అమెరికా యుటాలో దారుణం జరిగింది. విడాకులు కావాలని భార్య కోర్టులో దరఖాస్తు చేసిన కొద్ది రోజులకే భర్త కిరాతక చర్యకు పాల్పడ్డాడు. కుటుంబంలోని మొత్తం ఏడుగురిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది.
ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని మైకేల్ హైట్‌గా గుర్తించారు. హత్యకు గురైన ఏడుగురిలో అతని భార్య, ఐదుగురు పిల్లలతో పాటు అత్త కూడా ఉన్నారు. పిల్లలంతా 4-17ఏళ్ల వారే కావడం గమనార్హం. మరణించిన ఐదుగురు చిన్నారుల్లో 4, 7 ఏళ్ల అబ్బాయిలు, 7,12,17 ఏళ్ల అమ్మాయిలు ఉన్నారు.
అయితే మైకేల్‌కు తన భార్యతో రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే భార్య అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే క్రిస్మస్‌కు ముందు డిసెంబర్ 21న తన భర్త నుంచి విడాకులు కావాలని ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకే భర్త దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబంలో ఎవ్వరినీ వదలకుండా అందరినీ హతమార్చి, తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
చదవండి: రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ర్యాపర్ సహా 10 మందికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment