
తమిళసినిమా: తెలుగు తమిళ భాషల్లో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న సమంత ది ఫ్యామిలీ– 2 వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించి విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించే అతి కొద్దిమంది దక్షిణాది హీరోయిన్లలో సమంత ఒకరు. ఈమె ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సమంత నటించిన మరో హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం శాకుంతలం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
చదవండి: ఎన్టీఆర్ 30కి ముహుర్తం ఫిక్స్? అప్పుడే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్!
ఇదిలా ఉంటే తాను మయోటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు బహిరంగంగా వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చారు సమంత. అయితే తాను చాలా ధైర్యవంతురాలినని కచ్చితంగా ఈ వ్యాధితో పోరాడి నెగ్గుతాననే ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్న సమంత కోసం ఖుషి చిత్ర యూనిట్ ఎదురుచూస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె ఇటీవల ఒక భేటీలో తన మనోభావాలను పంచుకున్నారు. అందులో ఆమె పేర్కొంటూ తనకు కోపం వచ్చినప్పుడు జిమ్ముకు వెళ్లి ఇష్టానుసారంగా శారీరక వ్యాయామం చేస్తానని చెప్పారు. అప్పుడు వెంటనే కోపం తగ్గిపోతుంది అని చెప్పారు. తాను డబ్బు, పేరు ప్రఖ్యాతల కోసం ఆరాటపడనని.. తనకు డబ్బు ముఖ్యం కాదని నటనే ముఖ్యమన్నారు.
చదవండి: పట్టలేని సంతోషంతో భార్యను హగ్ చేసుకున్న అభిషేక్.. ఆ రూమర్లకు ఈ వీడియోతో చెక్
ఇక తాను చేసే ప్రతి పాత్రను ఆస్వాదిస్తానని, అలా నటించకపోతే అందులో ఎలాంటి సంతోషం, ప్రయోజనం ఉండదన్నారు. తనకు తానే పెద్ద విమర్శికురాలినన్నారు. మన తప్పులను, పొరపాట్లను తెలుసుకోగలిగితేనే వృత్తిలో ఎదగగలమని చెప్పారు. అయితే కాలం కలిసి రాకపోతే ఏదీ జరగదన్నారు. అలాంటి సమయంలో చింతించకుండా, ఆలోచనలను పక్కన పెట్టి నిద్రపోతానని చెప్పారు. ‘నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు. నువ్వు భూమి మీదకి వచ్చింది ఎవరి అభినందనల కోసమో, ఇతరులను సంతోష పెట్టడానికో కాదు. మనకు ఉన్నదాంట్లో సంతోష పడటానికి అలవాటు పడితే అవసరమైనవన్ని మనల్ని వెతుక్కుంటూ వస్తాయి’ అని సమంత చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment