జైపూర్ : రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొలెరో వాహనాన్ని ట్రక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే 11 మంది దుర్మరణం చెందారు. అలాగే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు మహిళలు, నాలుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బలోత్రా ఫలోడి రహదారిపై శనివారం ఈ ప్రమాదం సంభవించింది. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో దెబ్బతిన్న వాహనాలను పక్కకు తీసి.. శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. (కార్తీక్ హత్య కేసు విచారణ వేగవంతం)
వేగంగా దూసుకొచ్చిన ట్రక్.. జీపును బలంగా ఢీకొట్టడంతో జీపు మీదకు వాహనం చొచ్చుకెళ్లింది. అతి వేగమే ప్రమాదానికి కారణమయ్యి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. ‘జోధ్‌పూర్‌లో జరిగిన ప్రమాదం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. తమ వాళ్లను కోల్పోయిన వారికి నా ప్రగాడ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’. అంటూ ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. (‘అమ్మా.. అలసటగా ఉందమ్మా.. నిద్రపోతాను’)
Comments
Please login to add a commentAdd a comment