సీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కల్యాణ్ రామ్(Kalyan Ram) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) వద్ద నివాళి అర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడిగా రాణించి ఆపై నాయకుడిగా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తమ తాత నందమూరి తారక రామారావు సేవల గురించి వారు మరోసారి గుర్తుచేశారు.
ఈ సందర్భంగా రామారావు అభిమానులు నివాళీలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో నేడు మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. బసవతారకం ఆసుపత్రిలో తన తండ్రి ఎన్టీఆర్‌కు బాలకృష్ణ నివాళి అర్పించనున్నారు.
ఆ రోజు నుంచి ఏర్పాట్లన్నీ చూసుకుంటుంన్న తారక్
సుమారు ఆరేళ్ల క్రితం రామారావు 97వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తాతయ్య సమాధి వద్దకు చేరుకున్నారు. జయంతి సందర్భంగా పూలతో కళకళలాడాల్సిన సమాధి అలంకరణ లేక బోసి పోవడం చూసి తారక్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో వారు వెంటనే పూలు తెప్పించి సమాధిని ఘనంగా అలంకరించారు. తమ అభిమానుల సాయంతో కొన్ని నిమిషాల్లోనే సమాధి మొత్తం పూలతో కళకళలాడేలా చేశారు.
(ఇదీ చదవండి: ఇండియన్–3 సినిమాపై శంకర్ ప్రకటన)
ఆ తర్వాత వారిద్దరూ నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా తారక్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుంచి తాత వర్ధంతి, జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్‌కు సంబంధించిన కార్యక్రమం ఏదైనా సరే ఆయన సమాధిని పూలతో అలంకరిస్తూ వస్తున్నారు. గతేడాదిలో కూడా తారక్ దగ్గరుండి తాత సమాధిని పూలతో అలంకరణ చేశారు. అయితే, తండ్రికి నివాళి అర్పించేందుకు వచ్చిన బాలకృష్ణ ఫైర్ అయ్యారు.
అక్కడ ఎక్కువగా తారక్ ఫ్లెక్సీలు కనిపించడంతో వాటిని తొలగించాలని తన అభిమానులతో చెప్పారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీలు తొలగించిన చోటే మళ్లీ తారక్ అభిమానులు కొత్త కటౌట్స్ ఏర్పాటు చేశారు. ఆపై వాటికి పాలతో అభిషేకం చేశారు. అయితే, ఈ సారి బసవతారకం ఆసుపత్రిలో తన తండ్రి ఎన్టీఆర్‌కు బాలకృష్ణ నివాళి అర్పించనున్నారు.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
.@tarak9999 And @NANDAMURIKALYAN Paid His Tributes To Anna #NTR Gaaru At NTRGhat 🙏#ManOfMassesNTR #NTRVardhanti pic.twitter.com/5YqqK4sqbM
— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 18, 2025
Comments
Please login to add a commentAdd a comment