
జోధ్‌పూర్: మొబైల్ డేటాను మొత్తం వాడేశాడని సొంత తమ్ముడిని అన్నయ్య చంపిన ఘటన రాజస్థాన్ జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం నిందితుడు రామన్(23) తన తమ్ముడు రాయ్‌ను ఇంటిపైకి తీసుకెళ్లాడు. ఇంటర్నెట్ డేటాను పూర్తిగా వాడడంతో తమ్ముణ్ణి తిట్టాడు. కోపంతో నిందితుడు రాయ్ ఛాతీ మీద పొడిచి పారిపోయాడు. రక్తపుమడుగులో ఉన్న రాయ్‌ను కుటుంబ సభ్యులు బుధవారం అర్థరాత్రి ఆసుపత్రికి తరలించగా అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. పారిపోయిన నిందితుడు రామన్‌ను శుక్రవారం రైల్వే స్టేషన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మానసికంగా అస్థిరంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. (చదవండి:ప్రియురాలి ప్రవేశం.. మొదటిరాత్రి భగ్నం!)
Comments
Please login to add a commentAdd a comment