రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడిగా రామారావు
Published Fri, Sep 9 2016 9:33 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
బోట్‌క్లబ్ (కాకినాడ) :
జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడిగా వైడీ రామారావు శుక్రవారం రెడ్‌క్రాస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు కోశాధికారిగా శివరామకృష్ణ, కార్యదర్శిగా సీహెచ్ నరసింహారావు, కార్యవర్గ సభ్యులుగా సోముప్రసాద్, పి.సత్యనారాయణ, జి. మహాలక్ష్మి, పి.రఘరామారావు బాధ్యతలు స్వీకరించారు. తొలుత రెడ్‌క్రాస్ వ్యవస్థాపకులు జేన్‌హెన్రీడునన్ట్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైడి రామారావు మాట్లాడుతూ జిల్లాలోని రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలు మరింత విస్తరిస్తామన్నారు.
Advertisement
Advertisement