
All lives matter అని పోస్ట్ చేసినందుకు సారా అలీఖాన్‌పై ట్రోలింగ్ జరుగుతోంది. #Blacklivesmatter అనే నల్లజాతి నినాదంలోని Black అనే మాటను ఎర్రగీతతో కొట్టేసి, దానిపైన అ అని రాసి సారా షేర్ చేసిన ఆ పోస్టులో అసలు నినాద చిత్రంలో ఉన్నవిధంగా పిడికిలి బిగించి ఒక తెల్ల చెయ్యి, ఒక గోధుమ రంగు చెయ్యి, ఒక నల్ల చెయ్యి ఉంటాయి. వాటి పక్కన సారా అదనంగా ఏనుగు తొండాన్ని మరొక పిడికిలిలా యాడ్ చేశారు. చేసి, జీవులందరి ప్రాణాలూ ముఖ్యమైనవే అనే అర్థంలో అ అనే మాటను పెట్టారు. ఇటీవల కేరళలో ఒక ఏనుగును అమానుషంగా చంపడాన్ని దృష్టిలో పెట్టుకుని సారా అలా చేశారు. అయితే అది వివాదం అయింది. సహనటుడు కరణ్‌వీర్ బోరా.. సారాకు మద్దతుగా ఆమె ఉద్దేశాన్ని విడమరిచి చెబుతూ ఒక పోస్ట్ పెట్టవలసి వచ్చింది.
సారా అలీఖాన్, కరణ్‌వీర్ బోరా