ట్రాక్టర్‌ కిందికి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు దుర్మరణం | Road Accident Six deceased In A Collision Between A truck And Car in Jodhpur | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ కిందికి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు దుర్మరణం

Published Mon, Jul 5 2021 1:42 PM | Last Updated on Mon, Jul 5 2021 1:45 PM

Road Accident Six deceased In A Collision Between A truck And Car in Jodhpur - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్‌పూర్‌లో తెల్లవారుజామున డంగియావస్‌ సమీపంలో  ఓ కారు.. ట్రాక్టర్‌ కిందికి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు .ఈ ప్రమాదంలో మృతులందరూ  అజ్మీర్ జిల్లా కు  చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై డిసిపి భువన్ భూషణ్ యాదవ్ మాట్లాడుతూ మృతదేహాలను ఎండిఎం ఆసుపత్రిలో ఉంచినట్లు తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement