family killed
-
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కుటుంబం మృతి, భోరున విలపించిన జర్నలిస్టు
గాజాపై ఇజ్రాయెల్(Israeil) జరిపిన వైమానిక దాడిలో గాజాలోని జర్నలిస్టు కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. బుధవారం రాత్రి అల్ జజీరా జర్నలిస్ట్,అరబిక్ బ్యూరో చీఫ్ వేల్ అల్ దహదౌహ్ కుటుంబ సభ్యులు మరణించారు. సెంట్రల్ గాజాలోని ఇజ్రాయెల్ సురక్షిత ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తున్న నుసెరాత్ క్యాంప్ అతని ఇంటిని లక్ష్యంగా జరిగిన దాడిలో భార్య, కుమార్తె , కొడుకును కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దహదౌహ్ భార్య కుమారుడు, కుమార్తె గాజాలో నివసిస్తున్నారు. సురక్షితమైన ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని వైమానిక దాడులకు దిగబోతున్నాయనే విషయాన్ని భార్య తెలుసుకున్నారు. అక్కడి నుంచి తన కుమారుడు, కుమార్తెతో కలిసి పారిపోతుండగా వారిపైదాడి జరిగింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దహదౌహ్ భార్య, కుమారుడు, కుమార్తె మరణించారని అల్ జజీరా రిపోర్ట్ చేసింది. వారంతా శిథిలాల కింద సమాధి అయ్యారని వెల్లడించింది. ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న కుటుంబ సభ్యులను చూసిన దహదౌహ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు కలిచి వేస్తున్నాయి. “ఏమి జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది. పిల్లలు, మహిళలు , పౌరులే టార్గెట్‌గా చేస్తున్న వరుస దాడులివి. ఇజ్రాయెల్ దాడులు నుసైరాత్‌తో సహా అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేస్తున్న దాడుల గురించి యార్మూక్ నుండి రిపోర్టు చేస్తున్నాను..అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న వారికి శిక్షించకుండా వదిలి పెట్టరనే అనుమానాలను కూడా ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు గాజాలో అమాయక పౌరులను విచక్షణారహితంగా లక్ష్యంగా చేసుకుని చంపడాన్ని అల్ జజీరా తీవ్రంగా ఖండించింది.మరికొంతమంది జర్నలిస్టుల కుటుంబ సభ్యుల ఆచూకీ కూడా గల్లంతు అయినట్టు సమాచార.ం తీవ్ర విషాదానికి ముందు మమ్మల్ని కాపాడండి అంటూ వేల్ దహదౌ కుమారుడు మహమూద్, తల్లి, సోదరితో కలిసి మొరపెట్టుకున్న కొద్దిరోజులకే వారంతా చనిపోయారు.గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడి గురించి సోదరి ఖోలౌద్‌తో కలిసి ప్రపంచానికి ఒక వీడియో సందేశం పంపాడు. కాగా అక్టోబరు 7న హమాస్ ఆకస్మిక దాడిలో దాదాపు 1,400 మందిని చనిపోయారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ దాడులకారణంగా గాజాలో 6,500 మందికి పైగా మరణించినట్టు అంచనా. నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్ బాంబు దాడుల కారణంగా దాదాపు 6,00,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇది ఇలా ఉంటే పాలస్తీనా జర్నలిస్టుల యూనియన్ ప్రకారం గాజా బాధితుల్లో 22 మందికి పైగా జర్నలిస్టులు ఉన్నారు. “This is the ‘safe’ area that the occupation army spoke of.” Al Jazeera's Wael Dahdouh lost his wife, son and daughter in an Israeli air raid in the southern Gaza Strip, where Israel told Palestinians to forcibly evacuate for their safety https://t.co/kaf1moxPRa pic.twitter.com/U12h7kWoFq — Al Jazeera English (@AJEnglish) October 25, 2023 My colleague at @AJArabic Wael Al Dahdouh just lost his wife, daughter, and son in an Israeli strike “ that targeted his home “ in #Gaza. He reported on that strike earlier, without knowing that some family members were among the dead in that Israeli bombing.#Gazabombing pic.twitter.com/SObiuP5zer — Wajd Waqfi وجد وقفي (@WajdWaqfi) October 25, 2023 "Help us to stay alive" was their outcry to the world from Gaza. Mahmoud, Al Jazeera Arabic’s Wael Dahdouh son, joined by his sister Kholoud, sent a message to the world, days before Mahmoud, his mother, and younger sister Sham were killed in an Israeli airstrike in Gaza ⤵️ pic.twitter.com/HWJ8SjIpvx — Al Jazeera English (@AJEnglish) October 25, 2023 -
కుటుంబాన్ని చంపి తగులబెట్టి.. మృతుల్లో ఆరు నెలల పసికందు..
జోధ్‌పూర్: రాజస్థాన్ లో హోరమైన సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జోధ్‌పూర్ సిటీకి సమీపంలోని చౌరాయి గ్రామంలో కొంతమంది ఆగంతకులు ఒక కుటుంబంలోని నలుగురిని అత్యంత కిరాతకంగా చంపి దహనం చేశారు. అసలే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ వర్గాలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఇంటిలోంచి పొగలు వస్తుండటంతో అనుమానమొచ్చింది స్థానికులు పోలీసులకి సమాచారమందించి ఆ ఇంటిలోకి వెళ్లి చూస్తే అప్పటికీ ఆ కుటుంబంలో అందరూ కాలిపోయి విగతజీవులుగా మారినట్టు తెలిపారు. మృతుల్లో పునారామ్(55), భావ్రీ దేవి(50), దాపు(మేనకోడలు) ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇంటి ప్రాంగణంలోకి వెళ్లి చూస్తే మరో హృదయవిదారక దృశ్యం.. వారి కుమార్తె ఆరు నెలల పసికందు బూడిద కుప్పగా మిగిలి ఉంది. వీరందరినీ మొదట గొంతు కోసి తర్వాత తగలబెట్టారని చెబుతున్నారు పోలీసులు. ఈ హత్యలకు కారణం ఏమై ఉంటుందనేది ఇంకా తెలియరాలేదని పునారామ్ వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని వెళ్లదీసే వాడని తెలిపారు. బహుశా వ్యక్తిగత కక్షలే ఈ హత్యలకు కారణమై ఉంటాయని చెబుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దొరికిందే అవకాశం ప్రతిపక్షమైన బీజేపీ పార్టీ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర పరిష్టితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘావల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 17 రేప్ లు 7 మర్డర్లు జరిగాయని అన్నారు. రాజస్థాన్ లో శాంతి భద్రతలు ఎప్పుడో మంట కలిసిపోయాయని.. ముఖ్యమంత్రి చూస్తే ఎమ్మెల్యేలే నా ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని పొగుడుకుంటూ ఉంటారన్నారు. ఈరోజు ఆ ఎమ్మెల్యేలకు అహంకారం నెత్తికెక్కి వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: పెళ్ళిలో ఏనుగులు హల్ చల్.. బైక్ మీద పారిపోయిన కొత్త జంట.. -
పాత కక్షలు..తుపాకులతో వెళ్లి విధ్వంసం.. ఒకే కుటుంబంలో ఆరుగురు హత్య
భోపాల్: మధ్యప్రదేశ్ మొరేనా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పాత కక్షతో ఓ కుటుంబానికి చెందిన వారు తుపాకులతో వెళ్లి మరో కుటుంబంపై భీకర దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. లేప గ్రామంలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తుపాకులతో ముఠాగా వెళ్లిన కొందరు.. బాధిత కుటుంబంపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఎలాంటి భయం లేకుండా యథేచ్ఛగా పెద్ద పెద్ద తుపాకులు తీసుకెళ్లి దాడి చేశారు. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య పాత వైరం ఉంది. 2013లో చెత్త పడేసే విషయంపై ధీర్ సింగ్ థోమర్, గజేంద్ర సింగ్ థోమర్ కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనలో ధీర్ సింగ్ కుటుంబంలో ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత గజేంద్ర కుటుంబం ఊరు విడిచి పారిపోయింది. అయితే ఇరు కుటుంబాలు ఇటీవలే కోర్టు బయట రాజీ కుదుర్చుకున్నాయి. దీంతో గజేంద్ర సింగ్ థోమర్ ఫ్యామిలీ 10 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగివచ్చింది. వీరు ఇంటికి వచ్చిన కాసేపటికే పగతో రగిలిపోతున్న ధీర్ సింగ్ కుటుంబం దాడి చేసింది. మొదట కర్రలతో గజేంద్ర కుటంబసభ్యులను వీరు చితకబాదారు. ఆ తర్వాత తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గజేంద్ర సింగ్ థోమర్‌తో పాటు అతని ఇద్దరు కుమారులు, ముగ్గురు మహిళలు చనిపోయారు. పాత పగలే ఈ హత్యలకు కారణమని పోలీసులు స్పష్టం చేశారు. బంధువుల ఫిర్యాదు ఆధారంగా మొత్తం 8 మందిని నిందితులుగా గుర్తించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఐఈడీ పేల్చిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్లు మృతి.. -
విడాకులు కావాలన్న భార్య.. కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపిన భర్త..
అమెరికా యుటాలో దారుణం జరిగింది. విడాకులు కావాలని భార్య కోర్టులో దరఖాస్తు చేసిన కొద్ది రోజులకే భర్త కిరాతక చర్యకు పాల్పడ్డాడు. కుటుంబంలోని మొత్తం ఏడుగురిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని మైకేల్ హైట్‌గా గుర్తించారు. హత్యకు గురైన ఏడుగురిలో అతని భార్య, ఐదుగురు పిల్లలతో పాటు అత్త కూడా ఉన్నారు. పిల్లలంతా 4-17ఏళ్ల వారే కావడం గమనార్హం. మరణించిన ఐదుగురు చిన్నారుల్లో 4, 7 ఏళ్ల అబ్బాయిలు, 7,12,17 ఏళ్ల అమ్మాయిలు ఉన్నారు. అయితే మైకేల్‌కు తన భార్యతో రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే భార్య అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే క్రిస్మస్కు ముందు డిసెంబర్ 21న తన భర్త నుంచి విడాకులు కావాలని ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకే భర్త దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబంలో ఎవ్వరినీ వదలకుండా అందరినీ హతమార్చి, తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. చదవండి: రెస్టారెంట్లో కాల్పుల కలకలం.. ర్యాపర్ సహా 10 మందికి గాయాలు -
వరంగల్: ఘోర ప్రమాదంలో కుటుంబం బలి
సాక్షి, వరంగల్: జిల్లాలో రహదారి మరోసారి నెత్తుటి మరకలు అంటించుకుంది. వర్ధన్నపేట మండలం డీసీ తండా వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఓ లారీని కారు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. మృతుల్ని జిల్లాలోని పెరుకవాడకు చెందిన బిల్డర్ కృష్ణారెడ్డి.. ఆయన భార్య వరలక్ష్మి, కొడుకు వెంకటసాయి రెడ్డిగా గుర్తించారు. ఒంగోల్ నుండి వరంగల్ వస్తున్న క్రమంలో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ మిగిలిన ఆరుగురికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఘటన జరిగిన సమయంలో కారులో మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసుల వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: అయ్యో బిడ్డ.. అంటూనే కుప్పకూలిన తల్లి -
విషాదం.. గోడ కూలి ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి!
రాయ్‌పుర్: స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు ఇంటి గోడ కూలిపోయి ముగ్గురు పిల్లలు సహా భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ కంకెర్ జిల్లాలో సోమవారం జరిగింది. పఖంజోర్ ప్రాంతం, ఇర్పానార్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా ఎస్పీ శలభ్ సిన్హా తెలిపారు. గోడ కూలిపోయిన సమయంలో బాధితులు ఇంట్లో నిద్రిస్తున్నారని వెల్లడించారు. ప్రమాదం సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు గ్రామానికి చేరుకుని పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి అందాల్సిన సాయాన్ని వెంటనే అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అతి కష్టంపై అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్, కోర్బా, ముంగేలి, గరియాబంద్, రాయ్‌పుర్, దుర్గాంద్ ధంతారి జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చదవండి: ప్రేమ పెళ్లి.. పది నెలలకే ఊహించని దారుణం! -
చిన్నారి సహా తల్లి సజీవ దహనం
ఘట్కేసర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. సీఐ రఘవీర్‌రెడ్డి కథనం మేరకు.. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్ ప్రాంతంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులను కాల్చివేసినట్లు స్థానికులు, వీఆర్ఏ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన మాచెల్ల రమేష్, గూడూరుకు చెందిన కందిగ శుశ్రుత 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరివీ వేర్వేరు సామాజిక వర్గాలు. ఈ దంపతులకు 4 నెలల బాబు ఉన్నాడు. భర్తతో గొడవపడిన శుశ్రుత కొద్ది రోజులుగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. సమస్యను పరిష్కరించుకుందామని భార్యను ఉప్పల్‌కు రమేశ్ పిలిపించాడు. కుమారుడితో కలిసి శుశ్రుత ఓఆర్ఆర్ వద్దకు వచ్చింది. ఈ సందర్భంగా వారి మధ్య మళ్లీ వాగ్వాదం జరగడంతో మనస్తాపం చెందిన శుశ్రుత.. తాను నిద్రమాత్రలను మింగడమేగాక మరో మాత్రను పాలలో కలిíపి కుమారుడికి తాగించింది. ఆపస్మారక స్థితికి చేరుకున్న వారిని రాత్రి 9 గంటల ప్రాంతంలో రమేష్.. ప్రభాకర్ ఎన్క్లేవ్ ప్రాంతానికి తరలించి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం నేరుగా పాలకుర్తికి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఈ సందర్భంగా.. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వెల్లడైందని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: కుటుంబమంతా మృతి..
బుర్ద్వాన్: పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం ఉదయం బుర్ద్వాన్ జిల్లా తేజ్గంజ్ సమీపంలోని నేషనల్ హైవే-2 పై చోటుచేసుకుంది. రోడ్డు నిర్మాణానికి తారు తీసుకెళ్తున్న ట్యాంకర్‌ను కారు ఓవర్‌టెక్ చేయబోయి ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందగానే ఫైర్ ఇంజన్‌తో మంటలు అదుపు చేశామని పోలీసులు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, మృతుల్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఒక చిన్నారి ఉన్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాని పోలీసులు తెలిపారు. కాగా రోడ్డు ప్రమాదంతో పోలీసులు రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహానికి లోనయ్యారు.