అందువల్లే ఆ మ్యాటర్ బయపెట్టాల్సి వచ్చింది: సమంత కామెంట్స్ | Samantha Ruth Prabhu Shares Her Experience When Myositis Disease Attack, Deets Inside - Sakshi
Sakshi News home page

Samantha: అలాంటి పరిస్థితుల్లోనే ఆ విషయం చెప్పాల్సి వచ్చింది: సమంత

Published Fri, Mar 15 2024 10:04 PM | Last Updated on Sat, Mar 16 2024 10:21 AM

Samantha Shares Her Experience When Myositis Desease Attack - Sakshi

సమంత ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. తన సినీ కెరీర్‌లో ఎన్నో గెలుపోటములు రుచి చూశారు. గతంలో యాక్టింగ్‌కు కాస్తా విరామం తీసుకున్న భామ ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన ఇండియాటుడే కాన్‌క్లేవ్‌- 2024లో సామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్‌, మయోసైటిస్‌పై క్రేజీ కామెంట్స్ చేశారు. పరిస్థితుల వల్లే మయోసైటిస్‌ ఉందని బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు. 

సమంత మాట్లాడుతూ..'నటిగా దాదాపు 14 ఏళ్లు పూర్తి చేసుకున్నా. ప్రతిరోజూ 10 రకాల పనులు చేస్తా. ఐదు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని. నా కెరీర్‌లో కొన్ని బాధపడిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఇంపోస్టర్‌ సిండ్రోమ్‌తో ఇబ్బందిపడిన క్షణాలున్నాయి. దాని వల్ల కెరీర్‌ అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఆస్వాదించలేకపోయా. సక్సెస్ సాధించినప్పటికీ నా వల్ల వచ్చింది కాదని భావించేదాన్ని' అని అన్నారు.

అంతే కాకుండా మయోసైటిస్‌తో గతంలో తాను నటించిన హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ యశోద ప్రమోషన్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. అప్పట్లో ఎన్నో రూమర్స్ వచ్చాయని.. ప్రచారం చేయకపోతే సినిమా చనిపోయేలా ఉందని నిర్మాత చెప్పడంతో ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చానన్నారు. అలాంటి పరిస్థితుల్లోనే తనకు వ్యాధి ఉందని బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement