'పెల్లెట్ గన్స్ను నిషేధించండి' | opposition parties from Jammu and Kashmir met Prime Minister Narendra Modi | Sakshi
Sakshi News home page

'పెల్లెట్ గన్స్ను నిషేధించండి'

Published Mon, Aug 22 2016 11:07 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

'పెల్లెట్ గన్స్ను నిషేధించండి' - Sakshi

'పెల్లెట్ గన్స్ను నిషేధించండి'

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు వినియోగిస్తున్న పెల్లెట్ గన్స్ను వెంటనే నిషేధించాలని కోరుతూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ప్రతిపక్ష నేతల బృందం సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసింది. భద్రతాబలగాలు అల్లర్లను నియంత్రించడానికి పెల్లెట్ గన్స్ వాడటం మూలంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో యువత తీవ్రంగా గాయపడినట్లు విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు పెల్లెట్ గన్స్ వాడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒమర్ అబ్దుల్లా ప్రధానికి మెమొరాండం సమర్పించారు. ఆందోళనలు నిర్వహిస్తున్న వారితో చర్చలు ప్రారంభించి శాంతిపూర్వక వాతావరణం నెలకొల్పాలని వారు కోరారు.
 
హిజ్బల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వాని ఎన్కౌంటర్ నేపథ్యంలో చెలరేగిన హింసతో కశ్మీర్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా బలగాలు, వేర్పాటువాదులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు జవాన్లతో పాటు 60 మందికి పైగా పౌరులు మృతి చెందారు. ఇప్పటికీ శ్రీనగర్తో పాటు పలు సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement