jagdalpur
-
ఎట్టకేలకు ‘రూట్’ క్లియర్
సాక్షి, హైదరాబాద్: వివాదాలు.. ఉద్యమాలు.. వ్యతిరేకతలతో ఒక్క అడుగు కూడా ముందుకు పడ కుండా పోయిన ఓ జాతీయ రహదారి కథ కొలిక్కి వచ్చింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఇది రాష్ట్రంలో మరో ఎక్స్‌ప్రెస్ వే తరహాలో పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా రూపుదిద్దుకోబోతోంది. 131.8 కి.మీ. మేర నిర్మించే నాలుగు వరసల రహదారిలో 46 వంతెనలతో పాటు ఆర్ఓబీలు, అండర్‌పాస్‌లు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతుండటంతో.. నిజామాబాద్– ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్ ఎన్‌హెచ్ 63పై ట్రక్కులు ఎక్కువగా తిరుగుతుంటాయి. రెండు లేన్లతో ఇరుగ్గా ఉన్న రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారటంతో 4 వరసలకు విస్తరించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. ఇందులో నిజామాబాద్ నుంచి ఆర్మూరు శివారులోని హైవే 44 వరకు, తిరిగి మంచిర్యాల దాటిన తర్వాత ఉండే హైవే 363 నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు చెన్నూరు వరకు.. రాష్ట్రప్రభుత్వ ఆదీనంలోని హైవేల విభాగం విస్తరిస్తుంది. ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు కీలక నిర్మాణం అయినందున దాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించారు. రాష్ట్ర విభాగం ఇప్పటికే ఆ రోడ్డును అవసరమైన ప్రాంతాల్లో 4 వరసలుగా మార్చడం, మిగతా చోట్ల మెరుగుపరచటం చేస్తోంది. అయితే ఎన్హెచ్ఏఐకి అప్పగించిన ఆర్మూరు–మంచిర్యాల రోడ్డు పట్ణణాలు, గ్రామాల మీదుగా సాగుతున్నందున దాన్ని పూర్తి గ్రీన్‌ఫీల్డ్ హైవేగా మార్చాలని భావించారు. కానీ అందుకు భారీ మొత్తంలో సాగు భూములు సేకరించాల్సి రావటంతో రైతులు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఉన్న రోడ్డునే విస్తరించాలని భావించారు. కానీ, పట్టణాలు, గ్రామాల్లో భారీగా నిర్మాణాలను తొలగించాల్సి రావటంతో ఈసారి పట్టణ, గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. చివరకు పట్టణాలు, గ్రామాలున్న చోట బైపాస్‌లు నిర్మించి, మిగతా రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. గత నెల్లో టెండర్లు పిలవగా, ఇప్పుడు వాటిని ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రోడ్డు నిర్మాణంపై బుధవారం ఢిల్లీలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. రోడ్డు డిజైన్, ఎలివేటెడ్ కారిడార్ నమూనాలు, రహదారులను క్రాస్ చేసేందుకు వీలుగు చేయాల్సిన ఏర్పాట్లు తదితరాలపై చర్చించారు. నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకుని త్వరలో పనులు మొదలుపెట్టాలని నిర్ణయించారు. నో డైరెక్ట్ క్రాసింగ్: ఆర్మూరు–మంచిర్యాల రోడ్డు మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేటల మీదు గా సాగుతుంది. ఈ మార్గంలో 100 కి.మీ.ల మేర బైపాస్‌లే ఉండనున్నందున ఈ రోడ్డు దాదాపు కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే తరహాలోనే ఉండనుంది. ఆయా పట్టణాల వద్ద 6 కి.మీ. నుంచి 12 కి.మీ. మేర భారీ బైపాస్‌లు ఉంటాయి. ఇవి కాకుండా మరో 8 ప్రాంతాల్లో చిన్న బైపాస్‌లు నిర్మిస్తారు. ఇది పూర్తి యాక్సె స్ కంట్రోల్డ్ రహదారి (ఇతర రోడ్లు దీన్ని నేరుగా క్రాస్ చేయడానికి అవకాశం ఉండదు) కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తారు. బైపాస్‌ల కోసం 500 హెక్టార్ల భూమిని సేకరించారు. దీనికే రూ.900 కోట్లుఖర్చవుతోంది. ఇక వంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్ఓబీలు దాదాపు 46 వరకు ఉంటాయి. -
పేదరికమొకటే కులమన్నపుడు.. ఓబీసీనని ఎలా చెప్పుకుంటారు?
జగదల్పూర్: దేశంలో పేదరికం ఒక్కటే కులమన్న ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ తాను ఇతర వెనుకబడిన వర్గానికి (ఓబీసీ) చెందిన వాడినని ఎలా చెప్పుకుంటారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీశారు. చత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లో శనివారం రాహుల్ ఎన్నికల సభలో ప్రసంగించారు. గిరిజనులను ‘ఆదివాసీ’లకు బదులుగా వనవాసీలని సంబోధిస్తూ బీజేపీ వారిని అవమానిస్తోందని అన్నారు. ‘బీజేపీ నాయకులు ఆదివాసీలను వనవాసీలు అనే పేరుతో పిలుస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఈ వనవాసీ పదాన్ని పరిచయం చేశాయి. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ నాయకుడు గిరిజన యువకుడిపై మూత్రం పోశాడు. దీన్ని వీడియో తీసి వైరల్ చేశారు. ఇదీ బీజేపీ ఆలోచనాధోరణి. అడవుల్లో జంతువుల్లా మిమ్మల్ని వారు చూస్తారు’ అని రాహుల్ పేర్కొన్నారు. ఆదివాసీలే దేశానికి అసలు సిసలైన యజమానులు. అందుకే బీజేపీ ఈ పదాన్ని వాడదు. ఆదివాసీలని సం¿ోదిస్తే... మీ భూమి, నీళ్లు, అడవులను మీకు ఇచ్చేయాల్సి వస్తుందని బీజేపీ భయమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ధ్వజమెత్తారు. -
అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది: ప్రధాని మోదీ
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ జగ్దల్పూర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన దేశం అభివృద్ధి చెందాలంటే మొదట రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు. ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా మొదట జగ్దల్పూర్లోని బస్తర్ దంతేశ్వరి ఆలయంలో ప్రధాని జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ రాష్ట్రంలో మొత్తం రూ.26,000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ఆయన నాగర్నార్లోని ఎన్ఎండీసీ స్టీల్‌ప్లాంట్‌కు కూడా శంకుస్థాపన చేశారు. పలు రైల్వే ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టిన ప్రధాని వాటిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్బంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇక 2014 తో పోలిస్తే ఇక్కడ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి దాదాపు 20 రెట్లు బడ్జెట్ పెంచామని అన్నారు. అలాగే ఈ ఎన్ఎండీసీ స్టీల్‌ప్లాంట్ వలన ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని సుమారు 50,000 మందికి ఉపాధి లభించనుందని అన్నారు. ఇది కూడా చదవండి: 'సనాతన ధర్మం మాత్రమే మతం.. మిగిలినవన్నీ..' -
చత్తీస్‌గఢ్‌కు సోకిన బీహార్ వైరస్
సాక్షి, రాయ్‌పూర్: ఎన్సెఫాలైటిస్ అనే సిండ్రోమ్ బారినపడి బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో 136 మంది చనిపోయిన ఘటన మరుమకముందే చత్తీస్‌గఢ్‌లో మరో ముగ్గురి చిన్నారులకు వైరస్ సోకింది. చత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్ జిల్లాలో ముగ్గురు చిన్నారులు జ్వరం బారీన పడటంతో వారి బంధువులు తీవ్ర అందోళన చెందుతున్నారు. జ్వరం బారిన పడిన చిన్నారులను అధికారులు దిమ్రపాల్ మెడికల్ కాలేజీలో చెర్పించి.. వైద్య సేవలను అందిస్తున్నారు. వారికి చికిత్స చేసిన వైద్యులు.. చిన్నారులు బ్రేన్ ఫీవర్‌తో బాధపతున్నారని తెలిపారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వారిలో కొంతమందికి జపనీస్ జ్వరం లక్షణాలు ఉన్నట్లు మెడికల్ కాలేజ్ వైద్యుడు అయిన డాక్టర్ అనుపమ్ సాహు తెలిపారు. ‘అక్యూట్ ఎన్సెఫాలైటిస్ సిండ్రోమ్’ ఇది రాష్ట్రంలోనే మొదటి కేసు అని దీనిని ‘చమ్కీ బుకర్’ అని కూడా పిలుస్తారని ఆయన అన్నారు. హస్పిటల్ చెర్పించిన ఈ ముగ్గురు చిన్నారులలో నాలుగేళ్ల భువనే నాగ్‌కు మొదట వైద్య పరీక్షలు నిర్వహించగా ఎన్సెఫాలిటిస్‌గా వైద్యులు నిర్ధారించారు. మిగతా చిన్నారులు మాండవి కుమార్(7), ఇటియాసా (3)లు కిలెసాల్ పరప్పా ప్రాంతానికి చెందినవారు. దీంతో అధికారులు అక్కడి ప్రాంత ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కాగా ‘అక్యూట్ ఎన్సెఫాలైటిస్ సిండ్రోమ్ కారణంగా బిహార్‌లో ఇప్పటి వరకు 136మందికి పైగా చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. -
మావోయిస్టులూ.. వెళ్లిపోండి
మల్కన్‌గిరి: మావోయిస్టులకు వ్యతిరేకంగా తొలిసారి గిరిజనులు గళమెత్తారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లో పలు సంఘాల ఆధ్వర్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా శనివారం భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ఏడు జిల్లాల నుంచి 50 వేల మందికి పైగా గిరిజనులు ఇందులో పాల్గొన్నారు. ఇంతకాలం మావోయిస్టులకు సాయం చేశామని గిరిజన సంఘాల నాయకులు అన్నారు. ప్రతిఫలంగా గిరిజనులను కాల్పుల్లో ముందుంచి వారి మృతికి కారణమవుతున్నారని మండిపడ్డారు.‘ మా బతుకులు మేం దిద్దుకుంటాం మీరు వెళ్లిపోండి’ అని ఎలుగెత్తారు. -
సెక్స్ రాకెట్ గుట్టురట్టు
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా జగదల్పూర్ పట్టణంలోని సెక్స్ రాకెట్ నడుపుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు యవతులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పరపా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాపర్పట్టిలోని ఓ ఇంట్లో నలుగురు యువతులు వ్యభిచారం నిర్వహిస్తుండగా.. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న పోలీసులు ఇందులో విటుల పేర్లను మాత్రం బయట పెట్టకపోవడం గమనార్హం. అదుపులోకి తీసుకున్న యువతుల స్వస్థలాలు రాయ్‌పూర్, కోల్‌కత, గువాహటిగా పోలీసులు తెలిపారు. -
మావోయిస్టుల దాడి.. 12 మంది జవాన్ల మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని రెండు ప్రాంతాల్లో మావోయిస్టులు రెచ్చిపోవడంతో 12 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల సామగ్రితో తిరిగి వస్తున్న సిబ్బంది మీద మావోయిస్టులు దాడులు చేశారు. బీజాపూర్ జిల్లా కుంతల్నార్ సమీపంలో ఎన్నికల సామగ్రితో వస్తున్న వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చేశారు. దీనికి 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు రక్షణగా వస్తుండగా.. వారిలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన జవాన్లతో పాటు పోలింగ్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. జగదల్పూర్ జిల్లా జి.రామ్‌ఘాట్ వద్ద మరో సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందునుంచే హెచ్చరిస్తున్న నేపథ్యంలో పోలీసులు అత్యంత జాగ్రత్తలు తీసుకుని, 108 వాహనంలో పోలింగు సామగ్రిని తరలించారు. అయినా కూడా దాని గురించి పక్కా సమాచారం అందుకున్న మావోయిస్టులు.. ఆ వాహనాన్ని కూడా మందుపాతరతో పేల్చేశారు. ఈ సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బీజాపూర్, జగదల్పూర్ ఆస్పత్రులకు తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. ఉత్తర బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగానే హెచ్చరించాయి. దీంతో పోలీసులు పలు రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా ఈ దారుణం తప్పలేదు. అబూజ్మడ్ కేంద్రంగా జనతన సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్న మావోయిస్టులు.. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో దాదాపు 600 గ్రామాల్లో నాయకులు కనీసం ప్రచారం కూడా చేయలేకపోయారు. -
ఛత్తీస్‌గడ్‌లో చెలరేగిన మావోయిస్టులు
-
జగదల్పూర్లో కాంగ్రెస్, బిజెపిల పరస్పర దాడులు