Myositis
-
అందువల్లే ఆ మ్యాటర్ బయపెట్టాల్సి వచ్చింది: సమంత కామెంట్స్
సమంత ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. తన సినీ కెరీర్లో ఎన్నో గెలుపోటములు రుచి చూశారు. గతంలో యాక్టింగ్‌కు కాస్తా విరామం తీసుకున్న భామ ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన ఇండియాటుడే కాన్క్లేవ్- 2024లో సామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్, మయోసైటిస్‌పై క్రేజీ కామెంట్స్ చేశారు. పరిస్థితుల వల్లే మయోసైటిస్ ఉందని బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు. సమంత మాట్లాడుతూ..'నటిగా దాదాపు 14 ఏళ్లు పూర్తి చేసుకున్నా. ప్రతిరోజూ 10 రకాల పనులు చేస్తా. ఐదు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని. నా కెరీర్లో కొన్ని బాధపడిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఇంపోస్టర్ సిండ్రోమ్‌తో ఇబ్బందిపడిన క్షణాలున్నాయి. దాని వల్ల కెరీర్ అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఆస్వాదించలేకపోయా. సక్సెస్ సాధించినప్పటికీ నా వల్ల వచ్చింది కాదని భావించేదాన్ని' అని అన్నారు. అంతే కాకుండా మయోసైటిస్‌తో గతంలో తాను నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ యశోద ప్రమోషన్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. అప్పట్లో ఎన్నో రూమర్స్ వచ్చాయని.. ప్రచారం చేయకపోతే సినిమా చనిపోయేలా ఉందని నిర్మాత చెప్పడంతో ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చానన్నారు. అలాంటి పరిస్థితుల్లోనే తనకు వ్యాధి ఉందని బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు. -
ఆ ఏడాది నాకు చాలా కష్టంగా గడిచింది: సమంత
హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పేరుకే తమిళమ్మాయి గానీ టాలీవుడ్లో వరస సినిమాలు చేసింది. అలానే హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలైపోయింది. అయితే వ్యక్తిగత కారణాలతో 2021లో సమంత-చైతూ విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన ఏడాది సమయంలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడినట్లు సామ్ బయటపెట్టింది. ఇప్పుడు దాన్నుంచి కోలుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. 'ఏ మాయ చేశావె' సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న సమంత.. ఆ తర్వాత తెలుగులో మహేశ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది. చివరగా 'ఖుషి' చేసింది. ప్రస్తుతం ఈమె చేతలో కొత్త ప్రాజెక్టులేం లేవు. దీంతో యూట్యూబ్ ఛానెల్లో పాడ్ కాస్ట్ మొదలుపెట్టింది. తాజాగా తొలి ఎపిసోడ్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులోనే ఆటో ఇమ్యూనిటీ గురించి మాట్లాడింది. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) సమంతతో పాటు ఈ పాడ్ కాస్ట్లో ప్రత్యేక నిపుణుడు అల్కేశ్తో కనిపించింది. అతడు ఆటో ఇమ్యూనిటీ గురించి వివరంగా చెప్పుకొచ్చాడు. 'శరీరంలోని చెడు కారకాలు.. బయటికి వెళ్లే చెడు కారకాల మధ్య బ్యాలెన్స్(సమ తుల్యత) దెబ్బతిన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుత జీవన విధానంలో పర్యావరణానికి సంబంధించిన టాక్సిక్స్ (చెడు కారకాలు) ఎక్కువగా ఉన్నాయి. కాస్మోటిక్స్, దుస్తులు, వంట సమాన్లతో పాటు చాలా విషయాలు.. ఆటో ఇమ్యూనిటీ విషయంలో ప్రభావం చూపిస్తాయి' అని ఇతడు చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందించిన సమంత.. 'చాలామంది మంచి ఆహారం తింటూ బాగున్నామని, ఎలాంటి సమస్యలు రావని అనుకుంటున్నారు. నేను కూడా అలానే అనుకున్నాను కానీ ఆటో ఇమ్యూనిటీ సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది. తద్వారా మయోసైటిస్ బారిన పడ్డాను. అయితే వ్యాధి రావడానికి ముందు ఏడాది అయితే నాకు చాలా కష్టంగా గడిచింది' అని సమంత చెప్పుకొచ్చింది. ఈ వీడియో బట్టి సమంతకు సౌందర్య సాధనాలు (కాస్మోటిక్స్) వల్లే మయోసైటిస్ సమస్య ఏర్పడిందా అనే సందేహం కలుగుతోంది. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'కల్కి' హీరోయిన్? పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!) -
భూటాన్‌లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరమై పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టిపెట్టింది. తన ట్రీట్మెంట్లో భాగంగా రకరకాల థెరపీలను ట్రై చేస్తోంది సమంత. ఇటీవలె క్రయోథెరపీ అనే ఆయుర్వేద చికిత్స తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం భూటాన్‌లో ఉన్న సమంత.. డాట్‌షో (హాట్ స్టోన్ బాత్) అనే ఆయుర్వేద చికిత్సను తీసుకుంటుంది. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ వల్ల కలిగే ఉపయోగాలను సైతం పంచుకుంది. భూటాన్‌లో హాట్ స్టోన్ బాత్ అనే ఆయుర్వేద ట్రీట్మెంట్ బాగా ఫేమస్. దీనిపై సమంత స్వయంగా తన పోస్టులో షేర్ చేస్తూ..''వేల ఏళ్ల క్రితం నుంచే భూటన్లో ఈ ఆచారం ఉంది. ఆయుర్వేదలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్న భూటాన్ ప్రజలు స్టోన్ బాత్‌ని ఆచరిస్తున్నారు. నదులలో ఉన్న రాళ్లను ఎర్రగా కాలుస్తారు. వాటిని నీటిలో వేస్తారు. రాళ్లల్లో ఉన్న మినరల్స్ కరిగి భూటానీస్ హాట్ టబ్‌లోకి చేరుతాయి. ఈ ప్రక్రియలో కెంపా అనే మూలికలు కూడా వాడతారు. ఆ స్టోన్స్, మూలికలు ఈ హాట్ వాటర్ లో కరిగి వాటి శక్తి నీళ్లకు అందగా దీంట్లో స్నానం చేయడం వల్ల మనలో ఉన్న బాడీ పెయిన్స్, అలసట, కడుపు నొప్పి, జాయింట్ పెయిన్స్, ఎముకల బలహీనత.. ఇలాంటివి అన్ని మాయం అవుతాయి. కండరాలు రిలాక్స్ కావడానికి ఉపయోగపడతాయి'' అంటూ ఆ ప్రాసెస్‌ని వివరించింది సమంత. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) మజిల్ పెయిన్, ట్రావెల్ సిక్నెస్, మజిల్ - బోన్ రిలేటెడ్ ట్రబుల్స్కీ, ఆర్తిరైటిస్, స్పాండిలైటిస్, జాయింట్ పెయిన్స్, స్టొమక్ సిక్నెస్ వంటివాటికి అన్నిటికీ ఈ బాత్ ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దగ్గర్నుంచి సమంత కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్, బాలి, అమెరికా, ఆస్ట్రియా, ఇటలీ వంటి ప్రదేశాలకు వెళ్లింది. ఇప్పుడు భూటాన్‌లో ఆయుర్వే చికిత్సను తీసుకుంటూనే మరోపక్క అక్కడి ప్రకృతి ప్రదేశాలు, బుద్ధుడి ఆలయాలను సందర్శిస్తుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఏడాది నుంచి దానికి దూరమైన సమంత.. ఎంత కష్టమో!
హీరోయిన్ సమంత ఈ మధ్య తెగ వైరల్ అవుతోంది. నాగచైతన్యతో మళ్లీ కలుస్తుందని తెగ రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై నేరుగా స్పందించకుండా అతడి గుర్తుగా ఉన్న టాటూ చెరిపేశా అన్నట్లు ఓ ఫొటో పోస్ట్ చేసిన సామ్.. పుకార్లకు చెక్ పెట్టింది. ఇలా గత కొన్నాళ్ల నుంచి ట్రెండ్ అవుతున్న సమంత.. ఇప్పుడు మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) మయాసైటిస్ వల్ల సౌత్ సినిమాలతో సమంత స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. అయితే 'యశోద' మూవీ రిలీజ్ టైంలో తను మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. దాని చికిత్స కోసమే ఈ మధ్య అమెరికా కూడా వెళ్లింది. అయితే ఈ జబ్బు కారణంగా సమంత ఆహార అలవాట్లు చాలా మారిపోయాయి. బ్రెడ్ ముక్క కోసం ఇకపోతే దాదాపు ఏడాది 4 నెలల తర్వాత బ్రెడ్ తిన్నానని చెబుతూ సమంత.. తన ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. దీన్ని చూసిన ఆమె ఫ్యాన్స్.. సామ్‌కి ఎంత కష్టమొచ్చిందోనని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే గతనెలలో 'ఖుషి' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన సామ్.. త్వరలో 'సిటాడెల్' వెబ్ సిరీస్‌తో రాబోతుంది. ఇది కాకుండా కొత్త ప్రాజెక్టులు అయితే ఇంకా ఏం ఒప్పుకోలేదని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఖరీదైన తప్పులు చేశాం.. 'భోళా శంకర్' నిర్మాత షాకింగ్ ట్వీట్) -
మిగతా హీరోయిన్లకు సమంతకు ఉన్న తేడా అదే!
ఎవరైనా అరుదైన వ్యాధికి గురైతే మానసిక వేదనకు గురవుతారు. తగిన వైద్యం కోసం ప్రయత్నిస్తారు. నటి సమంత మాత్రం ఇందుకు విరుద్ధమని చెప్పొచ్చు. ఎందుకంటే తను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిందనే విషయం తెలియగానే అందరిలా ఆవేదనను గురయ్యారు. కంట తడి కూడా పెట్టారు. కానీ కృంగిపోలేదు. ఎందుకంటే సమంత కథే వేరు కదా! ఈమెకు ధైర్యం కాస్త ఎక్కువే. (ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) ఇంతకు ముందే జీవితంలో తగిలిన చాలా దెబ్బలు తట్టుకుంది. అందువల్ల మయోసైటిస్ వ్యాధికి ఓవైపు చికిత్స పొందుతూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసింది. ఇందులో 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ కూడా ఉంది. తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు ఏడాది పాటు నటనకు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. కొత్తగా అంగీకరించిన చిత్రాలకు తీసుకున్న అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చికిత్స కోసం అమెరికాకి వెళ్తుందనుకున్న సమంత.. నేరుగా అక్కడికి వెళ్లలేదు. యూఎస్ వెళ్లడానికి ముందు ధ్యానం, యోగా, స్నేహితులతో డాన్స్‌లు అని సమంత.. తనకు నచ్చిన విధంగా జీవితాన్ని గడిపేస్తోంది. ఆయా వీడియోలు, ఫొటోలని సోషల్ మీడియా పోస్ట్ చేస్తోంది. తాజాగా అందమైన స్మిమ్మింగ్ ఫూల్, పూలతోటలు, బంగ్లాలో దిగిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. ఇలా రాబోయేదంతా మంచి కాలం అని నమ్మకంగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే దటీజ్ సమంత అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (ఇదీ చదవండి: పేరుకే స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!) -
ట్రీట్మెంట్ కోసం హీరో వద్ద అప్పు.. క్లారిటీ ఇచ్చిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్‌తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అందుకోసం కొద్దిరోజుల పాటు సినిమాలకు కూడా ఆమె బ్రెక్ ఇచ్చింది. ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నట్లు కూడా తెలిపింది. కానీ అందుకు అయ్యే ఖర్చు సుమారు రూ.25 కోట్లు అని, ఆ డబ్బు కూడా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరో వద్ద అప్పుగా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై సమంత ఇలా క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు) మయోసైటిస్ చికిత్స కోసం రూ.25 కోట్లా!? ఇదీ తప్పు.. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. అందుకు అయ్యే ఖర్చు నా సంపాదనలో కొంత వరకు మాత్రమే అవుతుంది. ఆ ఖర్చు నేను పెట్టుకోగలను. నా కెరీర్లో సంపాదించిన మొత్తాన్ని ఇందుకోసమే ఖర్చు చేశానని నేను అనుకోవడం లేదు. నా జాగ్రత్తలు నేను చూసుకోగలను. మయోసైటిస్ అనేది ఓ సమస్య మాత్రమే. వేలాది మంది ప్రజలు కూడా దీనితో బాధపడుతున్నారు. ఇలాంటి విషయాలపై చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు దయచేసి కాస్త బాధ్యతగా ఉండాలి'అని సమంత తెలిపింది. (ఇదీ చదవండి: లలిత్ మోదీతో బ్రేకప్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన సుష్మితాసేన్!) ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న సమంత ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. దీంతో ఆమె భారీగానే ఆస్తి కూడబెట్టింది. అలాంటి సమంతకు అప్పు చేయాల్సిన అవసరం లేదని నెటిజన్స్ అంటున్నారు. సమంత విషయంలో పలు రూమర్స్ వస్తూనే ఉంటాయని, వాటిని నమ్మాల్సిన పనిలేదని సమంత ఫ్యాన్స్ కూడా తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
అంత లేదు...నేనూ సంపాదిస్తున్నా: మండిపడిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత మైయోసైటిస్ చికిత్స కోసం టాలీవుడ్ స్టార్ హీరో ఆర్థిక సాయంచేశారన్న వార్తలపై సమంత స్పందించింది. ఇవన్నీ గాలి వార్తలని కొట్టి పారేసింది. తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ఈమేరకు ఆమె ఇన్‌స్టా స్టోరీని పోస్ట్ చేసింది. సుదీర్ఘ కాలంగా సినిమాల్లో పనిచేసిన తనకు ఆ మాత్రం సామర్థ్యం ఉందని, తనను తాను చూసుకోగలనని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో తెలిపింది. మైయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత త్వరితగతిన తనచేతిలో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసింది. అలాగే ఆరోగ్యం సహకరించని కారణంగా చాలా ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడమేకాదు, కొంత కాలం పాటు సినిమాలకు విరామాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఆమె ప్రకృతి ఒడిలో బాలి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. కాగా మైయోసైటిస్ చికిత్స కోసం టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో ఆర్థిక సాయాన్ని చేశారనే తప్పుడు కథనాలు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. సమంత కు ‘యశోద’ సినిమా సమయంలోనే ఆమెకు మైయోసైటిస్ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. కొన్నాళ్ల చికిత్స తరువాత తన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. -
సమంత ట్రీట్మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఇండోనేసియాలోని బాలి టూర్లో ఉంది. ఇప్పటికే షూటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసిన సామ్.. కొన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకోనుంది. ఈ విషయం నిజమే. దీంతో ఆమె చికిత్స కోసమే ఈ విరామం తీసుకుందని అంటున్నారు. అయితే ఈ విషయమై విదేశాలకు వెళ్లబోతున్న సామ్.. ట్రీట్మెంట్ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన సమంత.. 'ఏ మాయ చేశావె' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టి శెభాష్ అనిపించుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాల చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. (ఇదీ చదవండి: అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా) కెరీర్లో భాగంగా తెలుగుతో పాటు తమిళ సినిమాలూ చేసిన సామ్.. ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చి హిందీ ప్రేక్షకులకు పరిచయమైంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' రెండో సీజన్లో విలన్ తరహా పాత్ర చేసిన సమంత.. త్వరలో 'సిటాడెల్' సిరీస్‌తో అందరినీ ఎంటర్టైన్ చేయనుంది. అలానే ఈమె నటించిన 'ఖుషి'.. సెప్టెంబరు 1న థియేటర్లలోకి రాబోతుంది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో తను బాధపడుతున్నట్లు గతేడాది బయటపెట్టిన సమంత.. ఓవైపు సినిమాలు చేస్తూనే చికిత్స తీసుకుంది. అయితే పూర్తి మెరుగైన ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లబోతుందని దీని కోసం రూ.25 కోట్ల వరకు ఖర్చు చేయనుందని టాక్. బహుశా ఇది నిజం అయ్యిండొచ్చు ఏమో కానీ, ఈ మొత్తాన్ని ఓ హీరో దగ్గర అప్పుగా తీసుకుందనే ఓ రూమర్ మాత్రం తెగ వైరల్ అయింది. బోలెడంత ఆస్తి సంపాదించిన సమంతకు అప్పు చేయాల్సిన అవసరం లేదని నెటిజన్స్ అంటున్నారు. దీన్నిబట్టి చూస్తే అప్పు అనేది కచ్చితంగా ఫేక్‌న్యూస్. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ) -
అరుదైన వ్యాధి బారిన ప్రముఖ నటి.. అలాంటి పరిస్థితిలో!
హీరోయిన్లని చూడగానే.. అబ్బా సూపర్ ఉంది అని ఫ్యాన్స్ అనుకుంటారు. అయితే సదరు హీరోయిన్లలో కొందరు అరుదైన వ్యాధులు, లేదంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఒకప్పుడు బయటపెట్టేవాళ్లు కాదు గానీ ఈ మధ్య మాత్రం తమకు ఎదురైన సమస్య గురించి నలుగురికి చెప్పడంలో సదరు బ్యూటీస్ అస్సలు మొహమాట పడట్లేదు. తాజాగా ఓ నటి అలానే ఓ ఫొటో పోస్ట్ చేసి తన హెల్త్ ప్రాబ్లమ్‌ని రివీల్ చేసింది. సమంతలా ఈ నటికి తెలుగు స్టార్ హీరోయిన్ సమంత.. ఈ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తనకు మయాసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉందని గతేడాది బయటపెట్టిన సామ్.. ఇప్పుడు దానికి చికిత్స కోసమే విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీలానే బాలీవుడ్ నటి ఈషా గుప్తా కూడా అరుదైన వ్యాధి బారిన పడినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా ఈ నటి ఇన్‌స్టా స్టోరీలో ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న ఫొటో పోస్ట్ చేసింది. దీంతో అందరూ షాకయ్యారు. (ఇదీ చదవండి: ఏప్రిల్‌లో గుండెనొప్పి.. ఇప్పుడేమో మళ్లీ స్టేజీపై చలాకీ చంటి!) అదే కారణమా? ఈషా గుప్తా పోస్ట్ చేసిన ఫొటోకి హైపర్బేరిక్ థెరపీ అని క్యాప్షన్ పెట్టింది. గతంలో ఇదే థెరపీ సమంత తీసుకుంది. మయోసైటిస్ చికిత్సలో భాగంగా ఈ థెరపీ తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల పాడైన కండరాలు బాగుపడతాయి. కండరాల వాపు, ఇన్ఫెక్షన్ లాంటివి తగ్గుతాయని సామ్ అప్పట్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు అలాంటి ఆక్సిజన్ మాస్క్ తో ఈషా గుప్తా కనిపించడంతో ఈమెకీ మయోసైటిస్ వచ్చిందా అనే సందేహం కలుగుతోంది. తెలుగులో రెండే ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైన ఈషా గుప్తా.. గతంలో తెలుగులోనూ రెండు సినిమాలు చేసింది. అందులో ఒకటి సచిన్ జోషి హీరోగా నటించిన 'వీడెవడు' కాగా, రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' మూవీలో ఏక్ బార్ ఏక్ బార్ అనే పాటలో ఈషా సందడి చేసింది. వీటి తర్వాత ఈమెకు టాలీవుడ్లో మరో ఛాన్స్ రాలేదనే చెప్పాలి. View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌పై బాడీ షేమింగ్.. ఆయన వల్ల!) -
వైద్యం కోసం విదేశాలకు సమంత.. అతడు ఎమోషనల్!
Samantha Hair Stylist Emotional post: స్టార్ హీరోయిన్ సమంత లాంగ్ బ్రేక్ తీసుకుంది. ఈ మధ్యే 'సిటాడెల్' షూటింగ్ పూర్తి చేసిన ఈమె.. విరామం తప్పేం కాదని చెబుతూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఎన్నాళ్లపాటు అనేది చెప్పలేదు గానీ ఇది ఏడాదికి పైనే ఉండొచ్చని తెలుస్తోంది. అసలు ఇది ఎందుకోసమా అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సామ్ హెయిర్ స్టైలిష్ట్ ఎమోషనల్ అయ్యాడు. ఆమె బ్రేక్‌కి అసలు కారణం బయటపెట్టాడు. ఆ చికిత్స కోసం హీరోయిన్ సమంత గతేడాది 'యశోద' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కి సరిగ్గా కొన్నిరోజుల ముందు 'మయోసైటిస్' అనే వ్యాధితో తాను బాధపడుతున్నట్లు బయటపెట్టింది. ఓవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు 'ఖుషి' మూవీ, 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్స్ పూర్తి చేసింది. ఇప్పుడు తాత్కాలికంగా నటనని పక్కనబెట్టి.. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లిపోయింది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' కంటే 'చంద్రయాన్-3' బడ్జెట్ తక్కువ) ఆత్రుతగా చూస్తుంటా 'రెండేళ్లు.. 1 మ్యూజిక్ వీడియో.. 3 సినిమాలు.. 7 బ్రాండ్ క్యాంపెయిన్స్.. 2 ఎడిటోరియల్స్.. లైఫ్ టైమ్ గుర్తుండిపోయే జ్ఞాపకాలని పోగేసుకున్నాం. ఎండ వాన లెక్కచేయకుండా పనిచేశాం. నవ్వులు, కన్నీళ్లు, బాధలు.. ఇలా అన్నీ చిరునవ్వుతో స్వీకరించాం. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. అద్భుతమైన జర్నీ చేశాం' 'చికిత్స తీసుకుంటున్న టైంలో మీరు మరింత బలం, శక్తి రావాలని కోరుకుంటున్నాను. ముందు కంటే డబుల్ ఉత్సాహంతో తిరిగి రావాలని ఆశిస్తున్నా. మళ్లీ మిమ్మల్ని కలిసే రోజు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటాం' అని హెయిర్ స్టైలిష్ట్ రోహిత్ భట్కర్ పోస్ట్ పెట్టాడు. దీంతో వైద్యం కోసం సమంత విదేశాలకు వెళ్తుందనే విషయం నిజమేనని అందరికీ క్లారిటీ వచ్చేసింది. View this post on Instagram A post shared by Rohit Bhatkar (@rohit_bhatkar) (ఇదీ చదవండి: హీరోయిన్ రష్మికపై కుట్ర జరుగుతోందా?) -
ఆత్మపరిశీలన చేసుకున్నా!
‘‘ఈ ఏడాది ఎప్పుడూ చేయనన్ని పూజలు, ప్రార్థనలు చేశా. నాకు వరాలు ఇమ్మని, దీవెనలు అందించమని కాదు. శక్తిని, ప్రశాంతతను ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించా. మన ప్రార్థనలను ఆలకించడంలో భగవంతుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడేమో కానీ, ఎలాంటి స్వార్థం లేని శాంతి, ప్రేమ, సంతోషం, శక్తిని కోరుకుంటే కాదనడు’’ అని సమంత పేర్కొన్నారు. మయోసైటిస్ కారణంగా కొన్ని నెలలు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన సమంత కోలుకుని సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్–డీకే ద్వయం తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం సెర్బియాలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడి ‘సెర్చ్ ఆఫ్ సెయింట్ సావా’ను సందర్శించి ప్రార్థనలు చేశారామె. ఆ ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసి, మయోసైటిస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ తన జీవిత ప్రయాణం ఎలా సాగిందో ఓ సుదీర్ఘమైన పోస్టు చేశారామె. ‘‘మయోసైటిస్ వ్యాధి నిర్ధారణ అయి ఏడాది అవుతోంది. ఈ ఏడాదిలో ఎప్పుడూ ఊహించని కొత్త పరిస్థితుల్ని ఎదుర్కొన్నాను. నా శరీరంతో ఎన్నో పోరాటాలు చేశా. ఇష్టమైన ఆహారాన్ని బలవంతంగా వదులుకున్నా. మందులే ఆహారం అయ్యాయి. ఆలోచించడం, ఆత్మపరిశీలన చేసుకోవడంతోనే ఈ ఏడాది సరిపోయింది. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన పరాజయాల విషయంలోనూ ఆత్మపరిశీలన చేసుకున్నా. పరిస్థితులను మెరుగుపరచమని కోరుతూ దేవుడికి ఎన్నో ప్రార్థనలు చేశా. అన్నీ మనకు అనుకూలంగానే జరగవన్న విషయం ఈ ఏడాది నేర్పించింది. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఫర్వాలేదని తెలుసుకున్నా. నా చేతుల్లో లేనిదాన్ని వదిలేయడం నేర్చుకున్నాను. కొన్నిసార్లు గొప్ప విజయాలు అక్కర్లేదు. పరిస్థితి నుంచి బయటపడటమూ ఒక విజయమే. ప్రతిదీ పరిపూర్ణం కావాలని ఎదురు చూడకూడదు.. గతాన్ని తలుచుకుంటూ అక్కడే ఆగిపోకూడదు. నన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తాను.. ద్వేషానికి మాత్రం నన్ను ఇబ్బందిపెట్టే అవకాశం ఇవ్వకూడదనుకున్నా’’ అని పోస్ట్ చేశారు సమంత. -
ఇంకా నయం కాని మయోసైటిస్.. ఆక్సిజన్ మాస్క్‌తో సమంత
చిలిపి నవ్వుతో కుర్రకారు గుండెలను కొల్లగొట్టే సమంత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే! ఓవైపు చికిత్స తీసుకుంటూనే సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ హుషారుగా కనిపిస్తుండటంతో వ్యాధి నెమ్మదిగా నయమవుతూ వస్తోందనుకున్నారంతా! కానీ ఇప్పటికీ అదే వ్యాధితో సతమతమవుతోంది సామ్. అందుకు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోయే ప్రత్యక్ష ఉదాహరణ! తాజాగా సమంత హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో సామ్ ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఉంది. తాను హైపర్ బారిక్ థెరపీ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ హైపర్ బారిక్ చికిత్స ద్వారా నిర్ణీత ప్రెజర్‌తో స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తారు. దీని ద్వారా ఎక్కువ ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో చేరి ఇన్ఫెక్షన్లను తగ్గించడమే కాకుండా దెబ్బతిన్న కణజాలం తిరిగి కోలుకునేందుకు ప్రేరేపిస్తుంది. అదనపు ఆక్సిజన్ బ్యాక్టీరియాపై పోరాటంలో సాయపడుతుంది. వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేందుకు తోడ్పడుతుంది. ఇక ఆక్సిజన్ మాస్క్‌తో సామ్‌ను చూసిన అభిమానులు నువ్వు చాలా స్ట్రాంగ్, త్వరలోనే ఈ వ్యాధిని జయిస్తావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సామ్ చివరగా శాకుంతలం సినిమాలో నటించింది. ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని రాబట్టడంలో ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: నాలుగు రోజుల్లోనే 500కు పైగా సిగరెట్లు తాగా: అల్లరి నరేశ్ -
ఆ సమయంలో ఆరోగ్యం క్షీణించినా లెక్కచేయలేదు: సమంత
సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గతేడాది యశోద చిత్రంతో అభిమానులను పలకరించింది. ఆ సమయంలో సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శాకుంతలం మూవీ ప్రమోషన్లలో బిజీ పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమంత తన ఆరోగ్య పరిస్థితిపై కీలక విషయాలను పంచుకున్నారు. సమంత మాట్లాడుతూ.. 'మయోసైటిస్ నిర్ధారణ కాగానే మొదట్లో చాలా బలహీనంగా అనిపించేది. యశోద చిత్ర సమయంలో ఆరోగ్యం బాగా క్షీణించింది. అయినా కూడా ప్రమోషన్స్‌లో పాల్గొన్నా. ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఓపిక ఉండేది కాదు. చాలా మందులు వాడాల్సి వచ్చేది. సినిమాను బాధ్యతగా భావించి కష్టమైన సరే ఇంటర్వ్యూ చేయాలనుకున్నా. అయితే ప్రస్తుతం ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తోంది. మయోసైటిస్ నుంచి కోలుకుని ధైర్యంగా ఉన్నా.' అని చెప్పుకొచ్చింది. శాకుంతలం చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గుణశేఖర్ కథ చెప్పగానే మొదట తిరస్కరించినట్లు తెలిపింది. అందుకు కారణం మూడేళ్లుగా తనలో ఉన్న భయమేనని అన్నారు. కానీ గుణశేఖర్ ఒప్పించి మరీ నటించేలా చేశారని వెల్లడించారు. ఈ సినిమాలోని పాత్ర కోసం ప్రత్యేక వ్యాయామాలు, వర్కవుట్లు, డైట్ కూడా మార్చుకున్నట్లు వివరించారు. ఈ చిత్రాన్ని వదులుకుంటే తన కల సాకారమయ్యేది కాదన్నారు. కాగా.. శాకుంతలం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో దేవ్ మోహన్, సచిన్ ఖేడ్కర్, మోహన్‌బాబు, అదితి బాలన్, అనన్య ప్రధాన పాత్రల్లో నటించారు. -
గుర్రపు స్వారీ చేస్తున్న సమంత.. ఫోటో వైరల్
సమంత ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకొని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటుంది. చివరగా యశోద సినిమాతో అలరించిన సమంత ఇప్పుడు శాకుంతలం సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు సమంత విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాతో పాటు సిటాడెల్ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్-డికే ‘సీటాడెల్’ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ కోసం సామ్ ప్రత్యేకంగా హార్స్ రైడింగ్ నేర్చుకుంటుంది. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో సమంత మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకొని ఇలా కనిపించడం సంతోషంగా ఉందని కామెంటస్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
600 మెట్లు ఎక్కుతూ, ప్రతి మెట్టుపై కర్పూరం వెలిగిస్తూ..
తమిళనాడులోని దిండిక్కల్ జిల్లాలో గల పళని సుబ్రహ్మణ్యస్మామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు సమంత. కొంతకాలంగా మయోసైటిస్ (కండరాలకు సంబంధించిన వ్యాధి...)తో సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకునేందుకు సమంత వైద్య చికిత్స తీసుకుంటున్నారు. కాగా, అనారోగ్యం నుంచి వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుతూ, పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సమంత పూజలు చేశారు. అలాగే ఈ ఆలయ దర్శనానికి సమంత దాదాపు 600 మెట్లు ఎక్కి వెళ్లారని, ప్రతి మెట్టుపై ఓ కర్పూరాన్ని వెలిగించారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే... సమంత నటించిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’లో హీరోయిన్గా, హిందీ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’లో నటిస్తున్నారు సమంత. -
సమంత హెల్త్ అప్డేట్.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?
స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే సినిమాల్లో యాక్టివ్ అవుతోంది. యశోద చిత్రంతో ప్రేక్షకులను అలరించిన నటి ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడి కొన్ని నెలల పాటు సినిమాలకు దూరమైంది. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న సామ్ యశోద మూవీ సక్సెస్ తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం సమంత శాకుంతలం, సిటాడెల్, ఖుషీ చిత్రాల్లో నటిస్తోంది. ఇందుకోసం తీవ్రంగా కసరత్తులు ప్రారంభించింది. తాజాగా జిమ్‌లో సమంత చెమటోడ్చుతున్న వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది సమంత. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవైపు ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు. మయోసైటిస్కు సంబంధించి నెలవారీ ఐవీఐజీ ఇంజెక్షన్ తీసుకుంటున్న ఫోటోలు షేర్ చేశారు. దీని కోసం దాదాపు 2 నుంచి 4 గంటలు కష్టపడుతోంది సమంత. ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఆరోగ్యాన్ని ఏమాత్రం అలసత్వం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మయోసైటిస్ చికిత్స కోసం ఇంట్లో యాంటీబాడీస్ కోసం ఐవీఐజీ (IVIG) ఇంజెక్షన్లు తీసుకుంటున్నట్లు యశోద నటి తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఇంజెక్షన్ తీసుకుంటున్న ఫోటోను కూడా పంచుకుంది. కాగా.. ఈనెల 17న విడుదల కావాల్సిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా శాకుంతలం 3డిలో విడుదల కానుంది. సమంత, విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషిలో కనిపించనున్నారు. అంతే కాకుండా బాలీవుడ్లో వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. ఇటీవల ముంబయి వెళ్లిన సమంత ‘సిటాడెల్’ చిత్రీకరణలో పాల్గొన్నారు. అమెజాన్ ప్రైమ్వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. -
ఆ రోజులను ఎప్పటికీ మరిచిపోలేను: సమంత ఎమోషనల్ పోస్ట్
సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. గతేడాది యశోద చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత కోలుకుంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు మళ్లీ దగ్గరవుతోంది. ఇటీవల ఆమె నటిస్తున్న సినిమాలపై మరింత ఫోకస్ పెట్టారు. సమంత ప్రస్తుతం శాకుంతలం, సిటాడెల్ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొత్త ఏడాది జవనరిలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది సామ్. కొత్త ఏడాది జనవరిలో తన లైఫ్ ఎలా సాగిందో సోషల్ మీడియాలో ఫొటోల ద్వారా పంచుకుంది. సిటాడెల్ చిత్రబృందంతో మీటింగ్, వర్కౌట్లు, ఫొటోషూట్లతో జనవరి నెల గడిచిపోయిందంటూ సామ్ పోస్ట్ చేసింది. సమంత తన పోస్ట్‌లో.. 'గట్టిగా ఊపిరి పీల్చుకో పాప. త్వరలో అన్నీ సర్దుకుంటాయని నేను నీకు మాటిస్తున్నా. గత 7-8 నెలలుగా చాలా ఇబ్బందులు పడుతూ ముందుకు సాగావు. ఆ క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నావో ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఎన్ని ఇబ్బందులు ఎదురైన ధైర్యంగా అడుగేశావ్. ఈ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నా. ధైర్యంగా మరింత ముందుకు సాగిపో.' అంటూ జనవరిలో జరిగిన విషయాలను ఓసారి గుర్తు చేసుకున్నారు సామ్. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
అరుదైన వ్యాధి.. ఈ పోరాటంలో విజయం మాదే అంటున్న అందాల తారలు
సమంతకు ‘మయోసైటిస్’.. పూనమ్ కౌర్‌కి ‘ఫైబ్రోమయాల్జియా’.. ఇది అందరికీ తెలిసిన విషయమే. మంగళవారం నాడు మమతా మోహన్‌దాస్ తాను చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘ఈ కష్టాన్నీ దాటేస్తాను’ అనే నమ్మకాన్ని వ్యక్తపరిచారామె. ఇక సమంత తన అనారోగ్యం గురించి చెప్పినప్పుడు ‘నాలానే ఎంతోమంది పోరాడుతున్నారు. మేం గెలుస్తాం’ అన్నారు. ఇదే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచిన పూనమ్, మమతా.. ఈ మధ్యకాలంలో తమ అనారోగ్యం గురించి పేర్కొన్న కొందరు తారల గురించి తెలుసుకుందాం. గత ఏడాది అక్టోబర్‌లో సమంత తాను మయోసైటిస్ వ్యాధి (ఎక్కువ పని చేయలేకపోవడం, కండరాల నొప్పి, త్వరగా అలసిపోవడం వంటివి)తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. ఆస్పత్రి బెడ్‌పై ఉండి ఆమె ‘యశోద’ సినిమాకి డబ్బింగ్ చెప్పారు కూడా. ‘‘జీవితంలో మంచి రోజులతో పాటు చెడ్డ రోజులు కూడా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో (మయోసైటిస్‌ని ఉద్దేశించి) ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపించింది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంతదూరం వచ్చానా అనిపించింది. అందుకే పోరాడతా. నాలానే చాలామంది పోరాడుతున్నారు. మేం గెలుస్తాం’’ అని పేర్కొన్నారు సమంత. ఇక సమంత తనకు మయోసైటిస్ అని ప్రకటించిన తర్వాత పియా బాజ్‌పాయ్ (‘రంగం’ సినిమా ఫేమ్) కూడా గతంలో తాను ఇదే వ్యాధితో బాధపడ్డాననే విషయాన్ని బయటపెట్టారు. అయితే ఇంట్లోవాళ్లు భయపడతారని తనకు మయోసైటిస్ అనే విషయాన్ని చెప్పలేదన్నారు పియా. కుటుంబ సభ్యులతో ఢిల్లీలో ఉంటున్న పియా వ్యాధి చికిత్స నిమిత్తం ముంబైలో ఉన్నారు. ఇంట్లోవాళ్లకు తెలియకుండా చికిత్స చేయించుకుని, కోలుకున్నాక చెప్పానని పియా పేర్కొన్నారు. ఇటీవల ‘లాస్ట్’ అనే హిందీ చిత్రంలో నటించారామె. ఇక సమంత తన అనారోగ్యం విషయం బయటపెట్టిన రెండు నెలలకు డిసెంబర్లో పూనమ్ కౌర్ తనకు ‘ఫైబ్రోమయాల్జియా’ అనే విషయాన్ని బయటపెట్టారు. కండరాల నొప్పి, అలసట, నిద్రలేమితో ఈ వ్యాధి బాధపెడుతుంటుంది. రెండేళ్లుగా ఈ వ్యాధితో తాను బాధపడుతున్నట్లు తెలిపారు పూనమ్. కేరళలో ఆయుర్వేద చికిత్స మొదలుపెట్టిన ఆమె త్వరలోనే కోలుకుంటానని ఈ వ్యాధి గురించి ప్రకటించినప్పుడు తెలిపారు. మరోవైపు గత ఏడాది నవంబర్‌లో బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ తాను ‘ఎపిలెప్సీ’ (మూర్ఛ రోగం)తో బాధపడుతున్నట్లు తెలిపారు. అయితే తన వ్యాధి విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగా ఉంచడానికి కారణం ఇతరులు తనను బలహీనురాలు అనుకోకూడదని, ఒకవేళ అందరికీ తెలిస్తే తనకు పని ఇవ్వడానికి వెనకాడతారనే భయాలే అని పేర్కొన్నారు ఫాతిమా. కానీ ఇప్పుడు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తన విషయం బయటపెట్టానని స్పష్టం చేశారు. ‘‘నేను షూటింగ్ చేస్తున్నప్పుడు మా యూనిట్లో ఒకరికి మూర్ఛ వచ్చింది. నేను ఆ వ్యక్తికి సహాయం చేశాను. నాకలా జరిగినప్పుడు ఇతరుల సహాయం కావాలి. అయితే ఇదేం తప్పు కాదు... దాచేయడానికి. అందుకే చెప్పాలనుకున్నాను. నా నిర్మాతలకు నా పరిస్థితి చెబుతుంటాను. లొకేషన్లో నాకు మూర్ఛ వచ్చిన సందర్భాలున్నాయి. ఆ టైమ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందే చెప్పడం హెల్ప్ అయింది’’ అన్నారు ఫాతిమా. ఆమిర్ ఖాన్ కూతురుగా ‘దంగల్’లో ఫాతిమా మల్ల యోధురాలుగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు ఫాతిమా. ఇక 2010లో మమతా మోహన్‌దాస్ కేన్సర్ బారిన పడ్డారు. ఆ విషయాన్ని బాహాటంగా చెప్పి, ధైర్యంగా చికిత్స చేయించుకున్నారామె. కేన్సర్‌పై అవగాహన కలిగించడానికి పలు విషయాలను పంచుకున్నారు కూడా. అయితే 2013లో మళ్లీ కేన్సర్ అని తెలిసినప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకుని, కోలుకున్నారు. ఇప్పుడు మంగళవారం (17.01.) నాడు తాను చర్మ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని పంచుకున్నారు మమతా మోహన్‌దాస్. ‘విటిలిగో’ అనే చర్మ వ్యాధి సోకిందని పేర్కొన్నారామె. చర్మంపై మచ్చలు, చర్మం రంగు మారడం ఈ వ్యాధి లక్షణాలన్నారు. ఇంకా ‘‘ప్రియమైన సూర్యుడా.. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు నిన్ను హత్తుకోవాలనుకుంటున్నాను. నా చర్మం రంగుని కోల్పోతున్నాను. నువ్వు ఉదయించక ముందే నీకోసం నేను నిద్రలేచి పొగమంచులో నీ తొలి కిరణాన్ని చూడటానికి వేచి చూస్తున్నాను. నీ వెచ్చదనాన్నంతా నాకు ఇచ్చెయ్. ఎందుకంటే నాకు అది ఎంతో మేలు చేస్తుంది. అందుకే నీకెప్పటికీ రుణపడి ఉంటాను’’ అని మమతా మోహన్‌దాస్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ‘మీరు పెద్దవే దాటి వచ్చారు. ఇది చిన్న విషయం. ఇందులోంచీ బయటపడతారు’ అని ఫ్యాన్స్ పోస్ట్ చేశారు. అనారోగ్యం అనే విషయాన్ని బయటపెట్టడానికి ధైర్యం కావాలి. దాన్ని ఎదుర్కొని, కోలుకోవడానికి ఇంకా ధైర్యం కావాలి. ఈ చాలెంజ్‌లో ‘గెలుపు ఖాయం’ అని నమ్మడంతో పాటు ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన ఈ స్టార్స్ నిజమైన ‘స్టార్స్’. -
సమంత అందంపై కామెంట్.. తన స్టైల్లో రిప్లై ఇచ్చిన సామ్
స్టార్ హీరోయిన్ సమంత చాలారోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో సమంత పాల్గొనడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అయ్యారు. ట్రైలర్లో సమంత అందానికి, నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మయోసైటిస్ నుంచి సమంత కోలుకుందా? ఇప్పుడు మునుపటిలా వరుస సినిమాలు చేస్తుందా అంటూ ఆమె ఆరోగ్య పరిస్థితిపై కూడా నెట్టింట జోరుగా చర్చ మొదలైంది. ఈ క్రమంలో సమంత అందంపై ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కి సామ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చదవండి:Samantha: సమంత మయోసైటిస్ నుంచి ఇంకా కోలుకోలేదా? సమంతను చూస్తే జాలేస్తుంది. విడాకుల తర్వాత ధైర్యంగా నిలదొక్కుకొని కెరీర్ ఉన్నత స్థానంలో ఉందని భావిస్తుండగా మయోసైటిస్ ఆమెను దెబ్బతీసింది. ఆమెను మళ్లీ బలహీనురాలిని చేసింది. సామ్ అందం, గ్లో తగ్గిపోయింది. ఆమెను చూస్తూ బాధేస్తోంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. నాలాగా నెలల తరబడి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి నీకు రాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నా. మీ అందం మరింత పెరిగేలా నా ప్రేమను కొంచెం పంపిస్తున్నా అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చింది సామ్.చదవండి: గుణశేఖర్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సమంత I pray you never have to go through months of treatment and medication like I did .. And here’s some love from me to add to your glow 🤍 https://t.co/DmKpRSUc1a — Samantha (@Samanthaprabhu2) January 9, 2023 -
సమంత చేతిలో జపమాల.. కారణం ఇదేనా?
చాలా రోజుల తర్వాత సమంత మీడియా ముందుకు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తెరపై ఆమె మాట్లాడడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామ్ గత కొంత కాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. యశోద సినిమా రిలీజ్ సమయంలో సమంత ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు అనారోగ్యం కారణంగా ఆ సినిమా ప్రమోషన్స్‌లోనూ పాల్గొనలేకపోయింది. శక్తిని కూడగట్టుకొని బలవంతంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్లిపోయింది. అప్పటి నుంచి నిన్నటి వరకు సామ్ మీడియా ముందుకు రాలేదు. సోషల్ మీడియాకు కూడా దూరంగానే ఉన్నారు. అయితే సామ్ ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది. ట్రీట్మెంట్ తో పాటు మానసిక ప్రశాంత కోసం ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలు చెప్పిన విషయాలను కూడా సమంత పాటిస్తున్నారని తెలుస్తుంది. సమంత ఎక్కడకు వెళ్లినా ఆమె చేతిలో జపమాల ఉంటుంది. తాజాగా శాకుంతలం ట్రైలర్ విడుదల ఈవెంట్లో పాల్గొన్న సమంత జపమాల చేతిలో పెట్టుకొనే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అంతకు ముందు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కూడా చేతిలో జపమాలతో కనిపించింది. దీంతో అందరి దృష్టి ఆ జపమాలపై పడింది. ఆమె జపమాల ధరించడానికి గల కారణం ఏమై ఉంటుందా అని అందరూ ఆరా తీస్తున్నారు. (చదవండి: సమంతపై మంచు లక్ష్మి ఆసక్తికర ట్వీట్) సాధారణంగా తులసిమాల వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, మనసు కూడా ప్రశాంతంగా అంటుందని చాలామంది నమ్ముతారు. దీంతో సమంత కూడా ఆ తులసి జపమాల ఆరోగ్యం కోసం, చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉండటానికి, మనసు ప్రశాంతంగా ఉండటానికే ఆ జపమాల వేసుకుందట. అంతేకాదు ఎక్కువగా తెల్లటి దుస్తులనే ధరిస్తున్నారట. నెగిటివ్ థాట్స్ రాకుండా, మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకే సామ్ జపమాలతో లక్ష జపం చేస్తున్నారట. అలాగే సమంతకు ఆధ్యాత్మిక భావన ఎక్కువనే చెప్పాలి. ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవుని కూడా ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. కాగా, సమంత లీడ్ రోల్లో నటించిన శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత షాకింగ్ నిర్ణయం! ఆ ప్రాజెక్ట్స్ నుంచి సామ్ అవుట్?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల సామ్ స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం సామ్ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో సామ్ బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. దీంతో ఆమె అక్కడ వరుస ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు తెలుగులోనూ ఆమె ఖుషి చిత్రంతో పాటు తమిళంలోనూ పలు సినిమాకు సంతకం చేసింది. వీటితో పాటు ఓ హాలీవుడ్ మూవీకి కూడా ఒకే చెప్పింది. దీంతో ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు క్యూలో ఉన్నాయి. పాన్ ఇండియా మూవీ శాకుంతలం అనంతరం సామ్ వరుసగా పలు చిత్రాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే తాను మయోసైటిస్ బారిన పడటంతో ప్రస్తుతం స్వల్ప కాలం పాటు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సామ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. బాలీవుడ్ సినిమాల విషయంలో సామ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖషి సినిమా తర్వాత ఆమె నటనకు, షూటింగ్‌లకు లాంగ్ బ్రేక్ తీసుకోవాలని అనుకుంటోందట. ఇదే విషయాన్ని తను సంతకం చేసిన మూవీ నిర్మాతలకు చెప్పిందట. సమంత నిర్ణయాన్ని బాలీవుడ్ నిర్మాతలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. సామ్ సంతకం చేసిన బాలీవుడ్ చిత్రాల నిర్మాతలు సినిమా ఆలస్యం అయితే తమకు నష్టమని, మిగతా నటీనటుల కాల్షిట్ దృష్ట్యా కూడా సమంత నిర్ణయాన్ని వారు తిరస్కరించినట్లు సమాచారం. దీంతో సామ్ ఆ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకున్నట్లు ఫిలిం దూనియాలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: శివాజీ గణేషన్‌ను ఇండస్ట్రీ పట్టించుకోలేదు: ఇళయరాజా సంచలన వ్యాఖ్యలు ఫైనలిస్ట్‌గా కీర్తి.. ఆమె 15 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే! -
నాకు నేనే పెద్ద విమర్శకురాలిని: సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
తమిళసినిమా: తెలుగు తమిళ భాషల్లో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న సమంత ది ఫ్యామిలీ– 2 వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించి విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించే అతి కొద్దిమంది దక్షిణాది హీరోయిన్లలో సమంత ఒకరు. ఈమె ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సమంత నటించిన మరో హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం శాకుంతలం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చదవండి: ఎన్టీఆర్ 30కి ముహుర్తం ఫిక్స్? అప్పుడే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్! ఇదిలా ఉంటే తాను మయోటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు బహిరంగంగా వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చారు సమంత. అయితే తాను చాలా ధైర్యవంతురాలినని కచ్చితంగా ఈ వ్యాధితో పోరాడి నెగ్గుతాననే ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్న సమంత కోసం ఖుషి చిత్ర యూనిట్ ఎదురుచూస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె ఇటీవల ఒక భేటీలో తన మనోభావాలను పంచుకున్నారు. అందులో ఆమె పేర్కొంటూ తనకు కోపం వచ్చినప్పుడు జిమ్ముకు వెళ్లి ఇష్టానుసారంగా శారీరక వ్యాయామం చేస్తానని చెప్పారు. అప్పుడు వెంటనే కోపం తగ్గిపోతుంది అని చెప్పారు. తాను డబ్బు, పేరు ప్రఖ్యాతల కోసం ఆరాటపడనని.. తనకు డబ్బు ముఖ్యం కాదని నటనే ముఖ్యమన్నారు. చదవండి: పట్టలేని సంతోషంతో భార్యను హగ్ చేసుకున్న అభిషేక్.. ఆ రూమర్లకు ఈ వీడియోతో చెక్ ఇక తాను చేసే ప్రతి పాత్రను ఆస్వాదిస్తానని, అలా నటించకపోతే అందులో ఎలాంటి సంతోషం, ప్రయోజనం ఉండదన్నారు. తనకు తానే పెద్ద విమర్శికురాలినన్నారు. మన తప్పులను, పొరపాట్లను తెలుసుకోగలిగితేనే వృత్తిలో ఎదగగలమని చెప్పారు. అయితే కాలం కలిసి రాకపోతే ఏదీ జరగదన్నారు. అలాంటి సమయంలో చింతించకుండా, ఆలోచనలను పక్కన పెట్టి నిద్రపోతానని చెప్పారు. ‘నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు. నువ్వు భూమి మీదకి వచ్చింది ఎవరి అభినందనల కోసమో, ఇతరులను సంతోష పెట్టడానికో కాదు. మనకు ఉన్నదాంట్లో సంతోష పడటానికి అలవాటు పడితే అవసరమైనవన్ని మనల్ని వెతుక్కుంటూ వస్తాయి’ అని సమంత చెప్పుకొచ్చారు. -
సమంత లాగే నాకు కూడా మయోసైటిస్ ఉంది : హీరోయిన్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆటో ఇమ్యూన్ సమస్య కారణంగా వచ్చే ఈ వ్యాధి వల్ల కండరాల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి కదల్లోని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆటో ఇమ్యూన్‌తో పాటు వైరస్, కొన్ని మందుల ప్రభావంతోనూ మయోసైటిస్ వస్తుంది. ప్రస్తుతం సమంత దీనికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాను కూడా మయోసైటిస్ వ్యాధితో పోరాడినట్లు హీరోయిన్ పియా బాజ్‌పేయ్ తెలిపింది. సమంత పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను కూడా గతంలో మయోసైటిస్ బారిన పడ్డాను. చికిత్స లేని వ్యాధి బారిన పడితే వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. నాకు మయోసైటిస్ వచ్చిందని విషయం ఇంట్లో వాళ్లకు కూడా చెప్పలేదు. ముంబైలో ఉండి చికిత్స తీసుకున్నా. సమంతకు మయోసైటిస్ ఉందని తెలియగానే బాధపడ్డా అంటూ చెప్పుకొచ్చింది. కాగా పియా బాజ్‌పేయి జీవా హీరోగా నటించిన 'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. -
అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్? కేరళలో చికిత్స!
హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్ అయిన పూనమ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఫైబ్రో మైయాల్జియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్న పూనమ్ ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందట. ఈ వ్యాధి కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతుందట.చదవండి: పెళ్లి ఫోటోల్లో లావుగా ఉందంటూ హీరోయిన్‌పై ట్రోల్స్ గత రెండేళ్ల నుంచి పూనమ్ ఈ వ్యాధితో బాధపడుతుందని ప్రస్తుతం దీన్నుంచి బయటపడేందుకు కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటుందట. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇక ఇటీవలె సమంత మయోసైటిస్ వ్యాధి బారినపడినట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ పూనమ్ అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటుందని సమాచారం. కాగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూనమ్ ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి వంటి సినిమాల్లో నటించింది. చదవండి: డీజే టిల్లు-2 సెట్స్‌లో అనుపమ-సిద్ధూ గొడవపడ్డారా? -
సమంత పరిస్థితి విషమం? నిజమేంటంటే?
ఇటీవలు యశోద సినిమాతో సక్సెస్ అందుకుంది హీరోయిన్ సమంత. మయోసైటిస్ అనే కండరాల సంబంధిత వ్యాధి బారిన పడిన ఆమె ఇప్పుడే కోలుకుంటోంది. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తుందంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సామ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇవన్నీ వట్టి వదంతులు మాత్రమేనని ఆమె వ్యక్తిగత టీమ్ కొట్టిపారేసింది. సమంత దక్షిణ కొరియాకు వెళ్లడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా ఒకరి ఆరోగ్యం గురించి ఇలా ఏది పడితే అది ఎలా రాస్తారని సామ్ టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె అనారోగ్యం నుంచి కోలుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోందని స్పష్టం చేసింది. అనవసరంగా తన ఆరోగ్యం గురించి వదంతులు సృష్టించవద్దని కోరింది. చదవండి: ఈ సినిమాలో తమన్నాను అందుకే తీసుకున్నాం: నిర్మాత పుష్ప సినిమాలో హీరో ఎవరో తెలియదు: సీనియర్ హీరోయిన్ -
కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకోనున్న సమంత!
నటి సమంత గురించి ఇటీవల రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందుకు కారణం ఆమె మయోసిటీస్ అనే వ్యాధికి గురికావడమే. ఇది ప్రాణాంతక వ్యాధి అని, సరైన వైద్యం కూడా లేదని నటి సమంతనే ఆ మధ్య స్వయంగా వెల్లడించారు. నటిగా దక్షిణాదిలో అగ్రస్థానంలో రాణిస్తున్న ఆమెకు ఇలాంటి వ్యాధా? ఆమె సంపూర్ణంగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. కాగా సమంత అమెరికాలో వైద్య చికిత్స పొందారు. ఆ వైద్యం వల్ల పూర్తిగా కోలుకునే అవకాశం లేదని కొందరి సూచనల మేరకు సమంత కేరళలోని ఆయుర్వేద చికిత్స పొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయుర్వేద చికిత్స సత్ఫలితాన్ని ఇస్తోందని, ఆమె త్వరలోనే పూర్తిగా కోలుకుంటుందని తాజాగా జరుగుతున్న ప్రచారం. త్వరలోనే మళ్లీ షూటింగ్లో పాల్గొంటుందనే నమ్ముతున్నారు. దీనిపై సమంత సన్నిహితుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇక ఆమె తాజాగా నటించిన యశోద చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆమె నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. ప్రస్తుతం నటుడు విజయ్ దేవరకొండతో ఖుషి అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం సమంతకు అనారోగ్యం కారణంగా ఆగిపోయింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి ఖుషి చిత్రాన్ని పూర్తి చేస్తుందనే ఆశాభావంతో చిత్ర యూనిట్ ఎదురు చూస్తోంది. చదవండి: పెళ్లి పీటలెక్కనున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే? -
అస్వస్థతతో సమంత ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు.. మేనేజర్ ఏం చెప్పారంటే..
స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఆమె అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్టు తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇవన్నీ వదంతులేనని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఇంట్లోనే క్షేమంగా ఉందంటూ స్పష్టం చేశారు. మరోవైపు సామ్ ఆరోగ్యంపై వస్తోన్న ఫేక్ న్యూస్‌ని నమ్మోద్దని ఆమె మేనేజర్ కోరాడు. (చదవండి: సమంత ‘యశోద’కు భారీ షాక్.. ఓటీటీ విడుదల ఆపాలంటూ కోర్టు ఆదేశం!) కాగా కొద్ది రోజులుగా సామ్ మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం నవంబర్ 11న థియేటర్స్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. There is a news doing the rounds about @Samanthaprabhu2 and her health. Sources close to her confirm that she is absolutely fine and is doing good. Pl do not spread wrong information. pic.twitter.com/STtZOJVDta — sridevi sreedhar (@sridevisreedhar) November 24, 2022 -
సమంత వ్యాధిపై సంచలన కామెంట్స్ చేసిన నటి కల్పిక
నటి కల్పికా గణేష్ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు, పడిపడి లేచే మనసు వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన కల్పికా రీసెంట్గా యశోద సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా తెరపైకి వస్తున్న కల్పిక తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కల్పిక కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో తనకు వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపింది. ఓ కాలేజీ ఫంక్షన్లో గెస్టుగా పిలిచి అవమానించారని, దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఓ వర్గం తనను టార్గెట్ చేసిందంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ విషయంలో తనపై పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారని తెలిపింది. ఇక సమంత లాగే తనకు కూడా మయోసైటిస్ ఉందని, గత 13 ఏళ్లుగా ఈ వ్యాధితో పోరాడుతున్నట్లు చెప్పింది. అయితే తాను ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నట్లు చెప్పిన కల్పిక సమంత మాత్రం థర్డ్ స్టేజ్‌లో ఉందని, ఆమె త్వరగా కోలుకోవాలని పేర్కొంది. -
అడుగు కూడా ముందు వేయలేనేమో అనిపిస్తోంది.. సమంత కన్నీళ్లు
'యశోద'లో సమంత భావోద్వేగభరిత పాత్ర చేశారు. తనకు ఎదురైన పరిస్థితుల నుంచి బయట పడటం కోసం పోరాటం చేసే మహిళగా కనిపించనున్నారు. రియల్ లైఫ్‌లో కూడా సమంత ఫైటర్. మయోసైటిస్‌తో పోరాటం చేస్తూ, చికిత్స (సెలైన్) తీసుకుంటూ 'యశోద' డబ్బింగ్ పూర్తి చేశారు. హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సినిమాతో పాటు తన ఆరోగ్య పరిస్థితి గురించి సమంత మాట్లాడారు. ఆ విశేషాలు.. హాయ్ సమంత గారు... ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? థాంక్యూ... ఈ మాట అడిగినందుకు! ఇప్పుడు నేను రికవరీ అవుతున్నాను. త్వరలో పరిస్థితులు మెరుగు అవుతాయని ఆశిస్తున్నాను. ఈ క్షణం, నేను ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. 'యశోద' విడుదల గురించి ఎగ్జైట్ అవుతున్నాను. మీ ఆరోగ్యం గురించి చాలా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? అవును... నేనూ చాలా ఆర్టికల్స్ చూశాను. అయితే... ప్రస్తుతానికి నేను చావలేదు (నవ్వులు). ఆ హెడ్డింగ్స్ అప్రస్తుతం. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఫైట్ చేస్తున్నాను. నేను ఉన్న పరిస్థితిలో అది అంత ప్రాణాంతకం ఏమీ కాదు. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మీకు ఎక్కడ నుంచి వస్తోంది? సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు... కొన్ని మంచి రోజులు ఉంటాయి. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కోరోజు ఇంకొక్క అడుగు కూడా ముందు వేయలేనేమో అనిపిస్తోంది. కొన్ని రోజులు వెనక్కి తిరిగి వస్తుంటే ఇంత దూరం వచ్చానా? అనిపిస్తోంది. (సమాధానం చెబుతూ సమంత భావోద్వేగానికి లోనయ్యారు) చాలా మంది ఎన్నో సవాళ్లతో యుద్ధం చేస్తున్నారు. అంతిమంగా మనమే విజయం సాధిస్తాం. యశోద... టీజర్, ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది. ఎగ్జైట్ అయ్యాను. అదే సమయంలో కొంచెం నెర్వస్ కూడా ఉంది. టీజర్, ట్రైలర్లో మేము చూపించినది నిజమే. సినిమాలో ఏం ఉందో అదే చూపించాం. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్లకు టీజర్, ట్రైలర్ నచ్చాయి. సినిమా కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. 'యశోద' అంటే ముందుగా గుర్తు వచ్చేది ఏంటి? కథ చెప్పినప్పుడు వెంటనే ఓకే చేశారా? లేదంటే ఆలోచించారా? సాధారణంగా నేను ఏదైనా స్క్రిప్ట్ ఓకే చేయడానికి ఒక రోజు సమయం తీసుకుంటా. కానీ, 'యశోద' వెంటనే ఓకే చేశా. నేను విన్న వెంటనే ఓకే చేసేసిన కథల్లో 'యశోద' ఒకటి. 'యశోద' క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. పవర్ ఫుల్ స్టోరీ ఇది. అందుకని, ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ లేదు. కథ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులు కూడా అదే విధంగా థ్రిల్ అవుతారని, వాళ్ళకూ గూస్ బంప్స్ వస్తాయని ఆశిస్తున్నాను. సినిమాలో అంత పవర్ ఉంది. దర్శకులు హరి, హరీష్ కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. పురాణాల్లో 'యశోద' గురించి విన్నాం. మోడ్రన్ 'యశోద' ఎలా ఉంటుంది? ఇద్దరూ మహిళలే. ఇద్దరూ అమ్మలే. చాలా మందిని రక్షించారు. ప్రేక్షకులకు శ్రీ కృష్ణుడిని పెంచిన 'యశోద' గురించి తెలుసు. పురాణాలపై అందరికీ అవగాహన ఉంది. మా సినిమా చూసిన తర్వాత 'యశోద' క్యారెక్టర్ గురించి అర్థం అవుతుంది. నేను చెప్పే విషయాన్ని అందరూ అంగీకరిస్తారని నమ్మకం ఉంది. ఇప్పుడు సరోగసీ అనేది కామన్ అయ్యింది. సరోగసీ మీద మీ అభిప్రాయం? సరోగసీ మీద నాకు బలమైన అభిప్రాయం లేదు. తల్లిదండ్రులు కావాలని అనుకునే వాళ్ళకు అదొక పరిష్కారం మాత్రమే. వాళ్ళ ఆశలకు ఆయువు పోస్తుంది. సినిమాలో సరోగసీ మాత్రమే కాదని, ఇంకా పాలిటిక్స్, వరల్డ్ రిచ్ విమెన్ ఇష్యూస్ ఉన్నాయని తెలుస్తోంది. కథ గురించి ఇంకొంచెం చెబుతారా? కథ గురించి నేను ఇంకేమైనా చెప్పానంటే... సినిమా చూసేటప్పుడు థ్రిల్ మిస్ అవుతారు. 'యశోద' ఒక మంచి థ్రిల్లర్. థియేటర్లో చూసేటప్పుడు తర్వాత ఏం జరుగుతుందోనని కుర్చీ అంచుకు వచ్చేస్తారు. దర్శకులు కథ, స్క్రీన్ ప్లే రాసిన విధానం... స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన తీరు... ఫైట్స్, సెట్స్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్... ప్రతిదీ సూపర్. తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన చిత్రమిది. వెండితెరపై ఎంజాయ్ చేయాలి. మీరు డిఫరెంట్ జానర్ సినిమాలు చేశారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయడంలో ఉండే థ్రిల్ ఏమిటి? కథలు వినేటప్పుడు గానీ... తర్వాత సినిమాలో క్యారెక్టర్ విషయంలో గానీ... ఇంతకు ముందు చేసిన దానికి డిఫరెంట్‌గా, కొత్తగా ఉండాలని ప్రతిసారీ ఆలోచిస్తాను. అలా ఉండేలా చూస్తాను. 'యశోద' కంటే ముందు 'యు - టర్న్' చేశా. అది కూడా థ్రిల్లర్. కానీ, 'యశోద' చాలా కొత్తగా ఉంటుంది. యాక్షన్ పరంగా కూడా కొత్తగా ఉంటుంది. యాక్షన్ చేయడం ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో రాజీ రోల్ కోసం యాక్షన్ చేశా. నిజం చెప్పాలంటే... యాక్షన్ చేసేటప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను. యాక్షన్ సీన్స్ కోసం మీరు ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు? యాక్షన్ చేయడం ఎలా అనిపించింది? యానిక్ బెన్ తో 'ఫ్యామిలీ మ్యాన్ 2'కి పని చేశా. ఆ క్యారెక్టర్ కోసం కిక్ బాక్సింగ్, బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. 'యశోద'లో నేను సింపుల్ ప్రెగ్నెంట్ లేడీగా చేశా. ఆ పాత్రకు తగ్గట్టు యాక్షన్ డిజైన్ చేశారు యానిక్ బెన్, వెంకట్ మాస్టర్... ఇద్దరూ ఫైట్స్ అన్నీ రా అండ్ రియల్ గా ఉండేలా చూసుకున్నారు. అదే సమయంలో పాత్రకు తగ్గట్టు ఉండేలా చూశారు. చాలా ప్రిపేర్ అయ్యాను. ట్రైలర్ విజువల్స్ చూస్తే ప్రొడక్షన్ వేల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారితో మీ అనుబంధం... సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కోసం లోకల్ హోటల్స్, హాస్పిటల్స్ చాలా చూశారు. కానీ, ఏవీ సెట్ కాలేదు. దాంతో భారీ సెట్ వేశారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు సినిమా గొప్పగా ఉండాలని ఎప్పుడూ తపిస్తారు. అవుట్‌పుట్ గ్రాండ్‌గా ఉండాలని ఖర్చుకు వెనుకాడకుండా తీశారు. పాన్ ఇండియా రిలీజ్ ఆలోచనతో కథ మీ దగ్గరకు వచ్చిందా? కథ చూస్తే... కథలో, సినిమాలో గొప్ప ఎమోషన్ ఉంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా సినిమా ఉంటుందని అర్థమైంది. బిగినింగ్ నుంచి కథలో పొటెన్షియల్ ఉందని మాకు అర్థమైంది. షూటింగ్ చేసేటప్పుడు మా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఎమోషనల్ పాయింట్ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని, అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. ఇప్పుడు ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు, మీడియా 'పాన్ ఇండియా' అంటున్నారు. పాన్ ఇండియా హిట్ అవుతుందని ఆశిస్తున్నా. తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల నుంచి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? తెలుసుకుంటున్నారా? నిజం చెప్పాలంటే... అన్ని భాషల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. డిఫరెన్స్ ఏంటంటే... మైక్రో ట్రెండ్స్. ఒక్కో భాషలో ప్రేక్షకులకు ఒక్కో అంశం నచ్చుతుంది. వాళ్ళ అభిరుచులు కొంచెం వేరుగా ఉంటాయి. అందుకని, ఎవరికి ఏం నచ్చిందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రక్షిత్ శెట్టి, సూర్య, వరుణ్ ధావన్... ట్రైలర్ విడుదల చేసిన హీరోలు అందరికీ థాంక్స్. వాళ్ళ సపోర్ట్ వల్ల అన్ని భాషల్లో ప్రేక్షకులకు ట్రైలర్ మరింత చేరువ అయ్యింది. సెలైన్ బాటిల్ తో డబ్బింగ్ చెప్పారు. వేరొకరితో డబ్బింగ్ చెప్పించే అవకాశం ఉన్నప్పటికీ... మీరే డబ్బింగ్ చెప్పడానికి కారణం? 'యశోద'కు డబ్బింగ్ చెప్పాలని ముందు నుంచి డిసైడ్ అయ్యాను. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే... చేయాల్సిందే. ఓ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ ప్రాణం పెట్టారంటే... వాళ్ళే డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటారు. తమ వాయిస్ వినిపించాలని అనుకుంటారు. నేను ఇంతే... నాలో ఆ పట్టుదల ఉంది. నాకు మొండితనం ఎక్కువ. సవాళ్లు ఎదురైనప్పటికీ డబ్బింగ్ చెప్పగలిగినందుకు సంతోషంగా ఉంది. 'యశోద'లో మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా నచ్చింది రోల్? వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారెక్టర్. సినిమా చూస్తే నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానో అర్థం అవుతుంది. ఇంతకు మించి ఏమైనా చెబితే స్పాయిలర్ అవుతుంది. ప్రజెంట్ మీ హెల్త్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. అభిమానులకు ఏం చెబుతారు? వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, మద్దతుకు థాంక్స్. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ఇదొక యుద్ధం. ఆ యుద్ధంలో పోరాటం చేయడానికి మీరందరూ చూపిస్తున్న ప్రేమ, మద్దతే కారణం. -
మయోసైటిస్‌తో ఆ స్టేజ్‌లో ఉన్నాను.. భావోద్వేగానికి లోనైన సమంత
సమంత నటించిన యశోద సినిమా ఈనెల 11న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమంత ఈ సినిమా తన రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉంటుందని చెప్పింది. 'యశోదకు చాలా సవాళ్లు ఎదురవుతుంటాయి. దాన్ని ఎదుర్కొని నిలబడింది. ఇప్పుడు నేను కూడా అలాంటి డిఫికల్ట్ పొజిషన్లోనే ఉన్నాను. దీన్నుంచి విజయం సాధిస్తానని అనుకుంటున్నా. నా అనారోగ్యం గురించి కొన్ని ఆర్టికల్స్ చేశాను. ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు వార్తలు రాశారు. కానీ అది నిజం కాదు. ప్రస్తుతం నేను ఉన్న స్టేజిలో ప్రాణాపాయం కాదు. ప్రస్తుతానికైతే చావలేదు. అలంటి హెడ్‌లైన్స్ అనవసరం. అయినా ఈ వ్యాధి తీవ్రత మాత్రం డిఫికల్ట్‌గా ఉంది. అయినా సరే బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా' అంటూ సమంత ఎమోషనల్ అయ్యింది. ఇక యశోద మూవీక డబ్బింగ్ గురించి మాట్లాడుతూ.. 'కష్టసమయంలోనే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. కానీ నాకు మొండితనం ఎక్కువ నేనే డబ్బింగ్ చెప్పాలని డిసైడ్ అయ్యాను కాబట్టి కష్టమైనా సరే డబ్బింగ్ పూర్తి చేశానని చెప్పింది. చివరగా మన నియంత్రణలో ఏదీ ఉండదని, అంతా మన లైఫ్ డిసైడ్ చేస్తుంది' అంటూ చెప్పుకొచ్చొంది. -
మయోసైటిస్ వల్ల నరకం.. కన్నీళ్లు పెట్టుకున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటూనే చేతికి సెలైన్ పెట్టుకొని యశోద డబ్బింగ్ కంప్లీట్ చేసిన సమంత తాజాగా ప్రమోషన్స్‌లోనూ స్వయంగా పాల్గొంది. ఈనెల 11న ఆమె నటించిన యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సమంత ఉన్న పరిస్థితుల్లో ఆమె బయటకు రావడం దాదాపు కష్టమే అని నిర్మాతలు సహా అభిమానులు కూడా అనుకున్నారు. కానీ అందరిని ఆశ్వర్యపరుస్తూ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కష్టకాలాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. 'ఒకానొక సమయంలో తాను ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేనని అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే ఇక్కడివరకు ఎలా వచ్చానోనని అనిపిస్తుంది' అంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. తన అనారోగ్యం కూడా కొందరు తప్పుగా ప్రచారం చేస్తూ తాను ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు వార్తలు రాశారని, కానీ తాను ఇప్పటికి ఇంకా చావలేదు అంటూ ఎమోషనల్ అయ్యింది. అంతేకాకుండా తనలాగే ఎంతోమంది కష్టాలతో పోరాడుతున్నారని, తనది పెద్ద సమస్య కాదని, ఈ పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. కష్టకాలంలోనూ సమంత చూపిస్తున్న ధైర్యానికి ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
సమంత వ్యాధి గురించి అప్పుడే తెలిసింది, అయినా తానే స్వయంగా..: యశోద నిర్మాత
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావూ రమేశ్‌తో పాటు తదితరులు కీలక పాత్రలో నటించారు. సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సమంత మయోసైటిస్ వ్యాధిపై ఆయన స్పందించారు. సినిమా షూటింగ్లో సమంతకు ఈ వ్యాధి ఉన్నట్లు తమకు తెలియదన్నారు. చదవండి: ఆదిపురుష్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన ఓం రౌత్ ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డబ్బింగ్ టైమ్‌లో మాకు సమంత హెల్త్ గురించి తెలిసింది. సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి మూడు నాలుగు రోజుల ముందే మాకు తెలిసింది. అప్పటికే ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తమిళంలో చెప్పే టైమ్‌కు ఎనర్జీ లెవల్స్ తగ్గాయి. వేరే వాళ్ళతో చెప్పిద్దామని అన్నాను. కానీ తమిళం ప్రేక్షకులందరికి తన వాయిస్ తెలుసు కాబట్టి తానే చెబుతానంది. ఇందుకోసం మూడు, నాలుగు రోజులు డాక్టర్ల సమక్షంలో ఉండి ఆవిడే డబ్బింగ్ చెప్పారు. ఆవిడ డిడికేషన్‌కు హ్యాట్సాఫ్. ఇక హిందీలో చిన్మయి చెప్పారు” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. చదవండి: ఉత్తరాది, దక్షిణాది చిత్రాల ఆదరణపై రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు -
సమంతతో సహా అరుదైన వ్యాధులతో బాధపడుతున్న హీరోయిన్స్..
స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్య పరిస్థితిని తెలుసుకొని ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా సమంత వెల్లడించిన సంగతి తెలిసిందే.ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపించే సామ్ ఇలా అనారోగ్యం బారిన పడటం, కోలుకోవడానికి తాను అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే పడుతుందంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేయడంతో సినీ తారలు సహా నెటిజన్లు షాక్‌కి గురయ్యారు. ఈ క్రమంలో గ్లామర్ ఇండస్ట్రీ వెనుక అందాలు మాత్రమే కాదు.. అరుదైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న హీరోయిన్స్ బోలెడంత మంది ఉన్నారు. మరి ఆ హీరోయిన్స్ గురించి ఓసారి తెలుసుకుందాం. ఇలియానా దేవదాస్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గ్లామరస్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న ఇల్లూ బేబీ టాలీవుడ్ టాప్ హీరోలతో నటించింది. ఒకానొక దశలో సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్గా కూడా నిలిచింది. అయితే బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ తర్వాత కొంతకాలం సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఇలియానా తనకు డిస్మార్ఫిక్ బాడీ డిజార్డర్ ఉందని స్వయంగా పేర్కొంది. ఇదొక మానసిక వ్యాధి. దీనికి ప్రత్యేకంగా చికిత్స అంటూ లేదు కానీ డాక్టర్ల సూచనతో దీన్నుంచి కొంత వరకు ఉపశమనం పొందొచ్చట. అనుష్క శర్మ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ తాను యాంగ్జైటీతో పోరాడుతున్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చొంది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పలు సందర్భాల్లో అనుష్క శర్మ అభిమానులతో పంచుకుంది. సోనమ్ కపూర్ స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సోనమ్ కపూర్. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికే సూపర్ క్రేజ్‌ను దక్కించుకున్న సోనమ్ డయాబెటీస్‌తో ఇబ్బంది పడుతుందట. అయితే ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పడానికి ఆమె ఏమీ భయపడలేదు. నయనతార లేడీ సూపర్‌స్టార్‌గా పేరు సంపాదిచుకున్న తమిళ స్టార్ హీరోయిన్ నయనతార. ఆమెకి స్కిన్ ఎలర్జీ ఉందట. మూవీ షూటింగ్స్‌లో భాగంగా తరుచూ మేకప్‌లు వేసుకోవాల్సి రావడంతో స్కిన్ ఎలర్జీ వచ్చినట్లు నయన్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. దీంతో కొన్ని జాగ్రత్తలు వాడుతూ మేకప్‌ని వేసుకోవడానికి ప్రత్యేకమైన టీమ్‌ను ఆమె నియమించుకుంది. దీంతో పాటు ఫుడ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు పాటిస్తుందట నయన్. ఎప్పుడైనా సరే కూల్ ఐటమ్స్ ఏం తిన్నా వెంటనే ఆమె స్కిన్ టోన్ మారిపోవడం,, స్కిన్ పై రాషస్ రావడం వంటివి జరుగుతుంటాయట. ఇప్పటికీ దీన్ని అధిగమించేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటుందట. దీపికా పదుకొణె బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న దీపికా పదుకొణె కొన్నాళ్ల పాటు డిప్రెషన్‌తో పోరాడినట్లు స్వయంగా ఆమె వెల్లడించింది. దీన్నుంచి బయటపడలేక చాలాసార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు దీపికా బహిరంగంగానే చెప్పింది. ఎక్కువ డిప్రెషన్‌కు లోనైతే హార్ట్‌బీట్ ఒకసారిగా పెరిగి అస్వస్థతకు గురవుతుందట.ఇప్పటికీ రెగ్యులర్‌గా డాక్టర్స్‌తో టచ్‌లో ఉంటానని ఈ బ్యూటీ తెలిపింది. పరిణితీ చోప్రా ప్రియాంక చోప్రా సోదరిగా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా. అయితే అక్క సపోర్ట్ లేకుండానే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న పరిణితీ కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతుందట. ఈ సమస్యను అధిగమించేందుకు తరుచూ డాక్టర్స్‌ని కలుస్తానని స్వయంగా ఆమె వెల్లడించింది. సమంత ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళంలో ఎనలేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న సామ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండేది. అయితే కొంతకాలంగా సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన సామ్ తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. కోలుకోవడానికి తాను అనుకున్నదానికంటే ఎక్కువ సమయమే పడుతుందని ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. -
సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్ కూతురు
సమంత ఆరోగ్య పరిస్థితిపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆమె రెట్టింపు శక్తితో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సామ్యే స్వయంగా తెలిపింది. దీంతో సామ్ త్వరగా కోలుకుకోవాలని కోరుకుంటూ ఇటూ ఫ్యాన్స్, అటూ సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే ఆమె అనారోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని హీరో అఖిల్, నటి వరలక్ష్మి శరత్ కుమార్, కీర్తి సురేశ్‌తో పాటు పలువురు నటీనటులు స్పందిస్తు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. చదవండి: సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్‌గా హీరో పోస్ట్ అలాగే దగ్గుబాటి వారసురాలు, విక్టరి వెంకటేశ్ కూతురు అశ్రిత సైతం సామ్ పోస్ట్‌పై స్పందించింది. సమంత పోస్ట్‌కు అశ్రిత ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది. ‘నీ గురించి నీకు తెలియదు.. నీలో ఎంతో బలం ఉంది.. నీ శక్తి గురించి నీకు తెలియదు.. అనంతమైన ప్రేమను నీకు పంపుతున్నా’ అంటూ రెడ్ హాట్ ఎమోజీలను జత చేసింది. అలాగే మరో అక్కినేని హీరో సుశాంత్ కూడా సామ్ పోస్ట్‌పై స్పందించాడు. ‘నువ్వు మరింత శక్తి, బలంతో ఉండాలని కోరుకుంటున్నా. త్వరలోనే నువ్వు దీన్ని అదిగమిస్తావు సామ్’ అంటూ ధైర్యం ఇచ్చాడు. దీంతో వారి కామెంట్స్ చూసి సామ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉంటే సామ్ ఆనారోగ్యంపై ఆమె మాజీ భర్త, హీరో నాగ చైతన్య స్పందన కోసం సమంత ఫ్యాన్స్‌తో పాటు అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: సమంతకు సోకిన మయోసైటిస్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయంటే.. Rambha Car Accident: హీరోయిన్ రంభ కారుకు ప్రమాదం, ధ్వంసమైన కారు.. ఫొటోలు వైరల్ -
సమంత 'మయోసైటిస్' వ్యాధిపై కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్
ఇప్పుడు చర్చంతా నటి సమంత గురించే. ఇంతకుముందు ఈమె వ్యాఖ్యలు, గ్లామరస్ పొటోలు, నాగచైతన్య నుంచి విడిపోవడం గురించి రకరకాలుగా చర్చించుకున్న సినీ వర్గాలు ఇప్పుడు ఆమె బాధపడుతున్న వ్యాధి గురించి చర్చించుకుంటున్నాయి. ప్రముఖ కథానాయికిగా తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తున్న సమంత ది ప్యామిలీ మెన్ – 2, వెబ్ సిరీస్‌తో జాతీయస్థాయిలో నటిగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడు చిరునవ్వుతో ఉండే సమంత, ఇప్పుడు మయాసిటీస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇటీవల స్వయంగా వెల్లడించారు. దీంతో ఆమె అభిమానులు షాక్‌కు గుర య్యారు. ఇక సహ నటీనటులు, స్నేహితులు, సన్నిహితులు సమంతను ఓదార్చే పనిలో పడ్డా రు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నుంచి పలువురు సమంతలో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఆమె మాజీ భర్త నాగచైతన్య, నాగార్జున కూడా ఓదార్పు వ్యాఖ్యలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. అలాగే నాగచైతన్య సోదరుడు అఖిల్ కూడా సమంతకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. నటి కాజల్ తదితర హీరోయిన్లు కూడా అధైర్య పడొద్దని, త్వరలోనే మరింత శక్తివంతంగా తిరిగి వస్తావని ధైర్యాన్ని నింపుతున్నారు. తాజాగా నటి కీర్తి సురేష్ కూడా సమంతను ఓదార్చేలా ‘నీకు అధిక శక్తి వస్తుంది. మరింత ధృఢంగా తిరిగి వస్తావు’ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రం ఈ నెల 4వ తేదీన దేశ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. చదవండి: (విశాల్‌తో ప్రేమలో నటి అభినయ.. త్వరలో పెళ్లి కూడా?) -
ఆ తర్వాతే సమంత ఆరోగ్యం క్షీణించి ఉండొచ్చు : నటి
సమంత అనారోగ్య పరిస్థితిపై చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అని సమంత పోస్ట్ చేయడంతో ఇండస్ట్రీ సహా ఆమె అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు. తాజాగా సమంత అనారోగ్యంపై నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ స్పందించారు. '12 ఏళ్లుగా సామ్‌తో పరిచయం ఉంది. యశోద సినిమాలో కలిసి నటించడం ఆనందంగా అనిపించింది. సెట్స్‌లో ఇద్దరం చాలా సరదాగా ఉండేవాళ్లం. షూటింగ్ టైంలో సామ్ అనారోగ్యంతో బాధపడుతుందని మాకు తెలీదు, ఎందుకంటే ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేది. యశోద షూటింగ్ పూర్తయిన తర్వాతే సామ్ ఆరోగ్యం క్షీణిందని అనుకుంటున్నా. కానీ ఆమె ఒక ఫైటర్. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుందని ఆశిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. కాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా నవంబర్ 11న విడుదల కానుంది. -
సమంత 'మయోసైటిస్' వ్యాధిపై నాగ చైతన్య స్పందిస్తాడా?
సమంత తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపించే సామ్ ఇలా అనారోగ్యం బారిన పడటం, కోలుకోవడానికి తాను అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే పడుతుందంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేయడంతో సినీ తారలు సహా నెటిజన్లు షాక్‌కి గురయ్యారు. చదవండి: వాళ్లని తప్పా నేను ఎవరిని మోసం చేయలేదు : పూరి జగన్నాథ్ సమంత అనారోగ్యంపై అక్కినేని అఖిల్ , ఎన్టీఆర్, నాని, సుశాంత్, కృతిసనన్, రాశికన్నా, హన్సిక, జెనీలియా, నందినిరెడ్డి, వంశీపైడిపల్లి సహా పలువురు ప్రముఖులు స్పందించారు.ఆమెకు ధైర్యం చెబుతూ గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. మరోవైపు సమంత అనారోగ్యంపై నాగచైతన్య స్పందిస్తాడా? లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భార్యభర్తలుగా విడిపోయినప్పటికీ ఫ్రెండ్‌లా అయినా చై సామ్ గురించి పోస్ట్ చేస్తే బాగుండు అని అభిప్రాయపడుతున్నారు. కాగా 2018లో పెళ్లి చేసుకున్న చై-సామ్‌లు గతేడాది అక్టోబర్‌లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: 'మయోసైటిస్' వ్యాధి వల్లే సమంత ముఖం అలా మారిపోయిందా? -
సమంత ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా : చిరంజీవి
సమంత అనారోగ్య పరిస్థితిపై చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అని సమంత పోస్ట్ చేయడంతో ఇండస్ట్రీ సహా ఆమె అభిమానులు షాక్ అయ్యారు. ఎప్పుడూ చలాకీగా, యాక్టివ్‌గా కనిపించే సమంతకు ఈ వ్యాధి ఎలా వచ్చింది? ఆమె త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు. చదవండి: 'మయోసైటిస్' వ్యాధి వల్లే సమంత ముఖం అలా మారిపోయిందా? ఇప్పటికే అక్కినేని అఖిల్ , ఎన్టీఆర్, నాని, సుశాంత్, కృతిసనన్, రాశికన్నా, హన్సిక, జెనీలియా సహా పలువురు సెలబ్రిటీలు సైతం సమంత ఆరోగ్యంపై స్పందిస్తూ నువ్వు స్ట్రాంగ్, ఈ పరిస్థితుల నుంచి బయటపడతావ్ అంటూ ఆమెలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సమంత అనారోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. సమంత త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. 'కాలనుగుణంగా మన జీవితంలో సవాళ్లు ఎదురవుతుంటాయి. మనలోని అంతర్గత శక్తి ఏంటో తెలుసుకోవడానికి ఆ సవాళ్లు ఎదురవుతాయి. సమంత ఒక అద్భుతమైన అమ్మాయి. అంతర్గతంగా ఎంతో ధైర్యంగా ఉంటుంది. అతి త్వరలోనే ఆమె అనారోగ్య సమస్య నుంచి బయపడుతుందని అనుకుంటున్నాను.సమంత ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ చిరు ట్విట్టర్ వేదికగా స్పందించారు. చదవండి: సమంత 'మయోసైటిస్' వ్యాధిపై అఖిల్ అక్కినేని కామెంట్స్ వైరల్ Wishing you speedy recovery!!@Samanthaprabhu2 pic.twitter.com/ZWGUv767VD — Chiranjeevi Konidela (@KChiruTweets) October 30, 2022 -
'మయోసైటిస్' వ్యాధి వల్లే సమంత ముఖం అలా మారిపోయిందా?
సమంత 'మయోసైటిస్' వ్యాధితో బాధపడుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. సామ్ పోస్ట్ చూసి సినీతారలు సహా ఆమె ఫ్యాన్స్ షాక్‌కి గురయ్యారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు అభిమానులు. 'గెట్ వెల్ సూన్ సామ్' అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా మయోసైటిస్ అనే వ్యాధి కారణంగానే సమంత ముఖం మారిపోయిందా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సామ్ బయట కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో అప్పటికే రకరకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఇటీవలె ఓ యాడ్‌లో కనిపించిన సమంత ముఖం ఉబ్బిపోయి తేడాగా కనిపించింది. దీంతో సర్జరీ చేయించుకుందనే వార్తలొచ్చాయి. కానీ తాజాగా తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడున్నట్లు స్వయంగా సమంత పేర్కొనడంతో ఆ వ్యాధి కారణంగానే సమంత ముఖం అలా మరిపోయిందని అంటున్నారు. ఏది ఏమైనా సామ్ త్వరగా కోలుకావాలంటూ ఆమె ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. చదవండి: సమంత 'మయోసైటిస్' వ్యాధిపై అఖిల్ అక్కినేని కామెంట్స్ వైరల్ -
సమంత 'మయోసైటిస్' వ్యాధిపై అఖిల్ అక్కినేని కామెంట్స్ వైరల్
స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యానికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. కొద్ది రోజులుగా ఆమో సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తుండటంతో పలు వార్తలు తెరమీదకి వచ్చాయి. సామ్ కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందని, అందుకే బయటికి రావడం లేదంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనికి తోడు సమంత రీసెంట్గా కనిపించిన ఓ యాడ్ షూట్లోనూ ఆమె ముఖంలో స్పష్టమైన మార్పులు కనిపించాయి. దీంతో సర్జరీ కోసమే సామ్ అమెరికా వెళ్లిందనే ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. సోషల్ మీడియాలో ఆమె అనారోగ్యంపూ రకరకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి. వీటిపై ఇంతవరకు స్పందించని సామ్ తొలిసారిగా ఓపెన్ అయ్యింది. తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.ఓవైపు చికిత్స తీసుకుంటూనే, మరోవైపు యశోద సినిమాకు సంబంధించిన డబ్బింగ్ చెబుతున్న ఓ ఫోటోను సమంత సోషల్ మీడియాలో చేసింది. దీంతో అటు ఇండస్ట్రీ ప్రముఖులు సహా నెటిజన్లు సామ్ త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక సామ్ పోస్టు చూసి అఖిల్ అక్కినేని సైతం స్పందించారు. అందరి ప్రేమాభిమానాలే నీకు మరింత బలాన్ని ఇస్తాయి డియర్ సామ్ అంటూ అఖిల్ చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు మరి నాగ చైతన్య ఇంకా ఎందుకు స్పందించలేదు అంటూ అభిప్రాయపడుతున్నారు. చదవండి: అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. ఎమోషనల్ పోస్ట్ -
సమంతకు సోకిన మయోసైటిస్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయంటే..
వాటర్ బాటిల్ మొదలు బకెట్ నీటిని ఎత్తడానికి పడే కష్టం. ఒక చెయిర్‌ను అటు ఇటు జరపడానికి పడే ఇబ్బంది.. సాధారణంగా వయసు మీద పడిన సమయంలో ఇలాంటివి తప్పదు. అయితే ఇలాంటి బలహీనతలే మధ్యవయస్కులో.. అదీ ప్రతీరోజూ కనిపించిందంటే.. అది ‘మమోసైటిస్’ లక్షణంగా భావించాల్సి ఉంటుంది. నటి సమంతకు మయోసైటిస్ సోకిందనే వార్త.. ఆమె ఫ్యాన్స్‌తో పాటు తారాలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. లక్షలో.. నలుగురి నుంచి 20 మంది దాకా.. సోకే ఈ అరుదైన వ్యాధి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్.. ‘మయోసైటిస్’. అరుదైన వ్యాధి మాత్రమే కాదు.. నొప్పులు, అలసటతో పేషెంట్‌కు నరకం చూపిస్తుంటుంది. ఈ వ్యాధిలో మొత్తం ఐదు రకాలు ఉన్నాయి. పాలిమయోసైటిస్: చిన్న చిన్న పనులకే నీరసపడిపోతారు. కండరాలు భరించలేనంత నొప్పిపెడతాయి. కొంతదూరం నడిచినా త్వరగా అలసిపోతారు. ఒక్కోసారి అదుపు తప్పి కిందపడిపోతారు. డెర్మటోమయోసైటిస్: కండరాలపై ప్రభావం పడుతుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. అతినీలాలోహిత కిరణాల ప్రభావం వల్ల ఈ రకమైన స్థితి నెలకొంటుందనే వాదన కూడా ఒకటి ఉంది. మహిళలు, చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. నెక్రోటైజింగ్ మయోపతి: శరీర మధ్యస్థ భాగాల్లో కండరాలపై ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. మోచేతులు, తొడలు, నడుము, భుజాలు, మెడ, వెనుక భాగంలో బలహీనత కారణంగా నొప్పి ఉంటుంది. ఇన్‌క్లూజన్ బాడీ మయోసైటిస్: నీరసం, తొడ, ముంజేతి, మోకాలి కింద కండరాలు పట్టేసి, నొప్పిగా అనిపిస్తాయి. ఐదు పదుల వయసు దాటిన వారిలో ఇలాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. జువెనైల్ ఫామ్స్ ఆఫ్ మయోసైటిస్: పిల్లల్లో, యుక్తవయసు ఉన్నవాళ్లలో ప్రభావం చూపెడుతుంది. చాలా కష్టం! మయోసిటిస్ స్థితిని నిర్ధారించడం.. చికిత్స అందించడం కొంచెం కష్టం. నయం కాని వ్యాధిగా దీనికంటూ ఓ పేరుంది. అలాగే దీనికంటూ ప్రత్యేకమైన చికిత్సా విధానం లేదు కూడా!. కానీ, సరైన మందులు, పద్ధతిగా థెరపీలతో వ్యాధి నుంచి ఉపశమనం పొందొచ్చు. ప్రత్యేకించి మయోసైటిస్ రకాల్లో.. ఇన్‌క్లూజన్ బాడీ మయోసైటిస్కు మాత్రం ఎలాంటి చికిత్స విధానం లేదు!. మయోసైటిస్ లక్షణాలు.. మయోసైటిస్.. ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రబావం చూపెడుతుంది. కండరాల బలహీనత, నొప్పులు, విపరీతమైన అలసట.. కామన్ లక్షణాలుగా కనిపిస్తుంటాయి. అయితే ఒక్కోరకం మయోసైటిస్‌లో బలహీన స్థితి ఒక్కోలా, ఇంకొన్ని అదనపు లక్షణాలు సైతం కనిపించొచ్చు. ఉదాహరణకు.. డెర్మటోమయోసైటిస్లో ముఖం, ఛాతీ భాగం, భుజాలు, మెడ వెనుక భాగంపై మచ్చల దద్దుర్లు వస్తాయి.. అవి నొప్పిని కలిగిస్తాయి కూడా. మయోసైటిస్ వ్యాధి ఎందుకు వస్తుందనే దానికి సరైన కారణాలను ఇంతవరకు పరిశోధకులు గుర్తించలేకపోయారు. అయితే.. కొందరిలో మాత్రం జన్యుసంక్రమణగా ఈ వ్యాధి సొకవచ్చనే అంచనాకి మాత్రం వచ్చారు. మహిళలో 30 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా మయోసైటిస్ బారిన పడుతున్నట్లు పలు యూనివర్సిటీలు నిర్వహిస్తున్న సర్వేలు వెల్లడించాయి. కండరాల బలహీనత, అలసట, దద్దుర్లు ఆధారంగా ఆ స్థితిని మయోసైటిస్ అనుకోవడానికి వీల్లేదు. అత్యంత అరుదైన ఈ స్థితిని గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షలు కూడా నిర్వహిస్తుంటారు. రుమటాలజిస్టులు, న్యూరాలజిస్టులు, డెర్మాటోమయోసైటిస్ స్థితిలో డెర్మటాలజిస్టులను సంప్రదించడం ద్వారా ఈ వ్యాధి స్థితిపై ఒక అంచానికి రావొచ్చు.