జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ట్రక్కు ఢీ కొట్టడంతో పలువురు మృతి చెందారు. జైసల్మేర్ రామ్‌దేవ్ర ఆలయానికి వెళ్తున్న క్రమంలో.. వేగంగా వస్తున్న ట్రక్కు.. ట్రాక్టర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
శుక్రవారం రాత్రి పాలి జిల్లా సుమేర్‌పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 25 మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, కొన్ని ఆంబులెన్స్‌లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఘటనపై ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌కర్, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్లు చేశారు.
The accident in Pali, Rajasthan is saddening. In this hour of grief, my thoughts are with the bereaved families. I pray for a speedy recovery of those injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2022
Anguished by the loss of lives in a road accident in Pali, Rajasthan. My heartfelt condolences to the bereaved families and prayers for the speedy recovery of the injured.
— Vice President of India (@VPSecretariat) August 19, 2022
ఇదీ చదవండి: చిల్లర మాయం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం
Comments
Please login to add a commentAdd a comment