రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ జగ్దల్‌పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన దేశం అభివృద్ధి చెందాలంటే మొదట రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు.
ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా మొదట జగ్దల్‌పూర్‌లోని బస్తర్ దంతేశ్వరి ఆలయంలో ప్రధాని జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ రాష్ట్రంలో మొత్తం రూ.26,000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ఆయన నాగర్నార్‌లోని ఎన్ఎండీసీ స్టీల్‌ప్లాంట్‌కు కూడా శంకుస్థాపన చేశారు. పలు రైల్వే ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టిన ప్రధాని వాటిని జాతికి అంకితం చేశారు.
ఈ సందర్బంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇక 2014 తో పోలిస్తే ఇక్కడ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి దాదాపు 20 రెట్లు బడ్జెట్ పెంచామని అన్నారు. అలాగే ఈ ఎన్ఎండీసీ స్టీల్‌ప్లాంట్ వలన ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని సుమారు 50,000 మందికి ఉపాధి లభించనుందని అన్నారు.
ఇది కూడా చదవండి: 'సనాతన ధర్మం మాత్రమే మతం.. మిగిలినవన్నీ..'
Comments
Please login to add a commentAdd a comment