సమంత నటించిన యశోద సినిమా ఈనెల 11న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమంత ఈ సినిమా తన రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉంటుందని చెప్పింది. 'యశోదకు చాలా సవాళ్లు ఎదురవుతుంటాయి. దాన్ని ఎదుర్కొని నిలబడింది. ఇప్పుడు నేను కూడా అలాంటి డిఫికల్ట్ పొజిషన్‌లోనే ఉన్నాను. దీన్నుంచి విజయం సాధిస్తానని అనుకుంటున్నా. నా అనారోగ్యం గురించి కొన్ని ఆర్టికల్స్ చేశాను.
ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు వార్తలు రాశారు. కానీ అది నిజం కాదు. ప్రస్తుతం నేను ఉన్న స్టేజిలో ప్రాణాపాయం కాదు. ప్రస్తుతానికైతే చావలేదు. అలంటి హెడ్‌లైన్స్ అనవసరం. అయినా ఈ వ్యాధి తీవ్రత మాత్రం డిఫికల్ట్‌గా ఉంది. అయినా సరే బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా' అంటూ సమంత ఎమోషనల్ అయ్యింది.
ఇక యశోద మూవీక డబ్బింగ్ గురించి మాట్లాడుతూ.. 'కష్టసమయంలోనే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. కానీ నాకు మొండితనం ఎక్కువ నేనే డబ్బింగ్ చెప్పాలని డిసైడ్ అయ్యాను కాబట్టి కష్టమైనా సరే డబ్బింగ్ పూర్తి చేశానని చెప్పింది. చివరగా మన నియంత్రణలో ఏదీ ఉండదని, అంతా మన లైఫ్ డిసైడ్ చేస్తుంది' అంటూ చెప్పుకొచ్చొంది.
Comments
Please login to add a commentAdd a comment