Samantha Denies Taking Rs 25 Crore From A Superstar For Her Myositis Treatment - Sakshi
Sakshi News home page

Samantha: ట్రీట్‌మెంట్‌ కోసం హీరో వద్ద అప్పు.. క్లారిటీ ఇచ్చిన సమంత

Aug 5 2023 12:57 PM | Updated on Aug 5 2023 1:06 PM

Samantha Denies Taking Rs 25 Crore From Superstar Her Treatment - Sakshi

స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్‌తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అందుకోసం కొద్దిరోజుల పాటు సినిమాలకు కూడా ఆమె బ్రెక్‌ ఇచ్చింది. ట్రీట్‌మెంట్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నట్లు కూడా తెలిపింది. కానీ అందుకు అయ్యే ఖర్చు సుమారు రూ.25 కోట్లు అని, ఆ డబ్బు కూడా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరో వద్ద అప్పుగా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై సమంత ఇలా క్లారిటీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు)

మయోసైటిస్ చికిత్స కోసం రూ.25 కోట్లా!? ఇదీ తప్పు.. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. అందుకు అయ్యే ఖర్చు నా సంపాదనలో కొంత వరకు మాత్రమే అవుతుంది. ఆ ఖర్చు నేను పెట్టుకోగలను. నా కెరీర్​లో సంపాదించిన మొత్తాన్ని ఇందుకోసమే ఖర్చు చేశానని నేను అనుకోవడం లేదు. నా జాగ్రత్తలు నేను చూసుకోగలను. మయోసైటిస్ అనేది ఓ సమస్య మాత్రమే. వేలాది మంది ప్రజలు కూడా దీనితో బాధపడుతున్నారు. ఇలాంటి విషయాలపై చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు దయచేసి కాస్త బాధ్యతగా ఉండాలి'అని సమంత తెలిపింది.

(ఇదీ చదవండి: లలిత్‌ మోదీతో బ్రేకప్‌.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన సుష్మితాసేన్‌!)

ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న సమంత ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. దీంతో ఆమె భారీగానే ఆస్తి కూడబెట్టింది. అలాంటి సమంతకు అప్పు చేయాల్సిన అవసరం లేదని నెటిజన్స్ అంటున్నారు. సమంత విషయంలో పలు రూమర్స్‌ వస్తూనే ఉంటాయని, వాటిని నమ్మాల్సిన పనిలేదని సమంత ఫ్యాన్స్‌ కూడా తెలుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement