మంచిర్యాల అర్బన్ : నాలుగు నెలల నిరీక్షణకు గురువారంతో తెరపడింది. మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గం కొలువుదీరింది.
ఈ తరుణంలో చైర్‌పర్సన్ విధులు ఏమిటో తెలుకుందాం..
పాలకవర్గం కొలువుదీరిన అనంతరం ప్రతినెలా కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి.
సెక్షన్-47 ప్రకారం చైర్‌పర్సన్ అధికారాలు వినియోగించుకోవచ్చు.
కౌన్సిల్, ప్రభుత్వం, అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు అన్ని చైర్‌పర్సన్ పేరుతో జరుగుతాయి.
సెక్షన్ 48-ప్రకారం చైర్‌పర్సన్ 2, 3వ గ్రేడ్ పురపాలక సంఘాలలో చైర్‌పర్సన్ రూ.1000 మించి ఖర్చు చేయరాదు.
ప్రత్యేక గ్రేడ్ మున్సిపాలిటీలలో రూ.5 వేలు మించరాదు.
డబ్బులు ఖర్చు చేస్తే వాటి వివరాలు కౌన్సిల్ ముందుంచాలి.
చైర్‌పర్సన్ వరుసగా పది రోజులకంటే ఎక్కువ రోజులు అధికార క్షేత్రం నుంచి గైర్హాజర్ అయినచో వైస్ చైర్మన్‌కు అధికారాలు సంక్రమిస్తాయి. అయితే రాష్ట్రం పరిధిలోనే ఉంటే అధికారాలు ైవె స్‌చైర్మన్‌కు లభించవు.
వైస్‌చైర్మన్ కూడా వరుసగా 10 రోజులకు మించి స్థానికంగా లేకపోయిన, అశక్తుడైనా మరొకరికి ఆ పదవిని కట్టబెడతారు.
చైర్‌పర్సన్ కౌన్సిల్ సమావేశంకు ఏదేని కారణం చేత సమావేశానికి హాజరుకాకపోతే వైస్ చైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలి.
చైర్మన్ గైర్హాజర్ అయితే కోరం సభ్యుల్లో ఒకరిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకుని సమావేశం నిర్వహించవచ్చు.
మున్సిపల్ చైర్‌పర్సన్ అధికారాలు, విధులు..
Published Sat, Jul 5 2014 1:26 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement