
బికనీర్: రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓవర్ బ్రిడ్జిపై వెళుతున్న కారుపై డంపర్ బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్నవారంతా పెళ్లికి వెళ్లి వస్తుండగా, ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన బుధవారం అర్థరాత్రి దాటాక దేశ్‌నోక్ ఓవర్‌బ్రిడ్జిపై చోటుచేసుకుంది. అత్యంత వేగంగా వెళుతున్న ఒక డంపర్ ఉన్నట్టుండి నియంత్రణ(Control) కోల్పోయి, పక్కనే ఉన్న కారుపై బోల్తా పడింది. భారీగా ఉన్న డంపర్ పడటంతో కారు నుజ్జునుజ్జయిపోయింది. ఈ సమయంలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం దరిమిలా ఓవర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఓవర్ బ్రిడ్జిపై కారు, డంపర్ ఒక దిశలో వెళుతున్నాయి. డంపర్ ఒక్కసారిగా కారుపై తిరగబడగానే కారులో ఉన్నవారికి తప్పించుకునే మార్గం లేకపోయింది. ప్రమాద ఘటన గురించి తెలియగానే దేశ్‌నాక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో జేసీబీని వినియోగించి డంపర్‌ను రోడ్డుకు ఒక పక్కగా తీసుకువచ్చారు. మృతులలో ఒక మహిళతో పాటు ఆరుగురు పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: బంగ్లాలో హిందువుల దాడులపై అమెరికా నిఘా
Comments
Please login to add a commentAdd a comment