వాషింగ్టన్/కొలరాడో: దివాలా(డిఫాల్ట్) ముప్పు నుంచి అగ్రరాజ్యం అమెరికా బయటపడినట్లే. రుణ పరిమితి పెంపునకు సంబంధించిన బిల్లుపై (ద్వైపాక్షిక ఒప్పందం) సెనేట్ తుది ఆమోద ముద్ర వేసింది. సుదీర్ఘమైన చర్చల అనంతరం గురువారం రాత్రి ఓటింగ్ నిర్వహించారు. 63–36 ఓట్లతో బిల్లు ఆమోదం పొందింది. సంతకం కోసం అధ్యక్షుడు జో బైడెన్ డెస్క్‌కు పంపించారు. ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాల్చనుంది.
దేశ రుణ పరిమితిని 31.4 ట్రిలియన్ డాలర్లకు పెంచుతూ బిల్లును రూపొందించారు. అంటే మొత్తం అప్పులు 31.4 ట్రిలియన్ డాలర్లు దాటకూడదు. బిల్లుకు సెనేట్ ఆమోదం లభించడంతో కొత్త అప్పులు తీసుకొని, పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. బడ్జెట్ కట్స్ ప్యాకేజీకి సైతం సెనేట్ ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదం పొందడంలో అమెరికా ఇక ఊపిరి పీల్చుకోవచ్చని సెనెట్ మెజార్టీ నాయకుడు చుక్ షూమర్ చెప్పారు.
ఇది అతిపెద్ద విజయం: బైడెన్
అమెరికా తన బాధ్యతలు నెరవేర్చే దేశం, బిల్లులు చెల్లించే దేశం అని డెమొక్రాట్లు, రిపబ్లికన్లు మరోసారి నిరూపించారని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అమెరికా తన బాధ్యతలను ఎప్పటికీ చక్కగా నెరవేరుస్తుందని చెప్పారు. బిల్లుపై త్వరగా సంతకం చేస్తానన్నారు. చర్చల్లో ఎవరికీ కోరుకున్నది మొత్తం దక్కకపోవచ్చని, అయినప్పటికీ తాము ఎలాంటి పొరపాటు చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు లఅతిపెద్ద విజయమని బైడెన్ అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment