చిత్తూరు జిల్లాకు చెందిన గజేంద్రరెడ్డి కెన్యాలోని నైరోబిలో మరణించారు. తొలుత ఆయన ఎబోలాతో మరణించినట్లు కథనాలు వచ్చినా.. ఆయన న్యుమోనియాతో ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు.
చిత్తూరు జిల్లాకు చెందిన గజేంద్రరెడ్డి కెన్యాలోని నైరోబిలో మరణించారు. తొలుత ఆయన ఎబోలాతో మరణించినట్లు కథనాలు వచ్చినా.. ఆయన న్యుమోనియాతో ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. ఈనెల నాలుగో తేదీన ఆయన జ్వరంతో నైరోబీలోని ఆగాఖాన్ ఆస్పత్రిలో చేరారు.
14వ తేదీ నుంచి కోమాలోకి వెళ్లి, 18న మృతి చెందారు. ఈ ఉదయం 10 గంటలకు గజేంద్రరెడ్డి భార్య, కుమార్తె బెంగళూరుకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గజేంద్రరెడ్డి మృతికి కెన్యా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు కె.సుజాత, కె.వి.కిరణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిత్తూరు జిల్లా పూతలపట్లు మండలం చిటిపిరాళ్ల ప్రాంతానికి చెందిన వారని గుర్తించారు.