జట్టు ఓటమి తట్టుకోలేక అభిమాని ఆత్మహత్య | Fan commits suicide in Kenya after Manchester United lose to Newcastle | Sakshi
Sakshi News home page

జట్టు ఓటమి తట్టుకోలేక అభిమాని ఆత్మహత్య

Published Mon, Dec 9 2013 4:48 PM | Last Updated on Tue, Oct 9 2018 5:31 PM

Fan commits suicide in Kenya after Manchester United lose to Newcastle

ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ టోర్ని లో తన ఫేవరేట్ జట్టు ఓటమిపాలవ్వడాన్ని జీర్ణించుకోలేక ఏడంతస్థుల భవనం నుంచి దూకి చనిపోయిన సంఘటన కెన్యా రాజధాని నైరోబిలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఓల్డ్ ట్రాఫోర్డ్ లో న్యూకాజిల్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో మాంచెస్టర్ యునైటెడ్ జట్టు 1-0 తేడాతో ఓటమి పాలైంది.
 
మ్యాగ్ పైస్, మాంచెస్టర్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన వెంటనే జాన్ మచారియా అనే అభిమాని నైరోబిలోని పైప్ లైన్ ఎస్టేట్ లోని అపార్ట్ మెంట్ లోని ఏడవ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడు అని నైరోబీ కౌంటీ పోలీసులు తెలిపారు. 
 
గతంలో కూడా తమ ఫేవరెట్ జట్ట ఓటిమి పాలుకావడంతో పలువురు అభిమానులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2009 లో జరిగిన యూఈఎఫ్ఏ చాంఫియన్స్ లీగ్ సెమీ ఫైనల్  మ్యాచ్ లో ది గన్నర్ జట్టు ఓటమి పాలవ్వడంతో సులేమాన్ ఆల్ఫాన్సో ఓమోండి అనే అభిమాని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement