రక్తం అందించడం అభినందనీయం : కలెక్టర్
న్యూశాయంపేట : గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వరంగల్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రెండు వేల మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం అందించడం అభినందనీయమని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం, వరల్డ్ తలసేమియా డే సందర్భంగా ఆదివారం రెడ్‌క్రాస్ భవనంలో తలసేమియా వ్యాధిగ్రస్తులను కలెక్టర్ పరామర్శించి పండ్లు పంపిణీ చేశారు.
రక్తదానం చేస్తున్న వారిని పలకరించారు. అనంతరం రెడ్‌క్రాస్ స్థాపకులు జీన్ హెన్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 200 యూనిట్ల రక్తసేకరణ లక్ష్యంగా శిబిరం నిర్వహించడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా వరంగల్ యూనిట్ చైర్మన్ టి.రవీందర్‌రావు, సీడబ్ల్యూసీ చైర్మన్ అనితారెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు కారం రవీం దర్‌రెడ్డి, పి.సుబ్బారావు, రాజేష్‌గౌడ్ పాల్గొన్నారు.