కెన్యా రాజధాని నైరోబీలో గురువారం రాత్రి భారీ పేలుడు జరిగింది. గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. మరో 300 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నైరోబీలోని ఎంబాకాసిలోని స్కైలైన్ ఎస్టేట్ సమీపంలోని కంటైనర్ కంపెనీలో పేలుడు జరిగినట్లు కెన్యా రెడ్‌క్రాస్ వెల్లడించింది. ఆ ప్రాంతం మొత్తం మంటల్లో చిక్కుకొని చుట్టుపక్కల ప్రదేశాలకు వ్యాపించినట్లు తెలిపింది.
News: Gas explosion in Nairobi, Kenya. Casualties undisclosed yet. The image is terrifying. pic.twitter.com/dFPYinmw3E
— Olu 🕊️ (@empror24) February 2, 2024
ఒక్కసారిగా పేలుళ్ల శబ్ధం రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రమాదం తీవ్రతకు కంపెనీకి చెందిన రెండు భవనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. అనేక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లకు మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న వాహనాలు, వ్యాపార సముదాయాలు, ఇళ్లు కాలిబూడిదయ్యాయి.
Nairobi, Kenya - Massive explosion. Death toll could be huge as hundreds in the building 🇰🇪 pic.twitter.com/lULFLJI2HU
— 🇬🇧RonEnglish🇬🇧🏴 (@RonEng1ish) February 2, 2024
పెద్ద సంఖ్యలో ప్రజలు పరిసర భవనాల్లో చిక్కుకుపోయారని అక్కడి అధికారులు తెలిపారు ఈ క్రమంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రిల్లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment