క్రయోథెరపీ! | Actress Samantha Ruth Prabhu Shares About Her Cryotherapy Experience, Deets Inside - Sakshi
Sakshi News home page

Samantha Cryotherapy: క్రయోథెరపీ!

Published Mon, Nov 6 2023 12:28 AM | Last Updated on Mon, Nov 6 2023 10:12 AM

Samantha Ruth Prabhu tries out Cryotherapy - Sakshi

హీరోయిన్‌ సమంత గత కొన్నాళ్లుగా మయోసైటిస్‌ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించారు కూడా. ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకునేందుకు ఆమె పలు రకాల వైద్య చికిత్సా పద్ధతులు అనుసరిస్తున్నారు. వైద్య చికిత్సలో భాగంగా తాజాగా క్రయోథెరపీ చేయించుకుంటున్నారామె. ఈ విషయాన్ని సోషల్‌  మీడియా వేదికగా పంచుకున్నారు సమంత.

క్రయోథెరపీలో భాగంగా గడ్డ కట్టేంత చల్లని నీటి టబ్‌లో మెడ భాగం వరకూ మునిగి ఉన్నారు సమంత. ‘‘క్రయోథెరపీ వల్ల వ్యాధి కారక క్రిములతో పోరాడే తెల్ల రక్త కణాల సంఖ్య బాగా పెరగడంతో పాటు రక్తప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ థెరపీ శరీరానికి సరికొత్త శక్తిని ఇవ్వడంతో పాటు మానసిక ప్రశాంతత కలిగిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. రాజ్‌ –డీకే ద్వయం తెరకెక్కించిన ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌లో నటించారు. ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement