limits
-
విదేశీ విద్యార్థులపై ఆస్ట్రేలియా పరిమితి
కాన్బెర్రా: అంతర్జాతీయ విద్యార్థులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉన్న ఆస్ట్రేలియా విదేశీ విద్యార్థుల సంఖ్యను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. కోవిడ్19కు పూర్వస్థితికి వలసలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2025 నుంచి ప్రతిఏటా 2,70,000 మంది విదేశీ విద్యార్థులను మాత్రమే అనుమతిస్తామని మంగళవారం ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి యూనివర్శిటీకి నిర్ణీత కోటాను పెడతామని వెల్లడించింది. దీనివల్ల వృత్తి విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. ఇది ఆర్థిక విధ్వంసమని పలు యూనివర్శిటీలు ప్రభుత్వ నిర్ణయంపై ధ్వజమెత్తాయి. ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియాలో 7,17,500 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. కోవిడ్ సమయంలో ఉన్నత విద్యారంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొందని ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి జాసన్ క్లార్ అంగీకరించారు. కోవిడ్‌కాలంలో ఆస్ట్రేలియా విదేశీ విద్యార్థులందరినీ స్వదేశాలకు పంపించి వేసింది. ప్రస్తుతం కోవిడ్ పూర్వకాలంతో పోలిస్తే 10 శాతం మంది విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియా వర్శిటీల్లో అధికంగా ఉన్నారని క్లార్ అన్నారు. వృత్తి విద్య, శిక్షణ సంస్థల్లో అయితే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏకంగా 50 శాతం అధికంగా ఉందన్నారు. విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చి నాణ్యత లేని విద్యను అందిస్తున్నారని, ఆంగ్ల భాషలో ఏమాత్రం ప్రావీణ్యం లేని విద్యార్థులనూ చేర్చుకుంటున్నారని, ఆస్ట్రేలియాలో పని చేసుకునేందుకు వచ్చినవారికి విద్యార్థుల ముసులో ఆశ్రయం కల్పిస్తున్నారని క్లార్ ఆరోపించారు. 2025 నుంచి ప్రభుత్వ యూనివర్శిటీల్లో 1,45,000 మంది విదేశీ విద్యార్థులను మాత్రమే చేర్చుకుంటామని తెలిపారు. అలాగే ప్రైవేటు యూనివర్శిటీల్లో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను 30 వేలకు పరిమితం చేస్తామని, వృత్తివిద్య, శిక్షణ సంస్థల్లో 95 వేల మందికి పరిమితం చేస్తున్నట్లు వివరించారు. -
రాష్ట్రంలో పవర్ హాలిడే లేదు - పరిశ్రమలకు పరిమితుల తొలగింపు
అమరావతి: రాష్ట్రంలో పవర్ హాలిడే లేదని, పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై ఎలాంటి పరిమితులు అమలు చేయడం లేదని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రకటించాయి. ఈమేరకు సోమవారం ప్రకటన విడుదల చేశాయి. విద్యుత్ డిమాండుకు అనుగుణంగా సరఫరా పరిస్థితి మెరుగుపడినందున పరిశ్రమలకు సరఫరాలో పరిమితులు ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి. రాష్ట్రంలో ఆదివారం అన్నిరంగాలకు ఎలాంటి కోతలు, పరిమితులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసినట్లు వివరించాయి. రాష్ట్రంలో మొత్తం 206.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా సరఫరాలో ఎలాంటి అంతరాయాలుగానీ, లోడ్ షెడ్డింగ్ లేదు. సెప్టెంబర్ 1 వ తేదీన రాష్ట్రంలో నెలకొన్న గ్రిడ్ డిమాండ్ – సరఫరా పరిస్థితులను బట్టి పారిశ్రామిక రంగానికి కొద్ది మేర విద్యుత్ సరఫరా తగ్గించి, ప్రాధాన్యతా రంగాలైన గృహ, వ్యవసాయ రంగాలను ప్రాధాన్యం ఇచ్చి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేశాయి. వ్యవసాయ, గృహ వినియోగరంగాలను పాధాన్యతా రంగాలుగా పరిగణించి అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ సంస్థలు భావించాయి. ఇందులో భాగంగానే డిమాండు ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలకు కొంతమేరకు సరఫరా తగ్గించి వ్యవసాయ, గృహ వినియోగదారులకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తామని గౌరవ కమిషన్ కు అభ్యర్ధన పంపించాం. విద్యుత్ పంపిణీ సంస్థల అభ్యర్ధన మేరకు గౌరవ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి 2023 సెప్టెంబర్ 09న ఈనెల 5 వ తేదీ నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్ వాడకంలో పరిమితులు విధించవచ్చని కమిషన్ అనుమతించింది. తగ్గిన డిమాండుతో పరిశ్రమలకు పరిమితుల తొలగింపు మారిన వాతావరణ పరిస్థితులు, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అల్పపీడన పరిస్థితులలు, వర్షాల దృష్ట్యా గ్రిడ్ డిమాండ్ కొంత మేర తగ్గింది. గత రెండు రోజులుగా ఎటువంటి విద్యుత్ కొరత లేదు. విద్యుత్ సౌధలో సోమవారం ట్రాన్స్‌కో సీఎండీ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె. విజయానంద్ ట్రాన్స్‌కో, జెన్కో, ఏపీపీసీసీ అధికారులతో రాబోయే రెండు వారాలపాటు విద్యుత్ డిమాండు, సరఫరా పరిస్థితిపై కూలంకుషంగా సమీక్షించారు. ప్రస్తుతం లోడ్ కొద్దిమేర తగ్గి సరఫరా పరిస్థితి మెరుగుపడి నందువల్ల పారిశ్రామిక వినియోగదారులకు అధికారిక లోడ్ షెడ్డింగ్ విధించే అవసరం కలగదని ఈ సమీక్ష సందర్భంగా భావించారు. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు పారిశ్రామిక రంగానికి విద్యుత్ వాడకంపై పరిమితి నిబంధనల అమలును రద్దు చేసుకున్నాయి. దయచేసి వినియోగదారులందరూ ఈ విషయాన్ని గ్రహించగలరని రాష్ట్రంలో ఏవిధమైన లోడ్ షెడ్డింగ్ కానీ, విద్యుత్ వాడకంలో పరిమితులు కానీ లేవని తెలియజేస్తున్నాం. మెరుగుపడిన సరఫరా పరిస్థితి వల్ల కమిషన్ ఇచ్చిన పారిశ్రామిక విద్యుత్ వాడకంలో పరిమితి – నియంత్రణ ఉత్తర్వులను అమలు చేయడం లేదు. ఈ విషయం గౌరవ కమిషన్ కు నివేదించాలని పంపిణీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సెప్టెంబర్ నెల 15వ తేదీ వరకు స్వల్పకాలిక మార్కెట్ నుంచి రోజుకి దాదాపు 40 మిలియన్ యూనిట్లు, ప్రతి యూనిట్‌కు రూ . 9.10 వెచ్చించి వినియోగదారుల సౌకర్యార్ధం కొంటున్నాం. సరఫరా పరిస్థితి అదుపు తప్పకుండా నిరంతరాయం అధికారులందరూ అప్రమత్తంగా వున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా గృహ, వ్యవసాయ, వాణిజ్య & పారిశ్రామిక రంగాలకు సరఫరా అంతరాయం లేకుండా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. -
ట్వీట్లకు పరిమితులు
శాన్ ఫ్రాన్సిస్కో: సామాజిక మాధ్యమం ట్విట్టర్ వినియోగదారులకు ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ గట్టి షాక్ ఇచ్చారు. ప్రతీరోజూ ట్వీట్లను చూడడానికి పరిమితి విధించారు. వెరిఫైడ్, అన్‌వెరిఫైడ్ అకౌంట్లకు వేర్వేరు పరిమితులు విధించారు. అన్‌వెరిఫైడ్ అకౌంట్ యూజర్లు రోజుకి 600 పోస్టులు మాత్రమే చూడగలరని, వెరిఫైడ్ ఖాతాదారులు రోజుకి 6 వేల పోస్టులు చూడగలరని శనివారం ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు. త్వరలో ఈ ట్వీట్ల సంఖ్యను అన్‌వెరిఫైడ్ అకౌంట్లకు 800కి వెరిఫైడ్ అకౌంట్లకి 8 వేలకు పెంచుతామని చెప్పారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వినియోగదారులకి శనివారం ట్విట్టర్ యాక్సెస్‌లోకి రాలేదు. కొందరు ట్వీట్లు చేస్తుంటే కెనాట్ రిట్రైవ్ ట్వీట్స్, లిమిట్ ఎక్సీడెడ్ అన్న మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ట్విట్టర్ డౌన్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ట్విట్టర్ డేటాను చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధతో పని చేసే వ్యవస్థలకి శిక్షణ ఇవ్వడానికి దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే ఈ పరిమితులు వచ్చాయని చెప్పారు. -
మెట్రోలో మద్యం అనుమతి.. ఎన్ని బాటిళ్ల వరకు తెలుసా..?
ఢిల్లీ: మెట్రో ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులకు మెట్రో నగరాల్లో సేవలు అందిస్తున్నాయి. అయితే.. మెట్రోలో మద్యాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంటుందా? ఎప్పుడైనా ఆలోచించారా? ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా అడిగిన ఈ ప్రశ్నకు ఢిల్లీ మెట్రో(డీఎమ్ఆర్సీ ) సమాధానం తెలిపింది. రెండు మద్యం బాటిళ్ల వరకు తీసుకురావడానికి మెట్రోలో అవకాశం ఉంటుందని డీఎమ్ఆర్సీ స్పష్టం చేసింది. మెట్రోలో మద్యం సేవించడం మాత్రం నిషేధించింది. అయితే.. ఢిల్లీలో ఎయిర్‌పోర్టు లైన్లో తప్పా మిగిలిన రూట్లలో మద్యం తీసుకురావడానికి ఇప్పటివరకు అనుమతి ఉండేది కాదు. కానీ ఇటీవల ఢిల్లీ మెట్రో నిబంధనలను సడలించింది. Hi. Yes 2 sealed bottles of alcohol is allowed in Delhi Metro. — Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) June 30, 2023 ఈ అంశంలో యాజమాన్యం సీఐఎస్ఎఫ్, డీఎమ్ఆర్సీ సభ్యులతో ఓ కమిటీని వేసింది. ఈ నివేదిక ప్రకారం మెట్రో ఏ రూట్లోనైనా ఒక వ్యక్తి రెండు బాటిళ్ల మద్యం వరకు తీసుకురావచ్చని తెలిపింది. ఇదీ చదవండి: దేన్నీ వదలకుండా మాట్లాడారు.. మెట్రో రైలులో అనుభవంపై ప్రధాని మోదీ -
అమెరికా రుణ పరిమితి బిల్లుకు సెనేట్ ఆమోదం
వాషింగ్టన్/కొలరాడో: దివాలా(డిఫాల్ట్) ముప్పు నుంచి అగ్రరాజ్యం అమెరికా బయటపడినట్లే. రుణ పరిమితి పెంపునకు సంబంధించిన బిల్లుపై (ద్వైపాక్షిక ఒప్పందం) సెనేట్ తుది ఆమోద ముద్ర వేసింది. సుదీర్ఘమైన చర్చల అనంతరం గురువారం రాత్రి ఓటింగ్ నిర్వహించారు. 63–36 ఓట్లతో బిల్లు ఆమోదం పొందింది. సంతకం కోసం అధ్యక్షుడు జో బైడెన్ డెస్క్‌కు పంపించారు. ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాల్చనుంది. దేశ రుణ పరిమితిని 31.4 ట్రిలియన్ డాలర్లకు పెంచుతూ బిల్లును రూపొందించారు. అంటే మొత్తం అప్పులు 31.4 ట్రిలియన్ డాలర్లు దాటకూడదు. బిల్లుకు సెనేట్ ఆమోదం లభించడంతో కొత్త అప్పులు తీసుకొని, పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. బడ్జెట్ కట్స్ ప్యాకేజీకి సైతం సెనేట్ ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదం పొందడంలో అమెరికా ఇక ఊపిరి పీల్చుకోవచ్చని సెనెట్ మెజార్టీ నాయకుడు చుక్ షూమర్ చెప్పారు. ఇది అతిపెద్ద విజయం: బైడెన్ అమెరికా తన బాధ్యతలు నెరవేర్చే దేశం, బిల్లులు చెల్లించే దేశం అని డెమొక్రాట్లు, రిపబ్లికన్లు మరోసారి నిరూపించారని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అమెరికా తన బాధ్యతలను ఎప్పటికీ చక్కగా నెరవేరుస్తుందని చెప్పారు. బిల్లుపై త్వరగా సంతకం చేస్తానన్నారు. చర్చల్లో ఎవరికీ కోరుకున్నది మొత్తం దక్కకపోవచ్చని, అయినప్పటికీ తాము ఎలాంటి పొరపాటు చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు లఅతిపెద్ద విజయమని బైడెన్ అభివర్ణించారు. -
రూ.2 కోట్లు దాటితేనే ‘జీఎస్టీ’నేరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నేర విచారణ విషయంలో అత్యున్నత స్థాయి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చట్టం ప్రకారం ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు కనీస పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.1 కోటి నుంచి రూ.2 కోట్లకు పెంచింది. నకిలీ ఇన్వాయిస్లకు మాత్రం పన్ను పరిమితి రూ.1 కోటి కొనసాగించాలని శనివారం జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు. దేశంలో జీఎస్టీ పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 1.4 కోట్లు కాగా నెలకు సగటున రూ.1.4 లక్షల కోట్లు వసూలవుతున్నాయని వివరించారు. అధికారి విధులకు ఆటంకం కలిగించడం, ఉద్ధేశపూర్వకంగా సాక్ష్యాల తారుమారు, సరఫరా సమాచారాన్ని ఇవ్వకపోవడం వంటి మూడు అంశాలను నేర జాబితా నుంచి తొలగించాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. రిఫైనరీలకు సరఫరా చేసే ఇథైల్ ఆల్కహాల్‌పై పన్ను 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది. అదనపు సుంకాల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 50–150 శాతం శ్రేణి నుంచి 25–100 శాతం శ్రేణికి కుదించారు. పరిహార (కంపెన్సేషన్) పన్ను 22 శాతం విధించడానికి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) నిర్వచనంపై కూడా కౌన్సిల్ స్పష్టత ఇచ్చింది. ఇకపై 1,500 సీసీ ఆపైన ఇంజిన్ సామర్థ్యం, 4,000 మిల్లీమీటర్ల కంటే పొడవు, 170 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే ఎస్‌యూవీగా పరిగణిస్తామని సీతారామన్ తెలిపారు. అదేవిధంగా, ఆన్లైన్ గేమ్‌లు గెలవడం అనేది ఒక నిర్దిష్ట ఫలితంపై ఆధారపడి ఉంటే పూర్తి పందెం విలువపై 28 శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. -
మంచి మాట: మాటల పాఠాలు
ఉన్నాయి కదా అని మనం మాటల్ని వాడేస్తూండకూడదు. వినిపించాయి కదా అని మనం మాటల్ని మాత్రమే పట్టించుకుని బతుకును పాడు చేసుకోకూడదు. మాటలతో, మాటలలో మనల్ని మనం వృథా చేసుకోకూడదు. మాటలకు పరిమితులు ఉంటాయి, ఉన్నాయి. అనేటప్పుడూ, వినేటప్పుడూ మాటల్ని ఒకస్థాయి వరకే పరిగణించాలి. మాటలు అని దెబ్బతిన్న సందర్భాలూ, మాటలు విని దెబ్బతిన్న సందర్భాలూ అందరికీ ఉంటాయి. వాటిని పాఠాలుగా తీసుకోవాలి. అవసరం అయినంత వరకే మాటల్ని అనాలి, వినాలి. మాటలు ఎక్కడ అనవసరమో తెలుసుకోవాలి. మాటలు ఎక్కడ అనర్థమో గ్రహించగలగాలి. మాటను కంచె అని అన్నారు చైనా తాత్త్వికులు, కవి లావొచు (లావోట్జ్). లావొచు అంటే ‘సిద్ధ గురువు’ అని అర్థం. వీరి రచనలు తావొ – త – చింగ్ అధారంగా తావొ మతం రూపొందింది. కవిత్వం నుంచి మతం పుట్టిన సందర్భం ప్రపంచంలో ఇదొక్కటే. లావొచు రోజూ ఉదయం పూట ఒక స్నేహితుడితో కలిసి నడకకు వెళ్లే వారు. ఆ సమయంలో వారు ఏ మాటా మాట్లాడేవారు కాదు, తపస్సు చేస్తున్నట్టుగా మౌనంగా ఉండేవారు. ఒకరోజు ఉదయం నడుస్తూండగా లావొచు స్నేహితుడి స్నేహితుడు దారిలో ఎదురుపడి వాళ్లతో కలిసి నడవసాగాడు. వాళ్ల నడక కొనసాగుతున్నప్పుడు ఉదయాన్ని చూస్తూ ‘ఈ ఉదయం ఎంతో అందంగా ఉంది’ అని అన్నాడు లావొచు స్నేహితుడి స్నేహితుడు. ఆ మాట వినగానే లావొచు ఉన్నపళాన నడక మానేసి ఇంటికి తిరిగి వచ్చేశారు. అది జరిగాక లావొచు స్నేహితుడు లావొచును ‘ఏమైంది, చిన్నమాటే కదా అతడన్నది ఆ మాత్రం దానికి మీరు నడక మానేసి తిరిగి వచ్చేయాలా?’ అని అడిగాడు. బదులుగా లావొచు ఇలా అన్నారు: ‘ఉదయ సౌందర్యమంతా ఆ మాటతో చెదిరిపోయింది. అది శబ్దం లేని సౌందర్యం. దాన్ని మౌనంగా అనుభవించాలి. మాట పుట్టి ఆ సౌందర్యాన్ని వేరు చేసింది. మాట పుట్టడానికి ముందున్న సౌందర్యానుభవం బృహదాత్మకం. – రోచిష్మాన్ మాట పుట్టగానే ఆ బృహత్తుకు కంచె వేసినట్టు అవుతుంది.‘ఒకరోజు లావొచు అనుయాయులు ‘తెలుసుకున్నవాళ్లు మాట్లాడరు, మాట్లాడుతున్న వాళ్లు తెలుసుకున్నవాళ్లు కారు’ అని లావొచు చెప్పిన మాటల గురించి చర్చ చేస్తూ వాళ్ల గురువును ఆ మాటలకు అర్థవివరణను ఇమ్మని అడిగారు. గురువు ‘మీలో ఎవరికి గులాబీ పువ్వు పరిమళం తెలుసు?’ అని వాళ్లను ప్రశ్నించారు. అందరూ తమకు తెలుసని చెప్పారు. ‘మీకు తెలిసిన ఆ విషయాన్ని మాటల్లోకి తీసుకురండి’ అని అన్నాడు గురువు. ఆ పని చెయ్యడం చాతకాక శిష్యులు మౌనంగా ఉండిపోయారు. మాట సత్యానుభవాన్ని సరిగ్గా సమర్పించలేదు. అనుభవానికి పరిధులు ఉండవు. అది ఆకాశంలా అనంతం. మాట సంకుచితమైంది. మాటలలో కూరుకుపోతూంటే మనం అనుభవాన్ని ఆస్వాదించలేం. మనం మాటల్ని పట్టుకుని కూర్చోకూడదు. ఒకదశ తరువాత మనం మాటల్ని దాటుకుని ముందుకు సాగాలి. ఎందుకంటే మౌనంలోనే సౌందర్యం అనుభవంలోకి వస్తుంది. సౌందర్యానుభవం మాటల్లో చెదిరిపోతుంది. అనుభవాన్ని మాటలు అనువదించలేవు. మాటలతో సౌందర్యానుభవాన్ని పోగొట్టుకోకూడదు. మాటను కంచె అని లావొచు అనడాన్ని సరిగ్గానూ, సమగ్రంగానూ అవగతం చేసుకోవాలి. మాట కంచె అయి మన చుట్టూ ఉండకూడదు. మాట మనల్ని కట్టిపడెయ్యకూడదు. మాటకు అందని స్థితిలో ఉండే రుచిని ఆస్వాదించ గలగాలి. మాటకు అతీతంగా ఉండే అత్యుదాత్తతను మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. -
వాట్సాప్ తగ్గించేసింది
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల వినియోగదారులను సొంతం చేసుకున్న ఇన్స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పుంజుకుంది. దీంతో వాట్సాప్ స్టేటస్ లో అప్లోడ్ చేసే వీడియోల నిడివిని సగానికి కుదించింది. వాట్సాప్ వినియోగంలో వస్తున్న అంతరాయాన్ని నివారించే చర్యల్లో భాగంగా దీన్ని15 సెకన్లకు పరిమితం చేసింది. అంతకుముందు ఇది 30 సెకన్లు. వినియోగదారులు పెద్ద సంఖ్యలో వీడియోలను వీక్షిస్తున్న కారణంగా ఇంటర్నెట్ వేగం ప్రభావితమవుతోందని వాట్సాప్ వెల్లడించింది. ఫేస్బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ 'స్టేటస్' సెక్షన్ కింద షేర్ చేసే వీడియోల వ్యవధిని తగ్గించిందని వాబేటా ఇన్ఫో ట్విటర్ ద్వారా వెల్లడించింది. తాజా నిర్ణయం ప్రకారం భారతీయ వినియోగదారులు ఇకపై 16 సెకన్ల కన్నా ఎక్కువ ఉంటే వీడియోలను వాట్సాప్ స్టేటస్ ద్వారా షేర్ చేయలేరు. 15 సెకన్ల వ్యవధి ఉన్న వీడియోలు మాత్రమే అనుమతించబడతాయి. సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లపై ట్రాఫిక్ ను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయ తీసుకున్నామని వాట్సాప్ వెల్లడించింది. వాట్సాప్ స్టేటస్ లో పలు వీడియోలను, ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. వినియోగదారుల నెట్‌వర్క్‌లో ఉన్న వ్యక్తులకు వీటిని వీక్షించే అవకాశం వుంది. అలాగే ఈ స్టేటస్ లో షేర్ చేసిన ఇమేజ్ లు, జిఫ్స్, లేదా వీడియోలు 24 గంటల తర్వాత ఆటోమేటిగ్గా అదృశ్యమవుతాయి. వాట్సాప్ స్టేటస్ ను ప్రారంభించినపుడు 90 సెకన్ల నుండి మూడు నిమిషాల వీడియోలను అనుమతించింది. ఆ తరువాత, దీన్ని 30 సెకన్లకు తగ్గించింది. భారతదేశంలో 400 మిలియన్లకు పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు. కాగా కరోనా వైరస్ ( కోవిడ్ -19) మహమ్మారి ప్రకంపనల కారణంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇంటికే పరిమితమైన ప్రజలు సమాచారం, వినోదం కోసం సోషల్ మీడియాపైన ఎక్కువ ఆధారపడుతున్నారు. దీంతో ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వీడియో, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి ఇతర సంస్థలు ఇంటర్నెట్ లైన్లను కాపాడటానికి వీడియో స్ట్రీమ్‌ల నాణ్యతను తగ్గించిన సంగతి తెలిసిందే. మరోవైపు లాక్ డౌన్ కొనసాగిస్తారన్న అంచనాలపై కేంద్రం స్పందించింది. ఏప్రిల్ 14 తరువాత కొనసాగించే ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. -
ట్విటర్ కొత్త నిబంధన
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విటర్ స్పామ్‌పై బెడద నుంచి బయటపడేందుకు చర్యలు చేపట్టింది. స్పామ్ మెసేజ్‌లు, ఖాతాలనుంచి ట్విటర్ వినియోగదారులను రక్షించేందుకు కీలక చర్య తీసుకుంది. ట్విటర్ వినియోగదారుడు ఫాలోఅయ్యే ఖాతాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. ఒక ట్విటర్ యూజర్ ఒక రోజులో ఇతర యూజర్లను ఫాలో అయ్యే సంఖ్యను 400కు తగ్గించింది. గతంలో రోజుకు 1000 అకౌంట్లను ఫాలోఅయ్యే అవకాశం ఉంది. స్పామ్ సమస్య నుంచి బయట పడేందుకే ఈ చర్యకు దిగినట్లు ట్విటర్ తెలిపింది. ఈ మేరకు ట్విటర్ సాంకేతిక భద్రతా విభాగం ట్వీట్ చేసింది. మరోవైపు ట్విటర్ సీఈవో జాక్ డోర్సే అందుకున్న జీతం ఎంతో తెలుసా. అక్షరాలా రూ.100. 2018 సంవత్సరానికిగాను ఆయనకు కంపెనీ 1.40డాలర్లు (సుమారు రూ.100) జీతం చెల్లించినట్లు సంస్థ వెల్లడించింది. అదేవిధంగా 2018లోనూ డోర్సేకు అందాల్సిన అన్ని ప్రయోజనాలను ఆయన తిరస్కరించారని, వేతనంగా మాత్రం 1.40 డాలర్లు తీసుకున్నారని సీఈఎస్ ఫైలింగ్‌లో ట్విటర్ వెల్లడించింది. ట్విటర్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొద్ది సంవత్సరాలుగా సహవ్యవస్థాపకుడైన డోర్సే జీతం తీసుకోవడం లేదని పేర్కొంది. కాగా వేతనంతో సహా కంపెనీ ఇచ్చే అన్ని సదుపాయాలను మూడేళ్ల పాటు (2015, 2016, 2017) తీసుకోబోనని గతంలో డోర్సే ప్రకటించిన సంగతి తెలిసిందే. Follow, unfollow, follow, unfollow. Who does that? Spammers. So we’re changing the number of accounts you can follow each day from 1,000 to 400. Don’t worry, you’ll be just fine. — Twitter Safety (@TwitterSafety) April 8, 2019 -
దీపావళి ధమాకా రెండు గంటలే
న్యూఢిల్లీ: దీపావళి పండుగను ధూంధాం ధమాకాగా చేద్దామని ప్లాన్ చేస్తున్నారా? ఇప్పటి నుంచే టపాసుల కొనుగోలు ప్రారంభించారా? వెలుగులు చిమ్మే చిచ్చుబుడ్లు, వీధివీధంతా మార్మోగే లక్ష్మీబాంబులు, వరుస పేలుళ్ల లడీలు.. ఇలా ఏమేం కొనాలో లిస్ట్ రెడీ చేసుకుంటున్నారా? కాస్త ఆగండి. ఈ దీపావళిని మీరలా జరుపుకోవడం సాధ్యం కాకపోవచ్చు. దీపావళే కాదు.. రానున్న క్రిస్మస్, న్యూఇయర్ పండుగలనూ పేలుళ్లతో కాదు.. ప్రశాంతంగా జరుపుకోవాల్సిందే. ఎందుకంటే పండుగ రోజు భారీగా విస్తరించే వాయు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలను, మరికొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దీపావళి తదితర పండుగల సందర్భంగా బాణసంచా పేలుళ్లను పూర్తిగా నిషేధించలేదు కానీ కొన్ని పరిమితులు విధించింది. తక్కువ వాయు కాలుష్యాన్ని వెదజల్లే బాణాసంచా (గ్రీన్ క్రాకరీ)ను మాత్రమే వినియోగించాలంది. అలాగే, దీపావళి నాడు రోజంతా కాకుండా, కేవలం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు.. అంటే కేవలం రెండు గంటల పాటే పటాసులు కాల్చేందుకు అనుమతినిచ్చింది.క్రిస్మస్, న్యూఇయర్‌లు అర్ధరాత్రి పండుగలు కాబట్టి, ఆ రోజుల్లో రాత్రి 11.55 నుంచి 12.30 వరకు, 35 నిమిషాల పాటు బాంబుల మోత మోగించవచ్చని పేర్కొంది. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో ఒకే దగ్గర అంతా టపాసులు పేల్చుకునే అవకాశం కల్పించే కమ్యూనిటీ ఫైర్ క్రాకింగ్’ను ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. వరుస పేలుళ్లు జరిపే లడీ తరహా బాణసంచా వినియోగాన్ని నిషేధించింది. వెలుగు, చప్పుడు తక్కువ వచ్చేలా ప్రమాదకర రసాయనాలను తక్కువగా వినియోగించి టపాసులను తయారు చేయాలని ఉత్పత్తిదారులను ఆదేశించింది. నిబంధనల మేరకు టపాసుల వినియోగం జరిగేలా చూడాల్సిన బాధ్యత స్థానిక పోలీసు అధికారిదేనని స్పష్టం చేసింది. తయారీదారుల జీవించే హక్కుపై... వాయు కాలుష్యానికి కారణమవుతున్న బాణాసంచా తయారీ, విక్రయాలపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం విచారించింది. బాణసంచా వినియోగంపై నిషేధం బదులు పరిమితులు విధించాలని తయారీదారులు ఈ సందర్భంగా న్యాయస్థానాన్ని అర్థించారు. వాయు కాలుష్యానికి బాణసంచాతో పాటు గాలి, ఉష్ణోగ్రతలు కూడా కారణమేనన్నారు. స్పందించిన ధర్మాసనం..130 కోట్ల దేశ ప్రజల ఆరోగ్య హక్కుతోపాటు బాణసంచా తయారీదారుల జీవించే ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లకుండా చూస్తామంది. సుప్రీం ఆదేశాల వివరాలు.. ♦ బాణసంచాల నుంచి వెలువడే ధ్వని, పొగ ప్రమాణాలను పెట్రోలియం, ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్(పీఈఎస్వో, పెసో) ధ్రువీకరించాల్సి ఉంటుంది. వీటిల్లో వాడే రసాయనాలను కూడా పెసో నిర్దేశించిన మేరకే వినియోగించాలి. ఇలా ధ్రువీకరించిన, గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే ఉత్పత్తికి, విక్రయాలకు అనుమతించాలి. నిబంధనలను ఉల్లంఘించిన విక్రేతల లైసెన్స్‌లను పెసో రద్దు చేయవచ్చు. ♦ లైసెన్స్ పొందిన విక్రేతలే టపాసులను విక్రయించాలి. కోర్టు ఆదేశాలకు లోబడి తయారైన వాటిని మాత్రమే వారు అమ్మాల్సి ఉంటుంది. లేకుంటే లైసెన్స్ రద్దు తప్పదు. ♦ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సంస్థలు బాణాసంచాను విక్రయించరాదు. ♦ పరిమితికి మించి ధ్వని, కాలుష్య కారకాలను వెదజల్లే బాణసంచాను కాల్చకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు శాఖదే. ఉత్స వాలు, పెళ్లిళ్ల సందర్భంగా వాడే బాణసంచా కూడా ప్రమాణాలకు లోబడి ఉండాలి. ♦ గ్రీన్ బాణసంచా వల్ల వ్యర్థాల పరిమాణం 15 నుంచి 20 శాతం వరకు తగ్గుతుంది. గ్రీన్ క్రాకర్స్ వల్ల ధ్వనితో పాటు కాంతి తీవ్రత కూడా 30 నుంచి 35 శాతం వరకు తగ్గుతుంది. దీంతోపాటు గాలిలో కలిసి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ల పరిమాణం కూడా గణనీయంగా పడిపోతుంది. ♦ భారీ వాయు, శబ్ద కాలుష్యం వచ్చే సిరీస్ క్రాకర్స్ లేక లారిస్(ఎత్తుకు వెళ్లి పేలడంతోపాటు మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లే)తయారీ, విక్రయాలపై నిషేధం. రివ్యూ పిటిషన్ వేస్తాం సుప్రీం తీర్పుపై భిన్న స్పందనలు వెలువడ్డాయి. ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని బాణసంచా తయారీ దారులు పేర్కొన్నారు. గ్రీన్ క్రాకరీ అనేదే లేదని, అలాంటి బాణసంచాను తయారు చేసేందుకు చాలా సమయం పడ్తుందని తెలిపారు. ఇప్పుడు తమ వద్ద ఉన్నది రెండేళ్లనాటి స్టాక్ అని చెప్పాయి. రెండు గంటల పాటే బాణసంచా పేలుళ్లకు అవకాశమివ్వడం వల్ల తమ బిజినెస్ భారీగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులోని శివకాశీలోనే దాదాపు 6 లక్షల మంది బాణసంచా తయారీతో ఉపాధి పొందుతున్నారని, అలాంటి వారి జీవనోపాధి సుప్రీంకోర్టు తీర్పుతో దెబ్బతింటుందని పేర్కొంది. మరోవైపు బాణసంచా పేలుళ్లతో వెలువడే వాయు, ధ్వని కాలుష్య స్థాయిలను కొలిచే పరికరాలు తమ వద్ద లేవని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, బాణసంచా విక్రేతలు సుప్రీంకోర్టు పేర్కొన్న పరిమితులలోపుఉన్న ఉత్పత్తులనే విక్రయించేలా చూడటం కూడా ఆచరణ సాధ్యం కాదన్నారు. కాగా, సుప్రీం తీర్పును పర్యావరణవేత్తలు స్వాగతించారు. -
ఎటువంటి ఆంక్షలు లేకుండా వీసాలు
-
ఎటువంటి ఆంక్షలు లేకుండా విద్యార్థులకు వీసాలు
న్యూఢిల్లీ: బ్రిటన్‌లో చదువుకునేందుకు భారతీయ విద్యార్థులకు ఎప్పుడూ తలపులు తెరిచే ఉంటాయని ఆ దేశ హై కమిషనర్ డొమ్నిక్ అస్కిత్ అన్నారు. యూకేలోని విశ్వవిద్యాలాయాలు అంతర్జాతీయ స్థాయి విద్యనందిస్తున్నాయని ఆయన అన్నారు. మహిళా ఆర్థిక సాధికారికతపై యూఎన్ నివేదికను ఆవిష్కరిస్తున్న సభలో పలు అంశాలపై అస్కిత్ మాట్లాడారు. భారతీయ విద్యార్థుల కోసం ఎలాంటి పరిమితులు లేకుండానే బ్రిటన్‌లో చదువుకునేందుకు వీసాలు మంజూరు చేస్తామని ఆయన అన్నారు. దాదాపు 600 మంది భారతీయ విద్యార్థులకు బ్రిటన్ స్కాలర్షిప్ అందజేస్తోందని ఆయన వివరించారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు వివిధ దేశాలనుంచి వచ్చి బ్రిటన్‌లో చదువుకుంటున్నట్లు తెలిపారు. కోర్సు అయిపోగానే విద్యార్థులు స్వదేశాలకు తిరిగివెళ్లేలా వీసా విధానాన్ని బ్రిటన్ కొనసాగిస్తోందని ఆయన వివరించారు. మహిళా సాధాకారికత కోసం ఉద్ధేశించిన 75 స్టార్టప్‌లపై బ్రిటన్ పెట్టుబడులు పెట్టినట్లు ఆయన తెలిపారు. భారత్‌లో ఉన్న బ్రిటన్ కంపెనీలు వారి ఆదాయంలో 7శాతం ఉద్యోగుల స్కిల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నట్లు అస్కిత్ వెల్లడించారు. -
హెచ్ఐవీ, మధుమేహం ఔషధాల రేట్లు 44% దాకా తగ్గింపు
న్యూఢిల్లీ: హెచ్ఐవీ, మధుమేహం మొదలైన వాటి చికిత్సలో ఉపయోగించే 50 పైగా ఔషధాల ధరలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. దీంతో వీటి ధరలు 5 నుంచి 44 శాతం దాకా తగ్గనున్నాయి. 29 ఫార్ములేషన్ల రిటైల్ ధరలపై కూడా జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) పరిమితులు విధించింది. జాబితాలోని నిర్దిష్ట ఔషధాల ధరలు 5–44 శ్రేణిలో తగ్గుతాయని, తగ్గుదల సగటున 25 శాతం మేర ఉండగలదని ఎన్పీపీఏ చైర్మన్ భూపేంద్ర సింగ్ తెలిపారు. తాజాగా నిర్దేశించిన పరిమితుల ప్రకారం హెచ్ఐవీ చికిత్సలో ఉపయోగించే నెవిరాపైన్ కాంబినేషన్ ఔషధ ట్యాబ్లెట్‌పై సీలింగ్ ధర రూ. 14.47గా ఉంటుంది. క్యాన్సర్ సంబంధ కీమోథెరపీలో ఉపయోగించే సైటోసిన్ అరాబినోసైడ్ ఒక్కో ప్యాక్ ధర (500 మి.గ్రా) రూ. 455.72గా ఉండనుంది. -
ఐటీ పరిధికి వస్తే... సబ్సిడీ కట్!
-
నల్లకుబేరులకు ఆర్బీఐ మరో షాక్..!
-
ఆర్బీఐ మరో షాక్..!
ముంబై: నల్లకుబేరులకు రిజర్వ్ బ్యాంక్ మరో్ షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆపరేషన్ బ్లాక్ మనీ పథకంలో భాగంగా అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. "నగదు ఉపసంహరణ'' లపై సరికొత్త పరిమితిలను విధించింది. ప్రధాన్ మంత్రి జన్-ధన్ యోజన ఖాతాలనుంచి నగదు విత్ డ్రాకు పరిమితిని విధించింది. బినామీ ఆస్తి లావాదేవీ, డబ్బు లావాదేవీల నుంచి అమాయక రైతులు, గ్రామీణ ఖాతాదారుల రక్షించడానికి వీలుగా విత్ డ్రా లిమిట్ ను పదివేలకు కుదిస్తున్నట్టు వెల్లడించింది. కేవైసి ఖాతాదారులకు నెలలో పదివేలు, నాన్ కేవైసి ఖాతాదారులకు నెలలో అయిదువేలు విత్ డ్రాకు అనుమతినిస్తూ ఆర్బీఐ ఒక ప్రకటన జారీ చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రైతులు, ఇతర ఖాతాదారులకు అక్రమ లావాదేవీలనుంచి రక్షణ కల్పించేందుకుగాను ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే 10వేలకు పైన విత్ డ్రాకు సరియైన ఆధారాలు, పత్రాలు చూపించిన తరువాత బ్యాంక్ మేనేజర్ అనుమతితో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. -
మరోసారి షాక్ ఇవ్వనున్న కేంద్రం
-
హద్దులు మీరుతున్న యువత..!
సంస్కృతి వైపు మొగ్గు –రకరకాల ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి –యుక్త వయస్సులో తీవ్ర ప్రభావం –పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.. ఆలేరు : కౌమారం దశ బహు విచిత్రమైంది. వయస్సు చేసే అల్లరి, తల్లిదండ్రులను ఎదిరించి పంతం నెరవేర్చుకునేలా చేసేది ఈ దశే. ఇంట్లో లభించే స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ యువత పాశ్చాత్య పోకడల వైపు పయనిస్తూ పెడదోవ పట్టేది ఈ వయస్సులోనే. సెల్ఫోన్లలో, కంప్యూటర్లలో ఆశ్లీల కార్యక్రమాలను వీక్షించడం, వీడియో గేమ్‌లు ఆడడం, చాటింగ్ చేయడం, సెల్ఫోన్లతో గంటల తరబడి మాట్లాడడం, ధూమ, మద్యపానం లాంటి దురలవాట్లకు ఆకర్షితులవుతున్న టీనేజీ యువతపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చేతి నిండా డబ్బులు.. నేటి తరంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్యాకెట్ మనీ ఇష్టారాజ్యంగా ఇస్తున్నారు. దీంతో వారు జల్సాలకు అలవాటు పడుతున్నారు. అంతేకాకుండా ఖరీదైన సెల్ఫోన్లు, బైక్ లు, ల్యాప్‌ట్యాబ్‌లు కొనిస్తుండడంతో వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఆకర్షణకు బందీ.. టీనేజీ యువతీయువకులు ఆకర్షణకు బందీ అవుతున్నారు. ప్రేమో, స్నేహమో తెలియని పరిస్థితి నెలకొంది. స్నేహానికి, ప్రేమకు మధ్య అంతరాన్ని గుర్తించడం లేదు. టీనేజీ భావనలను అధిగమించలేకపోవడం, సినిమాలు, టీవీల ప్రభావం, ఇంటివద్ద సమస్యలు తదితర కారణాలతో ప్రేమలో పడుతున్నారు. ప్రేమే లోకం, జీవితం అన్నట్టుగా మునిగిపోతున్నారు. దీంతో చదువు పెడదారిన పడుతోంది. గతంలో విద్యార్థులు చదువు, కే రీర్కు సంబంధించిన విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. కానీ నేఆ పరిస్థితి లేదు. ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయి. ప్రేమలో విఫలమైతే ఉన్మాదులుగా మారుతున్నారు. మరికొందరు ఆత్మహాత్యలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ టీనేజీ వయస్సులోనే ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ నుండే.. సిగరేట్, బీరు తాగడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారు.. నేటి తరం యువత. ఇంటర్ నుంచే వాటిని అలవాటు చేసుకుంటున్నారు. గుట్కాపై నిషేధం ఉన్నా యువత బానిస కావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సిగరెట్ తాగడం విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. ఇంటర్నెట్తో... ఇంటర్నెట్ చాలా మందికి కొత్త విషయాలు తెలుసుకోవాలనే మానసిక జిజ్ఞాస ఉత్సుకతంగా మారుతోంది. హైస్కూల్ వయస్సు మొదలయ్యే ప్రాయంలోనే అధికంగా ఉపయోగిస్తున్న స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు ఏ మాత్రం అప్రమత్తత లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టే. నెట్‌తో అనుసంధానం కాగానే అప్రయత్నంగానే ప్రత్యక్షమయ్యే అవాంచనీయ ప్రకటనలు, చిత్రాలు మనస్సును కలుషితం చేస్తుంది. 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాతనే ప్రారంభించాల్సిన ఫేస్బుక్ ఖాతాను తప్పుడు జనన తేదీలతో ఆరంభిస్తున్నారు. యాప్స్ ద్వారా సునాయసనంగా విషయాలను, చిత్రాలను, దృశ్యాలను పంచుకుంటున్నారు. యూటుబ్లో మంచితో పాటు చెడు కూడా ఉంది. వ్యసనంగా సెల్‌ఫోన్.. నేడు ప్రతి ఒక్కరికీ సెల్‌ఫోన్ వ్యసనంగా మారింది. బైక్ నడుపుతూ, రోడ్డు దాటుతూ, రైలు పట్టాలు దాటుతూ సెల్ఫోన్లో మాట్లడడం సాధారణంగా మారింది. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గంటల తరబడి మాట్లడడం వల్ల సమయం వృధా అవుతుంది. ఇటీవల కాలంలో సెల్ఫీలతో కూడా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. మరియు హెడ్‌ఫోన్స్‌తో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కుర్రాళ్లు జాగ్రత్త అధిక వేగం ఉన్న వాహనాల కొనుగోలుకు యువత అసక్తి చూపుతున్నారు. సై్టల్, హోదా ఉంటుందని వారి భావన. ఖరీదైన బైక్‌లపై మోజు గణనీయంగా పెరుగుతోంది.ఫలితంగా అతివేగం వల్ల వాహనంపై నియంత్రణ లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే తమ పిల్లలకు బైక్‌లను సమకూరుస్తున్న తల్లిదండ్రులపైనే చాలా బాధ్యత ఉందనే విషయాన్ని గమనించాలి. చేతికొచ్చిన పిల్లలు మృత్యువాత పడితే కడుపుకోత బాధ గురించి పిల్లలకు తెలియజేయాలి. బైక్‌లు కొనిచ్చినప్పటికీ.. వాటి నిర్వహణపై తల్లిదండ్రులు గమనిస్తుండాలి. మద్యానికి బానిసలుగా.. యుక్తవయస్సు ఉన్నవారు ఆల్కహాల్‌కు బానిసవుతున్నారు. కొన్నిచోట్ల యువకులు మద్యం కోసం ప్రత్యేక బడ్జెట్‌ను తయారుచేసుకుంటున్నారు. తమ పాకెట్ మనీలో 70శాతం వరకు ఆల్కహాల్‌కే ఖర్చు పెడుతున్నారు. మద్యానికి డబ్బులు లేని సమయంలో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఇటీవల హైద్రాబాద్‌లో కొందరు యువకులు మద్యం తాగి వాహనం నడుపుతూ చిన్నారి రమ్యతో పాటు మరో ఇద్దరు చనిపోయేందుకు కారణమయ్యారు. ముగ్గులోకి లాగుతున్నారు పబ్‌లోకి అమ్మాయిలతో వస్తేనే ప్రవేశం.. స్నేహితులతో కలిసి వెళ్తున్న యువకులకు తీరా అక్కడికి వెళ్లాక మద్యం, మత్తు పదార్ధాలకు అలవాటు చేస్తున్నారు. ఎనర్జీ డ్రింక్స్‌తో మొదలుపెట్టి మద్యం, మత్తుపదార్థాల వరకు చేరుతున్నారు. క్రేజీగా భావిస్తున్నారు. స్టార్ హోటల్స్‌లలో అయితే వైన్ ఫెస్టివల్‌తో యువతారాన్ని ఆకర్షిస్తున్నాయి. క్రమంగా ఆల్కహాల్ ఎక్కువగా ఉండే పానీయాలపై మొగ్గు చూపుతున్నారు. నైతిక విలువలకు ప్రాధాన్యం విద్యార్థులకు ప్రాధమిక స్థాయి నుండే నైతిక విలువల పట్ల అవగాహన కల్పించాలి. మానవత్వం గురించి చెప్పాలి. పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండేలా చూడాలి. చదువు, కేరీర్‌పైనే దృష్టి సారించేలా చూడాలి. తల్లిదండ్రులతో అభిప్రాయాలు పంచుకునేలా స్వేచ్ఛగా వెల్లడించాలి. సమస్యలు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాలి. జీవితమంటే సరదలు, షికారులే కాదు.. లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగేలా ప్రోత్సహించాలి. ప్రేమే జీవితం కాదు.. జీవితంలో ప్రేమ ఓ భాగం మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రుల బాధ్యత పెరగాలి విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. విద్యార్ధులను కేవలం ఉద్యోగాలు సంపాదించి యంత్రాలుగానే కాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి. ఎలాంటి స్నేహాలు చేస్తున్నారు, వారి ప్రవర్తన ఏ విధంగా ఉందని కనిపెడుతుండాలి. విద్యతో పాటు నైతిక విలువలు, మానవత్వం, సామాజిక బాధ్యతలు నేర్పాలి. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి –నర్సింహులు, ఎస్సై, ఆలేరు మారుతున్న సమాజంలో తల్లిదండ్రులు సంపాదన మీద చూపుతున్న శ్రద్ధ కుటుంబంపై చూపడం లేదు. ప్రధానంగా పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చూడాలి. మానవీయ విలువలను తెలియజేయాలి. పిల్లలకు ఆత్మీయత, అనురాగాలు, అనుబంధాలను పెంపొందేలా పెంచాలి. తేడా గుర్తించాలి –డా. ప్రభాకర్ , స్త్రీ వైద్య నిపుణులు, ఆలేరు ప్రేమకు–ఆకర్షణకు తేడా తెలుసుకోవాలి. కౌమరదశ– యవ్వనానికి పూర్వం అంటే 13–19 సంవత్సరాల మధ్య స్త్రీ పురుషుల్లో హర్మోన్ల ప్రభావంతో ఆకర్షణలు ఏర్పడుతాయి. విజ్ఞాత కలిగి హృదయపూర్వక సాన్నిహిత్యాన్ని కోరుకోవడమే అసలైన ప్రేమ. 20 ఏళ్లు దాటిన యువత సమాజం, పరిస్థితులు, కుటుంబ వ్యవస్థ, చదువు అన్నింటిపై అవగాహన కలిగి ఉంటారు. యాంత్రీకరణగా సంబంధాలు –బండిరాజుల శంకర్, ప్రిన్సిపాల్, ఆలేరు ప్రస్తుతం తల్లిదండ్రులకు సంపాదనపై ఉన్న ద్యాసం కుటుంబంపై ఉండడం లేదు. ఆలుమగల మధ్య సంబంధాలు యాంత్రీకరణగా మారడంతో అనుబంధం, ఆత్మీయత, అనురాగం దూరమవుతున్నాయి. వీటి ప్రభావం పిల్లలపై పడుతుంది. పిల్లలు పాశ్చాత్య పోకడలు పట్టకుండా చూడాల్సింది తల్లిదండ్రులదే. వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలపై అవగాహన కల్పించాలి. -
పన్ను మినహాయింపు పరిమితులు పెంచాలి
కేంద్రానికి బ్యాంకుల వినతి న్యూఢిల్లీ: ఆదాయ పను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ. 1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు - 2.5 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కోరాయి. అలాగే దేశీయంగా పొదుపును పెంచేందుకు.. ట్యాక్స్ ఫ్రీ డిపాజిట్ పథకాల లాకిన్ వ్యవధిని ఏడాదికి కుదించాలని విన్నవించాయి. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన సందర్భంగా బ్యాంకర్లు ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి. చౌక ఇళ్లకు ఇన్ఫ్రా రంగ పరిధిలోకి తెచ్చి ప్రాధాన్య హోదా కల్పించే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. మరోవైపు, వైద్యం, విద్య, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన తదితర అంశాలకోసం ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలని సామాజిక సేవ సంస్థల ప్రతినిధులు తమ భేటీలో కోరారు. ఇందుకోసం పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాలు మొదలైన వాటిపై మరింత అధిక పన్ను విధించాలని పేర్కొన్నారు.