వాషింగ్టన్ : అసందర్భంగా ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ప్రస్థావన తీసుకొచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ నిప్పులు చెరిగారు. అమెరికాలో ఆర్థికవేత్తల అంచనాలను మించి, ఊహించనదానికన్నా నిరుద్యోగిత రేటు అదుపులోకి రావడంపై ట్రంప్ శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జార్జ్ పైనుంచి ఇదంతా గమనిస్తున్నాడని, దేశానికి ఇదొక గొప్ప రోజు, జార్జ్‌కి ఇది గొప్ప రోజు, సమానత్వపరంగా ఇది గొప్ప రోజు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.(2 మిలియన్ల వ్యాక్సిన్లు సిద్ధం: ట్రంప్)
నిరుద్యోగిత రేటుకు, జార్జ్‌కు లింకుపెడుతూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తుచ్చమైనవని జో బిడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ట్రంప్ ప్రభుత్వంలో అన్యాయంగా హత్యకు గురైన జార్జ్ గురించి మాట్లాడుతున్నామన్నారు. ఫ్లాయిడ్‌ను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో మరణించడంతో గత వారం నుంచి అమెరికాలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 40 నగరాల్లో కర్ఫ్యూ విధించినా, జనాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఈ నిరసనలకు మద్దతు తెలుపుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే అధ్యక్షుడి వ్యాఖ్యలను కొన్ని వార్తా సంస్థలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించాయని ట్రంప్ ప్రచార కమ్యూనికేషన్స్ డైరెక్టర్ టిమ్ ముర్తాగ్ అన్నారు. (జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి)
Comments
Please login to add a commentAdd a comment