
రాయ్‌పుర్: స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు ఇంటి గోడ కూలిపోయి ముగ్గురు పిల్లలు సహా భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ కంకెర్ జిల్లాలో సోమవారం జరిగింది. పఖంజోర్ ప్రాంతం, ఇర్పానార్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా ఎస్పీ శలభ్ సిన్హా తెలిపారు. గోడ కూలిపోయిన సమయంలో బాధితులు ఇంట్లో నిద్రిస్తున్నారని వెల్లడించారు.
ప్రమాదం సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు గ్రామానికి చేరుకుని పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి అందాల్సిన సాయాన్ని వెంటనే అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అతి కష్టంపై అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్, కోర్బా, ముంగేలి, గరియాబంద్, రాయ్‌పుర్, దుర్గాంద్ ధంతారి జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి: ప్రేమ పెళ్లి.. పది నెలలకే ఊహించని దారుణం!
Comments
Please login to add a commentAdd a comment