Newcastle
-
సొంతూరు వీడుతూ బైడెన్ కంటతడి
న్యూ కేజల్ : అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి వాషింగ్టన్కు బయల్దేరి వెళ్లడానికి ముందు జో బైడెన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన సొంత రాష్ట్రమైన డెలవార్ లోని న్యూ కేజల్‌లో నేషనల్ గార్డ్ సెంటర్లో మంగళవారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న బైడెన్ తన సొంతూరు వీడి వెళ్లిపోతున్నందుకు పలుమార్లు కంటతడి పెట్టుకున్నారు. నేను చనిపోయినా కూడా నా గుండె డెలవార్ కోసం కొట్టుకుం టూనే ఉంటుందని బైడెన్ ఉద్విగ్నంగా చెప్పా రు. సెనేటర్‌గా దశాబ్దాల తరబడి రైల్లోనే వాషింగ్టన్కు ప్రయాణం చేసిన ఆయన ప్రమాణ స్వీకారానికీ అలాగే వెళ్లాలనుకున్నారు. కానీ భద్రతా కారణాల రీత్యా బైడెన్ విమానంలో వెళ్లాల్సి వచ్చింది. తన కోరిక తీరకపోయి నప్పటికీ ఆ రైలు ప్రయాణం అనుభూ తుల్ని బైడెన్ గుర్తు చేసుకున్నారు. ‘‘సరిగ్గా పన్నెండేళ్ల క్రితం విల్మింగ్టన్ స్టేషన్లో ఒక నల్లజా తీయుడి కోసం వేచి ఉన్నాను. రైల్లో ఆయన వెళుతూ నన్నూ తీసుకొని వెళ్లారు. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షు లుగా ఒబామా, నేను ప్రమాణం చేశాము. ఇప్పుడు మళ్లీ ఒక నల్లజాతీయ మహిళను కలుసు కోవడానికి వాషింగ్టన్ వెళుతున్నాం. నేను, కమలా హ్యారిస్ అధ్యక్ష, ఉపా«ధ్యక్షులుగా ప్రమాణం చేస్తాం. అదీ అమెరికా.. అదీ డెలవార్’’ అని బైడెన్ చెప్పారు. -
నార్త్ ఈస్ట్ ఇంగ్లాండ్‌లో ఘనంగా ఉగాది ఉత్సవాలు
న్యూ క్యాస్టిల్: తెలుగు భాషా, సంస్కృతుల విశిష్టతను ఖండాంతరాలు వ్యాపించేలా ఇంగ్లాండ్‌లోని న్యూ క్యాస్టిల్లో నార్త్ ఈస్ట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సురేఖ, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకలకు లార్డ్ మేయర్ ఇయం గ్రహం ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడుతూ.. వివిధ జాతులకు చెందిన ప్రజలు నగరానికి వన్నె తెచ్చారన్నారు. అనంతరం అయనను కేవీ రావు సత్కరించారు. జన్మ భూమికి వేల కిలో మీటర్ల దూరంలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాల వారికి అందించడమే ఈ ఉగాది వేడుకల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు డా.మధు ఆదాల అన్నారు. ఆ తర్వాత జరిగిన సంస్కృతిక జడివాన కార్యక్రమం అక్కడికి వచ్చిన తెలుగువారందని ఆకట్టుకుంది. 'బహుబలి' చిత్రాన్ని నాటక రూపంలో చిన్నారులు ఇచ్చిన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. పలువురు నాట్యకళాకారులు కూచుపూడి, భరత నాట్యాలతో వీక్షకులను ఆకట్టుకున్నారు. -
జట్టు ఓటమి తట్టుకోలేక అభిమాని ఆత్మహత్య
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ టోర్ని లో తన ఫేవరేట్ జట్టు ఓటమిపాలవ్వడాన్ని జీర్ణించుకోలేక ఏడంతస్థుల భవనం నుంచి దూకి చనిపోయిన సంఘటన కెన్యా రాజధాని నైరోబిలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఓల్డ్ ట్రాఫోర్డ్ లో న్యూకాజిల్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో మాంచెస్టర్ యునైటెడ్ జట్టు 1-0 తేడాతో ఓటమి పాలైంది. మ్యాగ్ పైస్, మాంచెస్టర్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన వెంటనే జాన్ మచారియా అనే అభిమాని నైరోబిలోని పైప్ లైన్ ఎస్టేట్ లోని అపార్ట్ మెంట్ లోని ఏడవ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడు అని నైరోబీ కౌంటీ పోలీసులు తెలిపారు. గతంలో కూడా తమ ఫేవరెట్ జట్ట ఓటిమి పాలుకావడంతో పలువురు అభిమానులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2009 లో జరిగిన యూఈఎఫ్ఏ చాంఫియన్స్ లీగ్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ది గన్నర్ జట్టు ఓటమి పాలవ్వడంతో సులేమాన్ ఆల్ఫాన్సో ఓమోండి అనే అభిమాని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.