Jodhpur
-
ఆడుతు పాడుతు ఊడుస్తుంటే...
అంతకు మించిన హాయి ఏమున్నది! శ్రమదానం మనకు కొత్త కాదు. అయితే అయేషా చేసిన శ్రమదానం వీడియో వైరల్ అయింది. ఇంతకీ ఆమె శ్రమదానం ప్రత్యేకత ఏమిటి అనే విషయానికి వస్తే... అయేషా మన అమ్మాయి కాదు. జోద్పూర్ను చూడడానికి తుర్కియే నుంచి వచ్చింది. జోద్‌పూర్‌లోని మాండోర్ గార్డెన్‌కు వెళ్లిన అయేషా అక్కడి పనివాళ్లు ఊడ్చే దృశ్యాలను చూసింది. ‘నాకు కూడా ఒక చీపురు కావాలి’ అని అడిగింది. అక్కడ ఉన్న గైడ్, వర్కర్స్ అయేషా జోక్ చేస్తుంది అనుకున్నారు. కాని ఆమె సీరియస్‌గానే అడిగింది అని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. చీపురుతో అరగంట పాటు ఊడ్చుతూ శ్రమదానం చేసింది.ఈ వీడియోను చూస్తూ నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘గార్డెన్లకు వెళ్లడం అనేది ఆహ్లాదకరమైన అనుభవం. అయితే గార్డెన్లలో ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తూ చిరాకు కలిగిస్తుంది. చెత్త వేసే వాళ్లు గార్డెన్లకు వెళ్లడానికి అనర్హులు. పరిసరాల పరిశుభ్రత అనే స్పృహ ఉన్న ఆయేషాలాంటి వాళ్లు మనకు ఆదర్శం కావాలి’ ‘శ్రమదానానికి సరిహద్దులు లేవని నిరూపించిన వీడియో ఇది’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
సోలార్ పవర్‌తో ఈవీ ఛార్జింగ్.. ఇది కదా మనకు కావాల్సింది
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఫ్యూయెల్ కార్ల మెయింటెనెన్స్ కంటే.. ఈవీల వినియోగానికి ఖర్చు తక్కువే అయినప్పటికీ.. ఛార్జింగ్ టైమ్ అనేది వాహన వినియోగదారులకు ఓ సమస్యగా ఏర్పడింది. ఈ సమస్యకు ఐఐటీ-జోధ్‌పూర్ ఓ చక్కని పరిష్కారం చూపింది. ఇంతకీ ఆ పరిష్కారం ఏంటి? ఛార్జింగ్ సమయాన్ని ఎలా తగ్గిస్తుంది? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..ఐఐటీ-జోధ్‌పూర్ ఎలక్ట్రిక్ కార్ల కోసం ఓ స్పెషల్ అడాప్టర్‌ను అభివృద్ధి చేసింది. దీంతో వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను సౌర శక్తిని ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రజలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో రీఛార్జ్ చేసుకునే వ్యవస్థను రూపొందించాలని నరేంద్ర మోదీ గతంలో వెల్లడించిన మాటలను ఐఐటీ-జోధ్‌పూర్ నిజం చేసింది.రూ.1,000 కంటే తక్కువ ధర వద్ద లభించే ఈ అడాప్టర్ సోలార్ ప్యానెల్ కార్యక్రమం విజయవంతమైతే.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు తమ వాహనాలను ఛార్జింగ్ వేసుకోవడానికి ప్రత్యేకంగా వేచి చూడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఐఐటీ జోధ్‌పూర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ తెలిపారు.ఈ అడాప్టర్ అన్ని రకాల వాహనాలలో పని చేస్తుందని, దీనికి సంబంధించిన ప్రోటోటైప్‌ను రూపొందించి విజయవంతంగా పరీక్షించామని, త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని కుమార్ తెలిపారు. కొండలు, మారుమూల ప్రాంతాల్లో కనీస ఛార్జింగ్ సదుపాయాలు లేని ప్రాంతాల్లో కూడా ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది.ఒకవైపు ఛార్జింగ్ అడాప్టర్ సోలార్ ప్యానెల్‌కు, మరోవైపు కంపెనీ అందించిన ఛార్జర్‌కు కనెక్ట్ అవుతుంది. దీంతో అవసరానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా సరఫరా అవుతుందని ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ అన్నారు. అమెరికా, కెనడా, చైనా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నాయని చెప్పారు.ఈ ప్లాన్‌లో సోలార్ సాకెట్‌తో.. సోలార్ ప్యానెల్‌ను వాహనాలలో ఉంచే బాధ్యత ఈవీ కంపెనీలదేనన్నారు. రాబోయే ఐదేళ్లలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ఓ సవాలుతో కూడుకున్న పని, కాబట్టి అడాప్టర్ సోలార్ ప్యానెల్ అద్భుతంగా పనిచేస్తుందని నిశాంత్ కుమార్ అన్నారు. -
తృటిలో తప్పిన రైలు ప్రమాదం
రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్లో శుక్రవారం రాత్రి జోధ్‌పూర్-భోపాల్ పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కోటా రైల్వే స్టేషన్‌లోని నాల్గవ నంబర్ ప్లాట్‌ఫాంపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఆకస్మిక ఘటనతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. దీంతో పలువురు ప్రయాణికులు కంపార్ట్మెంట్లో నుంచి దూకేశారు. వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఈ రైలు శుక్రవారం ఉదయం 10 గంటలకు జోధ్‌పూర్‌లో బయలుదేరి భోపాల్‌కు వెళ్తోంది. కోటా వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. రైలులోని రెండు కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటన అనంతరం రైల్వే బృందం ప్రయాణికులను రైలు నుంచి బయటకు తీసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ ఘటన అనంతరం ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పలు రైళ్లను ఇతర రైల్వే ట్రాక్‌లపైకి మళ్లించారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం రైల్వే ట్రాక్ పునరుద్ధరణ జరిగింది. అయితే ఈ లైనులో రైళ్లు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. #WATCH | Rajasthan: Two coaches of the Jodhpur-Bhopal passenger train derailed near Kota Junction. No casualties have been reported. Rescue operations underway. Details awaited. (5.1) pic.twitter.com/zKR7MLQRAr — ANI (@ANI) January 5, 2024 -
వందే భారత్ రైలుకు తప్పిన పెనుప్రమాదం
జైపూర్: ఉదయపూర్ జైపూర్ మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాల వెంబడి ఇటుక సైజులో ఉన్న రాళ్లను గమనించిన లోకోపైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రాళ్లు అమర్చి ఉన్న చోటుకు ముందే రైలు ఆగింది. రైల్వే సిబ్బంది ఈ రాళ్లను తొలగిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం ఉదయం సుమారు 7.50 ప్రాంతంలో ఉదయపూర్ నుంచి జైపూర్ వెళ్తున్న వందే భారత్ రైలు లోకో పైలట్ చాలా దూరం నుంచే ప్రమాదాన్ని పసిగట్టారు. చిట్టోగఢ్ వద్ద గాంగ్రార్ సోనియానా స్టేషన్ల మధ్య పట్టాలపై రాళ్లు ఉండటాన్ని గమనించి వెంటనే ఎమర్జెన్సి బ్రేకులు వేయడంతో రైలు అక్కడి వరకు వెళ్లకుండానే ఆగింది. లోకోపైలట్ సహా కొంతమంది రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి ఆ రాళ్లను, జాయింట్ వద్ద ఉన్న రాడ్డును తొలగించారు. వాటితో పాటు పట్టాలను వదులు చేసే పరికరం ఉండటాన్ని గమనించి దాన్ని కూడా తొలగించారు. నిందితులెవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. అనంతరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం యధాతధంగా కొనసాగింది. రైల్వే సిబ్బంది రాళ్లను తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో సంచలనంగా మారింది. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రైలు 435 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 6 గంటల 15 నిముషాల్లో చేరుకుంటుంది. గతంలో ఇదే దూరం ప్రయాణించడానికి కనీసం 7 గంటల సమయం పట్టేది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్ధ్యమున్న ఈ రైలును సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. Alert train drivers stop #VandeBharatExpress in time. Stones and clips to derail Udaipur-Jaipur #VandeBharat near Bhilwara. pic.twitter.com/vftHAtZpMw — Rajendra B. Aklekar (@rajtoday) October 2, 2023 ఇది కూడా చదవండి: కొంపముంచిన గూగుల్ మ్యాప్.. ఇద్దరు డాక్టర్లు మృతి -
అంతుచిక్కని మిస్టరీగా రాజా హుకుం సింగ్ హత్య
జోద్పూర్ పరిసర ప్రాంతాలన్నీ ఉదయాన్నే తెలిసిన ఆ వార్తతో ఉలిక్కపడ్డాయి. 1984 ఏప్రిల్ 17న అర్ధరాత్రి వేళ జరిగింది ఆ సంఘటన. రావు రాజా హుకుం సింగ్ అలియాస్ టుటు బనాను ఎవరో చంపేశారు. సమాచారం అందడంతో పోలీసులు సంఘటన జరిగిన రాజ్‌పుత్ రెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. హత్య జరిగి కొన్ని గంటలు గడిచిపోవడంతో అప్పటికే హుకుం సింగ్ శరీరం చల్లబడిపోయింది. విచిత్రంగా ఇద్దరు నిందితులు హుకుం సింగ్ మృతదేహం పక్కనే పోలీసుల రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. నిందితుల్లో మరో ఇద్దరు సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. మృతదేహం పక్కనే నెత్తుటి మరకల కత్తి పడి ఉంది. అది హుకుం సింగ్‌దే! హుకుం సింగ్ శరీరంపై ఇరవైకి పైగా కత్తి వేట్లు ఉన్నాయి.జోద్పూర్ రాజవంశానికి చెందిన రావు రాజా హుకుం సింగ్ హత్యపై అనుమానాలు చాలానే ఉన్నాయి. ఎన్నో ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.హుకుం సింగ్ జోద్పూర్ మహారాజా గజ్ సింగ్‌కు సవతి సోదరుడు, జోద్పూర్ మాజీ పాలకుడు మహారాజా హనువంత్ సింగ్, జుబేదా బేగంల కుమారుడు. హనువంత్ సింగ్, జుబేదా బేగం దంపతులు 1952లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. అప్పటికి హుకుమ్ సింగ్ వయసు ఏడాది మాత్రమే! సవతి తల్లి కృష్ణకుమారి ఆలన పాలనలో పెరిగాడు. తండ్రి హనువంత్ సింగ్ మరణం తర్వాత హుకుం సింగ్ సవతి సోదరుడు గజ్ సింగ్ పట్టాభిషిక్తుడయ్యాడు.అతి గారాబం వల్ల హుకుం సింగ్ అల్లరి చిల్లరిగా, దురుసుగా తయారయ్యాడు. రాచప్రాసాద మర్యాదలను పెద్దగా పట్టించుకోకుండా, ఊళ్లోని ఆకతాయి యువకులతో కలసి విచ్చలవిడిగా తిరిగేవాడు. తాగుడుకు అలవాటుపడి, జనాలతో తరచు తగవులు పెట్టుకునేవాడు. ఒక సందర్భంలో తనను నిలువరించడానికి ప్రయత్నించిన పోలీసులనే తుపాకి గురిపెట్టి బెదిరించాడు. తుపాకితో బెదిరించినందుకు పోలీసులు హుకుం సింగ్‌పై హత్యాయత్నం అభియోగం మోపుతూ కేసు పెట్టారు. హైకోర్టు ఆ కేసును కొట్టేసి, బెదిరింపు కేసు కింద విచారణ చేపట్టింది. ఇలాంటి దుందుడుకు స్వభావం ఉన్న హుకుం సింగ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. జోద్పూర్ జిల్లాలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగాడు. అకస్మాత్తుగా అతడు హత్యకు గురవడంతో జోద్‌పూర్‌లో కలకలం రేగింది.మొదటగా రంగంలోకి దిగి, దర్యాప్తు చేసిన జోద్పూర్ పోలీసులు చెప్పిన కథనం నమ్మశక్యంగా లేదు. నలుగురు నిందితులను అరెస్టు చేసినా, అసలు దోషులను నిరూపించలేకపోయారు. సంఘటన జరిగిన తర్వాత జోద్పూర్ ఎస్పీ శంతను కుమార్ మీడియా ముందుకు వచ్చాడు. అతను చెప్పిన ప్రకారం– హుకుం సింగ్‌కు నేరప్రవృత్తి ఉంది. పర్యాటక శాఖ ఉపమంత్రి నరేంద్రసింగ్ భాటితో అతడికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే, కొద్దిరోజులగా ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. హత్య జరిగిన రోజు సాయంత్రం హుకుం సింగ్ సమీపంలోని బస్తీలో జరిగిన డ్యాన్స్ కార్యక్రమం చూసి, రాత్రి రెస్ట్‌హౌస్‌కు తిరిగి వచ్చాడు. అతనితో పాటు మరో నలుగురైదుగురు ఉన్నారు. అందరూ మందు పార్టీ చేసుకున్నారు. తాగిన మత్తులో తనతో ఉన్నవాళ్లతో గొడవ పడ్డాడు. ఈ గొడవలోనే హత్యకు గురయ్యాడు. హత్య జరిగాక మృతదేహం వద్ద వేచి చూస్తున్న ఇద్దరినీ, అక్కడి నుంచి పారిపోయారని చెబుతున్న మరో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారే దోషులని నిరూపించలేకపోయారు. హుకుం సింగ్ హత్య కాంగ్రెస్ జాతీయ పార్టీలోనూ అలజడి రేపింది. హత్య వెనుక మంత్రి భాటి హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. భాటి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ‘హత్యకు కొద్దిరోజుల ముందు హుకుం సింగ్ జైపూర్ సర్క్యూట్‌హౌస్‌లో గొడవ పడ్డాడు. సంఘటనా స్థలానికి వచ్చిన విధాయక్పురి పోలీసులు అతణ్ణి కొట్టారు. హత్యాయత్నం కేసులో దిగువకోర్టు శిక్ష విధిస్తే, నాలుగు నెలలు జైల్లో గడిపి, హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చాడు. తరచు తగవులు పెట్టుకునే హుకుం సింగ్‌కు చాలామంది శత్రువులు ఉంటారు’ అని భాటి చెప్పారు. ఈ సంఘటనలో హుకుం సింగ్ సవతి సోదరుడు గజ్ సింగ్‌పై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆస్తుల వ్యవహారాల్లో ఇద్దరికీ పొరపొచ్చాలు ఉన్న మాట నిజమే అయినా, హత్యలో గజ్ సింగ్ ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలూ దొరకలేదు.అయితే, జోద్పూర్ కాంగ్రెస్ నేతలు భాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మూపనార్‌కు ఫిర్యాదు చేశారు. మూపనార్ దీనిపై భాటిని ప్రశ్నించారు. హుకుం సింగ్ ఢిల్లీలో తన పరువుతీసే పనులు చేస్తున్నాడని, తన ప్రత్యర్థుల చేతిలో పావుగా మారాడని, అయితే అతడి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. హుకుం సింగ్ హత్యలో రాజకీయ నాయకులెవరి ప్రమేయమూ లేదని రాజస్థాన్ ఐజీ జీసీ సింఘ్వీ మీడియాకు వెల్లడించారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లనే రాజస్థాన్ పోలీసులు ఈ కేసును నీరుగారుస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు కొందరు ఆరోపణలు చేశారు. దీంతో ఈ కేసు సీబీఐ చేతికి మారింది. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు సీబీఐ ఈ కేసులో గుమన్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. విచిత్రంగా విచారణకు ముందే అతడు అదృశ్యమయ్యాడు. దీంతో ఈ కేసు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. -
పాకిస్తాన్ వధువు, భారత వరుడు.. మరో జంట కథ
జోధ్‌పూర్: భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధం మరింత బలపడింది. ఇప్పటికే సీమా హైదర్-సచిన్ మీనా, అంజు-నస్రుల్లా భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి తమ ప్రేమను గెలిపించుకోగా తాజాగా అమీనా-అర్బాజ్ ఖాన్ కూడా ఒక్కటై ఈ లిస్టులో చేరిపోయారు. అయితే వీరు సాహసాలకు తెరతీయకుండా పెద్దలను ఒప్పించి ఆన్లైన్లో వివాహం చేసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన అమీనాకు భారత్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అర్బాజ్ ఖాన్‌కు వర్చువల్‌గా వివాహం జరిగింది. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన సంబంధమని పాకిస్థాన్‌లో ఉన్న తమ బంధువులు ఈ సంబంధాన్ని మాట్లాడి కుదిర్చినట్లు చెప్పారు అర్బాజ్ ఖాన్. వాస్తవానికి వివాహం భారత్‌లోనే జరగాలి కానీ అమీనాకు వీసా దొరకకపోవడం వలన ఎవరి దేశాల్లో వారు ఉండిపోయామని. అయినప్పటికీ తమ నిఖా సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలోనే జరిగినట్లు అర్బాజ్ ఖాన్ తెలిపాడు. భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేనందునే ఈ విధంగా ఆన్లైన్లో వివాహం చేసుకోవాల్సి వచ్చిందని అమీనాకు వీసా వచ్చిన తర్వాత ఇండియాలో మళ్ళీ వివాహం చేసుకుంటానని చెప్పారు అర్బాజ్. నిఖా మాత్రమే కాదు వివాహానికి సంబంధించిన అన్ని సంప్రదాయాలను దగ్గరుండి జరిపించారు కుటుంబ సభ్యులు. అర్బాజ్ చెప్పినట్లు పాకిస్తాన్ భారతదేశం మధ్య సంబంధాలు సరిగ్గా లేవన్నది ఒకప్పటి మాట. ఈ జంటల కథలను చూస్తే సంబంధాలు మెరుగవుతున్నట్టే కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: హర్యానా అల్లర్లు: నాలుగోరోజుకు చేరిన బుల్డోజర్ విధ్వంస ప్రక్రియ -
కుటుంబాన్ని చంపి తగులబెట్టి.. మృతుల్లో ఆరు నెలల పసికందు..
జోధ్‌పూర్: రాజస్థాన్ లో హోరమైన సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జోధ్‌పూర్ సిటీకి సమీపంలోని చౌరాయి గ్రామంలో కొంతమంది ఆగంతకులు ఒక కుటుంబంలోని నలుగురిని అత్యంత కిరాతకంగా చంపి దహనం చేశారు. అసలే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ వర్గాలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఇంటిలోంచి పొగలు వస్తుండటంతో అనుమానమొచ్చింది స్థానికులు పోలీసులకి సమాచారమందించి ఆ ఇంటిలోకి వెళ్లి చూస్తే అప్పటికీ ఆ కుటుంబంలో అందరూ కాలిపోయి విగతజీవులుగా మారినట్టు తెలిపారు. మృతుల్లో పునారామ్(55), భావ్రీ దేవి(50), దాపు(మేనకోడలు) ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇంటి ప్రాంగణంలోకి వెళ్లి చూస్తే మరో హృదయవిదారక దృశ్యం.. వారి కుమార్తె ఆరు నెలల పసికందు బూడిద కుప్పగా మిగిలి ఉంది. వీరందరినీ మొదట గొంతు కోసి తర్వాత తగలబెట్టారని చెబుతున్నారు పోలీసులు. ఈ హత్యలకు కారణం ఏమై ఉంటుందనేది ఇంకా తెలియరాలేదని పునారామ్ వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని వెళ్లదీసే వాడని తెలిపారు. బహుశా వ్యక్తిగత కక్షలే ఈ హత్యలకు కారణమై ఉంటాయని చెబుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దొరికిందే అవకాశం ప్రతిపక్షమైన బీజేపీ పార్టీ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర పరిష్టితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘావల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 17 రేప్ లు 7 మర్డర్లు జరిగాయని అన్నారు. రాజస్థాన్ లో శాంతి భద్రతలు ఎప్పుడో మంట కలిసిపోయాయని.. ముఖ్యమంత్రి చూస్తే ఎమ్మెల్యేలే నా ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని పొగుడుకుంటూ ఉంటారన్నారు. ఈరోజు ఆ ఎమ్మెల్యేలకు అహంకారం నెత్తికెక్కి వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: పెళ్ళిలో ఏనుగులు హల్ చల్.. బైక్ మీద పారిపోయిన కొత్త జంట.. -
అది ‘బ్లూ సిటీ ఆఫ్ ఇండియా’.. ఉదయం, సాయంత్రం వేళల్లో ఏం చూడొచ్చంటే..
భారత దేశంలో విచిత్రమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిని చూసేందుకు జనం ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. వాటిలో ఒకటే ‘బ్లూ సిటీ ఆఫ్ ఇండియా’. ఈ సిటీకి ఈ పేరు ఎందుకు వచ్చిందో.. ఇది ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మనదేశంలో పింక్ సిటీగా పేరొందిన జైపూర్.. రాజస్థాన్‌లో ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. మరి మన దేశంలో బ్లూ సిటీ అని ఏ ప్రాంతాన్ని అంటారో తెలుసా? భారతదేశం భిన్నత్వానికి పేరొందింది. మన దేశంలో ప్రతీ మతానికి చెందినవారూ ఉన్నారు. వివిధ రాష్ట్రల్లో పలు రకాలైన సంస్కృతులు కనిపిస్తాయి. అలాగే దేశంలోని ప్రతీ పట్టణం ఏదోఒక ప్రత్యేకతను కలిగివుంటుంది. మన దేశంలో పింక్ సిటీ మాదిరిగానే బ్లూ సిటీ కూడా ఉంది. ఉదయం సాయంత్రం వేళ్లలో ఇక్కడి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. The city which has my DREAM college AIIMS. The blue City the sun city one and only royal JODHPUR❤️❤️ https://t.co/HuDLrGFEpp— Chatenya Mathur 🦁🇮🇳 (@mathur_chatenya) June 8, 2023 రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ను బ్లూ సిటీ అని అంటారు. దేశంలో జోధ్‌పూర్ నగరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది అందాల నగరంగానూ పేరొందింది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఈ నగరం అందాలు మరింత రెట్టింపు అవుతాయి. జధ్పూర్ను సూర్యనగరి అని కూడా అంటారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే జోధ్‌పూర్‌లో సూర్యుడు అత్యధిక సమయం కనిపిస్తాడు. బ్లూ సిటీగా పేరొందిన ఈ నగరాన్ని సుమారు 558 ఏళ్ల క్రితం రావ్ జోధ్ నిర్మాంచాడని చరిత్ర చెబుతోంది. రావ్ జోధ్.. రాథోడ్ సమాజానికి అధ్యక్షునిగా ఉండేవాడు. 1459లో అతను పట్టణాన్ని నిర్మించారు. రావ్ జోధ్.. జోధ్‌పూర్‌కు 15 రాజు. జోధ్‌పూర్‌ను బ్లూ సిటీ అని పిలవడానికి గత కారణం ఇక్కడి ఇళ్ల నిర్మాణం. ఈ పట్టణంలోని చాలా ఇళ్లు నీలిరంగుతో మెరిసిపోతుంటాయి. భవనాలు కూడా నీలిరంగు రాళ్లలో నిర్మితమై ఉంటాయి. రాజస్థాన్‌లోని ఈ పట్టణాన్ని మొదట్లో మార్వాడా పేరుతో పిలిచేవారు. జోధ్‌పూర్‌లోని అత్యధిక శాతం ఇళ్లు నీలిరంగుతో ఉండటానికి కారణం ఇక్కడి అత్యధిక ఉష్ణోగ్రతలు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇక్కడివారంతా తమ ఇళ్లకు నీలిరంగు పెయింట్ వేయిస్తుంటారు. దూరం నుంచి చూస్తే ఈ పట్టణం నీలిరంగులో కనిపిస్తుంది. ఇది కూడాచదవండి: విడాకుల గుడి ఉందని మీకు తెలుసా.. ఇంతకీ ఎక్కడ ఉందంటే.. -
పెళ్లిలో పేలిన సిలిండర్.. 32కు చేరిన మృతులు.. సీఎంపై బీజేపీ ఫైర్
జైపూర్: రాజస్థాన్ జోధ్‌పుర్‌లోని ఓ పెళ్లి వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. శుక్రవారం మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. జోధ్‌పుర్‌లోని భుంగ్రా గ్రామంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఇంట్లో డిసెంబర్ 8న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 32 మంది చనిపోయారు. మిగతా వారు జోధ్‌పుర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం అశోక్ గహ్లోత్ ఇంకా ఈ గ్రామాన్ని గానీ, ఆస్పత్రిని గానీ సందర్శించకపోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించాలని, గ్యాస్ కంపెనీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది. పేలుడు జరిగిన గ్రామాన్ని సీఎం ఇంకా సందర్శించలేదని ధ్వజమెత్తింది. ఇంత విషాద సమయంలో కాంగ్రెస్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించిందని మండిపడింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జైపూర్‌లో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించింది కాంగ్రెస్. దీన్ని ఉద్దేశిస్తూ బీజేపీ గహ్లోత్ ప్రభుత్వంపై విమర్శలకు ఎక్కుపెట్టింది. రూ.2 లక్షలు పరిహారం.. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు పరిహారం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. గాయపడిన వారికి రూ.50 వేలు అందించనున్నట్లు పేర్కొంది. చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే.. -
భారీ అగ్నిప్రమాదం...ఆరు సిలండర్లు వరుసగా పేలడంతో...
రాజస్తాన్: ఆరు గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐతే ఈ ఘటనలో వరసగా ఆరు సిలిండర్లలో పేలుడు సంభవించిందని, దీంతో పలు వాహనాలు దారుణంగా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు సకాలంలో స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటన జోథ్‌పూర్‌లో మంగ్రా పుంజ్లా ప్రాంతంలోని రెసిడెన్షియల్ కాలనీలో చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనమయ్యారని, దాదాపు 16 మంది తీవ్ర గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. ఐతే దర్యాప్తులో ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్‌కి అక్రమంగా రీఫిల్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తేలింది. ప్రస్తుతం క్షతగాత్రులు జోథ్‌పూర్‌లోని మహాత్మగాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన సిలిండర్ ప్రమాదం మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరం. (చదవండి: బస్సులో చెలరేగిన మంటలు.. 11 మంది సజీవ దహనం) -
భారత వైమానిక దళంలోకి మన ప్రచండ్ (ఫొటోలు)
-
శత్రువుల పాలిట ‘ప్రచండ’మే
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్(ఎల్సీహెచ్) ప్రచండ్ భారత వైమానిక దళంలో చేరింది. సోమవారం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ వైమానికస్థావరంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సమక్షంలో 4 లైట్ కంబాట్ హెలికాప్టర్లను వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రచండ్లో రాజ్‌నాథ్ కొద్దిసేపు ప్రయాణించారు. పర్వతప్రాంతాల్లో, ఎడారి వంటి ప్రతికూల వాతావరణంలో పగలూ, రాత్రి శత్రువులపై దాడి చేయగలగడం ప్రచండ్ ప్రత్యేకత. గగనతలంలోని లక్ష్యాలను గగనతలం నుంచే చేధించగల క్షిపణులను, ట్యాంక్ విధ్వంసక మిస్సైళ్లను, 20 ఎంఎం తుపాకులనూ వీటిలో అమర్చవచ్చు. నిమిషానికి 750 తూటాలను పేల్చగల సత్తా వీటి సొంతం. పర్వతప్రాంతాల్లోని శత్రు సైన్యంపై, ట్యాంక్‌లు, బంకర్లు, డ్రోన్లపై ఇవి సులభంగా దాడిచేయగలవని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. 22 ఏళ్ల క్రితం భారత్ కన్న కల ఇప్పుడు నెరవేరిందని రాజ్‌నాథ్ అన్నారు. 1999లో పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధకాలంలో పర్వతప్రాంతాల్లో తేలికపాటి పోరాట హెలికాప్టర్ల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి చేసిన పరిశోధన ఫలితమే ప్రచండ్ రూపంలో వచ్చిందన్నారు. ఇంకొన్ని ప్రత్యేకతలు ఈ హెలికాప్టర్లు గరిష్ట సంఖ్యలో ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలవు. గాలిలో ఎక్కువసేపు ఉండటానికి సరిపడా ఇంథనాన్ని నింపొచ్చు. ఎడారుల్లో, మంచుమయమైన హిమాలయ పర్వతాల్లోనూ పోరాడగలవు. ట్విన్ ఇంజన్లు ఉన్న ఈ హెలికాప్టర్ బరువు 5.8 టన్నులు. శత్రువుకు కనపడని రంగులో, తక్కువ శబ్దం చేస్తూ, రాడార్‌కు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లకు చిక్కకుండా వెళ్లగలవు. హెలికాప్లర్లను అడవులు, పట్టణ ప్రాంతాలలో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలోనూ మొహరించవచ్చు. ఇక సైనిక వెర్షన్లో 96 హెలికాప్టర్లను తీసుకోవాలని ఆర్మీ భావిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
న్యాయమైన ఆశయం
పెద్దవాళ్లు, చుట్టుపక్కల వాళ్లు చేసేది చూసి పిల్లలు అనుకరిస్తుంటారు. కొంతమంది అనుకరణతో ఆగిపోకుండా వాళ్లలాగే తామూ ఎదగాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తుంటారు. ఈ కోవకు చెందిన అమ్మాయే 23 ఏళ్ల కార్తీక గెహ్లాట్. తండ్రి ఉద్యోగరీత్యా డ్రైవర్. న్యాయమూర్తులను కోర్టుకు తీసుకెళ్లడం ఆయన పని. చిన్నప్పటి నుంచి నాన్న నడిపే కారులో ఎంతో హుందాగా ఉండే న్యాయమూర్తులను దగ్గర నుంచి చూసిన కార్తీక తను కూడా జడ్జీ కావాలనుకుంది. నేను పెద్దయ్యాక నల్లకోటు ఆఫీసర్ అవుతాను అని అనుకరించి చూపిస్తూండేది. అది చూసిన వారంతా చిన్నపిల్ల చేష్టలనుకునేవారు. కానీ నేడు కార్తీక జుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో మంచి మార్కులతో 66 ర్యాంకు సాధించి పిల్లచేష్టలు కాదు, మరికొన్నేళ్లలో జడ్జి్జని కాబోతున్నానని చెప్పకనే చెబుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జోద్‌పూర్‌కు చెందిన రాజేంద్ర గెహ్లాట్ ముద్దుల కూతురే కార్తీక గెహ్లాట్. 31ఏళ్లుగా ప్రధాన న్యాయమూర్తులెందరికో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు రాజేంద్ర. రాజస్థాన్ హైకోర్టులో పనిచేస్తున్న ఎంతోమంది జడ్జీలను, లాయర్లను చూస్తూ పెరిగిన కార్తీక తాను కూడా పెద్దయ్యాక జడ్జి కావాలనుకునేది. ఆరోతరగతిలో ఉండగా నల్లకోటు వేసుకుని న్యాయస్థానంలో పనిచేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఆదిశగా అడుగులు వేస్తూ... జో«ద్‌పూర్‌లోని సెయింట్ ఆస్టిన్ సీనియర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్య పూర్తిచేసింది. ఇంటర్మీడియట్ తరువాత జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీలో ఐదేళ్ల బిబిఏ.ఎల్ఎల్.బి. పూర్తిచేసింది. ఈ ఏడాదే డిగ్రీ పూర్తిచేసినప్పటికీ జడ్జీ అయ్యేందుకు 2019 నుంచి సన్నద్ధమవడం ప్రారంభించింది. ఒక పక్క సెమిస్టర్ పరీక్షల కోసం చదువుతూనే, మరోపక్క పిలిమినరీ, మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యేది. కరోనా సమయంలో ఆఫ్‌లైన్ క్లాసులు అందుబాటులో లేకపోవడంతో, ఆన్లైన్ తరగతులకు హాజరవుతూ సిలబస్ పూర్తిచేసింది. ఇదే సమయంలో అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గోవింద్ మాథూర్, జిల్లా సెషన్స్ జడ్జి మండల్ ప్రసాద్ బోహ్రాల వద్ద లా గైడెన్స్, అడ్వకేట్ ధర్మేంద్ర వద్ద ఏడాదిన్నరపాటు టెక్నికల్ గైడెన్స్, మాజీ ఐఏఎస్ అధికారి, తన మాజీ స్కూలు ప్రిన్సిపాల్ వంటివారందరి సలహాలు సూచనలతో రోజుకి నాలుగు గంటలు కష్టపడి చదివేది. పరీక్ష తేది ప్రకటించిన తరువాత ప్రిపరేషన్‌ను పది నుంచి పన్నెండు గంటలకు పెంచింది. సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అన్నింటికీ దూరంగా ఉండి తన లక్ష్యంపై దృష్టిపెట్టి రాజస్థాన్ జుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో 66వ ర్యాంకు సాధించింది. దీంతో తన చిన్ననాటి కల జడ్జీ కావడానికి మొదటి అడుగు వేసింది. నేను న్యాయమూర్తులను కోర్టుకు తీసుకెళ్లడాన్ని అప్పుడప్పుడు కార్తీక చూసేది. అలా చూస్తూ పెరిగిన ఆమె 12 ఏళ్ల వయసులో ఒకరోజు నేను కూడా త్వరలో నల్లకోటు వేసుకుని జడ్జిని అవుతానని చెప్పింది. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కార్తీక మాత్రం అప్పటి నుంచి జడ్జిఅవ్వాలన్న కలను నిజం చేసుకునేందుకు కష్టపడుతూనే ఉంది. వాళ్ల అమ్మకూడా∙తనని అన్ని విధాల సాయపడుతూ అండగా ఉండడంతో ఈ రోజు తన కలను సాకారం చేసుకుంది. ఏళ్లుగా ఎంతోమంది జడ్జీలను వెనుకసీట్లోకూర్చోపెట్టి తిప్పాను. భవిష్యత్‌లో నా కూతురు కూడా వారిలా వెనుకసీట్లో కూర్చోబోతున్నందుకు సంతోషంగా ఉంది. – కార్తీక తండ్రి రాజేంద్ర గెహ్లాట్ పెళ్లికాదని భయపడుతున్నారు చాలామంది తల్లిదండ్రులు తమ కూతుర్లు లా చదువుతామంటే ఇష్టపడరు. లా చదివిన అమ్మాయిలకు పెళ్లిళ్లు కావు అని భయపడతారు. ఇలాంటి అపోహలు పోవాలంటే ప్రతి ఒక్కరికి చట్టం గురించిన ప్రాథమిక అవగాహన ఉండాలి. అప్పుడు తమ హక్కుల గురించి ధైర్యంగా పోరాడగలుగుతారు. నలుగురు సంతానంలో నేను ఒకదాన్ని. ప్రారంభంలో నా నిర్ణయాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. తర్వాత కష్టపడి చదవడం చూసి ప్రోత్సహించారు. వారి సహకారంతో ఈ రోజు ఇంతమంచి ర్యాంకును సాధించగలిగాను. నన్ను ప్రేరణగా తీసుకుని నా తోబుట్టువులు సైతం లా చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నా ప్రిపరేషన్లో ఆన్లైన్ యాప్స్‌తో పాటు, ఏకాగ్రతతో చదవడానికి సంగీతం చాలా బాగా ఉపయోగపడ్డాయి. – కార్తీక -
వీడు మనిషేనా.. మానవత్వం లేకుండా కుక్కను కారుకు కట్టి లాక్కెళ్లి..
ఆయనో డాక్టర్.. కానీ మానవత్వం మరిచి ఓ మూగజీవాన్ని దారుణంగా హింసించాడు. దీంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతను చేసిన పనికి నెటిజన్లు దుమ్మెతిపోస్తున్నారు. పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వివరాల ప్రకారం, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ కారు డ్రైవర్.. ఓ కుక్కను తన కారుకు కట్టి నడిరోడ్డు మీద లాక్కెళ్లాడు. కారును స్పీడ్‌గా డ్రైవ్ చేయడంతో కుక్క వేగంగా పరిగెత్తలేక కిందపడిపోయింది. అయినప్పటికీ అతను మాత్రం కారును ఆపలేదు. కాగా, కారు వెనుక వస్తున్న ఓ బైకర్.. కారును అడ్డుకునే పయత్నం చేశాడు. కారుకు బైకును అడ్డంగా పెట్టడంతో డ్రైవర్ కారును ఆపాడు. ఈ క్రమంలో అక్కడున్న మరికొంత మంది కారు వద్దకు చేరుకుని కుక్కను విడిపించారు. ఈ ప్రమాదంలో కుక్కకు తీవ్ర గాయాలు కాగా ఆసుప్రతికి తరలించారు. అనంతరం.. డ్రైవర్‌ను ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించాడు. అయితే, ఈ దారుణానికి ఒడిగట్టింది డాక్టర్ రజనీష్ గ్వాలాగా గుర్తించారు. దీంతో, ఈ ఘటనపై కొందరు వ్యక్తులు పోలీసులు, ఎన్జీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఎన్జీవోల ఫిర్యాదు మేరకు పోలీసులు జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. డాక్టర్‌కు కనికరం లేదని, మానవత్వం అంటే తెలియదని కామెంట్స్ చేస్తున్నారు. The person who did this he is a Dr. Rajneesh Gwala and dog legs have multiple fracture and this incident is of Shastri Nagar Jodhpur please spread this vidro so that @CP_Jodhpur should take action against him and cancel his licence @WHO @TheJohnAbraham @Manekagandhibjp pic.twitter.com/leNVxklx1N — Dog Home Foundation (@DHFJodhpur) September 18, 2022 -
సిద్ధూ మూసేవాలా తండ్రిని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు
చండీగఢ్: సిద్ధూమూవేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్‌ను చంపుతానని బెదిరించిన వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని రాజస్థాన్ జోధ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పంజాబ్ మాన్సా కోర్టులో ప్రవేశపెట్టి ఐదు రోజులు రిమాండ్‌లోకి తీసుకున్నారు. నిందితుడి పేరు మహిపాల్ అని పోలీసులు తెలిపారు. ఈమెయిల్ ద్వారా ఇతడు సిద్ధూ తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు సిద్ధూ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏజే లారెన్స్ బిష్ణోయ్ పేరుతో సోషల్ మీడియాలో పేజీ కూడా క్రియేట్ చేశాడు. ఫాలోవర్లను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే సిద్ధూ తండ్రికి మహిపాల్ బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. సిద్ధూ హత్యకు సంబంధించి కెన్యాలో అన్మోల్ బిష్ణోయ్, అజర్బైజాన్లో సచిన్ తాపన్ను అదుపులోకి తీసుకున్నట్లు కేంద్రం సెప్టెంబర్ 1న ధ్రువీకరించింది. స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నట్లు చెప్పింది. చదవండి: థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్.. 2024లో సరికొత్త చరిత్ర -
సల్మాన్ ఖాన్ లాయర్‌కు బెదిరింపు లేఖ.. వదిలిపెట్టేది లేదంటూ..
జైపూర్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాయర్ హస్తిమల్ సరస్వత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. జోధ్‌పూర్ కోర్టులోని తన చాంబర్ బయట ఈ లేఖ లభించింది. లేఖలో ‘గాయకుడు మూసేవాలకు పట్టిన గతే నీకూ పడుతుంది. మేము ఎవరినీ వదిలిపెట్టము. మీ కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టం’ అని రాసి ఉంది కృష్ణజింకను వేటాడిన కేసులో జోధ్‌పూర్ హైకోర్టులో లాయర్ హస్తిమల్ సల్మాన్ తరుపున వాదిస్తున్నారు. బెదిరింపు లేఖ నేపథ్యంలో జోధ్‌పూర్ పోలీస్ స్టేషన్లో లాయర్ ఫిర్యాదు చేశారు. దీంతో సల్మాన్ లాయర్‌కు భద్రతను పెంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అయితే లేఖలో చివరన ఎల్బీ, జీవీ అనే అక్షరాలు రాసి ఉండటంతో ఇది గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ల పేర్లను సూచిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో మే 29న పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురైన విషయం తెలిసిందే. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ గత నెలలో సిద్ధూ మూస్ వాలా హత్యకు తనదే బాధ్యత అంటూ ప్రకటించాడు. అంతేగాక మరో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో కలిసి ఈ పనిచేసినట్లు ఆరోపించారు. ఇదిలా ఉండగా సరిగ్గా నెల కిందట కూడా సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌లను చంపుతామంటూ బెదిరింపు లేఖలు వచ్చాయి. దీనిపై సల్మాన్ బాంద్రా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. -
పండుగ వేళ టెన్షన్.. టెన్షన్.. ఇంటర్నెట్, సోషల్ మీడియా బంద్
జైపూర్: రాజస్థాన్‌లోని సోమవారం రాత్రి ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి చివరకు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. వివరాల ప్రకారం.. జోధ్‌పూర్ జిల్లాలోని బాల్‌ముకంద్ బిస్సా సర్కిల్లో ఓ వర్గం జెండాలను తొలగించి మరో వర్గానికి చెందిన జెండాలను పాతడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రార్థనల కోసం ఏర్పాటు చేసిన లౌడ్స్పీకర్లను కొందరు తొలగించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తకరంగా మారి రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల యువకులను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో కొందరు యువకులు, నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. కాగా, ఈ ఘటనపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ ప్రజలందరూ శాంతి, సామరస్యంతో ఉండాలని కోరారు. అలాగే, ముందు జాగ్రత్త చర్చగా జిల్లాలో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాను, మొబైల్ డేటాతో పాటుగా ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: సంక్షోభంలో బొమ్మై ప్రభుత్వం?.. రంగంలోకి అమిత్ షా -
ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. పెద్ద కూతురికి పెళ్లి కావడంతో..
జైపూర్: తన కూతుర్ల పట్ల ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. వావివరుసలు మరిచి ఇద్దరు కూతుర్లను లైంగికంగా వేధించాడు. ఏకంగా మూడు దశాబ్దాల నుండి అతను తన కూతురిని వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసు అధికారి జుల్ఫికర్ వివరాలు తెలుపుతూ.. జోధ్‌పూర్‌లోని చౌపాస్ని హౌసింగ్ బోర్డ్ పరిధిలో కన్న తండ్రి తన ఇద్దరు కూతుళ్లను లైంగికంగా వేధించాడు. పెద్ద కూతురు ఆరు సంవత్సరాల వయస్సు నుంచే అతడి వల్ల లైంగిక వేధింపులకు గురైనట్టు తెలిపారు. 1993లో తనపై అత్యాచారం చేశాడని.. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. కాగా, బాధితురాలికి 2017లో వివాహమైంది. దీంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోగా.. అతడి కన్ను తన చెల్లెలిపై పడింది. తాజాగా, ఆమెను కూడా తండ్రి లైంగికంగా వేధించినట్టు ఆమె ఆరోపించింది. దీంతో తన సోదరిని రక్షించాలని బాధితురాలు(అక్క) పోలీసులను ఆశ్రయించింది. కాగా, ఆమె ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల తండ్రిపై కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు వెల్లడించారు. -
మోడల్ ఆత్మహత్యాయత్నం కేసులో బయటకొచ్చిన షాకింగ్ నిజాలు..
జోధ్‌పూర్‌కు చెందిన మోడల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనలో రాజస్థాన్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులిద్దరు ఉదయ్‌పూర్‌కు చెందిన వారు కాగా వారిలో ఓ మహిళ, పురుషుడు ఉన్నారు. వారి పేర్లు దీపాలి, అక్షయ్‌గా పోలీసులు తెలిపారు. కాగా జోధ్‌పూర్‌కు చెందిన ఫ్యాషన్ మోడల్ గున్‌గున్ ఉపాధ్యాయ్ రతనాద ప్రాంతంలోని లార్ట్స్ ఇన్ హోటల్లో శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గున్‌గున్ తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చదవండి: తండ్రికి చెప్పి ఆరో అంతస్థు నుంచి దూకిన మోడల్ ఈ ఘటనపై బాధితురాలు, ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా... ఈ కేసులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. గున్గున్ను ఉపయోగించి భిల్వారా మంత్రిని హనీ ట్రాప్‌కు గురి చేసేందుకు నిందితులు ప్లాన్ చేసినట్లు తేలింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలోని భిల్వారాకు చెందిన మంత్రి నిందితుల ఫైల్‌ను క్లియర్ చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆయనను హనీ ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయాలని నిందితులు దీపాలి, అక్షయ్‌లు ప్లాన్ చేసి గున్గున్ను వాడుకోవాలని చూశారని డీసీపీ భువన్ భూషన్ తెలిపారు. ప్లాన్ ప్రకారం మోడలింగ్ అసైన్మెంట్ ఉందంటూ నిందితులు గున్గున్ను పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ షోలో అవకాశం ఉన్నట్లు నమ్మించి బాధితురాలిని భిల్వారా తీసుకెళ్లారు. చదవండి: వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. అక్కడికి వెళ్లాక మంత్రితో గడపాలని నిందితులు ఆమెను బలవంతం చేశారు. దీనికి గున్‌గున్ నిరాకరించి వారి నుంచి తప్పించుకుని జోధ్‌పూర్ చేరుకుంది. అక్కడ లార్డ్స్ ఇన్ హోటల్లో దిగి తన తండ్రికి ఫోన్ చేసి జరిగిందంతా వివరించి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తండ్రికి చెప్పింది. ఆమె తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అతడి సమచారంతో పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకున్నారు. కానీ అప్పటికే గున్‌గున్ హోటల్‌పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని డీసీపీ మీడియాకు తెలిపారు. అనంతరం గున్గున్ను పోలీసులు ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మోడల్ కాళ్లు, ఛాతీ భాగం ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. -
తండ్రికి ఫోన్ చేసి మోడల్ ఆత్మహత్యాయత్నం
జోధ్‌పూర్ (రాజస్థాన్): జోధ్‌పూర్‌కు చెందిన మోడల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గున్‌గున్ ఉపాధ్యాయ్ జోధ్‌పూర్‌కు చెందిన ఫ్యాషన్ మోడల్. ఏదో పని మీద ఉదయ్‌పూర్ వెళ్లిన శనివారం జోధ్‌పూర్‌కు తిరిగొచ్చింది. ఈ క్రమంలో రతనాద ప్రాంతంలోని లార్ట్స్ ఇన్ హోటల్లో బస చేసిన ఆమె ఆరో అంతస్తు నుంచి కింది దూకి ఆత్మహత్యకు యత్నించింది. దీనికన్నా ముందు ఆమె తన తండ్రితో ఆఖరుసారి మాట్లాడాలనుకుందట. అందుకని వెంటనే తండ్రికి ఫోన్ చేసి చనిపోతున్నాను నాన్నా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. దీంతో వెంటనే ఆందోళన చెందిన ఆమె తండ్రి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఆమెను ఆపాలని చెప్పాడు. కానీ పోలీసులు అక్కడికి చేరుకునేలోపే గున్‌గున్ బిల్డింగ్‌పై నుంచి దూకేసిది. ఆమెను ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మోడల్ కాళ్లు, ఛాతీ భాగం ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. -
బైక్‌ల మీదకు దూసుకెళ్లిన లగ్జరీ కారు.. భయంకర దృశ్యాలు వైరల్
-
బైక్‌ల మీదకు దూసుకెళ్లిన లగ్జరీ కారు.. భయంకర దృశ్యాలు వైరల్
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఓ లగ్జరీ కారు బీభత్సం సృష్టించింది. వివరాలు జోధ్‌పూర్‌లోని రహదారిపై డ్రైవర్ అదుపు తప్పడంతో.. పలు ద్విచక్ర వాహనాల మీదకు కారు దూసుకెళ్లింది. బైకుల మీదకు దూసుకెళ్లిన కారు చివరికి రోడ్డు పక్కనున్న దుకాణాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జోధ్‌పూర్‌లోని మధురదాస్ మాథుర్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: వైరల్: తొలిసారి పిజ్జా తిన్న బామ్మ.. ‘అబ్బే బాలేదురా మనవడా’.. ఈ ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ ఘటన దురదృష్టకరమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా ఎయిమ్స్‌కు చేరుకున్నారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడని సీఎం వెల్లడించారు. మృతులకు సీఎం గెహ్లాట్ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదం బాధాకరమని, క్షతగాత్రులకు సరైన వైద్యం అందిస్తామని భరోసానిచ్చారు. చదవండి: చికెన్ కర్రీ అదరగొట్టిన రణు మండల్ .. వీడియో వైరల్ -
IPS Preeti Chandra: చంబల్‌ను గడగడలాడించింది.. ఆమె నిజంగానే శివంగి!
చంబల్‌లోయ అంటే మహా మహా పోలీస్ ఆఫీసర్లు కూడా ‘వద్దు సార్’ అంటారు పోస్టింగ్. ప్రీతి చంద్ర అక్కడ పోస్టింగ్ తీసుకుంది. సరిగ్గా మూడు నెలలు. బందిపోట్లు గడగడలాడారు. ‘దీని వెనుక పెద్దవాళ్లున్నారు’ అని కొన్ని కేసుల జోలికి రారు ఆఫీసర్లు. కాని ప్రీతి చంద్ర పెద్దవాళ్లు ఉన్న కేసుల్నే గట్టిగా పట్టుకుంటుంది. కటకటాల వెనక్కు తోస్తుంది. అందుకే ఆమెను రాజస్థాన్‌లో అందరూ లేడీ సింగం అని పిలుస్తారు. ఆమె శివంగి. నిజంగానే. అది 2020, మే నెల. లాక్డౌన్ నడుస్తోంది. రాజస్థాన్‌లోని జోద్పూర్ వెస్ట్ కమిషనర్‌గా విధుల్లో ఉన్న ప్రీతి చంద్ర పెట్రోలింగ్‌లో ఉంది. సరిగ్గా అప్పుడే రోడ్డు పక్కగా ఒక కారు ఆగింది. అందులో గర్భిణీ ఉంది. ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. ఆమెను కల్యాణ్‌పూర్ నుంచి జోద్‌పూర్‌కు కాన్పు కోసం తీసుకుని వస్తుంటే మధ్యలో నొప్పులు తీవ్రమయ్యాయి. ఇంకా సిటీకి దూరముంది. ప్రీతి చంద్ర వెంటనే రంగంలో దిగింది. గర్భిణిని సౌకర్యం కోసం తన ఇన్నోవా బ్యాక్సీట్లోకి మార్పించింది. దగ్గర్లోనే ఉన్న టెంట్ హాల్‌ను తెరిపించి షామియానా తెరలను చుట్టూ పోలీసులు పట్టుకుని నిలబడేలా చాటు ఏర్పాటు చేసింది. ఒక టీమ్‌ను డాక్టర్ కోసం పంపించి తనతో ఉన్న మహిళా కానిస్టేబుల్స్‌ను కాన్పు పనిలో సాయం పట్టమంది. డాక్టరు వచ్చేలోపే కాన్పు జరిగిపోయింది. తల్లీబిడ్డా క్షేమం. కాని ప్రీతి చంద్ర సకాలంలో స్పందించకపోతే ప్రమాదం జరిగి ఉండేది. ఆ తల్లికి ప్రీతి చంద్ర అంటే ఎంతో కృతజ్ఞత ఏర్పడింది. తన కూతురికి ఆమె పేరే పెట్టుకుంది– ప్రీతి అని. చంబల్‌ను గడగడలాడించింది! 2019లో ప్రీతి చంద్రాను కరోలి జిల్లాకు ఎస్పిగా వేశారు. కరోలీ జిల్లాలో చంబల్‌లోయ ఒక భాగం వస్తుంది. ఆ జిల్లాకు ఎస్.పి కావడం అంటే బందిపోట్ల తలనొప్పిని తెచ్చి పెట్టుకోవడమే. కాని ప్రీతి చంద్ర చార్జ్ తీసుకున్న మూడు నెలల్లోనే చంబల్‌ను గడగడలాడించింది. మగ ఆఫీసర్లు వెళ్లడానికి జంకే లోయలోని ప్రాంతాలను సందర్శించింది. వారంలో ఒకసారి చంబల్ లో క్యాంప్ చేసింది. సరిగ్గా మూడు నెలల్లో పదిమంది పేరుమోసిన బందిపోట్లను అరెస్ట్ చేసింది. వారికి ఇన్ఫార్మర్లుగా పని చేసేవారిని లోపల వేసింది. ఆ దెబ్బకు ఆ ప్రాంతంలోని బందిపోట్లు పరార్ అయ్యారు. కొందరు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ప్రీతి చంద్రను అందరూ ‘లేడీ సింగం’ అని పిలవసాగారు. స్కూల్ టీచర్ నుంచి ఐపీఎస్ దాకా ప్రీతి చంద్ర రాజస్థాన్‌లో 2008 ఐ.పి.ఎస్ బ్యాచ్ ఆఫీసర్. ఆమెది సీకర్ జిల్లాలోని కుందన్ అనే చిన్న ఊరు. తండ్రి బి.ఎస్.ఎఫ్‌లో పని చేసేవాడు. తల్లి నిరక్షరాస్యురాలు. ‘మా అమ్మ జీవితంలో పెన్సిల్ కూడా పట్టుకుని ఎరగదు. కాని నన్ను, నా చెల్లెల్ని, మా తమ్ముణ్ణి బాగా చదివించాలని పట్టు బట్టింది. నేను ఐ.పి.ఎస్ అవడానికి ఆమే కారణం’ అంటుంది ప్రీతి. జైపూర్‌లో ఎం.ఏ, ఎం.ఫిల్ చేసిన ప్రీతి కొన్నాళ్లు స్కూల్లో పాఠాలు చెప్పింది. మరికొన్నాళ్లు జర్నలిస్ట్‌గా పని చేసింది. నిజానికి జర్నలిస్టుగానే ఎదగాలని అనుకుందిగాని యు.పి.ఎస్.సి రాసి ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఐ.పి.ఎస్ అయ్యింది. ప్రీతి చంద్ర ఇప్పుడు బికనీర్‌కి ఎస్.పిగా ఉంది. బికనీర్‌కి ప్రథమ మహిళా ఎస్.పి ఆమె. ‘ఈ జిల్లా ఏర్పడి చాలా కాలం అయ్యింది. నా కంటే ముందు చాలామంది మహిళా అధికారులు ఉన్నారు. ఇన్నాళ్లకు ఒక మహిళకు అవకాశం ఇచ్చారు. వ్యవస్థలో మహిళలకు అవకాశం ఇవ్వడం సంకుచితత్వం ఉంది. అలాగే మహిళలు కూడా బాధ్యతను స్వీకరించడం లో వెనుకంజ వేయడం మానాలి’ అంటుందామె. చదవండి: ఆమె చేయని మంచి పని లేదు, సేవా రంగం లేదు.. ఓ అలుపెరుగని సంచారి!! -
యుద్ధ విమానాల కోసం సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసిన డీఆర్డీఓ
శత్రు రాడర్ల నుంచి భారత వైమానిక దళం(ఐఎఎఫ్) యుద్ధ విమానాలను రక్షించడం కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) అధునాతన చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లేబొరేటరీ(హెచ్ఈఎంఆర్ఎల్) సహకారంతో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోని డీఆర్డీఓ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. భారత యుద్ధ విమానాలు ఆకాశంలో ప్రయాణించేటప్పుడు శత్రువుల మిసైల్స్ ను తప్పుదోవ పట్టించడానికి ఈ టెక్నాలజీ ఒక డెకాయ్ గా పనిచేస్తుంది. ఇప్పటికే విజయవంతంగా యూజర్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ టెక్నాలజీ వినియోగించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. (చదవండి: టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగులకు తీపికబురు) ప్రస్తుత ఆధునిక రాడార్ టెక్నాలజీ కాలంలో మన యుద్ద విమానాలను రక్షించడానికి ఇలాంటి టెక్నాలజీపై దృష్టి పెట్టినట్లు తెలిపింది. ఈ క్రిటికల్ టెక్నాలజీని స్వదేశీ అభివృద్ధి కోసం తయారు చేసిన డీఆర్డీఓ, ఐఎఎఫ్ & విమానయాన పరిశ్రమను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఇది ఆత్మనీర్భర్ భారత్ దిశగా మరో ముందు అడుగు అని అన్నారు. ఐఎఎఫ్ ను మరింత బలోపేతం చేసే ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా అభివృద్ధి చేసినందుకు రక్షణ శాఖ కార్యదర్శి ఆర్ అండ్ డీ, డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జీ.సతీష్ రెడ్డి బృందాలను అభినందించారు. ఆధునిక రాడార్ టెక్నాలజీ పురోగతి చెందటంతో యుద్ధ విమానాల మనుగడ ప్రధాన ఆందోళన కలిగిస్తోందని పరిశ్రమ నిపుణులు తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ మనుగడ కోసం ఇన్ ఫ్రారెడ్ & రాడార్ టెక్నాలజీ నుంచి తప్పించుకోవడానికి కౌంటర్ మెజర్ డిస్పెన్సింగ్ సీస్టమ్ (సీఎమ్ డీఎస్) ఉపయోగపడుతుంది అని అన్నారు. -
‘ఆశ’ వదులుకోలేదు: స్వీపర్ నుంచి డిప్యూటీ కలెక్టర్‌గా..
రోజూ ఎన్నో సక్సెస్ స్టోరీలు చూస్తుంటాం. వాటిలో చాలామట్టుకు చిన్నస్థాయి నుంచి పెద్ద విజయాలు అందుకున్న వాళ్లే కనిపిస్తుంటారు. తమ కష్టపుకథలు మరికొందరిలో స్ఫూర్తి నింపాలనేదే వాళ్ల ఉద్దేశం కూడా. రాజస్థాన్‌కి చెందిన ఆశ కందారా గాథ కూడా అలాంటిదే. జైపూర్: ఆశ కందారా.. మూడు రోజుల వరకు జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో పని చేసిన ఒక స్వీపర్. 2016 నుంచి కాంట్రాక్ట్ సర్వీస్‌లో కొనసాగిన ఆమెకు.. పన్నెండు రోజుల క్రితమే పర్మినెంట్ ఎంప్లాయి లెటర్‌ను చేతిలో పెట్టారు అధికారులు. ఆ సంతోషం మరువక ముందే.. ఏకంగా ఆమె తన లక్క్ష్యం అందుకుంది. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్‌లో 728 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించింది. దీంతో త్వరలో ప్రభుత్వాధికారి హోదాలో ఆమె బాధ్యతల్ని చేపట్టబోతోంది. నిజానికే రెండేళ్ల క్రితమే ఆమె పరీక్షలకు, ఇంటర్వ్యకు హాజరుకాగా.. కరోనా కారణంగా ఆలస్యం అవుతూ చివరికి మంగళవారం రాత్రి ఫలితాలు వెలువడ్డాయి. घर चलाने के लिए लगाती थीं झाड़ू, लेकिन मेहनत लाई रंग और बनी SDM! सुनिए Asha Kandara के संघर्ष की ये कहानी#AshaKandara #SDM #Story pic.twitter.com/R2jekPkg0I — News Tak (@newstakofficial) July 16, 2021 భర్త వదిలేయడంతో.. 1997లో ఆశ చదువు ఆపేయించి మరీ పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇద్దరు పిల్లలు పుట్టాక మరో మహిళతో సంబంధం పెట్టుకుని.. ఆమెను వదిలేశాడు భర్త. దీంతో ఆమె పుట్టింటికి చేరింది. భర్తను అదుపులో పెట్టుకోలేకపోయిందంటూ సమాజం మొత్తం ఆశదే తప్పని నిందించింది. కానీ, ఆమె అవేం పట్టించుకోలేదు. ఇంట్లో చిన్నచిన్న పనులు చేస్తూనే.. పేరెంట్స్ సహకారంతో చదువును కొనసాగించింది. 2016లో ఎట్టకేలకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతో మున్సిపల్ కార్పొరేషన్లో టెంపరరీ స్వీపర్ పోస్టులకు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యింది. మలుపు తిప్పిన సెల్యూట్ ఆశకు ప్రేరణ తన పైఅధికారులే. రోజూ వాళ్ల గదుల్ని, ఆఫీసు పరిసరాల్ని శుభ్రం చేయడం, కిందిస్థాయి ఉద్యోగుల నుంచి వాళ్లు గౌరవం అందుకోవడం ఆమెను ఆకర్షించేవట. ఓరోజు విధుల్లో ఉండగా హఠాత్తుగా పైఅధికారులు ఇన్స్పెక్షన్కు వచ్చారు. అప్పటిదాకా తనతో సరదాగా గడిపిన తోటి ఉద్యోగులు ఒక్కసారిగా నిలబడి వాళ్లకు సెల్యూట్ చేయడంతో, ఆ గౌరవం తనకూ దక్కాలని ఆమె నిర్ణయించుకుంది. అయితే పరిస్థితులు అందుకు ప్రతికూలంగా ఉన్నాయని తెలిసినా ఆమె ఆశను వదులకోలేదు. పిల్లల పోషణ కోసం ఓవైపు 10 గంటలు స్వీపర్‌గా పని చేస్తూనే.. ఆర్ఏఎస్ ఎగ్జామ్‌లకు కష్టపడి ప్రిపేర్ అయ్యింది. చివరికి తన కలను నెరవేర్చుకోవడంతో పాటు త్వరలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించబోతోంది ఆశా కందారా. ‘ఈ విజయం నా కుటుంబానికే అంకితం. నా నిర్ణయాన్ని గౌరవించి, నాకు అండగా నిలబడినందుకే ఈ గెలుపు సాధ్యమైంది’ అని సంతోషంగా చెప్తోందామె. మేయర్ కుంతి దియోరా నుంచి అభినందనలు అందుకుంటున్న ఆశ -
సెవెన్ వండర్స్ అనగనగా ఒక రాజు
ఆ రాజుకు ఏడుగురు కొడుకులు అనే కథ చిన్న నాటి నుంచి వినే ఉంటారు. కానీ, అనగనగా ఒక భగవతి ఆమెకు ఏడుగురు కుమార్తెలు అనే కథ మాత్రం ఇప్పుడు ప్రపంచం అంతా చెప్పుకుంటోంది. ‘ది స్పైస్ గర్ల్స్ ఆఫ్ ఇండియా’గా ప్రఖ్యాతి గాంచిన వారి విజయ గాథను తెలుసుకోవాలంటే మాత్రం జోద్పూర్ వెళ్లాలి. సందడిగా ఉండే సర్దార్ మార్కెట్లో ఎమ్.వి. స్పైసెస్ పేరుతో ఉన్న సుగంధ ద్రవ్యాల దుకాణాన్ని ఒక తల్లి, ఏడుగురు కుమార్తెలు నిర్వహిస్తున్నారు. ఆ చిన్న దుకాణం ప్రపంచ పర్యాటకులను పలకరిస్తుంది. వారి ట్రేడ్‌మార్క్ మసాలా సెంటెడ్ చాయ్. ప్రపంచం నలుమూలల నుండి నగరాన్ని సందర్శించే పర్యాటకులు ఎమ్.వి. స్పైసెస్ పేరుతో ఉన్న ఆ స్టోర్‌ను తప్పనిసరిగా సందర్శిస్తారు. ఆ స్టోర్ గొప్పతనాన్ని, దాని ఏర్పాటు వెనకాల దాగున్న కృషిని ఒక కప్పు సెంటెడ్ టీ ని గుటక వేస్తూ్త తెలుసుకుంటారు. అప్పుడు కానీ అక్కడినుంచి వెళ్లరు. అలా వెళ్లిన పర్యాటకులు, బ్లాగర్లు ఈ సెవన్ వండర్స్ గురించి గొప్పగా ప్రస్తావిస్తూ ఉంటారు. అసమానతలకు ఎదురొడ్డి... ‘ఏడుగురు కూతుళ్లైనా సరే, ఒక్క కొడుకుతో సమానం కాదు. వారసుడి కోసం ఎదురుచూడాల్సిందే’ అత్తగారి విసురు మాటలకు పాతికేళ్ల భగవతి తల్లడిల్లిపోయింది. భర్త మోహన్‌లాల్ మొహం చూసింది. తల్లి మాటకు అడ్డుచెప్పలేని అతను భార్య స్థితిని అర్ధం చేసుకున్నాడు. రాజస్థాన్‌లోని జో«ద్‌పూర్‌లో ఎమ్.వి.స్పైసెస్ పేరుతో ఉన్న సుగంధ ద్రవ్యాల దుకాణంలో ఆరుపదుల వయసు దాటిన భగవతి తన జీవన ప్రయాణం గురించి వివరించినప్పుడు ఈ సమాజంలో కూతుళ్లకు ఉన్న స్థానం ఏంటో, అసమానతలకు ఎదురొడ్డి వారు ఏ విధంగా ఎదిగారో కళ్లకు కడతారు. సమానత్వం.. గౌరవం ఎమ్.వి సుగంధ ద్రవ్యాల కథ వాస్తవానికి తన కోసం మాత్రమే కాకుండా ఆమె ఏడుగురు కుమార్తెల సమానత్వం, గౌరవం కోసం ఒక తల్లి చేసిన యుద్ధ కథగా చెప్పుకోవచ్చు. అజ్మీర్‌లో పెరిగిన భగవతి 22 ఏళ్ల వయసులో 15 వేల రూపాయల కట్నంతో అత్తవారింట అడుగుపెట్టింది. వరుసగా ముగ్గురు కూతుళ్లు పుట్టారు. కొడుకు పుట్టకపోవటంతో అత్తమామలు భగవతిని శత్రువులా చూసేవారు. కూతుళ్లు కుటుంబానికి ‘భారం’ అనే ముద్రవేశారు. కొడుకు కోసం ఏడుగురు కూతుళ్లను కన్న భగవతి ఆరోగ్య స్థితిని ఎట్టకేలకు అర్థం చేసుకున్నాడు భర్త మోహన్ లాల్. ‘నా భర్త చదువుకున్న వ్యక్తి. దయగలవాడు. కానీ, ఇంటి పెద్దలకు ఎదురు చెప్పలేని మనస్తత్వం. నేను ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత మా ఏడుగురు కూతుళ్లను తీసుకొని అత్తవారింటి నుంచి బయటకు వచ్చాం. ఒక చిన్న కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంట్లో మసాలాలతో వండే ఆహారాన్ని నా భర్త బాగా ఇష్టపడేవాడు. ఇదే విషయాన్ని ప్రస్తావించినప్పుడు, మసాలాల వ్యాపారం చేయడానికి ఒప్పుకున్నాడు. రకరకాల సుగంధ ద్రవ్యాలను పోగుచేసి, వాటితో ఘుమ ఘుమలాడే మసాలా పొడులు తయారు చేసి ఇచ్చేదాన్ని. మొదట్లో మహారాణా కోట సమీపంలో బెడ్‌షీట్ పరిచి, వాటిని అమ్మేవాడు. పగటిపూట మసాలాలు అమ్మి, సాయంత్రం కిరాణాషాప్ నడిపేవాడు. అలా వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే ఏడుగురు పిల్లలు, మేము ఇద్దరం బతికిన తొలినాళ్లను ఇప్పటికీ మర్చిపోలేం. ఆ తర్వాత కిరాణ షాపునే మసాలా దుకాణంగా మార్చేశాం. ఆ కొన్ని రోజులకే అనారోగ్యంతో నా భర్త కన్నుమూసినప్పుడు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాలేదు. మసాలా దినుసులు అమ్మే వ్యాపారాన్ని నా కూతుళ్ల సహకారంతో చూసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు మా అత్తగారు తీవ్రంగా వ్యతిరేకించారు ఆడవాళ్లు చేసే పనేనా ఇది అంటూ. కానీ, ఎవరి మాటలూ లెక్కచేయకుండా ఈ వ్యాపారాన్ని కొనసాగించాను. అందుకు నా కూతుళ్లు పడిన కష్టం, వారిచ్చిన సహకారం చాలా గొప్పది. ఏడుగురు అమ్మాయిలు మంచి చదువులు చదువుకున్నారు. వ్యాపారాన్నీ చూసుకుంటున్నారు’ అంటూ తాము ఎదుర్కొన్న గడ్డు స్థితిని, దానిని ఓపిగ్గా దాటిన వైనాన్ని, గౌరవప్రదమైన జీవితాన్ని ఎలా సంపాదించుకున్నారో వివరిస్తారు భగవతి. ‘ఉషా, పూనమ్, నీలం, నిక్కి, కవిత, రితు, ప్రియా’ అంటూ తన ఏడుగురు కూతుళ్లను పరిచయం చేస్తూ వీరు నా ప్రపంచ అద్భుతాలు అంటారు భగవతి. ఈ ఏడుగురు కూతుళ్లు తల్లి భగవతితో కలిసి ఎమ్.వి.స్పైసెస్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపును ఇస్తున్నారు. అదృష్టానికి చిరునామా! ‘ఇటీవల జో«ద్‌పూర్ సందర్శనలో మేం ఎం.వి. స్పైసెస్ దుకాణాన్ని సందర్శించి అదృష్టవంతులమయ్యాం. సుగంధ ద్రవ్యాల అల్మారాలతో నిండి ఉన్న ఆ చిన్న దుకాణాన్ని ఏడుగురు అక్కాచెల్లెళ్లు నిర్వహిస్తున్నారు. మసాలా చాయ్‌కి కావల్సిన అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు గల ప్యాకెట్‌ను మేం కొన్నాం. అది చూస్తే ‘ప్యాకెట్ ఇన్ ఇండియా’గా అనిపించింది’ అంటూ ఒక పర్యాటకురాలు తన బ్లాగ్‌లో రాసుకున్నారు. ‘ది స్పైస్ గర్ల్స్ ఆఫ్ ఇండియా’ గురించి బిబిసి ఈ ఏడుగురు కూతుళ్ల గురించి డాక్యుమెంటరీ కూడా చేసింది. సెంటెడ్ ఛాయ్ గురించి పర్యాటకులకు వివరిస్తూ... -
ట్రాక్టర్ కిందికి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు దుర్మరణం
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్‌పూర్‌లో తెల్లవారుజామున డంగియావస్ సమీపంలో ఓ కారు.. ట్రాక్టర్ కిందికి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు .ఈ ప్రమాదంలో మృతులందరూ అజ్మీర్ జిల్లా కు చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై డిసిపి భువన్ భూషణ్ యాదవ్ మాట్లాడుతూ మృతదేహాలను ఎండిఎం ఆసుపత్రిలో ఉంచినట్లు తెలిపారు. -
ఆమె ఆరోగ్యం బాగు చేయడానికి ఆ దేవుడే ఇలా వచ్చాడేమో!
జైపూర్: ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి మనుషుల మాదిరిగానే, నోరులేని జీవాలకు ఉంటాయనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఉదంతాలను తెలిపే అనేక సంఘటనలు చూసే ఉంటాం. తాజాగా, మరో భావోద్వేగానికి గురిచేసే సంఘటన ఒకటి రాజస్థాన్‌లో జరిగింది. వివరాలు.. జోధ్‌పూర్ జిల్లాలోని ఫలోడి అనే గ్రామం ఉంది. దీనిలో భన్వ్రీ దేవి అనే 90 ఏళ్ల వృధ్దురాలు ఉంటుంది. ఆమె ఆరోగ్యం బాగాలేక మంచానికే పరిమితమైంది.. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, ఒక పెద్ద కొండెంగ (లగూన్) ఆమె ఇంట్లోకి ప్రవేశించింది. మెల్లగా ఆవృద్ధురాలు ఉన్న మంచంపై ఎక్కి కూర్చుంది. కాసేపు అటూ ఇటూ చూసింది. అంతటితో ఆగకుండా ఆ ముసలావిడ పైన కూర్చొని ఆప్యాయంగా ముఖంపై నిమిరింది. మొదట ముసలావిడ కాస్త భయపడినట్లు కనిపించినా, కాసేపటకి ,కొండెంగ చూపిస్తున్న ప్రేమకు భావోద్వేగానికి లోనైంది. ఆ వృద్ధురాలి కడుపు పైన కూర్చుని మరొసారి ఆలింగనం చేసుకుంటూ.. తన ప్రేమను చూపించింది. దీంతో, కొండెంగను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని దాని వీపుపై ప్రేమతో నిమిరింది. కాసేపటికి ఆ కొండెంగ మెల్లగా మంచం దిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ వావ్.. మనుషుల కన్నా నోరులేని జీవాలే మిన్న..’, ‘బామ్మ.. నిజంగా అదృష్టవంతురాలు’, ‘ఆమె ఆరోగ్యం బాగు చేయడానికే ఆ దేవుడే వచ్చాడు..’,‘పాపం.. కొండెంగ.. తన గుంపు నుంచి తప్పిపోయిందేమో..’, ‘ఆ ప్రేమను చూసి మా కళ్లలో నీళ్లు తిరిగాయి..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: వామ్మో.. గాల్లో బంతిలా ఎగిరి కిందపడ్డ ‘సివంగి’ చదవండి: ట్రైన్లో అడవి పంది: భళే పరుగులు తీస్తుందే!! -
వైరల్: దుస్తులు చించేసి, మరీ ఘోరంగా..
‘‘ఐదుగురు రాక్షసులు ఒక అమ్మాయిని దుస్తులు చించేసి.. శారీరకంగా హింసించారు. ఆపై వీడియోలు తీసి షేర్ చేశారు. హింసించిన వాళ్లలో ఒక మహిళ కూడా ఉంది’’.. మానవత్వం తలదించుకునే రీతిలో జరిగిన ఈ ఘోరమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియలో దుమారం రేపుతోంది. అత్యాచార అవమానం తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుందని, ఘటనకు కారకులైనవాళ్లను కఠినంగా శిక్షించాలని #justiceforloviassumi హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌ను కుదిపేస్తోంది. ఇందులో వాస్తవమెంత ఉందంటే.. జోధ్‌పూర్(రాజస్థాన్) : ఇరవై ఐదేళ్ల లోవీ అస్సుమీ ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు ఉత్తర భారతాన్ని కుదిపేస్తోంది. నాగాలాండ్‌కు చెందిన లోవి.. జోధ్‌పూర్‌లో ఓ రెస్టారెంట్లో పని చేస్తోంది. మే 23న తానుంటున్న గదిలో ఆమె ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ లోపు ఇంటర్నెట్లో ఒక వీడియో రిలీజ్ అయ్యింది. నలుగురు వ్యక్తులు, ఓ మహిళ కలిసి ఓ అమ్మాయిని దుస్తులు చించేసి శారీరకంగా హింసించిన వీడియో అది. ఆ వీడియోను ఇంటర్నెట్లో ఉంచారు. కొందరు లోవీ అస్సుమీ ఉరికి వేలాడుతున్న ఫొటోలను, వేధింపుల వీడియోను, అందులోని స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేశారు. ఆ వీడియోలో ఉంది లోవి అస్సుమీ అని, ఆ అవమాన భారం తట్టుకోలేకే ఆమె సూసైడ్ చేసుకుందని ప్రచారం మొదలైంది. దీంతో ఆమెకు న్యాయం జరగాలని సోషల్ మీడియా ఉద్యమిస్తోంది. వేర్వేరే ఘటనలు అయితే నాగాలాండ్ యువతి సూసైడ్‌కి, ఆ వీడియోలకు సంబంధం లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ అడిషినల్ డీజీపీ రాబిన్ హిబు కార్యాలయం నుంచి ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయ్యింది. అవి రెండు వేర్వేరు ఘటనలని, ఈమేరకు జోధ్‌పూర్ డీజీపీతో సంప్రదించి ధృవీకరించినట్లు చెప్పారు. అంతేకాదు వీడియోలను నాగాలాండ్ యువతి సూసైడ్‌కి ముడిపెట్టి వైరల్ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు, ఈ మేరకు దర్యాప్తు జరపాలని గుజరాత్, మిజోరాం, రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ సమాచారంతో కొందరు యూట్యూబర్లు ఈ వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మృగాల్ని శిక్షించాల్సిందే! అయితే ఘటనలో ఉన్న బాధితురాలు ఎవరైనా సరే.. నిందితులను శిక్షించాల్సిందేనని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అస్సాం పోలీసులు ఫేస్బుక్లో ఒక ప్రకటన పోస్ట్ చేశారు. వీడియోలో ఐదుగురు ఉన్నారని, వాళ్ల ఆచూకీ చెబితే నజరానా అందిస్తామని తెలిపింది. ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలిదు. కానీ, నిందితుల సమాచారం అందిస్తే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం అని అస్సాం పోలీసులు వెల్లడించారు. అయితే వీడియోల్లో ఆ గ్యాంగ్ ఇద్దరు అమ్మాయిలపై దాష్టీకానికి పాల్పడినట్లు గుర్తించామని కొందరు చెప్తున్నారు. -
హీరో సల్మాన్‌ఖాన్ గుర్రం పేరిట మోసం
జైపూర్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గుర్రం పేరిట దుండగులు ఓ మహిళను మోసం చేశారు. సల్మాన్ గుర్రం అమ్ముతామని చెప్పి ఆమె నుంచి రూ.12 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది. డబ్బులిచ్చాక గుర్రాన్ని ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసి దాదాపు పది నెలలైనా పట్టించుకోవడం లేదంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన మహిళ సంతోశ్ భాటికి గుర్రాలంటే ఎంతో ఇష్టం. ఆమె ఆసక్తిని గమనించిన ముగ్గురు మోసగాళ్లు ఆమెను సంప్రదించారు. హీరో సల్మాన్ ఖాన్‌కు చెందిన ఒక గుర్రం అమ్మకానికి ఉందని.. అది మీకు అమ్మి పెడతామని ఆమెను నమ్మించారు. ఈ సందర్భంగా ఆమెను నమ్మించేందుకు సల్మాన్‌కు చెందిన కొన్ని గుర్రాలను తాము గతంలో విక్రయించినట్లు చెప్పారు. దీంతోపాటు సల్మాన్ ఖాన్ గుర్రాలతో కలిసి దిగిన ఫొటోలు చూపించి ఆమెను నమ్మించారు. దీంతో ఆ గుర్రం కొనేందుకు ఆమె అంగీకరించింది. చర్చల అనంతరం చివరకు రూ.12 లక్షలకు గుర్రం ఇస్తామని మోసగాళ్లు చెప్పారు. ఇప్పుడు తక్కువకు కొని తర్వాత నీవు అధిక మొత్తానికి విక్రయించుకోవచ్చని అత్యాశపెట్టారు. వారి మాటలను నమ్మి బుట్టలో పడిన ఆమె రూ.11 లక్షల నగదు, రూ.లక్ష చెక్ ఇచ్చింది. అయితే డబ్బులు తీసుకుని వెళ్లిన ముగ్గురు ఎంతకీ గుర్రాన్ని తీసుకొచ్చి ఆమెకు ఇవ్వలేదు. వారిని సంప్రదించినా స్పందన లేకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించింది. 2020 ఆగస్టులో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నెలలైనా తన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. సమగ్రంగా, పారదర్శకంగా తన కేసును దర్యాప్తు చేయాలని కోర్టులో ఆమె పిటిషన్ వేశారు. రాజస్థాన్ హైకోర్టు ఆమె పిటిషన్‌ను గురువారం విచారణ చేసింది. సంబంధిత పోలీస్ అధికారికి ఈ కేసు గురించి తెలపాలని, ఆ అధికారి చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది. -
డేటా వాడేశాడని తమ్ముడిని కడతేర్చాడు
జోధ్‌పూర్: మొబైల్ డేటాను మొత్తం వాడేశాడని సొంత తమ్ముడిని అన్నయ్య చంపిన ఘటన రాజస్థాన్ జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం నిందితుడు రామన్(23) తన తమ్ముడు రాయ్‌ను ఇంటిపైకి తీసుకెళ్లాడు. ఇంటర్నెట్ డేటాను పూర్తిగా వాడడంతో తమ్ముణ్ణి తిట్టాడు. కోపంతో నిందితుడు రాయ్ ఛాతీ మీద పొడిచి పారిపోయాడు. రక్తపుమడుగులో ఉన్న రాయ్‌ను కుటుంబ సభ్యులు బుధవారం అర్థరాత్రి ఆసుపత్రికి తరలించగా అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. పారిపోయిన నిందితుడు రామన్‌ను శుక్రవారం రైల్వే స్టేషన్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మానసికంగా అస్థిరంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. (చదవండి:ప్రియురాలి ప్రవేశం.. మొదటిరాత్రి భగ్నం!) -
భర్తను చంపి.. ముక్కలుగా కోసి.. ఆపై
జైపూర్: రాజస్తాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను అత్యంత పాశవికంగా హతమార్చిందో భార్య. అనంతరం అతడి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మురుగునీటి శుద్ధి కర్మాగారంలో పడేసింది. జోధ్‌పూర్‌లో జరిగిన ఈ సంచలన హత్యకు సంబంధించిన మిస్టరీని 48 గంటల్లోనే ఛేదించినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాలు... నందాడి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సమీపంలోని మురికి కాలువలో రెండు బాక్సులను బుధవారం స్థానికులు గుర్తించారు. వాటిని పరీక్షించి చూడగా అందులో మనిషి మాంసం కనిపించడంతో బెంబేలెత్తిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. (బాలిక కళ్లెదుటే ఆమె తల్లిని కడతేర్చాడు) ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు.. స్థానికంగా నివసించే సుశీల్ అలియాస్ చరణ్ సింగ్ మిస్సయినట్లు గుర్తించారు. అతడి గురించి సేకరించిన వివరాల ఆధారంగా లోతుగా దర్యాప్తు జరపగా తానే భర్తను చంపినట్లు సుశీల్ భార్య పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది. తన అక్కాచెల్లెళ్లు, ఫ్రెండ్ సాయంతో సుశీల్‌ను తమ ఇంట్లోనే అంతమొందించానని, అనంతరం శవాన్ని ముక్కలుగా నరికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో పడవేసినట్లు తెలిపింది.(కొడుకును దారుణంగా హతమార్చిన తండ్రి) ఈ ఘటనలో నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్యభర్తల మధ్య గొడవల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఘటనాస్థలిలో లభించిన మృతుడి బైక్, ప్రత్యక్ష సాక్షుల ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా స్వల్పకాలంలోనే కేసును ఛేదించినట్లు పేర్కొన్నారు. -
ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి
జోథ్‌పూర్ : రాజస్తాన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్ధుల కుటుంబంలో 11 మంది ఆదివారం జోద్‌పూర్‌లోని వారి ఇంట్లో మరణించిన ఘటన కలకలం రేపింది. ఘటన జరిగిన ప్రాంతంలో పురుగు మందుల వాసన వస్తుండటంతో విషవాయువులు విడుదలవడంతో వారు మరణించి ఉంటారని భావిస్తున్నారు. జోథ్‌పూర్ జిల్లా కేంద్రానికి 150 కిలోమీటర్ల దూరంలోని దియోదు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడిఉంటారని స్ధానికులు పేర్కొంటున్నారు. భారత పౌరసత్వం పొందేందుకు బాధిత కుటుంబం 2012లో పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతం నుంచి భారత్‌కు తరలివచ్చింది. చదవండి : మార్చి లో పెళ్లి.. ఆగస్టులో ఆత్మహత్య అప్పటి నుంచి వారు శరణార్థి శిబిరంలో తలదాచుకుంటున్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా ఎలా మరణించారనే కారణాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఇక ఘటన జరిగిన సమయంలో ఇంటిలో లేకపోవడంతో ఓ కుటుంబ సభ్యుడు ప్రాణాలతో బయటపడ్డారని స్ధానికులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో యూపీలోని శాంతిపూర్ ప్రాంతంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకోగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా పడిఉండటాన్ని గుర్తించారు. గత ఏడాది డిసెంబర్ 14న ఆర్థిక ఇబ్బందులతో తమిళనాడులోని మధురై ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. -
జోధ్‌పూర్‌లో నడిరోడ్డుపై పగిలిన పైప్‌లైన్
-
జార్జ్ ఫ్లాయిడ్ లాంటి ఘటన
-
మెడపై కాలేసి తొక్కిపట్టిన పోలీసు!
జైపూర్: అమెరికాలో ఆందోళనలకు కారణమైన మినియాపొలిస్ జార్జ్ ఫ్లాయిడ్ లాంటి ఘటనే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీస్ అధికారి ఒకరు ముకేష్‌కుమార్ ప్రజపతి అనే వ్యక్తి మెడపై మోకాలితో తొక్కిపెట్టిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. బలదేవ్నగర్కు చెందిన ముకేష్‌కుమార్ మాస్క్ లేకుండా బయట తిరుగుతున్నందుకు పోలీసులు చలాన్ విధించారు. అయితే జరిమానా కట్టేందుకు నిరాకరించిన ముకేష్.. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతోపాటు వారిపై దాడికి తెగబడ్డాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసే క్రమంలో ఓ పోలీసు అధికారి ముకేష్ మెడపై మోకాలితో నేలకు నొక్కిపెట్టాడు. ఇది జార్జ్‌ఫ్లాయిడ్ ఘటనను గుర్తుచేస్తున్నా...ఇక్కడ ముకేష్ తిరిగి పోలీసులపై దాడి చేశాడు. అంతేకాదు స్క్రూ డ్రైవర్‌తో తండ్రి కంటికి గాయం చేసిన కేసులో గతంలో ఒకసారి అరెస్ట్ అయిన రికార్డ్ కూడా అతనికి ఉంది. (చదవండి: అమెరికా: పోలీసుల చర్యతో తల పగిలింది!) -
మాస్కులతో వివాహం చేసుకున్న దివ్యాంగులు
జోధ్‌పూర్: పెళ్లంటే కలకాలం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. అయితే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు కరోనా వచ్చి పెళ్లిళ్లను వెక్కరిచింది. తానుండగా వివాహాది శుభకార్యాలు జరిగేది లేదంది. దీంతో వందలాది వివాహాలు వాయిదా పడ్డాయి. కానీ కొంతమంది మాత్రం అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాల్సిందేనని మంకుపట్టి పడుతూ మరీ మనువాడుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ దివ్యాంగుల జంట కూడా ఇప్పట్లో కరోనా పోయిలా లేదుగానీ అనుకుని గురువారం నాడు కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరంగా పెళ్లి తంతు పూర్తి చేసుకుంది. (కల్యాణానికి కరోనా సెగ) అటు పురోహితుడు మాస్కు కట్టుకునే మంత్రాలు ఉచ్ఛరించాడు. ఇటు వధూవరులతోపాటు కుటుంబ సభ్యులు కూడా మాస్కులు ధరించారు. సుబోధ్ డేవ్ మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే వివాహం జరిపామని వెల్లడించారు. కొన్ని నెలల క్రితమే పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నామని, అందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశామన్నారు. అయితే లాక్డౌన్ వల్ల వేడుకలు క్యాన్సిల్ చేసుకుని నిరాడంబరంగా వివాహం జరిపామని తెలిపారు. కాగా లాక్డౌన్ ఇప్పటికి మూడు సార్లు పొడిగించిన తెలిసిందే. ప్రస్తుతం కేంద్రం విధించిన లాక్డౌన్ మే 17 వరకు కొనసాగనుంది. (మాస్క్ లేకుంటే జరిమానా రూ. 1,000) -
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
జైపూర్ : రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొలెరో వాహనాన్ని ట్రక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే 11 మంది దుర్మరణం చెందారు. అలాగే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు మహిళలు, నాలుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బలోత్రా ఫలోడి రహదారిపై శనివారం ఈ ప్రమాదం సంభవించింది. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో దెబ్బతిన్న వాహనాలను పక్కకు తీసి.. శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. (కార్తీక్ హత్య కేసు విచారణ వేగవంతం) వేగంగా దూసుకొచ్చిన ట్రక్.. జీపును బలంగా ఢీకొట్టడంతో జీపు మీదకు వాహనం చొచ్చుకెళ్లింది. అతి వేగమే ప్రమాదానికి కారణమయ్యి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. ‘జోధ్‌పూర్‌లో జరిగిన ప్రమాదం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. తమ వాళ్లను కోల్పోయిన వారికి నా ప్రగాడ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’. అంటూ ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. (‘అమ్మా.. అలసటగా ఉందమ్మా.. నిద్రపోతాను’) -
ఆ అమ్మాయితో మాట్లాడినందుకు గుండు గీయించి..
జైపూర్: దేశంలో కులవివక్ష ఏస్థాయిలో ఉందో చెప్పే ఉదంతం ఇది. ఎన్ని చట్టాలు, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా కొందరు మనుషులు సాటి మనుషుల పట్ల మానవత్వాన్ని మరచి అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం సంఘటన చోటుచేసుకుంది. దళిత యువకుడు అగ్రకులాల అమ్మాయితో మాట్లాడడాన్ని జీర్ణించుకోలేని కొందరు పెద్ద మనుషులు అతడికి గుండు కొట్టించారు. మెకానిక్ షాప్‌లో పనిచేసే రాహుల్ మేఘావాల్ అనే యువకుడు ఈ నెల 18న అతడికి తెలిసిన అగ్ర కులానికి చెందిన యువతితో మాట్లాడాడు. వీరిద్దరు ఓ కాఫీ హోటల్లో కలుసుకొని మాట్లాడుతుండగా గమనించిన అగ్ర వర్ణ కుల పెద్దలు, అమ్మాయి కుటుంబ సభ్యులు రాహుల్ ఇంటిపై దాడి చేశారు. అంతేగాక ఆ యువకుడికి గుండు గీయించి అవమానపరిచారు. అతనిపై, కుటుంబ సభ్యులపై విచక్షణ మరిచి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. చదవండి: ముగ్గురిని బలిగొన్న అక్రమ సంబంధం -
మిగ్–27కు వీడ్కోలు
జోథ్‌పూర్: దాదాపు మూడు దశాబ్దాల పాటు సేవలందించిన మిగ్(ఎంఐజీ)–27 యుద్ధ విమానాలు ఇక విశ్రాంతి తీసుకోనున్నాయి. జోథ్‌పూర్ వైమానిక స్థావరంలో శుక్రవారం జరిగిన మిగ్ వీడ్కోలు కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఎస్కే ఘోటియా పాల్గొన్నారు. ఈ విమానాలు పోరాటక్షేత్రంలో ముందు నిలిచాయని, 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో అమూల్యమైన సేవలందించాయని తెలిపారు. ఇన్నాళ్లూ జోథ్‌పూర్ ఎయిర్ బేస్‌లో మిగ్–27 రకం విమానాలు ఏడు వరకు సేవలందించాయి. -
ఆ నగరాలు సురక్షితం కాదు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని భోపాల్, గ్వాలియర్, రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ నగరాలు తమకు సురక్షితం కాదని మహిళలు అభిప్రాయపడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ప్రాంతాల్లో జనావాసం తక్కువగా ఉండటం, ఇతర ప్రాంతాలకు ఇవి సుదూరంగా ఉండటం వంటి కారణాల వల్ల తమకు రక్షణ కరువైనట్లు మహిళలు భావిస్తున్నారు. సామాజిక సంస్థలు సేఫ్టీపిన్, కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, ఆసియా ఫౌండేషన్లు ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. దీనికి గానూ భోపాల్ (77), గ్వాలియర్ (75), జోధ్‌పూర్ (67) నగరాల నుంచి 219 సర్వేల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించాయి. ఈ మూడు ప్రాంతాల్లో నివసించే విద్యార్థుల్లో 57.1 శాతం, అవివాహిత యువతుల్లో 50.1 శాతం మంది లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఈ ప్రదేశాలు నిర్జనంగా ఉండటం వల్ల తమకు రక్షణ కరువైందని 89 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. తమకు రక్షణ కరువైందని భావించడానికి మహిళలు పలు కారణాలను వెల్లడించారు. డ్రగ్స్, మద్యం అందుబాటులో ఉండటం (86 శాతం), ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం (63 శాతం), సరైన భద్రత లేకపోవడం (68 శాతం) వంటివి కారణాలుగా పేర్కొన్నారు. బస్సులు, ఆటోల్లో ప్రయాణించే సమయంలో కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు 50 శాతం మంది తెలిపారు. మార్కెట్లు వంటి చోట్ల వేధింపులకు గురవుతున్నామని 39 శాతం మంది వెల్లడించారు. రోడ్డు పక్కన వెళ్తుండగా (26 శాతం మంది), ట్రాన్స్పోర్ట్ కోసం వేచిచూసే సమయంలో (16 శాతం) సైతం లైంగిక వేధింపులకు గురవుతున్నామని చెప్పారు. -
నకిలీ ఆహ్వానం
బాలీవుడ్ క్రేజీ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ల నిశ్చితార్థం వచ్చే ఏడాది జనవరి 22న జోథ్‌పూర్‌లో జరుగుతుందన్నట్లు ఓ ఆహ్వాన పత్రిక నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. కానీ నెట్టింట్లో ఉన్న ఆహ్వానపత్రిక నిజమైనది కాదట. అందులో ‘ఆలియా’ స్పెల్లింగ్ తప్పుగా ఉండటంతో పాటు ఆలియా తండ్రి పేరు ముఖేష్ భట్ (నిజానికి ఆలియాభట్ తండ్రి పేరు మహేశ్‌భట్) అని ఉంది. ఈ కారణాలతో అది నకిలీ ఆహ్వానపత్రిక అని తెల్చేశాయి బాలీవుడ్ వర్గాలు. మరోవైపు ఈ విషయం గురించి ముంబై విమానాశ్రయంలో తారసపడిన ఆలియాను మీడియా అడిగితే.. ‘‘నేనేం చెప్పగలను. ఆ ఆహ్వాన పత్రిక ఫేక్’’ అని బదులిచ్చారట. ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలతో తీరిక లేకుండా ఉన్న ఆలియా తన ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో ‘బ్రహ్మాస్త్ర’ సినిమా చేస్తున్నారు. నెట్టింట్లో చక్కర్లు కొట్టిన ఆహ్వాన పత్రిక నకిలీదే అయ్యుండొచ్చు కానీ రణ్‌బీర్, ఆలియా ప్రేమలో ఉన్నారన్నది మాత్రం నిజం. మరి.. పెళ్లెప్పుడు? అంటే.. ఇద్దరూ నవ్వేసి, సమాధానం చెప్పకుండా తెలివిగా తప్పించుకుంటున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: 16 మంది మృతి
జైపూర్: రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న మినిబస్, కారు బలంగా ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదహారు మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రగా గాయపడ్డారు. వీరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం జోధ్‌పూర్ సమీపంలో ఈ ఘటన చేటుచేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. కాగా జాతీయ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. -
రూ 1999కే ఆ నగరాలకు విమాన యానం
సాక్షి, న్యూఢిల్లీ : ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన ప్రయాణీకులకు తీపికబురు అందించింది. న్యూఢిల్లీ నుంచి జోధ్‌పూర్‌కు ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి నేరుగా విమాన సర్వీసులను అందించనుంది. ఈ రూట్లో విమాన చార్జీలను రూ 1999గా నిర్ణయించింది. జోధ్‌పూర్‌తో పాటు ఢిల్లీ-అగర్తలా, ఢిల్లీ -దిబ్రూగఢ్ రూట్లలోనూ డైరెర్ట్ ఫ్లైట్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే నెల 14న ఈ రూట్లలో విమాన సర్వీసులను ప్రవేశపెడుతోంది. ఇక అగర్తలా, దిబ్రూగఢ్ రూట్లలో విమాన చార్జీలను వరుసగా 3,9999, 4999లుగా నిర్ణయించింది. మరోవైపు ఢిల్లీ, ముంబైలను కలుపుతా ఆరు నూతన అంతర్జాతీయ విమానాలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ-జెడ్డా, ముంబె-దిబ్రూగఢ్ రూట్లలో ఇవి సేవలు అందిస్తాయని ఇండిగో ఎయిర్‌లైన్ వెల్లడించింది. -
చాలా అందమైన ఫొటో..ఆమె గొప్పతల్లి...
ప్రకృతితో మమేకమై జీవించే బిష్ణోయి తెగ గురించి పర్యావరణ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకానొకనాడు చెట్ల కోసం ప్రాణాలను అర్పించిన బిష్ణోయిలు నేటికీ ప్రకృతిలోని ప్రతీ జీవితో తమ ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. జంతువులను సైతం కన్నబిడ్డల్లా సాకుతూ మానవతను చాటుకుంటున్నారు. రెండేళ్ల క్రితం జింక పిల్లకు పాలు పట్టిన ఓ బిష్ణోయి మహిళ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తప్పిపోయి వాళ్లింటికి వచ్చిందో ఏమోగానీ జింక పిల్ల ఆకలిని గుర్తించిన సదరు మహిళ... దానిని కన్నబిడ్డలా ఒళ్లో పడుకోబెట్టుకుని తన చనుబాలు తాగించింది. మాతృత్వపు వరానికి అసలైన అర్థం చెబుతూ అమ్మ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. అద్భుతమైన ఫొటో.. ‘జోధ్‌పూర్‌లోని బిష్ణోయి తెగ జంతువుల పట్ల ఎంతటి ఉదారతను కలిగి ఉంటుందో తెలుస్తోంది కదా. ఇవి వాళ్ల కన్నబిడ్డల కంటే తక్కువేమీ కావు. ఓ మహిళ పాలు పట్టిస్తోంది. 1730లో రాజును ఎదురించి మరీ 363 చెట్ల ప్రాణాలు నిలిపినది వీరే’ అంటూ ప్రవీణ్ కశ్వాన్ అనే అటవీ శాఖ అధికారి మహిళ ఫొటోతో సహా ట్విటర్లో షేర్ చేశారు. ఈ క్రమంలో చిప్కో ఉద్యమకారులైన బిష్ణోయిలు మరోసారి చర్చనీయాంశమయ్యారు. ఇక అద్భుతమైన ఈ ఫొటోపై ప్రకృతి ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘చాలా అందమైన ఫొటో. ఆమె చాలా గొప్ప తల్లి. ఆమెకు శిరస్సు వహించి వందనాలు తెలపాలి. మాతృత్వానికి నిజమైన అర్థం చెప్పారు’ అంటూ సదరు మహిళపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చిప్కో ఉద్యమం క్రీస్తు శకం 1730 లో జోధ్‌పూర్ రాజు అభయ్ సింగ్ ఓ పెద్ద నిర్మాణం నిమిత్తం బికనీర్‌కు సమీపంలో ఉన్న బిష్ణోయి ప్రాంతంలో ఖేజరీ చెట్లను నరికి తీసుకురమ్మని తన సైనికులను ఆదేశించాడు. అయితే ఖేజరీ చెట్టును దైవ సమానంగా భావించే బిష్ణోయి తెగ ప్రజలను ఈ వార్త ఎంతగానో కలచివేసింది. ఈ క్రమంలో అమృతాదేవి అనే గృహిణి పిల్లలతో సహా అక్కడికి చేరుకుని చెట్ల నరికివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో వారంతా చెట్లను హత్తుకొని నిల్చున్నారు. ఈ విషయం ఊరంతా పాకడంతో మరో 363 మంది ఆమెకు తోడయ్యారు. చెట్లను కౌగిలించుకుని తమ నిరసన తెలియజేశారు. అయినప్పటికీ రాజు మనుషులు చెట్లను నరికేశారు. ఈ ఘటనలో రెండు వందల మందికి పైగా బిష్ణోయిలు ప్రాణాలు కోల్పోయారు. మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమైన చెట్లను కాపాడేందుకు వీరు చేసిన ‘పర్యావరణ ఉద్యమానికే చిప్కో ఉద్యమం’ అని పేరు. ఇక గురు జాంబేశ్వర్ స్థాపించిన బిష్ణోయి మతాన్ని అనుసరించే బిష్ణోయిలు ఆయనను విష్ణు అవతారంగా భావిస్తారు. వీరికి ఆయన 29 నియమాలు పెట్టాడు. వీటిలో చెట్లు, పశుపక్ష్యాదులను కాపాడటం అతి ముఖ్యమైన నియమం. This is how #bishnoi community in Jodhpur cares for animals. These lovely animals are no less than children to them. A lady feeding one. The same people, who fought King in 1730 and laid 363 life protecting Khejri trees. pic.twitter.com/keBj5SEwdG — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 18, 2019 -
ఆ జంట ఆతిథ్యానికే రూ 4 కోట్లు..
ముంబై : బాలీవుడ్లో ఈ ఏడాది సెలబ్రిటీల పెళ్లిళ్లు హాట్ టాపిక్లా మారాయి. ముంబైలో అట్టహాసంగా సోనం కపూర్, ఆనంద్ అహుజాల పెళ్లి వేడుకతో మొదలైన హంగామా ఆ తర్వాత రణ్వీర్ సింగ్, దీపికా పడుకోన్‌ల ఇటలీ వెడ్డింగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక జోథ్‌పూర్‌లో దేశీ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ల పెళ్లి వేడుకకు చారిత్రక ఉమైద్ భవన్ ప్యాలెస్ సన్నద్ధమవుతోంది. నవంబర్ 29న ప్రారంభమయ్యే వేడుకలు డిసెంబర్ 2, 3 తేదీల్లో రెండు సంప్రదాయాల ప్రకారం సాగే పెళ్లి వేడకుతో ముగుస్తాయి. అంగరంగ వైభవంగా సాగే పెళ్లి తంతు కోసం నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకూ ప్రియాంక, నిక్ జోడీ తాజ్ ఉమైద్ భవన్ ప్యాలెస్‌ను బుక్ చేసినట్టు సమాచారం. మెహ్రాన్‌గర్ కోటలో మెహంది, సంగీత్‌లను ఆర్భాటంగా నిర్వహిస్తారు. జోధ్‌పూర్ ఎయిర్పోర్ట్ నుంచి ఉమైద్ భవన్ ప్యాలెస్‌కు ప్రియాంక, ఆమె తల్లి మధు చోప్రా, సోదరుడు సిద్ధార్ధ్‌లు నిక్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి చాపర్‌లో చేరుకోనున్నారు. మొత్తం 64 గదులున్న ఈ ప్యాలెస్‌లో 22 రూమ్‌లు 42 సూట్స్ ఉన్నాయి. వీటిలో ప్యాలెస్ రూమ్‌లు రోజుకు గదికి రూ 47,300 చార్జ్ చేస్తుండగా, సూట్స్‌కు రూ 65,300 వసూలు చేస్తారు. రాయల్ సూట్ ఖరీదు రోజుకు రూ 1.45 లక్షలు కాగా, గ్రాండ్ రాయల్ సూట్‌కు రూ 2.3 లక్షలు, ప్రెసిడెన్షియల్ సూట్స్‌కు రూ 5.04 లక్షల చార్జ్ చేస్తారు. ఐదు రోజుల వసతికి గాను ప్రియాంక, నిక్ జోడీ రూ 3.2 కోట్లు తమ బృందం ప్యాలెస్‌లో గడిపేందుకే వెచ్చిస్తోంది. మెహ్రన్గర్ కోటలో వేడుకలు జరపాలంటే ప్యాలెస్‌లో కనీసం 40 రూమ్‌లు బుక్ చేయాల్సి ఉంటుందని మెహ్రనగర్ ఫోర్ట్ అధికారి వెల్లడించారు. ఇక ఒక్కో వ్యక్తికి కేటరింగ్ కోసం రూ 18,000 వసూలు చేస్తారు. మూడు వేడుకలకు కలిపి కేటరింగ్‌కే రూ 43 లక్షల ఖర్చవుతుందని అంచనా. మొత్తంమీద ప్రియాంక, నిక్ జొనాస్ జోధ్‌పూర్ వివాహ వేడుకలకు రూ 4 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక రణ్వీర్, దీపికల తరహాలోనే రెండు సంప్రదాయాల ప్రకారం ప్రియాంక జోడీ వివాహం జరగనుంది. డిసెంబర్ 2న క్రిస్టియన్ వివాహం జరగనుండగా, డిసెంబర్ 3న హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుంది. కాగా వివాహం అనంతరం ఢిల్లీ, ముంబైల్లో భారీ రిసెప్షన్లు ఏర్పాటు చేయనున్నారు. దేశ రాజధానిలో ఫైవ్‌స్టార్ హోటల్లో ఘనంగా రిసెప్షన్ ఇచ్చేందుకు ప్రియాంక, నిక్ జోడీ సిద్ధమవుతోంది. ఇక బాలీవుడ్ ప్రముఖులు, స్నేహితుల కోసం ముంబైలో ఘనంగా విందు ఇవ్వనున్నారు. -
మూడో ఏట నిశ్చితార్థం.. రూ.20 లక్షలు కట్టకుంటే..
జైపూర్ : తల్లిదండ్రుల మాట నిలబెట్టాలనే వేధింపులు తట్టుకోలేక పోలీసుల ముందే ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోద్పూర్ పోలీసు స్టేషన్లో చోటుచేసుకుంది. వివరాలు.. జోధ్‌పూర్‌కు చెందిన దివ్యా చౌదరి(22) అనే యువతికి మూడేళ్ల వయస్సు ఉన్నపుడు జీవ్‌రాజ్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తామని ఆమె తల్లిదండ్రులు మాట ఇచ్చారు. దీంతో దివ్యానే తమ ఇంటి కోడలు అని జీవ్‌రాజ్ కుటుంబ సభ్యులు భావించేవారు. ఈ క్రమంలో యుక్త వయసు రాగానే వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో గత కొన్ని రోజులుగా.. జీవ్‌రాజ్‌ను త్వరగా పెళ్లి చేసుకొని, తమ ఇంటికి రావాలంటూ దివ్యపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రమేయం లేకుండా తల్లిదండ్రులు ఇచ్చిన మాటకు కట్టుబడేది లేదని, తను జీవ్‌రాజ్‌ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని దివ్య తేల్చి చెప్పింది. దీంతో ఈ విషయాన్ని పంచాయతీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు అతడి కుటుంబ సభ్యులు. దివ్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన పంచాయతీ పెద్దలు పెళ్లికి అంగీకరించకపోతే 16 లక్షల రూపాయల జరిమానా కట్టాలని తీర్పునిచ్చారు. అయితే వారి మాటలను ఖాతరు చేయకుండా దివ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెలి వేస్తాం జాగ్రత్త.. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ పెద్దలు 20 లక్షల రూపాయలు కట్టకపోతే దివ్య కుటుంబాన్ని వెలి వేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో దివ్య మరోసారి పోలీసులను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకుంది. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, ఉద్యోగం సంపాదించిన తర్వాతే తన ఇష్టప్రకారం పెళ్లి చేసుకుంటానని పోలీసులతో చెబుతున్న క్రమంలో విషం తాగింది. దీంతో దివ్యను వేధించిన జీవ్‌రాజ్ కుటుంబ సభ్యులు, పంచాయతీ పెద్దలపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ అమన్ సింగ్ తెలిపారు. దివ్య మొదటిసారి ఫిర్యాదు చేసినపుడు స్పందించకుండా నిర్లక్ష్యం చేసిన స్థానిక పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
నిన్ను విడిచి నేను ఉండలేనులే
...ఇది నిజములే అన్న రేంజ్లో ప్రియాంకా చోప్రా, ఆమెకు కాబోయే భర్త నిక్ జానస్లు సమయాన్ని గడుపుతున్నారు. గత నెలంతా ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన నిశ్చితార్థం వేడుక నిమిత్తం దాదాపు నెల రోజులు ఇటలీలో ఎంజాయ్ చేసిన ఈ జంట తాజాగా ముంబైలో షికార్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోనాలీ బోస్ దర్శకత్వంలో ఫర్హాన్ అక్తర్, ప్రియాంకా చోప్రా, జైరా వసీమ్ ముఖ్య పాత్రలుగా ‘ది స్కై ఈజ్ పింక్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఈ సినిమా రాత్రి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్రబృందం. ఈ సినిమా లొకేషన్లోకి అకస్మాత్తుగా వచ్చారట నిక్ జానస్. అంతేకాదు ప్రియాంక కేరవ్యాన్‌లో వెళ్లి ప్రేమ ముచ్చట్లు చెప్పారట. గత ఆదివారం ప్రియాంక సమక్షంలో నిక్ జానస్ బాలీవుడ్ యాక్టర్స్‌తో కలిసి ముంబైలో ఫుట్‌బాల్ ఆడిన విషయం తెలిసిందే. గమ్మతైన విషయం ఏంటంటే.. నిక్ ముంబై వస్తున్నట్లు ప్రియాంకకు తెలియనే తెలియదట. ప్రియురాలికి స్వీట్ షాకిచ్చారన్న మాట. ఈ నెల 10న ‘ది స్కై ఈజ్ పింక్’ షెడ్యూల్ లండన్‌లో మొదలవుతుంది. అక్కడ కూడా ప్రేమ షికార్లు చేయడానికి ఈ జంట ప్లాన్ చేస్తున్నారట. ఇలా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. -
సర్జికల్ స్ట్రైక్స్ 2వ వార్షికోత్సవం
-
సర్జికల్ స్ట్రైక్స్ 2వ వార్షికోత్సవం : వెలుగులోకి మరో వీడియో
జోధ్‌పూర్ : పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రైక్స్) జరిపి నేటికి రెండేళ్లు పూర్తి అయ్యాయి. ఈ దాడుల్లో భారత సైన్యం దాదాపు 50 మంది ఉగ్రవాదులను హతం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జోధ్‌పూర్ మిలిటరీ స్టేషన్లో వేడుకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే జోధ్‌పూర్ చేరుకున్నారు. తొలుత ఆయన ‘కోణార్క్ అమర వీరుల స్థూపా’న్ని సందర్శించారు. అనంతరం కోణార్క్ స్టేడియంలో సైన్యం ‘పరాక్రమ్ పర్వ్’ పేరిట నిర్వహిస్తోన్న ఆర్మీ ఎగ్జిబిషన్‌ని మోదీ ప్రారంభించారు. ఈ వేడుకల గురించి ఆర్మీ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఈ ఎగ్జిబిషన్ భారత సైన్యం శౌర్య, పరాక్రమాలను ప్రదర్శించాడానికి ఉద్దేశించినవి. ఈ ఎగ్జిబిషన్‌కి జోధ్‌పూర్‌కి చెందిన 250 మంది విద్యార్థులను ఆహ్వనించాము. ఈ కార్యక్రమంలో వీరు పదాతి దళం ఉపయోగించిన ఆయుధాలను స్వయంగా వీక్షిస్తారు. అంతేకాక పిల్లలంతా ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వబడింది. దాంతో పాటు సప్తశక్తి ఆడిటోరియంలో ‘సర్జికల్ స్ట్రైక్స్’కు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శిస్తాం. అనంతరం విద్యార్థులు సైన్యంలోని వివిధ హోదాలకు చెందిన అధికారులతో సంభాషిస్తార’ని తెలిపారు. -
రాజస్థాన్‌లో కూలిన యుద్ధ విమానం
జైపూర్ : రాజస్ధాన్‌లో భారత వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానం జోధ్‌పూర్ సమీపంలోని బనార్ ప్రాంతంలో మంగళవారం కుప్పకూలింది. సాంకేతిక సమస్యలతో పంటపొలంలో హెలికాఫ్టర్ కూలగా, ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. విమానం కూలిన క్రమంలో ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక బృందంతో పాటు వాయుసేన అధికారులు, పోలీసు సిబ్బంది చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. -
ఒక్క ఫోటో.. ఎంత పని చేసింది
జైపూర్: సోషల్ మీడియాలో ఫేక్ కథనాల నిర్మూలనపై చర్చ విస్తృతంగా సాగుతున్న వేళ.. రాజస్థాన్‌లో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఒళ్లో అందమైన చంటి బిడ్డను పట్టుకున్న ఓ బిచ్చగత్తె ఫోటో రెండు వారాల నుంచి వైరల్ అయ్యింది. దీంతో ఆమె పిల్లలను ఎత్తుకుపోయే మహిళ అన్న ప్రచారం విస్తృతంగా సాగింది. అయితే ఎట్టకేలకు ఓ ఎన్నారై మహిళ చొరవతో అదంతా ఉత్తదేనని తేలింది. వివరాల్లోకి వెళ్తే... జోధ్‌పూర్‌లోని శనీశ్వరుడి గుడి వెలుపల ఓ మహిళ బిక్షమెత్తుకుంటోంది. ఆమె పక్కింట్లో ఉండే మహిళ చెత్త ఎరుకుని జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఓ రోజు సదరు మహిళ తన బిడ్డను గుడి వద్ద ఉన్న మహిళకు అప్పగించి బయటకు వెళ్లింది. ఇంతలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. బిడ్డ అందంగా ఉండటం.. పైగా డైపర్ వేసి ఉండటంతో సదరు బిక్షగత్తెను పిల్లలను అపహరించే బాపతంటూ సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున్న జరిగింది. ఇదిలా ఉండగా రోహిణి షా అనే మహిళ జోధ్‌పూర్ పోలీసులకు ఆ కథనాన్ని ట్యాగ్ చేయటంతో వారు వెంటనే అప్రమత్తమయ్యారు. చివరకు ఆ మహిళను, బిడ్డ తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగు చూసింది. ఈ వ్యవహారాన్ని సునిశితంగా పరిశీలించి త్వరగా తేల్చేసిన పోలీసులను జోధ్‌పూర్ డీసీపీ అమన్ సింగ్ అభిందనందించారు. ఆలస్యం అయ్యి ఉంటే ఆ మహిళ పరిస్థితి ఏమైయ్యేదోనని పలువురు కామెంట్లు చేస్తున్నారు. thanks for the concern of all, the child,his mother and the baby sitter(in the snap) have been traced within hours of we being informed this afternoon. The mother & other lady are friends,one being a beggar and other a rag picker. pic.twitter.com/1hA7acvC1j — DCPJODHPUREAST (@DCP_JODHPUREAST) 30 July 2018 -
నెట్ సర్వీసులను నిలిపివేయడం నేరమే!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్, జైపూర్, జోద్పూర్ నగరాల్లో మూడు రోజుల క్రితం అంటే, 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులను సంపూర్ణంగా షట్‌డౌన్ చేసింది. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవడం వల్లనో, పిల్లలను ఎత్తుకుపోయే కిడ్నాపర్లు తచ్చాడుతున్నారంటూ వదంతులు వ్యాపిస్తున్నాయన్న కారణంగానో, మత విద్వేషాల కారణంగానో ఇంటర్నెట్ను షట్‌డౌన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం పరీక్షల పేరిట, అందులోను పోలీసు కానిస్టేబుళ్ల నియామక పరీక్షల కోసం నెట్ సర్వీసులను నిలిపి వేశారంటే ఆశ్ఛర్యం కలుగుతోంది. రాష్ట్రంలో 13000 వేల పోలీసు ఉద్యోగాల కోసం 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉండడంతో మూడు నగరాల్లో పరీక్షా కేంద్రాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. అత్యాధునిక పద్ధతుల్లో కాపీ కొట్టకుండా అభ్యర్థులను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు వివరించారు. ఇంటర్నెట్ సర్వీసులను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవడం అన్నది ప్రజల స్వేచ్ఛ. పరీక్షల పేరిట ప్రజల స్వేచ్ఛను హరించడం అన్యాయమని ప్రజా సంఘాలు వాదిస్తున్నాయి. పరీక్షలకు ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యారన్నది ఇక్కడ ముఖ్యంకాదని ఆ సంఘాలు పేర్కొన్నాయి. ఆ మాటకొస్తే ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ విషయంలో ఘోరంగా విఫలమవడమే అధిక పోటీకి కారణమని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాపీ కొడతారన్న కారణంగా పరీక్షల సందర్భంగా ఇంటర్నెట్ సౌకర్యాలను పూర్తిగా నిలిపివేయడం అంటే నీటిని తస్కరిస్తున్నారనో, వృధా చేస్తున్నారన్న కారణంగా ప్రజలందరికి నీటి సరఫరాను నిలిపివేయడంలా ఉందని ఆ సంఘాలు ఆరోపించాయి. ప్రజల స్వేచ్ఛను హరించే ఏ నిర్ణయమైన అది నేరమే అవుతుందని విమర్శించాయి. -
జోథ్‌పూర్‌లో ఘోరాతిఘోరం
సాక్షి, రాజస్తాన్: మూఢ నమ్మకాలతో మనుషుల్లో ఉన్నమతిపోతుంది. రంజాన్ మాసంలో కూతురిని బలిస్తే, తనకు కుమారుడు పుట్టేందుకు అల్లా తనను కరుణిస్తాడని భావించి ఓ వ్యక్తి తన కూతురిని ఘోరాతిఘోరంగా చంపాడు. కసాయివాడు జంతువు గొంతు కోసినట్లు కూతురి గొంతు కోసి చంపాడు. ఈ దారుణమైన సంఘటన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో శుక్రవారం వేకువజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జోథ్‌పూర్ నగరంలో నవాబ్ అలీ ఖురేషీ, ఆయన భార్య, కూతురు రిజ్వానాలు, అలీ భార్య తరపు బంధువుల ఇంట్లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. నవాబ్ అలీ పై అంతస్తులో ఉంటుండగా..భార్య తరపు బంధువులు కింద పోర్షన్లో ఉంటున్నారు. నవాబ్ అలీ ఖురేషీకి నాలుగేళ్ల రిజ్వాన్ అనే కూతురు ఉంది. శుక్రవారం వేకువజామున రెండున్నర గంటల సమయంలో అలీ తన స్వహస్తాలతో కూతురిని గొంతు కోసి బలి ఇచ్చి, అల్లాకు కానుకగా సమర్పించాడు. అనంతరం తాను ఏమీ ఎరగనట్లు వచ్చి భార్య పక్కన పడుకున్నాడు. కూతురు రిజ్వానా కనపడకపోవడంతో తల్లి కిందకు వెళ్లి చూసింది. రక్తపుమడుగులో పడి ఉండటం చూసి హతాశురాలైంది. అలీ భార్య కేకలు విని బంధువులు బయటకు వచ్చారు. జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 3 గంటలకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆధారాలు సేకరించేందుకు డాగ్ స్క్వాడ్‌ను హుటాహుటిన రప్పించిన పోలీసులు ఇళ్లంతా పరిశీలించారు. కుటుంబసభ్యులందరినీ శుక్రవారం, శనివారం అంతా పోలీసులు విచారించారు. విచారణలో కన్న తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. అల్లా కోసమే కూతురిని బలిచ్చానని విచారణలో నవాబ్ అలీ ఒప్పుకున్నాడు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిపడ్ నగర ఆసుపత్రికి తరలించారు. మూర్ఖపు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. -
మళ్లీ జోధ్‌పూర్‌కు సల్మాన్ ఖాన్!
న్యూఢిల్లీ: కృష్ణ జింకల్ని చంపిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ ఆదివారం జోధ్‌పూర్ చేరుకున్నారు. ఈ కేసులో సోమవారం జోధ్‌పూర్ సెషన్స్ కోర్టులో జరగనున్న వాదనలకు సల్మాన్ హాజరు కావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఒక రోజు ముందే సల్మాన్ జోధ్‌పూర్ చేరుకున్నారు. ముంబై నుంచి విమానంలో వచ్చిన సల్మాన్.. జోధ్‌పూర్ విమానాశ్రయంలో ఆయన కనిపించారని, సోమవారం కోర్టు విచారణకు ఆయన హాజరవుతారని ఏఎన్ఐ వార్తాసంస్థ ట్వీట్‌చేసింది. కృష్ణ జింకల్ని చంపిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న సల్మాన్‌కు ప్రస్తుతం బెయిల్‌మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. ట్రయల్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించడంతో రెండ్రోజులు జోధ్‌పూర్ కేంద్ర కారాగారంలో సల్మాన్ శిక్ష అనుభవించారు. అనంతరం ఆయనకు బెయిల్ లభించింది. అయితే బెయిల్ మంజూరును రాజస్తాన్ హైకోర్టులో సవాలు చేస్తామని బిష్ణోయ్ తెగ ప్రతినిధి రామ్ నివాస్ తెలిపారు. -
‘ఆశ’గా ఎదురుచూసి.. కంగుతిన్నారు!
జోధ్‌పూర్: తాము నమ్మిన భగవత్స్వరూపం కడిగిన ముత్యంలా తిరిగొస్తుందని ఆశగా ఎదరుచూసిన భక్తులు కంగుతిన్నారు. బాలికపై అత్యాచారం కేసులో ప్రముఖ ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపు దోషిగా తేలడంతో ఆయన అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ గురువు నిర్దోషిగా విడుదలవుతారని దండలు కూడా తీసుకొచ్చిన అభిమానులు కోర్టు తీర్పుతో షాక్‌కు గురయ్యారు. ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం కనిపించిన దృశ్యాలివి! ఆథ్యాత్మిక గురువుగా ఒక వెలుగు వెలిగిన ఆశారాం.. దేశవ్యాప్తంగా 400కుపైగా ఆశ్రమాలు స్థాపించారు. 2013లో సహారన్‌పూర్‌లోని తన ఆశ్రమంలోనే ఆయన మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదయింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఆశారాం దోషే అంటూ జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. బాపుతో పాటు కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మాత్రం నిర్దోషులుగా బయటపడ్డారు. బాపూజీ నిర్దోషిగా బయటికొస్తారని దండలతో వచ్చి జోధ్‌పూర్ జైలు వద్ద హడావిడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీర్పు నేపథ్యంలో ఆశారాం అనుచరులు విధ్వంసానికి పాల్పడే అవకాశాలున్న దరిమిలా రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని కీలక పట్టణాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యాయం దక్కింది: బాధితురాలి తండ్రి ‘‘ఆశారాం దోషిగా తేలడంతో మాకు న్యాయం దక్కింది. ఈ కేసులో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన సాక్షుల కుటుంబాలకు కూడా న్యాయం జరగాలని కోరుతున్నాను. దోషికి కఠిన శిక్ష పడుతుందని భావిస్తున్నా. సుదీర్ఘంగా సాగిన న్యాయ పోరాటంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ తీర్పుపై అప్పీలు! అత్యాచారం కేసులో ఆశారాంను దోషిగా తేల్చిన జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు ఆశారాం ఆశ్రమ అధికార ప్రతినిధి నీలమ్ దుబే మీడియాకు చెప్పారు. తీర్పు కాపీని క్షుణ్నంగా చదివి, నిపుణులతో చర్చించిన మీదట తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. దొంగ బాబాలకు చెంపపెట్టు: కాంగ్రెస్ ‘నిజమైన సాధువులకు, దొంగ బాబాలకు మధ్య తేడాలను ప్రజలు పసిగట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తీర్పు ఖచ్చితంగా చాలా మార్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా బాబాలు, సాధువుల పట్ల అంతర్జాతీయంగా నెలకొన్న అభిప్రాయాల్లో మార్పు వస్తుంది’’ అని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు. -
ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు షాక్
-
అత్యాచార కేసు : ఆశారాం దోషి
జోధ్‌పూర్ (రాజస్థాన్) : మైనర్ బాలికపై అత్యాచార కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూను జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. బాపుతో పాటు కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని దోషులుగా పేర్కొన్న కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంది. అయితే, ఆశారాంకు శిక్షపై కోర్టులో విచారణ ఇంకా కొనసాగుతోంది. కోర్టు తీర్పుపై న్యాయపరంగా సలహా తీసుకుని ముందుకు వెళ్తామని ఆశారాం అధికార ప్రతినిధి చెప్పారు. కాగా, కోర్టు తీర్పు నేపథ్యంలో జోధ్‌పూర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో ఆశారాంకు శిక్ష పడటంపై బాధితురాలి తండ్రి హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పోరాటంలో వారికి మద్దతుగా నిలిచినందుకు పలువురికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో సాక్ష్యులుగా ఉండి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. తీర్పు అనంతరం ఆశారాం అనుచరులు విధ్వంసక చర్యలకు దిగుతారేమోనన్న అనుమానంతో ఈ నెల 30వ తేదీ వరకు 144 సెక్షన్‌ను అమలు చేశారు. ఈ కేసులో 2013 సంవత్సరం నుంచి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆశారాం బాపూపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగష్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారాం తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమెకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్యపెట్టిన ఆశారాం అత్యాచారం జరిపినట్టు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. అందరి కళ్లు గప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నాడు. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతను బయటకి రాలేదు. అతనిని అరెస్ట్ చేయడం కూడా ప్రహసనంగానే మారింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశారాం అనుచరులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి. చివరికి 2013 సెప్టెంబర్ 1న ఆశారాంను జోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో సాక్షులపైన ఆశారాం బాపూ ప్రైవేటు సైన్యం బెదిరింపులు, దాడులకు దిగింది. తన కండబలం ప్రదర్శించింది. మొత్తం 9 మంది సాక్ష్యుల్లో ముగ్గరు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఆశారాంకు బెయిల్ ఇవ్వకపోతే చంపేస్తామంటూ కేసును విచారించిన న్యాయమూర్తిని సైతం ఆశారాం ప్రైవేటు సైన్యం బెదిరించింది. దీంతో సుప్రీంకోర్టులో కూడా ఆశారాంకు బెయిల్ లభించలేదు. మరో రెండు అత్యాచార కేసులు ఆశారాం బాపూని అరెస్ట్ చేసి రెండు నెలలు తిరక్కుండానే సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆశారాంతో పాటు ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్ సమీపంలోని ఆశ్రమంలో 2001, 2006 సంవత్సరం మధ్య ఆశారాం తనపై చాలాసార్లు లైంగికంగా దాడులకు దిగాడని అక్క ఆరోపణలు చేస్తే, సూరత్ ఆశ్రమంలో నారాయణ సాయి తనను అత్యాచారం చేశాడంటూ చెల్లి కోర్టుకెక్కింది. దీంతో పోలీసులు నారాయణ సాయిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆశారాం ఎలా ఎదిగాడు? 1941 సంవత్సరంలో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న సింధ్ ప్రాంతంలో పుట్టిన ఆశారాం 15 ఏళ్ల వయసులోనే ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కేవలం మూడో తరగతి మాత్రమే చదువుకున్న అతను ఆధ్యాత్మిక మార్గం పట్టాడు. గురు లీలా షాజీ మహరాజ్ దగ్గర శిష్యరికం చేశాడు. 1972 సంవత్సరంలో గుజరాత్‌లోని మొతేరా దగ్గర సబర్మతి తీరంలో చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేశాడు. తనని తాను దేవుడిగా ప్రకటించుకుని ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఏడాదిలోనే ఆ కుటీరం కాస్త ఆశ్రమంగా మారిపోయింది. ఆధ్యాత్మిక గురువుగా దేశ విదేశాల్లో ప్రఖ్యాతి వహించాడు. ప్రస్తుతం ఆయనకి దేశ విదేశాల్లో 400 ఆశ్రమాలు రెండు కోట్ల మంది శిష్యపరివారం ఉంది. పార్టీలకు అతీతంగా ఎందరో రాజకీయ వేత్తలు ఆయనకు పరమ వీర భక్తులు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో ప్రభుత్వాలు ఆయన ఆశ్రమాలకు అయాచితంగా భూ కేటాయింపులు చేశాయి. ఆశారాం ఆస్తులు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఏకంగా 10 వేల కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల్ని ఆయన కూడబెట్టాడు. అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగడుగునా వివాదాలే చోటు చోసుకున్నాయి. భూ కబ్జా ఆరోపణలు, ఆశ్రమంలో అనుమానాస్పద మృతులు వంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన ఆశ్రమం ఎన్ని అరాచకాలకు నెలవుగా మారిందో ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయి. -
రేపే తీర్పు... మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ అత్యాచార ఆరోపణల కేసులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనుంది. దీంతో జోధ్‌పూర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆశారాం అనుచరులు విధ్వంసక చర్యలకు దిగుతారేమోనన్న అనుమానంతో ఈ నెల 30వ తారీకు వరకు 144 సెక్షన్‌ను అమలు చేశారు. 2013 సంవత్సరం నుంచి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆశారాం బాపూపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగస్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారామ్ తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్యపెట్టిన ఆశారాం ఆమెపై అత్యాచారం జరిపినట్టు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. అందరి కళ్లు గప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నాడు. నాన్‌బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతను బయటకి రాలేదు. అతనిని అరెస్ట్ చేయడం కూడా ఒక ప్రహసనంగానే మారింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశారాం అనుచరులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి. చివరికి 2013 సెప్టెంబర్ 1న ఆశారాంను రాజస్థాన్ జోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో సాక్షులపైన ఆశారాం బాపూ ప్రైవేట్‌సైన్యం బెదిరింపులు, దాడులకు దిగింది. తన కండబలం ప్రదర్శించింది. ఆశారాంకు బెయిల్ ఇవ్వకపోతే చంపేస్తామంటూ కేసును విచారించిన న్యాయమూర్తిని కూడా బెదిరించారు. దీంతో సుప్రీంలో కూడా అతనికి బెయిల్ లభించలేదు. ఈ కేసులో ఆశారాంపై ఆరోపణలు రుజువైతే ఆయనకు గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మరో రెండు అత్యాచార కేసులు ఆశారాం బాపూని అరెస్ట్ చేసి రెండు నెలలు తిరక్కుండానే సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు ఆశారాంతో పాటు ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా అమ్మాయిల్ని లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్ సమీపంలోని ఆశ్రమంలో 2001, 2006 సంవత్సరం మధ్య ఆశారాం తనపై చాలాసార్లు లైంగికంగా దాడులకు దిగాడని అక్క ఆరోపణలు చేస్తే, సూరత్ ఆశ్రమంలో నారాయణ సాయి తనను అత్యాచారం చేశాడంటూ చెల్లి కోర్టుకెక్కింది. దీంతో పోలీసులు నారాయణ సాయిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఆశారాం ఎలా ఎదిగాడు ? 1941 సంవత్సరంలో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న సిం«ద్ ప్రాంతంలో పుట్టిన ఆశారాం 15 ఏళ్ల వయసులోనే ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కేవలం మూడో తరగతి మాత్రమే చదువుకున్న అతను ఆధ్యాత్మిక మార్గం పట్టాడు. గురు లీలాషాజీ మహరాజ్ దగ్గర శిష్యరికం చేశాడు. 1972 సంవత్సరంలో గుజరాత్‌లోని మొటెరా దగ్గర సబర్మతి తీరంలో చిన్న కుటీరాన్ని ఏర్పాడు చేశాడు. తనని తాను దేవుడిగా ప్రకటించుకుని ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఏడాదిలోనే ఆ కుటీరం కాస్త ఆశ్రమంగా మారిపోయింది. ఆధ్యాత్మిక గురువుగా దేశవిదేశాల్లో ప్రఖ్యాతి వహించాడు. ప్రస్తుతం ఆయనకి దేశవిదేశాల్లో 400 ఆశ్రమాలు 2 కోట్ల మంది శిష్యపరివారం ఉంది. పార్టీలకతీతంగా ఎందరో రాజకీయ వేత్తలు ఆయనకు పరమ వీర భక్తులు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో ప్రభుత్వాలు ఆయన ఆశ్రమాలకు అయాచితంగా భూ కేటాయింపులు చేశాయి. ఆశారాం ఆస్తులు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఏకంగా 10 వేల కోట్ల విలువైన ఆస్తుల్ని కూడబెట్టాడు. అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగడుగునా వివాదాలే చోటు చోసుకున్నాయి. భూకబ్జా ఆరోపణలు, ఆశ్రమంలో అనుమానాస్పద మృతులు వంటివి ఎప్పట్నంచో ఉన్నాయి. అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన ఆశ్రమం ఎన్ని అరాచకాలకు నెలవుగా మారిందో ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
సల్మాన్ బాధంతా ఆమె గురించే..
రాజస్తాన్: జోధ్‌పూర్ సెంట్రల్లో ఉన్న సమయంలో బాలీవుడ్ కండల నటుడు సల్మాన్ ఖాన్ ఎక్కువగా తన తల్లి గురించే బాధపడేవాడని రాజస్థాన్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నడుమ సల్మాన్ ఖాన్ తల్లి సుశీలా చరక్ అలియాన్ సల్మా ఆరోగ్యం బాగాలేదని, సల్మాన్ ఖాన్ జైలులో ఉన్నట్లు తెలిస్తే ఆమెకు ఇంకా బాధ ఎక్కువైపోతుందనే సల్మాన్ డీలా పడిపోయాడని స్థానిక జైళ్ల శాఖ డీఐజీ విక్రమ్ సింగ్ కర్ణావత్ తెలిపారు. సల్మాన్ ఖాన్ జైలుకు వచ్చిన సమయంలో కొంచెం ఆందోళనకు గురయ్యాడని, ఆ తర్వాత కుదురుకున్నాడని ఆయన తెలిపారు.సల్మాన్ ఖాన్‌ను కలిసేందుకు చాలా మంది సందర్శకులు వచ్చేవారని, కానీ సల్మాన్ వారందరినీ కలిసేందుకు అంత ఆసక్తి చూపించలేదని డీఐజీ తెలిపారు. ‘ జైలులో రోజూ ఉదయం అల్పాహారం చేసి జైలు గదిలో తిరిగేవాడు. సల్మాన్‌కు నాలుగు దుప్పట్లు ఇచ్చాం. కసరత్తుల కోసం ఎలాంటి పరికరాలు ఆయన అడగలేదు. కేవలం ఫ్లోర్‌ను మాత్రమే ఉపయోగించేవాడు’ అని విక్రం సింగ్ తెలిపారు. ‘ మొదటి రోజు సల్మాన్ తరపు న్యాయవాదులు వచ్చి ఆయనను కలిశారు. తర్వాత సినీ నటి ప్రీతి జింతా, ఆయన చెల్లెల్లు అల్విరా, అర్పితా ఖాన్లు ఆయనను సందర్శించారు. సల్మాన్‌కు బెయిల్ వచ్చిన తర్వాత మొదటగా ఆయన తన తల్లి సుశీలా చరక్‌కు ఫోన్ చేశారు’ అని విక్రం సింగ్ వివరించారు. ‘ సల్మాన్ ఖాన్‌కు బెయిల్ వచ్చిన విషయం చెప్పగానే ఆయన ముఖంలో ఎటువంటి ఆనందం కనిపించలేదు. వెంటనే స్నానం చేసి తన దుస్తులు ప్యాక్ చేసుకున్నారు’ అని డీఐజీ తెలిపారు. ‘ సల్మాన్ ఖాన్‌ను కలిసేందుకు పలువురు ఖైదీలు ఉత్సాహం చూపేందుకు ప్రయత్నించడంతో ఆయన సెక్యూరిటీ పాయింట్ వద్ద నుంచే చేతులు ఊపుతూ గ్రీట్ చేశారు. అలాగే జైలు నిబంధనలు ఉల్లంఘించవద్దని, డీఐజీని ఇబ్బందిపెట్టవద్దని ఖైదీలను సల్మాన్ సూచించారు’ అని డీఐజీ విక్రం చెప్పారు. సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు ఈ నెల 5 న ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెల్సిందే. రెండు రోజులు జైలులో గడిపిన అనంతరం ఈ నెల 7న కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. -
జైలులో సల్మాన్‌కు నిద్రలేని రాత్రి
జోధ్‌పూర్: జింకలను వేటాడిన కేసులో శిక్షననుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ కేంద్రీయ కారాగారంలో తొలిరోజు రాత్రి నిద్రలేకుండానే గడిపారని అధికారులు శుక్రవారం చెప్పారు. జైలులోని బ్యారక్ నంబర్ 2లో ఖైదీ నంబర్ 106గా ఉన్న సల్మాన్‌కు ప్రత్యేక సదుపాయాలేవీ కల్పించడం లేదనీ, అల్పాహారంగా మొలకెత్తిన విత్తనాలు, పాలు ఇచ్చామని జైళ్ల డీఐజీ విక్రం చెప్పారు. చెక్క మంచం, రగ్గు, కూలర్ సల్మాన్ గదిలో ఉంటాయన్నారు. సల్మాన్ బెయిలు దరఖాస్తుపై నిర్ణయాన్ని కోర్టు శనివారానికి వాయిదా వేసింది. నటి ప్రీతీ జింతా సల్మాన్‌ను పరామర్శించారు. 1998లో రెండు కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలుశిక్షను సెషన్స్ కోర్టు విధించడం తెలిసిందే. సల్మాన్ చెల్లెళ్లు అర్పిత, అల్విరలు ఆయనను శుక్రవారం కలుసుకున్నారు. జైలు యూనిఫాం ఇంకా సిద్ధం కానందున తన సాధారణ దుస్తులనే సల్మాన్ ధరించారు. రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపు పక్క గదిలోనే సల్మాన్‌ను ఉంచామనీ, గురువారం రాత్రి వారిద్దరూ పలకరించుకున్నారని సిబ్బంది చెప్పారు. గదిలో టాయిలెట్ గురించి సల్మాన్ అడిగాడనీ, గీజర్ ఉందేమోనని కనుక్కున్నాడని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. రెండో పోస్టుమార్టం పట్టించింది.. కృష్ణజింకల కళేబరాలకు రెండోసారి నిర్వహించిన పోస్టుమార్టం ద్వారానే సల్మాన్ దోషి అని నిరూపితమైంది. కళేబరాల ఎముకల్లో అంగుళం వ్యాసంతో రంధ్రాలు ఉన్నాయనీ, తుపాకీతో పేల్చడం వల్లనే ఇలా జరిగిందని పోస్టుమార్టం నివేదికలో తేలింది. -
కృష్ణ జింకల వేట కేసు : సల్మాన్ దోషి
జోధ్‌పూర్, రాజస్థాన్ : రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను జోధ్‌పూర్ న్యాయస్థానం దోషిగా పేర్కొంది. ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 1998లో వచ్చిన ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్ అడవుల్లో సల్మాన్ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. మూగజీవుల ప్రాణాలను బలిగొన్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించారు. జింకలను క్రూరంగా వేటాడిన సల్మాన్‌కు గరిష్టంగా శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదనలు వినిపించారు. కాగా, జోధ్‌పూర్ కోర్టు తీర్పును సల్మాన్ ఖాన్ హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. సల్మాన్ దోషిగా తేలడంతో ప్రస్తుతం షూటింగ్లో ఉన్న ఆయన సినిమాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. -
కృష్ణ జింకల వేట కేసులో నేడే తీర్పు
న్యూఢిల్లీ : కృష్ణ జింకల వేట కేసులో నిందితులుగా ఉన్న బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ తదితరులపై జోధ్‌పూర్ న్యాయస్థానం గురువారం తీర్పు చెప్పనుంది. కేసుకు సంబంధించి తుది వాదనలు గత నెల 28న పూర్తి అయ్యాయి. కేసును విచారిస్తున్న న్యాయమూర్తి తీర్పును గురువారం(ఏప్రిల్ 5)కు వాయిదా వేశారు. తీర్పు నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సహా నిందితులుగా ఉన్నబాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, టబు, సోనాలీ బింద్రే, నీలమ్‌లు ఇప్పటికే జోధ్‌పూర్ చేరుకున్నారు. -
‘లవ్ జిహాద్’ హంతకుడితో రథయాత్ర
జోధ్‌పూర్ : దేశమంతా శ్రీరామ నవమి రోజు రామున్ని పూజిస్తుంటే, కొంతమంది మాత్రం ఓ నేరస్థుడ్ని రామునిలా కొలుస్తూ వేడుకను జరుపుకున్నారు. గత ఏడాది రాజస్థాన్‌లో జరిగిన లవ్ జిహాద్ హత్య సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. అఫ్రజుల్ అనే వ్యక్తిని దారుణంగా హత మార్చిన శంభు లాల్ ప్రస్తుతం జోధ్‌పూర్ జైల్లో ఉన్నాడు. (మనిషిని చితక్కొట్టి.. సజీవ దహనం..!) అయితే ఓ వ్యక్తిని శంభు లాల్ వేషధారణతో రథంపై కూర్చోబెట్టి జోధ్‌పూర్‌లో శివసేన ర్యాలీ నిర్వహించింది. సదరు వ్యక్తి చేతిలో అఫ్రజుల్‌ని చంపడానికి వినియోగించిన గోడ్డలిని కూడా ఉంచడంతో పాటు, దారి పొడవునా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిపై ‘హిందు మిత్రులారా మేల్కొండి. మీ ఆడబిడ్డలను కాపాడుకోండి. దేశానికి లవ్ జిహాద్ నుంచి విముక్తి కల్పించండి’ అని రాసి ఉంది. శంభు లాల్‌కు మద్ధతు తెలిపేందుకే ఈ ర్యాలీ నిర్వహించినట్లు శివసేన నేత హరి సింగ్ పన్వార్ తెలిపారు. ‘హిందుత్వంపై అతని నిబద్ధత నాలో స్ఫూర్తిని రగిల్చింది. అయితే ఎవరి మనోభావాలను దెబ్బతీయటం ఈ యాత్ర ఉద్దేశం కాదు’ అని పన్వార్ తెలిపారు. ఇక ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తటంతో జోధ్‌పూర్ డీసీపీ స్పందించారు. ఈ విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నామని.. ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. -
దేశంలో ప్రమాదకరంగా కులతత్వం..
సాక్షి, జోధ్‌పూర్ : దేశంలో కులతత్వం రోజురోజుకూ పెరిగిపోతోందని ఆరెస్సెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాగే కొనసాగితే దేశానికే ప్రమాదం అని, జాతీయత భావం దెబ్బతింటుందని పేర్కొంది. వెంటనే సామాజిక సామరస్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. కుటుంబ విలువలు-జాతీయ సామరస్యం వంటి అంశాలపై ఆరెస్సెస్ రెండు రోజులపాటు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అరుణ్ చతుర్వేది, గులాబ్ చంద్ కఠారియా, వాసుదేవ్ దేవ్నానాయ్, బీజేపీ నేతలు సతిష్ పునియా, అశోక్ పార్నమి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కులవాదం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 'దేశానికి క్యాస్టిజం పెద్ద ప్రమాదంగా మారింది. గుజరాత్ ఎన్నికల్లో ఆ విషయం స్పష్టమైంది. పెరుగుతున్న ఆందోళనల దృష్ట్యా దీనిని ఆరెస్సెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. సమాజంలో సామరస్యం పెంపొందించేందుకు కృషిచేయాలని నిర్ణయించుకున్నాం' అని తెలిపారు. -
రాజస్థాన్‌లో ‘తలాక్’
సాక్షి, జోధ్‌పూర్ : ట్రిపుల్ తలాక్‌పై సుప్రీం కోర్టు తాత్కాలిక నిషేధం విధించిన తరువాత.. కూడా ఒక ముస్లిం మహిళకు తలాక్ చెప్పి.. మరో పెళ్లి చేసుకున్న ఘటన జోధ్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నివాసముంటున్న అఫ్సానాకు భర్త మున్నా.. సెప్టెంబర్ 18న ఫోన్లో ముమ్మారు తలాక్ చెప్పి పెట్టేశాడు. తలాక్ చెప్పి రెండు రోజుల గడవకముందే మున్నా మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని బాధితురాలు అఫ్సానా చెబుతున్నారు. మున్నాతో.. తనకు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగిందని.. అప్పటినుంచీ అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు హింసించేవారని అఫ్సానా చెప్పారు. కట్నం తేలేదని.. 2015లో ఒకసారి ఒంటిమీద కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారని ఆమె తెలిపారు. ట్రిపుల్ తలాక్‌పై తాత్కాలిక నిషేధం ఉందని.. ఇప్పుడు ఇది చెల్లదు కాబట్టి.. భర్త కుటుంబం మీద కేసు పెడతానని ఆమె చెప్పారు. ఇద్దరు పిల్లల పోషణకు భరణం కోసం కోర్టును ఆశ్రయిస్తానని అఫ్సానా తెలిపారు. -
చెరువులోకి దూకాలి.. లేదంటే అమ్మ మరణిస్తుంది
► ‘బ్లూవేల్ గేమ్’లో భాగంగా చెరువులో దూకిన యువతి ► రక్షించిన స్థానికులు, పోలీసులు జోధ్‌పూర్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో సోమవారం అర్ధరాత్రి 17 ఏళ్ల అమ్మాయి చెరువులోకి దూకేసింది. స్థానికులు గమనించి రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఎందుకు దూకావని ప్రశ్నిస్తే బిత్తరపోయే సమాధానమిచ్చింది. చేతిపై పొడుచుకున్న బ్లూవేల్ బొమ్మను చూపిస్తూ.. ‘నేను ఈ చివరి టాస్క్ పూర్తి చేయకపోతే మా అమ్మ చచ్చిపోతుంది’ అని ఏడుస్తూ చెప్పింది. ప్రమాదకర ‘బ్లూవేల్ గేమ్’ ఆడుతూ ఆత్మహత్యకు యత్నించిన యువతి కథ ఇది. ఏడుస్తూ.. నదిలోకి దూకేసింది.. బీఎస్ఎఫ్ జవాను కూతురైన ఈ అమ్మాయి మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పి సోమవారం రాత్రి బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు. ఇదే సమయంలో చెరువు వద్ద యువతి అనుమానాస్పదంగా తిరగడాన్ని స్థానికులు గుర్తించారు. ‘స్కూటర్‌పై ఓ అమ్మాయి ఏడుస్తూ వచ్చింది. చెరువులోకి దూకేందుకు వెళ్తుండటంతో ఆపేందుకు ప్రయత్నించాను. ఏం జరిగిందని అడిగితే.. ‘మా అమ్మ చనిపోతుందని చెప్పింది. ఎందుకు చనిపోతుందని అడిగాను. నేను ఆడుతున్న బ్లూవేల్ గేమ్ చివరికి వచ్చింది. గేమ్ పూర్తి చేయకపోతే మా అమ్మ చనిపోతుంది. అని ఏడుస్తూ చెప్పింది’ అని ఓం ప్రకాశ్ అనే స్థానికుడు చెప్పాడు. మాట్లాడుతుండగానే చెరువులోకి దూకిందని, వెంటనే యువతిని కాపాడినట్లు చెప్పాడు. యువతి చెరువులోకి దూకినట్లు తమకు సమాచారం వచ్చిందని, అప్పటికే యువతిని స్థానికులు రక్షించారని పోలీసు అధికారి తెలిపారు. అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. -
జోధ్‌పూర్‌లో మరో 'బ్లూవేల్' దారుణం
చెరువులోకి దూకేసిన 17 ఏళ్ల అమ్మాయి.. అదృష్టవశాత్తు పోలీసులకు సమాచారం.. సాక్షి, జోధ్‌పూర్: దేశంలో ’బ్లూవేల్’ దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో ఓ 17 ఏళ్ల అమ్మాయి చేతిపై ’బ్లూవేల్’ ఆకృతిని కత్తితో గీసుకొని.. చెరువులోకి దూకేసింది. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ఆ అమ్మాయి చెరువులో దూకినప్పటికీ.. అదృష్టశాత్తు అక్కడ ఉన్న స్థానికులు గుర్తించడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. గజ ఈతగాళ్లు చెరువు నుంచి ఆమెను కాపాడారు. పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. బాధిత అమ్మాయి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాను కూతురు. సోమవారం సాయంత్రం మార్కెట్‌కు వెళుతున్నానంటూ స్కూటర్ మీద బయటకు వచ్చిన ఆమె తిరిగి ఇంటికి వెళ్లలేదు. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే.. రోడ్డుపై దొరికిందంటూ ఎవరో ఓ వ్యక్తి ఫోన్ ఎత్తి మాట్లాడారు. దీంతో అమ్మాయి గురించి ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమెను వెతకడం ప్రారంభించారు. సాయంత్రం సమయంలో చెరువు సమీపంలో ఆమె స్కూటర్ మీద చక్కర్లు కొట్టినట్టు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో సమీపంలో ఉన్న కొండమీద నుంచి ఆమె చెరువులోకి దూకేసింది. అక్కడే ఉన్న కొంతమంది గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. గజ ఈతగాళ్లతో వచ్చిన పోలీసులు అమ్మాయి ప్రాణాలు కాపాడారు. అమ్మాయి చేతిమీద బ్లూవేల్ ఆకృతి కత్తితో గీసి ఉందని, తన చివరి ట్కాస్ పూర్తి చేసేందుకు చెరువులోకి దూకానని ఆమె చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ప్రమాదకరమైన ఆన్లైన్ గేమ్ ’బ్లూవేల్ చాలెంజ్’ బారినపడి టీనేజ్ బాలబాలికలు ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆన్లైన్ గేమ్‌పై అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచిస్తున్నారు. -
దారుణం: ఆపరేషన్ థియేటర్లో వైద్యుల నిర్వాకం
సాక్షి, రాజస్థాన్: మనిషి ప్రాణాలు కాపాడే వైద్యుడిని దేవుడితో పోలుస్తారు. కానీ అలాంటి వైద్యులే తమ విద్యుక్త ధర్మాన్ని మరిచిపోయి.. ఏకంగా ఆపరేషన్ థియేటర్లోనే గొడవపడితే.. ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణీని ఆపరేషన్ బెడ్ మీద పడుకోబెట్టి.. తమలో తాము కుస్తీపట్లకు దిగితే.. ఈ దారుణమే రాజస్థాన్ జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఓ నిండూ గర్భిణీ కడుపునొప్పితో జోధ్‌పూర్ ఉమైద్ ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు శస్త్రచికిత్స నిర్వహిస్తున్న సమయంలో డెలివరీని ఆపి ఇద్దరు వైద్యులు ఏకంగా ఆపరేషన్ థియేటర్లోనే గొడవపడ్డారు. ఒకరినొకరు ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు. ఇలా వైద్యులు నిర్లక్ష్యం వహించడంతో బాధిత మహిళ ప్రసవించిన పసికందు మృతిచెందింది. దీంతో ఆస్పత్రి తీరుపై, వైద్యుల నిర్లక్ష్యంపై బాధిత మహిళ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం (29వ తేదీ) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన నేపథ్యంలో గొడవకు దిగిన ఇద్దరు వైద్యులను విధుల నుంచి తొలగించినట్టు ఉమైద్ ఆస్పత్రి సూపరింటిండెంట్ ఆల్ భట్ తెలిపారు. ఇద్దరు వైద్యులపై త్వరలోనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. కడుపులోనొప్పితో, లో హార్ట్‌బీట్‌తో మహిళ ఆస్పత్రిలో చేరిందని, అయినా నవజాత శిశువు మృతిపై దర్యాప్తు జరుపుతామన్నారు. -
ఆపరేషన్ థియేటర్లో వైద్యుల నిర్వాకం
-
విస్మయపరుస్తున్న సీసీటీవీ దృశ్యాలు
జోధ్‌పూర్: రాజస్థాన్‌లో సోమవారం జరిగిన ఓ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వీక్షకులను విస్మయపరుస్తున్నాయి. జోధ్‌పూర్‌లోని ఓ ఎలక్ట్రానిక్ షోరూంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. హెల్మెట్ ధరించి వచ్చిన ఆ వ్యక్తిని షాపులోని వారు ముందుగా కస్టమర్‌గా భావించి వివరాలు అడుగుతుండగానే.. అతడు గన్ తీశాడు. దీంతో భయంతో అంతా తలోదిక్కున నక్కగా.. కౌంటర్ వద్ద ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్న దుండగుడు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి ఉడాయించాడు. -
హోంగార్డ్,జర్నలిస్ట్ బాహాబాహీ
-
పాముతో ఆటలు ప్రాణం తీసింది
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ పాములోడు చేసిన పనికి పాపం ఓ పర్యాటకుడు అన్యాయంగా మరణించారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జోధ్‌పూర్‌లో ఓ పాములోడు పాములతో విన్యాసాలు ప్రారంభించారు. దాన్ని చూట్టం కోసం జోధ్‌పూర్‌కు వచ్చిన పర్యాటకులు ఆయన చుట్టూ మూగారు. కొందరేమో సెల్ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు. వారిలో పాములాటను ఆసక్తిగా చూస్తున్న ఓ యువకుడి మెడలో ఆ పాములోడు ఓ నాగు పామును దండలా వేయబోయాడు. చిర్రెత్తుకొచ్చిన పాము పర్యాటకుడిని ఎవరూ గుర్తించలేనంత వేగంగా కరచింది. కాసేపటికి అనుమానం వచ్చిన పర్యాటకుడు తనను పాము కరచిందేమో అంటూ ఆపాములోడికి తన కణతను చూపించాడు. దాన్ని పాములోడు అసలు పట్టించుకోలేదు. కాసేపటికి స్మహతప్పిపోతున్న పర్యాటకుడిని స్థానికులు ఆస్పత్రికి కాకుండా సమీపంలో ఉన్న ఓ మందుల షాపుకు తీసుకెళ్లారు. గంటలోపే ఆ పర్యాటకుడు చనిపోయాడు. పాములోడి వద్దనున్న నాగుపాము ఏ రకమైనదో ఎవరికి తెలియదు. భారత దేశంలో ఐదు రకాల నాగుపాములు అత్యంత విషపూరితమైనవి. అవి కరిస్తే మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. వాటిలో ఇండియన్ కోబ్రా ఒకటి. -
ఇండో-పాక్ పెళ్లికి సుష్మాజీ గిప్ట్ ఏంటో తెలుసా?
జోథ్‌పూర్ : సవాలక్ష అడ్డంకుల అనంతరం పాకిస్తాన్ అమ్మాయి.. ఇండియా అబ్బాయి పెళ్లి నేడు జరుగుతోంది. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సహకారంతో జోథ్‌పూర్(రాజస్తాన్)కు చెందిన నరేశ్ తేవానీ, కరాచీకి చెందిన ప్రియా బచ్చానీలు ఒకటి కాబోతున్నారు. రెండేళ్ల కిందట మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా కుదిరిన వీరి పెళ్లికి ఇటీవల భారత్-పాకిస్తాన్ల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు అడ్డుగా నిలిచాయి. పెళ్లి బృందానికి వీసా నిరాకరించారు. దిక్కుతోచని పరిస్థితిలో పెళ్లికొడుకు దేశప్రధానికి, విదేశీ వ్యవహారాల మంత్రికి తమ గోడు విన్నవించుకున్నాడు. వారి పెళ్లికి వీసా మంజూరు చేపించే బాధ్యత తానదేనంటూ సుష్మాస్వరాజ్ హామీఇచ్చారు. సుష్మా జోక్యంతో భారత రాయబారి కార్యాలయం పెళ్లికూతురికి, తన కుటుంబానికి వీసా మంజూరు చేసింది. దీంతో పెళ్లి కూతురు కుటుంబసభ్యులు 35 మంది ఆదివారం జోథ్‌పూర్ చేరుకున్నారు. నిర్ణయించిన ప్రకారం నేడు వారి పెళ్లి జోథ్‌పూర్‌లో జరుగుతోంది. తమ అభ్యర్థనకు వెంటనే స్పందించి, పెళ్లికూతురికి వారి కుటుంబానికి వెంటనే వీసా మంజూరు చేసినందుకు నరేశ్, సుష్మాస్వరాజ్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. "నేను చాలా సంతోషంగా ఉన్నా. అన్నీ అనుకున్నమాదిరిగానే జరిగాయి. వేడుకలను చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం" అని ప్రియా చెప్పింది. పెళ్లి నిశ్చయం అయ్యాక, అమ్మాయి తరుఫు వాళ్లు వీసాకు దరఖాస్తు చేసుకున్నారని, పెళ్లి ఏర్పాట్లన్నీ షెడ్యూల్ ప్రకారం జరుగుతూ వస్తున్నాయని కానీ అంతలోనే వారికి వీసా మంజూరులో ఆటంకం ఏర్పడిందని అబ్బాయి తండ్రి కన్హెయా లాల్ తేవానీ చెప్పారు. ఇలాంటి సమస్యలకు సుష్మాజీ దయాగుణం తెలిసి, వెంటనే ఆమెకు అభ్యర్థన పెట్టుకున్నామని తెలిపాడు. తమ అభ్యర్థనకు కూడా వెంటనే స్పందించిన సుష్మా , వెంటనే వీసా మంజూరు చేపించారని వివరించాడు. -
డబ్బు కోసం అడ్డదారి తొక్కిన లవర్స్
జోధ్ పూర్: టీవీ క్రైమ్ సీరియల్ ప్రేరణగా తీసుకుని కిడ్నాప్ కు పాల్పడిన ముగ్గురు అడ్డంగా దొరికిపోయారు. ఓ యువతి తన ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి వరసకు సోదరుడయ్యే నాలుగేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి చివరకు ఊచలు లెక్కిస్తోంది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విలాసవంతమైన జీవితం గడిపేందుకు డబ్బు సంపాదించాలన్న దుర్బుద్ధితో పూర్ణిషా(22) అనే యువతి తన ప్రియుడు మయాంక్ మెహతా, అతడి స్నేహితుడు మయాంక్ సింధాల్ సహాయంతో యుగ్ భండారి(4)ని కిడ్నాప్ చేసింది. మోటార్ సైకిల్ పై తిప్పుతానని మానసరోవర్ కాలనీలోని ఇంటి నుంచి భండారిని పూర్ణిషా బయటకు తీసుకెళ్లింది. తర్వాత బాలుడిని తన ప్రియుడికి అప్పగించింది. రూ. 50 లక్షలు ఇస్తేనే భండారిని వదులుతామని అతడి తండ్రి రితేశ్ కు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. నాలుగు గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించి మహామందిర్ ప్రాంతం నుంచి బాలుడిని సురక్షితంగా విడిపించారు. ఫోన్ కాల్ రికార్డ్స్, రితేశ్ కుటుంబ సభ్యులను పశ్నించి కేసును ఛేదించినట్టు జోధ్ పూర్ డీసీసీ(వెస్ట్) సమీర్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ సీరియల్ ప్రేరణతో కిడ్నాప్ చేశామని నిందితులు చెప్పినట్టు వెల్లడించారు. వీరికి సహకరించిన భరత్ అనే మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. -
ఎయిమ్స్‌లో స్టాఫ్ 550 నర్స్ పోస్టులు
జోధ్‌పూర్ (రాజస్థాన్)లోని ఆలిండియాఇన్స్టిట్యూట్ ఆఫ్మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్).. గ్రేడ్-2 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీచేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఖాళీలు: 550 (ఓసీ-279, ఓబీసీ-148, ఎస్సీ-82, ఎస్టీ-41)వేతనం: రూ.9,300-34,800+గ్రేడ్‌పే రూ.4,600+కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఇతర అలవెన్సులు. విద్యార్హత: పదో తరగతి/తత్సమానం, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎం) సర్టిఫికెట్. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో ‘ఏ’ గ్రేడ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్‌గా రిజిస్ట్రేషన్.అనుభవం: కంప్యూటర్ పరిజ్ఞానం (ఆఫీస్ అప్లికేషన్లు, స్ప్రెడ్షీట్లు, ప్రజెంటేషన్లకు సంబంధించిన అనుభవం) ఉండాలి. వయసు: 18-30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అవసరమైతే ఆన్లైన్/ఆఫ్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.దరఖాస్తు విధానం: ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసుం: ఓసీలు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు. చివరి తేది: అక్టోబర్ 23 సాయంత్రం 5 గంటల వరకు. వెబ్సైట్: http://www.aiimsjodhpur.edu.in/ గమనిక: గత నోటిఫికేషన్ (Advt No: Admn/Estt/09/01/2015-AIIMS.JDH )మేరకు దరఖాస్తు చేసినవారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అర్హతల కటాఫ్ డేట్ (2015 అక్టోబర్ 16)లో ఎలాంటి మార్పులేదు. -
రాజస్థాన్‌లో పోలీసుల ఎంజాయ్మెంట్
-
ఆ నగరమంతా ‘బ్లూ’
జోధ్‌పూర్: ఓ గుర్రపు బంగీని తోలుకుంటూ ఓ కుర్రాడు వేగంగా దూసుకుపోవడం, ఓ మహిళ బెంచీ మీద కూర్చొని తాపీగా తేనీరు సేవిస్తుండడం, ఇంటి ప్రాంగణంలో ఓ బాలుడు బడలికతో పడుకొని ఉండడం, ఓ వీధి వాకిట గోడకు చేరగిలబడి కొంత మంది పెద్దవాళ్లు పిచ్చాపాటు మాట్లాడుకోవడం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో మనకు నిత్యం కనిపించే దశ్యాలు. ఈ దశ్యాల అన్నింటివెనకాల బ్యాక్‌గ్రౌండ్ మాత్రం ఒక్కటే కావడం విశేషం. అదే నీలి రంగు. నగరంలో ఎక్కడ చూసిన ఇళ్లకు, లోగిళ్లకు నీలి రంగే వేసి ఉంటుంది. జైపూర్‌ను పింక్ సిటీ అని పిలిచినట్లుగా జోధ్‌పూర్ ను బ్లూ సిటీ అని పిలవాల్సిందే. 15వ శతాబ్దంలో మహారాజా మాన్సింగ్ నగరంలో నిర్మించిన మెహ్రాన్‌గఢ్ కోట లోపల అద్దాలు కూడా నీలి రంగువే ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఎక్కువ మంది తమ ఇళ్లకు నీలి రంగు వేస్తారు అన్న ప్రశ్నకు ఇక్కడు రెండు ప్రధాన కారణాలు చెబుతారు. నగరంలో నివసించే హిందూ అగ్రవర్ణాల్లో మెజారిటీలైన బ్రాహ్మణులు తమ ఇళ్లకు నీలి రంగు వేసుకునే ఆచారాన్ని మొదట ప్రారంభించారట. దొంగతనాల నుంచి తమ ఇళ్లను రక్షించుకోవడం కోసం బ్రాహ్మణలు ఈ చిట్కాను ఉపయోగించారట. ఎక్కువ మంది విద్యావేత్తలు, పూజారులు ఉండే బ్రాహ్మణులను గౌరవించాలని, వారి ఇళ్లను దోచుకుంటే పాపం చుట్టుకుంటుందన్న నమ్మకం అప్పట్లో ప్రజల్లో ఉండేదట. అందుకని దొంగలకు తమ ఇళ్లని తెలియడం కోసం బ్రాహ్మణులు ఇళ్లకు నీలి రంగు వాడేవారట. ఒకప్పుడు బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన ఈ రంగు రానురాను నగరమంతటా విస్తరిస్తూ పోయింది. ఇతర కమ్యూనిటీ ప్రజలు కూడా ఈ రంగును ఎక్కువ ఉపయోగించడం మొదలు పెట్టారు. గోడలకు, తలుపులకు నీలి రంగు వేయడం వల్ల పురుగు, పుట్ర రాదని, చెదలు పట్టవన్న విశ్వాసంతో వారు ఈ రంగు ఉపయోగిస్తున్నారట. నీలి రంగులో ఉండే కాపర్ సల్ఫేట్ వల్ల చెదలు రావని కొందరు చెబుతున్నారు. నీలి రంగు వల్ల సూర్య కిరణాలు పరావర్తనం చెందుతాయని, ఫలితంగా నీలి రంగు వేసుకుంటే ఇల్లు చల్లగా ఉంటుందని చదువుకున్న వారు చెబుతున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
జోధ్‌పూర్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ లో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా సుమారు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అంతిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
ప్రపంచంలో బెస్ట్ హోటల్ మనదే తెలుసా!
జైపూర్: భారత గత చరిత్ర వైభవానికి, రాజరిక విలాసానికి చిహ్నంగా నిలిచే.. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ 2016 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్‌గా నిలిచింది. ట్రిప్ అడ్వయిజర్ వెబ్సైట్ ఈ మేరకు 'ట్రావెలర్స్ చాయిస్ అవార్డు'ను ప్యాలెస్‌కు ప్రకటించింది. అలనాటి రాజరిక వైభవాన్ని కళ్లకు కట్టే అనుభవాన్ని, అనుభూతిని ఈ ప్యాలెస్ తమకు అందించిందని పర్యాటకులు పేర్కొన్నారు. అంతేకాకుండా 840 మంది అతిథులు దీనికి ఐదుకు ఐదు రేటింగ్ ఇచ్చి అగ్రస్థానంలో నిలబెట్టారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెల్ వెబ్సైట్ అయిన ట్రిప్ అడ్వయిజర్ తన 14వ ఎడిషన్ ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్ ను ఈ ప్యాలెస్‌కు ప్రకటించింది. 1928-43 మధ్యకాలంలో 15 ఏళ్లపాటు శ్రమించి ఈ అద్భుతమైన రాజరిక భవనాన్ని నిర్మించారు. జోధ్‌పూర్ వంశానికి చెందిన మహారాజ ఉమైద్ సింగ్ పేరిట దీనికి ఉమైద్ భవన్ ప్యాలెస్ అని నామకరణం చేశారు. ఇది మొదట్లో జోధ్‌పూర్ రాజవంశానికి ప్రధాన నివాసంగా కొనసాగింది. ప్రాక్పశ్చిమ సంస్కృతులు, శిల్పకళారీతుల సమ్మేళనంగా ఐరోపా సాంస్కృతిక పునర్జీవనం, ఆర్ట్ డెకో ప్రభావంతో రూపొందిన ఈ ప్యాలెస్ రాజ్‌పుత్ చారిత్రక వారసత్వానికి నిలువటద్దంగా నిలిచిపోయింది. 347 గదులున్న ఈ ప్యాలెస్‌లో విహరించడం అద్భుతమైన అనుభూతి అంటూ ఎంతోమంది పర్యాటకులు తమ సమీక్షల్లో వివరించారు. ' ప్రత్యక్ష స్వప్నంలో విహరిస్తున్నట్టు తోచింది. అత్యద్భుతమైన అనుభవాన్ని ఈ రాజరిక కట్టడం మాకు అందించింది' అంటూ ఓ పర్యాటకుడు తన రివ్యూలో పేర్కొన్నారు. ట్రిప్అడ్వైజర్ సభ్యుల ప్రకారం 2016లో టాప్ 10 హోటల్స్ ఇలా ఉన్నాయి 1. ఉమైద్ భవన్ ప్యాలస్ - జోథ్‌పూర్, భారతదేశం 2. షింతామణి రిసార్ట్ - సీమ్ రీప్, కంబోడియా 3. బెల్వ్యూ సిరెన్ - సారెంటో, ఇటలీ 4. హనొయ్ లా సీస్టా హోటల్ అండ్ స్పా- హనొయ్, వియత్నాం 5. యాక్టిస్ హోటల్ - అఫిటోస్, గ్రీస్ 6. బెల్మాండ్ లే మానాయిర్ ఆక్స్ క్వెట్సైసన్ - గ్రేట్ మిల్టన్, యునైటెడ్ కింగ్డమ్ 7. మిరిహి ఐలాండ్ రిసార్ట్- మిరిహి, మాల్దీవులు 8. బుకుటి అండ్ తారా బీచ్ రిసార్ట్స్ అరుబా - పామ్ ఈగిల్ బీచ్ , అరుబా 9. కాలాబాష్ లగ్జరీ బోటిక్యూ హోటల్ అండ్ స్పా- లాన్స్ ఆక్స్ ఎప్పిన్స్, గ్రెనడా 10. హోటల్ రిట్టా హఫ్నర్ - గ్రమడో, బ్రెజిల్