Nairobi
-
కెన్యాలో భారీ పేలుడు: ఇద్దరు మృతి, 300 మందికి గాయాలు
కెన్యా రాజధాని నైరోబీలో గురువారం రాత్రి భారీ పేలుడు జరిగింది. గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. మరో 300 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నైరోబీలోని ఎంబాకాసిలోని స్కైలైన్ ఎస్టేట్ సమీపంలోని కంటైనర్ కంపెనీలో పేలుడు జరిగినట్లు కెన్యా రెడ్‌క్రాస్ వెల్లడించింది. ఆ ప్రాంతం మొత్తం మంటల్లో చిక్కుకొని చుట్టుపక్కల ప్రదేశాలకు వ్యాపించినట్లు తెలిపింది. News: Gas explosion in Nairobi, Kenya. Casualties undisclosed yet. The image is terrifying. pic.twitter.com/dFPYinmw3E — Olu 🕊️ (@empror24) February 2, 2024 ఒక్కసారిగా పేలుళ్ల శబ్ధం రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రమాదం తీవ్రతకు కంపెనీకి చెందిన రెండు భవనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. అనేక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లకు మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న వాహనాలు, వ్యాపార సముదాయాలు, ఇళ్లు కాలిబూడిదయ్యాయి. Nairobi, Kenya - Massive explosion. Death toll could be huge as hundreds in the building 🇰🇪 pic.twitter.com/lULFLJI2HU — 🇬🇧RonEnglish🇬🇧🏴 (@RonEng1ish) February 2, 2024 పెద్ద సంఖ్యలో ప్రజలు పరిసర భవనాల్లో చిక్కుకుపోయారని అక్కడి అధికారులు తెలిపారు ఈ క్రమంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రిల్లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
రూ.21.9 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీ ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ గుట్టురట్టు చేశారు. కెన్యా రాజధాని నైరోబీ నుంచి హెరాయిన్‌తో వచ్చిన మలావీ దేశ జాతీయురాలిని సోమవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. ఆమె నుంచి రూ. 21.9 కోట్ల విలువైన 3.129 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె క్యారియర్ అని, ఈ డ్రగ్‌ను తీసుకొనే రిసీవర్లు ఎవరనేది గుర్తించే కోణంలో దర్యాప్తు చేస్తు న్నామని డీఆర్ఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పక్కా రెక్కీ అనంతరం... మలావీకి చెందిన మహిళను బిజినెస్ వీసాపై కొన్ని రోజుల క్రితం నైరోబీకి పిలిపించిన అంతర్జాతీయ డ్రగ్ మాఫియా... రెక్కీ కోసం అక్కడ నుంచి రెండుసార్లు ఆమెను హైదరాబాద్‌కు పంపి ఒకట్రెండు రోజుల తర్వాత తిరిగి వెనక్కు రప్పించింది. అన్నీ పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్న మాఫియా సూత్రధారులు శుక్రవారం 3.129 కేజీల హెరాయిన్‌ను ఆమెకు అప్పగించారు. దీన్ని రెండు పాలిథిన్ బ్యాగుల్లో ఉంచి ట్రాలీ బ్యాగ్ కింది వైపు ఏర్పాటు చేసిన రహస్య అరలో ఉంచారు. స్కానింగ్‌లోనూ హెరాయిన్ ఉనికి బయటపడకుండా నల్లరంగు పాలిథిన్ సంచులను వాడారు. ఈ బ్యాగ్‌తో నైరోబీ నుంచి బయలుదేరిన మలావీ జాతీయురాలు తొలుత దోహాకు.. అక్కడి నుంచి సోమవారం శంషాబాద్‌కు చేరుకుంది. అయితే ఆమె బిజినెస్ వీసాపై నైరోబీ నుంచి రావడం, గతంలోనూ రెండుసార్లు వచ్చివెళ్లడంతో డీఆర్ఐ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని లగేజీని తనిఖీ చేయగా హెరాయిన్ లభ్యమైంది. ఆ మహిళను అరెస్టు చేసిన అధికారులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
Viral Video: పతకం గెలిచిన ఆనందంలో చిందేసిన భారత అథ్లెట్..
న్యూఢిల్లీ: అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ తరఫున లాంగ్ జంప్ ఈవెంట్లో 17 ఏళ్ల షైలీ సింగ్ రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆనందంలో ఆమె మైమరిచి చిందేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో షైలీ చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన షైలీ.. నైరోబి ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో 6.59 మీటర్లు దూకి రజతం సాధించింది. #WorldAthleticsU20 Silver Medalist #ShailiSingh celebrates her glorious return by dancing on the tune of a Punjabi song at SAI, Bangalore Take a look 😀@ianuragthakur @NisithPramanik @YASMinistry @IndiaSports @DGSAI @afiindia @Adille1 @NsscSai @ddsportschannel @AkashvaniAIR pic.twitter.com/hWzuezycEL — SAI Media (@Media_SAI) August 27, 2021 అనంతరం ఆమె భారత్‌కు తిరిగొచ్చాక బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) సెంటర్లో పతకం గెలిచిన ఆనందాన్ని వ్యక్త పరుస్తూ.. పాపులర్ పంజాబీ పాటకు బాంగ్రా నృత్యం చేసింది. ఈ డ్యాన్స్ వీడియోను సాయ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కాగా, షెల్లీ సింగ్ కేవలం 1 సెంటీమీటర్ దూరంతో స్వర్ణాన్ని కోల్పోయింది. స్వీడన్‌కు చెందిన 18 ఏళ్ల మజా అస్కాగ్ 6.60 మీటర్లు దూకి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. చదవండి: వినోద్ కూమార్‌కు కాంస్యం.. భారత్ ఖాతాలో మూడో పతకం -
అంతర్జాతీయ క్రీడా వేదికపై తూగో జిల్లా ఆదివాసి బిడ్డ
కూనవరం(తూగో జిల్లా): కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..మహాపురుషులవుతారు..అడవిరాముడు చిత్రం కోసం వేటూరి రాసిన ఈ గీతం ఓ స్ఫూర్తి మంత్రం..నిజమే..కొండ కోనల్లో కట్టెలమ్ముకునే ఇంట పుట్టిన ఓ అడవిబిడ్డ ఎంతో కష్టపడింది. పరుగులో రాణించేందుకు అహరహం శ్రమించింది. ఇప్పుడు కెన్యాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. పట్టుదల..కఠోర సాధనతో ఈ బాలిక విజయపథాన రివ్వున దూసుకెళుతోంది. కుటుంబ సభ్యులతో రజిత కుగ్రామం నుంచి.. కూనవరం మండలం పోచవరం పంచాయతీ పరిధిలోని ఆదివాసీ కుగ్రామం రామచంద్రాపురం. చుట్టూ దట్టమైన అడవి తప్ప మరేమీ కనిపించదు. 35 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి ఇక్కడికి వలసవచ్చింది మారయ్య కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని దయనీయ స్థితి. కుంజా మారయ్య..భద్రమ్మ దంపతులకు ముగ్గురు మగ పిల్లలు ..ఇద్దరు ఆడపిల్లలు. ఇందులో ఆఖరి బిడ్డ రజిత. భర్త చనిపోయాక భద్రమ్మ అడవికి వెళ్లి కట్టెలు సేకరించడం ద్వారా పిల్లల్ని పోషిస్తోంది. రజిత రోజూ చింతూరు మండలం కాటుకపల్లి వెళ్లి చదువుకునేది. 1 నుంచి 8వ తరగతి వరకు అక్కడ చదివింది. సెలవులు ఇచ్చినప్పుడు తల్లి వెంట కట్టెలు తెచ్చి చేదోడు వాదోడుగా నిలిచేది. పరుగులో తొలినుంచి ఈమెలో వేగాన్ని పెద్దన్న జోగయ్య గమనించాడు. చిన్నా చితకా పరుగుపందెం పోటీల్లో పాల్గొని ముందు నిలిచేది. ఆగని పరుగు.. నెల్లూరు ఆశ్రమ పాఠశాలలో సీటు రావడంతో రజిత 9, 10 తరగతులు చదివింది. అప్పుడే నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో వంశీసాయి కిరణ్ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ శిక్షణ పొందింది. మంగళగిరిలో ఇంటర్మీడియెట్ చదువుతూ గుంటూరులో శాప్ ద్వారా గురువులు కృష్ణమోహన్, మైకె రసూల్ వద్ద అథ్లెటిక్స్ శిక్షణ తీసుకుంది. 2019లో అసోంలో నిర్వహించిన జాతీయ ఖేలిండియా అథ్లెటిక్ పోటీల్లో 400 మీటర్లు పరుగు విభాగంలో విశేష ప్రతిభ కనబర్చింది. ఈ నెల 17న కెన్యాలోని నైరోబిలో జరిగే అండర్–20 జూనియర్ అథ్లెటిక్ పోటీలకు ఎంపికైంది. తగిన ప్రోత్సాహముంటే దేశ కీర్తిని చాటేలా ప్రతిభ నిరూపించుకుంటానని రజిత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. -
వరల్డ్ ఫేమస్ దొంగల ముఠా.. ప్రతీదీ ట్విస్టే!
ఎంటర్టైన్మెంట్కి ఎల్లలు లేవు. అందుకే లోకల్ కంటెంట్‌తో పాటు గ్లోబల్ కంటెంట్‌కు ఆదరణ ఉంటోంది. ఇక ఓటీటీ వాడకం పెరిగాక.. దేశాలు దాటేసి మరీ సినిమాలు, సిరీస్‌లను డిజిటల్ తెరలపై చూసేస్తున్నారు మనవాళ్లు. ఆ లిస్ట్‌లో ఒకటే ‘మనీ హెయిస్ట్’. ఎక్కడో స్పెయిన్‌లో తెరకెక్కిన ఈ టీవీ సిరీస్‌కి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్.. అందులో తెలుగువాళ్లూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కువమంది(ఇండియన్స్‌తో సహా) చూసిన నాన్–ఇంగ్లీష్ సిరీస్ కూడా ఇదే(ఇదొక రికార్డు). మనీ హెయిస్ట్కి ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటానికి ప్రధాన కారణాలు.. ఈ సిరీస్ మూలకథ, ప్రధాన పాత్రలతో వ్యూయర్స్ పెంచుకున్న కనెక్టివిటీ. అందుకే ఐదో పార్ట్ రూపంలో అలరించేందుకు సిద్ధమైంది ఈ దొంగల ముఠా డ్రామా. సాక్షి, వెబ్‌డెస్క్: క్రైమ్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవాళ్లకు ‘మనీ హెయిస్ట్’ ఒక ఫుల్ మీల్స్. ఒరిజినల్‌గా ఇది స్పానిష్ లాంగ్వేజ్‌లో తెరకెక్కింది. నాన్–స్పానిష్ ఆడియెన్స్ కోసం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో సిరీస్‌ను అందిస్తున్నారు. మొదటి సీజన్ 2017 మే 2న స్పానిష్ టీవీ ఛానెల్ ‘అంటెనా 3’ లో టెలికాస్ట్ అయ్యింది. స్పానిష్‌లో మనీ హెయిస్ట్ ఒక టెలినోవెలా.. అంటే టెలిసీరియల్ లాంటిదన్నమాట. మనీ హెయిస్ట్ టెలికాస్ట్ తర్వాత.. అప్పటిదాకా ఉన్న స్పానిష్ టీవీ వ్యూయర్షిప్ రికార్డులన్నీ చెరిగిపోయాయి. ఆ పాపులారిటీని గుర్తించి నెట్‌ఫ్లిక్స్ మనీ హెయిస్ట్ రైట్స్‌ని కొనుగోలు చేసింది. అలా నెట్‌ఫ్లిక్స్ నుంచి ప్రపంచం మొత్తం ఈ ట్విస్టీ థ్రిల్లర్‌కు అడిక్ట్ అయ్యింది. మరో రికార్డ్ ఏంటంటే.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూయర్షిప్ ఉన్న టీవీ సిరీస్ కూడా ఇదే!. మనీ హెయిస్ట్ ఇప్పటిదాకా రెండు సీజన్స్.. నాలుగు పార్ట్లు.. 31 ఎపిసోడ్స్‌గా టెలికాస్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్లో ఐదో పార్ట్‌గా పది ఎపిసోడ్స్‌తో రాబోతోంది. సెప్టెంబర్ 3న ఐదు వాల్యూమ్స్(ఎపిసోడ్స్‌గా) రిలీజ్ కానుంది. ఆ పై డిసెంబర్లో మిగిలిన ఐదు రిలీజ్ అవుతాయి. దీంతో ఎప్పుడెప్పుడు చూసేద్దామా అనే ఎగ్జయిట్మెంట్ ఫ్యాన్స్‌లో మొదలైంది. ఎందుకంత అడిక్షన్? మనీ హెయిస్ట్ ఒరిజినల్(స్పానిష్) టైటిల్ ‘లా కాసా డె పాపెల్’. బ్యాంకుల దోపిడీ(హెయిస్ట్) నేపథ్యంలో సాగే కథ ఈ సిరీస్‌ది. దోపిడీకి ప్రయత్నించే గ్యాంగ్.. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూసే పోలీసులు.. వెరసి ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్‌తో కథ ముందుకెళ్తుంది. అలాగని స్టోరీ నార్మల్‌గా ఉండదు. సీన్‌కి సీన్‌కి ఆడియెన్స్‌లో హీట్ పెంచుతుంది. ట్విస్టుల కారణంగా ‘ప్రతీ సీన్ ఒక క్లైమాక్స్‌లా’ అనిపిస్తుంది. కథలో తర్వాతి సీన్ ఏం జరుగుతుందనేది వ్యూయర్స్ అస్సలు అంచనా వేయలేరు. ఆ ఎగ్జయిట్మెంటే చూసేవాళ్లను సీటు అంచున కూర్చోబెడుతుంది. కథలో ఒక్కోసారి ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ వస్తుంటాయి. వాటి ఆధారంగానే కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. ఆడియెన్స్‌ని ప్రధానంగా ఆకట్టుకునే అంశం కూడా ఇదే. ఇక స్క్రీన్‌ప్లే సైతం గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్ చెప్పే డైలాగులు ఫిలసాఫికల్ డెప్త్‌తో ఉంటాయి. అందుకే ఒక్కసారి ఇన్వాల్వ్ అయ్యారంటే వదలకుండా చూస్తుంటారు. ఈ సిరీస్‌కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ట్విట్టర్లో ఒకటి, రెండు రోజులు ట్రెండింగ్‌లో ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు మనీ హెయిస్ట్ క్రేజ్ ఏపాటిదో. క్యారెక్టర్స్ కనెక్టివిటీ కాస్టింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు.. ప్రతీ క్యారెక్టర్‌కి కరెక్ట్ సీన్లు పడటం కొంచెం కష్టంతో కూడుకున్న పని. కానీ, మనీ హెయిస్ట్‌లో ప్రతీ క్యారెక్టర్‌కి సమాన ప్రాధాన్యం ఉంటుంది. క్యారెక్టర్లను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. ఈ కథ నారేటర్, దోపిడీ ముఠాలో ఫస్ట్ మెంబర్ ‘టోక్యో’. ఇక మెయిన్ క్యారెక్టర్ ‘ఎల్’ ఫ్రొఫెసర్. దోపిడీ వెనుక మాస్టర్ మైండ్ ఇతనే. నిజానికి అతని యాక్చువల్ ప్లాన్ వేరే ఉంటుంది. ప్రొఫెసర్‌తో పాటు నైరోబీ, బెర్లిన్(ప్రొఫెసర్ బ్రదర్) అనే మరో రెండు క్యారెక్టర్లు టోటల్‌గా ఈ సిరీస్‌కే కిరాక్ పుట్టించే క్యారెక్టర్లు. అందుకే వాటికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అసలు కథ విషయానికొస్తే.. ఆరంభంలో ఒక బ్యాంక్ దొంగతనం చేయబోయి ఆ ప్రయత్నంలో ఫెయిల్ అవుతుంది ఒలివెయిరా(టోక్యో). ఆమెను పోలీసుల బారి నుంచి రక్షిస్తాడు ప్రొఫెసర్. ఆమెతో పాటు మరో ఏడుగురిని ఒకచోట చేర్చి భారీ దోపిడీలకు ప్లాన్ గీస్తాడు. ఆ ముఠాలో ప్రొఫెసర్ బ్రదర్ అండ్రెస్ డె ఫోనోల్లోసా(బెర్లిన్) కూడా ఉంటాడు.ఆ గ్యాంగ్‌లో ఒకరి వివరాలు ఒకరికి తెలియవు. కానీ, ఎక్కడో దూరంగా ఉండి ప్రొఫెసర్ ఇచ్చే సూచనల మేరకు పని చేస్తుంటారు. పోలీసుల నుంచి రక్షించుకునే క్రమంలో జరిగే పోరాట సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈ క్రమంలో వాడే మోడరన్ టెక్నాలజీ, వెపన్స్ ప్రత్యేకంగా ఉంటాయి. మధ్యమధ్యలో క్యారెక్టర్ల రిలేషన్స్, ఎమోషన్స్, లవ్ ట్రాక్స్.. ఇలా కథ సాగుతూ పోతుంటుంది. కథలో ప్రతీ క్యారెక్టర్‌ను వ్యూయర్స్ ఓన్ చేసుకున్నారు కాబట్టే.. అంతలా సూపర్ హిట్ అయ్యింది ఈ సిరీస్. సాల్వడోర్‌కు గౌరవసూచికంగా.. మనీ హెయిస్ట్ కథలో మరో ప్రధాన ఆకర్షణ.. క్యారెక్టర్ల పేర్లు. ముఠాలోని సభ్యులకు ఒరిజినల్ పేర్లు వేరే ఉంటాయి. వాళ్ల ఐడెంటిటీ మార్చేసే క్రమంలో వివిధ దేశాల రాజధానుల పేర్లు పెడతాడు ప్రొఫెసర్. టోక్యో, మాస్కో, బెర్లిన్, నైరోబీ, స్టాక్‌హోమ్, హెల్సెంకీ... ఇలాగన్నమాట. ఒకరకంగా ఈ పేర్లే మనీ హెయిస్ట్ను ఆడియెన్స్‌కి దగ్గర చేశాయి.. హయ్యెస్ట్ వ్యూయర్షిప్తో బ్రహ్మరథం పట్టేలా చేశాయి. కథలో ఆకట్టుకునే విషయం దోపిడీ ముఠా ధరించే మాస్క్‌లు. ఈ మాస్క్‌లకూ ఒక ప్రత్యేకత ఉంది. స్పానిష్ ప్రముఖ పెయింటర్ సాల్వడోర్ డాలి. ఆయన గౌరవార్థం.. ఆయన ముఖకవళికలతో ఉన్న మాస్క్‌ను ఈ సిరీస్‌కు మెయిన్ ఎట్రాక్షన్ చేశాడు ‘లా కాసా డె పాపెల్’ క్రియేటర్ అలెక్స్ పీనా. ఈ టీవీ షో తర్వాతే అలెక్స్ పీనా పేరు ప్రపంచం మొత్తం మారుమోగింది. ఆయనకి బడా ఛాన్స్‌లు తెచ్చిపెట్టింది. ఊపేసిన బెల్లా చావ్ మనీ హెయిస్ట్ థీమ్ మ్యూజిక్ కంటే.. ఈ సిరీస్ మొత్తంలో చాలాసార్లు ప్లే అయ్యే పాట బెల్లా సియావో(బెల్లా చావ్)కి ఒక ప్రత్యేకత ఉంది. బెల్లా సియావో ఒక ఇటాలియన్ జానపద గేయం. ఇంగ్లీష్‌లో దానర్థం ‘గుడ్‌బై బ్యూటిఫుల్’ అని. పాత రోజుల్లో ఇటలీలో మాండినా(సీజనల్ వ్యవసాయ మహిళా కూలీలు) తమ కష్టాల్ని గుర్తించాలని భూస్వాములకు గుర్తు చేస్తూ ఈ పాటను పాడేవాళ్లు. 19వ శతాబ్దం మొదట్లో నార్త్ ఇటలీలో వ్యవసాయ కూలీలు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొనేవాళ్లు. ఆ టైంలో ఈ పాట ఉద్యమ గేయంగా ఒక ఊపు ఊపింది. 1943–45 టైంలో యాంటీ–ఫాసిస్టులు ఈ పాటను ఎక్కువగా పాడేవాళ్లు. ఆ తర్వాత ఈ పాట వరల్డ్ కల్చర్‌లో ఒక భాగమైంది. చాలా దేశాల్లో రీమేక్ అయ్యింది. 1969 నుంచి మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కూడా బెల్లా సియావో ఒక భాగమైంది. కానీ, మోస్ట్ పాపులర్ సాంగ్‌గా గుర్తింపు పొందింది మాత్రం మనీ హెయిస్ట్ సిరీస్‌తో. మెయిన్ క్యారెక్టర్స్ ఎల్ ప్రొఫెసర్, బెర్లిన్(అన్నదమ్ములు) కలిసి పాడిన ఈ పాట తర్వాత సీజన్ల మొత్తం నడుస్తూనే ఉంటుంది. 2018 సమ్మర్లో ‘బెల్లా సియావో’ యూరప్‌లో ఒక చార్ట్బస్టర్సాంగ్గా గుర్తింపు పొందింది. తెలుగులో మహేష్ బాబు ‘బిజినెస్ మేన్’లో.. ‘పిల్లా.. చావే...’ సాంగ్ దీని నుంచే స్ఫూర్తి పొందిందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. -
మనుషుల కంటే ఏనుగులే బెటర్.. వైరల్ వీడియో..
నైరోబి: సాధారణంగా వేసవి కాలంలో కొన్ని ఇళ్లలోని బోర్లు, బావులు ఇంకిపోవడం మనకు తెలిసిందే. దీని కోసం ఆయా ప్రాంతాల్లోని మున్సిపల్ అధికారులు నీటి ట్యాంకర్ల ద్వారా నీటి కోరత ఉన్న కాలనీల్లోకి నీటిని సరఫరా చేస్తుంటాయి. అయితే, ఇంటి ముందు నీళ్ల ట్రాక్టర్ రాగానే.. మహిళలు బిందేలతో నీటిని పట్టుకొవడానికి పొటీపడుతుంటారు. నాకంటే.. నాకు.. అని వాదులాడుకుంటుంటారు. ఈ క్రమంలో వారి మధ్య నీటి కోసం.. చిన్నపాటి ‘పానిపట్టు’ యుద్ధమే జరుగుతుంది. అయితే, ఇక్కడ వీడియోలో ఏనుగులు.. నీరు తాగటం కోసం ఏ మాత్రం.. పోటి పడకుండా.. తమ వంతు వచ్చే వరకు క్రమశిక్షణగా, వేచి చూస్తున్న వీడియో నెటిజన్లను ఏంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాలు.. ఈ సంఘటన కెన్యాలోని అడవిలో జరిగింది. ఇక్కడ రెండు ఏనుగులకు దాహం వేసినట్టుంది. నీటి కోసం వేతికాయి. కాసేపటికి, అడవికి దగ్గరలోని ఒక పార్క్‌లో నీటిని చిమ్ముతున్న స్ప్రింక్లర్ను చూశాయి. అవి రెండూ కూడా నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాయి. అయితే, మొదటి ఏనుగు ఆ స్ప్రింక్లర్ వద్ద నిలబడి తన తొండంతో నీళ్లను తాగి దాహన్ని తీర్చుకుంది. రెండొ ఏనుగు.. ఏమాత్రం తొందర పడకుండా.. తన వంతు కోసం ఓపిగ్గా ఎదురుచూస్తోంది. మొదటి ఏనుగు వెళ్లి పోయాక మెల్లగా.. స్ప్రింక్లర్ వద్ద వెళ్లి అది కూడా కడుపు నిండా నీటిని తాగింది. కాగా, నీటి కోసం ఆరెండు ఏనుగులు ఏమాత్రం పోటీపడలేదు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘మనుషుల కంటె గజరాజులే నయం’, ‘వావ్.. ఏనుగు ఎంత ఓపిగ్గా వేచి చూస్తోంది..’, ‘వాటి క్రమశిక్షణకు హ్యట్సాఫ్..’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, షెల్డ్రిక్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ అనే సంస్థ కెన్యాలోని వన్య ప్రాణుల రక్షణ, ఏనుగుల పునారవాస కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఏనుగుల శరీర ఉష్ణోగ్రత చాలాఎక్కువ. అందుకే, అవి నీటిలో ఏక్కువగా గడపటానికి ఇష్టపడతాయి. అదే విధంగా, ఒక ఏనుగు రోజుకు 50 గ్యాలన్ల వరకు నీటిని తాగుతుంది. Nothing beats…a fresh and cooling drink from the tap (or sprinkler) pic.twitter.com/TBnorTJN8n — Sheldrick Wildlife (@SheldrickTrust) June 27, 2021 -
కెన్యాలో హెలికాప్టర్ కూలి 17 మంది సైనికులు మృతి
నైరోబి: కెన్యాలో ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్ కూలిన ఘటనలో 17 మంది సైనికులు చనిపోయారు. గురువారం ఉదయం 23 మంది సైనికులతో బయలుదేరిన సైనిక హెలికాప్టర్ కజియాడో కౌంటీలోని ఒలె– తెపెసి వద్ద కూలిపోయింది. ఈ ఘటనలో 17 మంది మృత్యువాతపడగా తీవ్రంగా గాయాల పాలైన ఆరుగురిని ఆస్పత్రికి తరలిం చినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. హెలికాప్టర్ కూలిన విషయాన్ని కెన్యా సైన్యం కూడా ధ్రువీకరించింది. వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. -
సింహం దండయాత్ర: దాక్కున్నా వదల్లేదు!
అటవీ ప్రాంతంలో జరుగుతున్న విన్యాసాలు, అద్భుతాలు చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఆహారం కోసం జంతువులు చేసే పోరాటం అబ్బురపరుస్తుంటాయి. తాజాగా ఓ సింహం జూలు విదిల్చి ఏడు గంటల పాటు శ్రమించి చివరకు అడవి పందిని చేజిక్కించుకుని తన బొజ్జ నింపేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. భూమిలో దాగి ఉన్న ఆఫ్రికన్ పందిని వెలికితీసి మరి సింహం చంపి తిన్నది. ఈ వీడియో చూస్తే నిజంగా సింహం సింహామే అని అంటారు. కెన్యా దేశ రాజధాని నైరూబీలోని మసాయి మరా జాతీయ పార్కులో సింహం ఆహారం కోసం వేట సాగిస్తోంది. సాధారణంగా ఆఫ్రికన్ పందులు భూమిలో దాగి ఉంటాయి. బురద ప్రాంతంలో దాగి ఉన్న వాటిని సింహం గుర్తించింది. దీంతో తీవ్ర ఆకలి మీద ఉన్న సింహం గుంత తవ్వడం మొదలుపెట్టింది. మనిషి మాదిరి తవ్వుతూ.. తవ్వుతూ దాదాపు ఏడు గంటలపాటు నిర్విరామంగా తవ్వేసింది. అనంతరం ఆ గుంతలో ఉన్న ఆఫ్రికన్ జాతి పందిని పట్టేసింది. సింహం బారి నుంచి కాపాడేందుకు ఆ పంది ఎంత ప్రయత్నం చేసినా సింహం పట్టు వదలలే. చివరకు పంది ఓడింది.. సింహం గెలిచింది. అడవి రాజు సింహం ఆకలి తీరింది. దీనికి సంబంధించిన వీడియోను సేల్స్ ఇంజనీర్ సుహేబ్ అల్వీ తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. -
‘ఏంటీ.. నైరోబీకి తెలుగు మాట్లాడుతుంది!’
-
తెలుగులో స్పానిష్ నటి... ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
స్పానిష్ టీవీ షో ‘మనీహీస్ట్’ వెబ్‌సీరిస్ 2017 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ వెబ్‌సీరిస్‌లో నైరోబీ పాత్రతో అలరిస్తున్న స్పెయిన్ నటి అల్భాఫ్లోర్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల ఆమె భారతీయ మహిళగా చీర, బొట్టుతో తెలుగులో ఆనర్గళంగా మాట్లాడుతున్న ఓ సన్నివేశం నెట్టింట హల్చల్ చేస్తోంది. స్పానిష్ నటి అయిన అల్భా తెలుగులో స్పష్టంగా మట్లాడటం చూసి నైరోబీకి తెలుగు వచ్చా అని ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కాగా ఈ సన్నివేశం 2013లో ఆమె నటించిన స్పానిష్ చిత్రం ‘విసెంటే ఫెర్రర్’లోనిది. ఇందులో అల్భా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో నివసించే సమీరా అనే స్పానిష్ యువతి పాత్రలో కనిపించారు. (రూట్ మార్చిన ‘కుమారి’) కాగా ఈ సినిమా జెస్యూట్ మిషనరీలో భాగంగా ఇండియాలో మతప్రచారం చేసే అంశంపై తెరకెక్కింది. ఇందులో స్పానిష్ భాషను తెలుగులోకి అనువాదించే పాత్రలో అల్భా కనిపిస్తుంది. ఎప్పుడూ మోడ్రన్ దుస్తుల్లో కనిపించే నైరోబీని ఒక్కసారిగా చీరలో చూసేసరికి ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పైగా ఆమె తెలుగులో మాట్లాడటం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అంతేగాక ఈ వీడియోను ఆదివారం యూట్యూబ్‌లో షేర్ చేయడంతో ఇప్పటి వరకు 7.8 లక్షల పైగా వ్యూస్, 8 వేల లైక్‌లు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. -
కుప్పకూలిన విమానం : 157 మంది మృతి
ఇథియోపియా : అదిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీకి వెళుతున్న ఇథియోపియా ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలింది. ఆదివారం ఉదయం నైరోబీకి బయలుదేరిన ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం మార్గమధ్యంలో ప్రమాదవశాత్తూ కుప్పకూలిందని ఇథియోపియా ప్రధాని కార్యాలయం వెల్లడించింది. విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణీకులకు ఇథియోపియా ప్రధాని కార్యాలయం ప్రభుత్వం, ప్రజల తరపున తీవ్ర సంతాపం తెలుపుతోందని ప్రధాని అబివ్ అహ్మద్ కార్యాలయం ట్వీట్ చేసింది. కాగా, నైరోబీకి వెళుతున్న బోయింగ్ 737 విమానం బిషోపు వద్ద కుప్పకూలిందని, ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 157 మంది ప్రయాణీకులు, సిబ్బంది అందరూ మరణించారని ఇథియోపియా ఎయిర్‌లైన్స్ నిర్ధారించింది. -
ఒక్కడి ఆలోచన.. మృగరాజులకు వణుకు
నైరోబీ: అది ఆఫ్రికన్ దేశం కెన్యాలోని నైరోబీ నేషనల్ పార్క్. ఆధునికతకు.. అటవీక జీవనానికి మధ్యగా నలిగిపోయే కిటెన్‌గెలా అనే ఓ చిన్ని గ్రామం. ఆ మధ్యలో ఓ చిన్న నదీపాయ. దీంతో పక్కనే ఉన్న సఫారీ నుంచి జంతువులు తరచూ ఆ గ్రామాన్ని ఆనుకుని ఉన్న పచ్చిక బయళ్లకు వస్తుంటాయి. వాటిల్లో ఆవుల మందను వేటాడే సింహాలు కూడా ఉంటాయి. కానీ, అక్కడి ప్రజల విన్నూత ఆలోచనకు మృగరాజులు తోకి ముడిచి వెనక్కి చిత్తగిస్తుంటాయి. ఆ ఆలోచన వెనుక ఉన్న బుర్ర మాత్రం రిచర్డ్ టురెరె(18) కుర్ర కాపరిది. సూటిగా కథలోకి వెళ్తే... మాసయి తెగకు చెందిన రిచర్డ్ 9 ఏళ్ల వయసులో చదువుకు పుల్‌స్టాప్ పెట్టి తండ్రికి తోడుగా పశువులను మేపటం ప్రారంభించాడు. తన కళ్ల ముందే ఆవులను సింహాలు కబళిస్తున్న ఉదంతాలు అతనిలో భయాన్ని పొగొట్టేవి. ఇదిలా ఉంటే రిచర్డ్ 11 ఏట.. తమ మందలోని 9 ఆవులను వారం రోజుల్లో సింహాల మంద పొట్టనబెట్టుకున్నాయి. ఆర్థికంగా తీరని నష్టం కలగటంతో తల్లి కుంగిపోగా.. తన బుర్రకు పదును పెట్టడం రిచర్డ్ ఆరంభించాడు. సింహాలను తరిమేందుకు భయంకరంగా ఉన్న కాకి బొమ్మను తన వెంట తీసుకెళ్లేవాడు. కానీ, ఆ ఐడియా వర్కవుట్ కాలేదు. ఇదిలా ఉంటే ఓ రోజు రాత్రి టార్చ్ లైట్‌తో వెళ్తున్న సమయంలో సింహాలు ఎలాంటి దాడులకు పాల్పడపోగా.. ఆ వెలుతురికి భయంతో పరుగులు తీశాయి. అంతే వెంటనే అతని మెదడులో ఓ ఆలోచన మెరిసింది. తన తల్లి అపురూపంగా చూసుకునే రేడియోను బద్ధలు కొట్టి.. ఓ ఎల్ఈడీ బల్బు సాయంతో లైటింగ్ వ్యవస్థను రూపొందించాడు. సింహాలు దాడులకు వచ్చిన సమయంలో వాటిని వెలిగిలించటం.. అవి భయంతో పరుగులు తీయటం... మొత్తానికి ఈ ఐడియా బాగా వర్కవుట్ అయ్యింది. నాలుగేళ్ల తర్వాత అతని పరిశోధనకు పెటెంట్ హక్కులు దక్కాయి. కెన్యాలో యంగెస్ట్ పెటెంట్‌గా రిచర్డ్‌గా గుర్తింపు దక్కింది. అంతేకాదు 2013లో కాలిఫోర్నియాలో జరిగిన టెడ్ సదస్సులో ‘అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా’ లాంటి దిగ్గజాల మధ్య ప్రసంగించే అవకాశం రిచర్డ్‌కు లభించింది. దీంతోపాటే బ్రూక్ హౌస్ స్కూల్ అతనికి స్కాలర్షిప్ కూడా ఇచ్చింది. అయితే లయన్ లైట్స్ పెటెంట్ ఉన్నప్పటికీ.. ఆ ఆలోచన చుట్టుపక్కల పాకటంతో మరికొందరు ఇదే పద్ధతిని అవలంభించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా రిచర్డ్‌ను పట్టించుకోవటం మానేశాయి. దీంతో అతని జీవితం మళ్లీ వెనక్కి వచ్చేసింది. ప్రస్తుతం అతని వయసు 18 ఏళ్లు. పశువులను మేపుకుంటూనే జీవనం కొనసాగిస్తున్నాడు. అలాగని ప్రయోగాలకు అతను దూరం కాలేదు. ప్రస్తుతం ఏనుగులకు సంబంధించిన ఓ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడంట. ‘లయన్ లైట్స్ 2.0’ వ్యవస్థను ఇన్స్టాల్ చేయటానికి ఖరీదు రెండు వందల డాలర్లు ఖర్చు అవుతుంది. ఇందులో సగం ఓ ఎన్డీవో సంస్థ అందిస్తుండగా.. ఇంకా సగం కాపరులే భరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 750 లయన్ లైట్ సిస్టమ్‌లు ఆ ఊరు చుట్టు పక్కల ఉన్నాయి. అయితే ఇంకా ఎక్కువ సంఖ్యలో వాటి అవసరం ఉందని రిచర్డ్ అంటున్నాడు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సాయం చేయాలని చాలా కాలం నుంచే అతను విజ్ఞప్తి చేస్తున్నాడు. తన కొడుకు కంటే మేధావులు ఈ దేశంలో ఎందో ఉన్నారని, ప్రభుత్వాలు సరైన తోడ్పాటు-ప్రోత్సాహం అందిస్తే వారంతా అద్భుతాలు సృష్టిస్తారని రిచర్డ్ తల్లి వెరోనికచ్ చెబుతున్నారు. -
స్కూల్లో ఘోర అగ్నిప్రమాదం
నైరోబీ: కెన్యా రాజధాని నైరోబీలోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు బాలికలు చనిపోయారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రముఖమైన మోయి గర్ల్స్ హైస్కూల్లో సుమారు వెయ్యి మంది చదువుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఏడుగురు విద్యార్థినులు అక్కడికక్కడే చనిపోగా పది మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నందున రెండు వారాల పాటు అధికారులు సెలవులు ప్రకటించారు. 2016లో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు మూడు నెలల పాటు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు వంద స్కూళ్లపై దాడులు జరిపారు. అలాంటి కోవలేనిదే ఈ తాజా ఘటనా అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగుతోంది. అప్పట్లో ఇందుకు సంబంధించి 150 మంది విద్యార్థులతోపాటు 10 ఉపాధ్యాయులను నిందితులుగా గుర్తించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని దేశ అంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. -
‘ఐరాస నివాసాలకు’ భారత్ నేతృత్వం
పాలక మండలికి వెంకయ్య సారథ్యం సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సుస్థిర మానవ నివాసాల ఏర్పాటును ప్రోత్సహించే ఐక్య రాజ్యసమితి విభాగమైన యూఎన్–హాబిటాట్‌కు భారత్ రెండేళ్లపాటు నేతృత్వం వహించనుంది. కెన్యాలోని నైరోబీలో సోమవారం ప్రారంభమైన ఈ సంస్థ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అధ్యక్ష స్థానానికి భారత్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ‘నూతన పట్టణ ఎజెండా – సమర్థవంతమైన అమలుకు అవకాశాలు’ అనే అంశంపై ఈ పాలక మండలి సమావేశం జరుగుతోంది. నైరోబీలో జరుగుతున్న ఈ సమావేశాలకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్య నాయు డు నేతృత్వం వహించారు. రెండేళ్లపాటు ఈ సంస్థ చర్చలకు వెంకయ్యే నాయకత్వం వహిస్తారు. ‘సరికొత్త పట్టణ భవిష్యత్తుపై పనిచేసేందుకు దీన్ని అవకాశంగా భావిస్తున్నా’ అని వెంకయ్య ట్వీట్ చేశారు. యూఎన్–హాబిటాట్‌కు భారత్ నేతృత్వం వహించడం ఇది మూడోసారి. -
కేరింతలతో అంత్యక్రియలు..
చితికి నిప్పుపెట్టే సందర్భంలో ఎవరైనా హర్షధ్వానాలు చేస్తారా? కణకణమండే ఆ నిప్పుల్ని చూసి కిలకిలా నవ్వుతారా? చచ్చింది ఏ విలనో, విలనిజం తాలూకు గుర్తులో అయితే జనం అలా చేయడంలో తప్పేముంటుంది? తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో అదే జరిగింది. ఉగ్రవాదులు, సంఘవిద్రోహక శక్తుల నుంచి ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున్న 5,250 అక్రమ ఆయుధాలను 15 అడుగుల ఎత్తులో వరుసగా ఏర్పాటుచేసిన దండాలకు కు చితిలా పేర్చి పెట్రోల్ కుమ్మరించి నిలువునా దహనం చేశారు. వందలాది మంది జనం కేరింతల మధ్య గత వారం నైరోబీలో కెన్యా ఉపాధ్యక్షుడు విలియం రూటో తుపాకులకు నిప్పుపెట్టారు. అగ్నికి ఆహుతైన తుపాకుల్లో అధికశాతం ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చినవేనని, ఇంకోన్ని ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నవని ఉపాధ్యక్షుడు చెప్పారు. తుపాకులను పేర్చి దహనం చేసిన దృశ్యాలను విలియం తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. సోమాలియాలో విధ్వంసం సృష్టిస్తోన్న అల్-షబీబ్ ఉగ్రవాద సంస్థ కెన్యాలోనూ కాలు మోపే ప్రయత్నం చేస్తున్నదని, ఆ క్రమంలో పెద్ద ఎత్తున అక్రమ ఆయుధాలను సరఫరా చేస్తున్నదన్న విలియం..ఇకపై అలాంటిచర్యలను ఉపేక్షించబోమని ఉగ్రవాదులను హెచ్చరించారు. ఇప్పుడు కాల్చేసినవి కాకుండా కెన్యాలో మరో 5 లక్షల అక్రమ ఆయుధాలు ఉన్నట్లు, అతి త్వరలోనే వాటిని కూడా స్వాధీనం చేసుకుని తగలబెడతామని ఆయన అన్నారు. -
కెన్యా సంస్థలతో అపోలో ఒప్పందం...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వైద్య రంగ సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కెన్యాలోని నైరోబీలో రెండు సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకుంది. కెన్యాట్ట నేషనల్ హాస్పిటల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం కెన్యా వైద్య రంగంలో సామ ర్థ్య పెంపుకు అపోలో సహకారం అందిస్తుంది. కెన్యా వైద్యులు, సిబ్బందికి భారత్‌లోని అపోలో ఆసుపత్రుల్లో శిక్షణ ఇస్తారు. అలాగే మరో ఎంవోయూలో భాగంగా టెలికం సంస్థ ఎయిర్టెల్ ఆఫ్రికా ‘ఆస్క్-అపోలో’ సేవలను ప్రారంభిస్తుంది. దీని ప్రకారం ఎయిర్టెల్ ఆఫ్రికా చందాదారులు ఫోన్, ఈ-మెయిల్ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపోలో వైద్యులను సంప్రదించొచ్చు. సేవలు వినియోగించుకున్నవారు ఎయిర్టెల్ మనీ లేదా ఎయిర్టైం ద్వారా ఫీజు చెల్లించొచ్చు. కన్సల్టేషన్ ఫీజులో డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ కెన్యా పర్యటనలో భాగంగా ఈ ఒప్పందాలు జరిగాయి. -
'విద్వేష ప్రబోధకులతో సమాజానికి ముప్పు'
నైరోబి: ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ముద్రల ప్రపంచమంతా విస్తరిస్తున్న నేపథ్యంలో కెన్యా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. హింస, విద్వేష ప్రబోధకులు సమాజ సమగ్రతకు ముప్పుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉగ్రవాద భావజాలాన్ని ఎదుర్కొనేందుకు యువత సానుకూల భావజాలాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఢాకా ఉగ్రవాద పేలుళ్లకు కారణమయ్యారంటూ వివాదాస్పద ముస్లిం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నైరుబీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఆర్థిక పురోగతి ఫలాలు ప్రజలకు అందాలంటే సమాజ భద్రత అత్యంత కీలకమని నొక్కి చెప్పారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, ఉగ్రవాదులను రాజకీయ సాధనంగా వాడుకోవడాన్ని కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాద భావజాల నిరోధానికి కావాల్సిన సానుకూల భావజాలం పెంపొందించడంలో యువత కీలకపాత్ర పోషించాల్సిన అవసరముందని చెప్పారు. -
కెన్యాలో మోదీ పర్యటన
-
చచ్చేలా బూటు కాలుతో తొక్కుతూ..
నైరోబీ: కెన్యాలో తలెత్తిన ఆందోళన విధ్వంసకరంగా మారింది. వచ్చే ఏడాదిలో ఎన్నికల జరగనున్న నేపథ్యం జరిగిన ఈ ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పోలీసులు ఉద్యమకారులపై చూపించిన ప్రతాపం అంతా ఇంత కాదు. ఓ నిరసన కారుడిని అందరూ చూస్తుండగా కిందపడేసి అతి కిరాతకంగా పోలీసులే స్వయంగా చితక్కొట్టి తీవ్రంగా పదేపదే బూటుకాలితో తొక్కడంతో అతడు ఆస్పత్రిలో చేరిన కొద్ది సేపటికే కన్నుమూశాడు. ఈ వీడియో ఫొటోలు ఇప్పుడు వెలుగులోకి రావడంతో ప్రపంచమంతా దాన్ని చూసి విస్తు పోయింది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ఓ అంశంపై ఆందోళన ప్రారంభమైంది. భారీ ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి రావడంతో పోలీసులు వారిపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు పోలీసుల బూటుకాళ్లకిందపడి నలిగిపోయాడు. -
పార్క్ నుంచి సింహాల ఎస్కేప్
నైరోబీ: పార్క్ నుంచి సింహాలు తప్పించుకోవడం కెన్యా రాజధాని నైరోబీలో కలకలం సృష్టించింది. నేషనల్ పార్క్ నుంచి తప్పించుకున్న సింహాలు జనావాసంలోకి రావచ్చనే సమాచారంతో నైరోబీలో అలర్ట్ విధించారు. అయితే మొత్తం ఎన్ని సింహాలు బయటికి వెళ్లాయో స్పష్టమైన సమాచారం లేదు. ఇప్పటి వరకు ఒక ఆడ సింహాన్ని, రెండు సింహం పిల్లల్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మరో రెండు సింహాలు తిరిగి నైరోబీ నేషనల్ పార్క్‌లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ ఆ సింహాలు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని ఫారెస్ట్ అధికారలు తెలిపారు. ప్రజలెవ్వరూ బయటకు వెళ్లరాదని నైరోబీ వాసులను కోరారు. 2012లోనూ ఓసారి ఆడ సింహం పిల్లల్ని పార్క్‌లో వదిలి వెళ్లింది. అయితే అప్పట్లో ఆ ఆడ సింహాన్ని స్థానికులు చంపేశారు. అలాంటి ఘటన మళ్లీ జరగకుండా చూడాలని జూ అధికారులు స్థానికులను హెచ్చరించారు. -
డబ్ల్యూటీఓ సదస్సులో ఏకాభిప్రాయం కరవు
నైరోబి: ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రుల స్థాయి సదస్సు చివరి రోజు శుక్రవారం సుదీర్ఘంగా సాగిన చర్చల్లో.. వ్యవసాయానికి సంబంధించిన ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కరవైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలకు భద్రత కల్పించకుండా.. వ్యవసాయ ఎగుమతుల రాయితీలను తొలగించే ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. అమెరికా సహా సంపన్న దేశాల అభిప్రాయాలతో భారత్, చైనాల సారథ్యంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు విభేదించటంతో.. నాలుగు రోజుల సదస్సులో ఎటువంటి ఫలితమూ రాలేదు. ముందుగా.. దాదాపు 14 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న దోహా అజెండాను పూర్తిచేయాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు పట్టుపట్టడంతో నైరోబీలో జరుగుతున్న సమావేశాన్ని మరో రోజు పొడిగించారు. -
నైరోబీలో ఆడిపాడనున్న బాలీవుడ్ భామ
నైరోబీ: బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్, ప్రముఖ సింగర్ షాన్ కెన్యా రాజధాని నైరోబీలో ఆడిపాడి అలరించబోతున్నారు. మ్యూజికల్ టూర్లో భాగంగా వారిద్దరు నైరోబీ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 5న నైరోబీలోని కార్నివోర్ గ్రౌండ్స్‌లో వారు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అల్లాఫ్రికా డాట్ కామ్ అనే సంస్థ తెలిపింది. ఇటీవల కాలంలో కాస్త సినిమాల వేగం తగ్గించిన ఈ నాయకి గత వారంలో ప్రముఖ దర్శకుడు, గాయకుడు ఫరాహ్ అక్తర్‌తో కలిసి నైరోబీలోనే పార్క్‌లాండ్ స్పోర్ట్స్ క్లబ్ వద్ద ఓ మ్యూజికల్ షోను నిర్వహించిన విషయం తెలిసిందే. మరోపక్క ఆగస్టు 29, 30లో జరిగే కెన్యా వరల్డ్ వైడ్ ఫ్యాషన్ ఫియెస్టా 2015 కార్యక్రమంలో కూడా సన్నీ ప్రముఖ గాయని సోను శర్మతో కలిసి పాల్గొననుంది. -
కెన్యాలో కుప్పకూలిన భవనం
-
రాతి గనుల్లో కాల్పులు:36 మంది మృతి
నైరోబి: కెన్యాలోని మందేరా పట్టణం మంగళవారం రక్తసిక్తమయ్యింది. రాతి గనుల్లోకి ప్రవేశించిన ఓ ఆగంతకుడు తన వద్ద నున్నతుపాకీతో కార్మికులపై అతి కిరాతంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో 36 మంది కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. గనుల్లో కార్మికులు పని చేస్తున్న సమయంలో అక్కడికి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి పాశవికంగా కాల్పులు జరిపినట్లు బాధితులు స్పష్టం చేశారు. తమను ముస్లింలు, ముస్లిమేతరులుగా విడిగొట్టి కాల్పులు జరిపినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నైరోబీ పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే తరహా ఘటనలో దేశంలో పేట్రేగి పోవడంతో పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 22 వ తేదీన ఒక బస్సు నైరోబికి వెళుతున్న సమయంలో హైజాక్ చేసి 28 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. -
కెన్యా వన విహారం
అరణ్యాలూ, పర్వతాలూ, వన్యమృగాలకి ఆలవాలం కెన్యా. ఆ అరణ్యాలనీ, ఆ అరణ్యాలలో తమ సహజ పరిసరాలలో విహరించే వన్యమృగాలనీ సందర్శించాలని ఆఫ్రికాలోని కెన్యా యాత్రకి బయలుదేరాం. గున్న ఏనుగులకు అనాథాశ్రమం.. ముంబయి నుండి ఆరు గంటల విమానయానం తరువాత కెన్యా రాజధాని నైరోబీలో దిగాం. టూర్ ఆపరేటర్ పంపిన వాహనంలో హోటల్‌కి చేరి, అటు నుంచి విహారానికి బయల్దేరాం. నైరోబీలో తల్లికి దూరమయిన బుల్లి ఏనుగు పిల్లల కోసం ఒక అనాథ శరణాలయం ఉంది. తల్లి లేని ఏనుగు పిల్లల్ని ఇక్కడ కనీసం రెండేళ్ల వయసు నిండే వరకూ పెంచుతారు. ఇక్కడ ఏనుగు పిల్లలు, రెండు సంవత్సరాలు నిండే వరకూ తల్లి సంరక్షణలో లేకపోతే అవి చనిపోతాయి అని వాటి సంరక్షకుడు చెప్పాడు. ఏనుగు పిల్లలకి పాలు పట్టి పెంచుతారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకూ ఏనుగులకి పాలు పట్టడం, వాటి ఆటలు సందర్శకుల కోసం ప్రదర్శనగా ఉంచుతారు. జిరాఫీలకి ‘ఆం..’ తినిపించాం... నైరోబీలో చూసిన మరో ప్రదేశం- జిరాఫీ సెంటర్. ఇక్కడ జిరాఫీలు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. మనం వాటి నోటికి ఆహారం అందిచాలి. అంత పొడవుగా సాగిన మెడ పైన ఉన్న నోటికి ఆహారం అందించాలంటే, మనం మెట్లెక్కి మొదటి అంతస్తులో నిలబడాలి. మొక్కజొన్న, గోధుమలతో తయారయిన సుద్ద ముక్కల్లాంటి వాటిని నిర్వాహకులు మనకి ఇస్తారు. వాటిని ఒక్కొక్కటీ మనం అందిస్తోంటే,మెడలాగానే, బాగా పొడుగ్గా ఉన్న నాలుకని ముందుకు చాపి అందుకుని, ఆనందంగా ఆరగిస్తాయి ఆ జిరాఫీలు. వన్య మృగాలకూ ఆలవాలం.. ఆ రాత్రి నైరోబీలో విశ్రమించి, ఉదయాన్నే మాసైమారాకి బయలు దేరాం. ఈ ప్రాంతాన్ని మైసైమరా గీకు రిజర్వ్ అంటారు. దీని వైశాల్యం దాదాపు 1500 చ.కి.మీ. ఇది టాంజానియాలోని సెరంగిటీ నేషనల్ పార్కుతో కలిసి ఉంటుంది. ఈ గ్రీకు రిజర్వ్ వన్యమృగాలకి ఆలవాలం. జూలై - అక్టోబర్ నెలల్లో దాదాపు 1.5 మిలియన్ల శాకాహార వన్యమృగాలు టాంజానియా నుండి ఇక్కడికి వలస వస్తాయి. దాన్నే ‘గ్రేట్ మైగ్రేషన్’ అంటారు. మా వాహనదారుడు మమ్మల్ని ‘గ్రీకు డ్రైవ్’కి తీసుకువెళ్ళాడు. వాహనంలో కూర్చుని, వనమంతా తిరుగుతూ వివిధ మృగాలని వెతుకుతూ చూస్తూ, ఆనందించడమే ‘గ్రీకు డ్రైవ్’. వాహనం పై భాగాన్ని తెరుస్తారు. మనం నిలబడి ఆరుబయట ఉన్నట్లుగా మృగాలని చూస్తాం. పదుల సంఖ్యలో ఏనుగులు, వందల సంఖ్యలో జీబ్రాలు, జిరాఫీలూ, వేల సంఖ్యలో వివిధ రకాల జింకలూ ఇలపాలాలూ, గొర్రెలూ దర్శనమిచ్చా యి. టీవీలో చూసే నేషనల్ జియోగ్రఫీ చానెల్ని కళ్ళారా చూసినట్లుంది. లేక్ ఎలిమెంటైటా... రెండు రోజుల అనుభావాన్ని మూటకట్టుకుని మాసైమరాకి వీడ్కోలు పలికి లేక్ ఎలిమెంటైటాకి బయలుదేరాం. దారిలో 139 చ.కీ.మీ. వైశాల్యం ఉన్న నైవేష సరస్సులో నౌకా విహారం, నీటిలో ఉన్న హిప్పోపొటమస్ల పక్క నుండీ వెళ్తూ, మధ్యలో ద్వీపాల మీద ఉన్న జంతువులని పక్షులనీ చూసుకుంటూ.. ఆ విహారం కేరళలోని ‘చోక్వాటర్స్’ లో బోట్ ప్రయాణాన్ని తలపించింది. - మరో మజిలి - అబర్డారీ. ఇక్కడ మేం బస చేసిన రిసార్ట్‌లో ఏనుగులూ, ఇతర జంతువులూ నీళ్ళు తాగడానికి వచ్చేలా, వాటిని దగ్గర్నుండి చూసేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. భూమధ్యరేఖ... ఈ ప్రయాణంలో ‘నాన్యుకి’ అనే ప్రాంతం దగ్గర ‘భూమధ్యరేఖ’ మమ్మల్ని ఆకర్షించింది. ఆ రేఖా ప్రాంతం మీద నిలబడడం ఒక అనుభూతి. భూమధ్యరేఖకి ఉత్తరాన దక్షిణాన నీరు సుడి తిరిగే దశలు వేరుగా ఉంటాయి. ఉత్తరాన నీరు కుడి పక్కకి సుడి తిరుగుతుంది. దక్షిణాన నిలబడితే అదేనీరు ఎడమవైపుకి సుడి తిరుగుతుంది. భూమధ్యరేఖ మీద ఉంటే మాత్రం ఎటూ సుడి తిరగదు. ఈ అంశాన్ని అక్కడ ఉన్న వ్యక్తి ఒక చిల్లు గిన్నెలో నీటిని పోసి, అందులో ఒక అగ్గిపుల్ల వేసి చూపించాడు. నల్లవారు ‘నల్ల’ వారు... కెన్యాలో ఉన్న ఆరురోజుల్లో ఎందరో నల్ల వారిని కలిశాం. సభ్యత, సంస్కారం, మర్యాదతో మెలిగారు. మేము శాకాహారులం.. అందుకు అనుగుణంగా ప్రతి హోటల్లో మమ్మల్ని ఎంతగానో అందరించారు. అసలు వారి వంటల్లో భారతీయుల వంటకాల పేర్లే ఎక్కువ, నన్ను సంబోధించాల్సి వస్తే, మామ (అమ్మ) అనేవారు. అది మన పద్ధతే కదా! క్రాహేరి కెన్యా: యాత్ర ముగించుకుని నైరోబీ ఏర్పోర్టుకి చేరి, క్రాహేరి కెన్యా (గుడ్‌బై) అని చెప్పి విమానంలో ‘జాంచో’ (హెలో) అని మాట్లాడుతున్న ఎయిర్‌హోస్టెస్ మాటలు వింటూ తిరుగుప్రయాణమయ్యాం. - డా॥గాయత్రీదేవి, ఆయుర్వేద వైద్యులు, హైదరాబాద్