
ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఊబకాయం (obesity)పై మన దేశ ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మాట్లాడుతూ 10 శాతం వంట నూనెల వాడకం తగ్గించాలన్నారు. దీంతో ఆయిల్ వాడకం వల్ల లాభనష్టాల మాట మళ్లీ చర్చకి వచ్చింది. మనం ఎలాంటి నూనెలు వాడితే మంచిది? ఏ వయసువాళ్లు ఎంత నూనె వాడాలి? మహిళలు, పురుషులు వారి ఆరోగ్య రీత్యా వాడే నూనెలలో తేడాలుండాలా.. ఈ అంశాల గురించిన వివరణ.
ప్రపంచంలో 250 కోట్ల మంది అధికబరువుతో ఉన్నారని, ఆహారంలో నూనెల వాడకం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతోందని మోదీ డబ్ల్యూహెచ్‌ఓ డేటాని ఉటంకిస్తూ రోజువారి ఆహారంలో తక్కువ నూనె వాడకం ప్రాముఖ్యతను వివరించారు.
కుటుంబ బాధ్యత
వంటల్లో నూనెని తగ్గిస్తే ఊబకాయం నుంచి బయటపడొచ్చు. వంటల్లో నూనె తగ్గించడాన్ని కుటుంబం పట్ల బాధ్యతగా తీసుకోవాలి. ఎక్కువ నూనె వాడితే గుండె సమస్యలు, షుగర్, బీపి వంటివి వస్తాయి. అలాంటి వాటి నుంచి తప్పించుకునేందుకు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసి హెల్దీగా, ఫిట్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉండొచ్చు.
ప్రమాదకరమైనవి
వంట నూనెల్లో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారం ఊబకాయానికి కారణమవుతుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. నూనెలోని కొవ్వు చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయులను పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. అధిక రక్త΄ోటు ప్రమాదం పెరుగుతుంది.
చదవండి: Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?
తగ్గించాలంటే...
పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, సమతుల ఆహారం తీసుకోవాలి. రోజూ కనీసం గంటసేపు వ్యాయామం చేయాలి. ఊబకాయం గురించి అవగాహన కల్పించడానికి మోదీ పదిమంది సెలబ్రిటీలను నామినేట్ చేశారు. వారిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, నటులు ఆర్.మాధవన్, దినేష్ లాల్ యాదవ్ నిరాహువా, మోహన్ లాల్, స్పోర్ట్స్ షూటర్ మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, గాయని శ్రేయా ఘోషల్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఉన్నారు.
అధికంగా తీసుకుంటే నష్టాలు
గ్రాము నూనెలో 9 క్యాలరీలు ఉంటాయి. అధికంగా తీసుకుంటే శరీర బరువు పెరుగుతుంది.
కొవ్వు అధికంగా కలిగి ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు రావచ్చు.
ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న నూనెలు హాని చేస్తాయి.
అసమతుల్యమైన నూనెలు తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి, గుడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
అధిక నూనె వాడకం ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఏ నూనెలు వాడాలి?
సమతుల కొవ్వులు ఉండే నూనెలను వాడాలి. ముఖ్యంగా ప్రాసెసింగ్ తక్కువగా చేసిన (కోల్డ్ ప్రెస్డ్) నూనెలు ఆరోగ్యానికి మంచివి.
సురక్షితమైన, ఆరోగ్యకరమైనవి: సన్‌ఫ్లవర్, వేరుశనగ, ఒమేగా, మొక్కజొన్న నూనె, ఆలివ్ ఆయిల్, అవిసె నూనె, కోల్డ్ ఫ్రెస్డ్ ఆయిల్‌లలో ప్రాసెసింగ్ తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువ.
చదవండి: Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్ టిప్స్
తక్కువగా వాడవలసినవి: పామ్ ఆయిల్ (Palm oil) ) – అధికంగా ప్రాసెస్ అవుతుంది.
వనస్పతి – ట్రాన్స్ ఫాట్స్ ఎక్కువ
స్నాక్స్ తయారీలో ఒకసారి ఉపయోగించినవి, తిరిగి వాడుతుంటారు. వీటి వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది.
సరైన పరిమితిలో తగిన రకాల నూనెలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలే చేస్తుంది.
నూనెలు మంచి క్యాలరీ సోర్స్‌గా పనిచేస్తాయి. వీటిలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్) ఉంటాయి.
ఒమేగా–3, ఒమేగా–6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
కొన్ని నూనెలలో విటమిన్–ఇ, కె, శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం, కేశాల ఆరోగ్యానికి మంచిది.
కొవ్వులు శరీరంలోని వివిధ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైనవి.
ఎవరు ఎంత ఆయిల్
పిల్లలు (6–19 ఏళ్లు) రోజుకు 4 – 5 టీస్పూన్లు (20–25ఎం.ఎల్) ఆడ–మగ ఇద్దరికీ.
ముఖ్యంగా కొబ్బరి, ఆలివ్ ఆయిల్, కనోలా, నెయ్యి వంటి ఆరోగ్యకరమైన నూనెలు వాడాలి.
20 – 59 ఏళ్ల వరకు : రోజుకు 5 – 6 టీస్పూన్లు (25–30ఎం.ఎల్) ఆడ–మగ ఇద్దరికీ. ఆలివ్, కనోలా, అవకాడో, వేరుశనగ, సన్‌ఫ్లవర్, రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్స్. కొబ్బరినూనె, అవిసె నూనె రోజుకు
60 ఏళ్ల.. అంతకు మించి...రోజుకు 4 – 5 టీస్పూన్లు (20–25ఎం.ఎల్.) ఆడ–మగ ఇద్దరికీ. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆలివ్, అవిసె, కనోలా నూనెలను వాడాలి.
గర్భవతులు మాత్రం రోజూ 6–7 టీ స్పూన్ల ఆరోగ్యకరమైన నూనె వాడాలి. వాటిలో ఆలివ్, అవకాడో, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్స్ (ఒమెగా 3 ఉన్న నూనెలు) వాడాలి. -డా. జానకి, పోషకాహార నిపుణులు– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఆయిల్
Comments
Please login to add a commentAdd a comment