Ramarao
-
ఎన్టీఆర్ వర్ధంతి.. ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి
సీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కల్యాణ్ రామ్(Kalyan Ram) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) వద్ద నివాళి అర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడిగా రాణించి ఆపై నాయకుడిగా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తమ తాత నందమూరి తారక రామారావు సేవల గురించి వారు మరోసారి గుర్తుచేశారు. ఈ సందర్భంగా రామారావు అభిమానులు నివాళీలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో నేడు మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. బసవతారకం ఆసుపత్రిలో తన తండ్రి ఎన్టీఆర్‌కు బాలకృష్ణ నివాళి అర్పించనున్నారు.ఆ రోజు నుంచి ఏర్పాట్లన్నీ చూసుకుంటుంన్న తారక్సుమారు ఆరేళ్ల క్రితం రామారావు 97వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తాతయ్య సమాధి వద్దకు చేరుకున్నారు. జయంతి సందర్భంగా పూలతో కళకళలాడాల్సిన సమాధి అలంకరణ లేక బోసి పోవడం చూసి తారక్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో వారు వెంటనే పూలు తెప్పించి సమాధిని ఘనంగా అలంకరించారు. తమ అభిమానుల సాయంతో కొన్ని నిమిషాల్లోనే సమాధి మొత్తం పూలతో కళకళలాడేలా చేశారు. (ఇదీ చదవండి: ఇండియన్–3 సినిమాపై శంకర్ ప్రకటన)ఆ తర్వాత వారిద్దరూ నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా తారక్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుంచి తాత వర్ధంతి, జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్‌కు సంబంధించిన కార్యక్రమం ఏదైనా సరే ఆయన సమాధిని పూలతో అలంకరిస్తూ వస్తున్నారు. గతేడాదిలో కూడా తారక్ దగ్గరుండి తాత సమాధిని పూలతో అలంకరణ చేశారు. అయితే, తండ్రికి నివాళి అర్పించేందుకు వచ్చిన బాలకృష్ణ ఫైర్ అయ్యారు. అక్కడ ఎక్కువగా తారక్ ఫ్లెక్సీలు కనిపించడంతో వాటిని తొలగించాలని తన అభిమానులతో చెప్పారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీలు తొలగించిన చోటే మళ్లీ తారక్ అభిమానులు కొత్త కటౌట్స్ ఏర్పాటు చేశారు. ఆపై వాటికి పాలతో అభిషేకం చేశారు. అయితే, ఈ సారి బసవతారకం ఆసుపత్రిలో తన తండ్రి ఎన్టీఆర్‌కు బాలకృష్ణ నివాళి అర్పించనున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).@tarak9999 And @NANDAMURIKALYAN Paid His Tributes To Anna #NTR Gaaru At NTRGhat 🙏#ManOfMassesNTR #NTRVardhanti pic.twitter.com/5YqqK4sqbM— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 18, 2025 -
మాజీ డిప్యూటీ మేయర్ ఇంటిపై దాడి..
-
ముధోల్ బరిలో అన్నదమ్ముళ్లు! ఆసక్తిగా పరిశీలిస్తున్న ప్రజలు!
సాక్షి, ఆదిలాబాద్: భైంసా మండలం బడ్గాం గ్రామానికి చెందిన బోస్లే గోపాల్‌రావుపటేల్ – కమలాబాయి దంపతులకు ఇద్దరు కుమారులు. బోస్లే నారాయణరావుపటేల్, బోస్లే మోహన్‌రావుపటేల్. భైంసాలో జిన్నింగ్ ఫ్యాక్టరీ నడిపే ఇరువురు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. 1994 ఎన్నికల్లో టీడీపీ నుంచి మొదటిసారి బరిలో దిగిన నారాయణరావుపటేల్ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డెన్నపై గెలుపొందారు. అలాగే పవార్ శ్యాంరావుపటేల్ – రాధాబాయిల కుమారుడైన పవార్ రామారావుపటేల్ ఇద్దరికీ వరుసకు సోదరుడు. అక్కాచెల్లెల్ల పిల్లలైన ఈ ముగ్గురు కలిసి వ్యాపారం చేసేవారు. ఒకేచోట ఉన్న వీరు పరిస్థితులతో రాజకీయ పార్టీలు వేరై ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. ఆసక్తికరంగా పోటీ.. ముధోల్ అసెంబ్లీ బరిలో ఇద్దరు అన్నదమ్ములు నిలిచారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పవార్ రామారావుపటేల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బోస్లే నారాయణరావుపటేల్ పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లోనూ ఇద్దరు అన్నదమ్ముళ్లు బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పవార్ రామారావుపటేల్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బోస్లే నారాయణరావుపటేల్లు బరిలో నిలిచారు. 2018 ఎన్నికల్లో బోస్లే నారాయణరావుపటేల్, బోస్లే మోహన్రావుపటేల్లు నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటర్ల వద్దకు ప్రచారానికి వెళ్లారు. 2023 ఎన్నికల్లో బోస్లే మోహన్‌రావుపటేల్ పవార్ రామారావుపటేల్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఒకప్పుడు ముగ్గురు ఒక్కటే.. 1994 ఎన్నికల నుంచి 2009 ఎన్నికల వరకు ముగ్గురు అన్నదమ్ముళ్లు ఏకతాటిపైనే ఉండేవారు. 1994 ఎన్నికల్లో బోస్లే నారాయణరావుపటేల్ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలో వ్యాపారాలు పవార్ రామారావుపటేల్, బోస్లే మోహన్‌రావుపటేల్ చూసుకునేవారు. ముగ్గురు అన్నదమ్ముళ్లు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉండేవారు. గడిచిన పదేళ్లలో రాజకీయ వైరుధ్యాలతో వేర్వేరుగా పోటీచేస్తున్నారు. అన్నదమ్ముళ్లే ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఇరువురు సోదరులు రెండు జాతీయ పార్టీల నుంచి పోటీచేస్తున్నారు. -
నిత్యసాహితీ ప్రవాహి
ఒకసారి నలభయ్యేళ్లు వెనక్కి వెడితే... విశాఖ సాహితిలో పనిచేసిన ప్రముఖ కథారచయిత మల్లాప్రగడ రామారావు ఉద్యోగరీత్యా రాజ మహేంద్రవరం వచ్చారు. అంతలో కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు.) కన్ను మూసినట్టు వార్త వచ్చింది. ఒకనాటి తెలుగువారి సాహిత్య రాజధాని అయిన రాజమహేంద్రవరంలో కొ.కు. సంతాప సభ జరగక పోవడం ఆయనకు తలవంపుగా అనిపించింది. ఒక సాహితీ సంస్థను ఏర్పరచాలన్న వారి ఆలోచనకి మరికొందరు ఔత్సాహికులు కలిశారు. 1980 డిసెంబర్ 25న ‘సాహితీ వేదిక’ అవతరించింది. ఆ తర్వాత నాతో సహా మరెందరో చేరికతో అది మరింత వైశాల్యాన్ని తెచ్చుకుని యేడెనిమిదేళ్లు ఉనికిని చాటుకుంది. సభ్యుల్లో అనేకమంది తలోవైపుకీ చెదిరిపోవడంతో వేదిక క్రమంగా కనుమరుగై ఒక తీపి జ్ఞాపకంగా మిగిలింది. ఇప్పుడు మళ్ళీ ఈ నెల 25, 26 తేదీల్లో వేదిక సభ్యులం వేదిక ప్రస్థానాన్ని పునశ్చరణ చేసుకునేందుకు కలుసుకోబోతున్నాం. అనేక ప్రత్యేకతలున్న సంస్థ ‘సాహితీవేదిక’. అందరూ వక్తలు, శ్రోతలుగా ఉండే ఒక ప్రజాస్వామిక వేదికగా ఉండేది. భిన్న భావాలు, సిద్ధాం తాలు, ఆచరణలు, ఆకాంక్షలు ఉన్న... రచయితలూ, చదువరులతో, ‘నూరు ఆలోచనలు సంఘర్షించనీ వెయ్యి పువ్వులు వికసించనీ’ అన్నట్టుగా భావప్రకటనా స్వేచ్ఛతో ప్రభాత గౌతమిలా తళతళలాడుతుండేది. ఉత్తమ సాహిత్య ప్రమాణాలను పాటించడంలో వేదిక ఎన్నడూ రాజీపడలేదు. వామపక్షవాదులు మొదలు కొని సాంప్ర దాయవాదుల వరకూ సభ్యులుగా ఉండేవారు. ఒకరినొ కరం సహనంగా చెవొగ్గి వినటం, గౌరవించాల్సిన విష యాల్ని గౌరవించటం, విమర్శించాల్సిన వాటిని విమర్శించే పద్ధతిని పాటించాం. వేదిక కార్యక్రమాలు ఎంతో ఆసక్తిగొలిపేవి. వాటి కోసం ఉత్సాహంగా ఎదురు చూసే వాళ్ళం. ‘నిరుడు కురిసిన హిమ సమూహములు’ అనే విభాగం కింద వెనుకటి తరం రచయితల కథో, కవితో చదవడంతో సమావేశాన్ని ప్రారంభించేవారం. ప్రతినెలా రెండవ ఆదివారం జరిపే ‘సమాలోచన’ కార్యక్రమంలో ఆయా విశిష్ట రచనలపై ప్రసంగ వ్యాసాలు చదివేవారం. ఉగాది రోజున సాయంత్రం ‘ఇష్ట కవితా పఠనం’లో తనకి ఇష్టమైన కవి నుండి తాము ఎన్నుకున్న కవితని గోదావరి నదీతీరంలో మెట్ల మీద కూర్చుని పఠించే వాళ్ళం. వేదిక తొలి కథాసంకలనం ‘కథావేదిక’ను ఆర్ఎస్ సుదర్శనం, రెండవ కథాసంకలనం ‘కథాగౌతమి’ని కె. వాసమూర్తి, మొదటి ‘కవితావేదిక’ను గుంటూరు శేషేంద్ర శర్మ, ‘ఆర్కెష్ట్రా’ను వేగుంట మోహనప్రసాద్ ఆవిష్కరించడం వేదిక సభ్యులకి విలువైన జ్ఞాపకం. రెండవ వార్షికో త్సవ సభకు ముఖ్య అతిథిగా కాళీపట్నం రామారావు పాల్గొనటం ఓ మధురస్మృతి. నేటి పునస్సమాగమాన్ని పురస్కరించుకుని వేదిక గురించిన ఒక విశేష సంచికను, కొంతమంది సభ్యుల పుస్తకాలను ఆవిష్కరించుకోబోతున్నాం. ‘సాహితీ వేదిక’ అందమంతా తన విశాలత్వమే. అది మా తలపుల్లో గోదావరిలా నిత్యప్రవాహి. కుప్పిలి పద్మ వ్యాసకర్త కవయిత్రి, కథకురాలు -
జర్నలిస్ట్ అండా రామారావు కన్నుమూత
సీనియర్ జర్నలిస్ట్, సినీ పీఆర్వో అండా రామారావు ఇకలేరు. కర్నూలు జిల్లా ఆదోనిలోని స్వగృహంలో అనారోగ్యంతో ఆదివారం ఉదయం 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారాయన. డిగ్రీ పూర్తయ్యాక బీఎడ్ చేయాలనుకున్నా జర్నలిజంవైపు వచ్చారు. పలు అగ్ర దినపత్రికలతో పాటు సినీ వారపత్రికల్లోనూ పని చేశారాయన. ఘంటసాల వెంకటేశ్వరరావుపై వీరాభిమానంతో పలు వ్యాసాలు రాశారు.. కొందరి సహకారంతో ‘మీ ఘంటసాల’ పుస్తకాన్ని తెచ్చారు. ‘మ్యూజిక్ ఛానల్’ అనే మాస పత్రికను కొద్ది రోజులు నడిపారు రామారావు. ఆ తర్వాత నిర్మాత ఎమ్ఎస్. రెడ్డి వద్ద పీఆర్వోగా ఉన్నారు. ‘తెలుగు నిర్మాతల చరిత్ర’ పుస్తకం తీసుకురావడంలో నిర్మాత కె. మురారికి రామారావు సహకరించారు. గత ఏడాది హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్లిన రామారావు ‘ఘంటసాల గానామృతం’, ‘యుగపురుషుడు యన్టీఆర్’ అనే వాట్సప్ గ్రూప్‌లకు అడ్మిన్‌గా ఉంటూ పాత చిత్రాల విశేషాలను పంచుకున్నారు. అండా రామారావు మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తమ సంతాపం వ్యక్తం చేశారు. -
బిచ్చమెత్తుకుంటున్న కథా రచయిత..
ఆశ ఆవిరైంది.. అవకాశం చిక్కనంది.. జీవితం ఒంటరైంది.. ఫుట్‌పాతే దిక్కయింది.. బిచ్చమే బతుకయింది...అయినా ఆయనలో ఆత్మస్థైర్యం సన్నగిల్లలేదు. సినిమాలపై ఆసక్తి తగ్గలేదు. ఒక్క చాన్స్ దొరక్కపోతుందా? అనే ఆశతో ఇప్పటికీ ఎదురు చూస్తున్నాడు. సినీ అవకాశం కోసం దాదాపు 55 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాడు. ఇప్పటికే 100 కథలు రాశాడు. ఇంకా రాస్తూనే ఉన్నాడు. 72 ఏళ్ల వృద్ధుడి వ్యధ ఇది. ఓ కథా రచయిత జీవిత కథ ఇది. బంజారాహిల్స్: గుంటూరు జిల్లా ఎడ్లపాడు గ్రామానికి చెందిన కొండా రామారావుకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. తానూ వెండితెర మీద వెలిగిపోవాలని కలలు కనేవాడు. అదే ఆశతో 1964 ప్రాంతంలో మద్రాస్ రైలెక్కాడు. కానీ అవకాశాలు రాలేదు. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలిరావడంతో ఆయనా మకాం మార్చాడు. కనీసం చిన్న పాత్ర అయినా చేయాలని జూనియర్ ఆర్టిస్ట్‌గా చేరాడు. కానీ విఫలమయ్యాడు. ఇక కథలు రాసుకొని రచయితగానైనా రాణించాలని కలం పట్టాడు. ఒకట్రెండు కాదు.. ఏకంగా 100 కథలు రాశాడు. కానీ ఒక్కరూ ఆ కథలు వినలేదు.. అవకాశం ఇవ్వలేదు. పనిమనిషిగా ప్రస్థానం... ఎన్టీఆర్, ఏఎన్నార్, రావుగోపాల్రావు, కైకాల సత్యనారాయణ, రాజబాబులను తెరపై చూస్తూ తానూ అంతటివాడిని కావాలని రామారావు కలలు కన్నాడు. మద్రాస్ వెళ్లాక నాలుగైదు రోజులు పాండీబజార్ ఫుట్‌పాత్‌లపై కాలం వెళ్లదీశాడు. ఎన్టీఆర్ ఇల్లు జాడ తెలుసుకొని అక్కడ పని మనిషిగా చేరాడు. సమయం చూసి తన మనసులోని మాటను ఎన్టీఆర్‌కు చెప్పాలనుకున్నాడు. ఎన్టీఆర్ భార్య బసవతారకం ఓసారి మాటల సందర్భంలో రామారావు ఎందుకొచ్చాడో తెలుసుకొని... ‘సినిమాల్లో చేరాలంటే ఇళ్లల్లో కాదు పనిచేయాల్సింది. స్టూడియోల్లో అవకాశాలు వెతుక్కోవాల’ని సూచించి పంపించింది. అయితే రామారావుకు స్టూడియోల్లోనూ చుక్కెదురైంది. ఇక లాభం లేదని ఏఎన్నార్ ఇంటికి వెళ్లాడు. అక్కడో మూడు రోజులు పని చేసిన తర్వాత అవకాశాలు ఏమాత్రం దక్కవని అర్థమైంది. అప్పటి నటీనటులు జయలలిత, ఆర్.నాగేశ్వర్రావు, గీతాంజలి తదితరుల ఇళ్లలోనూ పనిచేస్తూ అవకాశాల కోసం ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. సినిమాల్లో వేషాల కోసం సరిగ్గా దశాబ్ద కాలం తిరిగినా ఎక్కడా అవకాశం రాలేదు. మద్రాస్ టు హైదరాబాద్ చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడంతో... రామారావు కూడా ఇందిరానగర్‌కు మకాం మార్చి జూనియర్ ఆర్టిస్ట్‌గా చేరాడు. చిన్న చిన్న వేషాలు వేస్తే కడుపుకింత తిండి దొరికేది తప్పితే.. సరైన అవకావం రాలేదు. ఈలోపు భార్య అంజమ్మ చనిపోవడం, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లయి వెళ్లిపోవడంతో రామారావు జీవితం ఒంటరైంది. సినిమా అవకాశాల కోసం తిరగడానికి, కుటుంబ పోషణకు, పిల్లల పెళ్లిళ్లకు ఉన్న కొద్దిపాటి ఆస్తిపాస్తులు అయిపోయాయి. ఇక ఫుట్‌పాతే ఆయనకు పూలపాన్పు అయింది. అదే ఆయన కథలకు వేదికయింది. తరచూ సినిమాలు చూస్తుంటే ఆ కథలపై వైరాగ్యం పుట్టుకొచ్చిందని, ఈ దిక్కుమాలిన కథలేంటంటూ నిర్వేదానికి గురై తానే ఫుట్‌పాత్‌పై కథలకు శ్రీకారం చుట్టానన్నాడు. అయితే వర్షం వచ్చినప్పుడల్లా రాసుకున్న కథలన్నీ తడిసిపోవడం జరిగిందన్నారు. 20 ఏళ్ల కాలంలో వందకు పైగా కథలు రాసి ఉంటానని చెప్పారు. సాంఘీకం, పౌరాణికం, చారిత్రాత్మకం, బయోపిక్స్ ఇలా ఏదైనా సరే అవలీలగా రాసే రామారావు... ఇప్పటికీ ఫిలింనగర్ శంకర్‌విలాస్ చౌరస్తాలోని ఓ బస్టాప్‌లో ఉంటున్నాడు. రాత్రి సమయాల్లో కథలు రాస్తూ తన కోరిక నెరవేర్చుకుంటున్నాడు. ఆనందం నాకిప్పుడు ఏ బాధా లేదు. రాత్రి 12గంటల వరకు ప్రశాంతంగా కథలు రాసుకుంటాను. కథా రచనలోనే నాకెంతో ఆనందం ఉంటుంది. ఇవి సినిమా రూపంలో రాకపోయినా... నేను నా కోరికను ఇలా తీర్చుకుంటున్నాను. కథలు సినిమాలకు పనికిరాకపోయినా ఇలాగే రాస్తుంటాను. ప్రతిరోజు రెండు పత్రికలుచదువుతాను. ఆదివారమైతే నాలుగు కొంటాను.ఎప్పటికైనా ఎవరైనా దర్శక నిర్మాతలు నన్ను సంప్రదించకపోతారా? అనే ఆశతో ఎదురుచూస్తున్నాను. ఆకలి ఆకలి తీర్చుకునేందుకు ఫిలింనగర్‌లోని రాజరాజేశ్వరీ దేవాలయం వద్ద ప్రతిరోజు 3గంటల పాటుకూర్చుంటాను. ఆ సమయంలో కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. వాటిని పుస్తకంలో రాసుకుంటాను. రోజూ రూ.50 మాత్రమే చేతిలో పడ్డాక తిరిగి వెళ్తాను. అవి నా తిండికి సరిపోతాయి. అంతకన్నా ఎక్కువఅవసరం లేదు. -
మళ్లీ వచ్చిన ట్యాంపర్ వీరుడు..!
సాక్షి, విశాఖపట్నం: ట్యాంపర్ వీరుడు మళ్లీ వచ్చారు.. ఎన్నిసార్లు వద్దు పొమ్మంటున్నా.. మళ్లీ ఇక్కడే పోస్టింగ్ కోసం పావులు కదుపుతూనే ఉన్నాడు. రాజకీయంగానే కాదు.. ప్రభుత్వ స్థాయిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని మళ్లీ మళ్లీ పోస్టింగ్ పొందుతున్నాడు. ఈసారి జిల్లాకు కేటాయించడం కాదు.. ఏకంగా పోస్టింగ్‌తోనే వచ్చాడు. కానీ ససేమిరా అతడ్ని విధుల్లో తీసుకునే ప్రసక్తే లేదని జిల్లా ఉన్నతాధికారులు తెగేసి చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖ భూకుంభకోణం పేరు చెప్పగానే గుర్తొకొచ్చే మొట్టమొదటి పేరు బీటీవీ రామారావు. ఈయన చేసిన అక్రమాలు అన్నీఇన్నీ కావు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతల అండదండలతో భీమిలి, విశాఖ రూరల్ మండలాల్లో రికార్డులను ట్యాంపర్ చేసి వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములు లిటిగేషన్లో పడేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయన చేతివాటం కారణంగా వందలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైపోయాయి. సిట్, నాన్ సిట్‌కు అందిన అత్యధిక ఫిర్యాదుల్లో ఈయన పాల్పడిన అవినీతి, అక్రమాలు దాదాపు రుజువయ్యాయి కూడా. అంతే కాదు భూవివాదాల్లో అత్యధిక షోకాజ్ నోటీసులందుకున్న అధికారి కూడా రామారావే. సిట్ సిఫార్సు మేరకు ఈయనపై అనేక కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో బీటీవీ రామారావు చేసిన అక్రమాలకు ఆయనను సర్వీస్ నుంచి తొలగించినా తప్పులేదని సిట్ అధికారులు సిఫార్సు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తులు, లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసుల్లో అరెస్ట్ కూడా అయ్యారు. ‘ఈ అధికారి మాకొద్దంటూ’ గతేడాదే అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఇంతటి వివాదాస్పద అధికారి మాకొద్దు బాబోయ్ అంటున్నా పదే పదే జిల్లాకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఈయనపై సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత ఇప్పటికే రెండుసార్లు జిల్లాకు కేటాయించారు. రెండు సార్లు కూడా జేసీలు, అప్పటి కలెక్టర్ విధుల్లో చేర్చుకోకుండా తిప్పి పంపారు. ఆయన హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర నివేదికతో ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఈసారి పోస్టింగ్‌తోనే.. విశాఖ జిల్లాలోనే పోస్టింగ్ పొందాలని పట్టువదలని విక్రమార్కుడిలా బీటీవీ రామారావు ప్రయత్నిస్తూనే ఉన్నారు. జిల్లాకు కేటాయిస్తుంటే పోస్టింగ్ ఇవ్వకుండా తిప్పిపంపుతున్నారని గ్రహించిన రామారావు రాజకీయంగా ప్రభుత్వ పెద్దల ద్వారా సీసీఎల్‌ఏపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈసారి జిల్లాకు కేటాయించడమే కాదు.. ఏ పోస్టులో అతడ్ని నియమించాలో ఆదేశాలు వచ్చాయంటే ఏ స్థాయిలో రామారావుకు ప్రభుత్వ పెద్దల అండ ఉందో అర్థమవుతోంది. సాధారణంగా తహసీల్దార్లను సీసీఎల్ఏ కమిషనర్ జిల్లాకు అలాట్ చేస్తారు. అలా అలాట్ అయిన వారికి ఎక్కడ పోస్టింగ్‌లు ఇవ్వాలో జాయింట్ కలెక్టర్, కలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అలాంటిది రెండుసార్లు తిరస్కరించిన రామారావుకు ఏకంగా జిల్లా పరిపాలనాధికారి కార్యాలయంలో పోస్టింగ్ ఇవ్వాలని సీసీఎల్ఏ నుంచే ఆదేశాలు రావడంతో విస్తుపోవడం ఉన్నతాధికారుల వంతైంది. అయితే ఆయనను తిప్పిపంపడమే తప్ప విధుల్లో తీసుకునే ప్రసక్తే లేదని జిల్లా ఉన్నతాధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ సారి రామారావు విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
రేవంత్ రెడ్డి అక్రమార్జనపై సోదాలు
-
రామారావు లీలలెన్నో..
► అవినీతి తహసీల్దార్‌పై మరిన్ని ఫిర్యాదులు ► ఏసీబీ డీఎస్పీని కలిసిన భీమిలి వాసులు ► కలెక్టర్ సహా అధికారులకు తెలిపినా స్పందన లేదని ఆవేదన సీతమ్మధార (విశాఖ ఉత్తర) : ఏసీబీ దాడుల్లో అడ్డంగా పట్టుబడ్డ భీమిలి తహసీల్దార్ రామారావు చేసిన అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రామారావు అరెస్టయిన విషయం తెలుసుకుని భీమిలిలో అతడు సాగించిన అక్రమాలకు సంబంధించిన సమాచారంతో పట్టణానికి చెందిన బాధితులు ముందుకు వస్తున్నారు. భీమిలి, తగరపువలస ప్రాంతాలకు చెందిన కొందరు సీతమ్మధారలోని ఏసీబీ కార్యాలయానికి శనివారం మధ్యాహ్నం వచ్చి డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌ను కలిశారు. మాజీ సైనికుడు చిన్నిపిల్లి శ్రీనివాసరెడ్డి, ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్న వానపల్లి గోవింద్‌తో పాటు మొత్తం ఐదుగురు డీఎస్పీ వద్ద గోడు వినిపించుకున్నారు. భూమికి సంబంధించిన పత్రాలు చూపించి వారికి జరిగిన అన్యాయయాన్ని వివరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, గోవింద్, మోహనరావు, గురుమూర్తి, అప్పలస్వామి మాట్లాడుతూ సైన్యం నుంచి పదవీ విరమణ పొందిన కొందరు చిట్టివలస సర్వే నెంబర్ 41/2లో లక్షలు వెచ్చించి స్థలాలు కొన్నట్టు తెలిపారు. వీటికి స్పష్టవైున హదు్దలు ఉన్నా, ఎటువంటి ఫీల్డ్ సర్వే లేకుండా ఖాళీ స్థలమని చూపి, రెవెన్యూ రికారు్డలు తారుమారు చేసి కొందరు వ్యకు్తలు తమదిగా చూపారని తెలిపారు. సుమారు 120 ఏళ్ల క్రితమే హకు్కలు లభించినట్టు చూపారన్నారు. ఈ స్థలాలకు భీమిలి పట్టణంలో చేయాల్సిన రిజిస్ట్రేషన్ ను ఆనందపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారని, తహసీల్దార్ అండతో ఇది జరిగిందని తెలిపారు. ఈ అవినీతిపై కలెక్టర్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తెలియజేశారు. అయితే దీనిపై ఫిర్యాదు ఇస్తే చర్యలు చేపడతామని డీఎస్పీ తెలిపారు. బాగా జరిగింది.. తహశీల్దార్ రామారావు అవినీతిపై ఏసీబీ అధికారులు దాడులు చేసి అతడిని అరెస్టు చేయడంపై చాలామంది బాధితులు హర్షం వ్యక్తం చేశారు. రూరల్‌కు, మండలానికి సంబంధించి మరికొందరు సోమవారం ఏసీబీ కార్యాలయానికి రానున్నారని తెలిపారు. చర్యలు ఎందుకు లేవు? అక్రమాలకు పాల్పడ్డ రామారావుపై ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులపై ఎందుకు స్పందించలేదని పలువురు బాధితులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు రామారావును ఎందుకు ఇంతగా ఉపేక్షించారు? మంత్రి అండదండలు ఉన్నాయా?లేక వేరెవరైనా ఉన్నారా? అని నిలదీస్తున్నారు. ఈ వ్యవహారాలపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడిగా రామారావు
బోట్‌క్లబ్ (కాకినాడ) : జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడిగా వైడీ రామారావు శుక్రవారం రెడ్‌క్రాస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు కోశాధికారిగా శివరామకృష్ణ, కార్యదర్శిగా సీహెచ్ నరసింహారావు, కార్యవర్గ సభ్యులుగా సోముప్రసాద్, పి.సత్యనారాయణ, జి. మహాలక్ష్మి, పి.రఘరామారావు బాధ్యతలు స్వీకరించారు. తొలుత రెడ్‌క్రాస్ వ్యవస్థాపకులు జేన్హెన్రీడునన్ట్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైడి రామారావు మాట్లాడుతూ జిల్లాలోని రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలు మరింత విస్తరిస్తామన్నారు. -
సానుకూల దృక్పథమే విజయానికి సోపానం
పటాన్చెరు: ‘రోజువారీ కార్యకలాపాలను సాధారణంగా ఎడమవైపు ఉన్న మెదడు నయంత్రిస్తుందని, సమాజంలోని చాలా మంది సహజంగానే దానికి అలవాటు పడిపోతారని ’ బార్క్ పూర్వ శాస్త్రవేత్త జి.ఎ.రామారావు అన్నారు. గురువారం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ‘సాఫ్ట్ స్కిల్స్ ఫర్ ఎ హెల్తీ మైండ్’ అనే అంశంపై జరిగిన ఓ వర్క్‌షాప్‌లో ఆయన శిక్షకుడిగా పాల్గొన్నారు. బాబా అణు పరిశోధన సంస్థ(బార్క్) పూర్వ శాస్త్రవేత్తగా జి.ఎ.రామారావు విద్యార్థులకు మెదడు పనితీరుతో పాటు సానుకూల దృక్పథంపై పలు కీలక సూచనలు, వివరణలు ఇచ్చారు. అంతా బాగుందనే మానసిక భావనే సానుకూల దృక్పథమని అదే విజయానికి సోపానమని వివరించారు. సానుకూల ఆలోచన పురోగతి వైపు సాగుతుందన్నారు. మన శరీరంలోని అంగాలన్నీ బాగా పనిచేస్తున్నాయనే భావన కలిగి ఉంటే చన్ని చిన్న రుగ్మతలు కూడా మననేమీ చేయలేవని ఆయన చెప్పారు. కాని ఏదో నలతగా ఉందే ఆందోళన మానసింగా కృంగదీస్తుందని, ప్రతికూల ఆలోచనలను (నెగెటివ్ మైండ్‌సెట్) విడనాడాలని సూచించారు. నిద్రలేమి గురించి కలత చెందవద్దని, బాగా నిద్రించాననే సానుకూల భావన ద్వారా దానిని అధిగమించి పునరుత్తేజితులు కావాలన్నారు. మెదడు పనితీరును ఆయన వివరిస్తూ ఎడమవైపు మెదడునే ఎక్కువగా వాడుతామన్నారు. అందువల్ల కుడివైపున ఉన్న మెదడును మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోతున్నామన్నారు. రోటీన్‌కు భిన్నంగా పనులు చేస్తుంటే రెండు మెదడుల మధ్య సమన్వయం పెరిగి ఆలోచనలను వస్తిరింప చేసుకోవచ్చని సూచించారు. రోజూ కొద్దిసేపు నేలపై కూర్చోవడం, ఒక్క చేత్తో చేయడానికి అలవాటు పడ్డ పనిని మరో చేతితో చేసేందుకు ప్రయత్నించడం వంటి చిన్ని చిన్న అభ్యాసాల(మార్జాలసనం, శలభాసనంలో కొన్ని మార్పుల) ద్వారా మేధస్సును వికసింప చేసుకోవచ్చన్నారు. ‘సంతోషమే సగం బలం’ అనేది నానుడని ఆనందంగా ఉంటేనే కుడివైపు మెదడు పనిచేస్తుందని రామారావు వివరించారు. కొంత సాధనతో విద్యార్థులు ఏకాగ్రతను అలవరచుకోవడం సాధ్యమేనన్నారు. ఒంటి కాలిపై నిలబడి ఒక కేంద్రాని్న ఎంపిక చేసుకుని దానిపై దృష్టినిలిపి తేదకంగా గమనించాలని, ఆలోచనలను నియంత్రించి ఏకాగ్రత సాధించే ప్రయత్నం చేయాలన్నారు.యోగలోని వృక్షాసనం, గరుడాసనం, నటరాజాసనం, వంటి బ్యాలెన్సింగ్ ఆసనాలను సాధన చేయాలన్నారు. చివరగా యోగనిద్ర ద్వారా సౌభ్రాతృత్వ, ఏకత్వ భావనలను పెంపొందించుకోవచ్చన్నారు. సానుకూల సమైక్య భావనలను యోగనిద్రలో పెంపొందించుకోవచ్చని ఆయన వివరించారు. దాదాపు వంద మంది బిటెక్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో శిక్షణ పొందారు. -
అల్లుడి హత్యకు ఏఎస్ఐ 'సుపారీ'
- రౌడీ షీటర్లతో కలిసి ఏఎస్ఐ పన్నాగం - భగ్నం చేసిన పోలీసులు.. నలుగురి అరెస్టు విజయవాడ: కూతురు ప్రేమను జీర్ణించుకోలేకపోయాడు. అల్లుణ్ణి అంతమొందించి మరో పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకు రౌడీషీటర్లకు సుపారీ ఇచ్చి పోలీసులకు దొరికిపోయాడు. అతను కూడా పోలీసు శాఖకు చెందిన వ్యక్తి కావడంతో ఉన్నతాధికారులు విస్మయం చెందారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని నున్న పోలీసు స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఏఎస్ఐ)గా విధులు ఆంబోతుల రామారావు తన అల్లుడు శ్యామ్‌ను హత్య చేసేందుకు రౌడీషీటర్లతో రూ.5 లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా రూ.1.50 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చాడు. వీరు హత్యకు రచన చేయడం పసిగట్టిన సత్యనారాయణపురం పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. సత్యనారాయణపురం పోలీసు క్వార్టర్స్‌లో ఉంటున్న రామారావు, కుమార్తె 2014 డిసెంబర్లో వన్‌టౌన్ పాడి వీధిలో వెల్డింగ్ పను లు చేసే శ్యామ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప. వీరి పెళ్లి ఇష్టం లేని రామారావు అల్లుడ్ని హతమార్చి కుమార్తెకు మరో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా రౌడీషీటర్లయిన వాంబే కాలనీకి చెందిన షేక్ ఖాసింను సంప్రదించాడు. అల్లుడిని హత్య చేస్తే రూ.5 లక్షలు ఇస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందంలో భాగంగా రూ.1.50 లక్షలు ఇచ్చాడు. ఖాసిం, కండ్రిక కాలనీకి చెందిన రౌడీషీటర్ షేక్ చాన్‌బాషా, పాయకాపురానికి చెందిన రౌడీషీటర్ నెలటూరి రవి, వాంబే కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు గంజి శౌరిని కలుపుకున్నాడు. పూటుగా మద్యం తాపించి న తరువాత హత్య చేసి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలనినిర్ణయించారు. పన్నాగంలో భాగంగా నిందితు లు శ్యామ్‌తో పరిచయం పెంచుకున్నారు. తరుచూ కలిసి మాట్లాడాలనే నెపంతో పిలి పించినప్పటికీ కుదరలేదు. ఈ క్రమంలోనే మద్యం మత్తుకు లోనైన నిందితుల్లో ఒకరు విషయం స్నేహితుల వద్ద ప్రస్తావించాడు. దీం తో పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులపై సత్యనారాయణపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. నెలటూరి రవి పరారీలో ఉండగా మిగిలిన వారిని అరెస్టు చేసి న ఇన్స్పెక్టర్ ఎం.సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. తప్పు చేసిన పక్షంలో పోలీసులైనా ఉపేక్షంచేది లేదని సీఐ చెప్పారు. -
రైతు కుటుంబానికి రూ.75వేల సాయం
గుడ్లూరు(ప్రకాశం): ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చించురెడ్డిపాలెం గ్రామంలో వారం క్రితం బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబానికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే పోతుల రామారావు రూ.75వేల సాయం అందజేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన రైతు బోయిన ఎలీషా ఈ నెల 2వ తేదీన అప్పుల బాధతో ప్రాణాలు తీసుకున్నాడు. బుధవారం రాత్రి ఆ కుటుంబాన్ని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు పరామర్శించారు. ఆ కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఎంపీ మేకపాటి రూ.50 వేలు, ఎమ్మెల్యే రామారావు రూ.25వేలను సాయంగా అందజేశారు. -
టీడీపీ ఎమ్మెల్యే అనితపై కేసు నమోదు
విశాఖ : విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే అనితపై పాయకరావు పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను నిర్భందించి చెప్పుతో కొట్టారని రామారావు అనే ప్రైవేటు ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అనితతోపాటు పీఏ ప్రసాద్, ఎంపీటీసీ కాశీ విశ్వనాథ్ లపై రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అనితను అరెస్ట్ చేయాలని బాధితుని బంధువులు పాయరావుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. మరోవైపు ఎమ్మెల్యే అనిత వ్యవహార శైలిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సత్యనారాయణ వ్రతం కోసం వెళ్లి..
చెన్నూర్ : సత్యనారాణయ వ్రతం కోసం వెళ్లిన అన్నాతమ్ముడు గోదావరిలో నీట మునిగి చనిపోయిన సంఘటన చెన్నూర్‌లో విషాదాన్ని నింపింది. ఓ చిన్నారిని కాపాడి తన కొడుకులను రక్షించుకుకోలేకపోయిన ఆ తండ్రి గుండె విలవిల్లాడింది. ‘స్వామి వత్రం కోసం వస్తే మీ ఇద్దర్ని తీసుకెళ్లాడా కొడుకా’ అంటూ తల్లి రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన పేరాల రామారావు స్థానిక అభయాంజనేయ ఆలయం సమీపంలో నివాసం ఉంటున్నాడు. రామారావు ప్రజావైన్స్లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రామారావు ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న ఆర్యవైశ్యులు పట్టణ సమీపంలోని గోదావరి నదిలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. వ్రతానికి వీరిని ఆహ్వానించడంతో రామారావు, భార్య లావణ్యతోపాటు ఇద్దరు కుమారులు సాయికృష్ణ (11), సాయి వర్షిత్ (6) వెళ్లారు. అక్కడి వెళ్లిన రామారావు పిల్లలతో గోదావరి స్నానాలు చేస్తున్నారు. వీరికి కొంత దూరంలో కొంత మంది చిన్నారులు స్నానాలు చేస్తున్నారు. అందులోంచి ఓ చిన్నారి గోదావరిలో మునిగిపోతుండగా రామారావు పరుగెత్తుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేర్చాడు. ఒడ్డుకు వచ్చి చూసే సరికి తన కొడుకులు ఇద్దరు కన్పించలేదు. తండ్రి వెంటనే వెళ్లిన సాయికృష్ణ (11), సాయివర్షిత్(6) గోదావరి నదిలో గల్లంతయ్యారు. చిన్నారులు గల్లంతైన ప్రదేశం లోతుగా ఉండడంతో జాలర్లు గాలింపు చర్యలు చేపట్టి పిల్లల మృతదేహాలను బయటికి తీశారు. సత్యనారాయణ స్వామి వత్రాలను చూసేందుకు వస్తే ఆ స్వామి మీ ఇద్దర్ని తీసుకెళ్లాడా కొడుకా అంటూ తల్లి లావణ్య రోధించిన తీరు పలువురిని కలచివేసింది. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై శివప్రసాద్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూలరాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కరుణసాగర్‌రావు సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా సాయికృష్ణ స్థానిక ఎస్జీబీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 4వ తరగతి, సాయివర్షిత్ ఎల్కేజీ చదువుతున్నారు. బంధువుల ఆందోళన సత్యనారాయణ వత్రాలు నిర్వహించే సమీపంలోనే ఇద్దరు చిన్నారులు మృతి చెంది బాధిత కుటుంబ సభ్యులు రోధిస్తుంటే పూజలు నిర్వహించడం ఎంత వరకు సమంజసమని మృతుల బంధువులు గోదావరి తీరం వద్ద ఆందోళన చేశారు. వెంటనే పూజలు నిలిపివేయాలని ఆర్యవైశ్య సంఘం నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఎస్సై శివప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన కారులకు నచ్చజెప్పారు. -
పెందుర్తి రెవెన్యూలో అవినీతి చేప
పెందుర్తి : పెందుర్తి రెవెన్యూ కార్యాలయంలో ఓ అధికారి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి పట్టుబడ్డాడు. ఎఫ్ లైన్ ధ్రువపత్రం కోసం రూ.5 లంచం తీసుకుంటూ మండల సర్వేయర్ పొడుగు రవ్రీంద్రపాల్ గురువారం ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఎం.నరసింహారావు తెలిపిన వివరాలు.. పెందుర్తి గ్రామానికి చెందిన మామిడి సింహాచలంకి పెందుర్తి సమీపంలో కొత్తవలస వెళ్లే రహదారి వద్ద 79 సెంట్ల భూమి ఉంది. సింహాచలం ఈ ఏడాది జూన్‌లో మరణించాడు. దీంతో అతడి పేరిట ఉన్న పట్టాదారు పాస్‌పుస్తకాన్ని సింహాచలం భార్య వెంకటేశ్వరమ్మ పేరిట మా ర్చుకునేందుకు సిద్ధమయ్యారు. అమ్మమ్మ తరపున ఆమె మనవడు సింహా చలం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న యడ్ల రామారావు గత ఆగస్టు 30న ఎఫ్ లైన్ సర్టిఫికెట్ కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేశాడు. నిబంధనల ప్రకారం సర్వేయర్ భూమిని సర్వే చేసి రిపోర్టు ఇస్తే 45 రోజులకు ఎఫ్ లైన్ ధ్రువపత్రం వస్తోంది. అయితే సర్వేయర్ రిపోర్టు కోసం రూ.10 వేలు డిమాండ్ చేశాడు. రూ.5 వేలు ఇస్తానని రామారావు సర్వేయర్‌ను ఒప్పించాడు. నగదు ఇచ్చేందుకు సిద్ధమైన రామారావు బుధవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ప్రణాళిక ప్రకారం గురువారం పాల్‌కు లంచం ఇచ్చేందుకు వెళ్లగా ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేసి అతడిని పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో రవీంద్రపాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఏసీబీ రూర ల్ డీఎస్పీ ఎన్.రమేష్, ఇన్స్పెక్టర్లు గణేష్, రామకృష్ణ పాల్గొన్నారు. -
రామారావుపై కేసుల తొలగింపుపై చర్చించాలి
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపుతో పాటు, టిడిపి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై కేసుల తొలగింపుపై చర్చ జరగాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాల ప్రారంభంలో ఈ అంశాలను ప్రతిపక్ష నేత ప్రస్తావించడంతో.. స్పీకర్ అభ్యంతరం చెప్పారు. వాయిదా తీర్మానం అంశానికి తగిన సమయంలో సమాధానం ఇస్తారని సూచించారు. మరో అంశాన్ని అప్పటికప్పుడు ప్రస్తావించడం సరికాదని తేల్చి చెప్పారు. -
జేసీపై చర్యలు తీసుకోవాలని నిరసన
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజావాణి కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రామసుబ్బారెడ్డి సమర్పించిన అర్జీని చించి వేసి అపహాస్యం చేసిన జాయింట్ కలెక్టర్ రామారావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ నగర కార్యదర్శి జి.చంద్ర డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ ఎదుట సీపీఐ కార్యకర్తలు జేసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశిస్తున్నా, జేసీ మాత్రం అందుకు తిలోదకాలిచ్చారన్నారు. ప్రజావాణి కార్యక్రమాల్లో తమ సమస్యలను విన్నవించి పరిష్కరించుకోవాలని వస్తుంటారని పేర్కొన్నారు. సమస్యను తహశీల్దార్ కార్యాలయంలోనే పరిష్కరించుకోవాలంటూ జేసీ సూచించారన్నారు. అయితే, అనేకసార్లు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లినప్పటికీ తన సమస్య పరిష్కారం కాకపోవడంతోనే కలెక్టర్ ప్రజావాణికి వచ్చానని రామసుబ్బారెడ్డి బదులివ్వడంతో జేసీ ఆగ్రహించి అర్జీని చించి వేశారని వివరించారు. జేసీపై చర్యలు తీసుకోకపోతే వచ్చే ప్రజావాణిలో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రామసుబ్బారెడ్డి, సహాయ కార్యదర్శి మనోహర్‌రెడ్డి, రూరల్‌శాఖ అధ్యక్ష, కార్యదర్శులు శంకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఇ.బాలచంద్రయ్య నాయుడు, వెంకట రమణ, దళిత హక్కుల పోరాట సమితి నాయకుడు కృష్ణయ్య, ఏఐటీయూసీ నాయకుడు లింగన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగాసురేష్ పాల్గొన్నారు. -
మెనూనా..ఎప్పుడో మరిచిపోయాం!
చీపురుపల్లి: ‘గుడ్డు లేదు... కాయగూర లేదు... పల్చని చారు, గట్టి అన్నమే దిక్కు... ఏదో తినాలి కాబట్టి తింటున్నాం తప్ప నోటికి రుచి తగలదు.’ ఇదీ చీపురుపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులు సాక్షాత్తూ జాయింట్ కలెక్టర్ రామారావు ఎదుట వ్యక్తం చేసిన అభిప్రాయం. శుక్రవారం చీపురుపల్లి బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం ‘ఫుడ్‌పాయిజన్’ అయిందంటూ జాయింట్ కలెక్టర్ రామారావుకు ఒక ఫోన్ కాల్ వెళ్లింది. దీంతో ఆయన స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. అక్కడితో ఆగకుండా.. ఆర్డీఓను వెంట పెట్టుకుని ఆయనే స్వయంగా బాలికోన్నత పాఠశాలకు వచ్చారు. దీంతో అక్కడ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో లోపాలను విద్యార్థులు వివరించారు. అనంతరం మూడు తరగతి గదుల్లోకి జేసీ వెళ్లారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. మధ్యా హ్న భోజనం పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు. రుచిగా ఉంటుందా.. మెనూలో గుడ్డు పెడుతున్నారా? అంటూ విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. మోనూను ఎప్పుడో మరిచిపోయూమని పలువురు విద్యార్థులు బదులిచ్చారు. భోజనం రుచిగా లేదని చెప్పారు. నెలకు ఒకసారి కూడా గుడ్డు పెట్టడం లేదని కొందరు చెప్పగా.. వారానికి ఒకసారి మాత్రమే పెడుతున్నారని మరికొందరు సమాధానమిచ్చారు. అన్నం అస్సలు తినలేకపోతున్నామని మరికొంత మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఉన్నా ఏం చేస్తున్నారని పాఠశాల హెచ్ఎం మహలక్ష్మిని జేసీ ప్రశ్నించారు. గతంలో ఎంతోమంది అధికారులకు ఇక్కడి పరిస్థితులు వివరించానని ఆమె బదులిచ్చారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులతో మాట్లాడిన ఆయన.. పిల్లల కోసం ప్రభుత్వం ఇస్తున్న నిధులు సక్రమంగా ఖర్చు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. దీనికి నిర్వాహకులు మాట్లాడుతూ.. వారానికి ఒకసారి భోజనంతోపాటు గుడ్డు పెడుతున్నామని, రాజకీయంగా తమను వేధిస్తున్నారని, తాము ఎలాంటి తప్పూ చేయలేదంటూ కంటతడి పెట్టుకున్నారు. విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటున్నామని వివరించారు. పూర్తి విచారణ అనంతరం కలెక్టర్ దృష్టిలో ఈ విషయాన్ని ఉంచి తగు చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ రామారావు తెలిపారు. ఆయన వెంట తహశీల్దార్ డి.పెంటయ్య, ఎంఈఓ బి.నాగేశ్వరరావు, ఈఓపీఆర్డీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
13న జమ్మలమడుగు చైర్మన్ ఎన్నిక
జమ్మలమడుగు: జమ్మలమడుగు మున్సిప ల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక ఈ నెల 13న జరగనుంది. ఈనెల 3వ తేదీన ఈ ఎన్నికలు జరగవలసి ఉండగా ఒకటో వార్డు కౌన్సిలర్ ముల్లాజానీ కనిపించకపోవడంతో అతని త ల్లి నూర్జహాన్ కిడ్నాప్ కే సు పెట్టింది. దీంతో ఎన్నికలను 4వ తేదీకి వాయిదా వేశారు. నా లుగోతేదీ రాత్రి 11 గంటల వరకూ ఎన్నిక జరపకుండా తనకు ఆరోగ్యం సరిగా లేదని ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీఓ రఘునాథరెడ్డి పోలీసుల సహకారంతో వెళ్లిపోయారు. దీం తో రాష్ట్ర ఎన్నికల అధికారులు జోక్యం చేసుకుని ఈనెల 13వ తేదీ ఉదయం 11 గంట లకు ఎన్నికను నిర్వహిస్తామని ప్రకటించా రు. జాయింట్ కలెక్టర్ రామారావు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. జమ్మలమడుగు ఆర్డీఓకు కర్నూలులో చికిత్స కర్నూలు(కలెక్టరేట్) : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ రఘునాథ్‌రెడ్డి కర్నూలులో ని విజయదుర్గ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జమ్మలమడుగు పురపాలక సం ఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఆయన అస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఉదయం గాయత్రి ఎస్టేట్‌లోని విజయదుర్గ ఆసుపత్రిలో చేర్పించగా.. వైద్యులు ఇంటెన్సి వ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. రఘునాథ్‌రెడ్డి గతంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయ పరిపాలనాధికారిగా, ఓర్వకల్లు తహశీల్దార్‌గా పనిచేశారు.పదోన్నతిపై జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా, ఏపీఎంఐపీ పీడీగా, ఇన్చార్జి డీఆర్వోగానూ విధులు నిర్వర్తించారు. కాస్త కోలుకున్న ఆయన ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ జమ్మలమడుగు ఎన్నిక ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్లు తెలిపారు. -
'సాక్షి’ విలేకరిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి
వ్యతిరేక వార్తలు రాస్తే పెట్రోల్ పోసి తగలెడతానంటూ బెదిరింపు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావు ‘సాక్షి’ స్థానిక విలేకరి జీవీవీ సత్యనారాయణపై సోమవారం సాయంత్రం విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. ‘నాకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయంటే నిన్ను, నీ పేపర్‌ను పెట్రోల్ పోసి తగలబెడతా..’ అంటూ బెదిరించారు. కొవ్వూరు మండలం ఆరికిరేవుల ఎంపీటీసీ స్థానానికి తమ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యేలా చూసేందుకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే అధికారులతో మంతనాలు ప్రారంభించారు. అయితే అందుకు అవకాశం లేదని ఎంపీడీవో పి.వసంతమాధురి, ఎన్నికల అధికారి యు.వసంత్‌కుమార్ ఎమ్మెల్యేకు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ‘మీతో రహస్యంగా మాట్లాడాలి రండి’ అని ఎన్నికల అధికారిని ఎమ్మెల్యే కోరారు. బయటకు వచ్చిన వారిని అక్కడే ఉన్న ‘సాక్షి’ విలేకరి ఫొటో తీసేందుకు ప్రయత్నించగా, రామారావు అతనిపై అమానుషంగా దాడి చేశారు. ‘ఎంపీటీసీ స్థానానికి మా పార్టీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యేలా చేసుకుందామని మా తంటాలు మేం పడుతుంటే ఫొటోలు తీస్తావా..’ అంటూ దుర్భాషలాడుతూ పిడిగుద్దులు గుద్దారు. అధికారులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేను అతి కష్టంగా బయటకు పంపారు. సత్యనారాయణ ఎంపీడీవో కార్యాలయంలోనే ఉండిపోగా, ఎమ్మెల్యే ‘బయటకు రా నా కొడకా.. ఇక్కడే చంపేస్తా’ అని అరుస్తూ మెయిన్ గేటు వద్దే కాపు కాశారు. విలేకరి ఇచ్చిన సమాచారంతో సీఐ ఎన్.చిరంజీవి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వారి సాయంతో సత్యనారాయణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు దాఖలు చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. -
ప్రశాంతంగా ‘టెట్’
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రం లో ఆదివారం నిర్వహించిన టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్) ప్రశాంతంగా ముగిసింది. 38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పరీక్షకు 1,807 మంది హాజరుకావాల్సి ఉండగా 1661 మంది వచ్చారు. అలాగే.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించిన పేపర్-2 పరీక్షకు 6,384 మందికి గాను 5,668 మంది పరీక్ష రాశారు. రెండు పరీక్షలకు కలిపి మొత్తం 862 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతారావు, ఏఎస్పీ డేవిస్, పరీక్షల రాష్ట్ర అబ్జర్వర్ తులసీదాస్, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు పరిశీలించారు. జిల్లా కేంద్రంలో సందడి.. టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులతో జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది. హోటళ్లు, లాడ్జీలు కిటకిటలాడాయి. అభ్యర్థులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు సమయానికి బస్సుల్లేక అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధిక ఖర్చు పెట్టి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. -
ఉషాకుమారికి లైన్‌క్లియర్
మున్సిపల్ శాఖ నుంచి వెలువడిన ఉత్తర్వులు ఉడా వీసీగా నేడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఫలించని రామారావు యత్నాలు సాక్షి, విజయవాడ : ఉడా వైస్ చైర్మన్ బదిలీ వ్యవహారంలో ఉత్కంఠ తొలగింది. వీజీటీఎం ఉడా వైస్ చైర్మన్‌గా నియమితులైన పి.ఉషాకుమారిని చార్జ్ తీసుకోవాలని సూచిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ నుంచి బుధవారం ఉత్తర్వులు రావటంతో ఆమెకు లైన్‌క్లియర్ అయ్యింది. గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. ఉడా వైస్ చైర్మన్ బదిలీ వ్యవహారం ఇప్పటివరకు అనేక మలుపులు తిరిగింది. ప్రస్తుత వైస్ చైర్మన్ రామారావు సీటు కాపాడుకోవటానికి చివరి నిమిషం వరకు ప్రయత్నాలు సాగించారు. వాస్తవానికి గత నెల 31న పి.ఉషాకుమారిని ఉడా వైస్‌చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్న రామారావు ఉడాకు వచ్చి ఎనిమిది నెలలు కూడా పూర్తికాకపోగా, బదిలీ క్రమంలో పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు అందాయి. దీంతో ఆయన పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేయటంతో పాటు అవకాశం ఉంటే ఉడాలోనే కొనసాగించాలని ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ శాఖ కార్యదర్శిని కలిసి విన్నవించారు. ఈ క్రమంలో రామారావు ఇంకా రిలీవ్ కాకుండా కొనసాగుతున్నారు. ఉన్నతాధికారుల వద్ద ఆవేదన మొర పెట్టుకోవడంతో ఫలితం ఉంటుందని రామారావు భావించినా తాజా ఉత్తర్వులతో ఆయన రిలీవ్ కావటం అనివార్యంగా మారింది. -
ఉడాలో కుర్చీలాట సా...గదీతే
రిలీవ్ కాని వైస్ చైర్మన్ రామారావు నూతన వీసీ చేరికపై వీడని సందిగ్ధత రెండు రోజులు వేచిచూడాలని ఉషాకుమారికి పెద్దల సూచన! కొనసాగుతున్న రామారావు యత్నాలు నేడు లేదా రేపు ఉషాకుమారి చేరే అవకాశం ఉడాలో కుర్చీలాట ఇంకా కొన‘సా...గుతోంది’. ప్రస్తుత వైస్ చైర్మన్ రామారావు, నూతనంగా నియమితులైన ఉషాకుమారి తమ పరపతిని ఉపయోగించి ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైస్‌చైర్మన్‌గా చివరికి ఎవరు వస్తారనేదానిపై సందిగ్ధత నెలకొంది. ఉషాకుమారి సోమవారమే బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా, రామారావు రిలీవ్ కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. సాక్షి, విజయవాడ : ఉడా వైస్‌చైర్మన్‌గా పి.ఉషాకుమారిని నియమిస్తూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో వీసీగా ఉన్న రామారావును బదిలీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కేటాయించలేదు. ఉషాకుమారి ఈ నెల ఒకటిన బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా వీసీ రామారావు రిలీవ్ కాకుండా నేరుగా హైదరాబాద్ వెళ్లి సోమవారమే తిరిగి వచ్చారు. రిలీవ్ కాకుండా విధుల్లో కొనసాగారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎవరి ప్రయత్నాలు వారివి... ఇద్దరు ఐఏఎస్ అధికారులూ తమ గాడ్ఫాదర్ల ద్వారా ఎవరికివారు సీటు దక్కించుకోవటానికి ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు. వైస్ చైర్మన్ రామారావుకు ఐఏఎస్ అయ్యాక వచ్చిన మొదటి మంచి పోస్టింగ్ కావడం.. అదీ తక్కువ రోజుల్లోనే ఆకస్మికంగా బదిలీ చేయటంతో సీటును కాపాడుకోవటానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. హైదరాబాద్ వెళ్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ కార్యదర్శిని కలిసి తన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఐఏఎస్ వచ్చాక పోస్టింగ్ కోసం ఎక్కువ కాలం నిరీక్షించాల్సి వచ్చిందని, ఆ తర్వాత వచ్చిన ఉడా పోస్టింగ్‌లోనూ పట్టుమని మూడు నెలలు కూడా పనిచేసే అవకాశం లేదని చెప్పినట్లు తెలిసింది. తన బదిలీ విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేయటంతో పాటు తన గాడ్ఫాదర్ల ద్వారా హైదరాబాద్‌లో లాబీయింగ్ కొనసాగించినట్లు సమాచారం. మరోవైపు చివరి ప్రయత్నాలు చేస్తున్నారని, అవి ఫలించకపోతే మంగళవారం సాయంత్రం ఆయన రిలీవ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లా నుంచి బదిలీ అయిన ఉషాకుమారి తన రాజకీయ పరపతితో చక్రం తిప్పి ఉడా వైస్‌చైర్మన్ సీటును పొందగలిగారు. రామారావు ప్రయత్నాల నేపథ్యంలో ఆమె కూడా పావులు కదిపి పోస్టింగ్‌లో చేరే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. వేచిచూడండి... ఈ క్రమంలో పి.ఉషాకుమారి రెండు రోజులు వేచిచూడాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదివారం మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ఆమె సోమవారం విధుల్లో చేరలేదు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం విధుల్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు గత నెల 21న విజయవాడలో జేసీగా రిలీవై 31న ఉడా వైస్ చైర్మన్‌గా మళ్లీ పోస్టింగ్ దక్కించుకున్న క్రమంలో 22 నుంచి 31 వరకు ఆమె దరఖాస్తు చేసుకున్న సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
రబీపైనే ఆశలు
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: ప్రస్తుత రబీ సీజన్లో వివిధ పంటల సాగు ముమ్మరంగా సాగుతోంది. ఖరీఫ్‌లో పంటలకు తీవ్ర నష్టం జరగడంతో రైతులు ఇప్పుడు రబీనే నమ్ముకున్నారు. చెరువుల్లో నీటి నిల్వలు తగినంత ఉన్నందున ఎక్కువగా వరిసాగు వైపు మొగ్గు చూపుతున్నారు. కొంత మంది రైతులు మొక్కజొన్న సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఖరీఫ్‌లో పంట చేతికొచ్చిన సమయంలో వరుసగా వచ్చిన తుపాన్లతో రైతులు విలవిలలాడారు. వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిని రూ.686 కోట్ల మేరకు రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఆ నష్టాల నుంచి కోలుకునేందుకు రైతులు రబీకి సిద్ధమవుతున్నారు. లక్నవరం, రామప్ప, పాకాల, మల్లూరు, చలివాగు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగినంత ఉన్నాయి. ఎస్సారెస్పీ నుంచి కూడా నీటి విడుదలతో రబీలో పంటల సాగుకు ఢోకాలేదని భావిస్తున్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం 915.8 మిల్లీ మీటర్లు కాగా, ఈ సారి 1225.9 మిల్లీ మీటర్లుగా నమోదుకావడంతో భూగర్భజలాలు పెరిగాయి. ఇప్పటి వరకు ఎరువుల కొరత లేనప్పటికీ, రుణ ప్రణాళిక అమలుకు అధికారులు చర్యలు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. బోర్లు, బావులపై ఆధారపడి నారు పోసిన వారు నాట్లు వేసేందుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల నాట్లు కూడా వేస్తున్నారు. వచ్చేనెల మొదటి వారం వరకు నాట్లు ఊపందుకోనున్నాయి. వరిసాగుకే ప్రాధాన్యత ఆరుతడి పంటలు సాగు చేయూలని వ్యవసాయూధికారులు చె బుతున్నప్పటికీ రైతులు మాత్రం వరి సాగుకే సిద్ధమవుతున్నా రు. గత ఏడాది రబీలో 70,651 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగరుుంది. ఈ సారి లక్ష హెక్టార్ల వరకు సాగు విస్తీర్ణం పెరుగుతుం దని అంచనా. ఇప్పటికే బోర్లు, బావుల కింద వెయ్యి హెక్టార్ల మేరకు వరి నాట్లు వే శారు. చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టుల కింద నీరు విడుదల కాగానే నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. వరి తర్వాత రైతులు ఎక్కువగా మొక్కజొన్నకు ప్రాధాన్యమిస్తున్నారు. మెట్టపంటగా తక్కువ మోతాదు నీటితో రెండు మూడు తడులతో ఈ పంట చేతికొచ్చే అవకాశం ఉంది. ఈ రబీలో ఇప్పటికే జిల్లాలో 13,600 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేపట్టారు. మొత్తం ఈ పంట 50వేల హెక్టార్లలో సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది రబీలో 40,600 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశారు. ఎరువులున్నాయి... రబీకి సంబంధించి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టారు. రబీలో యూరియా కొరత లేకుండా జాగ్రత్త వహిస్తున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఎరువులు జిల్లాకు చేరుకునే విధంగా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు యూరియా 52,692 మెట్రిక్ టన్నులు, డీఏపీ 4,862 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్సు ఎరువులు 26,606 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. ఇక పొటాష్ ఎరువులు జిల్లాకు చేరుకోవాల్సి ఉంది. రూ.540 కోట్లతో రబీ రుణ ప్రణాళిక రూపొందించారు. ఇప్పటి వరకు రూ.110 కోట్ల రుణాలు అందించినట్లు అధికారులు చెబుతున్నారు. రబీలో సమస్యలు తలెత్తకుండా చర్యలు : జేడీఏ రామారావు రబీలో రైతాంగానికి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ జి.రామారావు చెప్పారు. రుణ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎరువులు, విత్తనాల కొరత లేదన్నారు. ఆరుతడి పంటలు వేయాలని రైతులకు సూచించారు. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేశామన్నారు.