
అతడిని అరెస్ట్ చేసే క్రమంలో ఓ పోలీసు అధికారి ముకేష్ మెడపై మోకాలితో నేలకు నొక్కిపెట్టాడు.
జైపూర్: అమెరికాలో ఆందోళనలకు కారణమైన మినియాపొలిస్ జార్జ్ ఫ్లాయిడ్ లాంటి ఘటనే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీస్ అధికారి ఒకరు ముకేష్‌కుమార్ ప్రజపతి అనే వ్యక్తి మెడపై మోకాలితో తొక్కిపెట్టిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. బలదేవ్‌నగర్‌కు చెందిన ముకేష్‌కుమార్ మాస్క్ లేకుండా బయట తిరుగుతున్నందుకు పోలీసులు చలాన్ విధించారు.
అయితే జరిమానా కట్టేందుకు నిరాకరించిన ముకేష్.. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతోపాటు వారిపై దాడికి తెగబడ్డాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసే క్రమంలో ఓ పోలీసు అధికారి ముకేష్ మెడపై మోకాలితో నేలకు నొక్కిపెట్టాడు. ఇది జార్జ్‌ఫ్లాయిడ్ ఘటనను గుర్తుచేస్తున్నా...ఇక్కడ ముకేష్ తిరిగి పోలీసులపై దాడి చేశాడు. అంతేకాదు స్క్రూ డ్రైవర్‌తో తండ్రి కంటికి గాయం చేసిన కేసులో గతంలో ఒకసారి అరెస్ట్ అయిన రికార్డ్ కూడా అతనికి ఉంది.
(చదవండి: అమెరికా: పోలీసుల చర్యతో తల పగిలింది!)