ఫ్లాయిడ్‌ ఆత్మ.. గగన నినాదం | Artist Fly Banner George floyd Last Speech in Five States in US | Sakshi
Sakshi News home page

ఫ్లాయిడ్‌ ఆత్మ

Jun 4 2020 9:20 AM | Updated on Jun 4 2020 9:20 AM

Artist Fly Banner George floyd Last Speech in Five States in US - Sakshi

అమెరికన్‌ పోలీసు జాత్యహంకారానికి ప్రాణాలు కోల్పోయిన జార్జి ఫ్లాయిడ్‌ చివరి మాటలు అమెరికన్‌ గగనతలంలో బ్యానర్లపై రెపరెపలాడుతున్నాయి. తన గొంతుపై ఆ పోలీసు మోకాలిని తొక్కిపెట్టి ఉంచినప్పుడు ఫ్లాయిడ్‌ ఊపిరాడక.. ప్లీజ్‌ ఐ కాంట్‌ బ్రీత్‌.. మై స్టొమక్‌ హర్ట్స్‌.. దె ఆర్‌ గోయింగ్‌ టు కిల్‌ మీ.. మై నెక్‌ హర్ట్స్‌.. అని మూలుగుతూ ప్రాణాలు పోయేముందు కొన్ని నిముషాల పాటు విలవిలాడాడు. ఆ మాటలను జామీ హోమ్స్‌ అనే ఆర్టిస్టు బ్యానర్‌ల పై రాసి యూఎస్‌లోని ఐదు నగరాలలో (డెట్రాయిట్, మయామి, డాలస్, లాస్‌ ఏంజలెస్, న్యూయార్క్‌) ఎగరేశారు. వాటి రూపంలో నింగిలోనూ ఊపిరి కోసం కొట్టుకుంటున్నట్లుగా కనిపిస్తున్న ఫ్లాయిడ్‌ ఆత్మ ఇప్పట్లో అమెరికాను నిద్రపోనివ్వక పోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement