debit
-
దివాలా అస్త్రం నుంచి బయటపడ్డ బైజూస్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ దివాలాకు సంబంధించిన ఎన్సీఎల్టీ వివాదాన్ని పరిష్కరించుకుంది. ఈమేరకు బీసీసీఐతో కుదుర్చుకున్న రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. బెంగళూరు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన రూలింగ్‌ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్– చెన్నై బెంచ్) కొట్టివేసింది. దాంతో బైజూస్‌కు ఊరట లభించినట్లయింది.బీసీసీఐ స్పాన్సర్షిప్ కోసం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బైజూస్ డబ్బు చెల్లించాల్సి ఉంది. ఈమేరకు కుదిరిన రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. అయితే, అండర్‌టేకింగ్‌లో పేర్కొన్న నిర్దిష్ట తేదీల్లో చెల్లింపులు చేయడంలో ఏదైనా వైఫల్యం జరిగితే, తిరిగి బైజూస్‌పై దివాలా ప్రక్రియ పునరుద్ధరించేలా హెచ్చరికతో కూడిన ఉత్తర్వులను అప్పీలేట్ ట్రిబ్యునల్ జారీ చేసింది. అమెరికా రుణదాతలు చేసిన ఆరోపణల ప్రకారం.. బైజూస్ తాను తీసుకున్న రుణాలను నిర్దిష్ట లక్ష్యాలకు కాకుండా ‘రౌండ్–ట్రిప్పింగ్’కు వినియోగించుకుందని పేర్కొన్నారు. గతంలో చేసిన ఈ ఆరోపణలను కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. దానికి తగిన సాక్ష్యాలను అందించడంలో రుణదాతలు విఫలమయ్యారని పేర్కొంది. బైజూస్ వ్యవస్థాపకులు రవీంద్రన్ సోదరుడు–రిజు రవీంద్రన్ తన షేర్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను ఇప్పటివరకూ రుణ చెల్లింపులకు వినియోగించినట్లు పేర్కొంటూ... రౌండ్ ట్రిప్పింగ్ ఆరోపణలకు సాక్ష్యాలు లేవని తెలిపింది. రుణ చెల్లింపుల షెడ్యూల్ ఇదీ... ఒప్పందం ప్రకారం, రిజు రవీంద్రన్ జూలై 31న బీసీసీఐకి బైజూస్ చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లు చెల్లించారు. శుక్రవారం (ఆగస్టు 2న) మరో రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిగిలిన రూ.83 కోట్లను ఆగస్టు 9న ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించనున్నారు. వివాదమేమిటీ? బీసీసీఐ, బైజూస్‌లు 2019 జూలై 25న కుదుర్చుకున్న ’టీమ్ స్పాన్సర్ ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం..భారత క్రికెట్ జట్టు కిట్‌పై తన ట్రేడ్‌మార్క్/బ్రాండ్ పేరును ప్రదర్శించే ప్రత్యేక హక్కు బైజూస్‌కు ఉంది. అలాగే క్రికెట్ సిరీస్‌ల ప్రసార సమయంలో ప్రకటనలు, ఆతిథ్య హక్కులనూ కలిగి ఉంది. 2023 మార్చి 31 తేదీ వరకూ ఈ సర్వీసులు బైజూస్‌కు అందుబాటులో ఉంటాయి. ఇందుకు సంబంధించి బైజూన్ (కార్పొరేట్ డెబిటార్), ఆపరేషనల్ క్రెడిటార్ (బీసీసీఐ)కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2022లో జరిగిన భారత్–దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్‌కు సంబంధించి బైజూస్ ఒక ఇన్వాయిస్పై రూ. 25.35 కోట్లు చెల్లించింది. తదుపరి ఇన్వాయిస్లకు చెల్లించడంలో విఫలమైంది. రూ.143 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని బీసీసీఐ క్యాష్ చేసుకున్నప్పటికీ అది పూర్తి బకాయిని కవర్ చేయలేకపోయింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, ఆసియా కప్, ఐసీసీ టి20లతో సహా సిరీస్‌లు, టూర్లకు ఆగస్టు 2022 నుంచి జనవరి 2023 మధ్య స్పాన్సర్షిప్ రుసుము రూ.158.9 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనితో బీసీసీఐ బైజూస్‌పై ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్‌ను ఆశ్రయించింది. బైజూన్ రూ.159 కోట్లు చెల్లించడంలో విఫలమైందని పేర్కొంటూ, మాతృ సంస్థ థిక్ అండ్ లేర్న్పై దివాలా చర్యలకు అనుమతించాలని కోరింది. ఈ పిటిషన్‌ను జులై 16న అనుమతిస్తూ, ఎన్సీఎల్టీ మధ్యంతర దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) పంకజ్ శ్రీవాస్తవను నియమించింది. దాంతో సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ రవీంద్రన్ ఐఆర్‌పీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కూడా ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. అయితే దీనిపై బైజూస్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.కష్టాల కడలిలో... బైజూస్ విలువ ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే మహమ్మారి నియంత్రణలను సడలించిన తర్వాత పాఠశాలలను తిరిగి తెరవడం ఎడ్టెక్ సంస్థకు గొడ్డలిపెట్టయ్యింది. బ్లాక్‌రాక్ ఇటీవల సంస్థ విలువను 1 బిలియన్ డాలర్లను తగ్గించింది. రెండేళ్ల క్రితం ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ డెడ్లైన్లను పాటించడంలో విఫలమవడం, రాబడి అంచనాలకు 50 శాతానికి పైగా తగ్గించడం వంటి అంశాలతో కంపెనీ కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రోసస్ అండ్ పీక్ 15సహా బైజూస్ మాతృసంస్థలో పెట్టుబడిపెట్టిన వారంతా ఫిబ్రవరిలో జరిగిన అసాధారణ సమావేశంలో (ఈజీఎం) ‘‘తప్పుడు నిర్వహణ విధానాలు– వైఫల్యాల‘ ఆరోపణలతో రవీంద్రన్‌ను సీఈఓగా తొలగించాలని వోటు వేశారు. అయితే రవీంద్రన్ ఈ ఆరోపణలను ఖండించారు. ఈ వోటింగ్ చట్టబద్దతను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వివాదంపై న్యాయపోరాటం కొనసాగుతోంది.భారీ విజయమిది: బైజూస్ ఎడ్టెక్ సంస్థకు, వ్యవస్థాపకులకు ఇది భారీ విజయమని బైజూస్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు వ్యవస్థాపకులు బైజూ రవీంద్రన్ ఈ పరిణామంపై మాట్లాడుతూ, తాజా ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వు్య కేవలం చట్టపరమైన విజయం మాత్రమే కాదని, గత రెండేళ్లలో బైజూ కుటుంబం చేసిన వీరోచిత ప్రయత్నాలకు నిదర్శనమని అన్నారు. తమ వ్యవస్థాపక బృందం సభ్యులు సవాళ్లను ఎదుర్కొంటూ, అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని పేర్కొంటూ, వారి త్యాగం నిరుపమానమైందన్నారు. ప్రతి ఒక్కరికీ తాను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు. ప్రతి కష్టం పోరాడాలన్న తమ దృఢ నిశ్చయాన్ని పటిష్ట పరిచాయని అన్నారు. -
ట్రీట్మెంట్ కోసం హీరో వద్ద అప్పు.. క్లారిటీ ఇచ్చిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్‌తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అందుకోసం కొద్దిరోజుల పాటు సినిమాలకు కూడా ఆమె బ్రెక్ ఇచ్చింది. ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నట్లు కూడా తెలిపింది. కానీ అందుకు అయ్యే ఖర్చు సుమారు రూ.25 కోట్లు అని, ఆ డబ్బు కూడా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరో వద్ద అప్పుగా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై సమంత ఇలా క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు) మయోసైటిస్ చికిత్స కోసం రూ.25 కోట్లా!? ఇదీ తప్పు.. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. అందుకు అయ్యే ఖర్చు నా సంపాదనలో కొంత వరకు మాత్రమే అవుతుంది. ఆ ఖర్చు నేను పెట్టుకోగలను. నా కెరీర్లో సంపాదించిన మొత్తాన్ని ఇందుకోసమే ఖర్చు చేశానని నేను అనుకోవడం లేదు. నా జాగ్రత్తలు నేను చూసుకోగలను. మయోసైటిస్ అనేది ఓ సమస్య మాత్రమే. వేలాది మంది ప్రజలు కూడా దీనితో బాధపడుతున్నారు. ఇలాంటి విషయాలపై చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు దయచేసి కాస్త బాధ్యతగా ఉండాలి'అని సమంత తెలిపింది. (ఇదీ చదవండి: లలిత్ మోదీతో బ్రేకప్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన సుష్మితాసేన్!) ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న సమంత ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. దీంతో ఆమె భారీగానే ఆస్తి కూడబెట్టింది. అలాంటి సమంతకు అప్పు చేయాల్సిన అవసరం లేదని నెటిజన్స్ అంటున్నారు. సమంత విషయంలో పలు రూమర్స్ వస్తూనే ఉంటాయని, వాటిని నమ్మాల్సిన పనిలేదని సమంత ఫ్యాన్స్ కూడా తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
మోదీ హయాంలో 3 రెట్లు పెరిగిన దేశ అప్పు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తిరోగమన పాలనా విధానాల వల్లే దేశ అప్పు గత 9 ఏళ్ల బీజేపీ పాలనలో మూడు రెట్లు పెరిగిందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రస్తుతం దేశ ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదలచేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘మోదీ పాలనలో దేశ అప్పు ఈ 9 ఏళ్లలో మూడు రెట్లు ఎగసి రూ.155 లక్షల కోట్లకు చేరింది. 2014లో ఈ ప్రభుత్వం వచ్చిననాటి నుంచి లెక్కిస్తే అదనంగా రూ.100 లక్షల కోట్ల అప్పు పెరిగింది. గుజరాత్‌కు సీఎంగా ఉన్న కాలంలో మోదీ.. అసమర్థులు, అవినీతిపరులు, సత్తాలేని వాళ్లు అంటూ ఇతర పార్టీల ప్రభుత్వాలను విమర్శించేవారు. వాస్తవానికి ఈ గుణాలు మోదీకే సరిగ్గా సరిపోతాయి. దేశార్థికాన్ని దారుణంగా దెబ్బతీసి నిరుద్యోగం, ధరల్ని పెంచేశారు. గత 67 ఏళ్లలో 14 మంది ప్రధానులు మొత్తంగా రూ.55 లక్షల కోట్లు అప్పు చేస్తే మోదీ ఒక్కరే రూ.100 లక్షల కోట్లు పెంచేశారు. ఆర్థికవ్యవస్థను సరిదిద్దడమంటే జాతీయమీడియాలో పతాక శీర్షికలకు ఎక్కడం, టెలీప్రాంప్టర్ సాయంతో సుదీర్ఘ ప్రసంగాలు దంచేయడం, వాట్సాప్‌లో సందేశాలు ఫార్వార్డ్ చేయడం లాంటి పనికానే కాదు’ అని అన్నారు. ఆదాయ అంతరాలను ఈ ప్రభుత్వం పెంచేసింది. జనాభాలో కేవలం 10 శాతమున్న సంపన్నుల వద్ద ఏకంగా 80 శాతం సంపద పోగుబడింది. జీఎస్టీ వసూళ్లలో వీరి వాటా మూడు శాతమేనన్నారు. -
అమెరికా రుణ పరిమితి బిల్లుకు సెనేట్ ఆమోదం
వాషింగ్టన్/కొలరాడో: దివాలా(డిఫాల్ట్) ముప్పు నుంచి అగ్రరాజ్యం అమెరికా బయటపడినట్లే. రుణ పరిమితి పెంపునకు సంబంధించిన బిల్లుపై (ద్వైపాక్షిక ఒప్పందం) సెనేట్ తుది ఆమోద ముద్ర వేసింది. సుదీర్ఘమైన చర్చల అనంతరం గురువారం రాత్రి ఓటింగ్ నిర్వహించారు. 63–36 ఓట్లతో బిల్లు ఆమోదం పొందింది. సంతకం కోసం అధ్యక్షుడు జో బైడెన్ డెస్క్‌కు పంపించారు. ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాల్చనుంది. దేశ రుణ పరిమితిని 31.4 ట్రిలియన్ డాలర్లకు పెంచుతూ బిల్లును రూపొందించారు. అంటే మొత్తం అప్పులు 31.4 ట్రిలియన్ డాలర్లు దాటకూడదు. బిల్లుకు సెనేట్ ఆమోదం లభించడంతో కొత్త అప్పులు తీసుకొని, పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. బడ్జెట్ కట్స్ ప్యాకేజీకి సైతం సెనేట్ ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదం పొందడంలో అమెరికా ఇక ఊపిరి పీల్చుకోవచ్చని సెనెట్ మెజార్టీ నాయకుడు చుక్ షూమర్ చెప్పారు. ఇది అతిపెద్ద విజయం: బైడెన్ అమెరికా తన బాధ్యతలు నెరవేర్చే దేశం, బిల్లులు చెల్లించే దేశం అని డెమొక్రాట్లు, రిపబ్లికన్లు మరోసారి నిరూపించారని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అమెరికా తన బాధ్యతలను ఎప్పటికీ చక్కగా నెరవేరుస్తుందని చెప్పారు. బిల్లుపై త్వరగా సంతకం చేస్తానన్నారు. చర్చల్లో ఎవరికీ కోరుకున్నది మొత్తం దక్కకపోవచ్చని, అయినప్పటికీ తాము ఎలాంటి పొరపాటు చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు లఅతిపెద్ద విజయమని బైడెన్ అభివర్ణించారు. -
గోద్రేజ్ క్యాపిటల్ రుణ వితరణ లక్ష్యం రెట్టింపు
ముంబై: గోద్రేజ్ గ్రూపులో భాగమైన ఆర్థిక సేవల సంస్థ గోద్రేజ్ క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రుణ వితరణను రూ.12,000 కోట్లకు పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. 2023 మార్చి నాటికి ఇది రూ.5,500 కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ నాన్ బ్యాకింగ్ ఆర్థిక సేవల సంస్థ (ఎన్బీఎఫ్సీ) 2020 చివర్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా కార్యకలాపాలు ప్రారంభించింది. గోద్రేజ్ ప్రాపర్టీ కస్టమర్లకు రుణాలు సమకూర్చే లక్ష్యంతో మొదలు కాగా, తర్వాత ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈ రంగానికి కూడా రుణాలు ఇవ్వడం ఆరంభించింది. మార్చి చివరికి ఉన్న రూ.5,500 కోట్ల రుణాల్లో రూ.4,000 కోట్లు హోమ్ లోన్ విభాగానికి చెందినవి. ఇందులోనూ సగానికి పైగా (రూ.2వేల కోట్లకు పైన) గోద్రేజ్ ప్రాపర్టీస్ కస్టమర్లకు ఇచ్చినవే ఉన్నాయి. మిగిలిన చిన్న వ్యాపారస్థులకు ఇచ్చినవి కావడం గమనార్హం. తమ రెండు విభాగాల్లో (హౌసింగ్, ఎంఎస్ఎంఈ) నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) సున్నాగా ఉన్నట్టు సంస్థ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు. మార్చి త్రైమాసికంలో ఎంఎస్ఎంఈ విభాగం కూడా లాభాల్లోకి అడుగు పెట్టినట్టు చెప్పారు. హోమ్‌లోన్ విభాగం గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి లాభాల్లోనే ఉన్నట్టు తెలిపారు. ప్రమోటర్ల నుంచి రూ.1,200 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రమోటర్లు రూ. 1,200 కోట్ల నిధులు సమకూర్చనున్నట్టు మనీష్ షా వెల్లడించారు. మొదటి విడత నిధులు ప్రస్తుత త్రైమాసికంలోనే రానున్నట్టు తెలిపారు. 2024 మార్చి చివరికి నిర్ధేశించుకున్న రూ.12వేల కోట్ల రుణ పుస్తకంలో రూ.7,000 కోట్లు ఎంఎస్ఈ/ఎంఎస్ఎంఈ నుంచి ఉంటాయని షా చెప్పారు. ఎంఎస్ఎంఈ కస్టమర్ల బేస్ ప్రస్తుతం 1,000గా ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి పది రెట్లు పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు వెల్లడించారు. ‘‘యాజమాన్యం కార్యకలాపాలు ప్రారంభించిన మూడో ఏడాది రుణ పుస్తకం రూ.10,000 కోట్లను అధిగమించాలనే లక్ష్యాన్ని పెట్టింది. మేము దీన్ని చేరుకుంటామనే నమ్మకంతో ఉన్నాం. వచ్చే మూడేళ్లలో ఎంఎస్ఎంఈ/ఎస్ఎంఈ పుస్తకం రూ.30,000 కోట్లకు, 2028–29 చివరికి మొత్తం రుణ పుస్తకం రూ.50,000 కోట్లను అధిగమిస్తుంది’’అని చెప్పా రు. అప్పుడు కంపెనీని ప్రజల ముందుకు తీసుకెళ్లడాన్ని పరిశీలించొచ్చన్నారు. ఎంఎస్ఎంఈ/ఎస్ఎంఈలకు రుణ సేవల కోసం నిర్మన్ పేరుతో ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను షా ప్రకటించారు. -
మోదీ చేసిన అప్పు 100 లక్షల కోట్లు.. బీఆర్ఎస్ సర్కారు అప్పు ఎంతంతే?
ఇండియన్ ‘లోన్’ మోదీకి ముందున్న 14 మంది ప్రధానులు చేసిన అప్పు రూ. 56 లక్షల కోట్లయితే, మోదీ ఎనిమిదిన్నరేళ్లలో రూ. 100 లక్షల కోట్లు అప్పు చేశారు. పుట్టబోయే ప్రతి బిడ్డపై 1.25 లక్షల రూపాయల రుణభారం మోపారు. – కేటీఆర్ కామెంట్ ....... కౌంటర్.. ‘స్టేట్’మెంట్ తెలంగాణ అప్పు రూ. 3.12 లక్షల కోట్లయ్యింది. రెండేళ్లలోనే బీఆర్ఎస్ సర్కారు రూ. 87 వేల కోట్ల అప్పును చేసింది. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. మన పిల్లలకు అప్పు మిగులుస్తున్నారు. సరాసరి తలసరి రూ. 94 వేల అప్పును మోపుతున్నారు – బండి సంజయ్, కిషన్‌రెడ్డి విమర్శలు ....... అప్పుల ‘మధ్య’తరగతి.. ‘‘కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చేమోగానీ, కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేం..’’ అంటారు. కళ్ల తడి కామన్ కానీ, ఈ రోజుల్లో అసలు అప్పు చేయకుండా జీవితం దాటనేలేం. కుటుంబాలన్నీ అప్పుల కుప్పలే. ‘ఈఎంఐ’.. అని రుణాల పేరు పోష్‌గా మారిందంతే. వాయిదాల్లేకుండా బతికేదెవ్వరు.. ఇంటికి, బండికి, చదువుకు, పెళ్లికి.. చిట్లు.. ఒక్కటేమిటి ముఖ్యంగా మధ్యతరగతి బతుకంటేనే అప్పులు కదా...! చిన్నప్పుడు ‘తీసివేతలు’ నేర్పుతున్నప్పుడు లెక్కల మాస్టారు ‘ఒకటి అప్పు తీసుకోరా ..’ అని ఎప్పటి నుంచి చెప్పారో, అప్పటినుంచి బతుకు లెక్కంతా అప్పులే. రుణాలు తీసుకుంటూనే ఉన్నాం. వడ్డీలు, కిస్తులు కడుతూనే ఉన్నాం. అప్పూ గొప్పే... రిచ్ క్లాస్‌లో ఇదేం నామోషీ కాదు. అంబానీ నుంచి అదానీ దాకా అపరకుబేరులైనా అప్పు చేయా ల్సిందే. నిజానికి ఇలాంటి వారికే ఎక్కువ అప్పు లిస్తారు కూడా. ఈ రేంజ్లో ఉన్న వారికి రెడ్ కార్పెట్ వేసి అప్పులిచ్చి గౌరవించడం, ఎగ్గొడితే ఫ్లయిట్లలో విదేశాలకు పంపడం కూడా మనకు తెలిసిందే కదా.. అప్పుకు మారుపేరైన.. ‘ఈఎంఐ’ల్లో పుట్టి (హాస్పిటల్ చార్జీలు కూడా ఈఎంఐలో కట్టేంతగా ఉంటాయి), ఈఎంఐల్లో పెరిగి, ఈఎంఐలతో చదువుకుని, ఈఎంఐల్లో పోవడమే మధ్య, పేద తరగతి జీవితం. కానీ, అప్పుల్లోనూ అంత ఖదర్‌గా బతికే బిజినెస్, రిచ్ క్లాసూ ఉంది. రుణ.. పురాణం నిజానికి ఈ అప్పు లొల్లి, అప్పుల్లోనూ పేద ధనిక తారతమ్యం పురాణాల కాలం నుంచీ ఉన్నట్టుంది. బూడిద పూసుకుని, కనీసం ఒంటిపై బ్రాండెడ్ బట్టల్లేకుండా పులి చర్మాలు, నారచీరలు ధరించి శ్మశానాల్లో తిరుగుతూ ఉండే ‘శంకరుడి’కి కుబేరు డెప్పుడయినా లోన్ ఆఫర్ చేసిన సందర్భాలు కనిపిస్తాయా..? గడ్డ కట్టుకు పోయే చలిలో హిమాలయాల్లో నివసించే శివుడు కనీసం ‘హోమ్‌లోన్’కు అప్లయి చేసుకున్న దాఖలాలూ లేవు. యుగాల తరబడి అదే నందీశ్వరుడిని యూజ్ చేశాడే కానీ, ఎవరైనా శివుడికి ‘వెహికల్ లోన్’ అరేంజ్ చేశారా..? పుష్పక విమానంలో తిరిగే కుబేరుడు ఆఫర్ చేశాడా.. ఎందుకంటే ఆయన పేద దేవుడు. పైగా ఎవరేం అడిగినా ఇచ్చేసే భోళా శంకరుడాయే.. ‘కొల్లాటరల్ సెక్యూరిటీ’ చూపే శక్తి లేదు. ప్రధానుల, ముఖ్యమంత్రుల రికమండేషన్ కూడా లేనట్టుంది. ... ఇప్పటి మన రైతులు, పేదోళ్ల పరిస్థితిలాగా! అదే, విష్ణుమూర్తిని చూడండి. ఆయన మ్యారేజీకి కుబేరుడు ఎంత డబ్బిచ్చాడు! తిరుపతి వెంకన్నఇంకా కిస్తులు కడుతూనే ఉన్నాడు. ఆయనకు ఆ అప్పెలా వచ్చింది. ఆ అప్పు ఎందుకు తప్పు కాలేదు..? ఎందుకంటే ఆయన బాగా రిచ్చి. స్వయంగా లక్ష్మీదేవియే అర్ధాంగి. దేవుళ్లలో బాగా పలుకుబడి ఉన్నవాడు. ఘనంగా అల వైకుంఠపురంలో ఆ మూల సౌధాల్లో నివసిస్తాడు. పెద్దోళ్లందరికీ కావలసినవాడు. ఇంకేం ఎంతైనా అప్పు పుట్టుద్ది... మన రిచ్ పీపుల్ లాగా. – ఇక మన ఆర్థిక మంత్రి సీతారామన్ లాంటి వాళ్లెవరైనా ఉంటే దేవుళ్లలో ఇప్పటికే వెంకన్న రుణం అంతా ‘రైటాఫ్ ’ అయిపోయేది. అప్పు.. సంపన్నం ఇది చూడండి.. మనం ఆరాధనగా చూసే అమెరికా, సింగపూర్ తలసరి అప్పులు ఎక్కువే. అక్కడ సింగపూర్‌లో ఒక్కొక్కరిపై 97.46 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి. జపాన్, కెనడా, బెల్జియం వంటి సంపన్న దేశాల వారి తలసరి అప్పులు ఎక్కువ. రిచ్‌నెస్ అలా ఉంటది మరి. అప్పుల్లోనూ.. పూర్ ఆఫ్గానిస్థాన్ , డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బురుండి, మడగాస్కర్, లైబీరియా వంటి చిన్న దేశాల్లో తలసరి అప్పు తక్కువే. విదేశాల నుంచి అప్పులు దొరకడం కష్టం. ఆదాయమే సరిగ్గా లేని వాళ్లకు అప్పులెలా ఇస్తారు.. అదీ సంగతి ....... .. ఇంతకీ బీఆర్ఎస్కైనా, బీజేపీకైనా చెప్పొచ్చేదేమంటే.. ఎంత అప్పుంటే అంత దర్జా.. ఎంత దర్జా ఉంటే అంత అప్పు... కనుక ‘పక్కోడు చేసే అప్పులు..’ పెరుగుతున్నాయని చింతించవలదు. డబ్బున్నోడికి అప్పు ఈజీ కదా.. అంటే అప్పుంటే డబ్బు, దర్పం ఉన్నట్టే కదా! అంటే మనం బాగానే ఉన్నాం అనుకుంటే సరి. ....... కానీ, ‘...మన మీద పడే అప్పులపై ’ చింతించే మిడిల్ క్లాస్ ఒకటి ఉందండోయ్.. ‘ఇప్పటికే ఏళ్ల తరబడి ఇంటి లోన్ కడుతున్నాను, ఈ మధ్యే పిల్లాణ్ణి స్కూల్లో వేయడానికి ఓ లక్ష అప్పు చేశాను, కరోనా మింగిన నాలుగు లక్షల తాలూకు అప్పు, వడ్డీ అలాగే ఉన్నాయి. రెండో అమ్మాయి స్కూల్లో చేరడానికి రెడీ అవుతోంది. ఈ ఖర్చులిలా ఉండగా మన ‘డబుల్ ఇంజన్ సర్కార్లు’ వాళ్లు చేసిన అప్పులన్నీ మనతోనే కట్టిస్తారు.. వాళ్ల జేబు లోంచి కట్టరుగా... అని మా ఆవిడ భయంగా అడుగుతోంది..’ – కేటీఆర్, సంజయ్ ΄పోటా పోటీ ‘అప్పుల’ విమర్శలు చూసి ఓ నెటిజన్ పోస్టు ఇది. ఆలోచించదగ్గ ఆందోళనే. అక్కడిదాకా రాకుండా చూడండి. ఇప్పటికే అప్పులు కట్టలేక చస్తున్నాం. (క్లిక్ చేయండి: బయటపడిన అమెరికా డొల్లతనం) -
క్యూ1లో తగ్గిన భారత్ విదేశీ రుణ భారం
ముంబై: భారత్ విదేశీ రుణ భారం 2022 జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చితే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 2.5 బిలియన్ డాలర్లు తగ్గి 617.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన సమాచారం ప్రకారం, 2022 మార్చి త్రైమాసికంలో జీడీపీ విలువలో విదేశీ రుణ నిష్పత్తి 19.9 శాతం అయితే, ఇది జూన్ త్రైమాసికానికి 19.4 శాతానికి దిగివచ్చింది. డాలర్ మారకంలో భారత్ రూపాయి, ఇతర కరెన్సీ విలువల సర్దుబాటు, లాభ నష్టాల నేపథ్యం రుణ భారం తగ్గడానికి కారణమని గణాంకాలు పేర్కొన్నాయి. ‘వాల్యుయేషన్ ప్రభావం మినహాయిస్తే, విదేశీ రుణం 2022 మార్చి చివరితోపోల్చి 2022 జూన్ చివరి నాటికి 2.5 బిలియన్ డాలర్లు తగ్గడానికి బదులుగా 11.9 బిలియన్ డాలర్లు పెరిగింది‘ అని కూడా సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. కాగా, 2022 చివరినాటికి దీర్ఘకాలిక రుణం (ఏడాది కన్నా ఎక్కువ వాస్తవ మెచ్యూరిటీ విషయంలో) 487.3 బిలియన్ డాలర్లుగా ఉందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. 2022 మార్చి చివరి నాటితో పోల్చితే ఈ విలువ 10.6 బిలియన్ డాలర్లు తగ్గడం గమనార్హం. -
యూనిటీ బ్యాంక్ ప్రారంభం
ముంబై: యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభమయ్యాయి. దీనితో రూ. 7,000 కోట్ల రుణ కుంభకోణంతో కూరుకుపోయిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్... రానున్న కాలంలో యూనిటీ బ్యాంక్‌లో విలీనం కావడానికి మార్గం సుగమం అయ్యింది. సెంట్రమ్ గ్రూప్, పేమెంట్స్ యాప్ భారత్‌పే 51:49 భాగస్వామ్యంతో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటయ్యింది. అక్టోబర్ 12న సంస్థ ఆర్బీఐ లైసెన్స్ పొంది రికార్డు సమయంలో కార్యకలాపాలు ప్రారంభించింది. పీఎంసీ బ్యాంక్‌ను యూనిటీ బ్యాంక్ స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదన ఉంది. ఆర్బీఐ దీనికి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఒక బ్యాంక్ మరొక బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవలంటే, ఆ బ్యాంక్ మొదట వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలి. -
రుణానికి డిమాండ్ లేదని చెప్పలేం..
ముంబై: రుణాలకు డిమాండ్‌లేదని ఇప్పుడే ప్రకటించడం తొందరపాటు చర్య అవుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రుణ వృద్ధికి బ్యాంకింగ్ అక్టోబర్ నుంచీ జిల్లాల వారీగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. ‘‘మహమ్మారి కరోనా ప్రారంభం నుంచీ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొనడానికి కేంద్రం పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఈ ఉద్దీపన ప్యాకేజీలు సత్ఫలితాలు ఇవ్వడంలో రుణ వృద్ధి కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అక్టోబర్ నుంచీ చేపట్టనున్న జిల్లాల వారీ చర్యలు రుణ వృద్ధికి ఊపునిస్తాయి’’ అని ఆర్థికమంత్రి ఇక్కడ జరిగిన ఒక విలేకరుల సమావేశంలో విశ్లేషించారు. రుణ వృద్ధికి ఊపునందించడానికి 2019లో సైతం బ్యాంకులు 400 జిల్లాల్లో ‘‘రుణ మేళా’’లను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రుణ వృద్ధి రేటు దాదాపు 6 శాతంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనబడుతోంది. 2019 నుంచీ రూ.4.94 లక్షల కోట్ల రుణాలు బ్యాంకింగ్ చేపట్టిన ప్రత్యేక చర్యల ద్వారా 2019 నుంచి మార్చి 2021 వరకూ రూ.4.94 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేసినట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ‘ఈ ఏడాది అక్టోబర్ నుంచీ రుణ వృద్ధి పెరుగుదలకు బ్యాంకింగ్ జిల్లాలవారీ మేళాలను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–సూక్ష్మ రుణ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐ)ల ద్వారా రుణ గ్రహీతలకు రూ.1.5 లక్షల కోట్ల వరకూ రుణాన్ని అందించాలన్నది కేంద్రం లక్ష్యమని తెలిపారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో రుణ వృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆలాగే ఈశాన్య రాష్ట్రాల్లో రవాణా, ఎగుమతిదారులకు తగిన రుణ లభ్యత అందుబాటులో ఉంచడానికి రాష్ట్రాలవారీ ప్రత్యేక చర్యలు అవసరమని పేర్కొన్నారు. బ్యాంకర్లతో కీలక చర్యలు అంతకుముందు ఆర్థికమంత్రి 12 ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎండీ, సీఈఓలతో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ‘‘ఒక జిల్లా, ఒక ఎగుమతుల కేంద్రం’’ సందేశంలో భాగంగా ఎగుమతిదారులకు తగిన రుణ లభ్యత కల్పించడానికి జిల్లాలవారీగా ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకులను కోరినట్లు సీతారామన్ తెలిపారు. అలాగే ఫైనాన్షియల్ టెక్నాలజీ డిమాండ్లను నెరవేర్చడంలో తగిన మద్దతు నివ్వాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఆర్థికమంత్రి 2021–22కి సంబంధించి ‘ఈఏఎస్‌ఈ 4.0 ఇండెక్స్’ లక్ష్యాలను ఆవిష్కరించా రు. స్మార్ట్ అండ్ క్లీన్ బ్యాంకింగ్ దిశలో అడుగులు, లక్ష్యంలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉమ్మడి సంస్కరణల ఎజెండాగా 2018 జనవరిలో ‘ఈజ్’ విధానాన్ని ఆవిష్కరించడం తెలిసిందే. ఆర్థికమంత్రి ఇంకేమన్నారంటే... ► సరఫరాల చైన్‌ను మెరుగుపరచడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం దిగివస్తోంది. కరోనా కారణంగా సరఫరాల వ్యవస్థ దెబ్బతినడం వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దాటింది. ద్రవ్యోల్బణం కదలికలను కేంద్రం జాగ్రత్తగా గమనిస్తోంది. అదుపునకు రాష్టాలతో కలిసి పనిచేస్తుంది. ► గత యూపీఏ ప్రభుత్వ ఆయిల్ బాండ్ల భారాన్ని ప్రస్తుత ప్రభుత్వం మోయాల్సి వస్తోంది. ► పెట్రోలు ధరల అదుపునకు రాష్ట్రాలతో కేంద్రం సమన్వయం అవుతుంది. మోనిటైజేషన్ అంటే... రాహుల్ అర్థం చేసుకున్నారా? రెండు రోజుల క్రితం తాను ప్రకటించిన నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్‌పై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలపై ఆర్థికమంత్రి తీవ్రంగా స్పందించారు. ‘‘అసలు ఆయన (రాహుల్ గాంధీ) మోనిటైజేషన్ అంటే ఏమిటో అర్థం చేసుకున్నారా?’’ అని ఆమె ప్రశ్నించారు. 70 ఏళ్లపాటు కూడబెట్టిన ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే ప్రైవేటుకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణను మాత్రమే అప్పగిస్తున్నామని, యజమాని ప్రభుత్వమేనని కేంద్రం స్పష్టం చేస్తోంది. -
అప్పులు నష్టాల ఊబిలో ఏపీఎస్ ఆర్టీసీ
-
రాష్ట్ర సంక్షేమం కోసం అప్పులు చేయడం తప్పు కాదు
-
ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదే
-
ఆస్తి మూరెడు..అప్పు బారెడు
-
డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం పైపైకి!
నోయిడా: రాబోయే మూడు నాలుగేళ్లలో దేశంలో డెబిట్, క్రెడిట్ కార్డులు, ఏటీఎంల వినియోగం బాగా పెరుగుతుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ఆర్థిక లావాదేవీల నిర్వహణకు భవిష్యత్తులో మొబైల్ ఫోన్ల వాడకంపై ఆధారపడతారన్నారు. దేశంలో దాదాపు 72 శాతం ప్రజలు 32 ఏళ్లలోపు వారేనని, 2040 వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. 100 కోట్ల బయోమెట్రిక్ కార్డులు, పెద్ద సంఖ్యలో మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు ఉన్న దేశం మనదేనని చెప్పారు. 7.5 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత్ ముందుకు పోతుందని, ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం సమయంలో మన వృద్ధి రేటు ఒయాసిస్సును తలపిస్తుందని అభిప్రాయపడ్డారు. -
సర్‌చార్జ్!
స్వైప్ చేస్తే నగదు స్వీపే.. – రూ. 100కు రూ. 11.50 వసూలు – వినియోగదారులకు భారం – పెట్రోల్ బంకుల్లో అయోమయం.. ‘ ఎమ్మిగనూరుకు చెందిన రఘువీర్ ఈనెల 4న రూ.15,844ల డీజిల్ వేయించుకొని అమౌంట్‌ను స్వైప్ మిషన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. అరగంట తర్వాత తన అకౌంట్ నుంచీ పైమొత్తంతోపాటు రూ.455.52 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది.’ ‘‘ ఆలూరు నియోజకవర్గంలో పనిచేసే వ్యవసాయాధికారి పాపిరెడ్డి ఎమ్మిగనూరు పెట్రోల్ బంకులో రూ.100లు పెట్రోల్‌ను స్వైప్ద్వారా వేయించుకొన్నాడు.అతని బ్యాంక్ అకౌంట్లో రూ.100తోపాటు రూ.11.50లు అదనంగా డెబిట్ అయ్యింది.’ ఎమ్మిగనూరు : ‘ప్రజలంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు మళ్లాలి.. నగదు రహిత విధానంతో చిల్లర సమస్య ఉండదు. నగదు కొరత అసలే ఉండదు.’ ఇవీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చెబుతున్న మాటలు. ఇందుకోసం ప్రభుత్వం ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన సద్సులు కూడా నిర్వహిస్తోంది. నోట్ల రద్దు నేపథ్యంలో చాలా మంది గత్యంతరం లేక నగదు రహిత లావాదేవీలపై మొగ్గు చూపారు. బాదుడే.. బాదుడు.. అయితే డిసెంబర్ 31 తర్వాత ఆంక్షలు ఎత్తివేయటంతో సర్‌చార్జీల పేరుతో వినియోగదారులను బాదేస్తున్నారు. స్వైప్ ద్వారా పెట్రోల్ బంకుల్లో లావాదేవీలు జరిపే వినియోగదారులు లబోదిబోమంటున్నారు. పెట్రోల్ బంకుల్లో రూ.100లు ఇంధనానికి రూ. 11.50లు చార్జీ వసూలు చేస్తున్నారు. స్వైప్ చేసినప్పుడు రూ.100 మాత్రమే చూపుతున్నా తర్వాత వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో రూ.11.50 డెబిట్ అవుతోంది. అదే విధంగా ఇతర వ్యాపారులు స్వైప్ మిషన్లు వాడితే వినియోగదారుడిపై కాకుండా షాపు యజమానులకు సర్‌చార్జి పడుతోంది. కిరాణా కొట్టులో రూ.100లు బిల్లు చేసి స్వైప్ చేస్తే షాపు యజమాని ఖాతాలో రూ.92లు మాత్రమే జమవుతుంది. అదేవిధంగా వినియోగదారుడిపై రూ.2.8 శాతం అదనంగా చార్జిలు పడుతున్నాయి. బంక్‌లు, బ్యాంకుల మధ్య వార్.. ఈ నెల 1 నుంచి 8 వరకు ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ. 11.50లు వినియోగదారులపై సర్చార్జిలు వసూలు చేస్తున్నారు. సోమవారం నుంచి ప్రతి లావాదేవీలపైనా పెట్రోల్ బంక్ యజమానులకు కూడా 1 శాతం ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలను వర్తింపజేస్తుండడంతో అందరూ ఏకమయ్యారు. పెట్రోల్, డీజిల్ బంక్‌ల్లో సోమవారం నుంచి క్రికెట్, డెబిట్ కార్డులకు అనుమతించేది లేదంటూ బోర్డులు పెట్టారు. అయితే ఉన్నత స్థాయిలో జరిగిన చర్చల మేరకు ఈనెల 13 వరకు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కేవలం వ్యాపారులపై 1 శాతం సర్‌చార్జి పడుతుంటే అందరూ ఏకమై నిర్ణయాలు తీసుకుంటున్నారు.‘ అయితే వినియోగదారుడిపై ఏకంగా రూ. 11.50 ప్రతి లావాదేవీలపై అదనంగా పడుతున్నా స్పందించే వారు కరువయ్యారు. వ్యాపారాలపై దెబ్బ నగదు రహిత లావాదేవీలతో వ్యాపారులు వృద్ధి చెందుతాయనుకున్నాం. కానీ రూ.100లు పెట్రోల్ పోసుకొనే వినియోగదారుడిపై రూ.11.50లు అదనంగా చార్జీలు పడుతుంటం బాధనిపించింది. ఇప్పుడు ఏకంగా మాపై కూడా 1 శాతం సర్‌చార్జీలు వేస్తామని నోటీసులు పంపారు. ఈనెల 13 వరకు నిర్ణయం వాయిదా వేసుకొన్నారు. ఇలా జరిగితే వ్యాపారాలపై దెబ్బ పడుతుంది. -జి.ఎం. మహేంద్ర, పెట్రోల్ బంకు యజమాని చార్జీలు తప్పని సరి నగదు రహిత లావాదేవీలపై 2016 డిసెంబర్ 31 వరకు మాత్రమే ఆంక్షలు ఉండేవి. జనవరి 1 నుంచి పెట్రోల్ బంకుల్లో జరిగే లావాదేవీలపై వినియోగదారుడిపై రూ. 11.50లు చార్జీలు పడతాయి. ఇతర వ్యాపారాల్లో వ్యాపారులకు 8 శాతం వరకు చార్జీలు వర్తిస్తాయి. నిబంధనలను మార్చలేం. – కిరణ్, ఎస్బీఐ స్వైప్ మిషన్ రీజినల్ ఇంచార్జి -
ప్రశ్నార్థకంగా నగదు రహిత లావాదేవీల నిర్వహణ
► అందుబాటులో లేని స్వైపింగ్ మిషన్లు ► ప్రశ్నార్థకంగా మారిన నగదు రహిత లావాదేవీల నిర్వహణ కడప అగ్రికల్చర్: నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకోవాలంటే ప్రతి ఒక్కరికీ బ్యాంకుల్లో ఖాతా ఉండాలి. తప్పని సరిగా రూపే,డెబిట్ కార్డులు ఉండాలి. జిల్లాలో 75 శాతం మందికి ఖాతాలు ఉన్నా అందులో 30 శాతం మందికి కూడా డెబిట్, రూపే, ఏటీఎం కార్డులు లేవు. ఈ పరిస్థితిలో దుకాణాలు, పెట్రోలు బంకుల్లో పాయింట్ ఆఫ్ స్కేల్ మిషన్లు(పీఓఎస్ఎం) పెట్టి నగదు రహిత లావాదేవీలు చేయలేమని వ్యాపారులు అంటున్నారు. . జిల్లాలో రిజిస్టర్ చేసుకున్న షాపులు 3100, చౌకదుకాణాలు 1740 ఉన్నాయి. ఇందులో 2437 పీఓఎస్‌ఎంలు ఉన్నాయి. జిల్లాకు 10 వేల స్వైపింగ్ మిషన్లు కావాలని ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదికలు పంపింది. కిరాణా, మెడికల్ షాపులు, వస్త్ర, బంగారు, తదితర దుకాణాల్లో తప్పని సరిగా పీఓఎస్‌ఎంలు ఏర్పాటు చేసుకుని డెబిట్, రూపే కార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగా ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించింది. అయితే ఆయా షాపుల నిర్వాహకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కార్మిక, వాణిజ్య పన్నుల శాఖ వద్ద ఉన్న అంచనా ప్రకారం షాపులు దాదాపు 20 వేల దాకా ఉన్నట్లు సమాచారం. పీఓఎస్ఎంల కోసం వచ్చిన దరఖాస్తులు 150 దాకా ఉన్నట్లు బ్యాంకర్లు తెలిపారు. దీనిబట్టి చూస్తే నగదు రహిత లావాదేవీలపై వ్యాపార వర్గాలు అంతగా ఆసక్తి చూపడంలేదని తేటతెల్లమవుతోంది. బ్యాంకు ఖాతాలు ఉన్నా... డెబిట్ కార్డులు లేవు జిల్లాలో 29 లక్షలకు పైగా జనాభా ఉంది. జిల్లా మొత్తం 33 బ్యాంకులకు సంబంధించి 330 బ్రాంచీలు పనిచేస్తున్నాయి. ఇందులో పట్టణాల్లో 1,86,092, గ్రామీణ ప్రాంతాల్లో 1,97,658 ఖాతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అన్ని రకాల కార్డులు 3,51,547 అందజేశారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం మందికి డెబిట్ కార్డులు లేవు. దీనిని బట్టి చూస్తే జిల్లా వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం సాధ్యమైన పని కాదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. కేవలం పెట్రోలు బంకులు, షాపింగ్ మాల్స్ల్లో మాత్రమే వీటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుందని, చిన్న దుకాణాల్లో ఈ విధానం అమలు చేసే పరిస్థితి లేదని చిరువ్యాపారులు చెబుతున్నారు. చౌక దుకాణాల్లో కనిపించని మినీ ఏటీఎంలు, స్వైపింగ్ మిషన్లు జిల్లాలో 1740 రేష¯ŒSషాపులు ఉన్నాయి. ఈ షాపుల డీలర్లను బిజినెస్ కరస్పాండెట్లుగా నియమించి, మినీ ఏటీఎంలు, డెబిట్ కార్డులు అందజేసి నగదు రహిత లావేదేవీలు నిర్వహిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పినా ఎక్కడ కూడా అది అమలు కావడం లేదు. స్వైపింగ్ మిషన్లు అందజేయకపోవడంతో నగదు రహితం అమలుకు నోచుకోలేదు. -
వాలెట్లకూ చార్జీలుంటాయ్!!
• దుకాణాల్లో లావాదేవీలకు రుసుముల బాధ లేదు... • బ్యాంకులోంచి వాలెట్‌లోకి వేస్తే బ్యాంకు చార్జీలు • వాలెట్లోంచి బ్యాంకు ఖాతాలోకి వేస్తే 1-4 శాతం ఫీజు • అలాగని వాలెట్‌లోనే డబ్బులుంచితే పైసా వడ్డీ రాదు • పెద్ద నోట్ల రద్దుతో ఊపందుకుంటున్న వాలెట్ లావాదేవీలు డెబిట్, క్రెడిట్ కార్డులే కాదు. ఇపుడు మొబైల్ వాలెట్లూ జోరందుకున్నారుు. నవంబరు 8న పెద్ద నోట్లు రద్దు చేశాక... వాలెట్ దిగ్గజం పేటీఎం ద్వారానే కేవలం ఆరు రోజుల్లో రూ.150 కోట్ల లావాదేవీలు నమోదయ్యారుు. దీన్నిబట్టే వాలెట్ల ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. అసలింతకీ వాలెట్ అంటే ఏంటి? మొబైల్ వాలెట్ అంటే ఒక అప్లికేషన్. ఏ సంస్థ అందిస్తే ఆ సంస్థ తాలూకు యాప్ అన్నమాట. దీనిద్వారా ఎలాంటి చెల్లింపులైనా చేసుకోవచ్చు. అంటే మీరు మీ స్నేహితుడికి డబ్బులివ్వాలి అనుకోండి. తన మొబైల్లోని వాలెట్‌కి మీ మొబైల్ వాలెట్ నుంచి కేవలం ఫోన్ నెంబరుతో డబ్బు పంపించేయొచ్చన్న మాట. క్లోజ్డ్ వాలెట్స్‌తో ఏ చెల్లింపులైనా చేయగలం. అదే ఓపెన్ వాలెట్లరుుతే నగదు విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. క్లోజ్డ్ వాలెట్ విభాగంలో పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఆక్సిజన్ వంటివి సేవలందిస్తుండగా... ఓపెన్ వాలెట్ విభాగంలో హెచ్డీఎఫ్సీ పే జాప్, ఐసీఐసీఐ పాకెట్స్, ఎస్బీఐ బడ్డీ, ఎరుుర్‌టెల్ మనీ, వొడాఫోన్ ఎంపెసా వంటివి సేవలు అందిస్తున్నారుు. అరుుతే ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఈ వాలెట్ల ద్వారా నెలకు రూ.లక్ష మేర మాత్రమే లావాదేవీలు జరిపే వీలుంటుంది. చార్జీలు కూడా ఉంటాయండోయ్.. నిజానికిపుడు చాలా వాలెట్లకు విదేశాల నుంచి విపరీతమైన నిధులు పెట్టుబడుల రూపంలో వస్తున్నారుు. దీంతో అవి ప్రస్తుతం సాధ్యమైనంత ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారుు. అందుకని అవి లావాదేవీలపై క్యాష్బ్యాక్లంటూ విపరీతమైన ఆఫర్లు ఇస్తున్నారుు. ప్రస్తుతం చాలా లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు కూడా విధించటం లేదు. కాకపోతే ఈ వాలెట్లలోకి డబ్బులు వేసేటపుడు బ్యాంకులు ఎంతో కొంత ఛార్జీలు వసూలు చేస్తున్నారుు. ఎందుకంటే డబ్బులు బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి వాలెట్ వ్యవస్థలోకి పోతారుు కనక. అలాగే మనం వాలెట్ నుంచి మన బ్యాంకు ఖాతాలోకి నగదు వెనక్కి తీసుకున్నపుడు వాలెట్లు కూడా 1 నుంచి 3 శాతం వరకూ ఛార్జీలు వసూలు చేస్తున్నారుు. ఎందుకంటే డబ్బు వాలెట్ వ్యవస్థ నుంచి బ్యాంకుల్లోకి పోతోంది కనక. కాకపోతే ప్రధాన మంత్రి మోదీ ప్రకటన కారణంగా డిసెంబరు 31 వరకూ తాత్కాలికంగా ఇవి ఛార్జీలు వసూలు చేయటం లేదు. ‘‘పేటీఎంకు పేమెంట్ బ్యాంకు లెసైన్సు వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మేం డిసెంబరు 31లోగానే బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలుపెడతాం. అప్పుడు మా బ్యాంకు కస్టమర్లు కనక డబ్బులు బ్యాంకు ఖాతా నుంచి పేటీఎం వాలెట్లో వేసినా, పేటీఎం వాలెట్ నుంచి బ్యాంకు ఖాతాకు మార్చుకున్నా ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయం. మా బ్యాంకు ఖాతాదారులు కాని వారి విషయంలో మాత్రం ఛార్జీలు వసూలు చేస్తాం’’ అని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి ‘సాక్షి’ బిసినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పటం గమనార్హం. పెద్ద వర్తకుల నుంచి వసూలు.. ఇపుడు చాలా దుకాణాలు వాలెట్లను అంగీకరిస్తున్నారుు. దీనిపై కిరణ్ మాట్లాడుతూ... ‘‘లావాదేవీలకు సంబంధించి మేం మా వాలెట్ కస్టమర్ల నుంచి గానీ, చిన్న చిన్న వర్తకుల నుంచి కానీ ఛార్జీలు వసూలు చేయటం లేదు. అయితే, పెద్ద పెద్ద వర్తకుల వద్ద మాత్రం ఛార్జీలు వసూలు చేస్తున్నాం’’ అని కిరణ్ తెలియజేశారు. నిజానికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) అమల్లోకి వచ్చాక బ్యాంకింగ్ లావాదేవీల చిత్రమే మారిపోరుుంది. బ్యాంకు నుంచి వాలెట్‌కు, వాలెట్ నుంచి వాలెట్‌కు కేవలం ఎస్సెమ్మెస్ పంపినంత ఈజీగా డబ్బులు బదలారుుంచటం వీలవుతోంది. వాలెట్లలో మరో ముఖ్యమైన విషయమేంటంటే వీటిలో మనం ఉంచే డబ్బుకు ఎలాంటి వడ్డీ రాదు. అందుకని వాలెట్లోని డబ్బును ఎప్పటికప్పుడు బ్యాంకు ఖాతాలోకి మార్చుకుందామనుకుంటే... ఛార్జీలబాధ తప్పదు. అదీ కథ. -
పెట్రోల్ బంకుల్లో ‘డిజిటల్’ జోరు!
న్యూఢిల్లీ: నగదురహిత చెల్లింపులకు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌లు సన్నద్ధమయ్యాయి. డెబిట్, క్రెడిట్ కార్డులే కాకుండా ఈ వాలెట్లు, మొబైల్ వాలెట్లలతో కార్యకలాపాలు జరిపేందుకు తగిన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేసుకున్నాయి. సుమారు 4,800 పెట్రోలు బంక్‌లు పీఓఎస్ యంత్రాల ద్వారా రోజూ కార్డుకు రూ.2 వేల చొప్పన నగదును ప్రజలకు అందిస్తున్నాయి. గత రెండు వారాల్లో ఇలా రూ.65 కోట్లు సరఫరా చేశాయి. నెల రోజుల పాటు సుమారు 53 వేల పెట్రోలు బంక్‌ల వద్ద డిజిటల్ చెల్లింపులపై నిర్వహించే అవగాహన కార్యక్రమాలను శనివారం ప్రారంభించినట్లు పెట్రోలియం మంత్రి ధర్మేంద ప్రధాన్ చెప్పారు. పెట్రోల్ బంక్‌ల వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక కియోస్కోలు ఇంధనం కొనుగోలుకే కాకుండా ఎలక్ట్రానిక్ చెల్లింపులకూ పనిచేస్తాయి. త్వరలో ఇది ఎల్పీజీ పంపిణీ సంస్థలు, సీఎన్జీ బంకుల్లో అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ప్రధాన పట్టణాల్లోని మూడింట రెండొంతుల ఔట్లెట్లలో డిజిటల్ చెల్లింపుల వసతులు అందుబాటులోకి వచ్చాయ మంత్రి చెప్పారు. క్యూలో నిలబడి ప్రభుత్వ ఉద్యోగి మృతి హూగ్లి: పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లిలో నగదు కోసం ఏటీఎం వద్ద లైన్లో నిల్చొన్న ప్రభుత్వ ఉద్యోగి శనివారం ఉదయం చనిపోయాడు. కల్లోల్ రాయ్‌చౌధరి(56) అనే ప్రభుత్వ ఉద్యోగి కూచ్ బెహార్‌లోని తన కార్యాలయం నుంచి కోల్‌కతాలో ఉన్న ఇంటికి వెళ్తుండగా నగదు కోసం హూగ్లిలో ఆగాడు. స్టేషన్ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం వద్ద నిల్చున్న 20 నిమిషాల తరువాత కుప్పకూలిపోయాడు. ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో సుమారు 30 నిమిషాలు అలాగే ఉండిపోయాడు. తరువాత అక్కడి సెక్యూరిటీ గార్డు పిలిపించిన డాక్టర్... అతడు అప్పటికే చనిపోయాడాని నిర్ధరించాడు. ముంబై టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ ముంబై, శివారు ప్రాంతాల్లోని బ్యాంకులు, ఏటీఎం వద్ద క్యూ లైన్లు శనివారం ఏ మాత్రం తగ్గలేదు. వారాంతం కావడం, రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని బ్యాంకులు ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని ప్రజలకు అందజేయగా, పెద్ద సంఖ్యలో ఏటీఎంలు తెరుచుకోలేదు. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వే, సియోన్-పాన్వెల్ హైవేపై టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయారుు. ప్లాజాల వద్ద డిజిటల్ ద్వారా చెల్లింపులకు ఏర్పాట్లు చేసినా ఇబ్బందులు తప్పకపోవడంతో.. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. -
నగదు లేకుండా నడవగలమా?
• ‘ప్లాస్టిక్’ నాణేనికి రెండు వైపులా పదును • డిజిటల్ మనీతో నల్లధనానికి, అవినీతికి ముకుతాడు • ప్రభుత్వానికి ఆదాయం.. ఆర్థిక వ్యవస్థకూ లాభం • ఉగ్రవాద నిధులకూ, నకిలీ నోట్లకూ చరమగీతం • కానీ.. సైబర్ నేరాలకు, హ్యాకింగ్ మోసాలకు నెలవు • వ్యయంపై నియంత్రణ, వ్యక్తిగత గోప్యతకు చెల్లుచీటీ • కరెన్సీ వినియోగ సంస్కృతి ఉన్నఫళంగా మారుతుందా? • నిరక్షరాస్యత, పేదరికం అవరోధాలను అధిగమించేనా? మనిషి శ్రమకు ప్రతిరూపం... నిత్య జీవనాధారం... భవిష్యత్తుకు భరోసా! నాలుగు రాళ్లు సంపాదించినా.. ఖర్చు చేసినా.. దాచుకున్నా.. అంతా డబ్బు రూపంలోనే.. కరెన్సీ నోట్ల రూపంలోనే! భారతీయ సంస్కృతిలో వందల ఏళ్లుగా వస్తున్న అలవాటు ఇది.. నాణేనికి, నోటుకు లక్ష్మీదేవి ప్రతిరూపమని దేవత హోదా ఇచ్చిన సంస్కృతి ఇది! ఇప్పుడా డబ్బు.. కరెన్సీ నోట్లు వాడటం మానేద్దాం అంటోంది ప్రభుత్వం! డబ్బును ఇళ్లలో, పెట్టెల్లో దాచుకోవద్దు అంటోంది. అంతా బ్యాంకుల్లోనే ఉంచేద్దామంటోంది. కంప్యూటర్ సంకేతాలుండే ప్లాస్టిక్ ముక్కతోనో.. మొబైల్ ఫోన్లలో అప్లికేషన్ ద్వారానో.. డిజిటల్ మనీగా ఖర్చు పెట్టుకునే అలవాటు చేసుకుందాం అంటోంది! ఇది మన దేశానికి.. మన ప్రజలకు.. మన ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని, అభివృద్ధికి బాటలు పరుస్తుందని చెప్తోంది. అవినీతి, నల్లధనం వంటి రుగ్మతలకు ఇదే విరుగుడని అంటోంది! చాలా మంది ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులు, నిపుణులూ ఇదే మాట చెబుతున్నారు. మరోవైపు నగదు రహిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో చాలా లోటుపాట్లు ఉన్నాయనే వాదనలూ వినిపిస్తున్నాయి. వ్యక్తి తన శ్రమ ఫలాన్ని నగదు రూపంలో తన దగ్గర దాచుకోలేకపోవడం.. భౌతికంగా చేతిలో లేకపోవడం వల్ల ఖర్చుపై నియంత్రణ లేకపోవడం.. సైబర్ దాడుల ముప్పు వంటి ఎన్నో ప్రతికూలతలపై మరికొందరు ఆర్థికవేత్తలు, నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ లాభనష్టాల సంగతి ఎలా ఉన్నా భారతదేశం నగదు రహితంగా మారడానికి ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయన్న దానిపై మాత్రం అందరూ ఏకీభవిస్తున్నారు. దేశం చారిత్రకంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక పెను మార్పు వైపుగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. నగదు రహిత వ్యవస్థ లాభనష్టాలు, అందుకు గల అవరోధాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. - సాక్షి నాలెడ్‌జ సెంటర్ ⇔ ప్రస్తుతం దేశంలో 14.6 లక్షల స్వైపింగ్ మెషీన్లే ఉన్నాయి. ⇔ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేయాలంటే స్వైపింగ్ మెషీన్లు ఉండాలి. ⇔ నగదురహిత లావాదేవీలను విస్తృతం చేయడానికి వచ్చే మూడునెలల్లో మరో 10 లక్షల స్వైపింగ్ మెషీన్లను దుకాణదారులకు అందించాలని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. ⇔ నోట్ల రద్దు కారణంగా గత 20 రోజుల్లో మొబైల్ వ్యాలెట్, ఈ-వ్యాలెట్ సంస్థల వ్యాపారం ఏకంగా నాలుగు రెట్లు పెరిగిపోరుుంది. ఇంకా పెరుగుతూనే ఉంది. 16.7 భారత్‌లో ఈ ఏడాది నవంబర్ నాటికి ఇంకా 16.7 కోట్ల మందికి అసలు బ్యాంకు ఖాతానే లేదని ఆర్బీఐ, ప్రైస్ వాటర్ కూపర్ హౌస్‌ల నివేదికలు చెబుతున్నాయి. వీరందరినీ బ్యాంకు సేవల పరిధిలోకి తేవాల్సి ఉంటుంది. 19.5 కోట్ల ఖాతాలు పేరుకు మాత్రమే ఉన్నాయని, వీటిల్లో దీర్ఘకాలంగా ఎలాంటి లావాదేవీలు జరగడం లేదని వరల్డ్ బ్యాంక్ 2015లో వెల్లడించింది. 68.84 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే... వీరికి సేవలు అందించడానికి పనిచేస్తున్న బ్యాంకులు 38 శాతమే (భారత్‌లో బ్యాంకు శాఖల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి). 31.16 శాతంగా ఉన్న పట్టణ ప్రజలకు సేవలందించడానికి బ్యాంకు శాఖల్లో 62 శాతం నగరాలు, పట్టణాల్లోనే ఉన్నారుు. నిరక్షరాస్యత.. ఇంగ్లిష్ లోపం దేశంలో నాలుగో వంతు మందికి పైగా నిరక్షరాస్యులే. మూడొంతుల మంది అక్షరాస్యులే అయినా.. అందులో సగం మందికిపైగా ఏదో ఒక భాషలోనే చదవడం, రాయడం తెలిసినవారు. ఇంగ్లిష్‌లో చదవగల, రాయగల వారి సంఖ్య పావు శాతం కూడా ఉండదు. ఇంగ్లిష్‌లో ఉండే ఆన్లైన్ వ్యవహారాలను ఎంత మంది చేయగలరనేది ప్రశ్నార్థకం. డిజిటల్, ఆన్లైన్ అక్షరాస్యత దేశంలో సగం మంది పాతికేళ్ల లోపు యువతే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు ఇట్టే అందిపుచ్చుకోగలరు. కానీ వారికున్న ఆర్థిక స్వేచ్ఛ తక్కువ. అధికంగా ఆర్థిక లావాదేవీలు జరిపే వర్గాల వారిలో అత్యధికులకు డిజిటల్, ఆన్లైన్ అక్షరాస్యత లేదు. ఆన్లైన్ ఆర్థిక మోసాలు పెరిగిపోవడం, ఆ మోసాలు జరిగే తీరు తెన్నులు, తీసుకోవలసిన జాగ్రత్తలు అర్థంకాకపోవడం వల్ల చాలా మంది ప్లాస్టిక్, డిజిటల్ మనీని ఇష్టపడటం లేదు. బ్యాంకులు, ఏటీఎంల కొరత దేశ జనాభా సుమారు 134 కోట్లయితే.. బ్యాంకు శాఖలు 1.32 లక్షలు ఉన్నాయి. 68.84 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా.. మొత్తం బ్యాంకుల్లో 38 శాతమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. పట్టణ జనాభా 31.16 శాతం ఉంటే.. 62 శాతం బ్యాంకు శాఖలు వాటిల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. అలాగే ఇంత మంది జనాభాకు 2.03 లక్షల ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. అసంఘటిత రంగంలో ఎలా? దేశంలో అతి పెద్ద ఉద్యోగ రంగం.. అసంఘటిత రంగం! ఈ రంగం దాదాపుగా నగదు ఆధారితంగానే నడుస్తుంది. వ్యవస్థ నుంచి భారీ మొత్తంలో నోట్లను ఉపసంహరించడం.. భరోసానివ్వగల లావాదేవీల వ్యవస్థలు లోపించడం కారణంగా.. గ్రామీణ ప్రాంతాలు, అసంఘటిత రంగాలు కష్టాలు ఎదుర్కోనున్నాయి. యజమానుల వ్యతిరేకత పనిచేసే వారిలో 90 శాతం మంది (దేశవార్షిక ఉత్పత్తిలో సగం వీరి నుంచే వస్తుంది) అసంఘటిత రంగంలోనే ఉన్నారు. కాంట్రాక్టు లేబర్‌తో చిన్న పరిశ్రమలు పని చేయించుకుంటాయి. వారికి చెల్లింపులన్నీ నగదు రూపంలో.. వోచర్ పేమెంట్ ద్వారా జరుగుతాయి. యాజమాన్యాలు వారికి బ్యాంకు ఖాతాలు తెరిచి జీతాలు చెల్లించడానికి ముందుకు రావు. ఎందుకంటే ఒకసారి ఖాతాలు తీసి కార్మికులుగా చూపితే.. చట్టబద్ధంగా వారికి ప్రయోజనాలన్నీ ఇవ్వాల్సి వస్తుంది. 37.1 కోట్లు ⇔ భారత్‌లో మొబైల్ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య ⇔ 2016 జూలై నాటికి భారత్‌లో ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య 46 కోట్లు (సింహభాగం మొబైల్ ఇంటర్నెట్). ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకందారులు ఎక్కువగా ఉన్న దేశాల్లో చైనా తర్వాతి స్థానం మనదే. అమెరికాను కూడా దాటిపోయాం. దేశంలో జనాభాలో ఇంటర్నెట్ యాక్సెస్ఉన్న వారు 34.8 శాతం. ⇔ భారత్‌లో సెల్‌ఫోన్ కనెక్షన్ల సంఖ్య 103.32 కోట్లు. ⇔ స్మార్ట్ ఫోన్లు 22 కోట్లు ⇔ మొబైల్ వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు చేయాలంటే స్మార్ట్ ఫోన్లు, కనెక్టివిటీ అవసరం. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో నెట్ చార్జీలు అధికం. ఆండ్రాయిడ్ ఫోన్ కూడా పేదలకు భారమే. తక్కువ ధరకే ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం సాయపడటం, నెట్ చార్జీలు తగ్గించడం, పబ్లిక్ ప్లేస్‌లలో ఉచిత వైఫైని విరివిగా అందించడం... జనాన్ని మొబైల్ వ్యాలెట్ దిశగా ప్రోత్సహిస్తాయి. ⇔ అనుకూలాంశమేమిటంటే... భారత్ జనాభాలో 50 శాతం మంది 25 ఏళ్ల లోపు వారే. వీరికి టెక్నాలజీపై పట్టు ఉంటుంది. మొబైల్ వ్యాలెట్లు ఉపయోగించడానికి, ఆన్లైన్ లావాదేవీలు చేయడానికి సంసిద్ధత చూపుతారు. ఖాతాలపై పేదల వ్యతిరేకత దేశంలో చాలా మంది పేదలు బ్యాంకు ఖాతాలతో అనుసంధానం అవడానికి నిరాకరిస్తున్నారు. వారు వేతనాన్ని బ్యాంకుల ద్వారా తీసు కుంటే, అది రూ.60 వేలు దాటితే.. దారిద్య్రరేఖకు దిగువన గల పేదలుగా అందే సంక్షేమ పథకాలను కోల్పోతామనే భయమే కారణం. 71.24 కోట్లు రిజర్వుబ్యాంకు ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలో అన్ని బ్యాంకులు కలిపి 71.24 కోట్ల డెబిట్ కార్డులు (ఒకటికి మించి డెబిట్ కార్డులు కలిగిన వారు చాలామంది ఉంటారు) జారీచేశాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో స్వైపింగ్ మెషిన్లు లేకపోవడం, నగదుతోనే కొనడానికి బాగా అలవాటుపడటం... కారణమేదైనా ప్లాస్టిక్ మనీతో కొనుగోళ్లు మాత్రం జరగడం లేదు. కొనుగోళ్లు తదితర ఖర్చుల కోసం డెబిట్ కార్డులను ఉపయోగించటానికి.. దేశంలో ఆ కార్డులున్న వారు కూడా పూర్తిగా అలవాటుపడలేదు. ⇔ డెబిట్ కార్డులను ఎలా ఉపయోగిస్తున్నారని చూస్తే విస్మయం చెందుతాం. డెబిట్ కార్డుల వాడకం... 85 % ఏటీఎంలలో నగదు ఉపసంహరణకే జరుగుతోంది. 25 కోట్లు 25 కోట్ల జన్ ధన్ ఖాతాలు ప్రారంభించారు. 20 కోట్ల రూపే డెబిట్ కార్డులు ఇచ్చారు. 94 %డెబిట్ కార్డుల ద్వారా జరిగే ఖర్చు కూడా స్వల్పమే. డెబిట్ కార్డుల ద్వారా బయటికి వెళ్లే డబ్బులో 94 శాతం నగదుగా జనం తీసుకుం టున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే లక్ష రూపాయలు డెబిట్ కార్డు ద్వారా వాడితే అందులో 94 వేలు నగదు ఉపసంహరణే ఉంటోంది. మిగిలిన రూ.6 వేలే కొనుగోళ్లు, చెల్లింపులకు వాడుతున్నారన్న మాట. 75 % 2015లో భారతదేశంలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో 75 శాతం నగదు ఆధారిత లావాదేవీలేనని.. అదే సమయంలో అమెరికా, జపాన్, ఫ్రాన్స, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నగదు రూపంలో లావాదేవీలు 20-25 శాతంగా ఉందని గూగుల్‌ఇండియా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయన నివేదిక చెప్తోంది. ఆ 75 శాతం నగదు లావాదేవీల్లో మూడింట రెండు వంతులు నగదు రహితంగా మారడం ఇప్పటికిప్పుడు సాధ్యమేనా? 1,50,000 దేశంలో కంప్యూటర్లతో పనిచేసే పోస్టాఫీసులు లక్షా యాభై వేల పైచిలుకు ఉన్నాయి. వీటిల్లో నగదు లావాదేవీలు జరపొచ్చు. -
స్వైపింగ్తోనే సరుకులు
నగదు లేక ప్రజల ఇబ్బందులు పాత నోట్లపై అప్పుడే నిషేధం పెట్రోల్ బంకుల్లోనూ మిషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ వరంగల్ : నగరంలోని ప్రజలు తమ నిత్యావసర వస్తువుల కొనుగోళ్ల కోసం తప్పని పరిస్థితుల్లో డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించక తప్పడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో పాత రూ.500, రూ.1000 నోట్లను వ్యాపారులు తీసుకోవడం లేదు. పెద్ద నోట్లకు సరిపడా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తామన్నా వ్యాపారులు ఒప్పుకోవడం లేదు. పాత నోట్లు తీసుకుని బ్యాంకుల వద్దకు వెళ్లి క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని, ఇదంతా ఎందుకని పెద్ద నోట్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నట్లు వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం స్వైపింగ్ మిషన్ల ద్వారా చిల్లర విక్రయాలు కొనసాగిస్తున్నామన్నారు. దీనికి తోడుగా హోల్‌సేల్ వ్యాపారస్తులు ఇచ్చిన సరుకులకు పాత నోట్లు తీసుకోవడం లేదని, అందువల్ల తాము కూడా కొత్త నోట్లకు, చిల్లర నోట్లకే సరుకులు విక్రరుుస్తున్నట్లు తెలిపారు. నగరంలోని పలు కిరాణ షాపుల యాజమానులు ఇప్పుడిప్పుడే స్వైపింగ్ మిషన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. డిసెంబర్ 31వరకు బ్యాంకులు పాత నోట్లు తీసుకుంటామని ప్రకటనలు చేసినా వ్యాపారులు మాత్రం ఇప్పటి నుంచి పెద్ద నోట్లపై నిషేధం అమలు చేస్తున్నారు. కానరాని రూ.500 నోట్లు... దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రూ.500 నోట్లు దర్శనమిచ్చినా నగరంలో వీటి జాడే లేకుండా పోరుుంది. పలు ఏటీఎంలలో రూ.100నోట్లనే పెడుతున్నారుు. ఇలా ఏటీఎంలలో పెట్టిన నోట్లు నిమిషాల్లో ఖాళీ కావడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఇళ్లలో ఖర్చుల నిమిత్తం దేవుళ్లకు వేసిన ముడుపులు సైతం బయటకు తీయక తప్పడం లేదని తెలుస్తోంది. ఈ ఇబ్బందులు మరెన్ని రోజులు ఉంటాయో అని నగరవాసులు అంటున్నారు. లీటర్‌కు నో... రూ.300కు ఒకే... రద్దైన పెద్ద నోట్లతో మోటార్‌బైక్‌లు ఉన్న వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్‌పంపుల్లో చిల్లర నోట్లకే పెట్రోల్ పోస్తున్నారు. రూ.500 ఇచ్చి లీటర్, రెండు లీటర్లు పోయమంటే లేదన్న సమాధానం వస్తోంది. చివరకు రూ.250 నుంచి 300లో పోసుకుంటేనే మిగిలిన చిల్లర ఇస్తున్నారు. నిత్యావసర వస్తువుల్లో పెట్రోల్ కూడా ఒక ప్రధానం కావడంతో పోరుుంచుకోక తప్పడం లేదని నగర వాసులు వాపోతున్నారు. ఆర్బీఐ పెద్ద నోట్లు రద్దు చేసినా వాటి స్థానంలో రూ.100 నోట్లను ఎక్కవ సంఖ్యల్లో అందుబాటులోకి తెస్తే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కావని పలువురు వాపోతున్నారు. చివరకు పెట్రోల్‌పంపుల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వస్తోంది. -
నోట్ల కష్టాలు ఇప్పుడు కార్డులకు వచ్చేశాయ్!
న్యూఢిల్లీ: నోట్ల కష్టాలు ఇప్పుడు డెబిట్, క్రెడిట్ కార్డులకు కూడా వచ్చాయి. దేశవ్యాప్తంగా పలు రెస్టారెంట్లలో, మాల్స్‌లో, మల్టీఫ్లెక్సుల్లో తాత్కాలికంగా డెబిట్, క్రెడిట్ కార్డుల సర్వీసులు నిలిచిపోయాయంటూ కౌంటర్ల ముందు నోటీసు బోర్డులు వెలిశాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వరకు ఈ సర్వీసులు నిలిచిపోగా, కొన్ని ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా ఈ సర్వీసులు పునరుద్ధరణ కాలేదు. ఇదివరకెప్పుడు లేని విధంగా డెబిట్, క్రెడిట్ కార్డుల సేవలు విపరీతంగా పెరిగిపోవడంతో సర్వర్ల మధ్య సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కార్డుల సర్వీసుల్లో మూడు విభాగాల సర్వర్లు ప్రత్యక్ష పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానమై పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కడ సాంకేతిక సమస్య ఉత్పన్నమైనా సర్వీసులు మధ్యలో నిలిచిపోతాయి. ఇంటర్నెట్ సర్వీసు ప్రొఫైడర్, సంబంధిత బ్యాంకు, పేమెంట్ గేట్‌వే సంస్థ సర్వర్లు ఈ సర్వీసుల్లో ప్రత్యక్ష పాత్ర పోషిస్తాయని అనేక ప్రభుత్వ సంస్థలకు సలహాదారు, ఇండియన్ సైబర్ ఆర్మీ వ్యవస్థాపకులు కిస్లే చౌధరి తెలిపారు. ఈ మూడు సంస్థల్లో ఏ సర్వర్ డౌన్ అయినా లేదా డిమాండ్‌కు తగ్గ సామర్థ్యం లేకపోయినా సమస్యలు వస్తాయని ఆయన వివరించారు. డెబిట్, క్రెడిట్ కార్డుల విషయంలో బ్యాంక్ సర్వీసులపై తమకు పెద్దగా ఒత్తిడి లేదని, బ్యాంకు సర్వర్ల సామర్థ్యం చాలా ఎక్కువగానే ఉందని రాజస్థాన్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్ హెడ్ కల్పనా గుప్తా మీడియాకు తెలిపారు. ప్రస్తుత నోట్ల మార్పిడియే తమకు పెద్ద సమస్యగా మారిందని, తగినంత సిబ్బందిలేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె చెప్పారు. సాధారణంగా చెల్లింపు సంస్థల సర్వర్ల వద్దనే సమస్యలు వస్తాయని, ఆ సంస్థకు ఒక బ్యాంకు ఆన్లైన్ రూటు బిజీగా ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా మరో బ్యాంకు నుంచి చెల్లింపులు జరిపేందుకు ఆ సంస్థకు వీలుండాలని, అలా ఉండాలంటే ఆ చెల్లింపు సంస్థలు పలు బ్యాంకులతో టైఅప్ పెట్టుకుని ఉండాలని ఆమె సూచించారు. ఎలక్ట్రానిక్ పేమెంట్స్ బాగా ఊపందుకున్నప్పటికీ మాస్టర్ కార్డు చెల్లింపులకు మాత్రం ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని దక్షిణాసియా డివిజన్ అధ్యక్షుడు పోరుష్ సింగ్ తెలిపారు. సెకనుకు 4,300 కోట్ల లావాదేవీలు నిర్వహించే నెట్వర్క్ తమ మాస్టర్ కార్డుకుందని ఆయన తెలిపారు. -
జీఎస్టీని డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లించొచ్చు
ఇండోర్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ను వ్యక్తులు, సంస్థలు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో చెల్లించొచ్చని కేంద్ర రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. ఏ బ్యాంకు నుంచి అయినా సరే పన్ను చెల్లించవచ్చని ఆదివారమిక్కడ జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్‌లో వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను ఆన్ లైన్ ద్వారా నిర్వహించాలని యోచిస్తోంది. -
కార్డుల సర్‌చార్జ్ పై ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: డెబిట్ క్రెడిట్ కార్డు చెల్లింపులకు వ్యతిరేకంగా దాఖలపైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ కేంద్రాన్ని,ఆర్‌బిఐలకు ఆదేశించింది. ఆగస్టు 19లోగా సమాధానం చెప్పాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను, కేంద్ర బ్యాంకును కోరింది. దీనిపై పూర్తి మార్గదర్శకాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలపై సర్ చార్జ్ విధించడాన్ని సవాలు చేస్తూ అమిత సాహ్ని అనే లాయర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నగదు లావాదేవీలను మినహాయించి కేవలం డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలపై సర్ చార్జ్ విధించడం అక్రమమని వాదించారు. ఈ చర్య దేశంలో నల్లధనం చలామణిని ప్రోత్సహించేలా ఉందని పిటిషనర్ ఆరోపించారు. 2.5 శాతం చెల్లింపు లేదా అంతకంటే ఎక్కువగా సర్ ఛార్జి విధించడం వలన అక్రమ, అసమాన లావాదేవీలు దేశవ్యాప్తంగా పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జి రోహిణి, జస్టిస్ జయంత నాథ్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. -
విదేశీయులు, ఎన్నారైలకు శుభవార్త!
విదేశీయులు, ఎన్నారైలకు శుభవార్త! ఇకపై తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో రైల్వే టికెట్లను విదేశాల నుంచే కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కొత్తగా భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) కల్పిస్తోంది. ఇప్పటివరకూ ఎన్నారైలు, విదేశీయులు భారత్ పర్యటనకు వచ్చేముందు రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడం కోసం ఇండియాలోని తమ బంధువులు, టూర్ ఆపరేటర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఐఆర్ సీటీసీ ఈ పరిస్థితిలో మార్పులు చేర్సులు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం వెబ్ సైట్ లో అంతర్జాతీయ లావాదేవీలకు అవకాశం కల్పించింది. విదేశీ ప్రయాణీకులకు ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా చూడటమే లక్ష్యంగా కొత్త టికెట్ బుకింగ్ వ్యవస్థను భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ కొత్త పద్ధతిలో విదేశీయులు, ఎన్నారైలు తమకు ఫారిన్ బ్యాంకులు అందించిన క్రెడిట్, డెబిట్ కార్డులతో ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. 'ప్యాలెస్ ఆన్ వీల్స్' , 'మహరాజా' వంటి లగ్జరీ ట్రైన్లు, విదేశీయుల పర్యటనలకు అనువుగా ఉండే ఇతర టూరిస్ట్ స్పెషల్ ట్రైన్లతోపాటు, సాధారణ సర్వీసుల్లో కూడ ఈ కొత్త అవకాశం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇటువంటి అంతర్జాతీయ లావాదేవీలకు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ప్రత్యేక అవకాశం కల్పించడం ఇది రెండోసారి. క్రెడిట్ కార్డుల దుర్వినియోగాన్ని గమనించిన ఐఆర్ సీటీసీ మొదటిసారి ఇచ్చిన అవకాశాన్ని అప్పట్లో రద్దు చేసింది. ప్రస్తుతం హ్యాకింగ్ వంటి సమస్యలు ఎదురు కాకుండా వెబ్ సైట్ లో భద్రతను మరింత పటిష్ఠ పరచి ముందుగానే అన్నిరకాల పరిశీలనలు పూర్తయిన తర్వాతే టికెట్ బుకింగ్ కు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. నిమిషానికి 15,000 బుకింగ్స్ ను చేసే ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ... సెకనుకు 250 టికెట్లను వినియోగదారులకు అందిస్తుంది. ఈ నేపథ్యంలో సుమారు 58 శాతం టికెట్లు ఆన్ లైన్ లోనే అమ్మకాలు జరుగుతుండటం విశేషం. కాగా ప్రస్తుతం ఐఆర్ సీటీసీ అందిస్తున్న కొత్త సదుపాయం ఏప్రిల్ నెలాఖరుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. -
రూ.86 వేల కోట్ల ‘విదేశీ’ అప్పు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచబ్యాంకు, జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ తదితర విదేశీ సంస్థల నుంచి భారీఎత్తున అప్పుచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వివిధ రంగాల్లో రూ.86 వేల కోట్ల అప్పు చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆయా శాఖలు రూపొందించి ఆర్థికశాఖ పరిశీలనకు పంపించాయి. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం(ఎఫ్ఆర్బీఎం) నిబంధనల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు మూడు శాతానికన్నా మించరాదు. అయితే ఎఫ్ఆర్బీఎం నిబంధనలను సడలించడం ద్వారా ఎక్కువ అప్పు చేసేందుకు వీలు కల్పించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు కేంద్రాన్ని కోరింది. కానీ ఎఫ్ఆర్బీఎం నిబంధనలను సడలించేందుకు కేంద్రం ఇప్పటివరకు అనుమతించలేదు. అయినప్పటికీ రాష్ర్టప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా భారీస్థాయిలో అప్పుచేయాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐ.వై.ఆర్.కృష్ణారావు నిర్వహించిన సమీక్షలో ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు రూ.20 వేల కోట్లకు మించి అప్పు చేయడానికి వీలుపడదని ఆర్థికశాఖ పేర్కొంది. అయితే సీఎస్.. ఎఫ్ఆర్బీఎం నిబంధనలను కచ్చితంగా పాటించనక్కర్లేదన్నారు. ఈ నేపథ్యంలో విద్య, పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, గ్రామీణ, పట్టణ మంచినీటి సరఫరా, జలవనరులు, ఇంధన రంగాలకు సంబంధించి రూ.86 వేల కోట్లు అప్పు చేయాలని నిర్ణయించారు. ఇంత పెద్దమొత్తంలో అప్పు చేయనున్నందున అందులో 90 శాతం గ్రాంటుగా కేంద్రప్రభుత్వం భరించేందుకు వీలుగానైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఇటీవల రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ప్రత్యేకహోదా కల్పిస్తే విదేశీ సంస్థల నుంచి రాష్ట్రప్రభుత్వం తీసుకునే అప్పుల్లో 90 శాతాన్ని కేంద్రం భరిస్తుంది. మిగతా పదిశాతాన్ని మాత్రమే రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఇటీవల కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్రాలకు బదిలీ చేసినందున వాటికి రాష్ట్రప్రభుత్వం నిధులు సమకూర్చలేని స్థితిలో ఉందని, ప్రత్యేకహోదా కల్పిస్తే కేంద్రమే ఆ పథకాలకు నిధులను సమకూర్చుతుందని లేఖలో వివరించింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో విదేశీసంస్థల నుంచి రూ.3 వేల కోట్ల వరకు అప్పు తెచ్చుకునే వెసులుబాటును కల్పించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 13వ ఆర్థికసంఘం నిధులు రూ.670 కోట్లు ఇప్పించండి ఇదిలా ఉండగా 13వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి రావాల్సిన రూ.670.10 కోట్లను తక్షణం ఇప్పించాలని కూడా కేంద్రానికి రాష్ట్రసర్కారు లేఖ రాసింది. 13వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,017.28 కోట్లు గ్రాంటు రూపంలో కేంద్రం నుంచి రావాల్సి ఉంది. అయితే రాష్ట్రప్రభుత్వం సకాలంలో విడుదల చేసిన నిధులకు వినియోగపత్రాలను సమర్పించి నిధులు తెచ్చుకోవడంలో విఫలమైంది. దీంతో గతేడాది రూ.3,493.13 కోట్లనే కేంద్రం విడుదల చేసింది. మిగిలిన రూ.670.10 కోట్ల గ్రాంటును రాష్ట్రసర్కారు కోల్పోయింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలోనే రూ.670.10 కోట్లను వ్యయం చేశామని, అందువల్ల ఆ నిధులను ఇప్పించాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది.