tears
-
మూడు ముళ్లూ పడగానే శోభిత ఎమోషనల్, నాగ్ భావోద్వేగ సందేశం
వివాహం అనేది ప్రతీఅమ్మాయికి ఒక అందమైన అనుభూతి. బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రో ఛ్చారణల మధ్య మెడలో పవిత్రమైన మూడు ముళ్లూ పడే సందర్భంకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తారు. ఈ క్షణాల్లో భావోద్వేగాన్ని అదుపుచేసుకోవడం చాలా కష్టం. అక్కినేని వారి ఇంట పెళ్లి సందడిలో ఇలాంటి దృశ్యాలు నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచాయి.సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ, నాగచైతన్య మూడుముళ్ల వేడుకకు సంబంధించిన ఫోటోలు తెగ సందడి చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో (డిసెంబర్ 4, 2024న) అంగరంగ వైభవంగా ముగిసాయి. ఈ సందర్భంగా నాగ చైతన్య , తన మెడలో మంగళసూత్రాన్ని కడుతున్న సందర్భంలో శోభిత ఎమోషనల్ అయింది. మంగళసూత్రాలను తనివితీరా చూసుకుంటూ ఆనందంతో కళ్లనీళ్లు పెట్టుకుంది. ఈ దృశ్యాలు అభిమానులను హత్తుకున్నాయి. <Watching Sobhita and Chay begin this beautiful chapter together has been a special and emotional moment for me. 🌸💫 Congratulations to my beloved Chay, and welcome to the family dear Sobhita—you’ve already brought so much happiness into our lives. 💐 This celebration holds… pic.twitter.com/oBy83Q9qNm— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 4, 2024మంగళ సూత్ర ధారణ సందర్భంగా ముత్తయిదువలు ఈలలు వేస్తూ, తెగ అల్లరి చేశారు. ఇది చూస్తూ అలాగే నాగ చైతన్య తండ్రి, నాగార్జున మురిపెంగా నవ్వుకున్నారు. . నాగార్జునతో పాటు వెంకటేష్ దగ్గుబాటి, దగ్గుబాటి సురేష్ బాబుతోపాటు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న చైతన్య సోదరుడు అఖిల్ అక్కినేని కూడా ఈలలతో తెగ ఎంజాయ్ చేసిన దృశ్యాలు ఆకట్టు కుంటున్నాయి. అలాగే చే శోభిత పెళ్లిపై ఒక ప్రకటన చేశారు నాగార్జున. ట్విటర్లో ఒక భావోద్వేగ సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. "ఈ రోజు మాపై కురిపించిన అమితమైనఆశీర్వాదాలకు, ప్రేమకు కృతజ్ఞతలు. శోభిత-చే కలిసి ఈ అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం ఒక ప్రత్యేకమైన , భావోద్వేగ క్షణం. నా ప్రియమైన చేకి అభినందనలు, డియర్ శోభిత- మా కుటుంబంలోకి స్వాగతం. నువ్వు ఇప్పటికే మా జీవితాల్లో ఎనలేని సంతోషాన్ని నింపావు" అంటూ ట్వీట్ చేయడం విశేషం. పసుపు బట్టల్లో , శోభిత , చే పెళ్లి కళ్ల ఉట్టిపడేలా కనిపిస్తున్న ఫోటోలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. -
టాటాకు పెంపుడు శునకం కన్నీటి బై బై
ముంబయి: వ్యాపార దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు గురువారం(అక్టోబర్10) సాయంత్రం ముగిశాయి. ముంబైలోని వర్లి స్మశానవాటికలో జరిగిన ఈ అంత్యక్రియలకు ప్రముఖులు హాజరై హాజరై నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం టాటాకు చివరిసారి వీడ్కోలు పలికారు. టాటాకు కడసారి బై బై చెప్పేందుకు వచ్చిన ఓ పెంపుడు శునకం ఈ అంత్యక్రియల్లో అందరినీ కంటతడి పెట్టించింది. ఈ శునకం ఎవరిదో కాదు..రతన్ టాటా దత్తత తీసుకుని ముద్దుగా పెంచుకున్నదే. దీని పేరు గోవా. టాటా గోవా వెళ్లినపుడు ఓ వీధి శునకం ఆయన వెనకాల నడుస్తూ వచ్చింది. అంతే దాన్ని ముంబై తీసుకువచ్చి పెంచుకున్నారు. 11 ఏళ్లుగా గోవా టాటా వద్దే ఉంది. అంత్యక్రియలు జరుగుతున్నంత సేపు టాటా పార్థివ దేహం పక్కనే కూర్చున్న గోవా తన మాస్టర్‌కు అశ్రనయనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఈ దృశ్యాలు అక్కడున్నవారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. ఇదీ చదవండి: టాటా ప్రతీకారం అలా తీరింది -
హ్యాండిచ్చిన బీజేపీ.. మీడియా ముందు మాజీ ఎమ్మెల్యే కంటతడి
మరో నెల రోజుల్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు వేగం పెంచాయి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకి జరిగే ఎన్నికల కోసం 67 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈలిస్ట్‌లో విద్యుత్ శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలాతో పాటు తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మినహాయించింది.దీంతో పార్టీ నుంచి ఆశించిన వారికి టికెట్లు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేతలు. ఇప్పటికే బీజేపీ నుంచి టికెట్ దక్కకపోవడం రంజిత్ సింగ్ చౌతాలా గురువారం తన మంత్రి పదవకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.తాజాగా పార్టీ అధిష్టానం నుంచి తనకు టికెట్ నిరాకరించడంతో మరో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే శశి రంజన్ పర్మార్ కంటతడి పెట్టుకున్నారు. అయితే బివానీ జిల్లలోని తోషమ్ నియోజకవర్గం నుంచి శశి రంజన్ పోటీ చేయాలని భావించారు. కానీ ఆయనకు టికెట్ దక్కకపోవడంతో కలత చెంది శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.బీజేపీ ప్రకటించిన జాబితాలో నా పేరు వస్తుందని అనుకున్నాను. పార్టీ నా విలువను చూస్తుందని, నా నియోజకవర్గాన్ని చూస్తుందని అనుకున్నాను. నా పేరు పరిశీలనలో ఉందని నేను ప్రజలకు హామీ ఇచ్చాను. నేను ఇప్పుడు ఏమి చేయాలి? నిస్సహా స్థితిలో ఉన్నాను.’ అంటూ కంటతపడి పెట్టుకున్నాడు. అయితే అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యేను ఓదార్చేందుకు ప్రయత్నించినా ఆయన మాత్రం ఏడుస్తూనే ఉన్నారు.Shashi Ranjan Parmar, former BJP candidate from Tosham, broke down in tears after losing his ticket to Shruti Choudhry, Has called a meeting with his supporters on September 6 at Bhiwani. may contest as independent #HaryanaElections2024 #BJP #Tosham #ShashiRanjan #ShrutiChoudhry pic.twitter.com/VgQimmX4Of— Sushil Manav (@sushilmanav) September 5, 2024అయితే పార్టీ కార్యకర్తలకు, తనకు ఓటేసిన ప్రజలకు అండగా ఉండాలని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చెప్పగా..‘నాకే ఎందుకు ఇలా జరుగుతోంది. నన్ను ఎందుకు పార్టీ పట్టించుకోవడం లేదు. చాలా బాధగా ఉంది. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చారు.కాగా హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 12. నామినేషన్ల పరిశీలన సెప్టెంబర్ 13న జరనుంది. సెప్టెంబర్ 16 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. -
పాము విషానికి విరుగుడు.. ఒంటె కన్నీరు!
ఒంటె కన్నీటిలోని రసాయనాలు పాము విషానికి విరుగుడుగా పనికివస్తాయని శాస్త్రవేత్తలు చేసిన పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ నేపధ్యంలో ఒంటె కన్నీటితో పాము విషాన్ని తొలగించగల ఔషధాన్ని తయారు చేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాము కాటు కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.25 లక్షల మంది మరణిస్తున్నారు. కొన్ని పాములు అత్యంత విషపూరితమైనవి. ఇవి కాటువేసినప్పుడు మనిషి బతికేందుకు అవకాశం ఉండదు. ఈ నేపధ్యంలో పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే ఔషధాల తయారీకి నిరంతరం పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ (సీవీఆర్ఎల్) ఒంటె కన్నీటిని ఉపయోగించి, పాము విషానికి విరుగుడును తయారు చేయవచ్చని వెల్లడించింది. దుబాయ్‌లోని ఈ ల్యాబ్‌లో దీనిపై చాలా ఏళ్ల క్రితం పరిశోధనలు జరిగినప్పటికీ నిధుల కొరత కారణంగా అవి ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు నిధులను సమకూర్చుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళతామని సీవీఆర్ఎల్ పేర్కొంది. తాము త్వరలోనే పాము విషాన్ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని తయారు చేయనున్నామని ఈ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ వార్నర్ తెలిపారు. ఒంటె కన్నీటిలో అనేక రకాల ప్రొటీన్లు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా కాపాడతాయి. ఒంటె కన్నీటిలోని ఔషధ లక్షణాలపై అమెరికా, ఇండియా, తదితర దేశాల్లో పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఒంటె కన్నీటిలో లైసోజైమ్‌లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధిస్తాయి. ఒంటె కన్నీరే కాదు మూత్రానికి కూడా ఔషదీయ గుణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. -
ఆ చిన్నారికి తన కన్నీళ్లు, చెమటే అలర్జీ!
కొందరూ చెప్పేందుకు, వినేందుకు బాధకరంగా ఉండే చిన్న చిన్న వాటితో వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తుంటారు. ఆ వ్యాధి ఇది అని కూడా నిర్థారించలేక వైద్యులు సైతం తలపట్టుకుంటారు. అత్యంత విచిత్రమైన రుగ్మతలతో కొందరూ చిన్నారులు బాధపడుతుంటారు. వారికి, వారిని కన్నవారికి చెప్పుకోలేని ఆవేదన ఇది. ఎందువల్ల ఆ సమస్య ఉత్ఫన్నమవుతోంది నిర్థారించిన అందుకు సరైన చికిత్స విధానం లేక మరో సమస్య. పగవాడికి కూడా ఈ సమస్య వద్దు అనేలా ఉంటాయి ఆ ఆరోగ్య సమస్యలు. ఇక్కడ అలాంటి విచిత్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది ఓ చిన్నారి. వివరాల్లోకెళ్తే..క్వీన్స్‌లాండ్‌లోని కర్యాన్ జిమ్మ్ అనే మహిళ తన 11 ఏళ్ల కూతురు సుమ్మా విలియమ్స్ పడుతున్న ఆవేదన గురించి కన్నీటిపర్యంతమయ్యింది. తాను మొదట్లో తన చిన్నారికి వచ్చిన సమస్యను వడదెబ్బగా తప్పుగా అర్థం చేసుకున్నానట్లు తెలిపింది. ఏడ్చినా, చెమట పట్టినా..ఒక్కసారిగా ఆమె చర్మం ఎర్రగా మారి ప్రతి చోట పగళ్లు ఏర్పడటం జరుగుతోంది. దీంతో తాను తన కూతురు బయట ఎండకు ఎక్స్పోజ్ కావడంతో అలా అయ్యి ఉంటుందని భావించి తేలిగ్గా తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే అది కాస్త తీవ్రమైన దురదతో కూడిన మంటతో బ్రిస్బేన్‌లోని ఆస్పత్రిలో చేరే వరకు ఆ సమస్య ఏంటన్నది తనకు తెలియలేదని ఆవేదనగా చెప్పుకొచ్చింది ఆ చిన్నారి తల్లి. అక్కడ వైద్యులు ఆమె కన్నీళ్లు, చెమటే ఆమెకు అలెర్జీగా పరిణిమించి ఇలా మంటతో కూడిన దురద వచ్చి ఎర్రగా అవుతున్నట్లు వెల్లడించారు. శరీరంపై పగుళ్లుకు కారణం అదేనని చెప్పడంతో తాము షాక్‌కి గురయ్యినట్లు పేర్కొంది. ఆ అలెర్జీని తామరకు సంబంధించిన చర్మ వ్యాధిగా వైద్యులు నిర్థారించినట్లు తెలిపింది. అంతేగాదు తన కూతురిని తీసుకుని బయటకు వెళ్లిన ప్రతి చోట ఆమెను చూసి వడదెబ్బకు గురయ్యిందా? అని అందరూ అడుగుతున్నట్లు చెప్పుకొచ్చింది ఆ తల్లి. తన కూతురుకి డ్యాన్స్ అంటే ఇష్టమని, అందులో ఆమె మంచి నర్తకిగా అవార్డు కూగా గెలుచుకుందని చెప్పుకొచ్చింది. అయితే డ్యాన్స్ చేస్తే కచ్చితంగా చెమట పడుతుంది. దీంతో ఆమె ఆ చర్మ సమస్యను ఫేస్ చెయ్యక తప్పడం లేదు. కన్నీళ్ల అంటే ఎప్పుడో పరిస్థితిని బట్టి వచ్చేవి, కానీ చెమట అనేది మనం శ్రమించినా, లేదా టెన్షన్ పడ్డ ఆటోమెటిక్‌గా వచ్చేవి. దీంతో ఆ చిన్నారికి ఈ సమస్య వర్ణనాతీతంగా మారింది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఈ సమస్యను వైద్యులు వివిధ ఇంజెక్షన్లతో నివారించే ప్రయత్నం చేస్తున్నారు. తన కూతురు పదేపదే తన స్నేహితుల్లా తన చర్మం ఎందుకు లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటుదంటూ ఆ చిన్నారి తల్లి ఆవేదనగా చెబుతోంది. కాగా, ముర్డోక్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం..ప్రపంచంలోనే అత్యధికంగా తామరకు సంబంధించిన చర్మ వ్యాధితో ఆస్ట్రేలియాలోని చిన్నారులే ఎక్కువుగా బాధపడుతున్నట్లు సమాచారం. (చదవండి: దేశంలోనే తొలి 'చేతి మార్పిడి' శస్త్ర చికిత్స! అదికూడా కిడ్నీ మార్పిడి..) -
మగువ కన్నీళ్లకు ఇంత శక్తి ఉందా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
ఎంతవారైనా కాంత దాసులే అంటాడు త్యాగరాజు. ఆడదాని ఓరచూపులో చిత్తుకానీ మగాడు లేడు అంటాడు ఓ సినీ కవి. అవన్నీ నిజమే అనేలా శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆడవాళ్ల కంటి నుంచి వచ్చే కన్నీళ్లకు ఉన్న శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. దెబ్బకి మగాడిలో ఉన్న దూకుడుతునానికి కళ్లెం పడుతుందని ప్రూవ్ చేసి చూపించారు కూడా. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని వీజ్ మాన్ ఇన్స్టిట్యూట్ ఆప్ సైన్స్ నిర్వహించిన పరిశోధనలో మానవ కన్నీళ్లలో రసాయన సంకేతం ఉందని, మెదడు కార్యకలాపలను ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు. స్త్రీల నుంచి వచ్చే కన్నీళ్ల వాసన పురుషుల కోపాన్ని నియంత్రిస్తుందని వెల్లడించారు. అందుకోసం పరిశోధకులు ఆడ ఎలుకలపై పరిశోధన చేశారు. ఆ అధ్యయనంలో ఆడ ఎలుకల కన్నీళ్లు మగ ఎలుకల దాడిని నియంత్రించినట్లు తెలిపారు. అంతేగాదు ఈ మగ ఎలుకలు కూడా తమ కన్నీళ్లతో ఆల్పా అనే జాతి ఎలుకల దాడిని నివారిస్తాయిని పేర్కొన్నారు. అలాగే ఇద్దరు వాలంటీర్ మహిళలపై కూడా ప్రయోగం చేశారు. వాళ్లికి ముందుగానే ఇద్దరు మగావాళ్లతో కొన్ని రకాల గేమ్‌లు ఆడమన్నారు. అలాగే వారి డబ్బులను లాక్కునేలా మోసం చేయమన్నారు. ఆ తర్వాత వెంటనే కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణలు చెప్పమన్నారు. ఇలా చేయంగానే సదరు మగవాళ్లలో ప్రతికార చర్యలు నెమ్మదిగా తగ్గిపోయినట్లు గమనించారు. ఈ అధయనంలో ప్రతీకారం తీర్చుకోవాలనే పురుషుల కోరిక 43.7% వరకు తగ్గిపోయిందన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న సదరు పురుషులను బ్రెయిన్‌ను ఎమ్మారై స్కాన్ చేయగా మహిళ కన్నీళ్ల వాసన వారి మెదడును ప్రభావితం చేసి ఆయా ప్రాంతాల్లో ప్రిఫ్రంటల్ కార్టెక్స్, పూర్వ ఇన్సులాలో చురుకుదనం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి. శిశువులు పుట్టగానే ఏడుస్తారు. ఇక్కడ వారికి వచ్చే హానిని నియంత్రించడానికి కన్నీళ్లు పెట్టేలా ఏడవడం జరుగుతుందన్నారు. ఇక్కడ శిశువులు నిస్సహాయులు కాబట్టి తమ పట్ల కోపంగా ప్రవర్తించొద్దని ఏడుపు రూపంలో తెలియజేస్తారని, అందుకు తగ్గట్టుగానే మానవ మెదడు ఆటోమెటిక్‌గా కరిగి కోపాన్ని తమాయించుకుంటుంది. ఇదే మాదిరిగా నిజజీవితంలో కొన్ని సందర్భాల్లో ఈ కన్నీళ్లు వాసన ప్రభావంతంగా కనిపించదని కూడా చెప్పారు. గృహహింస, ఆడవాళ్లపై అకృత్యాలు లేదా టార్చర్ పెట్టే నేరగాళ్లలో దూకుడుని ఈ కన్నీళ్ల వాసన పెద్దగా ప్రభావం చేయకలేకపోయిందని అన్నారు ఇక్కడ కాస్త దీన్ని నిశితంగా గమనిస్తే.. వాళ్లది హింసా ప్రవృత్తి. సాధారణంగా సున్నితమైన మనస్సు గలవాళ్లకే మహిళ కన్నీళ్లకు ఇలా ప్రతిస్పందిస్తారని శాస్త్రవేత్తలు ధీమాగా చెబుతున్నారు. ఇక్కడ మహిళ కన్నీళ్ల వాసన మగవాడి కోపానికి కళ్లేం వేయగలిగినప్పుడు, స్త్రీ పట్ల అమానుషింగా ప్రవర్తించే నేరగాళ్ల బ్రెయిన్‌ని ఎందుకు ప్రభావితం చేయలేకపోతుందనేది శాస్త్రవేత్తలకు అర్థంకానీ చిక్కు ప్రశ్న. ఈ మిస్టరీని చేధించగలిగితే మహిళల పట్ల జరిగే ఎన్నో అమానుషాలను సులభంగా నియంత్రించొచ్చని చెప్పింది పరిశోధకుల బృందం. (చదవండి: సర్జరీ చేసే టైంలో పేషెంట్‌పై డాక్టర్ తోడి! వీడియో వైరల్) -
కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ..
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కన్నీరు పెట్టుకున్నారు. అవును.. ఇది నిజం.. దేశంలో గత కొంతకాలంగా జననాల రేటు క్షీణిస్తున్న నేపధ్యంలో రాజధాని ప్యాంగ్యాంగ్లో తల్లుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ రోదించారు. వేదికపై కూర్చున్న ఆయన ప్రసంగం ప్రారంభించే సమయంలో దీర్ఘశ్వాస తీసుకున్నారు. ఆ సమయంలో అతని కళ్లు మరింత ఎర్రబారాయి. కన్నీటిని రుమాలుతో తుడుచుకున్నారు. ఉత్తరకొరియా ప్రభుత్వ టెలివిజన్ ఆ క్షణాన్ని క్యాప్చర్ చేసి, ప్రసారం చేసింది. కిమ్ జోంగ్ ఉన్ ఏడుపుతో పాటు, సభకు హాజరైన తల్లుల రోదనను కలిపి చూపించారు. అత్యంత క్రూరమైన నియంతగా పేరొందిన కిమ్ జోంగ్ కన్నీరు కారుస్తున్న చిత్రాలు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాయి. అయితే కిమ్ జోంగ్ ఏడుపు అక్కడి ప్రజలను తప్పుదారి పట్టించేందుకే అనే వాదన కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఉత్తరకొరియా జాతీయ టెలివిజన్‌లో కిమ్ ఏడుపు చూపించడం ఇదేమీ మొదటిసారి కాదని నిపుణులు అంటున్నారు. ఇది నిజమైనదా లేదా మొసలి కన్నీరా అనే అంశంతో సంబంధం లేకుండా.. కిమ్ జోంగ్ మానవత్వం కలిగిన నేత అని చూపించేందుకే అతని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పన్నిన వ్యూహంలో భాగమని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఉత్తరకొరియా సుప్రీం కమాండర్ బహిరంగంగా కన్నీరు పెట్టడమనేది తొలిసారిగా 2011డిసెంబర్లో కనిపించింది. కుమ్సుసన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ సమాధి వద్ద తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్‌ను గుర్తు చేసుకుంటూ కిమ్ కంటనీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో అతని సోదరి కిమ్ యో జోంగ్ కూడా అతని వెనుక ఉన్నారు. ‘రోడాంగ్ సిన్మున్’లో ప్రచురితమైన ఫోటోలో.. తండ్రి అంత్యక్రియల్లో కిమ్ కన్నీటిని నియంత్రించుకున్న దృశ్యం కనిపించింది. 2020, అక్టోబర్‌లో వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 75వ వార్షికోత్సవ కార్యక్రమంలో కిమ్ జోంగ్.. కరోనా మహమ్మారి కష్టాల నుంచి ప్రజలను రక్షించేందుకు తన ప్రయత్నాలు సరిపోలేదని పేర్కొంటూ కిమ్ ప్రసంగ సమయంలో రోదించారు. కాగా సియోల్‌లోని కూక్మిన్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు ఫ్యోడర్ టెర్టిస్కీ మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కొరియా నేతలు ఏడవడం కొత్త విషయమేమీ కాదని, మాజీ నేతలు కిమ్ జోంగ్ ఇల్, కిమ్ ఇల్ సంగ్ ఇలా ఏడుస్తూ కనిపించారని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు 2022, జూలై 2022లో జరిగిన విక్టరీ డే ఈవెంట్లో తన భర్త పక్కన నిలుచుని ఏడుస్తూ కనిపించారు. ఉత్తర కొరియా నేతల తీరును విశ్లేషించిన ఒక నిపుణుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ నేతల ఏడుపులను ఆయా సందర్భాలను అనుసరించి వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. కిమ్ జోంగ్ 2020లో ఒలికించిన కన్నీరు ఉద్దేశపూర్వకంగా లేదా సెంటిమెంటల్ రాజకీయాల కోసం చేసిన చర్యగా లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సవాలుతో కూడిన దేశ పరిస్థితుల మధ్య కిమ్ జోంగ్ ఉన్ ఒంటరితనంతో కుమిలిపోతూ భావోద్వేగానికి లోనై ఉండవచ్చన్నారు. అలాగే తండ్రి మరణించినప్పుడు కిమ్ ఏడుపు.. తండ్రిని కోల్పోయిన బాధలోంచి వచ్చినదన్నారు. కొరియా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ బాలాజ్ స్జాలోంటాయ్ మాట్లాడుతూ నియంతలు బహిరంగంగా రోదించడం అనేది చాలా అరుదు అని పేర్కొన్నారు. వియత్నాం మాజీ నియంత హో చి మిన్ కూడా దీనికి ఉదాహరణ అన్నారు. తాజాగా కిమ్ జోంగ్ ఏడుపు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే అయి ఉండవచ్చన్నారు. భావోద్వేగ సందర్భాల్లో ప్రజల మందు ఉదాసీనంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే కిమ్ జోంగ్ ఇలా భావోద్వేగంతో కనిపించి ఉండవచ్చని స్జాలోంటాయ్ పేర్కొన్నారు. కిమ్ జోంగ్ ఉన్ ఏడుపు నిజమైనదే అయితే, అతను నిజంగా ప్రజానాయకుడైతే ఉత్తరకొరియాలో నియంతృత్వ పాలన పోయి, ప్రజలు స్వేచ్ఛగా జీవించివుండేవారన్నారు. కిమ్ జోంగ్ ఉన్ కార్చిన కన్నీరు అతని అపరిపక్వతకు చిహ్నమని స్జాలోంటాయ్ విశ్లేషించారు. ఇది కూడా చదవండి: దక్షిణ కొరియాకు కొత్త భయం -
handsome weeping boys: కరువుతీరా ఏడ్చెయ్యండి! వీపింగ్ బాయ్ తుడిచేస్తాడు!
కోపం, బాధ, సంతోషం వంటి భావోద్వేగాలను వ్యక్తం చేయడంలో ఇతర దేశాల వారికంటే జపాన్ వాసులు వెనుకబడి ఉన్నారు. దీంతో వారు చేసే ఉద్యోగ, వ్యాపారాల్లో సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీని వల్ల ఆయా కంపెనీల రెవెన్యూలపై ప్రభావం పడుతోంది. ఇది గమనించిన అక్కడి కంపెనీలు ‘హ్యాండ్సమ్ వీపింగ్ బాయిస్’ పేరిట పరిష్కార మార్గం వెతికాయి. ఉద్యోగులు పెట్టే కన్నీరు తుడిచి వారిని ఓదార్చడమే ఈ హ్యాండ్సమ్ వీపింగ్ బాయిస్ పని. ఉద్యోగి మనసులోని భారం మొత్తం దిగిపోతే మరింత చురుగ్గా పనిచేస్తారు. దీనికోసం అందంగా ఉండే అబ్బాయిలను వీపింగ్ బాయిస్‌గా నియమించుకుంటున్నాయి. ఏడ్పించి... కంపెనీలోని కొంతమంది ఉద్యోగులను ఒక రూమ్‌లో కూర్చోబెడతారు. వీరందరికి ఏడుపు వచ్చే సినిమాలు చూపిస్తారు. వీటిలో పెంపుడు కుక్కలను బాధించేవీ,తండ్రీ కూతుళ్ల మధ్య ప్రేమానుబంధాలు వంటి సన్నివేశాలు ఉంటాయి. అవి చూస్తూ బాధ కలిగిన వెంటనే ఉద్యోగులు గొంతు విప్పి మనసారా ఏడవచ్చు. ఇలా ఏడుస్తోన్న వ్యక్తి కన్నీళ్లను హ్యాండ్సమ్ వీపింగ్ బాయ్ కాటన్ కర్చీఫ్‌తో ప్రేమగా తుడుస్తాడు. ఇలా అక్కడ ఉన్న వారందరి బాధను వీపింగ్ బాయ్ తన ప్రేమతో, ఓదార్పు మాటలతో పూర్తిగా ఓదార్చుతాడు. ఇలా కంపెనీ ఉద్యోగుల కన్నీరు తుడిచేసి మరీ చక్కగా పనిచేయించుకుంటున్నాయి జపాన్ కంపెనీలు. ఒకసారి నలుగురిలో కన్నీరు పెట్టడం అలవాటైతే వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలను చక్కగా పరిష్కరించుకోగలుగుతారు అని వారు చెబుతున్నారు. టోక్యోకు చెందిన ‘క్రైయింగ్ వర్క్‌షాపు’ వ్యవస్థాపకుడు హిరోకి టెకాయ్కు వచ్చిన ఐడియానే వీపింగ్ బాయ్. ఆలోచన వచ్చిన తరవాత అనేక వర్క్ షాపులు నిర్వహించి ఈ వీపింగ్ బాయ్‌ను అమలులోకి తెచ్చి పరీక్షించాడు. మంచి ఫలితాలు రావడంతో తన ఆఫీసులోనే వీపింగ్ బాయిస్‌ను నియమించడం మొదలు పెట్టాడు. వర్క్‌షాపులను అందమైన అబ్బాయిలు చక్కగా నిర్వహించడంతో హ్యాండ్సమ్ బాయిస్‌ను వీపింగ్ బాయిస్‌గా ఎంచుకున్నాడు. అందమైన అబ్బాయిలు ఓదార్పునిస్తే కొత్త ఉత్సాహం కలుగుతుంది. అందుకే అందమైన అబ్బాయిలను ఈ పనికి ఎన్నుకున్నట్లు టెకాయ్ చెబుతున్నాడు. ఆ మధ్య నవ్వడం నేర్చుకోవడం మొదలు పెట్టి జపాన్ ఉద్యోగులు నేడు నలుగురిలో సిగ్గుపడకుండా ఏడవడం నేర్చుకోవడం కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ... గుంyð ల్లో ఉన్న భారం దిగిపోతే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. సిగ్గు, బిడియం, బాధ పోయినప్పుడు అందరితో కలిసి మెలిసి తిరగగలుగుతారు. -
ఈ ఉల్లిపాయాలు కోస్తే కన్నీళ్లు రావు!..కానీ ధర వింటే కన్నీళ్లు ఖాయం!
ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లు వస్తాయి. ఉల్లి ధరలు పెరిగినప్పుడు వాటిని కోయకపోయినా కన్నీళ్లు వస్తాయి, అది వేరే విషయం! కోసినా కన్నీళ్లు తెప్పించని ఉల్లిపాయలు ఇటీవల ఆస్ట్రేలియా మార్కెట్లోకి వచ్చాయి. మిగిలిన కూరగాయల్లాగానే వీటిని కూడా సంతోషంగా తరుక్కోవచ్చని, వీటిని కోసినప్పుడు కళ్లుమండటం, కన్నీళ్లు రావడం జరగదని చెబుతున్నారు. ఈ రకం ఉల్లిపాయలను ‘హ్యాపీ చాప్స్’ బ్రాండ్ పేరుతో విడుదల చేశారు. తొలిసారిగా ఈ ఉల్లిపాయలను ఆస్ట్రేలియాలోని వూల్‌వర్త్స్ సపర్మార్కెట్లలోకి జూలై 12 నుంచి అందుబాటులోకి తెచ్చారు. జన్యుమార్పిడి ద్వారా ఉల్లిపాయల్లోని కన్నీళ్లు తెప్పించే రసాయనాలు లేకుండా చేసి, వీటిని ప్రత్యేకంగా పండించారు. వీటిని కోసిన తర్వాత వీటిలో కన్నీళ్లు తెప్పించే రసాయనాలు తగ్గిపోతాయి. రోజులు గడిచేకొద్దీ పూర్తిగా లేకుండాపోతాయి. సాధారణ రకాలకు చెందిన ఉల్లిపాయల్లో రోజులు గడిచేకొద్దీ ఈ రసాయనాలు ఎక్కువై, మరింతగా కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే, ఈ ఉల్లిపాయలను కోసినప్పుడు కన్నీళ్లు రాకున్నా, వీటి ధర వింటే కన్నీళ్లు రావడం ఖాయం. ‘హ్యాపీచాప్స్’ ఉల్లి కిలో ధర 5 డాలర్లు (ర.411) వత్రమే!. (చదవండి: పార్కుగా మారనున్న పాడుబడ్డ స్టేషన్) -
టమాటా ధరలపై పేలుతున్న మీమ్స్, ట్రోల్స్.. మీరూ ఓ లుక్కేయండి
టమాటా ధరలు ఆకాశంలో ఉండి ఆందోళన కలిగిస్తున్న మాట ఎలా ఉన్నా, చేతికి చిక్కని, అందనంత ఎత్తులో ఉన్న టమాటపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న మీమ్స్ కడుపుబ్బా నవ్విస్తూ వైరల్ అవుతున్నాయి. అవేంటో చూసేయండి.. ‘మా ప్రేమని టమాటాలతో కొనలేరు’ అంటాడు ఒక ప్రేమికుడు. పోజ్ కొడుతున్న టమాటాను ఉద్దేశించి సాటి కూరగాయలు ఇలా అంటాయి... ‘నడమంత్రపు సిరి అంటే ఇదే’ మరో మీమ్‌లో... పరుగు పందెంలో డీజిల్, పెట్రోల్లతోపాటు టమాట కూడా పాల్గొని నెంబర్‌వన్ స్థానంలో నిలిచి కాలరెగరేస్తోంది. ఉల్లిగడ్డ... కోస్తేనే కన్నీళ్లు వస్తాయి. అదేమిటో... టమాట పేరు వింటేనే కన్నీళ్లు వస్తున్నాయి. Ek tamatar ki keemat tum kya jano, Ramesh Babu!!#TomatoPrice pic.twitter.com/ViZMVtaF7W — Sandhya Bhadauria (@Okk_Sandhya) June 27, 2023 Returning home with 2kg tomato#TomatoPrice pic.twitter.com/TH1oSEaELl — Thanos Pandit™ (@Thanos_pandith) June 27, 2023 #TomatoPrice keep running pic.twitter.com/Q2WmxttRkZ — varsha roshan (@RoshanVars79963) June 27, 2023 #TomatoPrice hike, Say it like Nimmo Tai 😎 pic.twitter.com/GmKJKR74vs — United India 🇮🇳 (@Unitedd_India) June 27, 2023 Tomato prices are skyrocketing across the country. Even a simple dish like rasam has become costly. But what is causing this price hike?#tomato #tomatopricehike #climatechange #delayedrainfall #heavyrainfall #heatwave #newswithnavya pic.twitter.com/RjgsJEHMxB — Navya Singh (@newswithnavya) July 2, 2023 #TomatoPrice pic.twitter.com/3YA3eYeg1I — Sri Rama Chandra Murthy YV (@yvsrc_murthy) July 4, 2023 #TomatoPrice pic.twitter.com/ITKLb1ONiN — Nala Ponnappa (@PonnappaCartoon) July 3, 2023 -
తలా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా...
-
మండపంలోనే బోరున ఏడ్చేసిన వధూవరులు.. వీడియో వైరల్!
పెళ్లి.. పేరుకి రెండు అక్షరాలైన దీని బంధం మాత్రం నూరేళ్లు ఉంటుంది. వివాహం ద్వారా ఇద్దరు వ్యక్తులు.. మూడు ముళ్ల బంధంతో.. నలుగురి సమక్షంలో ఒకటై జీవితాంతం జీవిస్తారు. అందుకే జీవితంలో ఇదొక మధురమైన క్షణంగా భావిస్తుంటారు. అంతటి ప్రత్యేక రోజు కనుకే పెళ్లి మండపంలో ఆనందంతో పాటు కాస్త హడావుడి, కాస్త గందరగోళం వాతావరణం ఉంటుంది. ఇటీవల వివాహ వేదికలపై ఏదో ఒక వింత ఘటనలు జరగడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ పెళ్లి వేదికపై మరో వింత ఘటన చోటు చేసుకుంది. ఒకటే ఏడుపు... పెళ్లంటేనే సందడి. బంధు మిత్రుల హడావుడి, మర్యాదలు, ఆత్మీయుల కలయికలు ఇలాంటి వాటితో అక్కడ వాతావరణమంతా పండుగను తలపిస్తుంది. వధూవరుల తరపు కుటుంబ సభ్యులకు ఈ సమయంలో వారి ఆనందాన్ని అవధులు ఉండవు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే మాంగళ్య ధారణ జరిగే సమాయానికి వధూవరులు కుటుంబసభ్యుల కళ్లలో ఆనందాన్ని కన్నీళ్ల రూపంలో బయటపెడుతుంటారు. ఇటీవల ఓ పెళ్లిలో.. వధూవరులు ఇద్దరూ వేదికపైనే ఏడ్వడం ప్రారంభించారు. వారిద్దరూ కలిసి ఒకటై జీవితాన్ని ప్రారంభించబోతున్నాం అనే ఆనందం కాస్త కన్నీళ్లుగా మారి బయటపడ్డాయి. ఇద్దరు ఒకరి నొకరు చూసుకుంటూ ఏడ్వడం ఆ వీడియోలో కనిపిస్తోంది. దీనంతటిని వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. రిసెప్షన్ వేదికపై ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. View this post on Instagram A post shared by 𝗪𝗲𝗱𝗱𝗶𝗻𝗴_𝗰𝗼𝘂𝗽𝗹𝗲❤ (@wedding_couple_photography_20) -
గుణశేఖర్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సమంత
శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న సమంత కన్నీళ్లు పెట్టుకుంది. డైరెక్టర్ గుణశేఖర్ ఆమె గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు నిజమైన హీరో సమంత అని ప్రశంసించాడు. దీంతో ఎమోషనల్ అయిన సామ్ కంటతడి పెట్టింది. కాగా తనకు మయోసైటిస్ వ్యాధి ఉందని చెప్పిన తర్వాత సామ్ తొలిసారి ఇలా మీడియా ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నాకు సినిమాపై ఉన్న ప్రేమ, సినిమాకు నామీదున్న ప్రేమ తగ్గలేదని పేర్కొంది. ''గుణశేఖర్ ప్రాణం పెట్టి తీశారు. ఈ కథ విన్నప్పుడు మేం ఊహించుకున్నట్లు రావాలి అనుకున్నాం. సినిమా చూసిన తర్వాత అంతకు మించి ఉంది అనేలా ప్రతిఒక్కరికి అనిపిస్తుంది. ఇండియన్ హిస్టరీ లో కాళిదాసు రాసిన శకుంతల పాత్ర నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. లైఫ్‌లో ఎన్ని ఫేస్ చేసినా సినిమాను ప్రేమిస్తూనే ఉంటాను'' అంటూ సమంత మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) We're with you sam 🤍🥺 be strong@Samanthaprabhu2#SamanthaRuthPrabhupic.twitter.com/sDjC9r9dBR — Jegan (@JeganSammu) January 9, 2023 -
మయోసైటిస్‌తో ఆ స్టేజ్‌లో ఉన్నాను.. భావోద్వేగానికి లోనైన సమంత
సమంత నటించిన యశోద సినిమా ఈనెల 11న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమంత ఈ సినిమా తన రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉంటుందని చెప్పింది. 'యశోదకు చాలా సవాళ్లు ఎదురవుతుంటాయి. దాన్ని ఎదుర్కొని నిలబడింది. ఇప్పుడు నేను కూడా అలాంటి డిఫికల్ట్ పొజిషన్లోనే ఉన్నాను. దీన్నుంచి విజయం సాధిస్తానని అనుకుంటున్నా. నా అనారోగ్యం గురించి కొన్ని ఆర్టికల్స్ చేశాను. ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు వార్తలు రాశారు. కానీ అది నిజం కాదు. ప్రస్తుతం నేను ఉన్న స్టేజిలో ప్రాణాపాయం కాదు. ప్రస్తుతానికైతే చావలేదు. అలంటి హెడ్‌లైన్స్ అనవసరం. అయినా ఈ వ్యాధి తీవ్రత మాత్రం డిఫికల్ట్‌గా ఉంది. అయినా సరే బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా' అంటూ సమంత ఎమోషనల్ అయ్యింది. ఇక యశోద మూవీక డబ్బింగ్ గురించి మాట్లాడుతూ.. 'కష్టసమయంలోనే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. కానీ నాకు మొండితనం ఎక్కువ నేనే డబ్బింగ్ చెప్పాలని డిసైడ్ అయ్యాను కాబట్టి కష్టమైనా సరే డబ్బింగ్ పూర్తి చేశానని చెప్పింది. చివరగా మన నియంత్రణలో ఏదీ ఉండదని, అంతా మన లైఫ్ డిసైడ్ చేస్తుంది' అంటూ చెప్పుకొచ్చొంది. -
మయోసైటిస్ వల్ల నరకం.. కన్నీళ్లు పెట్టుకున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటూనే చేతికి సెలైన్ పెట్టుకొని యశోద డబ్బింగ్ కంప్లీట్ చేసిన సమంత తాజాగా ప్రమోషన్స్‌లోనూ స్వయంగా పాల్గొంది. ఈనెల 11న ఆమె నటించిన యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సమంత ఉన్న పరిస్థితుల్లో ఆమె బయటకు రావడం దాదాపు కష్టమే అని నిర్మాతలు సహా అభిమానులు కూడా అనుకున్నారు. కానీ అందరిని ఆశ్వర్యపరుస్తూ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కష్టకాలాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. 'ఒకానొక సమయంలో తాను ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేనని అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే ఇక్కడివరకు ఎలా వచ్చానోనని అనిపిస్తుంది' అంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. తన అనారోగ్యం కూడా కొందరు తప్పుగా ప్రచారం చేస్తూ తాను ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు వార్తలు రాశారని, కానీ తాను ఇప్పటికి ఇంకా చావలేదు అంటూ ఎమోషనల్ అయ్యింది. అంతేకాకుండా తనలాగే ఎంతోమంది కష్టాలతో పోరాడుతున్నారని, తనది పెద్ద సమస్య కాదని, ఈ పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. కష్టకాలంలోనూ సమంత చూపిస్తున్న ధైర్యానికి ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
ఆ వీడియోని చూసి...కన్నీళ్లు పెట్టుకున్న పాక్ నాయకుడు
పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ సెనెటర్ ఆజం ఖాన్ స్వాతి ఒక అభ్యంతరకర వీడియో గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆజం ఖాన్ గతనెలలో ట్విట్టర్లో జనరల్ కమర్ జావేద్ బజ్వాను విమర్శించడంతో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) ఆయన్ను అరెస్టు చేసింది. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ మేరకు ఆయన విలేకరులు సమావేశంలో ప్రసంగిస్తూ...తన భార్యకు గత రాత్రి ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి అభ్యంతరకర వీడియో వచ్చిందని చెప్పారు. ఐతే నా దేశంలో కూతుళ్లు, మనవరాళ్లు ఉన్నారు కాబట్టి ఆ వీడియో గురించి ఏమి ప్రస్తావించలేను అంటూ కన్నీరు పెట్టుకున్నారు. తాను తన భార్య క్వెట్టాను సందర్శించినప్పుడూ ఈ వీడియోని తీశారని, దీంతో తనను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారంటూ ఆవేదన చెందారు. అంతేగాదు తనను కస్టడీలో ఉంచి బట్టలు విప్పి ఎగతాళి చేస్తూ.. టార్చర్ చేసినట్లు తెలిపారు. ఐతే ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అది ఫేక్ వీడియో అని, ఫోటోషాప్తో సృష్టించిన నకిలీ వీడియో అని ప్రకటించింది. ఐతే సెనెటర్ ఈ విషయమై ఒత్తిడి చేస్తున్నారు కాటట్టి అధికారికంగా దరఖాస్తు దాఖలు చేస్తే విచారణ చేస్తామని ఫెడరల్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఈ మేరకు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ...ఆజం ఖాన్ స్వాతిని చిత్రహింసలకు గురిచేయడాన్ని ఖండించారు. అలాగే ఆయన భార్య అనుభవిస్తున్న అవమానకరమైన బాధ, ఆవేదనకు పాకిస్తాన్ తరుఫున తాను క్షమాపణలు చెబుతున్నాను అని అన్నారు. Shocking details of what happened last night to Azam Swati and his family being stated by @AzamKhanSwatiPk himself 1/2 pic.twitter.com/gdLpAW30qe — PTI (@PTIofficial) November 5, 2022 (చదవండి: వారెవ్వా.. సరికొత్త గిన్నిస్ రికార్డ్.. ‘కీహోల్’లోంచి ఏడు బాణాలు!) -
Sakshi Cartoon: సారు.. ఇలా లైవ్‌లో స్పందించరు!
సారు.. ఇలా లైవ్‌లో స్పందించరు! -
కన్నీటి వ్యధపై లఘుచిత్ర కథ
కాశీబుగ్గ: మారుమూల గెడ్డ.. అందులో నురగలు కక్కుతూ పలువురు మృతిచెందడం.. అటువైపుగా వెళ్లిన వారంతా ఆ దృశ్యాన్ని చూసి ఆందోళన చెందడం.. అయితే ఇదంతా వాస్తవం కాదు. జిల్లా పోలీసు శాఖ నిర్వహిస్తున్న షార్ట్‌ఫిల్మ్ పోటీలకు కొంతమంది ఉపాధ్యాయులు కలిసి నటించిన దృశ్యరూపకం. నాటుసారా వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ ఈ లఘుచిత్రం రూపొందిస్తున్నారు. పలాస మండలం సరియాపల్లి గెడ్డ వద్ద సన్నివేశం చిత్రీకరిస్తుండగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. -
పునీత్ రాజ్‌కుమార్ సినిమా చూస్తూ అభిమానుల కంటతడి
Puneeth Rajkumar Fans Getting Emotional Seeing After James Movie: కర్ణాటకలో ప్రస్తుతం జేమ్స్ ఫీవర్ నడుస్తుంది. పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం కావడంతో ఏ థియేటర్ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది.మార్చి17న పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కర్నాటకలో ఎన్నలేని విధంగా 500 పైగా స్క్రీన్స్, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 కి పైగా స్క్రీన్స్ ప్రపంచ వ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్స్ లో ఈ సినిమాను విడుదల చేశారు. చదవండి: పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' ట్విట్టర్ రివ్యూ చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. తమ అభిమాన నటుడి చివరి సినిమా కావడంతో ఈ సినిమా చేసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. పునీత్ యాక్షన్స్ సీన్స్ చూసి ఓ వైపు ఆనందం వ్యక్తం చేస్తుంటే, తమ ఆరాధ్య హీరో చివరి సినిమా ఇదేనంటూ మరికొందరు భావోద్వేగానికి లోనవుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు పునీత్‌ను తల్చుకొని అభిమానులు కంటతడి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ఇప్పటికీ సీక్రెట్‌గానే.. పునీత్ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదట Fans getting emotional seeing after #James movie🥺 Every fan is crying coming out of theatre seeing movie😔#PuneethRajkumar #HappyBirthdayPuneethRajkumar pic.twitter.com/JHlo6XrdB8 — Babu7@అన్నఫ్యాన్ (@Babu9440) March 17, 2022 -
ఆ సినిమా చూసి నేను, నా భర్త ఏడ్చేశాం: ప్రణీత
Pranitha Subhash Gets Tears After Watching The Kashmir Files Movie: గుండ్రని కళ్లతో, చక్కని చిరునవ్వుతో కుర్రకారు మనసు దోచిన చిన్నది ప్రణీత సుభాష్. 'ఏం పిల్లో.. ఏం పిల్లడో; సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బాపుబొమ్మ సిద్ధార్థ్ సరసన హీరోయిన్గా 'బావ' మూవీలో నటించి మెప్పించింది. తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్‌బస్టర్ హిట్ 'అత్తారింటింకి దారేది' సినిమాతో సెకండ్ హీరోయిన్గా టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అనంతరం తెలుగులో అవకాశాలు లేక కనుమరుగైంది. సినిమాల మాట ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ప్రణీత. ఈ సోషల్ మీడియా వేదికగా తను, ఆమె భర్త ఓ సినిమా చూసి ఏడ్చేశాం అని చెప్పుకొచ్చింది. చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'.. సినిమాలో ఏముంది ? ప్రణీత తన ఇన్‌స్టా గ్రామ్ హ్యాండిల్లో ''మేము 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా వీక్షించాం. ఈ చిత్రం పూర్తయ్యేసరికి నేనూ, నా భర్త ఏడ్చేశాం. సుమారు 30 ఏళ్ల క్రితం కశ్మీర్ పండిట్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో కళ్లకు కట్టినట్టు చూపించారు.'' అని పోస్ట్ పెట్టింది. అలాగే ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ చూడాలని కోరింది. కాగా 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా తెరకెక్కిన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. ఈ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసించారు. హర్యాణా, మధ్య ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, గోవా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు వినోదపు పన్ను రాయితీని కూడా ప్రకటించాయి. ఈ చిత్రాన్ని వివేక్ రంజన్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేశారు. చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో -
అపస్మారక స్థితిలో ఉన్నా.. కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: దివంగత లెజెండరీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జయంతి సందర్భంగా ఆయన భార్య సుతాపా సిక్దర్ భావోద్వేగానికి గురయ్యారు. ఇర్ఫాన్‌తో పంచుకున్న జీవితాన్ని, ఇతర విషయాలను తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సుతాప అతనితో మరెన్నో జ్ఞాపకాలను పంచుకున్నారు. భర్త చనిపోవడానికి ముందు రోజురాత్రి అతనికిష్టమైన పాటల్ని పాడుతూ కూచున్నానని గుర్తు చేసుకున్నారు. ఒక వెబ్‌సైట్‌తో తన ఆవేదనను పంచుకున్నారు సుతాప. తాను పాడుతోంటే..అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఇర్ఫాన్ కళ్ల నుంచి నీళ్లు అలా ప్రవహిస్తూనే ఉన్నాయని చెప్పారు. ఉమ్రావ్ జాన్ మూవీలోని 'ఝూలా కిన్నే దాలా రే, హమ్రియా, లతా మంగేష్కర్ ఆలపించిన పాపులర్ సాంగ్ ‘లగ్ జా గలే’, ఆజ్ జానే కీ జిద్ న కర్ అనే గజల్‌ను ఇర్ఫాన్ కోసం పాడి వినిపించానంటూ సుతాప ఎమోషనల్ అయ్యారు. ఇర్ఫాన్ లేకుండా, సింగిల్ మదర్‌గా తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకునే వారు సుతాప. గత ఏడాది ఇర్ఫాన్ వర్ధంతి సందర్భంగా ఇర్ఫాన్కెంతో ఇష్టమైన నైట్ క్వీన్ మొక్కను నాటి నివాళి అర్పించారు. ఈ పూల సువాసన ఇర్ఫాన్‌కి చాలా ఇష్టమని పేర్కొన్నారు. అలాగే ఇర్ఫాన్ పెద్ద కుమారుడు బాబిల్ ఖాన్ కూడా తమకు దూరమైన తండ్రి గురించి తలచుకుంటూ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. కాగా కేన్సర్‌తో బాధపడుతూ ఏప్రిల్ 29, 2020న ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
తెలుసా! ఈ ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావట..!
Cutting this ‘onion’ won't make your eyes watery: ఉల్లిపాయలను కట్ చేయడం కూడా ఓ రకమైన స్టంట్ లెక్కే! ఎంతటి ఘరనా ధైర్యవంతులకైనా కంట్లో నీళ్లు ఇట్టే తెప్పించగలవు. ఆ ఘాటుకు ముక్కు ఛీదేసి.. కళ్లు నులుమేసి.. ఆ కాసేపట్లోనే సతమతంచేసేస్తుంది.. ఉల్లి. కంట్లో నీళ్లు తెప్పించని ఉల్లిగడ్డలుంటే ఎంతబాగుంటుందో.. అని అనుకోని వారు ఉండరేమో! ఐతే ఈ వీడియోలో కనిపించే ఉల్లిని కట్ చేస్తే మాత్రం కళ్లు చెమ్మగిల్లవట!! కంట్లో నీళ్లు తెప్పించని ఉల్లిపాయలా? ఆశ్చర్యంగా ఉందే.. ఎక్కడున్నాయ్! ఇదేనా మీ సందేహం. ఆ విశేషాలు మీకోసం.. గతనెల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఉల్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది ఏ రకమైన ఉల్లి అయ్యుంటుందనేది.. ప్రతి ఒక్కరి అనుమానం. విషయం తెలిశాక ముక్కుమీద వేలేసుకున్నారంత! చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో.. నిజానికి.. అచ్చం ఉల్లిలాగే కనిపించే, ఉల్లి రూపంలో తయారు చేసిన రియలిస్టిక్ కేక్ అది. దీనిని చూసిన నెటిజన్లు రియాక్షన్లయితే.. ‘అది నిజమైన ఉల్లికానప్పుడు దానికి ఉల్లి తొడుగు ఎందుకు తొడిగారు' అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు, ఆనియన్ స్కిన్ కూడా నిజమైనది కాదనీ. వెనీలాతో తయారుచేసినదని.. దాన్ని భేషుగ్గా తినొచ్చని ఈ ఉల్లి కేక్‌ను తయారు చేసిన బేకర్ రిప్లై ఇచ్చాడు. ‘అబద్ధం చెప్పకండి.. పై పొర నిజమైనదే' అని ఒకరు ప్రశ్నిస్తే, ‘అద్భుతమైన స్కిల్.. మనసుకు హత్తుకునేలా ఉంద'ని మరొకరు ప్రశంశించారు. మరి మీరేమంటారు? చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!! View this post on Instagram A post shared by Sideserf Cake Studio (@sideserfcakes) -
భావోద్వేగం: వధువుని అలా చూసి కంటతడి పెట్టిన వరుడు
పెళ్లి అనేది జీవితంలో ముఖ్య ఘట్టం. ప్రతి జంట తమ పెళ్లిని సమ్‌థింగ్ స్పెషల్‌గా నిర్వహించుకోవాలని కోరుకుంటారు. అలాగే వారు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవాలని ఆశిస్తారు. తమతో జీవితాంతం కలిసి జీవించే వారికి కొత్తగా, అందంగా కనిపించాలనుకుంటారు. అచ్చం ఇలాగే వధువు తన వివాహ వేడుక ప్రారంభమయ్యే ముందు వరుడిని ఆశ్చర్యపరచాలని నిర్ణయించుకుంది. ఆఖరికి అనుకున్నది సాధించింది. పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబైన వధువు వేదిక వద్దకు వయ్యారంగా నడుచుకుంటూ రావడాన్ని చూసిన వరుడు మంత్రుముగ్ధుడయ్యాడు. వధవును చూడటానికి తనకు రెండు కళ్లు చాలలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెను చూసిన ఆ వరుడి కళ్లు ఆనందంతో నిండిపోయాయి. పుత్తడిబొమ్మలా తనవైపు నడిచొస్తున్న వధువుని చూసి ఫిదా అయిన వరుడు భావోద్వేగానికి లోనై సంతోషంతో కంటతడి పెట్టుకున్నాడు. ఈ భావోద్వేగ క్షణాలను కెమెరాలో బంధించారు. దీనికి సంబంధించిన వీడియోను వెడ్డింగ్ వైర్ ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ షేర్ చేసింది. చదవండి: అఫ్గాన్ల దుస్థితికి అద్దం పడుతున్న దృశ్యాలు! ‘ఒకరినొకరు కలిసి జీవించాలనుకునే మీ కల ఇప్పుడు ఏ క్షణంలోనైనా నిజమవుతోందని తెలిసిన క్షణాన ఆ భావానికి అభినందనలు. వరుడు తన వధువు వైపు చూసే విధానం పూర్తిగా మన హృదయాలను తాకుతోంది’ అని కామెంట్ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు సైతం తమ హృదయాలను కరిగిస్తోందని, కన్నీళ్లు తెప్పిస్తుందని కామెంట్ చేస్తున్నారు. చదవండి: తాలిబన్ల ఆధీనంలో అప్గన్ పార్లమెంట్, వీడియో వైరల్ View this post on Instagram A post shared by WeddingWire India (@weddingwireindia) -
ఆ నిర్ణయం దురదృష్టకరం: మేరీ కోమ్ భావోద్వేగం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (38) నిష్క్రమణ పలువుర్ని షాక్‌కు గురిచేసింది. మహిళల ఫ్లై వెయిట్ బాక్సింగ్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ఇంగ్రిట్ వాలెన్సియాపై ఓడిన తరువాత మీడియాతో మాట్లాడిన మేరీ కోమ్ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఓడిపోయానంటే నమ్మలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జడ్జెస్ నిర్ణయం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పతకంతో తిరిగి వస్తానని అనుకున్నా.. కానీ తన తప్పు ఏమిటో అర్థం కాలేదనీ, దీన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆమె పేర్కొన్నారు. అయితే 40 ఏళ్ల వయస్సు వరకు తన బాక్సింగ్ వృత్తిని కొనసాగిస్తానని మేరీ కోమ్ ప్రకటించారు. ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మేరీ కోమ్ టోక్యో ఒలింపిక్స్‌లో కొలంబియా ప్రత్యర్థిపై న్యాయ నిర్ణేతల విభజన నిర్ణయంతో అనూహ్యంగా ఓడిపోయారు. ఈ పరిస్థితిని మేరీ కోమ్ కూడా ఊహించలేదు. ఒక దశలో ఇంగ్రిట్ విజేతగాప్రకటించడానికి ముందే విజేతగా మేరీ తన చేయిని పైకి లేపారు. ముగ్గురు జడ్జిలు ఇంగ్రిట్‌కు అనుకూలంగా బౌట్ తీర్పు ఇవ్వగా ఇద్దరు మేరీ కోమ్కు మద్దతిచ్చారు. కానీ పాయింట్ల కేటాయింపులో తేడా మేరీని విజయానికి దూరం చేసింది. మరోవైపు ఇదే విషయంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా ట్వీట్ చేశారు. అందరి దృష్టిలో మీరే విజేత. కానీ న్యాయమూర్తులకు వారి వారి లెక్కలు ఉంటాయంటూ ట్విటర్లో వ్యాఖ్యానించారు. ప్రియమైన మేరీ కోమ్, టోక్యో ఒలింపిక్స్‌లో కేవలం ఒక పాయింట్‌తో ఓడిపోయారు. కానీ ఎప్పటికీ మీరే ఛాంపియన్ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో మరే మహిళా బాక్సర్ సాధించనిది మీరు సాధించారన్నారు. మీరొక చరిత్ర. భారతదేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని కేంద్ర మాజీ క్రీడామంత్రి ప్రశంసించారు. అలాగే ఇతర క్రీడాభిమానులు కూడా మేరీ కోమ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఓడిపోయినా ‘యూ ఆర్ ది లెజండ్.. మీరే విజేత.. మీరే మాకు ఆదర్శం’ అన్న సందేశాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. For all of us @MangteC was the clear winner but Judges have their own calculations😥 https://t.co/bDxjHFK9MZ pic.twitter.com/gVgSEugq4Q — Kiren Rijiju (@KirenRijiju) July 29, 2021 -
ప్రధాని మోదీ కంటతడి
వారణాసి/లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటతడి పెట్టుకున్నారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య యోధులతో సమావేశం సందర్భంగా.. వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినవారిని గుర్తు చేసుకుంటూ ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలోని వైద్యులు, వైద్య సిబ్బందితో శుక్రవారం ప్రధాని వర్చువల్ సమావేశం నిర్వహించారు. కోవిడ్ 19 పేషెంట్ల వద్దకే వైద్య సేవలను తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా వారికి ఆయన సూచించారు. ‘జహాః బీమార్.. వహీః ఉపచార్’అనే కొత్త మంత్రాన్ని ఉపదేశించారు. దానివల్ల ఆరోగ్య వ్యవస్థపై భారం తగ్గుతుందన్నారు. ‘అందరి ఉమ్మడి కృషితో ఈ మహమ్మారిని కొంతవరకు నియంత్రించగలిగాం. కానీ అప్పుడే సంతృప్తి చెందలేం. యుద్ధాన్ని ఇంకా చాలారోజులు కొనసాగించాల్సి ఉంది’అన్నారు. వారణాసి, పూర్వాంచల్‌లోని గ్రామీణ ప్రాంతాలపై వైద్యులు దృష్టి పెట్టాలన్నారు. టెలీ మెడిసిన్ సేవలను విస్తృతం చేయాలని, యువ వైద్యులు, రిటైరైన వైద్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, వార్డ్‌బాయ్స్, అంబులెన్స్ డ్రైవర్లు.. తదితరుల సేవలను ప్రధాని కొనియాడారు. ‘కానీ ఈ మహమ్మారి ఎంత తీవ్రంగా ఉందంటే.. ఇంతగా కష్టపడుతున్నా.. చాలా మంది ప్రాణాలను ఇంకా కాపాడలేకపోతున్నాం. మనకు దగ్గరైన వారెందరినో ఈ వైరస్ తీసుకెళ్లిపోయింది’అంటూ కంటనీరు పెట్టుకుని, గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు. ఆ తరువాత కాసేపటివరకు ఆవేదనతో ఆయన మాట్లాడలేకపోయారు. కాసేపటికి తేరుకుని.. కరోనాతో చనిపోయినవారందరికీ నివాళులర్పిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నానన్నారు. కరోనా నుంచి పిల్లలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రధాని కోరారు. తాజాగా బ్లాక్ ఫంగస్ మరో సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండో వేవ్‌లో కరోనాతో బహుముఖ పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. ‘ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉంది. ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరమున్న రోగుల సంఖ్య పెరిగింది. దాంతో వైద్య వ్యవస్థపై భారీగా భారం పడింది’అని వివరించారు. కనిపించని, క్షణక్షణం రూపుమార్చే శత్రువుతో పోరాడుతున్నామన్నారు. టీకాలే ఈ వైరస్ నుంచి కాపాడే సురక్షా కవచాలని, టీకా వేసుకున్న కారణంగానే వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్ యోధులు ధైర్యంగా పోరాడగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ సురక్షా కవచం అందరికీ చేరాల్సి ఉందన్నారు. ఏడేళ్లుగా వైద్య రంగంలో చేపట్టిన కార్యక్రమాల కారణంగా ఈ మహమ్మారిని ఎదుర్కోగలిగామన్నారు. అయితే, ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో రాత్రింబవళ్లు సేవలందించిన వైద్య సిబ్బంది కృషి విస్మరించలేనిదని కొనియాడారు. మొదట్లో తాము యోగాకు ప్రచారం చేస్తున్నప్పుడు, దానికి కొందరు మతం రంగు పులిమారని, కానీ ఇప్పుడు ఆ యోగానే కరోనాపై పోరులో మనకు సహకరిస్తోందని వ్యాఖ్యానించారు. మైక్రో కంటైన్మెంట్ జోన్ల వల్ల వారణాసి లబ్ధి పొందిందన్నారు.