కెన్యా సంస్థలతో అపోలో ఒప్పందం...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వైద్య రంగ సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కెన్యాలోని నైరోబీలో రెండు సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకుంది. కెన్యాట్ట నేషనల్ హాస్పిటల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం కెన్యా వైద్య రంగంలో సామ ర్థ్య పెంపుకు అపోలో సహకారం అందిస్తుంది. కెన్యా వైద్యులు, సిబ్బందికి భారత్‌లోని అపోలో ఆసుపత్రుల్లో శిక్షణ ఇస్తారు. అలాగే మరో ఎంవోయూలో భాగంగా టెలికం సంస్థ ఎయిర్‌టెల్ ఆఫ్రికా ‘ఆస్క్-అపోలో’ సేవలను ప్రారంభిస్తుంది. దీని ప్రకారం ఎయిర్‌టెల్ ఆఫ్రికా చందాదారులు ఫోన్, ఈ-మెయిల్ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపోలో వైద్యులను సంప్రదించొచ్చు. సేవలు వినియోగించుకున్నవారు ఎయిర్‌టెల్ మనీ లేదా ఎయిర్‌టైం ద్వారా ఫీజు చెల్లించొచ్చు. కన్సల్టేషన్ ఫీజులో డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ కెన్యా పర్యటనలో భాగంగా ఈ ఒప్పందాలు జరిగాయి.