
ఊబకాయం (Obesity)పై అవగాహన పెంచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Modi) వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను నామినేట్ చేశారు. ఆరోగ్య ముప్పును అరికట్టడానికి చర్యలు తీసు కోవాలని ప్రజలను ఉద్బోధించిన ప్రధాని తాజాగా ఊబకాయంపై పోరాటంలో సహాయం చేయడానికి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah), వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra), నటుడు మోహన్ లాల్ (Mohanlal)తోపాటు వివిధ రంగాలకు చెందిన 10 మందిని సోమవారం నామినేట్ చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఉద్యమాన్ని విస్తరిస్తూ, ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని ఆయన వారిని కోరారు.
దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దీన్ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని ఆదివారం జరిగిన మన్ కీ బాత్ వేదికగా పిలుపునిచ్చారు. ప్రజలు ఆహారంలో తక్కువ నూనె వాడాలని, నూనె తీసుకోవడం 10 శాతం తగ్గించడంతోపాటు, ఈ చాలెంజ్‌ను మరో పది మందికి అందించాలని ఆదివారం తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని కోరారు. ప్రధానమంత్రి డబ్ల్యూహెచ్‌వో WHO డేటాను ఉటంకిస్తూ, 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ లెక్కలు చాలా తీవ్రమైనవని, ఇలాఎందుకు జరుగుతుందో మనమందరం ఆలోచించాలని పిలుపినిచ్చారు. అధిక బరువు లేదా ఊబకాయం అనేక రకాల సమస్యలు, వ్యాధులకు దారితీస్తుంది అని అన్నారు.
అలాగే దీనికి సంబంధించిన ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి, ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహనను విస్తృతం చేసేందుకు తానుఈ క్రింది వ్యక్తులను నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఉద్యమం పెద్దదిగా మారడానికి ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని కూడా వారిని అభ్యర్థిస్తున్నాను అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ప్రధాని నామినేట్ చేసిన ప్రముఖులు
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆనంద్ మహేంద్ర, ప్రముఖ నటుడు మోహన్‌లాల్ భోజ్‌పురి గాయకడు, నటుడు నిరాహువాహిందుస్తానీ, షూటింగ్ ఛాంపియన్ ఒలింపిక్ విజేత మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, నటుడు ఆర్ మాధవన్, గాయని శ్రేయ ఘోషల్, రచయిత్రి, ఎంపీ సుధా మూర్తి ఉన్నారు. ఈ పదిమంది ఎంతమందిని నామినేట్ చేస్తారో.. ఈ లిస్టులో ఎవరెవరు ఉంటారో చూద్దాం.!
Comments
Please login to add a commentAdd a comment