chattisghar
-
ఇదెక్కడి క్రేజ్ రా అయ్యా.. పుష్పరాజ్ దెబ్బకు ట్రాఫిక్ జామ్!
అల్లు అర్జున్ పుష్ప-2 థియేటర్లను షేక్ చేస్తోంది. ఈ నెల 5న మొదలైన పుష్పరాజ్ బాక్సాఫీస్ విధ్వంసం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే కలెక్షన్ల పరంగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప-2 కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్‌ను చేరుకుంది. అంతేకాకుండా హిందీలో ఎప్పుడు లేనివిధంగా రికార్డులు తిరగరాస్తోంది. కేవలం 12 రోజుల్లోనే రూ.582 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా సెకండ్ వీకెండ్లో రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన తొలిచిత్రంగా నిలిచింది.ఈ వసూళ్లు చూస్తే చాలు హిందీలో పుష్పరాజ్ క్రేజ్ ఏంటో తెలిసిపోతుంది. రెండోవారంలో ఆదివారం థియేటర్ల వద్ద ఏకంగా ఆడియన్స్‌ను చూస్తే ఏకంగా జాతరను తలపించింది. అయితే అది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో పుష్ప-2 థియేటర్ వద్ద ఇసుకెస్తే రాలనంత జనం వచ్చారు. టికెట్స్ కౌంటర్ వద్ద మాస్ జాతర కనిపించింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకు ఏకంగా థియేటర్ ముందు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. ఇదంతా ఓ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. అత్యంత వేగంగా వెయ్యి కోట్ల మార్కు అందుకున్న ఘనతను ఇప్పటికే సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి భారీ సినిమాల అల్ టైమ్ వసూళ్లను అధిగమించింది. ఇప్పటికే రూ.1409 కోట్లకు వసూళ్లతో రెండు వేల కోట్ల మార్క్ దిశగా పుష్పరాజ్ దూసుకెళ్తున్నాడు. ఇదే జోరు కొనసాగితే ఈ వీకెండ్లోనే రూ.2000 వేల కోట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. #Pushpa2 నిన్న ఆదివారం Raipur లో థియేటర్ లో టికెట్ల కోసం క్యూ... తెలుగు సినిమా 💪❤️ pic.twitter.com/amyUAvmoGf— Rajesh Manne (@rajeshmanne1) December 16, 2024 -
చత్తీస్ ఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-
Chattisgarh: బీజేపీ నేత దారుణ హత్య
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బీజేపీ నేతను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘాతుకానికి పాల్పడింది మావోయిస్టులు అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జన్‌పడ్ పంచాయతీ సభ్యుడైన బీజేపీ నేత కట్ల తిరుపతి శుక్రవారం రాత్రి బీజాపూర్ జిల్లాలోని టోయనార్ గ్రామంలో ఓ పెళ్లికి హాజరయ్యారు. కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి వెళుతుండగా కొందరు వ్యక్తులు పదునైన ఆయుధంతో అతడిని పొడిచి చంపారని బీజాపూర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) జితేంద్ర యాదవ్ తెలిపారు. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లినపుడు అక్కడ మృతి చెందినట్లు చెప్పారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీకి చెందిన నేత హత్యకు గురవడం గత సంవత్సర కాలంలో ఇది ఏడోసారి కావడం కలకలం రేపుతోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో నారాయణ్‌పూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు రతన్‌దూబేను మావోయిస్టులు హత్య చేశారు. ఇదీ చదవండి.. జార్ఖండ్‌లో స్పెయిన్ యువతిపై దారుణం -
మావోయిస్టులపై కేంద్రం ఫోకస్.. దద్దరిల్లిన దండకారణ్యం!
సాక్షి, రాయ్‌పూర్: మావోయిస్టుల ఏరివేతపై కేంద్ర హోం శాఖ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్ పతాకస్థాయికి చేరింది. ఈ క్రమంలో బలగాల కూంబింగ్‌లో ఛత్తీస్‌గఢ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉలికిపాటు మొదలైంది. వివరాల ప్రకారం.. మావోయిస్ట్ ఏరివేత కార్యక్రమాలను కేంద్ర హోంశాఖ తీవ్రతరం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్ కొనసాగుతోంది. నారాయణపూర్‌లో కేంద్ర బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. పీఎల్జీఏ స్థావరం అబూజ్మడ్ను చుట్టుముట్టేందుకు బీఎస్ఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్కు చెందిన పదివేల మందితో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా, ఇటీవలే జోసెఫ్ (దర్శన్ పాల్), సంజీత్ (అర్జున్ ప్రసాద్ సింగ్)ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల మూలంగా భారత్ కమ్యూనిస్ట్ మావోయిస్ట్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి సహకారంతో అబూజ్మడ్ను ముట్టడించే కార్యక్రమానికి కేంద్ర భద్రతా వర్గాలు రెడీ అయ్యాయి. ఇక, తాజాగా కూంబింగ్‌తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంథని తూర్పు డివిజన్ ఉలిక్కిపడింది. ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. -
చత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
సుక్మా: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గోగుండా ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, దంతెవాడ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ 2వ బెటాలియన్, సీఆర్పీఎఫ్ 111 బెటాలియన్లు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. ఈ కూంబింగ్‌లో భద్రతా బలగాలకు, మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఎదురు కాల్పుల్లో నలుగు మావోయిస్టుల మృతి చెందినట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఘటనా స్థలంలో గాయపడిన మరికొంత మంది మావోయిస్టులును చుట్టుముట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఆర్పీఎఫ్ డీఐజీ అరవింద్ రాయ్ తెలిపారు. చదవండి: Temple Vandalised: భారత్ స్ట్రాంగ్ రియాక్షన్ -
చెట్లపై మంచు ముత్యాలు.. వీధుల్లో చలిమంటలు!
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ జిల్లాలో చలిగాలులు స్థానికులను గజగజా వణికిస్తున్నాయి. తీవ్రమైన చలికి తోడు విపరీతంగా మంచు కురుస్తుండటంతో మొక్కలు, చెట్లు మంచుతో నిండిపోతున్నాయి. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. చలి తీవ్రత దృష్ట్యా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సామాన్యుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ కూడళ్లు, జనావాసాల వద్ద చలి మంటలు వెలిగించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుందన్‌కుమార్ జిల్లా మున్సిపల్ ముఖ్య అధికారులు, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారులను ఆదేశించారు. గత కొన్ని రోజులుగా అంబికాపూర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు నిరంతరం పడిపోవడానికితోడు, చలిగాలులు చుట్టుముడుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. చలి మంటలు వేసేందుకు కలప వినియోగాన్ని తగ్గించాలని, పేడ పిడకలను ఉపయోగించాలని సూచించారు. చలిగాలుల విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కోరారు. అవసరమైన సందర్భంలో వైద్యులను సంప్రదించాలని సలహా ఇచ్చారు. ఇది కూడా చదవండి: 2023.. భారత్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే.. -
ప్రభుత్వం మారగానే సీఎం కార్లకు కొత్త నంబర్లు!
ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం మారిన వెంటనే పాలనలో అనేక మార్పులు మొదలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ఒక వాహనానికి గల బీబీ-0023 అనే నంబర్ ప్లేటును తొలగించారు. దీనిలో బీబీ అంటే అంటే భూపేష్ బఘేల్ (మాజీ ముఖ్యమంత్రి). అలాగే 23 అతని పుట్టినరోజు. దీని ప్రకారం నంబర్ ప్లేటును బీబీ-0023గా రూపొందించారు. ముఖ్యమంత్రి సచివాలయం అందించిన మార్గదర్శకాల ప్రకారం ఈ నంబర్ ప్లేట్ మార్చారు. నూతన సీఎం విష్ణు దేవ్ సాయి కారుకు వచ్చిన కొత్త నంబర్ సీజీ-03-9502. గతంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో సీజీ-02 నంబర్ ఉండేది. మాజీ సీఎం బఘేల్ తన కాన్వాయ్‌లో ఉన్న వాహనాలకు ప్రత్యేక నంబర్‌ను తీసుకున్నారు. ఇప్పుడు ఆ నంబర్లను సమూలంగా మార్చారు. అంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తన కాన్వాయ్‌లో ఉన్న వాహనాలను కూడా మార్చారు. నాడు సీఎం తన కాన్వాయ్‌లోని మిత్సుబిషి పజెరో వాహనాన్ని తొలగించారు. ఛత్తీస్‌గఢ్‌లో సీజీ-01, సీజీ-02, సీజీ-04 రిజిస్ట్రేషన్‌ను రాయ్‌పూర్ ఆర్టీఓ పర్యవేక్షిస్తుండగా, సీజీ-03 రిజిస్ట్రేషన్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జరగడం గమనార్హం. ఇది కూడా చదవండి: ‘నిర్భయ’కు 11 ఏళ్లు... మహిళల భద్రతకు భరోసా ఏది? -
కిడ్నీ దానంతో భర్త ప్రాణాలు కాపాడిన భార్య!
వివాహమైన తరువాత ఒకరికి ఒకరు అనే విధంగా, ప్రాణంలో ప్రాణంగా కలిసిమెలసి జీవించేవారే నిజమైన భార్యాభర్తలు. ఇలాంటివారిలో ఒకరికి ఏదైనా కష్టం వస్తే మరొకరు తల్లడిల్లిపోతారు. అలాంటి పరిస్థితిలో అవతలి వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం అవుతారు. ఛత్తీస్‌గఢ్‌లోని బతౌలీలో భర్త కోసం భార్య చేసిన త్యాగం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే బతౌలీలోని భారత్ మాతా చౌక్ నివాసి, హార్డ్‌వేర్ దుకాణం నిర్వాహకుడు ఆయుష్ అగర్వాల్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో అతని భార్య తన కిడ్నీని దానం చేసి భర్త ప్రాణాలను నిలబెట్టింది. ఈ కిడ్నీ మార్పిడి చికిత్స తర్వాత ఆయుష్ అగర్వాల్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఆయుష్ అగర్వాల్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ప్రతి 15 రోజులకోసారి డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చేది. వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని ఆయుష్కు సూచించారు. అయితే నిబంధనల ప్రకారం రక్త సంబంధీకుల నుంచి మాత్రమే కిడ్నీ తీసుకోవలసి ఉంటుంది. అతని భార్య నిషా అగర్వాల్ తన కిడ్నీని భర్తకు దానం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆయుష్ అగర్వాల్ ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్నారు. మొరుగైన వైద్యం కోసం వైద్యుల పర్యవేక్షణలో నాలుగు నెలల ఉన్నారు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో భార్యాభర్తలిద్దరూ ముంబై నుంచి తిరిగి బతౌలీ చేరుకున్నారు. త్వరలోనే తిరిగి తన వ్యాపారాన్ని ప్రారంభించనున్నానని ఆయుష్ తెలిపారు. తన భార్య తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిందని ఆనందంగా తెలిపారు. భర్తకు కిడ్నీని దానం చేసిన నిషా అగర్వాల్ అభినందనీయురాలని వైద్యులు కొనియాడారు. ఇది కూడా చదవండి: మంచుకురిసే వేళలో.. వాతావరణశాఖ హెచ్చరికలు! -
3 రాష్ట్రాల్లో సీఎం ఎంపికపై బీజేపీ ఫోకస్
-
ఛత్తీస్‌గఢ్ సీఎం ఎవరు? నేటితో చర్చలకు తెర?
ఛత్తీస్‌గఢ్‌కు నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపిక అవుతారనేదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. సీఎం ఎంపికకు బీజేపీ పరిశీలకులను నియమించింది. ఈ నేపధ్యంలో నేడు (ఆదివారం) శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో సీఎం పేరు ఖరారు కావచ్చని భావిస్తున్నారు. అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ గౌతమ్‌లను బీజేపీ ఛత్తీస్‌గఢ్ పరిశీలకులుగా నియమించింది. రాష్ట్ర ఇన్చార్జి ఓం మాథుర్, రాష్ట్ర కో-ఇన్చార్జ్ నితిన్ నబిన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా సింగ్, కేంద్ర మాజీ మంత్రి విష్ణుదేవ్ సాయి, రాంవిచార్ నేతమ్, అరుణ్ సావో, ఓపీ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక కోసం బీజేపీ పరిశీలకులను ప్రకటించింది. వీరు ఎమ్మెల్యేలతో చర్చలు సాగించి సీఎం పేర్లను ప్రకటిస్తారు. అనంతరం మూడు రాష్ట్రాలలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు. కాగా మూడు రాష్ట్రాల్లో జరిగే ప్రమాణస్వీకారోత్సవాలు జరిగే తేదీలపై చర్చ పార్టీలో జరుగుతోంది. ఇది కూడా చదవండి: అందరికీ ‘రామ్ రామ్’ -
ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు ఊహించని ఫలితం!
ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈసారి 90 స్థానాలకు గాను 54 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ 35 సీట్లకే పరిమితమయ్యింది. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్ ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సాజా స్థానం నుంచి ఏడు సార్లు కాంగ్రెస్ తరపున పోటీ చేసి, ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి రవీంద్ర చౌబేపై బీజేపీ అభ్యర్థి ఈశ్వర్ సాహు విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతర జిల్లా సాజా అసెంబ్లీ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలో ఈశ్వర్ సాహు కుమారుడు మృతి చెందాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈశ్వర్ సాహుకు బీజేపీ టికెట్ ఇచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి రవీంద్ర చౌబేని కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దింపింది. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈశ్వర్ సాహు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. తన కుమారుడి మృతితో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పినా ఈశ్వర్ సాహు ఆ సాయం తీసుకోలేదు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు భువనేశ్వర్ సాహును బీరాన్‌పూర్, బెమెతారాలో జిహాదీల వర్గం హత్య చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు. ఈ నేపధ్యంలో అతని తండ్రి ఈశ్వర్ సాహుకు ‘సాజా’ స్థానం నుండి పోటీ చేసేందుకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఇది కూడా చదవండి: పొత్తు లేకనే కాంగ్రెస్ చిత్తు?.. ఇండియా అలయన్స్ నేతలు ఏమంటున్నారు? -
హ్యాట్రిక్‌కు గ్యారంటీ
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన హ్యాట్రిక్ విజయం.. 2024 ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల్లో సాధించబోయే హ్యాట్రిక్‌కు గ్యారంటీ అని ప్రధాని మోదీ అభివరి్ణంచారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో పార్టీ ఘన విజయం తర్వాత ఆదివారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ వందలాది మంది పార్టీ శ్రేణులనుద్దేశిస్తూ ప్రసంగించారు. ‘‘ మూడు రాష్ట్రాల్లో కలిపి హ్యాట్రిక్ సాధించాం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించబోయే హ్యాట్రిక్ గెలుపునకు ఈరోజు విజయం గ్యారంటీని ఇస్తోంది. ఇది చక్కని సంకేతం. ఈ ఫలితాలు అహంకార ‘ఇండియా’ కూటమికి గట్టి హెచ్చరిక. ఆత్మనిర్భరత, పారదర్శక, సుపరిపాలన భారత్‌ను కాంక్షించే బీజేపీ ఎజెండాకు ఈ గెలుపు మద్దతుగా నిలిచింది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమి ఏర్పాటు సందర్భంగా గతంలో విపక్షాల అగ్రనేతలు గ్రూప్ ఫొటో దిగటాన్ని మోదీ ఈ సందర్భంగా ఎద్దేవాచేశారు. ‘‘ స్టేజీ మీద వారసత్వ నాయకులంతా ఒక్క చోటకు చేరితే మంచి ఫొటోలు దిగగలరు. కానీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని మాత్రం గెలుపొందలేరు. ఈ ఫలితాలు కాంగ్రెస్, దాని గర్విష్ఠి కూటమికి పెద్ద గుణపాఠం నేర్పాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచదేశాల నమ్మకాన్ని పెంచుతోంది మోదీ సర్కార్ ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి తెచ్చి తమ నేతలపై తప్పుడు అవినీతి కేసులను బనాయిస్తోందంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను మోదీ ప్రస్తావించారు. ‘ అవినీతికి వ్యతి రేకంగా మేం చేస్తున్న పోరాటానికి ప్రజలు ఈ ఫలితాల రూపంలో మాకు మద్దతు పలికారు. అవినీతిలో మునిగిన పారీ్టలకు ఓటర్లు ఈ ఫలితాల రూపంలో వారి్నంగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధికి, ప్రజలకు మధ్య మరెవరూ రాలేరు. ఎవరైనా వచ్చేందుకు ప్రయత్నిస్తే ఓటర్లు ఇలాగే తీసి పక్కనపడేస్తారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలకు నాదో విన్నపం. దేశాభివృద్ధి ఊపందుకున్న ఈ తరుణంలో దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాజకీయాలు చేయొద్దు. దేశాన్ని విభజించే, విచి్ఛన్నం చేసే శక్తులతో జట్టుకట్టొద్దు’’ అని హితవు పలికారు. ‘‘ఇలాంటి సందర్భాల్లో దేశ వ్యతిరేక శక్తులు ఏకమయ్యేందుకు కష్టపడుతుంటాయి. అదను కోసం ఎదురుచూస్తుంటాయి. ఇలాంటి వారితో జాగ్రత్త’ అంటూ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. ‘ఈ గెలుపు భారత్‌పై ప్రపంచదేశాలు పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెంచుతుంది. ఇది భారత్‌లో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ‘అభివృద్ధి చెందిన భారత్’ సాకారం కోసం మనం చేపడుతున్న ఎజెండాకు ప్రజా మద్దతుకు లభిస్తోందని ఈ ఫలితాలు చాటుతున్నాయి. దేశంలో చక్కటి మెజారిటీతో అధికారంలోకి వచ్చే సుస్థిర ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారన్న విషయాన్ని ప్రపంచదేశాలు కళ్లారా చూశాయి’’ అని మోదీ అన్నారు. ఈ భూతాలను బీజేపీయే తరిమికొట్టగలదు ‘అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందని ఈ ఫలితాల ద్వారా ప్రజలు తీర్పు చెప్పారు. అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలనే ఈ మూడు భూతాలను తరిమికొట్టే సత్తా ఒక్క బీజేపీకే ఉందని యావత్ భారతదేశమే భావిస్తోంది. అవినీతి భరతం పట్టే బీజేపీకి ఇప్పటికే దేశవ్యాప్త మద్దతు దక్కుతోంది. అవినీతితో అంటకాగే నేతలకు ఇది సూటి హెచ్చరిక. అవినీతిపరులకు రక్షణగా ఉండే వ్యక్తులు, తప్పులను దాచిపెట్టే వ్యక్తులే దర్యాప్తు సంస్థల ప్రతిష్టను దిగజార్చేలా ఆరోపణలు గుప్పిస్తున్నారు. వాళ్లొకటి గమనించాలి. అవినీతి వ్యతిరేక పోరాటానికి ప్రజా మద్దతు ఉందని ఈ ఎన్నికల ఫలితాలను చూసైనా ఈ వ్యక్తులు అర్ధం చేసుకోవాలి’’ అని విపక్షాలను పరోక్షంగా విమర్శించారు. ఆ కులాల సాధికారత దేశ సాధికారత ‘‘దేశంలో మహిళలు, యువత, పేదలు, రైతులు అని దేశంలో నాలుగే పెద్ద కులాలున్నాయి. ఈ కులాలు సాధికారత సాధించిననాడే దేశ సాధికారత సాధ్యపడుతుంది. దేశంలో దాదాపు అన్ని ఓబీసీ వర్గాలు, షెడ్యూల్డ్ తెగల వారంతా ఈ నాలుగు వర్గాల్లోనే ఉన్నారు. బీజేపీ తమ విధాన నిర్ణయాలు, పథకాల ద్వారా వీరి సాధికారతకు కృషిచేస్తోంది. ఈ ఫలితాలొచ్చాక మేం గెలిచామని ప్రతి ఒక్క రైతు, యువజన ఓటరు, పేద, అణగారిన వర్గాల వ్యక్తులు గొంతెత్తి నినదిస్తున్నారు. గొప్ప భవిష్యత్తు కోసం యువత కలలు కంటోంది. ఈ రోజు ఫలితాలు చూశాక 2027కల్లా అభివృద్ధిచెందిన భారత్ సాకారం అవుతుందని ప్రతి ఒక్క పౌరుడు భరోసాగా ఉన్నాడు. నిజాయితీగా ఒక్కటి చెప్పదలుచుకున్నా. మీ స్వప్నం సాకారమవ్వాలనేదే నా సంకల్పం. ప్రపంచంలో భారత ఆర్థికాభివృద్ధి దూసుకుపోతూ దేశ మౌలికరంగ ముఖచిత్రాన్ని మార్చేస్తోంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ స్వప్నాలు సాకారం కావాలనుకునే ప్రతి ఒక్కరూ మోదీనే ఎంచుకుంటారు’’ అని రాసి ఉన్న భారీ కటౌట్‌ను బీజేపీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. -
ఈసారి ఛత్తీస్‌గఢ్ సీఎం ఎవరు..? సీనియర్ కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే రానుందని ఎగ్జిట్ పోల్స్ ప్రెడిక్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి సీఎం ఎవరనేదానిపై రాష్ట్రంలోని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయమై సీనియర్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్‌దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడం సంతోషంగా ఉంది. అయితే ఈసారి మేం అటు ఇటుగా 60 సీట్లతో అధికారంలోకి రాబోతున్నాం. సీఎం ఎవరనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. హై కమాండ్ నిర్ణయించిన వ్యక్తిని సీఎంగా ఏకగగ్రీవంగా ఎన్నుకుంటాం. రెండున్నరేళ్ల పవర్ షేరింగ్ లాంటి ప్రతిపాదనలేవీ లేవు’ అని సింగ్ దేవ్ చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్ సింగ్ దేవ్ సీఎం పదవి కోసం పోటీపడ్డారు. అయితే భూపేష్ భగేల్‌ను ఆ పదవి వరించింది. ఈ ఏడాది జూన్ దాకా క్యాబినెట్ మంత్రిగా ఉన్న సింగ్‌దేవ్‌ను జూన్‌లో డిప్యూటీ సీఎంగా నియమించారు. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రానుందన్న అంచనాల నేపథ్యంలో సింగ్ దేవ్ మళ్లీ సీఎం రేసులోకి రావడం విశేషం. #WATCH | On CM face, Chhattisgarh Dy CM and Congress leader T S Singh Deo says, "...In the last five years, our experience related to two and a half years was not good... We decided unanimously that what the high command decides is final... We do not want speculation, as it… pic.twitter.com/txIJ0QROvc — ANI (@ANI) December 1, 2023 ఇదీచదవండి..ఆ ఆటలన్నీ ఆడాం: టన్నెల్ వర్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్: ఇప్పటి వరకు ఎంత శాతమంటే?
Updates.. మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.. 11 గంటల వరకు పోలింగ్ ఇలా.. ►ఛత్తీస్‌గఢ్‌లో 22.97 శాతం పోలింగ్ ►మిజోరంలో 26.43 శాతం పోలింగ్ నమోదు 22.97% voter turnout recorded till 11 am in Chhattisgarh and 26.43% in Mizoram. #ChhattisgarhElections2023 #MizoramElection2023 pic.twitter.com/xKeNXk3etK — ANI (@ANI) November 7, 2023 ప్రజల కోసమే కాంగ్రెస్.. ►ఎన్నికల పోలింగ్ సందర్బంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ మాట్లాడుతూ.. ఐదేళ్లలో మేం చేసిన పనితో నక్సలిజం చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఫలితంగా గ్రామాల్లోనే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు.. ప్రజలు తమ గ్రామంలోనే ఓటు వేస్తారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వీటన్నింటి ప్రస్తావన ఉంది. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎప్పుడూ సామాన్య ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. #WATCH | Chhattisgarh Elections | CM and Congress leader Bhupesh Baghel says, "Naxalism has retreated to a great extent with the work we have done in 5 years. As a result, polling booths have been set up inside villages. People will vote in their village itself. There is a… pic.twitter.com/Lg01Hlushn — ANI (@ANI) November 7, 2023 ఉదయం తొమ్మిది గంటల వరకు పోలింగ్ ఇలా.. ►ఛత్తీస్‌గఢ్‌లో 9.93 శాతం ►మిజోరంలో 12.80 శాతం పోలింగ్ నమోదు 9.93% voter turnout recorded till 9 am in Chhattisgarh and 12.80% in Mizoram. #ChhattisgarhElections2023 #MizoramElection2023 pic.twitter.com/XkG5JYHGpp — ANI (@ANI) November 7, 2023 23ఏళ్ల తర్వాత పోలింగ్ ►సుక్మాలోని నక్సల్స్ ప్రభావిత కరిగుండం ప్రాంతంలో 23 ఏళ్ల తర్వాత ఓటింగ్ జరుగుతోంది. సీఆర్పీఎఫ్ 150 బెటాలియన్, జిల్లా బలగాల భద్రతతో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. #WATCH | Chhattisgarh Elections | Sukma: Voting being held in naxal-affected Karigundam area after 23 years. The polling process is being held under the security cover by CRPF 150 Battalion and District Force. (Video Source: CRPF 150 Battalion) pic.twitter.com/pk2tfpUs86 — ANI (@ANI) November 7, 2023 ► ఛత్తీస్‌గఢ్‌లో సుక్మా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు. #WATCH | Voters stand in a queue outside a polling booth in the Sukma Assembly Constituency to cast their votes for the Chhattisgarh Assembly elections 2023. pic.twitter.com/7OVHn0cCEl — ANI (@ANI) November 7, 2023 #WATCH | Chhattisgarh elections | Voters queue up outside a polling booth in Kondagaon as they await their turn to cast a vote in the first phase of Assembly elections.#ChhattisgarhElection2023 pic.twitter.com/p699iWnbpT — ANI (@ANI) November 7, 2023 ►ఓటు వేసిన మిజోరం గవర్నర్ హరిబాబు కంభంపాటి. ఐజ్వాల్‌లోని సౌత్-2 పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. #WATCH | Mizoram Governor Hari Babu Kambhampati casts his vote at a polling booth in Aizawl South - II. #MizoramElections2023 pic.twitter.com/wDjBQVlLRt — ANI (@ANI) November 7, 2023 ఈ సందర్బంగా గవర్నర్ హరిబాబు కంభంపాటి మాట్లాడుతూ.. మిజోరం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం, అక్షరాస్యత శాతం చాలా ఎక్కువ. ప్రజలు కూడా తమ హక్కుల గురించి తెలుసుకుంటారు. మిజోరాం ప్రజలందరూ ఓటు వేసి ఎన్నికల్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మిజోరంలో ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా ఉంది. ఈసారి కూడా చాలా ఎక్కువ శాతం ఉంటుందని నేను భావిస్తున్నాను. #WATCH | Mizoram Governor Hari Babu Kambhampati says, "Mizoram is a literate state, literacy rate is very high. People are also aware of their rights. I appeal to all the people of Mizoram to vote and participate in the election and strengthen democracy...I think in Mizoram,… https://t.co/A4GElwDrcR pic.twitter.com/ckV4Cronb6 — ANI (@ANI) November 7, 2023 ►ఓటు వేసిన మిజోరం కాంగ్రెస్ చీఫ్ లాల్సావ్తా ఓటు వేశారు. ఐజ్వాల్‌లోని మిషన్ వెంగ్తలాంగ్ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | State Congress chief Lalsawta says, "...We are confident that we can form the Government...This constituency is difficult to predict but I think we will come on top...We have already considered the possibility of securing 22 seats."#MizoramElections2023 https://t.co/T2jK0jh3Ft pic.twitter.com/wX8kam8lHl — ANI (@ANI) November 7, 2023 ఛత్తీస్‌గఢ్‌లో ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి కేదార్ కశ్యప్ ►ఓటు హక్కు వినియోగించుకున్న నారాయణపూర్ బీజేపీ అభ్యర్థి కేదార్ కశ్యప్.. భాన్‌పురి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ 212లో ఓటు వేశారు. #WATCH | BJP candidate from Narayanpur, Kedar Kashyap casts his vote for the Chhattisgarh Assembly Elections 2023 at polling booth number 212 in Bhanpuri Assembly Constituency. pic.twitter.com/cbh8FejMRI — ANI (@ANI) November 7, 2023 ►ఈ సందర్భంగా కేదార్ కశ్యప్ మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ గెలుపు ఖాయం. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓటు వేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు. బీజేపీకి ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ►ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిజోరంలో హంగ్ వచ్చే ప్రసక్తే లేదు. ఇక్క ఎంఎన్ఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. మెజార్టీపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. మిజోరంలో మేము చాలా అభివృద్ధి పనులు చేశాం. నేను ఓటు వేసిన సందర్బంగా ఈవీఎం పనిచేయలేదు. నేను కాసేపట్లో మళ్లీ ఓటు వేస్తాను. మిజోరంలో మ్యాజిక్ ఫిగర్ 21. కానీ, 25 స్థానాల్లో మేము గెలుస్తాం. #WATCH | Mizoram elections | CM and MNF president Zoramthanga says, "In order to form the Government, 21 seats are needed. We hope that we will be able to get more than that, maybe 25 or more. I believe that we will have a comofortable majority." pic.twitter.com/PozWwno2v5 — ANI (@ANI) November 7, 2023 ►ఈ క్రమంలో ఈవీఎం మొరాయించడంతో ఆయన ఓటు వేయలేకపోయారు. #WATCH | Mizoram elections | CM and MNF president Zoramthanga could not cast a vote; he says, "Because the machine was not working. I was voting for some time. But since the machine could not work I said that I will visit my constituency and vote after the morning meet." https://t.co/ytRdh7OpKe pic.twitter.com/f8uJdUUUrL — ANI (@ANI) November 7, 2023 ►ఓటు వేసిన మిజోరం సీఎం జోరంతంగా #WATCH | Chief Minister of Mizoram Zoramthanga casts his vote for the Mizoram Assembly Elections 2023 at 19-Aizawl Venglai-I YMA Hall polling station under Aizawl North-II assembly constituency. pic.twitter.com/w3MdGFLWme — ANI (@ANI) November 7, 2023 ►మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐజ్వాల్ వెంగలై-1 ఐఎంఏ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ►మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశలో పోలింగ్ ప్రారంభమైంది. Voting for Mizoram Assembly Elections 2023 begins. pic.twitter.com/qufBy3nlal — ANI (@ANI) November 7, 2023 Voting for the first phase of Chhattisgarh Assembly Elections 2023 begins. Twenty of the 90 assembly seats will be voting in the first phase of polls. Over 40 lakh electors will vote across 5,304 polling stations in the first phase. pic.twitter.com/HTHM9J39nj — ANI (@ANI) November 7, 2023 ►మిజోరం అసెంబ్లీకి నేడు జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) మధూప్ వ్యాస్ చెప్పారు. అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 8.57 లక్షల ఓటర్లకుగాను 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ►149 పోలింగ్ కేంద్రాలు మారుమూల ప్రాంతాల్లోనూ, మరో 30 కేంద్రాలు, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉన్నాయని చెప్పారు. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రంతో ఉన్న మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేశారు. వీటితోపాటు రాష్ట్రంతో ఉన్న అస్సాంలోని మూడు జిల్లాలు, మణిపూర్‌లోని రెండు, త్రిపురలోని ఒక జిల్లా సరిహద్దులను మూసివేశారు. భద్రతా విధుల్లో మూడు వేల మంది పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సేవలను వినియోగించుకుంటున్నారు. #WATCH | Aizawl: Preparations underway at the polling booth for the Mizoram Assembly Elections 2023 Voting for Mizoram Assembly Elections 2023 is to begin at 7 am today. (Visuals from 19-Aizawl Venglai-I YMA Hall polling station under Aizawl North-II assembly constituency.) pic.twitter.com/VPcOul2j4C — ANI (@ANI) November 7, 2023 ►ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు సిద్ధమైంది. అసెంబ్లీలోని 90 స్థానాలకు గానూ 20 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. తొలి దశలో పోలింగ్ జరుగనున్న ఈ 20 స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచిన 223 మంది అభ్యర్థుల్లో 25 మంది మహిళలున్నారు. తొలిదశలో మొత్తం 5,304 పోలింగ్ కేంద్రాల్లో 40.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. #WATCH | Rajnandgaon, Chhattisgarh: Preparations underway as voting for the first phase of #ChhattisgarhElections2023 to begin at 8 am today; visuals from Booth No - 96 Wesleyan English Medium School, Rajnandgaon. pic.twitter.com/vjMBeamlxN — ANI (@ANI) November 7, 2023 ►మొత్తం 5,304 పోలింగ్ స్టేషన్లకు గాను 25,429 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) చెప్పారు. పది నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మరో 10 నియోజకవర్గాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. మొదటి విడత పోలింగ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం బస్తర్‌లోని 12 నియోజకవర్గాల్లో జరగనున్నందున అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. వీరిలో 40 వేల మంది కేంద్ర సాయుధ రిజర్వు బలగా(సీఏపీఎఫ్)లున్నాయి. #WATCH | Aizawl: Preparations underway at the polling booth for the Mizoram Assembly Elections 2023 Voting for Mizoram Assembly Elections 2023 is to begin at 7 am today. (Visuals from 19-Aizawl Venglai-I YMA Hall polling station under Aizawl North-II assembly constituency.) pic.twitter.com/VPcOul2j4C — ANI (@ANI) November 7, 2023 ►తొలిదశలో బరిలో ఉన్న అభ్యర్థులలో బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్‌సింగ్‌తో పాటు ఆయన మంత్రివర్గంలో పనిచేసిన ఐదుగురు మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుత కేబినెట్లోని ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీ సహా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్‌లు బరిలో ఉన్నారు. తొలిదశలోని 20 స్ధానాల్లో ముఖ్యంగా చిత్రకోట్, రాజ్‌నంద్‌గావ్, కవర్ధా, కొండగావ్, కొంటా, కేశ్కాల్, నారాయణ్‌పూర్, బిజాపూర్, అంతాగఢ్, దంతెవాడ నియోజకవర్గాలపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. #WATCH | Chhattisgarh: Preparations, mock poll underway as voting for the #ChhattisgarhElections2023 to begin at 7 am today; visuals from a polling booth in Kondagaon. pic.twitter.com/CS6QJsQmBB — ANI (@ANI) November 7, 2023 ►రాజ్‌నంద్‌గావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ మాజీ సీఎం రమణ్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గిరీష్ దేవాంగన్‌ల మధ్య నెలకొంది. రాజ్‌నంద్‌గావ్ అసెంబ్లీ సీటు రమణ్ సింగ్‌కు బలమైన కోటగా పరిగణిస్తారు. 2008 నుంచి 2018 వరకు ఈ స్థానం నుంచి గెలుపొందారు. రమణ్‌సింగ్‌కు పోటీగా కాంగ్రెస్ సీనియర్ నేత గిరీష్ దేవాంగన్‌ను ఇక్కడి నుంచి పోటీకి దింపింది. చిత్రకోట్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి వినాయక్ గోపాల్ దీపక్‌కు సవాల్ విసిరారు. #WATCH | Chhattisgarh: Preparations, mock poll underway as voting for the first phase of #ChhattisgarhElections2023 will begin at 7 am today in Konta Assembly constituency of Sukma district. pic.twitter.com/LvoZgOttBv — ANI (@ANI) November 7, 2023 #WATCH | Chhattisgarh: Preparations, mock poll underway as voting for the first phase of #ChhattisgarhElections2023 will begin at 7 am today in Jagdalpur Assembly Constituency of Bastar district. pic.twitter.com/von3Pvi1qu — ANI (@ANI) November 7, 2023 -
ఈడీ, ఐటీలతో కలిసి బీజేపీ పోటీ : ఛత్తీస్‌గఢ్ సీఎం
రాయ్‌పూర్ : బీజేపీని ఈ నెల 17 దాకా ఎంజాయ్ చేయనివ్వండని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్ చమత్కరించారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ లో వచ్చిన ఆరోపణలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశలపై ఏమైనా ప్రభావం చూపుతాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు భగేల్ నవ్వుతూ సమాధానమిచ్చారు. బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం లేదని తన మిత్రులు ఈడీ, ఐటీలతో కలిసి పోటీ చేస్తోందని భగేల్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముందు తమ ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ తెర మీదకు తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న విషయంలో ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అవసరమైతే పార్టీ తరపున ఫిర్యాదు చేస్తామన్నారు. ఈసీ ఈ విషయంలో విచారణ జరపాలని కోరారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్ మంగళవారం జరగనుంది. రెండవ విడత పోలింగ్ ఈ నెల 17న నిర్వహిస్తారు. -
ముగిసిన ప్రచారం.. అక్కడ రేపే పోలింగ్
ఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో రేపు(మంగళవారం) ఈశాన్య రాష్ట్రం మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో పోలింగ్ జరుగనుంది. మిజోరంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. దీంతో, ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్ ప్రభావిత బస్తర్ డివిజన్లోని ఏడు జిల్లాలు, మరో నాలుగు ఇతర జిల్లాల్లో ఈ 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 25 మంది మహిళలతో పాటు మొత్తం 223 మంది అభ్యర్థులు తొలి విడత బరిలో ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉన్నదని సర్వేలు చెప్తున్నాయి. తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న 20 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లను కైవసం చేసుకుంది. కాగా, రెండో విడుతలో 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరుగనుంది. మరోవైపు.. మిజోరంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. మొత్తం 8.57 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించనున్నారు. ఎన్నికల్లో 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతఃరాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దుల్లోని దాదాపు 30 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. బంగ్లాదేశ్, మయన్మార్‌తో సరిహద్దులు పంచుకొనే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మొత్తంగా 3 వేల మంది పోలీసు సిబ్బంది, 5,400 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించామని తెలిపారు. VIDEO | Mizoram elections 2023: EVMs being dispatched to various polling booths in Aizawl. Polling for 40 assembly constituencies will take place in Mizoram on November 7.#AssemblyElectionsWithPTI #MizoramElections2023 pic.twitter.com/Bo8CmO0o5e — Press Trust of India (@PTI_News) November 6, 2023 మూడు పార్టీల ముమ్మర ప్రచారం మిజోరంలో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), ప్రతిపక్ష కాంగ్రెస్, జోరం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నది. అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు ఎంఎన్ఎఫ్ ముమ్మర ప్రచారం చేసింది. అటు మిజోరంలో గత రెండు పర్యాయాలుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్నది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించిన జెడ్పీఎం పార్టీ ఈసారి ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా నిలిచి, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఉంది. #Chhattisgarh: Ahead of Assembly elections, polling teams leave by helicopter to #Naxal-hit areas, in Sukma The first phase of voting for #ChhattisgarhElections2023 will be held on November 7.#lokmat #lokmattimes #Elections2024 #AssemblyElection2024 #voting pic.twitter.com/yDRqGx6Xjg — Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) November 4, 2023 ఇది కూడా చదవండి: అవినీతిపరులంతా బీజేపీలోకే: కేజ్రివాల్ -
ప్రచారంలో బీజేపీ స్పీడ్.. కాంగ్రెస్‌పై సీఎం యోగి ఫైర్..
రాయ్‌పూర్: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సమయం సమీపిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పార్టీలు ఫుల్ బిజీగా ఉన్నాయి. మరోవైపు.. నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. అక్కడ బీజేపీ తరఫున యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా కవార్ధాలో బీజేపీ సభలో సీఎం యోగి మాట్లాడుతూ..‘ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొనసాగుతోంది. అక్కడ లవ్ జిహాద్ పూర్తిగా నిషేధం. దీనికి వ్యతిరేకంగా చట్టం చేశాం. ఛత్తీస్‌గఢ్‌లో కూడా లవ్ జిహాద్, గోవుల అక్రమ రవాణా, మైనింగ్ మాఫియాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వచ్చే ఎన్నికల్లో మీరు కాంగ్రెస్‌ను ఇంటికి పంపి.. బీజేపీని గెలిపిస్తేనే అది సాధ్యమవుతుంది. ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఆనాడు ప్రధాని వాజ్‌పేయ్ నేతృత్వంలోని ప్రభుత్వం చొరవతో ఛత్తీస్‌గఢ్ ఏర్పడింది. రమణ్ సింగ్ నాయకత్వంలో 15 ఏళ్లు రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిచింది. అయితే, ఐదేళ్లుగా ఇక్కడ అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుపడుతూ.. ఉగ్రవాదం, వేర్పాటువాదం, నక్సలిజం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోంది. దేశానికి కాంగ్రెస్ పెద్ద సమస్య. సుపరిపాలన, అభివృద్ధి, శాంతి భద్రతలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మాత్రమే చూడగలం. ఛత్తీస్‌గఢ్‌తో ఉత్తరప్రదేశ్ ప్రజలకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పవిత్ర భూమిపై ప్రజలకున్న విశ్వాసాలతో కాంగ్రెస్ ఆడుకోవడం దుర్మార్గం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. స్కూల్స్ బంద్ -
డోంగర్‌ఘఢ్‌కు ప్రధాని మోదీ.. బమ్లేశ్వరి ఆలయంలో పూజలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) ఛత్తీస్‌ఘఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ఆయన ఇప్పటికే డోంగర్‌ఘఢ్ చేరుకున్నారు. కొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ చంద్రగిరిలో ఆచార్య విద్యాసాగర్ మహరాజ్‌తో సమావేశమై, పలు అంశాలపై చర్చించనున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ముందుగా బమ్లేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. ఛత్తీస్‌ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డోంగర్‌ఘడ్ స్థానం కీలకంగా మారింది. జైన మతానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాని మోదీ ఇక్కడ పర్యటన చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో స్థానికంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఆచార్య విద్యాసాగర్ మహరాజ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: కుండల తయారీలో కామర్స్ గ్రాడ్యుయేట్.. -
ఛత్తీస్‌గడ్‌లో హోరాహోరీ పోరు
దేశంలో కొద్ది రోజుల్లో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా పరిగణిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా, భూపేష్ బఘెల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి అధికారం దక్కించుకునేందుకు బీజేపీ తన ఎంపీలను, కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి భూపేష్ బఘెల్ పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ దుర్గ్‌లో ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ దుర్గ్ కోటను ఛేదించడం అంత సులువు కాదని, ఇది ఎప్పటికీ కాంగ్రెస్‌కు కంచుకోట అని అన్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ రాయ్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఛత్తీస్‌గఢ్ ప్రజలు బీజేపీ మద్దతు పలకాలని కోరారు. కాగా ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 7, 17 తేదీల్లో ఓటింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇది కూడా చదవండి: దేశ రాజకీయాల్లో మహరాణులెవరు? ఎక్కడ చక్రం తిప్పుతున్నారు? -
మొన్న రైల్వే కూలీ.. నేడు ప్యాసింజర్.. సర్ప్రైజ్ చేసిన రాహుల్ గాంధీ
రాయ్‌పూర్: దేశంలో ఈ ఏడాది చివరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫుల్ జోష్‌లో ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లోకి దూసుకెళ్తూ వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. తాజాగా ప్యాసింజర్ రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు రాహుల్ గాంధీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా పార్టీ నేతలతో కలిసి రైలులో ప్రయాణించారు. సాధారణ వ్యక్తిలా ట్రైన్లో ప్రయాణిస్తూ అందరినీ పలకరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ నుంచి రాయ్‌పూర్ వరకు ఇంటర్ సిటీ రైల్లో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా పలువురు రాహుల్‌తో ఫొటోలు దిగేందుకు, ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఎగబడ్డారు. మరోవైపు, ఇటీవలే రాహుల్ గాంధీ రైల్వే కూలీ అవతారమెత్తిన విషయం తెలిసిందే. Rahul Gandhi Did It Again#RahulGandhi's simplicity is revealed again and again. Today's Train Journey is touching Four points. First, #RahulGandhi realizes how far the standard of #IndianRailways has Fallen in the last 10 years. Second, #RahulGandhi interacted with the… pic.twitter.com/9HSYzptmwC — তন্ময় l T͞anmoy l (@tanmoyofc) September 25, 2023 ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ఎర్రని చొక్కా ధరించి నెత్తిన లగేజ్ పెట్టుకుని మోశారు. రైల్వే కూలీలు ధరించి బ్యాడ్జీ ధరించి అచ్చం కూలీలాగే కనిపించి అభిమానులను అలరించారు. రైల్వే కూలీల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ చిరునవ్వులు చిందుతూ రైల్వే కూలీలా మూటలు మోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Congress leader Rahul Gandhi meets railway porters at Anand Vihar ISBT in Delhi, wears porter dress and badge... pic.twitter.com/Pzwouwx2Wn — Saurabh Raj (@sraj57454) September 21, 2023 ఇక, అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన గృహ నిర్మాణాలకు సంబంధించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుల గణన నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గడిచిన కొన్ని నెలల్లో రాష్ట్రంలో 2,600 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. #WATCH | Delhi: Congress MP Rahul Gandhi visits Anand Vihar ISBT, speaks with the porters and also wears their uniform and carries the load pic.twitter.com/6rtpMnUmVc — ANI (@ANI) September 21, 2023 ఇది కూడా చదవండి: భారత్‌ను ముక్కలు చేసేందుకు ప్లాన్.. కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా.. -
యాంకర్ సల్మా సుల్తానా హంతకుడెవరు? మూలన పడిన కేసు ఎలా బయటకు వచ్చింది?
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాకు చెందిన న్యూస్ యాంకర్ సల్మా సుల్తానా అక్టోబర్ 2018లో ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఈ కేసులో సల్మా ప్రియుడు మధుర్ సాహు ఆమెను హత్య చేసి, అతని స్నేహితులతో కలిసి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో ఇన్నాళ్లకు వెల్లడైంది. 2023, ఆగస్టు 22న సల్మా అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సల్మా సుల్తానా మాయమయ్యాక.. కోర్బా జిల్లాలోని కుస్ముండా నివాసి అయిన 18 ఏళ్ల సల్మా సుల్తానా ఒక కేబుల్ ఛానెల్లో యాంకర్‌గా పనిచేసేది. 10వ తరగతి పాసయ్యాక యాంకరింగ్ చేయడం మొదలుపెట్టింది. 2018, అక్టోబర్ 21న సల్మా సుల్తానా ఇంటి నుండి బయటకు వెళ్లింది. తరువాత మరి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె కోసం వెదకడం ప్రారంభించారు. ఎన్నాళ్లు వెదికినా సల్మా గురించిన ఎలాంటి సమాచారం వారికి దొరకలేదు. సల్మా తండ్రి మరణించాక.. సల్మా తండ్రి 2019, జనవరి 20న మరణించారు. తండ్రి అంత్యక్రియల కోసమైనా సల్మా ఇంటికి తప్పకుండా వస్తుందని కుటుంబసభ్యులు ఆశించారు. కానీ అది జరగలేదు. అయితే ఆమె అదృశ్యంపై కుటుంబ సభ్యులు 2019 జనవరిలోనే స్థానిక కుస్ముండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిలో జిమ్ నిర్వాహకుడు, సల్మా ప్రియుడు మధుర్ సాహుపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. కోర్బా సిటీ ఎస్పీ రాబిన్సన్ చొరవతో.. సల్మా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మధుర్ సాహుతో సహా సల్మా పరిచయస్తులను విచారించారు. విచారణలో మధుర్ సాహు పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ వచ్చాడు. సల్మా కేసుకు సంబంధించిన ఎటువంటి సమాచారం లభ్యం కాకపోవడంతో కేసు మూలన పడింది. అయితే 2023 మార్చిలో కోర్బా సిటీ ఎస్పీ రాబిన్సన్ గుడియా సల్మా కేసుకు సంబంధించిన ఫైల్‌ను తనిఖీ చేశారు. ఉన్నతాధికారులతో సంప్రదించిన అనంతరం తిరిగి విచారణకు ఆదేశించారు. ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు వివరాల రాబట్టడంలో సఫలమయ్యారు. ఒకరోజు తాగిన మత్తులో.. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ కేసు కోల్డ్ స్టోరేజీకి చేరుకోవడంతో మధుర్ సాహు తాను ఇకపై పోలీసుల చేతికి చిక్కే అవకాశం ఉండదని భావించాడు. ఒకరోజు తాగిన మత్తులో మధుర్ తన స్నేహితుని ముందు సల్మా హత్య గురించి వెల్లడించాడు. ఏదో లావాదేవీ విషయంలో మాధుర్‌కు అతని స్నేహితునికి మధ్య వివాదం జరిగింది. దీంతో మాధుర్ స్నేహితుడు.. సల్మా హత్య గురించి పోలీసులకు సమాచారం అందించాడు. ఇది కూడా చదవండి: అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం! సల్మా సుల్తానా రుణం చెల్లిస్తూ.. కాగా యూనియన్ బ్యాంక్ నుంచి సల్మా సుల్తానా రుణం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు బ్యాంకును సంప్రదించగా సల్మా రుణానికి సంబంధించిన ఈఎంఐని గంగాశ్రీ జిమ్ యజమాని మధుర్ సాహు చెల్లిస్తున్నట్లు తెలిసింది. సల్మా కనిపించకుండా పోయిన తర్వాత ఆమె ఈఎంఐని మధుర్ సాహు చెల్లిస్తుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంతలో మధుర్ సాహు పరారయ్యాడు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. సల్మా స్నేహితులు, సన్నిహితుల వాంగ్మూలాలను పోలీసులు మరోసారి నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషుల వాంగ్మూలాలు వేర్వేరుగా ఉండటంతో వారిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా వారు నిజాన్ని బయటపెట్టారు. 2018, అక్టోబరు 21న సల్మా సుల్తానాను మధుర్ సాహు, అతని సహచరుడు కౌశల్ శ్రీవాస్ హత్య చేశారని వారు పోలీసులకు తెలిపారు. తరువాత సల్మా మృతదేహాన్ని కోర్బాలోని కొహాడియా వంతెన సమీపంలో ఖననం చేశారని వెల్లడించారు. అస్థిపంజరం కోసం తవ్వకాలు నిందితుడిని గుర్తించిన పోలీసులు కోర్టు అనుమతితో సల్మాను ఖననం చేసిన రోడ్డు ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. 2 రోజుల పాటు ఈ తవ్వకాలు సాగాయి. చివరికి 2023 ఆగస్టు 22న పోలీసులు ఒక షీట్లో చుట్టివుంచిన అస్థిపంజరాన్ని కనుగొన్నారు. ఈ అస్థిపంజరం ఎవరిదనేది నిర్ధారించేందుకు దానిని డీఎస్ఏ పరీక్షలకు పంపారు. న్యూస్ యాంకర్ సల్మా సుల్తానా మృతదేహాన్ని నిందితులు ఖననం చేసిన ప్రదేశంలో గతంలో హైవేను నిర్మించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన మధుర్ సాహు, కౌశల్ శ్రీవాస్, అతుల్ శర్మలను పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: పిజ్జా యాప్ సాయంతో ప్రియుడి అరెస్ట్.. ఇలా కూడా చేయచ్చా? అంటున్న యూజర్లు! -
80 అడుగుల టవర్ ఎక్కి హైడ్రామా.. ప్చ్.. చివరికి..
రాయపూర్: ప్రేమికుడిపై అలిగి కోపంతో ప్రియురాలు 80 అడుగుల ఎత్తైన హై టెన్షన్ పవర్ లైన్ ఎక్కిన సంఘటన గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో చోటు చేసుకుంది. కోపంతో టవర్ ఎక్కుతున్న ప్రేయసిని బుజ్జగించేందుకు ఆమెను అనుసరిస్తూ ప్రియుడు కూడా అదే టవర్ పైకి ఎక్కాడు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరినీ ఎలాంటి హాని కలగకుండా కిందికి దించారు. ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో ఒక ప్రేమజంట పెద్ద సాసహం చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపగించిన ప్రియురాలు దగ్గర్లోని 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ ఎక్కి దూకాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవు చకచకా 80 అడుగుల హైటెన్షన్ టవర్ ఎక్కేసింది. ప్రేమించిన అమ్మాయి టవర్ ఎక్కి ఎక్కడ అఘాయిత్యం చేసుకుంటుందోనని కంగారుపడిన ప్రియుడు అంతే వేగంగా పరుగు లంఘించుకుని తాను కూడా టవర్ ఎక్కుతూ కనిపించాడు. స్థానికులు ఈ దృశ్యాలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు విషయాన్ని చేరవేడంతో ఆ ప్రేమ జంట తల్లిదండ్రులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి గంటల పాటు శ్రమించి ఎలాగోలా వారిద్దరినీ క్షేమంగా కిందకి దించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ అమ్మాయి మైనర్ అని వారిద్దరి మధ్య తగువు తలెత్తడంతో ఈ సాహసానికి ఒడిగట్టారన్నారు. వారిపైన కేసు నమోదు చేయలేదు కానీ మందలించి పంపినట్టు తెలిపారు. ఈ చోద్యాన్ని చూడటానికి వచ్చిన వారెవరో మొత్తం సన్నివేశాన్ని చక్కగా మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. We have been building transmission towers from ages. This is the first time I have seen someone climb them to commit suicide upset with her lover. Good news, the boyfriend followed her up and convinced her to climb down. All iz well #Chhattisgarh #today pic.twitter.com/3MRpbZ8RJI — Harsh Goenka (@hvgoenka) August 6, 2023 ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం -
వామ్మో..! అల్లుళ్లకు కట్నంగా 21 పాములు..
రాయ్‌పుర్: ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే వధువు తల్లిదండ్రులు తోచినంత కట్నం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. సాధారణంగా మనం చూసినంతవరకు కట్నంగా డబ్బులు, బంగారం, భూములు వంటి ఆస్తులను వరునికి కానుకగా ఇస్తుంటారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో ఓ తెగ ప్రజలు చాలా వింత ఆచారం ఇప్పటికీ పాటిస్తున్నారు. కట్నంగా వారు పాములను వరునికి కట్నంగా ఇస్తారు. ఛత్తీస్‌గఢ్‌లో కన్వారా తెగ ప్రజలు వింతైన ఆచారం పాటిస్తున్నారు. ఆడపిల్లకు పెళ్లి చేసేప్పుడు వరునికి పాములను కట్నంగా ఇస్తారు. కనీసం తొమ్మిది రకాలకు చెందిన 21 పాములను కట్నంగా ఇచ్చేస్తారు. కట్నంగా పాములను ఇవ్వలేని ఆడపిల్లలను ఎవరూ వివాహం చేసుకోరు. తమ పూర్వికులు కనీసం 60 పాములను కట్నంగా ఇచ్చేవారని ప్రస్తుతం ఆ సంఖ్య క్రమంగా తగ్గినట్లు ఆ తెగకు చెందిన ఓ సభ్యుడు కటంగీ తెలిపారు. పాములను కట్నంగా ఇవ్వండం తమ ఆచారంగా వస్తోందని వెల్లడించారు. కన్వారా తెగ ప్రజలు తమ పూర్వికుల నుంచి కూడా పాములను ఆడిటడం జీవనాధారంగా చేసుకున్నారు. వివిధ రకాల పాములను పట్టుకుని వాటిని ఆడిస్తూ వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తారు. పాములనే తమ ఆస్తిగా భావిస్తారు. అందుకే ఆడపిల్లకు కట్నంగా పాములనే ఇస్తుంటారు. విషరహిత పాములనే పట్టుకుని జీవనం సాగించాలని అటవీ అధికారులు తెగ ప్రజలకు సూచించారు. స్థానిక సంప్రదాయాలను గౌరవించి ప్రభుత్వం కూడా అనుమతులు ఇస్తోందని అటవీ రేంజి అధికారి సియారామ్ కర్మాకర్ తెలిపారు. ఇదీ చదవండి: ఇలాంటి వారితో జాగ్రత్త.. బైక్ బుక్ చేసుకున్న మహిళకు చేదు అనుభవం -
ఆ మేక.. అతన్ని కంటితోనే చంపేసింది..!
మనిషికి చావు అనేది అత్యంత విచిత్ర పరిస్థితుల్లో సంభవిస్తుంటుంది. చావును ఎవరూ ముందుగా ఊహించలేరు. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలోని ఖోపాధామ్‌లో ఒక వ్యక్తి మేకలను బలిచ్చాడు. తరువాత ఆ మేక మాంసంతో వంటకాలు చేయించి అందరికీ వడ్డించి, తానూ తిన్నాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే ఆ వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతని మృతికి కారణం ఏమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఊహకందని విధంగా.. మేక కన్ను మనిషి ప్రాణాలను తీస్తుందని ఎవరైనా ఊహించగలరా? అయితే ఇది నిజంగానే జరిగింది. సూరజ్‌పూర్‌లో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. మేక కన్ను తిన్న వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఆలయంలో మేకలను బలి ఇచ్చిన తరువాత వాటి మాంసంతో వంటలు చేయించాడు. అతను ఆ వంటకాలలోని మేక కన్నును తిన్నాడు. అయితే అది అతని గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో అతనికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి, ప్రాణాలు వదిలాడు. జిల్లా ఆసుపత్రికి తరలించగా.. ఈ ఘటన సూరజ్‌పూర్ జిల్లాలోని మదన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 50 ఏళ్ల బగార్ రాయ్ తన స్నేహితులతోపాటు ప్రముఖ ఖోపాథామ్కు వెళ్లాడు. తన కోరిక నెరవేరిన నేపధ్యంలో అతను అక్కడికి వెళ్లాడు. అక్కడ పూజలు నిర్వహించిన తరువాత మేకలను బలి ఇచ్చి, ఆ మాంసంతో వంటకాలు చేయించాడు. తరువాత వాటిని గ్రామస్తులకు వడ్డించాడు. ఈ నేపధ్యంలో అతను మేక మాసంలోని దాని కన్నును తిన్నాడు. అయితే ఆ కన్ను అతని గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి అందక ఇబ్బంది పడ్డాడు. గ్రామస్తులు అతన్ని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియగానే వారు పరుగుపరుగున ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణం వారి రోదనలతో నిండిపోయింది. ఇది కూడా చదవండి: ప్రియురాలి కోసం భార్య ముక్కు తెగ్గోసి, జేబులో వేసుకుని.. -
మేనకోడలి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో స్టేజీపైనే.. వీడియో వైరల్..
రాయ్‌పూర్: మేనకోడలికి పెళ్లి అయిందనే పట్టరాని సంతోషంలో స్టేజీపైనే డ్యాన్స్ చేసిన ఓ వ్యక్తి సడన్‌గా గుండెపోటుతో కుప్పకూలాడు. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా నృత్యం చేసిన అతడు ఉన్నట్టుంది ఛాతీలో ఇబ్బందిగా అన్పించి పెళ్లి వేదికపైనే కూర్చుండిపోయాడు. ఆ తర్వాత క్షణాల్లోనే సృహకోల్పోయి పడిపోయాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో పెళ్లి సంబరాల్లో ఉన్న వారంతా ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయారు. ఛత్తీస్‌గఢ్ రాజనందన్‌గావ్ జిల్లా డోంగర్‌గఢ్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు దిలీప్ రాజ్‌కుమార్. బాలోద్ జిల్లాలో నివసిస్తున్నాడు. భిలాయ్ స్టిల్ ప్లాంట్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లివేదికపై దిలీప్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను అక్కడున్నవారు తమ ఫోన్లో వీడియో తీశారు. ఈ సమయంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలడంతో ఆ దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాసేపట్లోనే వైరల్‌గా మారింది. 10 May 2023 : 🇮🇳 : Dilip Rautkar, an engineer at Bhilai Steel Plant, suffered a 💔attack💉 while dancing at a wedding & died on the spot.#heartattack2023 #TsunamiOfDeath #BeastShotStrikesAgain #BeastShot pic.twitter.com/PLogsrUAx7 — Anand Panna (@AnandPanna1) May 10, 2023 కాగా.. ఈ మధ్య గుండెపోటు ఘటనలు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. వయసుతో సంబధం లేకుండా, యువకులు, పెద్ద వయస్కులు అనే తేడా లేకుండా చాలా మంది హఠాత్తుగా హార్ట్ఎటాక్తో కుప్పకూలుతున్నారు. జిమ్‌లో వ్యాయామం చేస్తూ, గేమ్స్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కల్గిస్తోంది. చదవండి: పుట్టగానే తండ్రి వదిలేశాడు.. టెన్త్‌లో 10 జీపీఏతో సత్తాచాటిన కవలలు