న్యూ కేజల్ : అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి వాషింగ్టన్‌కు బయల్దేరి వెళ్లడానికి ముందు జో బైడెన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన సొంత రాష్ట్రమైన డెలవార్ లోని న్యూ కేజల్‌లో నేషనల్ గార్డ్ సెంటర్‌లో మంగళవారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న బైడెన్ తన సొంతూరు వీడి వెళ్లిపోతున్నందుకు పలుమార్లు కంటతడి పెట్టుకున్నారు. నేను చనిపోయినా కూడా నా గుండె డెలవార్ కోసం కొట్టుకుం టూనే ఉంటుందని బైడెన్ ఉద్విగ్నంగా చెప్పా రు. సెనేటర్‌గా దశాబ్దాల తరబడి రైల్లోనే వాషింగ్టన్‌కు ప్రయాణం చేసిన ఆయన ప్రమాణ స్వీకారానికీ అలాగే వెళ్లాలనుకున్నారు. కానీ భద్రతా కారణాల రీత్యా బైడెన్ విమానంలో వెళ్లాల్సి వచ్చింది. తన కోరిక తీరకపోయి నప్పటికీ ఆ రైలు ప్రయాణం అనుభూ తుల్ని బైడెన్ గుర్తు చేసుకున్నారు. ‘‘సరిగ్గా పన్నెండేళ్ల క్రితం విల్మింగ్‌టన్ స్టేషన్‌లో ఒక నల్లజా తీయుడి కోసం వేచి ఉన్నాను. రైల్లో ఆయన వెళుతూ నన్నూ తీసుకొని వెళ్లారు. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షు లుగా ఒబామా, నేను ప్రమాణం చేశాము. ఇప్పుడు మళ్లీ ఒక నల్లజాతీయ మహిళను కలుసు కోవడానికి వాషింగ్టన్ వెళుతున్నాం. నేను, కమలా హ్యారిస్ అధ్యక్ష, ఉపా«ధ్యక్షులుగా ప్రమాణం చేస్తాం. అదీ అమెరికా.. అదీ డెలవార్’’ అని బైడెన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment