red cross
-
కెన్యాలో భారీ పేలుడు: ఇద్దరు మృతి, 300 మందికి గాయాలు
కెన్యా రాజధాని నైరోబీలో గురువారం రాత్రి భారీ పేలుడు జరిగింది. గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. మరో 300 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నైరోబీలోని ఎంబాకాసిలోని స్కైలైన్ ఎస్టేట్ సమీపంలోని కంటైనర్ కంపెనీలో పేలుడు జరిగినట్లు కెన్యా రెడ్‌క్రాస్ వెల్లడించింది. ఆ ప్రాంతం మొత్తం మంటల్లో చిక్కుకొని చుట్టుపక్కల ప్రదేశాలకు వ్యాపించినట్లు తెలిపింది. News: Gas explosion in Nairobi, Kenya. Casualties undisclosed yet. The image is terrifying. pic.twitter.com/dFPYinmw3E — Olu 🕊️ (@empror24) February 2, 2024 ఒక్కసారిగా పేలుళ్ల శబ్ధం రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రమాదం తీవ్రతకు కంపెనీకి చెందిన రెండు భవనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. అనేక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లకు మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న వాహనాలు, వ్యాపార సముదాయాలు, ఇళ్లు కాలిబూడిదయ్యాయి. Nairobi, Kenya - Massive explosion. Death toll could be huge as hundreds in the building 🇰🇪 pic.twitter.com/lULFLJI2HU — 🇬🇧RonEnglish🇬🇧🏴 (@RonEng1ish) February 2, 2024 పెద్ద సంఖ్యలో ప్రజలు పరిసర భవనాల్లో చిక్కుకుపోయారని అక్కడి అధికారులు తెలిపారు ఈ క్రమంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రిల్లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
Chetana Parikh: రక్తదాతకు వందనం
ఇన్ని కోట్ల మంది ఉన్న మనదేశంలో 100 సార్లు రక్తదానం చేసినవారు కేవలం 125 మంది ఉన్నారు. వీరిలో స్త్రీలు ఇద్దరే ఉండగా మూడవ వ్యక్తిగా అహ్మదాబాద్‌కు చెందిన చేతన పారిఖ్ నిలిచింది. అక్టోబర్ 1న వందోసారి రక్తదానం చేయడం ద్వారా ఆమె ఈ ఘనత సొంతం చేసుకుంది. రక్తదాన అవసరాన్ని ప్రచారం చేయడమే కాక అనితరసాధ్యంగా పాటిస్తున్న చేతన పరిచయం. అక్టోబర్ 1, ఆదివారం, అహ్మదాబాద్‌లోని జె.ఎల్.ఠాకూర్ రెడ్‌క్రాస్ భవన్. ‘నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే’ సందర్భంగా రెడ్‌క్రాస్ సంస్థ నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. అందరూ 58 ఏళ్ల చేతన పారిఖ్ కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపటికి ఆమె వచ్చింది. రక్తం ఇవ్వడానికి అలవాటుగా చేతిని ముందుకు సాచింది. మెడికల్ స్టాఫ్ ఆమె చేతిలో సూది గుచ్చారు. ఆమె ఒంటి నుంచి రక్తం సాచెట్ వైపు ప్రవహించసాగింది. అంతే. అందరూ చప్పట్లు హోరెత్తించారు. ఎందుకంటే ఆ రోజుతో ఆమె అలా రక్తాన్ని ఇవ్వడం వందోసారి. మన దేశంలో దశాబ్దాలుగా రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల్లో ఇప్పటి వరకు కేవలం ఇద్దరు స్త్రీలే నూరుసార్లు రక్తం ఇచ్చారు. చేతన పారిఖ్ మూడో వ్యక్తి. కాలేజీ రోజుల నుంచి అమ్మమ్మ వయసు వరకూ ఆమె ఎప్పుడూ రక్తదానం చేస్తూనే ఉంది. ఇక మీదట కూడా చేస్తూనే ఉంటాను అంటోంది. 1985లో మొదటిసారి చేతన పారిఖ్ అహ్మదాబాద్‌లోనే పుట్టి పెరిగింది. నగరంలోని కలుపూర్ కాలేజీలో చదువుకుంది. ‘అది 1985వ సంవత్సరం. మా కాలేజీకి రెడ్ క్రాస్ వాళ్లు వచ్చి రక్తం ఇమ్మని అభ్యర్థించారు. అప్పటికి రక్తదాన ఉద్యమం ఊపందుకోలేదు. చాలా అపోహలు ఉండేవి. కొద్దిమంది అబ్బాయిలు ముందుకొచ్చారు. నేను, ఇంకో అమ్మాయి మాత్రమే రక్తం ఇచ్చాం. మా ఇంటిలో ఇది తెలిసి చాలా ఆందోళన చెందారు. రక్తం ఇవ్వడం వల్ల శరీరానికి నష్టం అనుకునేవారు ఆ రోజుల్లో. కాని రక్తం అందక చాలా మంది మరణిస్తున్నారని అప్పటికే నాకు తెలుసు. ఇది చేయదగ్గ మంచి పని అనిపించింది. అప్పటి నుంచి రక్తం ఇస్తూనే ఉన్నాను’ అంటుంది చేతన పారిఖ్. కుటుంబంతో ఉద్యమం చేతన భర్త వినిత్ పారిఖ్ సాదాసీదా డాక్టర్. పెళ్లయ్యాక చేతన తన భర్తను రక్తదానం వైపు ప్రోత్సహించింది. ఒక డాక్టర్‌గా రక్తదానం ఎంత అవసరమో తెలియడం వల్ల వినిత్ కూడా భార్య నుంచి స్ఫూర్తి పొందాడు. ఇద్దరూ కలిసి రెడ్ క్రాస్‌లో చేరారు. ఒకరికి చెప్పడమే కాదు తాము క్రమం తప్పకుండా రక్తదానం ఇస్తూ స్ఫూర్తిగా నిలిచారు. ‘నా భర్త వినిత్ నా కంటే ముందే నూరుసార్లు రక్తం ఇచ్చినవాళ్ల లిస్ట్‌లోకి ఎక్కారు. నేను తాజాగా ఆ లిస్ట్‌లో చేరాను. మనం చేసి చూపిస్తే మిగిలినవారు అందుకుంటారు. నా కొడుకు హన్షిల్, నా కుమార్తె మేహ ఇద్దరూ డాక్టర్లే. వారు కూడా మాతో కలిసి రక్తదానం చేస్తూనే ఉంటారు. ఇద్దరూ ఇప్పటికి చెరో ముప్పైసార్లు రక్తం ఇచ్చారు. ఇలా మా కుటుంబంలోని నలుగురు సభ్యులం కలిసి మొత్తం 260 సార్లు రక్తం ఇచ్చాం. ఇన్నిసార్లు ఇచ్చిన మరో కుటుంబం లేదేమో మన దేశంలో’ అంటుంది చేతన. పెళ్లిలో వినూత్నం చేతన రక్తదానం కోసం ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకుంటుంది. కూతురు పెళ్లిలో ఆమె రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం విశేషం. అందులో పెళ్లికొడుకు స్వయంగా రక్తం ఇచ్చాడు. పెళ్లికి వచ్చిన బంధుజనుల్లో చాలామంది రక్తం ఇవ్వగా 58 యూనిట్ల సేకరణ జరిగింది. ‘రక్తం విలువ సరిగ్గా అది అవసరమైనప్పుడు తెలుస్తుంది. రక్తం ల్యాబ్‌లో తయారు కాదు. మనిషే ఇవ్వాలి. అందుకు మానవత్వం ఉండాలి. మన మానవత్వం నిరూపించుకోవడానికి రక్తదానానికి మించిన మార్గం లేదు’ అంటుంది చేతన. ఒక గృహిణిగా ఉంటూనే ఆమె చేస్తున్న ఈ విశిష్ట ప్రచారం, సేవ ఒక్కరికైనా స్ఫూర్తి కలిగిస్తే అంతే చాలు. -
Libya Floods: లిబియాలో ఊహకందని మహా విషాదం
డెర్నా: అస్థిర ప్రభుత్వాలు, సంక్షోభం, ఎవరికీ పట్టని ప్రజా సంక్షేమంతో సమస్యల వలయంలో చిక్కిన లిబియాపై ప్రకృతి కత్తి గట్టింది. ఊహించని వరదలు, వరద నీటి ధాటికి పేకమేడల్లా కుప్పకూలిన రెండు డ్యామ్‌లు.. వరద విలయాన్ని మరింత పెంచాయి. డ్యామ్‌ల నుంచి దూసుకొచ్చిన నీటిలో కొట్టుకుపోయి జలసమాధి అయిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం నాటి గణాంకాల ప్రకారం డెర్నా సిటీలో వరద మృతుల సంఖ్య ఏకంగా 5,100 దాటింది. ఇంకా వేలాది మంది జాడ గల్లంతయిందన్న కథనాలు చూస్తుంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వరద ఉధృతికి ఇళ్లుసహా సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారు వేలాదిగా ఉన్నారు. డెర్నా సిటీ తీరప్రాంతంలోని పర్వతాలు, లోయలతో నిండిన నగరం. వరదల కారణంగా చాలా రోడ్లు దెబ్బతిని సహాయక బృందాలు వరద ముంపు ప్రాంతాలకు చేరుకోలేని పరిస్థితి. దీంతో చాలా చోట్ల సహాయక చర్యలు మొదలేకాలేదు. అతికష్టం మీద కొన్ని బృందాలు చేరుకుని జలమయమైన ఇళ్లలో బాధితుల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. నేలమట్టమైన భవనాలు, శిథిలాల కింద వెతికే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. 30 వేలు దాటిన వలసలు వరద ధాటికి సర్వం కోల్పోవడంతో దాదాపు 30 వేల మంది స్థానికులు పొట్టచేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలసవెళ్లారని ఐక్యరాజ్యసమితికి చెందిన మైగ్రేషన్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ సంఖ్య 40,000కుపైనే ఉంటుందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ సొసైటీ లిబియా ప్రతినిధి తమెర్ రమదాన్ అంచనావేశారు. రెండు ప్రభుత్వాల మధ్య నలిగి.. తూర్పు ప్రాంతంలో ఒక ప్రభుత్వం, మరో దిశలో ఇంకో ప్రభుత్వాల నిర్లక్ష్య ఏలుబడిలో ఉన్న లిబియాలో మౌలిక వసతుల కల్పన అరణ్యరోదనే అయ్యింది. ‘నగరంలో ఉన్న ఏకైక శ్మశానానికి తరలించేందుకు మృతదేహాలను ఒక దగ్గరకు చేరుస్తాం. ఈ జల విలయంలో 11 మంది కుటుంబసభ్యులను కోల్పోయి గుండెలవిసేలా రోది స్తున్న ఒకాయనను ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు’ అని సహాయక బృంద సభ్యుడొకరు చెప్పారు. ‘ నా కుటుంబం మొత్తాన్నీ కోల్పోయా. వరదల్లో మా వాళ్ల మృతదేహాలు సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి’ అని అబ్దల్లా అనే వ్యక్తి వాపోయారు. రోడ్లలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు బుల్డోజర్లుతో రెండు రోజులుగా నిరంతరంగా పనిచేయిస్తున్నారు. అప్పుడుగానీ అత్యవసర సరుకుల్ని తరలించలేని దుస్థితి. వేరే పట్టణాలకు మృతదేహాల తరలింపు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించే పరిస్థితు లు డెర్నీ సిటీలో కరువవడంతో వందలాది మృతదేహా లను సమీపంలోని పట్టణాలకు తరలిస్తున్నారు. మరణించిన వారిలో 84 మంది ఈజిప్టువాసులూ ఉన్నారు. దక్షిణాన ఉన్న బెనీ సుయెఫ్ రాష్ట్రంలో ఎల్–షరీఫ్ గ్రామంలో డజన్లకొద్దీ ఈజిప్షియన్లు జలసమాధి అయ్యారు. డెర్నాలో భీతావహ దృశ్యం నగరంలో చాలా చోట్ల మృతదేహాలు కనపడుతు న్నాయి. బురదనీటిలో కూరుకుపోయి, వీధుల్లోకి కొట్టుకొచ్చి, సముద్ర తీరం వెంట.. ఇలా చాలా ప్రాంతాల్లో స్థానికులు విగతజీవులై కనిపించారు. ఒక్కసారిగా నీరు రావడంతో ఎటూ తప్పించుకోలేని నిస్సహాయక స్థితి. ‘నగరంలో ఏ ప్రాంతంలో సహాయం చేసేందుకు వెళ్లినా అక్కడ మాకు చిన్నారులు, మహిళల మృతదేహాలే కనిపిస్తున్నాయి’ అని బెంఘాజీకి చెందిన ఒక సహాయకుడు ఫోన్లో మీడియా సంస్థకు చెప్పారు. ‘సిటీ శివార్లలోని డ్యామ్ బద్దలైన శబ్దాలు మాకు వినిపించాయి. నగరం గుండా ప్రవహించే వాదీ డెర్నీ నదిలో ప్రవాహ ఉధృతి అమాంతం ఊహించనంతగా ఎగసి జనావాసాలను ముంచేసింది. ‘ డ్యామ్ బద్దలవడంతో ఏకంగా ఏడు మీటర్ల ఎత్తులో దూసుకొచ్చిన ప్రవాహం తన మార్గంలో అడ్డొచ్చిన అన్నింటినీ కూల్చేసింది’ అని లిబియాలో రెడ్ క్రాస్ కమిటీ ప్రతినిధి బృంద సారథి యాన్ ప్రైడెజ్ చెప్పారు. మధ్యధరా ప్రాంతంలో సన్నని తీరప్రాంతంలో పర్వత పాదాల చెంత ఈ నగరం ఉంది. పర్వతాల నుంచి వచ్చిన వరద నీరు నగరాన్ని ముంచేస్తూ తీరం వైపు కిందకు ఉరకలెత్తడంతో వరద తీవ్రత భయంకరంగా ఉంది. వరద ధాటికి దక్షిణం వైపు కేవలం రెండు రోడ్లు మాత్రమే మిగిలిపోయాయి. కూలిన వంతెనలు నగరం మధ్య భాగాన్ని రెండుగా చీల్చాయి. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గాయపడిన ఏడు వేలకుపైగా స్థానికులను మైదానాల్లోని తాత్కాలిక వైద్యశాలల్లో చికిత్సనందిస్తున్నారని తూర్పు లిబియాలోని అంబులెన్స్, అత్యవసర కేంద్రం అధికార ప్రతినిధి ఒసామా అలీ చెప్పారు. -
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ సమీక్ష!
ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఉధృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు తమిళసై సౌందర్‌రాజన్ జిల్లాలో వరదల పరిస్థితిని సమీక్షించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ప్రతినిధి యాటకారి సాయన్న జిల్లా పరిస్థితిని గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై జిల్లా ప్రస్తుత పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలు, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కడెం మండలం పాండవాపూర్ తాండ నుంచి 50 ఇళుల్ల ఖాళీ చేసి సమీపంలోని తాత్కాలిక గృహాల్లో, నవాబ్‌పేట గ్రామపంచాయతీలో 100 నివాసగృహాలు ఖాళీ చేసి 350 మందిని సమీపంలోని రైతువేదికలో ఉంచారని వివరించారు. అంబర్‌పేటలో 50 గృహాలను ఖాళీ చేసి 200 మందిని నారాయణరెడ్డి షెడ్లో తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారన్నారు. ఖానాపూర్‌లో 70 గృహాలను ఖాళీ చేయించి 150 మందిని సమీపంలోని ఎల్ఎంఆర్ డిగ్రీ కాలేజీలో ఉంచారు. దస్తురాబాద్ మండలం దేవునిగూడా గ్రామంలో 15 ఇళ్లు ఖాళీ చేసి 60 మందికి దేవుని గూడా గ్రామపంచాయతీలో, భుక్తాపూర్ గ్రామాలో 11 ఇండ్లు ఖాళీ చేసి 45 మందికి బుక్తాపూర్ పాఠశాలలో, మున్యాల్ గ్రామం 30 ఇళ్లు ఖాళీ చేసి 156 మందికి మున్యాల్ స్కూల్లో, గొడిసెర్యాల్ గ్రామంలో 12 ఇళ్లకు చెందిన 55 మందికి, గుడిసెల స్కూల్లో పునరావాసం ఏర్పాటు చేశారని వివరించారు. నిర్మల్ కేంద్రంలో జీఎన్ఆర్ కాలనీలోని 60 ఇళ్లను ఖాళీ చేయించి, 300 మందికి అల్ఫోర్స్ స్కూల్లో, సోఫి నగర్‌లోని పది ఇళ్లకు చెందిన 32 మందిని కమ్యూనిటీ హాల్లోని వసతికి తరలించారని తెలిపారు. భైంసా మండలం గుండెగాం లో 50 ఇళ్లకు చెందిన 200 మందిని భైంసాలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో వసతి కల్పించినట్లు పేర్కొన్నారు. -
AP: రాజ్‌భవన్‌లో ఇంటర్నేషనల్ రెడ్‌క్రాస్ దినోత్సవ వేడుకలు
సాక్షి, విజయవాడ: ఏపీ రాజ్‌భవన్‌లో ఇంటర్నేషనల్ రెడ్‌క్రాస్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ రెడ్ క్రాస్ ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్.. కలెక్టర్లతో పాటు పలువురికి మెడల్స్ అందజేశారు. అనంతరం గవర్నర్ నజీర్ మాట్లాడుతూ.. ఏపీలో రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం. గ్లోబల్ వార్నింగ్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించాలి అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: సీఎం జగన్‌ను కలిసిన సిక్కు మత పెద్దలు.. కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ -
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్
సాక్షి, హైదరాబాద్: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్ వరించింది. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) అధ్యక్షుడు బిశ్వభూషణ్ హరిచందన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఏపీలోని విజయనగరం జిల్లా కురుపం గ్రామంలో మెడికల్ క్యాంపులో కావాల్సిన వనరులను సమకూర్చినందుకు, అలాగే చిత్తూరులో బ్లడ్ బ్యాంకు నిర్మాణం చేపట్టినందుకు గాను పవర్‌గ్రిడ్‌కు ఈ అవార్డు లభించింది. కాగా, పవర్‌గ్రిడ్ ఈ రెడ్‌క్రాస్ గోల్డ్ మెడల్‌ను అందుకోవడం ఇది మూడోసారి. పవర్‌గ్రిడ్ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ అవార్డును అందుకున్నారు. -
రక్తదానానికి ముందుకు రండి
సాక్షి, అమరావతి: ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో భారత రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏపీ శాఖకు సమకూర్చిన రక్తదాతల శకటాలను (బ్లడ్ డోనర్ వ్యాన్స్)ను విజయవాడ రాజ్‌భవన్ నుంచి గవర్నర్ జెండా ఊపి శనివారం ప్రారంభించారు. ఒక కరోనా పరీక్ష శకటంతో సహా ఐదు రక్తదాతల వాహనాలను సేవకు అంకితం చేశారు. వీటిని విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, కర్నూలు నగరాల్లో అందుబాటులో ఉంచనున్నారు. గవర్నర్ మాట్లాడుతూ ఎక్కడ దాతలు సిద్ధంగా ఉంటే అక్కడికే వెళ్లి రక్తసేకరణ చేస్తున్నారని.. ఇందుకోసం 18004251234లో సంప్రదించవచ్చన్నారు. రెడ్‌క్రాస్ ఏపీ శాఖ చైర్మన్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల అభిమానం మరువలేనిది ఏపీ ప్రజల ప్రేమాభిమానాలు మరువలేనివని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన శనివారం దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం ఆదివారం ప్రసారం కానుంది. ఏపీ గవర్నర్‌గా పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. ఇంతకాలం తనకు అండగా నిలిచిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇదే విధంగా ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందగలనన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
కరోనా: ఆఖరు ఘడియల్లో ఆత్మబంధువులు
మానవత్వాన్ని కరోనా మంట గలిపేసింది. రోగంతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి కుటుంబ సభ్యులే వెళ్లలేని పరిస్థితిని తీసుకొచ్చింది. తాకితే కరోనా వచ్చేస్తుందేమోనన్న భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. మాయదారి మహమ్మారి ప్రాణంతోపాటు అయిన వారిని దూరం చేస్తోంది. అసువులు బాస్తే భయంతో బంధువులూ సైతం రావడం లేదు. కనీసం కడసారి చూపునకు నోచుకోలేకపోతున్నారు. చివరకు అంత్యక్రియలకు అడుగడుగునా ఆటంకాలే. మృతదేహాన్ని సొంతూరు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిద్దామంటే... అయిన వాళ్లే అడ్డు పడుతున్నారు. అంతిమ సంస్కారాలకు ఆ నలుగురు కూడా రాని పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ నేపథ్యంలో మేమున్నామంటూ రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో కొందరు యువకులు ముందుకొచ్చి సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. సాక్షి, శ్రీకాకుళం: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మానవ సంబంధాలను ప్రశ్నిస్తోంది. అక్కడెక్కడో కాదు మన దగ్గర మచ్చుకైనా మానవత్వం లేకుండా చేస్తోంది. కుటుంబంలో ఒకరికి కరోనా సోకితే ఇంట్లో వాళ్లందరికీ వచ్చేస్తుందన్న భయం పట్టుకుంది. కరోనా వచ్చిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సైతం వణుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఇక చనిపోయిన రోగుల మృతదేహాల వద్దకు వెళితే కరోనా చుట్టేస్తుందన్న అభద్రతా భావాన్ని సృష్టించింది. వాస్తవంగా కరోనాతో చనిపోయిన ఆరు గంటల తర్వాత మృతదేహం నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది. ఈ విషయాన్ని అధికారులు, వైద్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం భయపడిపోతున్నారు. కరోనాతో చనిపోతే దగ్గరకు రావడం లేదు. అంత్యక్రియల కోసం అంబులెన్స్‌లో తరలింపు ఆ మృతదేహాన్ని ముట్టు కోవడానికి సాహసించడం లేదు. కరోనా మృతుల వద్దకే కాదు సాధారణంగా చనిపోయిన వారి దగ్గరికి సైతం వెళ్లడం లేదు. కరోనా వలన చనిపోయారేమోనన్న భయంతో మృతదేహాలను తాకడం లేదు. దీనితో అంతిమ సంస్కారాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ అవగాహనతో కొందరు యువకులు ఆ మృతదేహాలకు దహన కార్యక్రమాలు చేపట్టేందుకు మేమున్నా మంటూ ముందుకొస్తున్నారు. మృతి చెందిన 6 గంటల తర్వాత కరోనా వ్యాపించదని నిరూపిస్తున్నారు. రెడ్‌క్రాస్ తరపున జిల్లాకు చెందిన పి.తవుడు, ఎన్.ఉమాశంకర్, జి.సత్యసుందర్, ఎల్.రవికుమార్, పి.సూర్య ప్రకాష్, పి.చైత న్య, సిహెచ్ కృష్ణంరాజు, జి.విజయబాబు, బి.శ్రీధర్, కె.సత్యనారాయణ, జి.పవన్‌కుమార్ (డ్రైవర్), ఎన్.కోటీశ్వరరావు తదితరులు కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 20 కోవిడ్ మృతదేహాలకు, నాలుగు సాధారణ మృతదేహాలకు దహన సంస్కారాలు చేశారు. కరోనాతో మృతి చెందినా, సాధారణ మృతులకైనా ఎక్కడైనా అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితులు ఉంటే 8333941444కు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తామని స్వర్గధామం రథం కో ఆర్డినేటర్ ఎన్.కోటీశ్వరరావు విజ్ఞప్తి చేశారు. కరోనా మృతదేహాలపై వివక్ష చూపించాల్సిన అవసరం లేదని, దహన సంస్కారాలు చేసేందుకు తాము సిద్ధమని తెలిపారు. -
ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిపై ప్రత్యేక దృష్టిసారించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ సర్వే నిర్వహించి తగిన జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. రెడ్‌క్రాస్ కీలక పాత్ర పోషించాలి కరోనా మహమ్మారిని నివారించడంలో రెడ్‌క్రాస్ సొసైటీ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూ షణ్ హరిచందన్ అన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ బాధ్యులతో గవర్నర్ రాజ్‌భవన్‌లో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్‌ను కట్టడి చేయడంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిం చాలన్నారు. ప్రజలు చేయాల్సినవి, చేయకూడనివి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. పేదలు, నిరాశ్రయులకు ఆహారం సరఫరా చేయాలని గవర్నర్ చెప్పారు. రాష్ట్ర రెడ్‌క్రాస్ చైర్మన్ డా.శ్రీధర్‌రెడ్డి రెడ్‌క్రాస్ సొసైటీ చేపడుతున్న కార్యక్రమాలను గవర్నర్‌కు వివరించారు. ఇందుకోసం టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చామన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ టోల్ ఫ్రీ నంబరు: 18004251234 -
రామ్ చరణ్ చేతుల మీదుగా సన్మానం
పాలమూరు మహబూబ్‌నగర్ : ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో శిల్పారామంలో పలువురిని సన్మానించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 131 సార్లు రక్తదానం చేసిన మహబూబ్‌నగర్ రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్‌ను సినీ హీరో రామ్‌చరణ్ సన్మానించి జ్ఞాపిక అందజేశారు. -
సమాజానికి ఆదర్శంగా నిలవాలి కలెక్టర్ అమ్రపాలి
కాటకాజీపేట అర్బన్ : ఇంటర్న్‌షిప్‌లో శిక్షణ పొందిన విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్, రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు అమ్రపాలి కాట తెలిపారు. అర్బన్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను కలెక్టర్ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హన్మకొండ సుబేదారిలోని రెడ్‌క్రాస్ సొసైటీలో 22 మంది ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు మే 28 నుంచి జూన్ 11వ తేదీ వరకు ఇంటర్న్‌షిప్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా రెడ్‌క్రాస్‌లోని ధాలసెమియా సెంటర్లో 252 మంది వ్యాధిగ్రస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోగా విద్యార్థులు వారిపై అవగాహన పెంచుకుని తాము సైతం రక్తదానం అందించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు అతి తక్కువ ధరలకు మందులు అందించే జనరిక్ మందుల దుకాణాలు, బ్లడ్ బ్యాంకులో బ్లడ్ గ్రూప్, క్రాస్ మ్యాచింగ్ విధానంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. రెడ్ క్రాస్ చరిత్ర, బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో అందించాల్సిన సేవలు, 108, వృద్ధాశ్రమాలు, సోషల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వలంటరీ ప్రొగ్రాంలో భాగస్వామ్యం అందిస్తూ ప్రథమ చికిత్స అందించడంపై విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లో నేర్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి, రాష్ట్ర పాలక వర్గ సభ్యులు ఈవీ.శ్రీనివాసరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
వామ్మో.. రెడ్‌క్రాస్!
- అధికారుల తనిఖీలో విస్తుపోయే నిజాలు – బ్లడ్‌బ్యాంక్‌లో కనీస ప్రమాణాలు పాటించని వైనం – రికార్డుల నిర్వహణా అస్తవ్యస్తమే – ఏపీ శాక్స్‌కు సమగ్ర నివేదిక అనంతపురం మెడికల్ : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందించాల్సిన రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్ లోపాల పుట్టగా మారింది. మూడు నెలల నుంచి నివేదికలు రాకపోవడంతో ఎయిడ్స్ అండ్ లెప్రసీ అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ అనిల్‌కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సొసైటీలో కొనసాగుతున్న రాజకీయ విభేదాల కారణంగా బ్లండ్బ్యాంక్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారినట్లు గుర్తించిన అధికారులు ఈ మేరకు ఏపీ శాక్స్‌కు సమగ్ర నివేదిక పంపారు. తనిఖీల్లో భాగంగా అక్కడికి వెళ్లిన డాక్టర్ అనిల్‌కుమార్.. ముందుగా మూడు నెలల నుంచి నివేదికలు పంపని వైనంపై సిబ్బందిని ప్రశ్నించారు. ఇప్పటికే రెండుసార్లు మెయిల్ చేశామని, ఒకసారి ఫోన్ చేసి చెప్పినా ఎందుకు పంపలేదని నిలదీశారు. అక్కడ 24 గంటలు విధుల్లో ఉండాల్సిన మెడికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లేకపోవడంతో ఎక్కడికెళ్లారని ఆరా తీయగా సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ రోస్టర్ కూడా లేని పరిస్థితి ఉన్నట్లు గ్రహించారు. మొత్తం ల్యాబ్టెక్నీషియన్లతోనే నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఎంత మేరకు బ్లడ్ సేకరిస్తున్నారు.. ఇతరులకు ఇవ్వడానికి వీల్లేకుండా ఉన్న రక్తం ప్యాకెట్లు ఎన్ని.. ఎన్ని ప్యాకెట్లు గడువు ముగిశాయన్న వివరాలు కూడా లేకపోవడంతో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిబంధనల మేరకు రాత్రి వేళ కూడా బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహించాల్సి ఉన్నా ఇక్కడా పరిస్థితి లేదు. సిబ్బందిని అడిగితే ఊరికి దూరంగా ఉంది.. ఇక్కడెలా ఉండాలని సమాధానం రావడంతో ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా రక్తం ఇవ్వడానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన డోనర్ గదిలో ఆక్సిజన్ లేకపోవడం, అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోకపోవడం, పరిసరాలన్నీ అధ్వానంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ నాలుగుసార్లు బ్లడ్ ప్యాకెట్ల టెంపరేచర్ పరిశీలించాల్సి ఉన్నా అలాంటిదేమీ ఇక్కడ జరగడం లేదని గ్రహించి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మొత్తంగా బ్లండ్ బ్యాంక్‌లో పర్యవేక్షణ లేదన్న విషయాన్ని తెలుసుకుని ఇక్కడి సౌకర్యాల లేమి, అధికారుల నిర్లక్ష్యంపై ఏపీ శాక్స్‌కు నివేదిక పంపారు. రెడ్‌క్రాస్‌లో ఉన్న పరిస్థితిని ఎయిడ్స్ నియంత్రణ మండలి జాయింట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఎయిడ్స్ అండ్ లెప్రసీ విభాగాన్ని చూసిన అధికారులు అస్సలు దృష్టి కేంద్రీకరించకపోవడంతోనే పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైనట్లు తెలుస్తోంది. ఈ బ్లడ్‌బ్యాంక్‌కు రక్తం సేకరించడానికి అవసరమయ్యే బ్యాగ్స్, టెస్టింగ్ సామగ్రి ఏపీ శాక్స్ నుంచే సమకూరుస్తారు. అయితే వీటి లెక్క కూడా అక్కడ లేదని తెలుస్తోంది. -
సమాచార హక్కు కన్వీనర్ అనుమానాస్పద మృతి
నెల్లూరు: సమాచార హక్కు నెల్లూరు కన్వీనర్ భద్రయ్య(45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన భద్రయ్య.. పలువురిచే రక్త దానం చేయించారు. రెడ్ క్రాస్ రక్తనిధి విభాగంలో అక్రమాలపై ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా దానిపై విచారణ జరుగుతోంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన భద్రయ్య తిరిగి రాలేదు. అర్ధరాత్రి దాటాక నెల్లూరు-మాగుంట రైల్వే ట్రాక్‌పై ఆయన మృతదేహం పడి ఉంది. గొంతు కోసినట్లు కనిపిస్తుండగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఉస్మాన్ సాహెబ్పేటలో నివసించే ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భద్రయ్య మృతిపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కొందరు వ్యక్తులు ఈయనను తరుముకుంటూ వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. -
54 ఏళ్ల తర్వాత స్వదేశానికి..
1963లో దారి తప్పి భారత్‌లోకి వచ్చిన చైనా సైనికుడు బీజింగ్: 54 ఏళ్ల క్రితం దారితప్పి భారత్‌కి వచ్చిన ఓ చైనా సైనికుడు ఎట్టకేలకు శనివారం స్వదేశానికి చేరుకున్నాడు. వాంగ్ కి (77) అనే చైనా సైనికుడు 1962లో జరిగిన భారత్–చైనా యుద్ధకాలంలో సరిహద్దు దాటొచ్చి భారత్‌లో చిక్కుకుపోయాడు. బీజింగ్ ఎయిర్‌పోర్టులో వాంగ్‌కు చైనా విదేశాంగ, భారత దౌత్యాధికారులు ఘన స్వాగతం పలికారు. యుద్ధం ముగిశాక∙రాత్రి చీకట్లో దారి తప్పి 1963 జనవరి 1న ఇతను అస్సాంలోకి ప్రవేశించాడు. అక్కడి రెడ్ క్రాస్ సభ్యులు వాంగ్‌ను గుర్తించి పోలీసులకు అప్పగించారు. వాంగ్ ఆరేళ్ల జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. తిరిగి చైనా వెళ్లేందుకు భారత అధికారులు అంగీకరించక పోవడంతో మధ్యప్రదేశ్ చేరుకుని అక్కడే ఓ మహిళను పెళ్లాడి వాచ్‌మన్ ఉద్యోగంలో చేరారు. స్థానికులు అతనికి రాజ్ బహదూర్ అని పేరు పెట్టారు. వాంగ్‌కు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుక్కి ఓ కూతురుంది. కొన్నాళ్ల క్రితం వాంగ్ బంధువు ఒకరు భారత పర్యటనకు వచ్చినప్పుడు అతణ్ని కలిసి విషయం తెలుసుకుని చైనాకు వెళ్లి వాంగ్‌కు పాస్‌పోర్టు వచ్చేలా చేశాడు. వాంగ్‌పై గతంలో బీబీసీ ప్రసారంచేసిన కార్యక్రమం సంచలనం కావడంతో విషయం ఇరుదేశాల విదేశాంగ శాఖలకు తెలిసి ఉమ్మడిగా చర్చించి.. భారత్‌కు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేలా వీసా మంజూరు చేశారు. వాంగ్ భార్య, కూతురు అతనితోపాటు చైనా వెళ్లేందుకు నిరాకరించగా, కొడుకు, కోడలు, మనవరాలుతో కలిసి వాంగ్ శనివారం చైనా చేరుకున్నారు. -
యువతకు వైఎస్ జగన్ స్ఫూర్తి
కర్నూలు(హాస్పిటల్): నాయకత్వ లక్షణాల్లో నేటి యువతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తి అని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యుడు శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 21న వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. నగరంలోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధిలో సొసైటీ చైర్మన్ జి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 50 మందికి పైగా యువకులు రక్తనిధికి చేరి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని కళాశాల విద్యార్థి వినోద్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రహదారులపై ఉన్న అనాథలకు దుప్పట్ల పంపిణీ, అనాథాశ్రమంలో అన్నదానం కార్యక్రమాలు నిర్వహించనున్నారని తెలిపారు. ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో ఓర్చుకునే సహనం, నాయకత్వ లక్షణాలు, పేదలను పలకరించే తీరు వైఎస్ జగన్‌కే సొంతమన్నారు. నేటి యూత్ ఐకాన్ జగన్ అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రక్తనిధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటయ్య, కో ఆర్డినేటర్ పద్మారెడ్డి, వైఎస్ జగన్ యూత్ నాయకులు వినోద్‌కుమార్‌రెడ్డి, విద్యార్థులు షాహిద్, షేక్షావలి, మహేష్‌గౌడ్, విజయసింహారెడ్డి పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్యల నివారణకు కృషి
–మెగా రక్త, నేత్రదాన శిబిరంలో కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): రైతు ఆత్మహత్యల నివారణకు వ్యవసాయ శాఖ కృషి చేయాల్సి ఉందని కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. రాష్ట్ర వ్యవసాయాధికారుల సంఘం ఆధ్వర్యంతో సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో మెగా రక్త, నేత్ర దాన శిబిరాన్ని వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనంజయరెడ్డితో కలసి కలెక్టర్ ప్రారంభించారు. మండల వ్యవసాయాధికారులు, ఏడీఏలు, ఏఇఓ, ఏంపీఇఓలు, వ్యవసాయశాఖ సిబ్బంది 150 మంది.. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకీ రక్తదానం చేశారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి, అదనపు డైరెక్టర్ సుశీల, వ్యవసాయాధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కమలాకరశర్మ, ప్రవీణ్ కర్నూలు జిల్లా వ్యవసాయాధికారుల సంఘం ప్రతినిధులు, వివిధ జిల్లాల నాయకులు దాదాపు 500 మంది మరణానంతరం కళ్లు దానం చేస్తామని అంగీకార పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ...వ్యవసాయాధికారుల్లోను మానవత్వం ఉందని రక్త, నేత్రదాన కార్యక్రమం ద్వారా నిరూపించుకున్నారన్నారు. అదే రీతిలో రైతుల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనంజయరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయశాఖలో విస్తరణ కార్యక్రమాలు లేవనే విమర్శ ఉందని ఈ లోపాన్ని సవరించుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ...వ్యవసాయాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రక్త, నేత్ర దానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.జేడీఏ ఉమామహేశ్వరమ్మ, జిల్లా వ్యవసాయాధికారుల సంఘం అ«ధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారెడ్డి, రవిప్రకాష్, జిల్లా నాయకులు అక్బరుబాష, అశోక్‌కుమార్‌రెడ్డి, సురేష్‌బాబు, విశ్వనాథ్, తేజస్వరీ, ఏడీఏలు రమణారెడ్డి, సాలురెడ్డి, వీరారెడ్డి, సుధాకర్, చెంగల్రాయుడు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడిగా రామారావు
బోట్‌క్లబ్ (కాకినాడ) : జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడిగా వైడీ రామారావు శుక్రవారం రెడ్‌క్రాస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు కోశాధికారిగా శివరామకృష్ణ, కార్యదర్శిగా సీహెచ్ నరసింహారావు, కార్యవర్గ సభ్యులుగా సోముప్రసాద్, పి.సత్యనారాయణ, జి. మహాలక్ష్మి, పి.రఘరామారావు బాధ్యతలు స్వీకరించారు. తొలుత రెడ్‌క్రాస్ వ్యవస్థాపకులు జేన్హెన్రీడునన్ట్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైడి రామారావు మాట్లాడుతూ జిల్లాలోని రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలు మరింత విస్తరిస్తామన్నారు. -
పుష్కర సేవలకు ‘రెడ్‌క్రాస్’ సిద్ధం
గుంటూరు ఈస్ట్ : కృష్ణా పుష్కరాల్లో సేవలు అందించేందుకు రెడ్‌క్రాస్ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ గౌరవ చైర్మన్, విశ్రాంత జస్టిస్ అంబటి లక్ష్మణరావు తెలిపారు. హిందూ కళాశాల ఏడీ హాల్లో రెడ్ క్రాస్ కార్యకర్తలకు పుష్కర సేవా కార్యక్రమాల సన్నాహక సమావేశం బుధవారం నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ జిల్లాలో అమరావతి, సీతానగరంలలో క్యాంపులు నిర్వహించి 24 గంటలు సేవలందిస్తారని చెప్పారు. పెనుమూడి వారధి, విజయపురి సౌత్లలోను పుష్కర సేవలు అందిస్తారన్నారు. జిల్లా కార్యదర్శి జీవీఎన్ బాబు మాట్లాడుతూ కార్యకర్తలు పుష్కర యాత్రికులతో సేవాభావంతో మెలగాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 1,500 మంది కార్యకర్తలు 12 రోజులు 24 గంటలు సేవలందిస్తారని చెప్పారు. తొలుత కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర సభ్యులు ఎంవీ ఉదయ్‌కుమార్, జిల్లా చైర్మన్ వడ్లమాను రవి, హిందూ కళాశాల ప్రిన్సిపాల్ కనకదుర్గ పాల్గొన్నారు. -
రక్తం అందించడం అభినందనీయం : కలెక్టర్
న్యూశాయంపేట : గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వరంగల్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రెండు వేల మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం అందించడం అభినందనీయమని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం, వరల్డ్ తలసేమియా డే సందర్భంగా ఆదివారం రెడ్‌క్రాస్ భవనంలో తలసేమియా వ్యాధిగ్రస్తులను కలెక్టర్ పరామర్శించి పండ్లు పంపిణీ చేశారు. రక్తదానం చేస్తున్న వారిని పలకరించారు. అనంతరం రెడ్‌క్రాస్ స్థాపకులు జీన్ హెన్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 200 యూనిట్ల రక్తసేకరణ లక్ష్యంగా శిబిరం నిర్వహించడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా వరంగల్ యూనిట్ చైర్మన్ టి.రవీందర్రావు, సీడబ్ల్యూసీ చైర్మన్ అనితారెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు కారం రవీం దర్‌రెడ్డి, పి.సుబ్బారావు, రాజేష్‌గౌడ్ పాల్గొన్నారు. -
ఎల్లలు లేని కళాకారులు ఎవరి పక్షం?
వారి ఉద్దేశాలు ఏవైనా ఎల్లలు లేని కళాకారులు విస్థాపనకు, నిర్వాసితత్వానికి గురవుతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గురించి కాక.. నూతన రాజధాని నిర్మాణ నిధి కోసం కళా ప్రదర్శన చేయడం అన్యాయమైన నిర్ణయం, చర్య అవుతాయి. రెండు దేశాల మధ్యన హిం సాత్మకమైన ఘర్షణ ఏర్పడిన ప్పుడు - ఆ ఘర్షణ స్వభా వంతో, ఆ ఘర్షణలో ఎవరిది న్యాయం అనే వివక్షతో నిమి త్తం లేకుండా బాధితులకు వైద్య సహాయం చేయడానికి వెళ్లే సంస్థల్లో మొదటిదిగా ‘రెడ్‌క్రాస్’కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్నది. అలాగే ‘డాక్టర్స్ వితవుట్ ఫ్రాంటి యర్స్’ అనే సంస్థ ప్రాన్స్‌లో ఏర్పడింది. ఇరాక్, అఫ్ఘాని స్తాన్లపై అమెరికా దాడుల సందర్భంగా, ఇంకా చాలా ఘర్షణాయుత దేశాల్లో వీరందించిన సేవలకు చాలా గుర్తింపు వచ్చింది. పౌర సమాజం అని చెప్పుకుంటున్న ఒక ఆధునికానంతర తరాన్ని డాక్టర్స్ వితవుట్ ఫ్రాంటి యర్స్- సరిహద్దులు లేని వైద్యులు- వంటి మాట ఆకర్షి స్తుంది, ప్రభావితం చేస్తుంది. అందుకే దానితో పోలికే లేకుండా హైదరాబాద్‌లో ‘ఆర్టిస్ట్స్ వితవుట్ బార్డర్స్’ సంస్థ ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ఒక కళాకారుల బృందం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరా వతి పేరుతో నిర్మాణం చేస్తున్న రాజధానికి కళాకారు లుగా సహాయం చేయడానికి రాష్ట్రాల సరిహద్దులు పాటించకుండా వెళ్లిన సందర్భం ఇది. సుక్క కరుణ అనే చిత్రకళాకారిణి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీనియర్ రీసెర్చ్ ఫెలో. అమ రావతి రాజధాని నిర్మాణ సందర్భంలో విజయవాడ సంస్కృతికి తన వంతు సాంస్కృతిక దోహదంలో భాగంగా ఆమె మరో తొమ్మిది మంది కళాకారులతో ఒక కళా శిబిరంలో పాల్గొనడానికి వెళ్లింది. విజయవాడ సాంస్కృతిక కేంద్రం సంస్థాపక అధ్యక్షుడు యార్లగడ్డ హరిశ్చంద్రప్రసాద్, భారత పరిశ్రమల సమాఖ్య అధ్య క్షుడు చిట్టూరి సురేశ్ రాయుడు, సినిమా నిర్మాత సురేశ్ బాబుల పూనికతో ఈ నెల 17 నుంచి 19 వరకు కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడలో ‘ఆర్ట్ బియాండ్ బౌండ రీస్’ (ఎల్లలెరుగని కళావైభవం) పేరిట ఈ చిత్రకళా శిబి రాన్ని నిర్వహించారు. తెలంగాణ నుంచి వెళ్లిన సరి హద్దులు లేని ఈ కళాకారులు అక్కడే చిత్రాలు వేసి, వాటినక్కడే ప్రదర్శించారు. కళాకారులంతా తాము ఎంచుకున్న విషయంపైనే చిత్రాలు వేస్తారు. ఈ ప్రద ర్శన ద్వారా వచ్చే డబ్బు నూతన రాజధాని నిర్మాణ నిధికి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఈ సరిహద్దులు లేని తెలంగాణ కళా కారుల కానుక ఇది. ఇందులో కళాకారుల ఉద్దేశాలను శంకించడానికేమీ లేదు. కళాకారులు, కవులు భావోద్వేగపరులు. ఇటీవల కోల్‌కతాకు పోయినప్పుడు ఢిల్లీలో పనిచేసిన ఒడిశాకు చెందిన ఒక ప్రొఫెసర్ ‘‘నూతన ఆంధ్రప్రదేశ్‌కు అమ రావతి రాజధాని అట. నేను పులకించిపోయాను. వెం టనే నేనా రాజధానికి నా మొబైల్ ఫోన్లో ఒక లోగోను రూపొందించాను చూస్తారా?’’ అని చూపించింది. ఆమెకేమని చెప్పను? ఏం చెప్పినా పొరుగు రాష్ట్రం రాజ ధాని విషయంలో ముఖ్యమంత్రిపై చాడీలు చెప్పినట్లు గానో, నిందలు వేసినట్లుగానో ఉంటుంది. కాని నిష్ఠుర సత్యాన్ని చెప్పక తప్పదు. ఇది బుద్ధుని కాలపు బౌద్ధా రామం కాదు. ఆ అమరావతి కాదు. ఇది చంద్రబాబు మాటల్లోనే సింగపూర్ ప్రతికృతి. బుద్ధుని దాకా ఎందుకు, మాకు సత్యం శంకరమంచి అనే అద్భుతమైన రచయిత ఉన్నాడు. ఆయన రాసిన అమరావతి కథల్లో మధురానుభూతిగా మిగిలిన నగరం కూడా కాదు. ఇది కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని డెల్టా ప్రాంతంలోని కృష్ణా నది జలాలతో కాదు... రైతుల చెమట, ఆక్రోశం, ఆగ్రహం నెత్తురు చిందిన చిత్తడి నేలలో రూపొందుతున్న ఒక పీడకల. చంద్రబాబు వంటి వారికి, పైన పేర్కొన్న కళా పారిశ్రామిక పోషకుల వంటి వారికి నూతన రాజ ధాని స్వప్నమే కావచ్చు. కాని ప్రజల పాలిట అచ్చమైన పీడకల. వేలాది ఎకరాల భూమి చంద్రబాబు నాయ కత్వంలోని పాలకులు అధిగ్రహణం చేయడం వల్ల నిర్వా సితులైన, విస్థాపితులైన ప్రజలకు ఎప్పటికి నిలిచిపోయే చేదు గుర్తు అనుకున్నాను. బౌద్ధ ధర్మం గురించి విస్తృత మైన అధ్యయనం చేసిన ఆమెకు సులభంగా అర్థమయ్యే వర్తమాన సందర్భం చెప్పాలనిపించింది. ఇప్పుడు బస్తర్‌లో ప్రభుత్వ పాఠశాలలు పాఠశాలలు కానట్లే, ప్రభుత్వ వైద్యశాలలు వైద్యశాలలు కానట్లే మీరూహిం చుకునే అమరావతి ఆ అమరావతి కాదు. అవి ఎట్లా కేంద్ర అర్థసైనిక బలగాల స్థావరమైనవో, ఈ నూతన రాజధాని అట్లా రైతాంగం పాలిట, అశేష ప్రజానీకం పాలిట అణచివేత స్థావరం కానున్నది అని చెప్పాను. ఈ నూతన రాజధాని కోసం చంద్రబాబు నారా వారిపల్లె మొదలు నాలుగు దిక్కుల నుంచి ఇసుక (మాఫియా తినగా మిగిలింది), మట్టి (రియల్టర్లు, కంపె నీలు ఆక్రమించగా మిగిలింది) సేకరించాడు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమురవోలు (ఎన్టీఆర్ సతీ మణి బసవతారకం గ్రామం) నుంచి చంద్రబాబు భార్య భువనేశ్వరి మట్టి, నీరు సేకరించిందని చదివినప్పుడు నాకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అణచ డానికి ఢిల్లీ నుంచి వచ్చిన భారత సైన్యం కాటూరు, పామర్రు గ్రామాల్లో నిర్వహించిన దుశ్చర్యలు గుర్తు కొచ్చాయి. అవును కదా, ఇటువంటి దౌర్జన్యాలకు భారత సైన్యాన్ని పురిగొల్పిన వల్లభ్ భాయ్ పటేల్‌కు అమెరికాలోని లిబర్టీ స్టాచ్యూను మించిన లోహ విగ్ర హాన్ని నిర్మించడానికి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఇనుము సేకరిస్తున్నాడు కదా అని గుర్తుకు వచ్చింది. దేశ వ్యాప్తంగా ముస్లిం ప్రజల మనోభావాలను గాయపరచ డానికి, బాబ్రీమసీదును కూల్చి రామమందిర నిర్మాణం చేయడానికి ఆనాడు లాల్‌కృష్ణ అద్వానీ ఇటుకలు సేకరిం చడం గుర్తుకు వచ్చింది. ఈ ఇద్దరు నేరస్తులతో అధి కారం ముడివేసుకున్నవాడే కదా చంద్రబాబు. అయినా, చంద్రబాబు తొమ్మిదిన్నర సంవత్సరాల రక్తసిక్త పాలన తెలియని తెలుగువాళ్లెవరు? ఈ కళాకారులు తప్ప. వచ్చేవాళ్ల, పంపేవాళ్ల ఉద్దేశాలు ఏమైనా, ఎల్లలు లేని వైద్యులు ఘర్షణలో బాధితులకు వైద్యసహాయం చేస్తారు. వాళ్లకు చికిత్స, వైద్య సహాయమే కర్తవ్యం, లక్ష్యం. గాయపడిన, బాధితుల మంచి చెడ్డలతో సంబం ధం లేదు. కాని ఎల్లలు లేని కళాకారులు క్షతగాత్రులైన, బాధితులైన, విస్థాపనకు, నిర్వాసితత్వానికి గురవు తున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గురించి కాకుండా, నూతన రాజధాని నిర్మాణం గురించి కళా ప్రదర్శన చేసి, ఆ కళాఖండాలు వేలం వేయగా వచ్చిన డబ్బును నూతన రాజధాని నిర్మాణ నిధికి అర్పించడమే అన్యాయమైన నిర్ణయం, చర్య అవుతాయి. ప్రజలకు, పాలకులకు మధ్యన ఉన్న సరిహద్దులో ఈ కళాకారులు ప్రజలవైపు నుంచి ఎల్లలు దాటి పాలకుల వైపు వెళ్లిన వాళ్లే అవుతారు. వాళ్లకా ఉద్దేశాలు ఏమాత్రం లేకపో వచ్చు. ఆపాదించనూలేం. కాని నిర్వాహకుల ప్రయోజ నం అదే. బహుశా ఆ సత్యం బోధపడినందువల్లనే ఈ కళా శిబిరంలో ప్రసిద్ధ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ పాల్గొన కూడదని నిర్ణయించుకున్నాడు. దేశవ్యాప్తంగా కవులు, కళాకారులు, బుద్ధిజీవులు ఈనాటి పాలకులకు తమకు మధ్య ఎల్లలు తెలుసుకుంటున్న సమయంలో, ప్రజల వైపు నిలబడుతున్న తరుణంలో ఈ నిష్ఠుర నిజాన్ని ఈ ఎల్లలు లేని కళాకారులు కూడా గ్రహిస్తారని ఆశిద్దాం. తాజాకలం- ఒక ఇంగ్లిష్ దినపత్రిక ఈ కళాబృం దం ప్రయాణానికి Straight from the he'art' అని శీర్షిక పెట్టింది. హృదయం నుంచి, కళ నుంచి నేరుగా అనే అర్థాలు స్ఫురించేలా. కాని ఆ ఉత్సాహంలో జెండర్ వివక్ష చేస్తున్నానని గుర్తించలేదు. ఈ ప్రయాణానికి కరుణగారి పరిశోధన కారణమని ఈ పత్రిక చెప్తున్నది. ఆమె ఈ వివక్షను కూడా గమనించ కోరుతున్నాను. (వ్యాసకర్త ప్రముఖ విప్లవ రచయిత) 9676541715 - వరవరరావు -
‘బ్లడీ’ఫెలోస్‌తో బహుపరాక్!
- రక్తంతో అక్రమార్కుల దందా.. నకిలీ బ్లడ్ ప్యాకెట్లు, లేబుళ్లతో వ్యాపారం - హుజూరాబాద్ ‘రెడ్‌క్రాస్’లో వెలుగుచూసిన వ్యవహారం - ప్రైవేట్ నర్సింగ్ హోంల నుంచి తీసుకొచ్చి విక్రయం - పరీక్షలు లేకుండానే రక్త సేకరణ.. అసురక్షిత పద్ధతుల్లో నిల్వ - ప్యాకెట్లపై బ్లడ్ గ్రూప్ కూడా లేని వైనం - దందా వెనుక పెద్ద రాకెట్!.. అదుపులో ల్యాబ్ టెక్నీషియన్ - కొనసాగుతున్న విచారణ... గవర్నర్ దృష్టికి వెళ్లిన విషయం - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రక్తనిధి కేంద్రాల్లో తనిఖీలు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అమ్మమ్మకు ఆపరేషన్ .. వైద్యులు రక్తం కావాలనడంతో ఆమె మనవడు నరేశ్ రెడ్‌క్రాస్ సొసైటీకి చెందిన రక్తనిధి కేంద్రానికి వెళ్లాడు.. డబ్బులు చెల్లించి రెండు ప్యాకెట్ల రక్తం తీసుకొచ్చి వైద్యులకిచ్చారు.. రక్తాన్ని పరిశీలించిన డాక్టర్లు నోళ్లు తెరిచారు! ఆ ప్యాకెట్‌పై లేబుళ్లు నకిలీవి! ఆ ప్యాకెట్లూ నకిలీవి! చివరికి అందులో తీసుకువచ్చిన రక్తం కూడా సంస్థది కాదు!! ఆ బ్లడ్ ఏ గ్రూప్‌నకు చెందిందో కూడా తెలియదు!! మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ నెత్తురుతాగే గత్తరగాళ్లు సాగిస్తున్న ఈ ‘రక్తం దందా’ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో వెలుగుచూసింది. దీని వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాంటి పరీక్షలు చేయకుండా ప్రైవేట్ నర్సింగ్ హోంలు సేకరించే రక్తాన్ని తీసుకువచ్చి, దాన్ని నకిలీ లేబుళ్లతో తయారు చేసిన ప్యాకెట్లలో తక్కువ మోతాదుల్లో నింపి సొమ్ము చేసుకుంటున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా మంచి పేరున్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్ కేంద్రంగా కొందరు అక్రమార్కులు ఈ దందా సాగిస్తుండడం గమనార్హం. వెలుగులోకి వచ్చిందిలా... లక్ష్మి అనే వృద్ధురాలు మోచేతి ఆపరేషన్ కోసం ఇటీవల జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు రక్తం తక్కువగా ఉందని, రెండు ప్యాకెట్ల రక్తం తీసుకురావాలని సూచించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఈనెల 10న హుజూరాబాద్‌లోని రెడ్‌క్రాస్ రక్తనిల్వల కేంద్రానికి వెళ్లి రెండు ‘బి’ పాజిటివ్ రక్తం ప్యాకెట్లు కావాలని అడిగారు. రక్తనిధి కేంద్రంలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ వారి నుంచి రూ.4 వేలు తీసుకుని రెండు రక్తపు సంచులు అందజేశాడు. ప్యాకెట్లు తీసుకొచ్చి ఆస్పత్రిలో ఇవ్వగా.. వాటిని పరిశీలించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. రెడ్‌క్రాస్ సొసైటీ పేరుతోనే ఆ సంచులు ఉన్నప్పటికీ అందులో 300 ఎంఎల్ ఉండాల్సిన రక్తం 125 ఎంఎల్ మాత్రమే ఉంది. ఆ ప్యాకెట్‌పై రక్తం ఏ గ్రూపు అనేది కూడా ముద్రించలేదు. ఆ సంచులపై అంటించిన లేబుల్ నకిలీదిగా తేలింది. ఐస్ ప్యాకింగ్ కూడా లేదు. అనుమానం వచ్చిన వైద్యులు రెడ్‌క్రాస్ సొసైటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. రక్త నిల్వలు సీజ్! వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి సిద్దుల బాలకృష్ణ జమ్మికుంట ఆస్పత్రికి వెళ్లి బ్లడ్‌బ్యాంక్ నుంచి తెచ్చిన రక్తపు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రోగి నుంచి తీసుకున్న డబ్బులను చెల్లించారు. ఉచితంగా మరో రెండు రక్తం ప్యాకెట్లను అందజేశారు. హుజూరాబాద్‌కు వెళ్లి రక్తపు యూనిట్లు ఉంచిన ఫ్రిజ్‌ను తనిఖీ చేశారు. అక్కడున్న రక్తపు సంచులపై అనుమానం రావడంతో బ్లడ్‌బ్యాంక్‌ను సీజ్ చేశారు. బాధ్యుడైనటెక్నీషియన్ను గత ఐదు రోజులుగా విచారిస్తున్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ర్ట ప్రతినిధులకు కూడా సమాచారం పంపారు. గవర్నర్ దృష్టికి దందా.. రెడ్‌క్రాస్ సొసైటీ పేరుతో నకిలీ లేబుళ్లు, రక్తపు సంచులు తయారు చేస్తున్నారంటే దీని వెనుక పెద్ద రాకెట్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దృష్టికి కూడా ఈ విషయం వెళ్లినట్లు సమాచారం. రెడ్‌క్రాస్ సంస్థ అధికారులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో సంస్థకు చెందిన రక్తనిధి కేంద్రాలను తనిఖీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ రాకెట్ వెనుక సూత్రధారి, పాత్రధారులు ఎవరనే అంశంపై లోతుగా విచారణ సాగుతోంది. దర్యాప్తు జరుగుతోంది హుజూరాబాద్‌లో జరుగుతున్న వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది. చర్యలు తీసుకుంటున్నాం. సోమవారం హుజురాబాద్ వెళ్లి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం. జిల్లా కలెక్టర్‌తో కూడా సమావేశమవుతా - ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ప్రధాన క్యాదర్శి మదన్మోహన్ -
బంగూయిలో విధ్వంసకాండ: 300 మంది మృతి
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికన్ రాజధాని బంగూయిలో గత రెండు రోజులుగా చోటు చేసుకున్న విధ్వంసకాండలో దాదాపు 300 మంది మరణించారని రెడ్ క్రాస్ సొసైటీ శనివారం ఇక్కడ వెల్లడించింది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మృతదేహలను ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది. శాంతి భద్రతలను పరిరక్షించే క్రమంలో భాగంగా ఇప్పటికే ఫ్రెంచ్ దళాలకు చెందిన వేలాది మంది భద్రత సిబ్బంది ఇప్పటికే బంగూయి చేరుకున్నారని వివరించింది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్న్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ బొజీజ్ను ఇటీవల పదవి నుంచి తొలగించారు. దాంతో ఫ్రాంకోయిస్ అనుకూల వర్గానికి, వ్యతిరేక వర్గానికి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బీబీసీ శనివారం వెల్లడించింది. -
బస్టాప్ ఏర్పాటు చేయండి
వేలూరు, న్యూస్‌లైన్:వేలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని ముత్తు మండపం వద్ద బస్టాప్ ఏర్పాటు చేయాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సభ్యులు కలెక్టర్ నందగోపాల్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. వేలూరు కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్‌డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు సమస్యలను అధికారులకు విన్నవించారు. సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం పుదు వాయువు పథకం కింద జిల్లాలోని నాలుగు యూనియన్లలోని మహిళలకు రూ.29.5 లక్షలు అందజేశారు. ఆంబూరు ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో శివ ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుం బానికి రూ.3 లక్షలు, పది మంది వికలాంగులకు రూ.5.85 లక్షలు విలువ చేసే మూడు చక్రాల వాహనాలు, ఇద్దరు వికలాంగులకు కృత్రిమ కాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బలరామన్, వికలాం గుల సంక్షేమశాఖ జిల్లా అధికారి చార్లెస్ ప్రభాకరన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.