
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానో వివాదాస్పదంగానో మారుతోంది. గత ప్రభుత్వాలు తీరుకు భిన్నంగా ట్రంప్ పాలన కొనసాగుతోంది. ఏది చేసినా తానే అమలు చేయాలి అన్న చందంగా ఉంది ట్రంప్ తీరు. అక్రమ వలసల వెనక్కి పంపించే నిర్ణయం దగ్గర్నుంచీ, ‘గ్రీన్ కార్డు రద్దు’ అంశం ఇలా ట్రంప్ తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదంగానే ఉంటోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని డొనాల్డ్ ట్రంప్ తాజాగా తప్పుబట్టారు. అధ్యక్షుడిగా దిగిపోవడానికి కొన్ని గంటల ముందు పలువురికి క్షమాబిక్షలు ప్రసాదించారు బైడెన్. అధ్యక్షుడిగా తనకున్న విచాక్షణాధికారాలతో బైడెన్ ముందుకెళ్లారు. అయితే అది సరైన చర్య కాదంటూ ట్రంప్ తాజాగా డిక్లేర్ చేశారు.
అవి చెల్లవు.. బైడెన్ కు ఏమీ తెలియదు
అయితే ఆ క్షమాభిక్షలు చెల్లవు అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అసలు బైడెన్ కు ఏమీ తెలియదని, అది బైడెన్ దిగి పోవడానికి చివరి గంటల్లో కాకతాళీయంగా చర్యగా అభివర్ణించారు. ఆ సమయంలో విచారణ జరిపిన కమిటీలోని సభ్యులు క్షమాభిక్షలు ఇవ్వడం కూడా చెల్లదన్నారు ‘ఆ సంతకం చేసింది బైడెన్ కాదు.. బైడెన్ కు ఆ సంతకాలు గురించి కూడా ఏమీ తెలియదు. నా పరిభాషలో చెప్పాలంటే అవి ఆటోపెన్ సంతకాలు’ అంటూ ట్రంప్ కొత్త పల్లవి అందుకున్నారు.
కాగా, ప్రధానంగా 2021, జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడికి సంబంధించిన శిక్ష అనుభవిస్తున్న వారికి బైడెన్ క్షమాభిక్ష కింద విముక్తి కల్పించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతీకార చర్యలు తీసుకునేందుకు వీలులేకుండా ఈమేరకు చర్యలు తీసుకున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా తనకు ఉన్న ప్రత్యేక అధికారాలతో చివరి గంటల్లో జో బైడెన్ క్షమాభిక్షలు ఇచ్చారు. అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె తదితరులకు ముందస్తు క్షమాభిక్ష జారీ చేశారు. అలాగే, క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులకూ కూడా ఉపశమనం కల్పించారు బైడెన్
Comments
Please login to add a commentAdd a comment