లండన్ : ప్రపంచంలో ఏ దేశమైనా సరే తల్లి ప్రేమ అనేది మాత్రం వెలకట్టలేనిది. లాక్‌డౌన్ నేపథ్యంలో వైద్యసిబ్బంది తమ ఇంటిని, పిల్లలను వదిలిపెట్టి కరోనా బాధితులకు చికిత్సనందించేందుకు ఆసుపత్రులనే తమ ఇళ్లుగా మలచుకొని వారికి సేవలందిస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్‌కు చెందిన సూసి అనే మహిళ క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రిలో హెల్త్‌కేర్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు హెట్టి(7), బెల్లా(9) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కరోనా నేపథ్యంలో బాధితులకు చికిత్సనందించేందుకు 9వారాల పాటు ఇంటికి దూరం కావాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆమె తన పిల్లలను కజిన్ ఇంట్లో పెట్టింది. అయితే ప్రస్తుతం విధులకు కొంత విరామం దొరకడంతో సూసీ వెంటనే తన పిల్లలను చూడాలని భావించింది.(కరోనా బారిన పడిన ఓ తల్లి భావోద్వేగం)
రెండు నెలల పాటు పిల్లలకు దూరమైన ఆ తల్లి వారికి చిన్న సర్‌ప్రైస్ ఇవ్వాలనుకుంది. ఈ నేపథ్యంలో సూసీ కజిన్ ఇంటికి వెళ్లింది. అప్పటికే హెట్టి, బెల్లాలు సోఫాలో కూర్చొని టీవీ వీక్షిస్తున్నారు. సూసీ చడీ చప్పుడు లేకుండా పిల్లలు కూర్చున్న సోఫా వెనుకకు వచ్చి నిలుచుంది. వారు టీవీలో ఏదో సీరియస్‌గా చూస్తూ కూర్చుండిపోయారు. అయితే బెల్లా అనుమానమొచ్చి ఒకసారి వెనుకకు తిరిగింది. అంతే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతూ మమ్మీ... అంటూ ఆనందంతో కేక వేసింది. దీంతో హెట్టీ కూడా వెనుకకు తిరిగి సూసీ ఒడిలో వాలిపోయింది. అసలే తన పిల్లలను చూడక 9వారాలు కావడంతో సూసీ ఆనందం పట్టలేక తన ఇద్దరు పిల్లలను దగ్గరికి హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది. ఆ ఆనందక్షణాలను పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోనూ 2.2 మిలియన్ మంది వీక్షించారు.(రిమూవ్ చైనా యాప్స్ తొలగించిన గూగుల్)
Comments
Please login to add a commentAdd a comment