utah
-
అంతరిక్షం టూ భూలోకం.. ఏం గుట్టు విప్పుతుందో?
వాషింగ్టన్: అల్లంత దూరాన అంతరిక్షంలో సేకరించిన ఆస్టరాయిడ్ తాలూకు తొలి శాంపిల్‌ను అమెరికా భూమి మీదికి తీసుకొచ్చింది. ఓసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌక భూమికి దాదాపు లక్ష కిలోమీటర్ల దూరం నుంచి విసిరేసిన శాంపిల్ క్యాప్సూల్ 4 గంటల ప్రయాణం తర్వాత ఆదివారం అమెరికాలోని ఉటా ఎడారిలో సైనిక భూభాగంలో దిగింది. నమూనాను సోమవారం హ్యూస్టన్ లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలిస్తారు. అనంతరం వాటిమీద పరీక్షలు, పరిశోధనలు చేస్తారు. అక్కడ గతంలో తెచ్చిన చంద్ర శిలలున్నాయి. వాటిని 50 ఏళ్ల క్రితం అపోలో మిషన్‌లో భాగంగా చంద్రుని మీదికి వెళ్ళిన అంతరిక్ష యాత్రికులు తీసుకొచ్చారు. తాజా క్యాప్సూల్ లో కనీసం పావు కేజీ పరిమాణంలో ఆస్టరాయిడ్ తాలూకు శకలాలు ఉండి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి ఎలా రూపొందిందో, దానిపై జీవం ఎలా వికసించిందో అర్థం చేసుకోవటానికి అవి మరింతగా ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ఇప్పటిదాకా జపాన్ ఒక్కటే ఆస్టరాయిడ్ శకలాలను భూమికి తెచ్చింది. Today's #OSIRISREx asteroid sample landing isn't just the end of a 7-year, 3.9-billion-mile journey through space. It takes us 4.5 billion years back in time. These rocks will help us understand the origin of organics and water that may have seeded life on Earth.… pic.twitter.com/sHLRrnWqAg — NASA (@NASA) September 24, 2023 ఏడేళ్ల ప్రయత్నం... ఆస్టరాయిడ్లపై పరిశోధన నిమిత్తం నాసా 2016లో 100 కోట్ల డాలర్ల ఖర్చుతో ఓసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. రెండేళ్ల అనంతరం అది బెన్నూగా పిలిచే ఆస్టరాయిడ్ ఉపరితలంపై దిగింది. 2020లో దాని మీదినుంచి స్వల్ప పరిమాణంలో శకలాలను ఒక క్యాప్సూల్ లోకి సేకరించి వెనుదిరిగింది. అప్పటికే అది కోట్లాది కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున్న బెన్నూ ఆస్టరాయిడ్ ప్రస్తుతం భూమికి 8.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అది 2182 సంవత్సరంలో భూమికి అతి సమీపంగా వస్తుందని, అప్పుడది బహుశా మనను ఢీకొనే ప్రమాదమూ లేకపోలేదని అంచనా. ఓసిరిస్ ఎక్స్ ప్రస్తుతం అపోఫిస్‌గా పిలిచే మరో ఆస్టరాయిడ్ వైపు పయనిస్తోంది. బెన్నూ రైట్ ఛాయిస్ సౌర కుటుంబం పుట్టినప్పుడు ఏర్పడ్డ పదార్థంతో బెన్ను రూపొంది ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం శాస్త్రవేత్తల వద్ద ఉన్న ఉల్క పదార్థాల నమూనాలతో పోలిస్తే ఇది భిన్నమైంది. దీన్ని శోధించడం ద్వారా 450 కోట్ల ఏళ్ల కిందట సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావొచ్చు. బెన్నూ.. కర్బన పదార్థాలు పుష్కలంగా ఉండే కార్బనేషియస్ తరగతి గ్రహశకలం. ఇలాంటి ఖగోళ వస్తువులు గ్రహాల నిర్మాణంలో ‘ఇటుకల్లా’ పనిచేసి ఉంటాయని విశ్లేషిస్తున్నారు. దీనిపై సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఖగోళశాస్త్రంలో నేడున్న అతిపెద్ద ప్రశ్న.. జీవానికి ప్రధాన కారణమైన నీరు, సేంద్రియ పదార్థాలు భూమి మీద పుష్కలంగా ఉండటానికి కారణమేంటి? వందల కోట్ల ఏళ్ల కిందట బెన్ను వంటి గ్రహశకలాలు వీటిని భూమికి చేరవేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ గుట్టును ఒసైరిస్-రెక్స్ నమూనాలు విప్పే అవకాశం ఉంది. చాలా గ్రహశకలాలు.. అంగారకుడు, గురుడు మధ్య ఉన్న గ్రహశకల వలయంలో ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బెన్నూ మాత్రం ఆరేళ్లకోసారి భూమికి చేరువగా వచ్చి వెళుతుంటుంది. అందువల్ల ఆ గ్రహశకలం వద్దకు వ్యోమనౌకను పంపి, భూమికి తిరిగి రప్పించడం చాలా సులువు. ఉత్కంఠ ప్రయాణంలో.. రోదసిలో దాదాపు మూడేళ్ల ప్రయాణం తర్వాత ఒసైరిస్-రెక్స్.. భూమికి చేరువైంది. భూ ఉపరితలానికి లక్ష కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆదివారం సాయంత్రం ఈ వ్యోమనౌక నుంచి శాంపిల్ క్యాప్సూల్ విడిపోయింది. ఆ తర్వాత నాలుగు గంటలు ప్రయాణించాక క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం 13 నిమిషాల పాటు దట్టమైన వాతావరణాన్ని చీల్చుకుంటూ గంటకు 44,500 కిలోమీటర్ల వేగంతో నేల దిశగా దూసుకొచ్చింది. గాలి రాపిడి వల్ల చెలరేగిన 3వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను ఉష్ణ రక్షణ కవచం సాయంతో తట్టుకోగలిగింది. పారాచూట్లు దశలవారీగా విచ్చుకొని క్యాప్సూల్ వేగాన్ని తగ్గించాయి. అమెరికాలోని యూతా ఎడారిలో అది సురక్షితంగా దిగింది. హెలికాప్టర్లో వచ్చిన బృందాలు దీన్ని సేకరించి, సమీపంలోని తాత్కాలిక క్లీన్ రూమ్‌లోకి తరలించాయి. ఆ తర్వాత హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు పంపుతారు. 50 ఏళ్ల కిందట చందమామ నుంచి తీసుకొచ్చిన నమూనాలు కూడా అక్కడే ఉన్నాయి. ఒసైరిస్-రెక్స్.. తన ఏడేళ్ల ప్రస్థానంలో.. సుమారు 620 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. -
విడాకులు కావాలన్న భార్య.. కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపిన భర్త..
అమెరికా యుటాలో దారుణం జరిగింది. విడాకులు కావాలని భార్య కోర్టులో దరఖాస్తు చేసిన కొద్ది రోజులకే భర్త కిరాతక చర్యకు పాల్పడ్డాడు. కుటుంబంలోని మొత్తం ఏడుగురిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని మైకేల్ హైట్‌గా గుర్తించారు. హత్యకు గురైన ఏడుగురిలో అతని భార్య, ఐదుగురు పిల్లలతో పాటు అత్త కూడా ఉన్నారు. పిల్లలంతా 4-17ఏళ్ల వారే కావడం గమనార్హం. మరణించిన ఐదుగురు చిన్నారుల్లో 4, 7 ఏళ్ల అబ్బాయిలు, 7,12,17 ఏళ్ల అమ్మాయిలు ఉన్నారు. అయితే మైకేల్‌కు తన భార్యతో రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే భార్య అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే క్రిస్మస్కు ముందు డిసెంబర్ 21న తన భర్త నుంచి విడాకులు కావాలని ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకే భర్త దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబంలో ఎవ్వరినీ వదలకుండా అందరినీ హతమార్చి, తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. చదవండి: రెస్టారెంట్లో కాల్పుల కలకలం.. ర్యాపర్ సహా 10 మందికి గాయాలు -
‘చిట్టి’ తల్లి.. చనుబాలతో ఎందరో బిడ్డల ఆకలి తీర్చాలనుకుంది!
సాల్ట్ లేక్ సిటీ: బిడ్డల ఆకలిని తీర్చేందుకు అక్కడి తల్లులు పడుతున్న అవస్థలు చూసి ఓ తల్లి చలించిపోయింది. విమర్శలు ఎదురవుతాయని తెలిసినా.. ఒక అడుగు ముందుకు వేసింది. తన చనుబాలను ఇచ్చి ఎంతో మంది బిడ్డల ఆకలి తీర్చే ప్రయత్నం చేసింది. అమెరికా యూటా చెందిన అలైస్సా చిట్టి తన ఇంట్లో మూడు ఫ్రీజర్ల నిండా చనుబాలను నిల్వ చేసి ఉంచింది. మొత్తం పాల క్వాంటిటీ 118 లీటర్లు!!. తొలుత ఆమె ఉచితంగానే పాలను పంచాలని అనుకుందట. అయితే మిల్క్ బ్యాంక్‌ల నుంచి పాలు పంచే పద్ధతి సుదీర్ఘంగా ఉండడం, అదే జరిగితే ఆలస్యం అవుతుందనే ఆలోచనతో ఆమె ఈ ఉపాయం చేసింది. ఔన్స్ పాలకు డాలర్ వసూలు చేయడం మొదలుపెట్టి.. తల్లులకు పాలు పంచుతోంది. చిట్టి ఈ పని మొదలుపెట్టినప్పుడు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. తల్లి పాలతో వ్యాపారం చేస్తోందంటూ కొందరు మండిపడ్డారు. కానీ, పద్ధతి ప్రకారం వెళ్తే ఆమె అనుకున్న పని జరగదు. అందుకే ఇలా.. అమ్మకం ద్వారా పంచుతోంది. బేబీ ఫార్ములా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇప్పుడు బేబీ ఫార్ములా(బిడ్డ ఆకలి తీర్చే ఉత్పత్తుల) కొరత కొనసాగుతోంది. అమెరికా వ్యాప్తంగా 40 శాతం బేబీ ఫార్ములా ఔట్ ఆఫ్ స్టాక్‌గా ఉంది. ఫిబ్రవరిలో ఓ ప్రముఖ ప్రొడక్షన్ ప్లాంట్ మూతపడిపోవడంతో ఈ సంక్షోభ పరిస్థితి నెలకొంది. బేబీ ఫార్ములా అనేది ఏడాది లోపు పసికందులకు ఇచ్చే అథెంటిక్ ఫుడ్. తన బిడ్డ కూడా ఆ తరహా ఫుడ్‌కు అలవాటు పడిందనేనని, ఆ కష్టాలేంటో తెలిసే ఇలా సాయం చేస్తున్నానని అలైస్సా చిట్టి అంటోంది. అయితే ఆమె ఇంటర్వ్యూ తర్వాత నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఎదురుకావడంతో.. ప్రస్తుతానికి చనుబాలను అమ్మే ప్రయత్నాన్ని తాత్కాలికంగా ఆమె ఆపేసింది. ఎందుకు అడ్డంకులు.. అమెరికాలో ఆన్లైన్లో తల్లి పాలను కొనుగోలు చేయడం, విక్రయించడం ఖచ్చితంగా చట్టబద్ధమైనదే అయినా నియంత్రణ లేని వ్యవహారం. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆదేశాల ప్రకారం.. తల్లి పాలను నేరుగా వ్యక్తుల నుంచి లేదంటే ఆన్లైన్ ద్వారా పొందినప్పుడు.. దాత అంటు వ్యాధులు లేదంటే నాణ్యత ప్రమాణాల కోసం పరీక్షించబడే అవకాశం ఉండదు. అదే ఒకవేళ పాలను మిల్క్ బ్యాంకుకు విరాళంగా ఇవ్వడం వల్ల వారాల తరబడి స్క్రీనింగ్ ఉంటుంది. అందుకే మిల్క్ బ్యాంకుల ద్వారానే పంచాలని చెప్తున్నారు వైద్య నిపుణులు. -
ఘోర ప్రమాదం: ఇసుక తుఫాను బీభత్సం... 22 వాహనాలు ఢీ
వాషింగ్టన్(కానోష్): అమెరికాలోని ఉతాహ్ రాష్ట్రంలో ఇసుక తుఫాను కారణంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కానోష్ నగరంలోని ఇంటర్ స్టేట్ హైవే 15 మీద ఈ ప్రమాదం జరిగింది. ఇసుకు తుఫాను కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడంతో, దాదాపు 22 వాహనాలు ఢీకొట్టుకొని ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. దీంతో 8 మంది మరణించారు. బాధితులను ఆస్పత్రులకు తరలించేందుకు ఎయిర్ అంబులెన్సులను ఉపయోగించారు. ఇసుక తుఫాను, రోడ్డు ప్రమాదం కారణంగా హైవే 15ను ఆదివారం మూసేశారు. -
మిస్టరీ: ఇక్కడ మాయం.. అక్కడ ప్రత్యక్షం
బుకారెటస్ట్, రొమేనియా: గత నెల ఉటా ఎడారిలో ఓ లోహపు దిమ్మె ప్రత్యక్షం అయ్యి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. సడెన్‌గా ప్రత్యక్షం అయిన దిమ్మె.. అంతే సడెన్‌గా మాయమవ్వడంతో ఏలియన్స్ పనే అని చర్చించుకుంటున్నారు నెటిజనులు. లోహపు దిమ్మె కనిపించకుండా పోయినప్పుడు ‘ఉటా ఎడారి నుంచి మాయమయ్యింది.. ఇక ఇప్పుడు ఎక్కడ ప్రత్యక్షం కానుందో’ అంటూ కామెంట్ చేశారు కొందరు నెటిజనులు. వారి మాటలు నిజమయ్యాయి. ఉటాలో మాయమైన లోహపు దిమ్మె ప్రస్తుతం యూరప్‌లో ప్రత్యక్షమయ్యింది. యూరప్ దేశం రొమేనియాలో... ఓ లోహ స్తంభం సడెన్‌గా ప్రత్యక్షమైంది. త్రికోణ ఆకారంలో ఉన్న ఈ లోహ స్తంభం... రొమేనియాలోని... పియత్రా నీమ్త్‌లో ఉన్న పురాతన పెట్రోదావా దాసియన్ కోటకు కొన్ని మీటర్ల అవతల కనిపించిందని డైలీ మెయిల్ తెలిపింది. తాజా స్తంభం... 13 అడుగుల ఎత్తు ఉంది. సియాహ్లూ పర్వతం వైపు చూస్తున్నట్లుగా ఉంది. రొమేనియాలోని సహజమైన 7 వింతల్లో ఆ పర్వతం కూడా ఉంది. ఐతే... ఉటా ఎడారిలో మాయమైన లోహపు దిమ్మె, ఇదీ... రెండు వేరు వేరని చెబుతున్నారు. ఉటా ఎడారిలో కనిపించిన లోహపు దిమ్మె 10-12 అడుగుల ఎత్తు, మూడు వైపుల స్టీల్‌తో తయారై ఉంది. ఇక ఈ లోహపు దిమ్మె తమ దేశంలో ప్రత్యక్షం కావడంతో రొమేనియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దాని మిస్టరీ విప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తుంటే... మేమూ దాన్ని మొదటిసారి చూస్తున్నాం అని చెబుతున్నారు. అది ప్రభుత్వానికి చెందినది కాదనీ... అందువల్ల దాన్ని తాము ఏమీ చెయ్యలేమనీ... కాకపోతే... దాని ఓనర్ ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు అధికారులు. అది చారిత్రక, పురాతత్వ రక్షణ వలయ ప్రాంతంలో ఉండటం వల్ల ఎవరూ అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ ఏదైనా వస్తువును అక్కడ ఉంచాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ ఇవేవి లేకుండా రాత్రికి రాత్రే ఈ లోహపు స్తంభం ఇక్కడ ప్రత్యక్షం కావడంతో ప్రజలతో పాటు అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. (ఉటా ఎడారి: ఎలా వచ్చిందో.. అలానే వెళ్లింది) ఉటా ఎడారిలో నుంచి దాన్ని తొలగించింది మేమే ఇక ఉటా ఎడారిలో కనిపంచిన లోహపు దిమ్మెను ఎవరు తొలగించారనే దానికి సమాధానం లభించింది. అయితే దాన్ని తొలగించింది ఏలియన్స్ మాత్రం కాదు. నలుగురు వ్యక్తులు దాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఈ విషయాన్ని రాస్ బెర్నార్డ్స్ అనే ఫోటోగ్రాఫర్ తెలిపారు. ఎడారిలో ఉన్న లోహపు దిమ్మెని ఫోటో తీయడానికి వెళ్లినప్పుడు నలుగురు వ్యక్తులు దాన్ని తొలగించడం తన కెమరా కంటికి చిక్కిందని తెలిపాడు. అంతేకాక వారి ఫోటోలను తన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు బెర్నార్డ్స్. మంగళవారం తరువాత, 34 ఏళ్ల స్లాక్‌లైన్ ప్రదర్శనకారుడు, సాహస క్రీడాకారుడు ఆండీ లూయిస్ ‘మేము ఉటా ఎడారిలో కనిపించిన లోహపు దిమ్మెని తొలగించాం’ అంటూ ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. -
ఉటా ఎడారి: ఎలా వచ్చిందో.. అలానే వెళ్లింది
వాషింగ్టన్: అమెరికాలోని ఉటా ఎడారిలో కొద్ది రోజుల క్రితం ఓ వింత వస్తువు ప్రత్యక్షమయిన సంగతి తెలిసిందే. 12 అడుగుల పొడవున్న ఈ లోహపు దిమ్మె నర సంచారం లేని ఆ ఎడారిలోకి ఎలా వచ్చేందనే విషయం ఇంకా మిస్టరీగానే ఉండగా... తాజాగా మరో వింత చోటు చేసుకుంది. ప్రస్తుతం ఉటా ఎడారిలో ప్రత్యక్షమైన ఆ దిమ్మె కనిపించకుండా పోయింది. దాంతో తప్పకుండా ఇది ఏలియన్స్ పనే అంటున్నారు నెటిజనులు. ఈ నేపథ్యంలో ల్యాండ్ మేనేజ్మెంట్ బ్యూరో అధికారులు ‘ఒక్కరు లేదా కొందరు వ్యక్తులు కలిసి ఈ దిమ్మెను శుక్రవారం రాత్రి తొలిగించినట్లు మాకు తెలిసింది’ అన్నారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం.. ‘లోహపు దిమ్మెను తొలగించారు. బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్మెంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా పాతిన లోహపు దిమ్మెను తొలగించినట్లు మా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది’ అని దానిలో పేర్కొన్నారు. ఈ నిర్మణాన్ని తొలగించినట్లు ఉటా హైవే పాట్రోల్ సీపీఎల్ అధికారి ఒకరు ఆదివారం వాషింగ్టన్ పోస్ట్‌కు తెలియజేశారు. అయితే ఎవరు దాన్ని తొలగించారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ విషయం జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. (చదవండి: ఏముంది.. అక్కడే పడుకో: భార్య) ‘అసలు ఆ దిమ్మెను ఎడారిలో ఎవరు నిలబెట్టారు.. ఇప్పుడు ఎవరు తొలగించారు. అంతా మాయాలా ఉంది’ అంటూ ఆశ్చర్యం వ్యక్యం చేస్తున్నారు జనాలు. ప్రస్తుతం దీని గురించి ఇంటర్నెట్లో తెగ చర్చ నడుస్తోంది. ‘ఏలియన్స్ వచ్చి దాన్ని తీసుకెళ్లాయి’.. ‘ఇప్పుడు ఆ దిమ్మె మరో చోట ప్రత్యక్షం అవుతుందేమో’.. ‘ఆ దిమ్మె ఏలియన్స్‌కు సంబంధించిన వస్తువు. అందుకే అధికారుల సీక్రేట్‌గా దాన్ని తొలగించారు.. దాని ఏం మాట్లాడటం లేదు’ అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఈ నెల 18న కొందరు కార్మికులు ఈ నిర్మణాన్ని గమనించారు. రెడ్ రాక్ రిమోట్ ఏరియాలో దిమ్మె ప్రత్యక్షం అయ్యిందని తెలిపారు. నాటి నుంచి ఈ దిమ్మె తెగ వైరలయ్యింది. ఇక ఈ దిమ్మె ఎక్కడ ఉంది అనే దాని గురించి ఉటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ వాళ్లు ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చే అవకాశం ఉండటంతో సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. -
ఉటా ఎడారిలో మిస్టరీ దిమ్మె!
అమెరికా: ఉటా ఎడారిలో అకస్మాత్తుగా ఓ లోహపు దిమ్మె ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి ఊడిపడిందో ఎవరికీ తెలియదు కానీ.. ఇది సుమారు 12 అడుగుల పొడవుందని ఉటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ వాళ్లు ప్రకటించారు. ఎడారి ప్రాంతంలోని అడవి గొర్రెల సంతతిని లెక్కించేందుకు గత బుధవారం తాము హెలికాప్టర్లో సర్వే నిర్వహించిన ప్పుడు ఉటా నైరుతి దిక్కున ఎర్ర రాళ్ల మధ్య ఈ లోహపు దిమ్మె కనిపించిందని అధికారులు తెలిపారు. ఈ దిమ్మెను అక్కడికి ఎవరు తెచ్చారో? ఎలా తెచ్చారో తెలియలేదని, అక్కడ పాతిన ఆనవాళ్లూ ఏవీ కనిపించ లేదన్నారు. ఈ దిమ్మె కచ్చితంగా ఎక్కడుందో చెప్పేందుకు కూడా అధికారులు ఇష్టపడటం లేదు. ఎందుకంటే మనుషులు వెళ్లలేని ప్రాంతంలో అది ఉందని, ఒకవేళ ఎవరైనా వెళ్లినా వాళ్లను రక్షించేందుకు మళ్లీ తామే వెళ్లాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అచ్చం ఆ సినిమాలో ఉన్నట్లే... ఉటా ఎడారిలో గుర్తించిన లోహపు దిమ్మె అచ్చం 1968లో విడుదలైన ‘‘2001: ఎ స్పేస్ ఒడెస్సీ’’ చిత్రంలో గ్రహాంతర వాసులకు చెందినదిగా చూపిన నిర్మాణం మాదిరిగానే ఉండటంతో ఈ వార్తపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఉటా హైవే ఫేస్బుక్ పేజీలో ఈ మిస్టరీ నిర్మాణంపై పలువురు హాస్యాన్ని జోడించి మరీ కామెంట్లు పెట్టారు. మరోవైపు ఈ నిర్మాణంపై అధికారులు స్పందిస్తూ ఇది చట్ట వ్యతిరేకమని, తగిన అనుమతుల్లేకుండా ఇలా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేయడం ఎర్త్ లాను ఉల్లంఘించడమేనని హెచ్చరిస్తున్నారు. ఆ దిమ్మె ఏమిటి? అక్కడకు ఎలా వచ్చిందన్నది ప్రస్తుతానికైతే మిస్టరీనే! స్ప్రే చేస్తే చాలు.. కదులుతాయి! శరీరం లోపలి భాగాలకు నేరుగా మందులు అందించేందుకు హాంకాంగ్ సిటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. అయస్కాంత పదార్థపు స్ప్రేతో ఏ వస్తువునైనా మిల్లీ రోబోగా మార్చేయగలగడం ఇందులోని కీలక అంశం. పాలివినైల్ ఆల్క హాల్, గ్లుటెన్, ఇనుప రజనుతో తయారైన ఈ స్ప్రే చేసిన వస్తువును శరీరంలో కావాల్సిన చోటికి నడిపించవచ్చు లేదా దొర్లేలా చేయవచ్చు. పాక్కుంటూ కూడా వెళ్లగలదు. కేవలం మిల్లీమీటర్లో నాలుగో వంతు మందం ఉండే ఈ స్ప్రేను మాత్రలపై ఉప యోగించడం ద్వారా మందులను నేరుగా శరీర భాగాలకు ఇవ్వాలన్నది తమ ఆలోచన అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ షెన్ యాజింగ్ తెలిపారు. ఎం–స్ప్రే అని పిలిచే ఈ కొత్త పదార్థం శరీరంలోకి ప్రవేశించిన తరువాత అవసరమైన సమయంలో తనంతట తానే నాశనమై వ్యర్థంగా బయటకు వచ్చేస్తుంది. గమనాన్నీ నియంత్రించొచ్చు.. అంతేకాదు.. ఎం–స్ప్రే కోటింగ్ ఉన్న వస్తువు ఏ రకంగా ప్రయాణించాలో నిర్ణయించవచ్చని, అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి కోటింగ్‌పై కణాల అమరికను మార్చడం ద్వారా ఇది సాధ్యమని యాజింగ్ వివరిస్తున్నారు. కొన్ని మాత్రలకు తాము ఈ కోటింగ్ ఇచ్చి ఎలుకలపై ప్రయోగించామని, ఆ తరువాత ఇవి ఎలుకల శరీరంలో ఎలా ప్రయాణించాయో స్పష్టంగా గమనించగలిగామని, కావాల్సిన ప్రాంతానికి చేరుకోగానే కోటింగ్ కరిగిపోయి మందు మాత్రమే విడుదలైందని చెప్పారు. ఈ స్ప్రేను వైద్య రంగంలో ఉపయోగించడమే కాకుండా మిల్లీ రోబోల తయారీ ద్వారా కదిలే సెన్సర్లుగానూ వాడుకోవచ్చునని యాజింగ్ అంటున్నారు. గుండెజబ్బుల చికిత్స కోసం శరీరంలోకి చొప్పించే క్యాథిటర్ను కూడా ఈ కోటింగ్ ద్వారా నియంత్రించవచ్చని తెలిపారు. -
కారు కొనేందుకు కారేసుకెళ్లిన బుడ్డోడు
కాలిఫోర్నియా: అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో పిల్లలు అలుగుతుంటారు.. అది సహజం. అయితే ఓ ఐదేళ్ల బుడ్డోడు మాత్రం అలిగి బుంగమూతి పెట్టుకుని కూర్చోలేదు. తను కోరింది దక్కాల్సిందేనన్న మంకుపట్టుతో చెప్పాపెట్టకుండా కారేసుకుని వెళ్లిపోయాడు. హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఆ బుడతడు డ్రైవింగ్ చేయడం చూసి ఖంగు తిన్నారు. ఈ ఆశ్చర్యకర ఘటన సోమవారం అమెరికాలోని ఉటావాలో జరిగింది. ఓ బాలుడు తన తల్లిని ఖరీదైన లంబోర్గిని కారు కొనివ్వమని అడిగాడు. అందుకు అతని తల్లి నిరాకరించింది. (సైకిల్‌పై వచ్చి చిన్నారిని ఈడ్చుకెళ్లిన కోతి) దీంతో స్వయంగా అతనే వెళ్లి తెచ్చుకోవాలని భావించిన పిల్లవాడు మూడు డాలర్లు వెంట పెట్టుకుని ఇంట్లో మాటైనా చెప్పకుండా తన పేరెంట్స్ ఎస్యూవీ కారు తీసుకుని కాలిఫోర్నియాకు బయలు దేరాడు. మార్గమధ్యంలో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. నీకు ఐదేళ్లే కదా? ఇంత చిన్న వయసులో డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకున్నావ్? అంటూ ప్రశ్నలు కురిపించారు. అదృష్టవశాత్తూ అతని డ్రైవింగ్‌లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. సుమారు నాలుగైదు కిలోమీటర్ల వరకు అతను కారు నడిపాడని తెలిపారు. తర్వాత అతడిని మందలించి తల్లిదండ్రులకు అప్పగించారు. (డిస్ట్రబ్ చేసింది.. స్టార్ అయ్యింది) -
అంత ధర చెల్లించలేను.. ఏం చేయాలి?
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) ధాటికి ప్రపంచ దేశాలన్నీ విలవిల్లాడుతున్నాయి. ఈ మహమ్మారి ప్రజల దరిచేరకుండా అనేక పటిష్ట చర్యలు చేపడుతున్నాయి. కరోనా కట్టడికై వ్యాక్సిన్ రూపొందించే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నం కాగా.. చికిత్స కంటే నివారణే మేలు అన్నచందంగా చాలా దేశాల్లో ప్రజలు సామాజిక ఎడం పాటిస్తూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. కరోనా ప్రబలకుండా ఉండేందుకు మాస్కులు ధరిస్తూ, శానిటైజర్లు వాడుతూ.. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ.. ఇతర జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కొన్నిచోట్ల వ్యాపారులు ప్రజల భయాన్ని, అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ మహిళ మరోసారి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.(‘అందుకే నా భర్తను దూరంగా ఉంచాను’) వివరాలు... లారెన్ విట్నీ(36) అనే మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి దక్షిణ ఊతాలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో తన చంటిబిడ్డకు డైపర్లు కొనేందుకు స్థానిక స్టోర్‌కు వెళ్లారు. అయితే అక్కడ వాటి ధర చూసి ఆమె షాక్‌కు గురయ్యారు. ఒక్కో డైపర్ ప్యాకెట్ ధర 20 రెట్లు పెరిగిందని.. తను అంత ఖర్చు పెట్టి వాటిని కొనలేనని.. తన బిడ్డకు డైపర్లు ఎలా మార్చాలో అర్థంకావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె టిక్‌టాక్‌లో షేర్ చేశారు. ఈ క్రమంలో నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. లారెన్‌పై సానూభూతి వ్యక్తం చేస్తూ.. కరోనా భయాన్ని వ్యాపారులు ఇలా వాడుకుంటున్నారంటూ మండిపడుతున్నారు. ఆమెకు తమ వంతు సాయం చేస్తామని ముందుకు వస్తున్నారు. ఈ విషయం గురించి లారెన్ మాట్లాడుతూ... తన ఈ వీడియోను డ్రాప్ట్స్‌లో పెట్టాలనుకున్నానని.. అయితే అనుకోకుండా అది అప్లోడ్ అయిపోయిందన్నారు. నిమిషాల్లోనే వైరల్‌లా మారిన ఈ వీడియో కారణంగా కొంత మంది వ్యాపారులైనా తమ వైఖరి మార్చుకుంటారనే నమ్మకంతో దానిని అలాగే ఉంచేశానని పేర్కొన్నారు.(‘కరోనా ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయండి’) ‘కరోనా’ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం! వైద్యులు ఎన్నిసార్లు చేతులు కడుక్కుంటారో తెలుసా? -
ప్రాణం పోయేలా ఉంటే ప్రాంక్ అనుకుంది
పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఎప్పుడూ టిక్టాకేనా, వేరే పనే లేదా? అని ఎంతమంది మొట్టికాయలు వేసినా టిక్‌టాక్ యూజర్లకు చీమకుట్టినట్టైనా ఉండదు. పైపెచ్చు నా వీడియోను ఇంతమంది చూశారు, అంతమంది లైక్ కొట్టారని తెగ మురిసిపోతుంటారు. లేదంటే నా వీడియో ఎవరూ పట్టించుకోవట్లేదంటూనే మరో వీడియోకు పోలోమని రెడీ అయిపోతుంటారు. అన్నం తినకుండా ఒకరోజైనా ఉంటారేమో కానీ టిక్‌టాక్ లేకుండా ఒక పూట కూడా ఉండలేమన్నట్లుగా తయారయ్యారు చాలామంది జనాలు. ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగాలు ఊడగొట్టుకోగా మరికొంతమంది ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు. చావును దగ్గర నుంచి చూశాడు కానీ కొందరు మాత్రం పిచ్చి పిచ్చి ప్రయోగాలతో చావు చివరి అంచుల దాకా వెళ్లి వస్తున్నారు. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి కూడా ఈ కోవకు చెందినవాడే. టిక్‌టాక్ స్టార్ జాసన్ క్లార్క్ ఓ విన్యాసానికి పూనుకున్నాడు. అందరిలాగా మామూలు నీళ్లలో ఈత కొడితే మజా ఏముంది అనుకున్నాడో ఏమోగానీ గడ్డ కట్టిన మంచు నీటి కింద ఈత కొట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మంచు గడ్డ కట్టిన నీళ్లలోకి ప్రవేశించి ఈత కొట్టడం ప్రారంభించాడు. తర్వాత కాసేపటికే ఊపిరాడక చేపలా గిలగిలా కొట్టుకున్నాడు. తిరిగి పైకి రావడానికి దారి కూడా కనిపించలేదు. పైగా అతని కళ్లు కూడా మంచు కట్టడం ప్రారంభించమవడంతో ఊపిరి పోవడం తథ్యం అనుకున్నాడు. కానీ ఎట్టకేలకు ఓ రంధ్రం గుండా నీళ్లలో నుంచి బయట పడ్డాడు. ఊపిరాడక చస్తుంటే ప్రాంక్ అనుకుంది ఈ భయానక అనుభవాన్ని జాసన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘నీళ్లలోకి దిగి ఈత కొట్టాక నా చుట్టూ అంతా ఒకేలాగా అన్పించింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటంతో ఎలాగోలా పైకి రావాలని మంచుగడ్డను పగలగొట్టేందుకు ప్రయత్నించాను, కానీ అది సాధ్యపడలేదు. కళ్లు కూడా పనిచేయడం మానేసినట్లు అనిపించింది. దీంతో వెంటనే నా శక్తిని కూడగొట్టుకుని పైకి వచ్చేశాను’ అని పేర్కొన్నాడు. ఇక దీన్నంతటినీ చిత్రీకరిస్తున్న మహిళ అతను నీళ్ల లోపల కొట్టుమిట్టాడటాన్ని చూసి అది ప్రాంక్ అని భ్రమపడటం గమనార్హం. ఇక విశేషమేంటంటే ఇంత జరిగినా అతను మరోసారి ఈ సాహసానికి పూనుకుని అందులో సఫలీకృతుడయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పంచుకన్నాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. -
ఏముంది.. అక్కడే పడుకో: భార్య
ఉటావా: జిమ్‌లో గంటల తరబడి వ్యాయామం చేస్తూ ఓ వ్యక్తి సమయాన్నే మర్చిపోయాడు. దీంతో అతన్ని గమనించని నిర్వాహకులు జిమ్ సెంటర్‌కు తాళం వేసి వెళ్లిపోయిన ఘటన అమెరికాలోని ఉటావాలో చోటు చేసుకుంది. వివరాలు.. డేన్ హిల్ అనే వ్యక్తి ‘24 హవర్స్ ఫిట్నెస్’ అనే జిమ్ సెంటర్లో చేరాడు. అయితే జనవరి 12న అతను జిమ్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ ప్రపంచాన్నే మర్చిపోయినట్టున్నాడు. ఇక ఇతన్ని ఆ జిమ్ నిర్వాహకులు కూడా గమనించనట్టున్నారు. దీంతో అర్ధరాత్రి సమయంలో జిమ్‌ను మూసేసి వెళ్లిపోయారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న డేన్ జిమ్ నుంచి బయటపడే దారి కోసం ప్రయత్నించాడు. కానీ ఏ మార్గం అతని కంట పడలేదు. దీంతో జిమ్‌లో చిక్కుకున్న విషయాన్ని అతను ఫొటోలతో సహా ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ‘ఈ జిమ్ 24 గంటలు తెరిచి ఉండనపుడు దానికి ఆ పేరు ఎలా సూటవుతుంది?’ అని కాస్త విసుగు ప్రదర్శించాడు. ఇక ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. జిమ్ నుంచి బయటపడే దారి దొరక్కపోవడంతో డేన్ తన భార్యకు కాల్ చేశాడు. అయితే ఆమె ‘మంచి స్థలం చూసుకుని అక్కడే పడుకొ’మ్మని సలహా ఇచ్చింది. ‘ఏముంది.. అద్దాలు పగలగొట్టి బయటపడు’ అని కొందరు నెటిజన్లు ఐడియాలు ఇచ్చారు. ‘24 హవర్స్ ఫిట్నెస్ అంటే 24 గంటలపాటు లోపలే ఉంచి లాక్ చేయడమేమో’ అని మరికొందరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. కాగా కాసేపటికే పోలీసులు అతన్ని జిమ్ నుంచి బయటికి తీసుకువచ్చేందుకు సహాయం చేశారు. దీనిపై జిమ్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. రాత్రిళ్లు అంతగా ఉపయోగం లేని చోట్ల మాత్రమే జిమ్‌ను క్లోజ్ చేస్తున్నామని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. -
విమానం నుంచి చేపల వర్షం.. విమర్శలు
-
విమానం నుంచి చేపల వర్షం.. విమర్శలు
వాషింగ్టన్ : ఊతా సరస్సులో చేపల జనాభాను పునరుద్ధరించేందుకు వినూత్న ఆలోచన చేసిన ‘ఊతా డివిజన్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ రీసోర్సెస్’ (డీడబ్ల్యూఆర్) విమర్శల పాలైంది. సోషల్ మీడియాలో తాము పోస్ట్ చేసిన వీడియోపై వివరణ ఇచ్చుకుంది. అసలేం జరిగిందంటే... అమెరికాలోని ఊతా రాష్ట్రంలో ఉన్న ఊతా సరస్సును సందర్శించేందుకు ఏటా వేలాది మంది పర్యాటకులు వస్తూంటారు. అక్కడ ఫిషింగ్ చేసే వెసలుబాటు కూడా ఉంటుంది. దీంతో చేపల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుండటంతో.. డీడబ్ల్యూఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చేప పిల్లలను నీళ్లలోకి వదిలేందుకు.. మొదట్లో గుర్రాలను ఉపయోగించేవారు. గుర్రాలపై చేపలను రవాణా చేసేవారు. అయితే ఊతా సరస్సు ఎత్తైన కొండల మధ్య ఉండటంతో ఈ ప్రక్రియ చాలా కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో విమానం ద్వారా చేప పిల్లలను నీళ్లలోకి వదలాలని నిర్ణయించిన డీడబ్ల్యూఆర్ తమ ఆలోచనను అమలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను తమ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోను చూసిన జంతు ప్రేమికులు డీడబ్ల్యూఆర్ను తప్పుపట్టారు. చేప పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించారంటూ విమర్శించారు. వాటికేం కాదు.. తమ చర్యను సమర్థించుకున్న డీడబ్ల్యూఆర్.. మేము ఎన్నోసార్లు గాల్లోంచి సరస్సులోకి చేప పిల్లలను వదిలాం.. చాలా చిన్నవైన పిల్లలు 1 నుంచి 3 ఇంచుల పొడవు గలవి. వాటిని విమానం నుంచి విసరటం వల్ల ఎటువంటి అపాయం జరగదంటూ వివరణ ఇచ్చింది. నయాగరా జలపాతంతో పాటుగా జాలువారే చేపలు బతికే ఉంటున్నాయి కదా అంటూ తమ చర్యను సమర్థించుకుంది. -
బస్సు డ్రైవరే అమ్మలా మారి...
-
బస్సు డ్రైవరే తల్లిలా మారి...
ఆల్పైన్ : తల్లిలేని పిల్లకు తల్లిలా మారిందో మహిళా డ్రైవరు. రోజూ తన బస్సులో ప్రయాణించే చిన్నారికి తల దువ్వి జడేస్తూ ఆ బాలికకు అమ్మలేని లోటును కొంతైనా తీరుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఉటా దేశంలోని ఆల్పైన్ నగరానికి చెందిన పదకొండేళ్ల ఇసబెల్లా పీరీ అనే అమ్మాయి రెండేళ్ల క్రితం తల్లిని కోల్పోయింది. క్యాన్సర్ వ్యాధితో ఆమె మరణించగా.. అప్పటి నుంచి ఆ చిన్నారి తన పనులు తానే చేసుకుంటోంది. తండ్రి ఉద్యోగ రిత్యా ఉదయాన్నేలేచి వెళ్లిపోతుండటంతో.. సొంతగా పనులు చేసుకోవటం అలవర్చుకుంది. అయితే జడేసుకోవటం మాత్రం ఆ చిన్నారికి ఇబ్బందిగా అనిపించేది. ఓ రోజు తాను వెళ్లే స్కూలు బస్ డ్రైవర్ ట్రేసీ డీన్.. ఓ విద్యార్థినికి జడవేయడం ఇసబెల్లా గమనించింది . తనకు కూడా జడవేయాల్సిందిగా ట్రేసీని కోరింది. అలా అప్పటి నుంచి రోజు ఆమెకు ఎంచక్కా ఆ డ్రైవర్ జడేస్తూ ముస్తాబు చేసేది. ‘ట్రేసీ చేస్తున్న సేవలతో తాను ఆమెను ఓ తల్లిలా భావిస్తున్నాను’ అని ఇసబెల్లా చెబుతుండగా.. ట్రేసీ డీన్ స్పందిస్తూ.. ‘ఏడు సంవత్సరాల క్రితం నేను రొమ్ము క్యాన్సర్‌కి గురయ్యాను. ఆ సమయంలో నేను చనిపోతే నా పిల్లలను ఎవరు చూసుకుంటారనిపించింది. తండ్రి ఉన్నా.. తల్లి చేసే పనులు చేయలేరు. ప్రేమగా జడవేయడం తల్లికి మాత్రమే తెలుసు. అందుకే ఇసబెల్లా కోరికను తీరుస్తున్నా’ చెప్పారు. ఇసబెల్లాకు ట్రేసీ జడ వేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రకృతి వంతెనలు
-
కార్లతో సహా కొట్టుకుపోయారు
లాస్ ఎంజెల్స్: అమెరికాలో భారీ వరదలు సంభవించి 15మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పన్నెండు మంది రెండు కుటుంబాలకు చెందిన వారు. వీరంతా రెండు వాహనాల్లో బయలుదేరి వెళుతుండగా కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉతాహ్ ప్రాంతంలో పోటెత్తిన వరదల్లో చిక్కుకున్నారు. వరద నీరు బలంగా వచ్చి వాహనాలు ఢీకొనడంతోపాటు ఈడ్చుకెళ్లడంతో వారు అందులోనే ప్రాణాలు విడిచారు. అయితే, అవే కార్లలోని ఓ ముగ్గురు మాత్రం బతికి బయటపడ్డారు. వరదల్లో చిక్కుకున్న తమ వాహనాలు తిరిగి వెనక్కు తీసుకెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా అప్పటికే నీటి ప్రవాహం పెరిగి వారు వాహనాలతో సహా కొట్టుకుపోయారు. ఇప్పటికే అక్కడి పలు నదులు ప్రమాధ స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.