bilateral agreement
-
విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా భారత్
ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన, విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా అవతరించడమే భారత్ లక్ష్యమని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అధీకృత ఆర్థిక ఆపరేటర్ల (ఏఈవోలు) భాగస్వామ్య విస్తరణ, సమగ్ర స్వేచ్ఛా ఆర్థిక కేంద్రాలు, వినూత్నమైన విధానాలను ప్రోత్సహించడం వల్ల ఇది సాధ్యమవుతుందని చెప్పారు.‘సులభతర వాణిజ్యం, అంతర్జాతీయ అనుసంధానతతో నూతన బెంచ్‌మార్క్‌లను (ప్రమాణాలు) ఏర్పాటు చేయాలనే భారత్ లక్ష్యం’ అని ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఈవోల సదస్సులో భాగంగా మల్హోత్రా తెలిపారు. టెక్నాలజీ, విశ్వాసం రెవెన్యూ విభాగానికి రెండు స్తంభాలుగా పేర్కొన్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నిర్వహణలో భారత్ టెక్నాలజీని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అప్పీళ్లు, రిఫండ్లు, చెల్లింపులు తదితర సేవలన్నీ ఆన్లైన్లో అందిస్తున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: గగనతలంలో 17 కోట్ల మంది!‘బిలియన్ల కొద్దీ బిల్లులను ఏటా జారీ చేస్తుంటాం. టెక్నాలజీ సాయం లేకుండా ఈ స్థాయిలో నిర్వహణ సాధ్యం కాదు. భారత్ అన్ని పోర్టులను ఆటోమేట్ చేయాలనుకుంటోంది. 20 ప్రధాన పోర్టుల్లో 17 పోర్టులు ఇప్పటికే ఆటోమేట్‌గా మారాయి. పోర్టుల్లో అన్ని సేవలను, అన్ని సమయాల్లో ఆన్లైన్, ఎలక్ట్రానిక్ రూపంలో అందించేందుకు కృషి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
అమెరికా రుణ పరిమితి బిల్లుకు సెనేట్ ఆమోదం
వాషింగ్టన్/కొలరాడో: దివాలా(డిఫాల్ట్) ముప్పు నుంచి అగ్రరాజ్యం అమెరికా బయటపడినట్లే. రుణ పరిమితి పెంపునకు సంబంధించిన బిల్లుపై (ద్వైపాక్షిక ఒప్పందం) సెనేట్ తుది ఆమోద ముద్ర వేసింది. సుదీర్ఘమైన చర్చల అనంతరం గురువారం రాత్రి ఓటింగ్ నిర్వహించారు. 63–36 ఓట్లతో బిల్లు ఆమోదం పొందింది. సంతకం కోసం అధ్యక్షుడు జో బైడెన్ డెస్క్‌కు పంపించారు. ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాల్చనుంది. దేశ రుణ పరిమితిని 31.4 ట్రిలియన్ డాలర్లకు పెంచుతూ బిల్లును రూపొందించారు. అంటే మొత్తం అప్పులు 31.4 ట్రిలియన్ డాలర్లు దాటకూడదు. బిల్లుకు సెనేట్ ఆమోదం లభించడంతో కొత్త అప్పులు తీసుకొని, పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. బడ్జెట్ కట్స్ ప్యాకేజీకి సైతం సెనేట్ ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదం పొందడంలో అమెరికా ఇక ఊపిరి పీల్చుకోవచ్చని సెనెట్ మెజార్టీ నాయకుడు చుక్ షూమర్ చెప్పారు. ఇది అతిపెద్ద విజయం: బైడెన్ అమెరికా తన బాధ్యతలు నెరవేర్చే దేశం, బిల్లులు చెల్లించే దేశం అని డెమొక్రాట్లు, రిపబ్లికన్లు మరోసారి నిరూపించారని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అమెరికా తన బాధ్యతలను ఎప్పటికీ చక్కగా నెరవేరుస్తుందని చెప్పారు. బిల్లుపై త్వరగా సంతకం చేస్తానన్నారు. చర్చల్లో ఎవరికీ కోరుకున్నది మొత్తం దక్కకపోవచ్చని, అయినప్పటికీ తాము ఎలాంటి పొరపాటు చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు లఅతిపెద్ద విజయమని బైడెన్ అభివర్ణించారు. -
ఈయూతో యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కూటమితో యునైటెడ్ కింగ్డమ్(యూకే) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. పోస్ట్–బ్రెగ్జిట్‌స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) ఇరు వర్గాలు గురువారం ఖరారు చేసుకున్నాయి. ఇందుకు తుది గడువు డిసెంబర్ 31 కాగా, వారం రోజుల ముందే ఒప్పందం కుదరడం విశేషం. ఇందుకు బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరం వేదికగా మారింది. ఇది అతిపెద్ద ద్వైపాక్షిక ఒప్పందమని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ అగ్రిమెంట్ పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో బహిర్గతం కానున్నాయి. ఒక స్వతంత్ర వాణిజ్య దేశంగా ఇకపై తమకు ఎన్నో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇతర భాగస్వామ్య దేశాలతో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి మార్గం సుగమమైందని యూకే అధికార వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. జీరో టారిఫ్‌లు, జీరో కోటాల ఆధారంగా ఈయూతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. దీంతో ధనం, సరిహద్దులు, చట్టాలు, వాణిజ్యం, సముద్ర జలాలపై తమ ఆధిపత్యం మళ్లీ తిరిగి వస్తుందని తెలిపాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 2021 జనవరి 1వ తేదీన తాము పూర్తిగా రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛ పొందుతామని స్పష్టం చేశాయి. ఇదొక పారదర్శక, బాధ్యతాయుతమైన ఒప్పందమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వన్‌డెర్ లెయెన్ అభివర్ణించారు. ఈయూకు యూకే దీర్ఘకాలిక భాగస్వామ్య దేశమని గుర్తుచేశారు. ఈయూ నుంచి విడిపోవడం కొంత బాధాకరమే అయినప్పటికీ, ఇది భవిష్యత్తు వైపు దృష్టి సారించాల్సిన సమయమన్నారు. ప్రధాని బోరిస్ హర్షం పోస్ట్–బ్రెగ్జిట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ద డీల్ ఈజ్ డన్’ అంటూ ఒక మెసేజ్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసం వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బ్రిటిష్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పారు. అతి పెద్ద ఒప్పందాన్ని నేడు ఖరారు చేసుకున్నామని, ప్రజలు కోరుకున్నదే జరిగిందని తెలిపారు. మన ఉత్పత్తులు, వస్తువులను ఇకపై ఈయూ మార్కెట్లలో ఎలాంటి టారిఫ్‌లు, నియంత్రణల భారం లేకుండా విక్రయించుకోవచ్చని అన్నారు. తద్వారా యూకేలో కొత్త ఉద్యోగాలను, గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్లను సృష్టించావచ్చని పేర్కొన్నారు. 1973 తర్వాత తొలిసారిగా మన సముద్ర జలాలపై పూర్తి నియంత్రణతో యూకే ఒక స్వతంత్ర తీరప్రాంతం ఉన్న దేశంగా మారుతుందని తెలిపారు. సముద్ర జలాల్లో చేపల వేటపై యథాతథ స్థితి ఒప్పందం మరో ఐదున్నరేళ్లు మాత్రమే అమల్లో ఉంటుందని, ఆ తర్వాత మన జాలర్లు మన సముద్ర జలాల్లో ఎన్ని చేపలయినా పట్టుకోవచ్చని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. యూకే ఎప్పటికీ యూరప్‌తో సాంస్కృతికంగా, చరిత్రకంగా, వ్యూహాత్మకంగా, భౌగోళికంగా అనుసంధానమైన ఉంటుందని ఉద్ఘాటించారు. బ్రిటిష్ ఎంపీలు డిసెంబర్ 30న సమావేశమై, ఈ ఒప్పందానికి ఆమోదం తెలుపుతారని పేర్కొన్నారు. -
నేటి నుంచి యూఎస్‌కు విమానాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభించే దిశగా భారత ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. విమాన సర్వీసు లను ప్రారంభించేందుకు వీలుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీలతో ప్రత్యేక ద్వైపాక్షిక ఒడంబడికలను కుదుర్చుకుంది. త్వరలో యూకేతోనూ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఈ వివరాలను విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. పారిస్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, ముంబైలకు జూలై 18 నుంచి ఆగస్టు 1 వరకు ఎయిర్ ఫ్రాన్స్ సంస్థ 28 విమాన సర్వీసులను నడుపుతుంది. అలాగే, ఈరోజు నుంచి 31 వరకు ఇరుదేశాల మధ్య అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 18 విమాన సర్వీసులను నడుపుతుంది. ఆ సంస్థ ఢిల్లీ– నెవార్క్‌ల మధ్య ప్రతీరోజు ఒక సర్వీసును, ఢిల్లీ– శాన్‌ఫ్రాన్సిస్కోల మధ్య వారానికి మూడు సర్వీసులను నడుపుతుంది. యూకేతో ఒప్పందం కుదిరిన తరువాత.. ఢిల్లీ, లండన్ల మధ్య రోజుకు రెండు సర్వీసులు ఉంటాయని పురి తెలిపారు. జర్మనీ నుంచి లుఫ్తాన్సా సర్వీసులుంటాయన్నారు. భారత్ నుంచి ఎయిర్ ఇండియా సంస్థ ఆయా దేశాలకు విమాన సర్వీసులను నడుపుతుందని వివరించారు. అంతర్జాతీయ సర్వీసులపై భారత్ ఇప్పటికే యూఏఈతో ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో దీపావళి నాటికి దేశీయ ట్రాఫిక్ కరోనా ముందున్న స్థాయితో పోలిస్తే.. 55 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. భౌతిక దూరంపై ప్రయాణికుల ఆందోళన కరోనా సమయంలో కొందరు విమాన ప్రయాణికులు భౌతిక దూరం నిబంధనను సరిగ్గా పాటించకపోవడాన్ని మిగతావారు ప్రధాన సమస్యగా భావిస్తున్నారని ఒక సర్వేలో తేలింది. జూన్ 20 నుంచి జూన్ 28 వరకు ఆన్లైన్లో సుమారు 25 వేల మంది ప్రయాణికులను సర్వే చేశామని ఇండిగో ప్రకటించింది. -
భారత్–జపాన్, 2+2
దౌత్య సంబంధాలు ఏర్పడటంలోనూ, అవి చిక్కబడటంలోనూ ఎన్నో అంశాలు కీలకపాత్ర పోషి స్తాయి. అందుకే రెండు దేశాలు సాన్నిహిత్యాన్ని పెంచుకుంటుంటే... ఆ రెండు దేశాలతో లేదా వాటిలో ఒక దేశంతో విభేదాలున్న మూడో దేశం ఆ సాన్నిహిత్యాన్ని సంశయంతో చూస్తుంది. జపా న్లో రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పం దాలను సహజంగానే ఇతర దేశాలకన్నా చైనా నిశితంగా గమనిస్తుంది. భారత్–జపాన్ల మధ్య ఏటా జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన మోదీ ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంత ర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆరు ఒప్పందాలపై ఇరు దేశాల మధ్యా సంతకాలయ్యాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇరు దేశాల సహకారం మరింత పెంపొందించేం దుకు ఈ శిఖరాగ్ర సమావేశంలో అంకురార్పణ జరిగింది. ఇంతవరకూ అమెరికాతో మాత్రమే ఉన్న మంత్రుల స్థాయి 2+2 చర్చల ప్రక్రియ విధానాన్ని జపాన్‌కు కూడా వర్తింపజేసేందుకు అంగీకారం కుదిరింది. అమెరికాతో రక్షణ శాఖ, విదేశాంగ మంత్రుల స్థాయిలో 2+2 చర్చల ప్రక్రియ సాగు తోంది. జపాన్‌తో ప్రస్తుతం ఇది కార్యదర్శుల స్థాయిలోనే ఉంది. అయితే దాన్ని మరింత విస్తృతం చేయడం కోసం 2+2 చర్చల ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. 2+2 చర్చల్లో ఇరు దేశాలూ వ్యూహాత్మక, భద్రతా అంశాలపై లోతుగా చర్చించుకుంటాయి. రక్షణ రంగానికి సంబం ధించి రెండు దేశాలూ మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ తమ సైనిక స్థావరాలను ఇరు దేశాలకూ చెందిన సైనిక దళాలు అవసర సమయాల్లో పరస్పరం వినియోగించుకోవడానికి వీలు కల్పించే ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలని అంగీకారానికొచ్చాయి. ఈ మాదిరి ఒప్పందం మనకు ఇంతవరకూ అమెరికా, ఫ్రాన్స్‌లతో ఉంది. ఇది జపాన్‌తో కూడా కుదిరితే ఆఫ్రికా ఖండం లోని ఏడెన్ జలసంధి సమీపంలో జపాన్‌కున్న జిబౌతి స్థావరం మన నావికా దళానికి అందు బాటులోకొస్తుంది. అలాగే హిందూ మహా సముద్రంలోని అండమాన్, నికోబార్ దీవుల్లో భారత్ కున్న సైనిక స్థావరాలు జపాన్ ఆత్మరక్షణ దళాలకు వినియోగపడతాయి. మొన్న ఆగస్టులో ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య చర్చలు జరిగినప్పుడు ఈ అంశం ప్రస్తావనకొచ్చింది. మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు తాజాగా దీనిపై తదుపరి చర్చలు జరపాలన్న నిర్ణయానికొచ్చారు. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి దేశమూ ఖండాంత రాల్లో తన సైనిక స్థావరాలు నెలకొల్పుకోవడానికి ప్రాధాన్యమిస్తోంది. మన దేశం హిందూ మహా సముద్ర ప్రాంత దేశమైన సేషెల్స్‌లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటోంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) హిందూ మహా సముద్ర ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని క్రమేపీ విస్తరించుకోవడాన్ని గమనించాక మన దేశం ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత స్థావరాల విషయంలో సేషెల్స్ సానుకూలత ప్రదర్శించినా స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో మొన్నీ మధ్య వెనకడుగేసింది. వాస్తవానికి సేషెల్స్ 2011లో సైనిక స్థావరం ఏర్పాటు చేయమని చైనాను కోరింది. అది అంగీకరించి ఆ పని పూర్తిచేసింది. సముద్ర దొంగల బెడద నివారణ కోసం ఇది అవసరమని సేషెల్స్ భావించింది. ఇప్పుడు భారత్‌ను కూడా అను మతిస్తే ఆ రెండు దేశాలమధ్యా మున్ముందు సమస్యలు తలెత్తి అవి యుద్ధానికి దారితీస్తే తమ భూభాగంలోనే అవి కత్తులు దూసుకునే ప్రమాదం ఏర్పడుతుందని అక్కడి విపక్షాలు ఆందోళన మొదలుపెట్టాయి. పర్యవసానంగా అది కాస్తా ఆగిపోయింది. యుద్ధ సమయాల్లో తమ దళాలకు అవసరమయ్యే ఆహారం, రక్షణ సామగ్రి తదితరాలను సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో చేరే యడం కోసం ఈ స్థావరాలను నెలకొల్పుకుంటారు. నిజానికి హిందూ మహా సముద్ర ప్రాంతాన్ని ఏ దేశమూ సైనిక స్థావరంగా వినియోగించుకోకుండా, దాన్ని శాంతి మండలంగా ప్రకటించాలని మన దేశంతో సహా చాలా దేశాలు కోరేవి. 60, 70 దశకాల్లో ఆసియా, ఆఫ్రికా దేశాలు దానిపై పట్టు బట్టేవి. 1971లో ఐక్యరాజ్యసమితి ఆ మేరకు తీర్మానం కూడా చేసింది. అప్పట్లో అమెరికా– సోవి యెట్ యూనియన్ల మధ్య ఉండే విభేదాల పర్యవసానంగా పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులుండేవి. తమ దగ్గర అలాంటి స్థితి ఏర్పడకూడదని హిందూ మహా సముద్ర ప్రాంత దేశాల భావన. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎవరికి వారు పోటీలు పడి సుదూర తీర ప్రాంతాల్లో తమ సైనిక స్థావరాలుండాలని కలలు కంటున్నారు. జిబౌతి నిరంకుశ పాలనలో ఉన్న అతి చిన్న దేశం కనుక అక్కడ జపాన్ సైనిక స్థావరానికి అడ్డంకులు ఏర్పడలేదు. ఇప్పుడా స్థావరాన్ని మనం కూడా వినియోగించుకోవడానికి జపాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది గనుక సేషెల్స్ వెనకడుగేయడం వల్ల వచ్చే నష్టం పెద్దగా ఉండదు. తూర్పు చైనా సముద్రంలోని కొన్ని దీవుల విషయమై చైనాతో ఏర్పడ్డ వివాదాల నేపథ్యంలో అంతర్జాతీయంగా తనకు మద్దతు కూడగట్టుకునేందుకు జపాన్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఆ దేశం మనతో సాన్నిహిత్యాన్ని మరింత పటిష్టపరుచుకోవాలన్న ఉత్సు కతతో ఉంది. అయితే ఇరు దేశాల మధ్యా వాణిజ్యం అనుకున్నంతగా విస్తరించడం లేదు. ద్వైపాక్షిక వాణిజ్యంపై 2011లో భారత్–జపాన్‌లు ఒప్పందం కుదుర్చుకున్నా అందులో పెద్దగా పురోగతి లేదు. 2017–18లో మూడేళ్లనాటితో పోల్చినా వాణిజ్యం అంతంతమాత్రమే. ఆ దేశానికి మన ఎగు మతులైనా, అక్కడినుంచి మన దేశానికి దిగుమతులైనా ఒకలాగే ఉన్నాయి. ఈ శిఖరాగ్ర చర్చల సందర్భంగా ఆ అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. అయితే జపాన్ తాను రూపొందించిన నావి కాదళ విమానాలను మనతో డజను వరకూ కొనిపించాలని అయిదేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈసారి కూడా ఆ విషయంలో జపాన్‌కు నిరాశే ఎదురైంది. ఏదేమైనా ఈ శిఖరాగ్ర సమావేశం సాధించింది తక్కువేమీ కాదు. -
మరిన్ని నగరాలకు సర్వీసులు: ఎమిరేట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగంలో ఉన్న దుబాయ్ సంస్థ ఎమిరేట్స్.. భారత్‌లో మరిన్ని నగరాలకు విమానాలను నడుపనుంది. ప్రస్తుతం 10 నగరాలకు సర్వీసులు నడుస్తున్నాయి. సీట్ల సామర్థ్యం పెంపు విషయంలో భారత ప్రభుత్వంతో ద్వైపాక్షిక ఒప్పందం కుదరగానే విస్తరణ ప్రారంభిస్తామని ఎమిరేట్స్ పశ్చిమ ఆసియా, భారత వాణిజ్య కార్యకలాపాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ ఖూరీ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. కొత్త నగరాల్లో అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఏ380 విమానాన్ని ముంబైకి మాత్రమే కంపెనీ నడుపుతోంది. ఒప్పందం పూర్తి అయితే ఢిల్లీ, హైదరాబాద్‌కు ఈ భారీ విహంగాన్ని నడిపేందుకు వీలుందని చెప్పారు. ఎమిరేట్స్ ప్రస్తుతం దుబాయ్-భారత్ మధ్య వారానికి 185 సర్వీసులను అందిస్తోంది. సీట్ల సామర్థ్యం 65 వేలు. 30 శాతం పెరిగిన కంపెనీలు... ఈ ఏడాది ఏవియేషన్ ప్రదర్శనకు అంతర్జాతీయంగా మంచి స్పందన వచ్చిందని మంత్రి చెప్పారు. ‘‘గత ఏవియేషన్ షోలతో పోలిస్తే పాల్గొనే కంపెనీల సంఖ్య 30% పెరిగింది. 25 దేశాల నుంచి 210కిపైగా కంపెనీలు, 29 విమానాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి’’ అని తెలియజేశారు. రెండు దేశాలు, ఏడు రాష్ట్రాలు భాగస్వాములుగా ఉన్న ఈ సదస్సులో ప్రపంచంలోని అన్ని విమాన తయారీ కంపెనీల ప్రతి నిధులూ పాల్గొన్నారని చెప్పారాయన. ‘‘విమానాల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే పలు ఒప్పందాలు జరిగాయి. ఈ సారి ఎక్కువగా నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాల్ (ఎంఆర్వో) యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నాం. ఈ దిశగా కొత్త పాలసీలో పలు నిర్ణయాలు కూడా ప్రకటిస్తాం’’ అని వివరించారు.