నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా | Nalgonda, Suryapet municipal chairman elections postponed, says Nalgonda District Collector | Sakshi
Sakshi News home page

నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా

Published Thu, Jul 3 2014 2:12 PM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM

Nalgonda, Suryapet municipal chairman elections postponed, says Nalgonda District Collector

నల్గొండ, సూర్యాపేట మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నికలు రేపటికి వాయిదా వేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులు వెల్లడించారు. గురువారం నల్గొండలో కలెక్టర్ చిరంజీవులు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలకు ఎన్నికైన వారి వివరాలను ఈ సందర్బంగా తెలిపారు.

 

కోదాడ మున్సిపల్ ఛైర్మన్గా అనిత (కాంగ్రెస్), మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ నాగలక్ష్మి (కాంగ్రెస్), భువనగిరి మున్సిపల్ ఛైర్మన్గా లావణ్య (బీజేపీ) ఎన్నికైనట్లు ప్రకటించారు. అలాగే హుజూర్నగర్ నగర పంచాయతీ ఛైర్మన్గా జక్కుల వెంకయ్య (కాంగ్రెస్), దేవరకొండ నగర పంచాయతీ ఛైర్మన్గా మంజూ నాయక్ (కాంగ్రెస్)లు ఎన్నికైనట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement