
సాక్షి, రాయ్‌పూర్: ఎన్సెఫాలైటిస్ అనే సిండ్రోమ్ బారినపడి బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో 136 మంది చనిపోయిన ఘటన మరుమకముందే చత్తీస్‌గఢ్‌లో మరో ముగ్గురి చిన్నారులకు వైరస్ సోకింది. చత్తీస్‌గఢ్‌లోని జగ్‌దల్‌పూర్ జిల్లాలో ముగ్గురు చిన్నారులు జ్వరం బారీన పడటంతో వారి బంధువులు తీవ్ర అందోళన చెందుతున్నారు. జ్వరం బారిన పడిన చిన్నారులను అధికారులు దిమ్రపాల్ మెడికల్ కాలేజీలో చెర్పించి.. వైద్య సేవలను అందిస్తున్నారు. వారికి చికిత్స చేసిన వైద్యులు.. చిన్నారులు బ్రేన్ ఫీవర్‌తో బాధపతున్నారని తెలిపారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వారిలో కొంతమందికి జపనీస్ జ్వరం లక్షణాలు ఉన్నట్లు మెడికల్ కాలేజ్ వైద్యుడు అయిన డాక్టర్ అనుపమ్ సాహు తెలిపారు.
‘అక్యూట్ ఎన్సెఫాలైటిస్ సిండ్రోమ్’ ఇది రాష్ట్రంలోనే మొదటి కేసు అని దీనిని ‘చమ్‌కీ బుకర్’ అని కూడా పిలుస్తారని ఆయన అన్నారు. హస్పిటల్ చెర్పించిన ఈ ముగ్గురు చిన్నారులలో నాలుగేళ్ల భువనే నాగ్‌కు మొదట వైద్య పరీక్షలు నిర్వహించగా ఎన్సెఫాలిటిస్‌గా వైద్యులు నిర్ధారించారు. మిగతా చిన్నారులు మాండవి కుమార్(7), ఇటియాసా (3)లు కిలెసాల్ పరప్పా ప్రాంతానికి చెందినవారు. దీంతో అధికారులు అక్కడి ప్రాంత ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కాగా ‘అక్యూట్ ఎన్సెఫాలైటిస్ సిండ్రోమ్ కారణంగా బిహార్‌లో ఇప్పటి వరకు 136మందికి పైగా చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment