జోధ్‌పూర్: రాజస్థాన్ లో హోరమైన సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జోధ్‌పూర్ సిటీకి సమీపంలోని చౌరాయి గ్రామంలో కొంతమంది ఆగంతకులు ఒక కుటుంబంలోని నలుగురిని అత్యంత కిరాతకంగా చంపి దహనం చేశారు. అసలే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ వర్గాలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఇంటిలోంచి పొగలు వస్తుండటంతో అనుమానమొచ్చింది స్థానికులు పోలీసులకి సమాచారమందించి ఆ ఇంటిలోకి వెళ్లి చూస్తే అప్పటికీ ఆ కుటుంబంలో అందరూ కాలిపోయి విగతజీవులుగా మారినట్టు తెలిపారు. మృతుల్లో పునారామ్(55), భావ్రీ దేవి(50), దాపు(మేనకోడలు) ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇంటి ప్రాంగణంలోకి వెళ్లి చూస్తే మరో హృదయవిదారక దృశ్యం.. వారి కుమార్తె ఆరు నెలల పసికందు బూడిద కుప్పగా మిగిలి ఉంది. వీరందరినీ మొదట గొంతు కోసి తర్వాత తగలబెట్టారని చెబుతున్నారు పోలీసులు.
ఈ హత్యలకు కారణం ఏమై ఉంటుందనేది ఇంకా తెలియరాలేదని పునారామ్ వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని వెళ్లదీసే వాడని తెలిపారు. బహుశా వ్యక్తిగత కక్షలే ఈ హత్యలకు కారణమై ఉంటాయని చెబుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
దొరికిందే అవకాశం ప్రతిపక్షమైన బీజేపీ పార్టీ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర పరిష్టితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఘాటు విమర్శలు చేశారు.
కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘావల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 17 రేప్ లు 7 మర్డర్లు జరిగాయని అన్నారు. రాజస్థాన్ లో శాంతి భద్రతలు ఎప్పుడో మంట కలిసిపోయాయని.. ముఖ్యమంత్రి చూస్తే ఎమ్మెల్యేలే నా ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని పొగుడుకుంటూ ఉంటారన్నారు. ఈరోజు ఆ ఎమ్మెల్యేలకు అహంకారం నెత్తికెక్కి వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: పెళ్ళిలో ఏనుగులు హల్ చల్.. బైక్ మీద పారిపోయిన కొత్త జంట..
Comments
Please login to add a commentAdd a comment