జమ్మలమడుగు: జమ్మలమడుగు మున్సిప ల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక ఈ నెల 13న జరగనుంది. ఈనెల 3వ తేదీన ఈ ఎన్నికలు జరగవలసి ఉండగా ఒకటో వార్డు కౌన్సిలర్ ముల్లాజానీ కనిపించకపోవడంతో అతని త ల్లి నూర్జహాన్ కిడ్నాప్ కే సు పెట్టింది. దీంతో ఎన్నికలను 4వ తేదీకి వాయిదా వేశారు. నా లుగోతేదీ రాత్రి 11 గంటల వరకూ ఎన్నిక జరపకుండా తనకు ఆరోగ్యం సరిగా లేదని ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీఓ రఘునాథరెడ్డి పోలీసుల సహకారంతో వెళ్లిపోయారు. దీం తో రాష్ట్ర ఎన్నికల అధికారులు జోక్యం చేసుకుని ఈనెల 13వ తేదీ ఉదయం 11 గంట లకు ఎన్నికను నిర్వహిస్తామని ప్రకటించా రు. జాయింట్ కలెక్టర్ రామారావు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు.
జమ్మలమడుగు
ఆర్డీఓకు కర్నూలులో చికిత్స
కర్నూలు(కలెక్టరేట్) : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ రఘునాథ్‌రెడ్డి కర్నూలులో ని విజయదుర్గ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జమ్మలమడుగు పురపాలక సం ఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఆయన అస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఉదయం గాయత్రి ఎస్టేట్‌లోని విజయదుర్గ ఆసుపత్రిలో చేర్పించగా.. వైద్యులు ఇంటెన్సి వ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. రఘునాథ్‌రెడ్డి గతంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయ పరిపాలనాధికారిగా, ఓర్వకల్లు తహశీల్దార్‌గా పనిచేశారు.పదోన్నతిపై జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా, ఏపీఎంఐపీ పీడీగా, ఇన్‌చార్జి డీఆర్వోగానూ విధులు నిర్వర్తించారు. కాస్త కోలుకున్న ఆయన ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ జమ్మలమడుగు ఎన్నిక ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్లు తెలిపారు.
13న జమ్మలమడుగు చైర్మన్ ఎన్నిక
Published Sun, Jul 6 2014 2:12 AM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM
Advertisement
Advertisement